[6/14, 16:18] null: @అమ్మనాన్నలకి ఉందో గైడ్@17
తేది: 14/06/2025
""""""""""""""""""""""""""""""""""""""""""'""
బడులు తెరిచే వేళయింది... యూనిఫారాలేసుకుని సీతాకోకచిలుకల్లా ముస్తాబై బడికెళ్లిపోయే పిల్లల్ని చూస్తుంటే భలే
ముచ్చటగా ఉంటుంది. అదే వాళ్ల చదువులూ హోంవర్కులూ ట్యూషన్లు పరీక్షలూ... గుర్తొస్తే మాత్రం అమ్మానాన్నల గుండెల్లో రాయి పడుతుంది. పాఠాలెలా చదవాలో,
ఏ ప్రశ్నకు ఎలా సమాధానం రాయాలో చెబుతూ పిల్లలకు
గైడ్లు వర్కు బుక్ లు ఉన్నట్లే పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా
చదివించాలో పెద్దలకు పాఠాలు చెప్పే గైడ్లూ ఉంటే
బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే
ఈ పుస్తకం మీకోసమే
@ యు కెన్ డూ ఇట్- హౌ టు బూస్ట్ యువర్ చైల్డ్స్ అచీవ్ మెంట్ ఇన్ స్కూల్' @
Michael E Bernard Ph D
అనే పుస్తకాన్ని మైఖేల్
బెర్నార్డ్ రాశారు. ప్రొఫెసర్, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్
అయిన ఆయన దాదాపు ముప్పయ్యేళ్ల క్రితం రాసిన
ఈ పుస్తకం 'పేరెంటింగ్ కి అర్థం చెబుతుంది.
'పెళ్లి చేసుకోవడానికి ముందు
పిల్లల పెంపకానికి సంబంధించి
ఆరు సిద్ధాంతాలుండేవి నాదగ్గర. పెళ్లయ్యాక ఆరుగురు
పిల్లలొచ్చారు. ఒక్క సిద్ధాంతమూ
'లేదు' అన్నారు పదిహేడో శతాబ్దపు ఆంగ్లకవి జాన్ విల్మట్. అప్పటికీ ఇప్పటికీ తల్లిదండ్రులది అదే పరిస్థితి ఆచరణలోకి వచ్చేసరికి ఆదర్శాలన్నీ
హుష్ కాకి అవుతున్నాయి. పిల్లల్ని మంచి స్కూల్లో వేసేస్తే
మన బాధ్యత తీరినట్లే, చదివించడం టీచర్ల పనే...అనిభావించేవారు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే- తల్లి
దండ్రులుగా మనం చేసేవీ, చేయనివీ పిల్లల ప్రతిభను ఎంత
గానో ప్రభావితం చేస్తాయని, స్కూలూ ఇల్లూ రెండూ
సమన్వయం తో చదువు బాధ్యత వహించినప్పుడే పిల్లలు చదువులో రాణిస్తారని. పిల్లలందరూ అద్భుతమైన తెలివితేటలతో,
హద్దుల్లేని సృజనశక్తితో పుడతారు. నేర్చుకోవాలన్న వాళ్ళ
కుతూహలానికి కళ్లాలే ఉండవసలు, సరైన పద్ధతిలో పెరిగితే
పిల్లలంతా చదువుల్లో చక్కగా రాణిస్తారు- అంటారు మైఖేల్,
రోజులు మారుతున్నాయనీ పిల్లల భావోద్వేగ, అభ్యసన అవసరాలు గతం కన్నా ఎక్కువ సంక్లిష్టంగా తయారయ్యాయని
గుర్తించమంటారు. పిల్లాడు హోంవర్క్ చేయకుండా మొండి
కేస్తే నూటికి తొంభైమంది అమ్మానాన్నలు చేసే పని రెండు
తగిలించడం లేదా అరిచి గోల చేసి రాసేదాకా అన్నం పెట్టనని బెదిరించడం పెద్దలు ఒత్తిడికి లోనై తాము ఇబ్బంది.
పడుతూ పిల్లల్ని ఇబ్బంది పెట్టడమే తప్ప సమస్యను పరిష్కరించే మార్గం అది కాదంటోందీ పుస్తకం. పిల్లల ప్రవర్తన
మీద దృష్టి పెట్టాలి కానీ పిల్లలమీద కాదంటుంది. చదు
వుకోమని బలవంతం చేయడం కన్నా చదువు ప్రాధాన్యాన్ని
అర్థమయ్యేలా చెప్పడం, నేర్చుకోవడాన్ని ఆస్వాదించేలా
చేయడం ముఖ్యమంటుంది. పిల్లల బలహీనతల్ని ఎత్తిచూప
వద్దు, అమ్మానాన్నల నోట నెగెటివ్ కామెంట్ వినడాన్ని
మించిన శిక్ష పిల్లలకు ఇంకోటి ఉండదంటారు రచయిత.
పిల్లలు ఏదైనా చెబుతుంటే అడ్డుకోకుండా, సలహాలు ఇవ్వ
కుండా ఎంతసేపు వింటారు? అవును, పిల్లల గురించి తెలు
సుకోవడానికి అత్యంత ముఖ్యమైన మార్గం వాళ్లని ఓపిగ్గా
వినడమేనట. వేర్వేరు దేశాల్లో పిల్లల పెంపకం విధానాల్ని
వాటిపై జరిగిన అధ్యయనాల్ని కూడా రచయిత ఈ పుస్త
కంలో సందర్భానుసారం వివరించారు. రకరకాల పేరెంటింగ్
టెక్నిక్స్ ఉదాహరణలతో చర్చించారు. పిల్లల్లో నిద్రాణంగా
ఉండే భిన్న సామర్థ్యాల్ని వెలికి తీయడం ఎలాగో చెప్పారు.
[6/16, 19:56] null: *@ బెస్ట్ ఫ్రెండ్ వి రా..! @ 18
తేది: 16/0/2025
"""""""""""""""""""""""""""""""""""""""
విధేయత అనే ఇంధనం మీద నడిచే బండి స్నేహం!
ప్రపంచాలు, ప్రయారిటీలు వేరైనా..
మనకోసం నిలబడే ఒక్క
లాయల్ ఫ్రెండున్నా చాలు. అసలు అయినవాళ్లు లేనివాడుకాదు,
ఆప్తమిత్రుడు లేనివాడే అనాథ అప్పుడే కలిసినా ఎన్నాళ్లనుంచో తెలిసినట్టుగా పెదాల మీద విరిసే చిరునవ్వు.. ఆ నవ్వును అలాగే పదికాలాలు నిలబెట్టే ఆ,స్వచ్ఛమైన బంధం..
చాలా అపురూపమైనవి. సగటు మనిషి నుంచి సెలబ్రిటీల
వరకూ ఫ్రైడ్షిప్ ఈ లాయల్టీకి బానిసలే..!
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో
అనితర సాధ్యమైన విజయం వెనక.. తన చిన్ననాటి
స్నేహితుడి గొప్ప త్యాగం ఉందట..! చిన్నవయసులో ఆట
మరింతగా నేర్చుకునేందుకు స్పోర్ట్స్ అకాడమీలో చేరటానికి
రొనాల్డో, తన ఫ్రెండ్ ఆల్బర్ట్ ఒకేసారి పోటీపడ్డారు. అక్కడ
ఒకే ఒక్క సీటు ఉండటంతో మ్యాచ్ ఆడి ప్రతిభ నిరూపించు
కోవాల్సి వచ్చింది. ఎవరు ఎక్కువ గోల్స్ వేస్తే వారికే
అకాడమీలో చేరే అవకాశం వస్తుంది. రొనాల్డో, ఆల్బర్ట్
ఇద్దరూ పోటాపోటీగా గోల్స్ చేస్తున్నారు. ఆఖర్లో ఒక్క
గోల్ విజయం నిర్ధారణ అవుతుందనగా.. తన దగ్గర
ఉన్న బంతిని రొనాల్డో వైపు పాస్ చేశాడు ఆల్బర్ట్. ఆశ్చర్యం,
ఆనందం కలగలిసిన స్థితిలో.. రొనాల్డో ఆ గోల్ వేసి అకాడమీలో సీటు దక్కించుకున్నాడు. అక్కడి నుంచి ఇక తిరిగి
చూసుకునే పనే లేకపోయింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం.. 'ఎందుకురా అలా చేశావ్?'
అని ఆల్బర్ట్ ని అడిగాడు రొనాల్డో, 'నాకంటే నువ్వు
మెరుగైన ఆటగాడివి. ఆ విషయం నాకు తెలుసు. ప్రపంచం
చూపు నీవైపు తిప్పుకొనేంత గొప్ప ప్రతిభ నీలో దాగి ఉంది.
అందుకే ఈ అవకాశం నీకే దక్కాలి. నేను వెనకపడినా..
నాకేం బాధ లేదురా!' అని ఎంతో నమ్మకంగా చెప్పాడు.
ఆల్బర్ట్..! అనిర్వచనీయమైన అనుభూతికి ఏ పేరు పెట్టాలో
కూడా తెలియలేదు రొనాల్డ్ లోకి. అంత చిన్న వయసులో,
అంత మంచి మనసుతో తన మిత్రుడు చేసిన సాయాన్ని
పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు చెమటోడ్చి
పగలూ రాత్రీ సాధన చేసి విజయతీరాలకు చేరాడు కానీ
తన స్నేహితుడి చేయి మాత్రం ఎన్నడూ వీడలేదు. దురదృష్టవశాత్తూ ఆ తర్వాత ఆల్బర్ట్ ఎప్పటికీ ప్రొఫెషనల్ ఫుట్ బాలర్ కాలేకపోయాడు. అయినప్పటికీ అతడి బాగోగులన్నీ
రొనాల్డ్ లోనే చూస్తున్నాడు. పెద్ద ఇల్లూ ఖరీదైన కార్లూ కొనిచ్చాడు! ఒక రకంగా తన మిత్రుడి వలనే తానీ స్థితిలో
ఉన్నట్టు రొనాల్డో చెబుతూ ఉంటాడు.
సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రచారంలో ఉన్న
విషయమిది. నిజంగా ఇది రోనాల్డోనే చెప్పాడని కొందరు
అంటారు. కాదంటారు మరికొందరు. ఏదేమైనా స్నేహమంటే
ఇలాగే ఉండాలనిపిస్తుంది
రొనాల్డో-ఆల్బర్ట్ కథ చదివితే...*
[6/18, 13:52] null: *@ ఆగండి...
చూడండి...
వెళ్లండి..! @
తేది :18/06/2025
"""""""""""""""""""""""""""""""
( క్షనిక ఆవేశం లో మనం
తీసుకునే నిర్ణయాలు ఎంతటి
అగధాన్ని సృష్టిస్తుందో
ఈ స్టోరీ చదివితే
కన్నీళ్లు ఆగవు...)
గేట్ లేని రైల్వే క్రాసింగ్స్ దగ్గర రోడ్డుకు అటు, ఇటు
ఎడమ చేతివైపు పసుపురంగు బోర్డుపైన నల్లటి అక్షరాలతో
ఆగండి.. చూడండి.. వెళ్లండి' అనే సూచికలుంటాయి.
రైలు వస్తున్నదీ, లేనిదీ చూసుకుని ముందుకు వెళ్ళాలని
అవి తెలియజేస్తాయి. రైల్వే గేటు దగ్గరే కాదు, జీవితంలో
ప్రతి చోటా ఈ పదాలు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే-
ముందు వెనక చూడకుండా తీసుకునే నిర్ణయాలు
ఊహించని పరిణామాలకు దారితీయవచ్చు.
ఓ ఇంజినీరు భార్యాబిడ్డలతో ఒక కాలనీలో నివసిస్తు
న్నాడు. దీపావళి పండుగ రోజు ఉదయమే బయటికి
వెళ్లిన అతడు మధ్యాహ్నానికి కొత్త కారుతో ఇంటికి
వచ్చాడు. పూజాసామగ్రి కోసం భార్య అతణ్ని తిరిగి
బజారుకు వెళ్లమంది. అతడు అయిష్టంగానే బైక్ మీద
వెళ్లాడు. భార్య పనిలో పడింది. పిల్లలు బయట క్రికెట్
ఆడుకోవటానికి వెళ్లారు. అరగంట తరవాత అతడు తిరిగి
వచ్చేసరికి కొత్తకారు ముందు అద్దం పగిలిపోయి ఉంది.
అతడు ఉగ్రుడైపోయాడు. ఎదురుగా క్రికెట్ ఆడుతున్న
పిల్లలు కనిపించారు. అంతే, ఆవేశంతో ఊగిపోతూ పిల్లలి
ద్దరిని ఇంట్లోకి బరబరా ఈడ్చుకెళ్లి వారిచేతిలో ఉన్న
బ్యాటుతో పెద్దవాణ్ని విచక్షణారహితంగా కొట్టాడు.
చిన్నోడు అమ్మ దగ్గరకు పారిపోయాడు. దెబ్బలు తిన్న
పిల్లాడు స్పృహతప్పాడు. గదిలోకి వచ్చి కొడుక్కి దెబ్బ
తగలకుండా అడ్డుకోబోయిన భార్యను కూడా కొట్టాడు.
ఆమె ఏడుస్తూ ఏం జరిగిందో తెలుసుకుని పిల్లాణ్ని
ఒడిలోకి తీసుకుంది. ఆవేశం తగ్గాక అతడు షోరూంకు
వెళ్లి కొత్త అద్దాన్ని తెచ్చి ఫిట్ చేయించాడు.
కారు మళ్లీ కొత్తగా అయింది.
లోపలికి వచ్చేసరికి భార్య ఒళ్లో సొమ్మసిల్లిన కొడుకును
చూసేసరికి తండ్రి మనసు చలించింది. వెంటనే ఆసుప
త్రికి తీసుకెళ్లాడు. పరీక్షలన్నీ చేసి ఆ చేయి ఇక పనిచేయ
దని చెప్పాడు డాక్టర్. ఊరంతా పండుగ చేసుకుంటుంటే
ఆ కుటుంబం మాత్రం పిల్లల్ని తీసుకుని ఆస్పత్రుల
చుట్టూ తిరిగింది. ఫలితం లేదని తెలుసుకుని రాత్రికి
భారంగా ఇంటికి చేరుకుంది. కారు కొత్తగా మెరుస్తోంది.
