Monday, August 25, 2025

Microplastics | ఇది కాలకూట విషం! నిర్లక్ష్యం చేస్తే బాడీ మొత్తం విషం| Dr Manthena Satyanarayana Raju

 Microplastics | ఇది కాలకూట విషం! నిర్లక్ష్యం చేస్తే బాడీ మొత్తం విషం| Dr Manthena Satyanarayana Raju

https://youtu.be/6zP9qYLlflE?si=iLO8skyA9s_fTmKs




ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్లాస్టిక్ వాడకం ద్వారా తినే ఆహార పదార్థాలు గాని తాగే డ్రింక్స్ ద్వారా గాని పానీయాల ద్వారా తెలుసో తెలియకుండానో మైక్రోప్లాస్టిక్ అణువులు మన లోపలికి వెళ్ళిపోయి అనేక రకాలుగా శరీర అవయవాల మీద మైక్రోప్లాస్టిక్ యొక్క ప్రభావం చేత దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం రోజు రోజుకి పెరుగుతున్నది. ఇవన్నీ పరిశోధనలు చేసి రుజువు చేయడం ద్వారా మనం కొద్దిగా ఆలోచించడానికి అవకాశం కలుగుతున్నది. ఎంతవరకు సాధ్యమైనంతవరకు మైక్రోప్లాస్టిక్ యొక్క వాడకాన్ని అవి లోపలికి వెళ్లకుండా నివారించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అంత మంచిది. ముఖ్యంగా ఐదు రకాల నష్టాలు మైక్రోప్లాస్టిక్ రేణువులు మనకు కలిగిస్తున్నాయట. అంటే కంటితో చూడలేనంత చిన్న రేణువులు వెళ్ళిపోతుంటాయి. అవి 1నానోమీటర్ నుంచి 5 మిీమీటర్ లోపు మధ్యలో చిన్న సైజు గా ఉంటాయన్నమాట. ఈ మైక్రో ప్లాస్టిక్ అణువులు ఆహారం ద్వారా కానీ మనం త్రాగే నీళ్ళ ద్వారా కానీ లోపలికి లేకోతే వేడి వేడి టీల్ని కొన్ని ప్లాస్టిక్ కప్పుల్లో తాగుతాం కదా అలాంటి వాటి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డామేజ్ హాని అసలు ప్రేగుల్లో ఎక్కువ జరుగుతుంటుంది. మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అని రెండు రకాలుగా ఉంటాయి. ఈ గుడ్ బ్యాక్టీరియాలు శరీరారోగ్యం మొత్తాన్ని రక్షణ వ్యవస్థను మొత్తాన్ని ఇక్కడి నుంచే కంట్రోల్ చేసే ఏదో పోలీస్ కంట్రోల్ రూమ్ లాంటి సిస్టం అన్నమాట ఇది అంత మేలు ఇవి చేస్తూ ఉంటాయి. ఈ గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోవటానికి ప్రధాన కారణం మైక్రోప్లాస్టిక్ అనేది కూడా ఈ మధ్య రుజువవుతున్న వాస్తవాలు అన్నమాట. ఈ గుడ్ బ్యాక్టీరియా తగ్గేసరికి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతూ ఉంటుంది. సమాజంలో మంచి పర్సెంటేజ్ తగ్గిందంటే చెడు పర్సంటేజ్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది కదా అలాగే మన ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగేసరికి ప్రేగుల్లో విటమిన్ కే తయారవ్వాలి విటమిన్బి12 తయారవ్వాలి. ఆహార పదార్థాల్లో పోషకాలని ప్రేగుల నుంచి రక్తంలో పంపే పని బ్యాక్టీరియాలు చేస్తుంటాయి. ప్రేగుల పోరంతా హెల్దీగా ఉండేటట్టు చేయటానికి డైజెషన్ కి అన్ని హ్యాపీ హార్మోన్స్ అయిన సెరటోనిన్ డొపమిన్ ప్రొడక్షన్ కి ఈ గుడ్ బ్యాక్టీరియాలే కారణం అలాంటి బ్యాక్టీరియాలు తగ్గిపోవడానికి ఈ కెమికల్ ఎఫెక్ట్ మైక్రోప్లాస్టిక్ కారణం అవుతుంది. ఇక రెండవ నష్టం తీసుకుంటే మైక్రోప్లాస్టిక్ అణువులు హార్మోన్ ఇంబాలెన్స్ సమస్యలకు ప్రధాన కారణం అవుతున్నాయట. హార్మోన్స్ యొక్క రిసెప్టార్స్ ఉంటాయి హార్మోన్స్ పైన తలుపులండి ఆ రిసెప్టార్స్ మీద ఈ మైక్రోప్లాస్టిక్ రేణువులు కూర్చుని హార్మోన్స్ పనిచేయనీయకుండా చేసేస్తున్నాయట అందుకని ఈ రోజుల్లో ఎక్కువమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండటం అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ రావటం కానీ పిల్లలు కలకపోవటానికి కూడా ఇట్లాంటి వాటికి కూడా మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఒక కారణం అవుతున్నది అనేది పరిశోధనల ద్వారా రుజువతున్న విషయం అన్నమాట ఇక మూడవ అతి ముఖ్యమైన నష్టం అందరూ ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటారు కదా ఇది కూడా సత్యమే దీర్ఘకాలంగా మన లోపలికి మైక్రో ప్లాస్టిక్ గాని ప్లాస్టిక్ రేణువులు వెళ్ళాయి అనుకోండి ప్రతి కణము లోపల ఉండే dఎన్ఏ లోపల కూడా ఈ మైక్రోప్లాస్టిక్ రేణువులు వెళ్లి ఆ dఎన్ఏ ని డ్ామేజ్ చేస్తున్నది. కొన్ని అవయవాలు కొంతమందికి వీక్ గా ఉంటాయి వీక్ గా ఉన్న అవయవాల్లో dఎన్ఏ డామేజ్ అయితే మంచి కణం కూడా క్యాన్సర్ కణంగా మారిపోతుంది. కణజాలం అద్వాప లేకుండా విభజన చెందుతాయిరెండు నాలుగునాలుగు 16 dఎన్ఏ డామేజ్ అయితే కంట్రోల్ ఉండదు ఇక ఆ కణ విభజన ఎక్కువైతే అక్కడ గ్రోత్ వస్తుంది అదే గెడ్డగా గాని క్యాన్సర్ కణతిలాగా గాని అట్లా మారిపోతుంటాయి అందుకని క్యాన్సర్ రావటానికి కూడా మైక్రోప్లాస్టిక్ రేణువులు ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఇక నాలుగవ నష్టం తీసుకుంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థ మీద ఈ మైక్రోప్లాస్టిక్ రేణువుల యొక్క ప్రభావం పడి రక్షణ వ్యవస్థ హైపర్ యక్టివ్ అయిపోతున్నదట మామూలుగా మనకు తెలుసు కదా పిల్లలు కొంతమంది హైపర్ యక్టివ్ గా ఉండి అన్ని కదిపేస్తారు పీకేస్తారు అసలు కూతురు ఉండదు కూర్చోరు అస్తమానం అట్లా ఉంటారు కదా ఓవర్ గా స్పీడ్ గా అలాంటి హైపర్ యక్టివ్ చైల్డ్ లాగా మన ఇమ్యూన్ సెల్స్ అని హైపర్ యక్టివ్ అయిపోతాయి ఈ ఇమ్యూన్ హైపర్ యక్టివ్ అయింది అంటే ఇప్పుడు ప్రమాదకరమైన దీర్ఘ రోగాలకి దారి తీస్తుంది. అవే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఎస్ఎల్ఈ అట్లాగే క్రాన్స్ డిసీస్ అల్సరేటివ్ క్వాలిటీస్ రోమటాయిడ్ ఆర్థ్రైటిస్ సోరియాసిస్ మామూలుగా మనకి స్క్లరోడర్మా విటిలిగో ఇలాంటివన్నీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కదా యాంకలైజింగ్ స్పాండిలోసిస్ ఇట్లాంటివన్నీ కూడా దీర్ఘ రోగాలు రావటానికి మైక్రోప్లాస్టిక్ రేణువులు కూడా ఇలాంటివన్నీ ఇమ్యూన్ సిస్టం మీద డైరెక్ట్ గా దాడి చేయడం వల్ల జరిగే నష్టం అన్నమాట ఇక ఐదవ నష్టం తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు కూడా ఈ మైక్రోప్లాస్టిక్ యొక్క ప్రభావం పడుతున్నదట ఆ గర్భవతి లోపలికి మైక్రో ప్లాస్టిక్ వెళ్ళినయి అనుకోండి చివరికి ప్లాజెంటాలో నుంచి కూడా లోపల ఉండే బిడ్డకి కూడా పిండానికి కూడా ఈ మైక్రోప్లాస్టిక్ రేణువులు అట్లా ట్రాన్స్ఫర్ అయి ఆ పుట్టబోయే బిడ్డ మీద కూడా ఈ కెమికల్ ఎఫెక్ట్ పడుతున్నది అటప్పుడు అందుకని ఇలాంటివి అనేక రకాలుగా మైక్రోప్లాస్టిక్ రేణువులు మన శరీర శరీరం లోపలికి వెళ్ళే రోగాలు దీర్ఘ రోగాలు కలగడానికి కారణం అవుతున్నది. మరి ఏ ఏ రూపాల్లో మనకు తెలియకుండా వన్ నానోమీటర్ నానోమీటర్స్ అంటే కంటితో చూడలేనంత చిన్న రేణువులుగా లోపలికి ఎట్లా వెళ్తాయి అంటే ఎక్కువగా మనం ప్లాస్టిక్ వాడకంలో వేడి వేడి పదార్థాలు వేయటం వల్ల ఇవి ఎక్కువ నష్టం జరుగుతుంటాయి. అంటే భోజనం ప్లేట్ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే ఆ వేడికి ప్లాస్టిక్ రేణువులు తెలియకుండా వెళ్ళిపోతుంటాయి. అట్లాగే రెండోది వేడి వేడి పాలు కానీ టీ కానీ కాఫీలు కానీ ఇట్లా రోడ్డు మీద తాగేటప్పుడు ప్లాస్టిక్ గ్లాసులో తాగినప్పుడు ఆ వేడికి కరిగిపోయి ప్లాస్టిక్ రేణువులు అట్లా వెళ్ళిపోతుంటాయి. కర్రీ పాయింట్స్ లో చాలామంది కవర్స్ లోనూ ప్లాస్టిక్ వాటిలోనూ సాంబార్లు రసాలు కూరలు అట్లాంటివి ప్యాక్ చేసుకొని పట్టుకెళ్తుంటారు. వేడి వేడి అన్నం కూడా ప్లాస్టిక్ కవర్లో కట్టేసి ఇస్తుంటారు అందులో ఇస్తరాకు గాని అరిటాకులు గాని ఇట్లాంటివి వేయరు చాలా చోట్ల అలాంటి చోట్ల తెలియకుండా వెళ్ళిపోతుంది. చాలామంది ప్లాస్టిక్ బిందుల్లో నీళ్లు పట్టేసేసుకుంటూ ఉంటారు. ప్లాస్టిక్ బిందెలు వాడకం రంగు రంగుల బిందులు కనపడుతుంటాయి కదా మనకి అలాంటివి బయట ఎండకు పెట్టేసినప్పుడు ఆ ఎండకి ఈ ప్లాస్టిక్ డామేజ్ అయిపోయి ఆ మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఆ నీళ్ళకి వచ్చేసే అవకాశం ఉంటుంది ఆ నీళ్లు మనం పోసుకున్నప్పుడు కూడా స్కిన్ ద్వారా మైక్రో ప్లాస్టిక్ రేణువులు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందట నిదానంగా ప్లాస్టిక్ హీట్ కి ఎండ యొక్క వేడికి డ్ామేజ్ అయిపోతుంటుంది. గాలి ద్వారా కూడా బయటికి వచ్చేస్తుంటాయి ఆ రేణువులు మనం పీల్చే అవకాశాలు కూడా అట్లా ఉంటాయి. ఇక దీనితో పాటు సౌందర్యానికి ఉపయోగించే కొన్ని కాస్మెటిక్స్ క్రీమ్స్ లోషన్స్ కొన్ని రకాల బాంబులు ఇట్లాంటి రకరకాలుగా చర్మానికి వాడుతుంటారు కదా వాటన్నిటి ద్వారా మైక్రోప్లాస్టిక్ రేణువులు లోపలికి వెళ్ళే అవకాశం ఉండవు వాటి తయారీలో వాడుతుంటారు అన్నమాట కొన్ని రకాల టెక్స్టైల్ ఇండస్ట్రీలో గాని పెయింట్స్ కర్మాగారాల్లో గాని మనకి ఈ మైక్రో ప్లాస్టిక్ వాడకం ఎక్కువ ఉంటుంది. వాటి ద్వారా ఎయిర్ పొల్యూషన్ ద్వారా మనకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ని రూపాల్లో వెళ్లే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఐదు రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటున్నదని పరిశోధనలో రుజువతున్నది కాబట్టి కొంచెం ఆలోచించి సాధ్యమైనంతవరకు మనం పేపర్ ప్లేట్స్ కానీ ఒక్క ఆకుతో చేసే కప్పులు ప్లేట్లు గ్లాసులు ఇలాంటి వాటితో జాగ్రత్త పడటం చాలా మంచిది ఇట్లో ఇంకా సాధ్యమైతే కాటన్తో చేసిన సంచులు గాని గోని సంచులు లాంటివి ఇప్పుడు వస్తున్నాయి కదా ఇంకా క్యారీ బ్యాగ్ లాగా వాడకం తగ్గించడానికి జనపనార్థ చేసిన కవర్లో బ్యాగ్లు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు అట్లాంటివి గాని క్లాత్ బ్యాగ్స్ కానీ ఇట్లాంటి వాడకం సాధ్యమైనంత వరకు చేయగలిగితే ఎంతో మంచి లాభాలు మనం పొందొచ్చు ఆరోగ్యానికి హాని అట్లా ఉండదు ప్లాస్టిక్ వాడకాని ఎంత దూరం చేయగలిగితే అంత మంచిదని అందరికీ విజ్ఞప్ చేస్తూ నమస్కారం

No comments:

Post a Comment