Monday, August 25, 2025

 *సత్య ప్రమాణాల దేవుడు:* 

*కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడు. స్వామివారి ఎదుట  ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే... వారిని స్వామియే శిక్షిస్తాడని విశ్వాసం. తాగుడు, జూదం వంటి వ్యసనాలకు బానిసలైన వారు స్వామి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీవరసిద్ధి వినాయకుని ఆలయం ఉంది. బహుదా నది ఒడ్డున కాణిపాక వినాయకుడు సర్వమత ఆరాధ్యుడుగా పూజలందుకుంటున్నాడు.*

*స్థలపురాణం:* 

*విహారపురి గ్రామస్థులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి సోదరులు వ్యవసాయంతో జీవించేవారు. ఒక దశలో వారి గ్రామంలో కరవు సంభవించింది. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి సమయంలో కరవును జయించాలని ముగ్గురు సోదరులూ సంకల్పించుకున్నారు. తమ పొలంలో ఉన్న ఏతం బావికి పూడిక తీయడం ప్రారంభించారు. అప్పుడు వారికి* *ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా ఆ రాయి నుంచి రక్తం చిమ్మింది. ఆ రక్తం పైకి చిమ్మి ఒంటిమీద పడగానే... ముగ్గురు సోదరులకూ వైకల్యాలు పోయాయి. వారిలో కొత్త జవసత్వాలు వచ్చాయి. పరుగు పరుగున గ్రామంలోకి వెళ్లి ఈ విచిత్రాన్ని వారు అందరికీ చెప్పారు. గ్రామస్థులంతా కలిసి ఆ బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో గణనాథుని రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్దలతో పూజించారు. ఆ రోజున స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు 'కాణి' భూమి (కాణి అంటే ఎకరం పొలం అని అర్ధం) మేర పారింది. అప్పటినుంచి విహారపురి గ్రామానికి 'కాణిపారకరమ్' అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే కాణిపాకంగా మారింది.*

*┈┉┅━❀꧁ జై గణేశా ꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🪷🌻🪷 🙏🕉️🙏 🪷🌻🪷

No comments:

Post a Comment