పిల్లాణ్ని భుజానేసుకుని గేటులోపలికి వెళ్తున్న తండ్రిని'
ఆపాడు పక్కవీధిలోని పెద్దాయన. చేతిలో కొంత డబ్బు
పెడుతూ 'క్షమించండి, ఉదయం మా మనవడు క్రికెట్
ఆడుతూ విసిరిన బంతి మీ కారు అద్దాన్ని పగలగొట్టిం
దట. వాడు భయపడుతూ అప్పుడే వచ్చి చెప్పినా పనిలో
ఉండి నేను వెంటనే రాలేకపోయాను' అని క్షమాపణ
చెప్పి వెళ్లిపోయాడు. ఆ తండ్రి పరిస్థితి ఊహించగలమా?
ఒక్క క్షణం కోపాన్ని నియంత్రించుకుని ఏం జరిగిందో
పిల్లలు చెప్పేదాకా అతను ఆగి ఉంటే ఏమయ్యేది?
ఒకవేళ తన కొడుకే పగలగొట్టినా వాణ్ని కొడితే అద్దం
బాగవదు. ఎలాగూ డబ్బు పెట్టి కొనాల్సిందే. అందుకే చెప్పేది...
ఏ పనికైనా ఆగండి...
చూడండి...
ముందుకు వెళ్లండి అని...
*
[6/21, 21:08] null: @పనికి జెండర్ లేదు.!@19
తేది: 21/06/2025
""""""""""""""""""""""""""""""""""""""
సుధాకర్ వాకింగ్ నుంచి వచ్చి, తీరుబడిగా కూర్చుని బూట్లు
విప్పుతూ 'శారదా కాఫీ' అని ఇంట్లోకి కేక పెట్టాడు. శారదకి
అయిదు రోజులుగా జ్వరం. నిన్నే తగ్గింది. నీరసంగా లేచి
కాఫీ పెట్టి ఇచ్చి మళ్లీ పడుకుంది. సుధాకర్ ఉత్సాహంగా
నాలుగు కిలోమీటర్లు నడిచి వచ్చాడు కానీ నాలుగడుగులు
వంటింట్లోకి వేసి కాఫీ పెట్టుకోవడానికి మనసు అంగీకరించ
లేదు. శారదకి బాగా లేకపోతే రెండు రోజులు హోటల్లో
తిన్నాడు. మరో రెండు రోజులు ఆమె అన్నం వండితే
బయటనుంచి కూరలు తెచ్చుకుని తిన్నాడు. నాలుగు రోజుల
అంట్లు సింకులో పేరుకుపోయి వాసనొస్తున్నాయి. శారద లేచి
కడిగితేనే వాటికి మోక్షం. పిల్లలిద్దరూ వేరే ఊళ్లో హాస్టళ్లలో
ఉంటున్నారు. తమ ఇద్దరికీ ఎంత పని ఉంటుందిలే అని
పనిమనిషిని మాన్పించారు. శారద కూడా ఉద్యోగస్తురాలే.
అయినా సుధాకర్ ఇంట్లో చిన్న పని కూడా ముట్టుకోడు.
'మగవాళ్లు ఇంటి పనులు చేయడమేంటి? అంటాడు. పిల్లలు
చిన్నగా ఉన్నప్పుడు అన్ని పనులూ చేయడానికి శారద చాలా
ఇబ్బంది పడేది. అయినా పట్టించుకోకపోగా తన పనుల్లో
నిమిషం ఆలస్యమైనా సహించేవాడు కాదు. పని ఒత్తిడి,
అతడి కోపం, అలసట, ఆఫీసులో టెన్షన్.. అన్నీ కలిసి
శారద ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి.
సుధాకర్ లాంటి వాళ్లు మన సమాజంలో ఇప్పటికీ చాలా
మంది ఉన్నారు. ఇంట్లో ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు.
భార్య ఉద్యోగం చేయొచ్చు కానీ తాము ఇంటి పని చేయడం
తప్పు వీళ్ల దృష్టిలో. కొందరుంటారు... వీళ్లు తప్పని పరిస్థితిలో
ఇంట్లో పని చేయడానికి సిద్దమే కానీ చేస్తామని ఎవరికీ
చెప్పరు. భార్య కష్టానికన్నా బయటివాళ్లు చేసే ఎగతాళికి
ఎక్కువ విలువిస్తారు. అందుకని అవసరమైనప్పుడు మాత్రం
ఎవరూ చూడకుండా తలుపులేసుకుని పనులు చేస్తుంటారు.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిలేట్స్ని ఒకసారి ఎవరో
ఒక ప్రశ్న అడిగారు... ''మీరు ఇష్టంగా చేసేదీ మీరు
చేస్తారని ఎవరూ ఊహించనిదీ ఏదైనా ఉందా' అని. ఆయనేం
చెప్పారో తెలుసా? 'రోజూ రాత్రివేళ ఇంట్లో గిన్నెలు కడుగు
తాను' అని. వాళ్లకి పనిమనుషులు లేకపోవచ్చు కానీ కడిగే
మెషీన్లు ఉంటాయి. అయినా ఆయన ఆ పని ఎందుకు
చేస్తారంటే... తనకి ఇష్టం కాబట్టి. అది ఆడవాళ్ల పని అని
ఆయన అనుకోలేదు కనుక చేస్తానని బహిరంగంగా ప్రకటిం
చారు. దానివల్ల ఆయన విలువేమీ తగ్గిపోలేదుగా! తరతరాల
క్రితం ఎప్పుడో స్త్రీలను ఇంటికి పరిమితం చేసినప్పటి
పని విభజనని ఇరవై ఒకటో శతాబ్దంలోనూ అమలు
చేయాలనుకోవడం అవివేకం తప్ప మరొకటి కాదు! పనులకు
జెండర్ లేదు. వ్యవసాయం నుంచి అంతరిక్ష యాత్రల
దాకా స్త్రీలు నేడు పనిచేయని రంగం లేదు. అటువంటప్పుడు
ఇంటిపని పురుషులు ఎందుకు చేయకూడదు...?
[6/26, 09:58] null: @ ఒక్కరే..ఎన్నో జీవితాలు @20
తేది: 24/06/2025
""""""""""""""""""""""""""""""""""""""""""""
డొమినో ఎఫెక్ట్...ఈ మాట విన్నారా ఎప్పుడైనా? ఏదైనా...
ఒక్క సంఘటన వరసగా పలు సంఘటనలకు దారితీయడాన్ని
వరసగా పుస్తకాలను నిలబెట్టి చివర ఉన్న ఒక్కదాన్ని తడితే....
అది పక్కదానిమీద పడుతుంది. అలా ఒకదాని మీద ఒకటి
పడుతూ మొత్తంగా నిలబెట్టినవన్నీ పడిపోతాయి. డొమినో ఎఫెక్ట్ కి ఉదాహరణగా చెబుతారు దీన్ని అలా పడిపోవడంలోనే
కాదు పుస్తకం చదవడంలోనూ డొమినే ఎఫెక్ట్ ఉంటుందట
పాఠకుడి జీవితంలో ఆరోగ్యకరమైన మార్పునకు శ్రీకారం
చుట్టగల శక్తి మంచి పుస్తకానికి ఉంది.
