Tuesday, August 26, 2025

 గేటు చప్పుడు అవడం తో 
అటువైపు చూశాడు శంకరరావు.
శంకరరావు స్థానిక ఉన్నత పాఠశాల లో నైట్ వాచ్ మాన్ గా పని చేస్తున్నాడు.

శంకర్ రావు ప్రిన్సిపాల్ సార్ ఉన్నారా అని వెంకటేశ్వర రావు గేటు తలుపు తోసుకుంటూ లోపలకి వచ్చాడు.అతని తో పాటు ఇంకో నలుగురు కూడా వెనక ఉన్నారు.అందులో ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు.
అయ్యగారు ఇప్పుడే మేడ మీద కి వెళ్ళిరండి.
అయ్యా మీరు అలా కిందన ఉన్న గోడ ప్రక్కన మెట్లు ఉన్నాయి.వాటిమీదుగా వెళితే అయ్యగారి ని కలవవచ్చును సార్ అని చెప్పడంతో వెంకటేశ్వరరావు
అతనితో పాటు వచ్చిన మిగిలిన వాళ్ళు మేడ మీదకి వెళ్ళి ప్రిన్సిపాల్ రూమ్ దగ్గర 
నిలబడ్డారు.మే ఐ కమిన్ 
సార్ అని అనగానే,లోపలకి రండి అని పిలుపు వినిపించింది.ఐదుగురు కూడా అక్కడ ఉన్న హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు 
సుబ్బారావు కి నమస్కరించి 
కుర్చీ లో కూర్చున్నారు
మీరు ఎవరు,ఏ పని మీద వచ్చేరు అని సుబ్బారావు అడగడం తో,సార్ మేము స్థానిక బీఈడీ కళాశాలలో చదువుతున్నాము సార్.మా బ్యాచ్ కి సంబంధించిన ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతున్నది.అందువలన 
మా ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని స్టాఫ్ ని ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ ఇచ్చేరు సార్.మీకు అందచేసి చెప్పడం కోసం వచ్చేం సార్ అని వెంకటేశ్వర రావు అనగానే చాలా సంతోషం తప్పకుండా వస్తాము అయితే ఒక చిన్న విషయం ఏమిటి అంటే మా ఇంగ్లీష్ మాస్టారు రామచందర్ రావు గారు బాగా మాట్లాడతారు వారిని ప్రత్యేకం గా వెళ్ళి పిలవండి,ఆయనకి చెప్పక పోతే అతను రాడు.అందువలన మీరు ఆయనకి ఒక సారి చెప్పండి.మీకు అవకాశం ఉంటే స్టాఫ్ రూమ్ కి వెళ్లి అందరికీ ఒక సారి చెప్పి వెళ్ళండి అని అనగానే 
తప్పకుండా అలాగే చేస్తాము సార్ అని చెప్పి స్టాఫ్ రూమ్ కి వెళ్లి అందరికీ చెప్పి వాళ్ళు వెళుతుంటే ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మేడం మీరు రమ్మని చెప్పేరు కానీ ఇంతకీ
మేము ఎప్పుడురావాలో చెప్పలేదు అనగానే ,సారి మేడం గారు ఎల్లుండి శని వారం సాయంత్రం 6గం లకి ప్రారంభం అవుతుంది ఫంక్షన్
అని చెప్పి తప్పకుండా రండి అని చెప్పి వెళ్లారు వెంకటేశ్వరావు అతనితో పాటు వచ్చిన మిగిలిన Bed కళాశాల విద్యార్థులు.