చదువు విలువ, పుస్తకాల విలువ తెలిసినవారు కాబట్టే మనవారు ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటుచేసేవారు. ఆంధ్ర,రాష్ట్రంలో అయ్యంకి వెంకట రమణయ్య లాగే కేరళలో గ్రంథాలయోద్యమ పితామహుడిగా పేరొందారు పి.ఎన్. పణిక్కర్,
ఆయన ఊరూ వాడా తిరిగి చదువు విలువ అందరికీ అర్ధమయ్యేలా చెప్పేవారు. దాదాపు ఆరువేల లైబ్రరీలను సంఘటిత
పరచి గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటుచేశారు అక్షరాస్యతలో
కేరళ రాష్ట్రం ముందు వరసలో నిలవడానికి పునాది వేసింది.
'రీడ్ అండ్ గ్రో ' అన్న నినాదంతో పనిచేసిన ఈ ఉద్యమమే.
అందుకే పణిక్కర్ సేవల్ని గుర్తుచేసుకుంటూ 1996 నుంచి
ఆయన వర్ధంతి అయిన జూన్,19ని ఆ రాష్ట్రంలో పఠన దినోత్సవం'గా జరుపుకొంటున్నారు. 2017
నుంచి దీన్ని జాతీయ
పఠన దినోత్సవంగా మార్చింది కేంద్ర ప్రభుత్వం పుస్తకం
ప్రాధాన్యాన్ని చర్చించుకోవడానికి, పఠనాసక్తి పెంచుకోవడానికి
ఇంతకన్నా మంచి సందర్భం ఏముంటుంది?
'నిశ్శబ్దం పాటించవలెను' గ్రంథాలయాలన్నిట్లోనూ గోడల
మీద రాసి ఉంటుందీ సూచన. అయినాసరే ఒకప్పటి గ్రంథాలయాలు చదువరుల గుసగుసలతో పుస్తకాల పేజీల రెపరెపలతో
మంచి సందడిగానే ఉండేవి. కానీ, ఇప్పుడా సూచన అక్షరాలా
అమలు జరిగిపోతోంది. అరలనిండా పొందిగ్గా పేర్చిన పుస్తకాల
దొంతరలను కదిలించేవాళ్ళు లేక దుమ్ము కొట్టుకుపోతున్నాయి.
పలకరించే వాళ్ళు లేక గ్రంథాలయాల్లో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది ఎన్నో గ్రంథాలయాలు మూతపడ్డాయి. అంతమాత్రాన ఎవరూ చదవడం లేదనుకుంటే పొరపాటే ఇప్పుడు
పుస్తకం... బహురూపి అది ఫోనులో పీడీఎఫ్, ట్యాబ్ లో ఈ-రీడర్ అవుతుంది పుస్తకం గ్రంథాలయం నుంచి బయటపడి
రీడింగ్ క్లబ్ సభ్యుల చేతికి చేరి పార్కులో చల్లగాలికి షికారు.
కొడుతోంది బుక్ ఎక్స్చేంజ్ క్లబ్ లో చదువరుల చేతులు
మారుతూ జ్ఞానదీపాలు వెలిగిస్తోంది. ఇయర్ ఫోన్స్ ఆడియో
బుక్ అవతారమెత్తి ఇటు వ్యాయామం, అటు పుస్తక పఠనం
ఒకేసారి చేసేలా మల్టీ టాస్కింగ్ తరాన్ని అలరిస్తోంది.
ఉన్నది ఒకటే జీవితం అనుకుంటూ ఉంటాం కదా..
మరి
ఆ ఒక్క జీవితంలో వందల జీవితాలు జీవించిన అనుభవాన్ని
ఇచ్చే అవకాశాన్ని వదులుకుంటామా? అందుకే చదువుదాం...
చదివిద్దాం..!
[6/26, 13:42] null: *@ వీధి అరుగులు @21
తేది: 26/06/2025
"""""""""""""""""""""""""""""""""""
వీధి అరుగులను ఒకప్పటి వాట్సాప్, ఫేస్ బుక్
వేదికలనొచ్చేమో! అదేంటీ అనకండి. నిజం చెప్పాలంటే
అంతకన్నా ఎక్కువే. సూరీడు పడమట దిక్కున వాలడం
ఆలస్యం... మగవాళ్లంతా ఏ రచ్చబండ దగ్గరో కాలక్షేపం.
చేస్తే... ఇంటి పనంతా గబగబా కానిచ్చుకుని ఆడవాళ్లు
కాసేపు సేదతీరే విమెన్స్ క్లబ్బులవి.
మధ్యాహ్నం వేళ కాసేపు పచ్చీస్ తో కాలక్షేపం చేసినా
సాయంకాలం మాత్రం ఇరుగూ పొరుగూ అంతా కలిసి
ఎవరో ఒకరి వీధి అరుగుమీద చేరేవారు. అక్కణ్నుంచి
బోలెడు ముచ్చట్లు... ఆరోజు వండిన కూరల ప్రస్తావనతో
మొదలెట్టి... పిల్లల కబుర్లు, భర్త మీద ఫిర్యాదులు, అత్తగారి
విసుర్లు, కోడలి చిరాకులూ... అబ్బో ఎన్ని సంగతులు
దొర్లేవో. ముఖ్యంగా వాళ్ల మనసుకు కష్టమనిపించినవన్నీ
ఏ సైకాలజిస్టులూ గుచ్చిగుచ్చి అడిగే పనిలేకుండానే బయటికి
వచ్చేసేవి. పక్కింటి బామ్మగారో ఎదురింటి పిన్నిగారో ఇచ్చే
సలహాలతో పరిష్కారమూ దొరికేది. దాంతో అప్పటివరకూ
ఏ మూలో గూడుకట్టుకున్న గుబులు మటుమాయమయ్యేది.
మొత్తమ్మీద గుండె భారాన్ని దించుకుని ఆ రోజుకు అరుగు
మీటింగ్ ముగిసేది. అందరూ ప్రశాంతంగా నిద్రపోయేవారు.
అంటే- ఆ అరుగు ఓ మంచి కౌన్సెలింగ్ సెంటర్ అన్నట్లేగా.
మరీ ముఖ్యంగా అక్కడ కూర్చుని ఆ దారిన వెళ్లే వాహనాల్ని.
మనుషుల్నీ చూస్తూ మనసారా పలకరించేవారు. దీనివల్ల
అందరి క్షేమసమాచారాలు తెలిసి పరిచయాలన్నీ అప్డేట్
అయ్యేవి. సోషలైజేషన్ వల్ల ఒత్తిడి తగ్గి ఒకలాంటి ఆనందం
కలుగుతుంది. అందుకే అరుగు మంచి స్ట్రెస్ బస్టర్ కూడా.
ఇక, అప్పుడప్పుడూ వాళ్ల మధ్య లేనివాళ్ల కబుర్లూ ఉంటాయి.
ఊళ్లో జరిగిన విశేషాలూ, రేడియోలోనో వేరేవాళ్ల ద్వారానో
విన్న ప్రపంచ సంగతులూ సరేసరి. అంటే... సమాచార
ప్రసరణకీ కేంద్ర బిందువు ఆ వీధి అరుగే అన్నమాట.
ఏ పండుగో దగ్గరికొస్తుంటే ఏ రోజు ఎవరెవరి ఇంట్లో
పిండివంటలు చేయాలన్న షెడ్యూల్ ఖరారయ్యేదీ అరుగు
మీదే. మంచీచెడుల వాదప్రతివాదనలకీ అదే చర్చావేదిక.
ఇక, ఊళ్లోకెల్లా విశాలంగా ఉండే మునసబుగారి ఇంటి
అరుగులమీదే కుటుంబ కలహాలూ చిన్నపాటి కొట్లాటలకు
సంబంధించిన తీర్పులూ జరిగిపోయేవి. అంటే ఊరి
న్యాయస్థానం హోదా కూడా అరుగుదేనన్న మాట.
అంతేనా... పిల్లల ఆటపాటల గేమ్ జోన్స్, పెద్దలు చెప్పే
నీతి పాఠాలు క్లాస్ రూమ్స్ అన్నీ అదే. ఉమ్మడి కుటుంబాల్లేక
అవ్వ తాతల్లేక పాత కాలం నాటి ఇళ్ల అరుగులు ఎటూ
బోసిపోతున్నాయి. ఇంకా వాటితో పనేంటన్నట్లు కొత్తగా
కట్టే ఇళ్లకు వీధి అరుగులే ఉండటం లేదు. ఫలితమే నేడు
చిన్నాపెద్దా అందరిలో ఏదో తెలియని అశాంతి. చుట్టుపక్కల
అంతా మనవాళ్లే ఉన్నా ఏకాకుల్లా వర్చువల్ ప్రపంచంలో
జీవిస్తున్నారు. పల్లెల్లో అరుగు ముచ్చట్లకి
ఫుల్ స్టాప్ పెట్టేసి టీవీల ఫోన్లకీ అతుక్కుపోతుంటే... నగరాల్లోని గేటెడ్
కమ్యూనిటీల్లో మాత్రం బెంచ్ మీటింగ్ లు కనిపిస్తున్నాయి.
మార్పు అంటే ఇదేనేమో..!*
[6/27, 20:06] null: *@ వెదురు పాఠం..! @ 22
తేది:27/06/2025
"""""""""""""""""""""""""""""""""""""
రేయాన్ష్ అనే కుర్రాడు వ్యాపారం ప్రారంభించాడు. రెండేళ్ళు
గడిచిన నష్టాలే తప్ప లాభాల్లేవు
"ఇది ముందుకెళ్లదు"
ఎవరికీ ముఖం చూపించలేను...
ఆత్మహత్యే శరణ్యం అనుకుంటూ అడవి దారి పట్టాడు అలా కొంతదూరం వెళ్లాక
పెద్ద వయసున్న ఓ రైతు ఎదురుపడి పలకరించాడు సరే,
కొన్నిరోజులు నాతో ఉండు అని ఇంటికి తీసుకెళ్లాడు.
మర్నాడు ఉదయం అతను పెరట్లో చెట్లన్నింటికీ నీళ్లు
"పోస్తూ...ఓ పాదులా తవ్విన నేలపైనా పోశాడు దాదాపు
రెండు నెలలు గడుస్తున్నాయి. రోజూ గమనిస్తున్న రేయాన్ష్
ఇక ఉండబట్టలేక అక్కడ ఏముందని రోజూ నీళ్లు పోస్తున్నావు. ఎరువు వేస్తున్నావు అని అడిగాడు. దానిలోపల
వెదురు మొక్క ఉందనీ, నాలుగేళ్ల నుంచి పెంచుతున్నాననీ
చెప్పాడు రైతు. ఇతనికేమైనా పిచ్చా అన్నట్టుగా చూశాడు,రేయాన్ష్
అది అర్ధం చేసుకున్న ఆపెద్దమనిషి నవ్వుతూ..
'మరికొన్ని రోజులు ఓపిక పట్టు' అన్నాడు..
ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి... పెద్దాయన నీళ్లుపోసే
చోట చిన్న వెదురు పిలక కనిపించింది. అది మర్నాటికల్లా
రెట్టింపైంది. ఆరు వారాల్లోనే 90 అడుగులకు చేరింది.
అప్పుడు చెప్పాడా రైతు. 'ఇది చైనీస్ బ్యాంబూ నాలుగేళ్ల
పాటు నేల లోపలే పెరుగుతుంది. మనం పోసే నీళ్లు పీల్చు
కుని, దాని వేళ్ళు లోపలకంటా వెళ్లి బలంగా నాటుకుంటాయి.
నేల సారాన్ని గ్రహించి మొక్క బలంగా పెరిగేలా చేస్తాయి.
ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మొక్క పడిపోకుండా
ఉండేందుకే అది ముందుగా నేల లోపలికంటా పెరుగుతుంది.
మిగిలిన మొక్కలకు ఇటువంటి వేరు వ్యవస్థ ఉండదు. కాబట్టి
అవి చిన్నపాటి ఈదురుగాలికే వంగి విరిగిపోతాయి' అని!
రేయాన్ష్ కి విషయం అర్థమైంది. వ్యాపారం మొదలు పెట్ట
గానే లాభాలు ఆశించకూడదు. కష్టమర్లకు దగ్గరయ్యే వరకు
ఓపికతో కష్టపడాలి. అప్పుడే చైనా వెదురులా ఫలితాన్ని
అందుకోవచ్చని బోధపడింది. 'ఆ రైతు, నేల లోపల అసలు
విత్తనం సరిగ్గానే ఉందా... అది లోపలికి పెరుగుతుందా.
అని అనుమానించి మధ్యలోనే తవ్వి చూడలేదు. మొలకొచ్చే
వరకూ ఓపికతో ఉన్నాడు... అంటే మనం చేసే పనిమీద
ముందు మనకు నమ్మకం ఉండాలి' అన్న విషయాన్నీ గ్రహించాడు. తన వ్యాపారంలో లోపాల్ని గుర్తించి, సరిచేసుకున్నాడు.
లాభాలతో ఆనందంగా జీవించాడు.
చైనీస్ బ్యాంబూ అనేది కల్పిత కథే కావచ్చుగానీ,
ఇందులో గొప్ప వ్యాపార సూత్రం దాగి ఉంది. పునాది
ఎంత బలంగా ఉంటే భవనం అంత పటిష్టంగా ఉంటుంది.