స్థానిక శ్రీ వెంకటేశ్వర Bed కళాశాల లో వీడ్కోలు చెప్పే ఉత్సవం జరుపుకునే పండుగ రోజు రానే వచ్చింది.
శని వారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత 
సాయంత్రం 6గం లకి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు తన సహోపాధ్యాయులతో కలిసి స్తానిక Bed కళాశాల లో నిర్వహిస్తున్న 
వీడ్కోలు సభకు హాజరయ్యేందుకు వెళ్లాడు.
ఎక్కడకి చేరుకోగానే కళాశాల ప్రాంగణం అంతా విద్యుత్ దీపాలంకరణలతో
వివిధరకములైన రంగురంగుల పూల తో అందం గా అలంకరించబడి ఉంది.లోపలకి ప్రవేశించగానే ఇరువైపుల నిలబడి ఉన్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ నమస్కరిస్తూ స్వాగతం పలుకుతూ లోపలి ఆడిటోరియం లోనికి తీసుకుని వెళ్ళి వారికి కేటాయించిన సీట్లలో  అందరినీ సగౌరవం గా కూర్చోబెట్టారు.
ఇంతలో సాయంత్రం 6.30నిమిషాలు కాగానే సభ ప్రారంభం అయ్యింది. స్థానిక పెద్దలు,నాయకులు,ప్రిన్సిపాల్ గారిని,ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు గారిని అందరినీ వేదిక మీదకి ఆహ్వానించారు.
సుబ్బారావు గారు ప్రిన్సిపాల్ గారికి చెప్పి రామచందర్ రావు ని కూడా వేదిక మీదకి ఆహ్వానించారు.
అందరి ఉపన్యాసాలు అయిన తర్వాత సుబ్బారావు గారిని ప్రసంగించమని కోరడం తో
ఆయన లేచి అందరినీ సగౌరవం గా పలకరించి విద్యార్థిని విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియచేసి,నేను అంత బాగా మాట్లాడలేను ,మా ఇంగ్లీష్ మాస్టారు రామచందర్ రావు గారు చక్కగా మాట్లాడతారు,వారిని ప్రసంగించునట్లు అనుమతిస్తూ,ఆహ్వానించవలసినదిగా ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నాను అని చెప్పడం తో,ప్రిన్సిపాల్ గారు వెంటనే లేచి రామచందర్ రావు ని 
ఆహ్వానించగానే రామచందర్ రావు పోడియం వద్దకు వెళ్లి 
సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపాల్ గారికి,మా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు,వేదికనలంకరించిన పెద్దలకు,ఈ వీడ్కోలు సభకు హాజరయ్యేందుకు వచ్చిన తల్లితండ్రులకు నా నమస్కారములు.
కాబోయే ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులకు నా ఆశీస్సులు అని ప్రారంభించి 
ఈ రోజున మీరు అందరూ ఎంతో ఆనందం తో జరుపుకుంటున్న ఈ ఉత్సవం లో పెద్దల అనుమతి తో కొన్ని విషయాలు నాకు తెలిసినవి 
చెప్పాలని మీ ముందున నిలబడి ఉన్నాను 
తప్పు చెయ్యడం మానవ సహజం.కానీ సమాజం లో ఇద్దరు ఎప్పుడూ తప్పు చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి.
వాళ్ళు ఒకరు ఉపాధ్యాయుడు,ఒకరు 
వైద్యుడు. ప్రాణం పోసే వైద్యుడు తప్పు చేస్తే మనిషి ఎలా జీవిస్తాడు?.
జీవన గమనం నిర్దేశించే ఉపాధ్యాయుడు తప్పు చేస్తే కొన్ని తరాలు బాధ పడతాయి.
మన  స్వార్థం కోసం,వ్యక్తి గతమైన కక్షలు కారణం గా,
కుల మతాలు ఆధారం గానో ఒక విద్యార్థి భవిష్యత్తు కు
విఘాతం కలిగిస్తే అది ఎంత పాపం.
మనకి నేర్పిన చదువు ఇదే చెప్పిందా? ఇలాగే చెయ్యాలని నిర్దేశించిందా.
మన పూర్వీకులు ఇలాగే భావించి ఉంటే మనం ఇక్కడ 
ఉండగలిగే వాళ్ళమా.ఒక్కసారి మీరు అందరూ ఆ దిశ గా ఆలోచించండి.రాబోయే రోజుల్లో మీరు జాతి నిర్మాతలు అవుతారు అటువంటి పొరపాట్లు జరగనివ్వకుండా నిగ్రహించుకోండి.భావితరాలకు ఆదర్శంగా నిలవండి.
అటువంటి తప్పుకు బలైపోయిన వాడిని నేను.లేకుంటే నా భవిష్యత్తు వేరే విధం గా ఉండేది అని కళ్ళు తుడుచుకుని తన ప్రసంగం ఒక్కసారి ఆపి 
మళ్ళీ తిరిగి మాట్లాడి చివరిగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అని తన ప్రసంగం ముగించాడు.
వెంటనే సుబ్బారావు గారు లేచి ప్రిన్సిపాల్ గారి అనుమతి తో పోడియం వద్దకు వచ్చి ప్రసంగిస్తూ ఇంతటి ఇబ్బందిని మా రామచందర్ రావు గారు ఎదుర్కొన్నారని ఎప్పుడూ 
చెప్పలేదు.ఇంత బాధ ఆయన గుండెల్లో దాచుకున్నారని మాకు తెలియదు.
నేను చాలా బాధపడుతున్నాను.వారికి కలిగిన బాధ ఏ విద్యార్థికి రాకూడదని మనస్పూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అని తన 
ప్రసంగం ముగించారు.
తర్వాత విద్యార్థుల వందన సమర్పణతో సభముగిసింది.
అందరికీ అల్పాహారం ఏర్పాటు చేసి ప్రిన్సిపాల్ గారు ఙ్ఞాపకాలు అందచేశారు.
వెళ్ళే ముందు అందరినీ గేటు వరకు విద్యార్థులు దిగబెట్టి వచ్చారు.తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు 
నిర్వహణ ఉన్నదని చెప్పినా  పెద్దలు ఎవరూ ఉండలేదు.
విద్యార్థులు అందరూ చంద్రకళ మేడం దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటే
ప్రిన్సిపాల్ గారు సుబ్బారావు గారి తో ఈ రోజు ఇంక మనం 
ఏమి మాట్లాడకూడదు సార్ అని నవ్వుతూ చెబుతుంటే
అంతే అంతే అని సుబ్బారావు గారు మిగిలిన వారు అందరూ ప్రిన్సిపాల్ గారి అనుమతి తో ఇంటికి బయలు దేరి వెళుతుంటే
ఆ ప్రాంగణం లో కొలువై ఉన్న సరస్వతీ దేవి వారిని నిండు మనసు తో ఆశీర్వదించింది.

ప్రసాద్

గురువా గురువా

No comments:

Post a Comment