అలాగే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడానికి ముందు
గ్రౌండ్ వర్క్ ఎంత బాగా చేస్తే, అది అంతగా వృద్ధి చెందుతుంది. కానీ చాలామంది ఇవేవీ పట్టించుకోకుండానే వేగంగా
లాభాల్ని ఆశిస్తారు. అవి రాకపోతే అక్కడితో వదిలేసి మరొకటి వెతుకుతారు. కానీ, పనితీరును మెరుగుపరచుకోవడానికి
ప్రయత్నించారు. అందుకేమరి చైనాలో ప్రాచుర్యం పొందిన
ఈ కథను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యూనివర్సిటీల్లో
బిజినెస్ మేనేజ్ మెంట్ పాఠంగా చెబుతుంటారు.*
[6/29, 16:11] null: *@ చూసే కళ్లను బట్టి..!@23
తేది: 29/06/2025
""""""'""""""'""""''""""""""""""""''"""""""
ఒక యువజంట కొత్తింట్లో కాపురం పెట్టింది. వాళ్ల కిటికీలో
నుంచి చూస్తే ఎదుటి ప్లాట్ వాళ్ల బాల్కనీ కన్పిస్తుంది. ఆ
ప్లాట్లో ఒక వృద్ధ జంట నివసిస్తోంది. రోజూ సోఫాలో
కూర్చుని దూరంగా కిటికీలో నుంచి ఎదురింటి పెద్దావిడ
ఆరేసిన బట్టల్ని చూసి 'ఇంకాస్త శుభ్రంగా ఉతకాల్సింది, బట్ట
లన్నీ దుమ్ముకొట్టుకుపోయినట్లు కనిపిస్తున్నాయి' అనుకునేది
యువ ఇల్లాలు. కొన్నాళ్లకు అది ఆమెకో అలవాటుగా మారి
పోయింది. రాను రాను ఎదురింటావిడ ఉతికే బట్టలు
మరింత మురికిగా కన్పించడం మొదలెట్టాయి. దాంతో
'చూడండి వాళ్ల బట్టలెంత మురికిగా ఉన్నాయో' అంటూ
భర్తకు కూడా ఫిర్యాదు చేసేది. 'వాళ్ల గురించి మనకెందుకు
అని అతడు సర్దిచెప్పేవాడు.
ఒకరోజు ఎప్పటిలాగే కిటికీలోనుంచి చూసిన యువతికి
ఎదురింటి బాల్కనీలో శుభ్రంగా మిలమిల మెరుస్తున్న బట్టలు
కన్పించాయి. ఆశ్చర్యంతో భర్తను పిలిచి చూపించింది.
'వాళ్ల బట్టల సంగతి సరే కానీ, నువ్వసలు మన కిటికీ
చూశావా... అద్దాలు ఎలా తళతళా మెరిసిపోతున్నాయో.
ఇవాళ పొద్దున్నే మెలకువ వచ్చేసింది. ఏమీ తోచక బాగా
దుమ్ము పట్టి ఉన్న కిటికీల అద్దాలన్నీ శుభ్రంగా తుడిచేశాను
నువ్వు లేచేసరికి' చెప్పాడు భర్త. అది విని కిటికీనీ, బయట
కన్పిస్తున్న దృశ్యాల్నీ తేరిపార చూసిన ఇల్లాలు ఆలోచనలో
పడింది. ఇన్నాళ్లూ తను చూసిన మురికి తమ కిటికీ అద్దాలదే
తప్ప ఎదురింటి వారి దుస్తులది కాదన్న మాట... అనుకుంది.
వ్యక్తిత్వ వికాస పాఠాల్లో చెప్పే కథ ఇది. మనం కళ్లతో
చూసేది అన్నివేళలా నిజం కాకపోవచ్చు, నిర్ణయాలు తీసు
కునే ముందు కాస్త విజ్ఞత చూపాలని గుర్తుచేస్తుంది. నిజమే
కదా... కిటికీ అద్దం మురికిగా ఉంటే దాని ద్వారా మనం
చూసేవన్నీ మురికిగానే కన్పిస్తాయి. మనం ఏ రంగు కళ్ల
ద్దాలు పెట్టుకుంటే లోకం ఆ రంగులోనే కన్పిస్తుంది. అలాగే
మనం ఏ దృష్టితో చూస్తే మనుషులూ అలాగే కన్పిస్తారు.
మనం నిర్మలమైన మంచి మనసుతో చూస్తే ఎదుటివారిలో
మంచి లక్షణాలన్నీ కనపడతాయి.
ఇతరుల జీవితాలూ అలవాట్ల గురించి వ్యాఖ్యానించడం,
విమర్శించడం, చర్చించడం తేలికే. నిజానికి అవి మనకే
మాత్రం అవసరమూ సంబంధమూ లేనివి. వాటివల్ల
మనసుకు అనవసర వేదనే తప్ప లాభమేమీ ఉండదు.
బతుకంతా నీటిలో ఉండే చేపకి నీచు వాసన పోదు.
దాన్ని పోగొట్టడానికి ఏవేవో వేసి రుద్దుతాం. మన మన
సులూ అంతే. వాటిని నిర్మలంగా ఉంచుకోకపోతే రోజూ
రెండుసార్లు స్నానం చేసి ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలే వేసుకుం
టున్నా లాభం ఉండదు. తప్పెప్పుడూ ఇతరులదే అని
భావించడం మాని, మనలో మనం ఆత్మ పరిశీలన చేసు
కోవడం జీవనవికాసానికి తోడ్పడుతుంది.*
[7/1, 15:42] null: *@ పాపం... నాన్న @ 24
తేది: 01/07/2025
""""""""""""""""""""""""""""""""""""
'మీకు మేరు పర్వతం తెలుసా
'పుస్తకాల్లో చదివిందే..!
'అక్షయపాత్ర గురించి విన్నారా కనీసం కామధేనువు
ఏమేం ఇస్తుందో ఐడియా ఉందా?
'చిన్నప్పుడు విన్నట్లు గుర్తు అంతే.
అవన్నీ ఒక్క చోట మూర్తీభవించిన మనిషే నాన్న! మేరు నగమంతటి వ్యక్తిత్వం ఆయనది ఎంత చిన్న వృత్తిలో
ఉన్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా నాన్నంటే కల్పవృక్షం,
డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అంటుంటారు కదా ! ఏమో,
డబ్బులు కాసే చెట్లను చూడలేదుగానీ,అడిగింది కాదనని
నాన్న చొక్కా జేబులైతే గుర్తున్నాయి కదా! అదేమిటో నాన్న
దగ్గర అన్నీ దొరుకుతూనే ఉంటాయి ఆయన మనసు
అనురాగ చెలమ ఎంత
తవ్వుకున్నా ఊరుతూనే
ఉంటుంది. కళ్లముందే
ఎవరెస్టంత నాన్న
ఉండగా, మేరుపర్వతాన్ని
చూడలేదన్న బాదేందుకు?
ఈ మధ్యే ఫాదర్స్ డే
పేరిట ఓ దినోత్సవమూ
జరిగిపోయింది. వాట్సాప్ లో కొటేషన్లు పంచుకుని,మూకుమ్మడి
వందనాలు సమర్పించేశాం. నాన్నంటే
అంతేనా! ఒక్క రోజు బలవంతంగా గుర్తుకుతెచ్చుకుని, మరుసటిరోజే మరచిపోయే
శిథిల జ్ఞాపకం మాత్రమేనా! నిజంగా నాన్న విలువను గుర్తిస్తున్నామా? మరైతే, మనకు రెక్కలు
బలపడగానే నాన్న ఎందుకు అక్కర్లేని లెక్కల్లో కలిసిపోతున్నాడు! ఇల్లు చూసుకోవడానికో, పిల్లల్ని పెంచడానికో, వండిపెట్టడానికి పనికొస్తుందని అమ్మనైతే ఎంచుకొంటున్నారు
చాలామంది. నాన్న మాత్రం 'ఎవరికీ అక్కరకురాని చుట్టమైపోతున్నాడు. పని మానేసిన నాన్న పనికిరానివాడై
పోతున్నాడెందుకో..?
ముడతలు పడిన మొరటు ముసలి
చర్మాన్ని నాన్నంటూ పరిచయం చెయ్యాల్సి వస్తుందన్న
నామోషీ ఎందుకు..?
తన గడపతొక్కిన ఏ ఒక్కరినీ వదలకుండా భుక్తాయాసంతో తిప్పి పంపిన చరిత్ర నాన్నది.
అంతటి మనిషిని నాలుగు ముద్దలకే మొహం వాచేలా
చేస్తున్న ఘనత మనది. చిన్నప్పుడెలాగూ అడిగినవన్నీ
కావాలంటూ అలిగి, ఏడ్చి నాన్నను ఏడిపించేశాం కదా! ఏరోజూ ఏదీ కాదనకుండా, లేదనకుండా ఆయన తెచ్చివ్వలేదు అప్పుడేమో తినకుండా ఏడిపించి, ఇప్పుడేమో తిండి
పెట్టకుండా ఏడిపించి...
ఎప్పుడూ నాన్నే ఏడవాలా?
నాన్నంటే ధైర్యం కష్టపడి పనిచేస్తే, ఫలితం ఉంటుందంటూ భుజంతట్టిన చెయ్యి ఆయనది. గీతాసారాన్ని ఒక్కముక్కలో చెప్పిన జ్ఞానసముద్రమది
నాన్న అనుభవసారం
కన్నా గొప్ప స్ఫూర్తి ఎక్కడ దొరుకుతుంది అందరికీ అన్నీ
ఇచ్చిన ఆ చేయి తిరిగి అడిగిందేమీ లేదు. ఆశిస్తున్నదల్లా
ఆఖరి అంకంలో కాసింత ఆప్యాయతే కదా..! ఆ మాత్రం
సాయం చేయలేమా..?
సాయం కాకపోతే దానం దానం
అనుకుంటే పుణ్యం,పుణ్యానికే పుణ్యం ప్లస్,అవుతుందనే
ఆశతోనైనా నాన్నను బతుకనిద్దాం బతికిద్దాం!
గుండెల్లో ఆకాశమంత ప్రేమను దాచుకున్న నాన్న, ఒక్క
సారైనా దాన్ని బయటికి చెప్పినట్లు గుర్తుందా..? చెప్పలేదు,
చెప్పలేడు కూడా..! ఎందుకంటే, ప్రపంచంలో భాషకు అందని
భావం ఏదైనా ఉందంటే..
అది నాన్న ప్రేమే...*
[7/3, 19:28] null: థాంక్స్... చెప్పేద్దాం..!
తేది: 3/07/2025
"""""""""""©nu"""""""""""
థాంక్యూ... చిన్న పదమే కానీ దాని ప్రయోజనాలు
బోలెడు ఎవరైనా కాస్త సాయం చేయగానే మనస్పూర్తిగా
కృతజ్ఞతలు చెబుతారు కొందరు. ఫార్మాలిటీ కోసం థాంక్యూ
అంటారు మరికొందరు. ఇంత చిన్న పనికి కూడా థాంక్స్
చెప్పాలా అనుకుని అసలు చెప్పరు ఇంకొందరు. కానీ ఎంత
చిన్నదానికైనా థాంక్స్ చెప్పే తీరాలి. ఆ పదానికి అంత
విలువుంది మరి. కృతజ్ఞతాభావన వ్యక్తులమధ్య అనుబం
దాన్నీ, నమ్మకాన్నీ పెంచుతుంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని పెంచి
ఆ ఇద్దరినీ చూసిన మరికొందరు సైతం సాయం చేసేలా
ప్రేరేపిస్తుందని పరిశోధనలూ చెబుతున్నాయి. కావాలంటే
సోషల్మీడియాలో పెట్టే పోస్టులనే పరిశీలించండి. ఓ
ఫొటో షేర్ చేయగానే కొందరే ముందు రియాక్ట్ అవు
తారు. వాళ్లకి థాంక్స్ చెప్పగానే మరికొందరు స్పందిస్తారు.
అదే మీరు ఎవరికీ థాంక్స్ చెప్పకపోతే... మర్నాటి మీ
పోస్టుకి స్పందన స్వల్పమే.
కొన్నిసార్లు థాంక్ యూ నోట్ వల్ల ఊహించని లాభాలూ
ఉంటాయి. ఇప్పటిలా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లేని
రోజులవి. చదువులో చాలా చురుకైన అమ్మాయి సంధ్య...
చిన్నప్పటి నుంచీ తాను కలలు కన్న ఓ ప్రముఖ సంస్థలో
మేనేజర్ పోస్టుకి అప్లై చేసింది. ఇంటర్వ్యూ బాగా చేసింది.
ఉద్యోగం వస్తుందనుకుంది కానీ, వేరే అమ్మాయిని తీసుకు
న్నారని తెలిసింది. తనకు రానందుకు బాధనిపించినా, ఆ
పదవికి తనకు అర్హతలు ఉన్నాయని భావించి ఇంటర్వ్యూకి
పిలిచినందుకు కంపెనీకి 'థాంక్ యూ' అని ఓ లెటర్ రాసి,
అందమైన కవర్లో పెట్టి పోస్టు చేసింది. అది చూసి ఆ
సంస్థ యాజమాన్యం ఆశ్చర్యపోవడమే కాదు, తిరిగి ఉత్తరం
రాసింది... 'థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేకున్నా మీరు
స్పందించిన తీరు, నిజాయతీ మాకు నచ్చాయి. భవిష్యత్తులో
ఏ అవకాశం ఉన్నా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాం' అని.
కొన్ని రోజులకు నిజంగానే ఆ కంపెనీలోనే మరో పోస్టుకు
ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఇదంతా కేవలం
ఆమె రాసిన థాంక్యూ నోట్ ఫలితమే. నిజానికి ఉద్యోగం
రానప్పుడు చాలామంది ఏం చేస్తారు... అన్ని అర్హతలూ
ఉన్నా తనకి ఉద్యోగం ఇవ్వలేదని కంపెనీ పట్ల అకారణ
ద్వేషం పెంచుకుంటారు. నెగెటివ్ గా మాట్లాడతారు. సంధ్య
అలా చేయకపోగా ఆ సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్లడమే
గొప్పగా భావించింది. కంపెనీని, దాని నిర్ణయాన్ని గౌరవిం
చింది. కృతజ్ఞత కనబరిచింది. లక్ష్యాన్ని చేరుకుంది.
మరి మనం అలా చేస్తున్నామా..? జీవితాన్నిచ్చిన
తల్లిదండ్రులకీ, పాఠాలు నేర్పిన గురువులకీ, అండగా ఉన్న
స్నేహితులకీ, తోడుగా ఉన్న భాగస్వామికీ, జీవితంలో స్థిర
పడేందుకు ఎదగడానికీ కారణమైన సంస్థల యాజమాన్యానికీ ఎప్పుడైనా మనఃస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నామా...
ఆలోచించండి..!
[7/5, 16:35] null: @ ఇంటిగుట్టు... @26
తేది: 05/07/2025
""""""""""""""""""""""""""""""""
వేసుకున్న డ్రస్సు, వెళ్లిన చోటు, పెళ్లి రోజు, బిడ్డల పుట్టిన
రోజు... అన్నీ సామాజిక మాధ్యమాల్లో చెప్పుకోవటం
చూస్తుంటే మనకిక వ్యక్తిగతమంటూ లేదా, మరుగన్నది
మరిచిపోయామా అన్న సందేహం వస్తోంది.
అమ్మాయి ప్రసవానికి అమెరికా వెళ్తున్నాం, అన్నవరంలో
స్వామి వ్రతం చేయించుకుంటున్నాం...ఇలా ప్రతి
విషయాన్నీ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేయడం
ఇప్పటి ట్రెండ్. టీనేజర్ల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు
ఎవరూ దీనికి అతీతులు కారు. కానీ సంసారమన్నాక కాస్తంత
గుట్టు ఉండొద్దా? కుటుంబసభ్యుల వ్యక్తిగత వివరాల్లాంటి
సున్నిత విషయాలను సోషల్ మీడియాలో ప్రచారానికి
పెట్టడం అవసరమా? చాలామంది ఈ-మెయిల్, బ్యాంకింగ్,
యూపీఐ పాస్వర్డ్ లను ను మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో
పెళ్లిరోజు, భాగస్వామి, పిల్లల పేర్లు, వారి పుట్టినరోజు తేదీల
కాంబినేషన్లతోనే పెడుతుంటారు. లైకులూ శుభాకాంక్షలను
ఆశించి ఆ ప్రత్యేకమైన రోజు గురించి సోషల్ మీడియాలో
రాసేస్తే మీ పాస్వర్డ్ లు తెరిచే తాళం చెవి సైబర్ నేరగాళ్ల
చేతికిచ్చినట్లే మరి!
ఆ
నిన్నగాక మొన్న మన కళ్లముందు పుట్టిన పసిబిడ్డ అప్పుడే
పట్టుపరికిణీ కట్టేసుకుందా అని మురిసిపోతుంటాం.
సంతోషాన్ని అందరితోనూ పంచుకోవాలని ఫొటో తీసి సోషల్
మీడియాలో పెట్టేస్తుంటాం. కానీ, తండ్రీ కూతురు కలిసున్న
ఫొటో కనిపించినా కళ్లు మూసుకుపోయి కుళ్లు మాటలు
మాట్లాడే సమాజంలో, మార్ఫింగ్ వీడియోలతో ఆడబిడ్డల
జీవితాల్ని బజారుకీడ్చే కామాంధులున్న లోకంలో బతుకుతున్నాం. మన బిడ్డల ఫొటోలు, వీడియోల్ని ఇనిస్టా లో,
ఎఫ్ బి ల్లో పెట్టి అలాంటివారి చేతికి మన జుట్టు మనమే
అప్పగించేసుకుంటున్నామా అన్నది ఆలోచించాల్సిన విషయం.
వ్యక్తిగతమే కాదు.. వృత్తిగతంగానూ అన్నింటినీ అందరికీ
చెప్పడం ప్రమాదహేతువే ఆఫీస్ విషయాల్ని సోషల్
మీడియాలో పంచుకునే ఉద్యోగిపై సంస్థకు నమ్మకం
సడలుతుంది అలాంటివారికి కీలక బాధ్యతలు అప్పగించడానికి
యాజమాన్యం సంకోచిస్తుంది. అది మన ఎదుగుదలకు మనమే
అడ్డుపడటం!
ఒకప్పుడు పెద్దవాళ్లు పసిబిడ్డలను బయటి వారికి చూపించే
వారు కాదు. దిష్టి తగులుతుందనేవారు కాలం మారింది.
పద్ధతులూ మారాయి అర్థం లేని నమ్మకాలూ సామాజిక
కట్టుబాట్లూ వీడి స్వేచ్ఛగా ముందుకెళ్తున్నంత మాత్రాన
ప్రతి చిన్న సమాచారాన్నీ సోషల్ మీడియాలో పందేరం
పెట్టనక్కరలేదు.
'ఇంటిగుట్టు లంకకు చేటు' అన్నమాట ఊరికే అనలేదు
పెద్దలు. ఫలానా వాళ్లింట్లోనే ఎందుకు దొంగతనం చేశావని
బోనులో ఉన్న దొంగని అడిగారు న్యాయమూర్తి. 'ఫ్యామిలీ
అంతా వారం రోజులు అండమాన్ టూర్ వెళ్తున్నామని ఫేస్ బుక్ లో పెట్టారండీ...చెప్పాడు దొంగ
అదండీ... సంగతి..!
[7/7, 14:03] null: సోషల్ మీడియా మయసభ@27
తేది: 07/07/2025
""""''"""""'''""'""""""""""""""""""""""""""""""
సోషల్ మీడియా ఇప్పుడు మన రొటీన్లో భాగమైంది.
బంధుమిత్రులతో కనెక్ట్ అవ్వడానికి మంచి వేదికైంది.
అనుభవాలను, అలవాట్లను, ఆలోచనలను పంచుకునే చోటు.
ఇది కొంతమేర బాగానే ఉన్నా ఎదుటివారి
'సోషల్.బతుకు'లను చూస్తూ కుంగుబాటుకు లోనవుతున్నవారి సంఖ్య
పెరుగుతోంది. ఇతరుల విహారాలు, వినోదాలు, విలాసాలను
చూస్తూ.. తమని తాము తక్కువ చేసుకుంటున్నారు
చాలామంది. మరి సోషల్ మీడియాలో మనం చూసే ప్రతిదీ
నిజమేనా అంటే...'కాదు' అనే చెప్పాల్సి వస్తుంది.
'ఫ్యామిలీ ఓవర్
ఎవ్రీథింగ్' అంటూ ఫొటోను
స్టేటస్ గా పెట్టుకునేవారు
పట్టుమని పది నిమిషాలు
కూడా ఫ్యామిలీతో
గడపకపోవచ్చు. 'ఫ్రెండ్స్
'ఫర్ లైఫ్' అనేవారికి అసలు
స్నేహితులే లేకపోవచ్చు.
'ఆరోగ్యమే మహాభాగ్యం'
అంటూ అర్ధరాత్రి పూట
పోస్టులు పెడుతుండవచ్చు.
'అమ్మే దైవం' అని
ఎమోషనల్ క్యాప్షన్స్ పెట్టేవారంతా అమ్మకు పనుల్లో సాయం
చేస్తారన్నది అపోహే. పొద్దున నిద్ర లేవగానే దేవుడి
వీడియోలను స్టేటస్ గా పెట్టుకున్నవారు మంచి మనుషులనీ
ఏ తప్పూ చేయనివారనీ అనుకుంటే పొరపాటే. పిల్లికి బిచ్చం
వేయనివారే 'సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి
తోడుపడవోయ్' అంటూ పోజులు కొట్టవచ్చు. నువ్వు లేనిదే
నేను లేనంటూ ఇన్ బాక్సుల్లో ప్రేమపాఠాలు వల్లె వేసేవారు...
ఆ మాటే మరొకరికి చెప్పరని గ్యారంటీ లేదు.
ఖరీదైన కారు ముందో, విలాసవంతమైన భవనం ముందో
నిలబడి ఫొటోలు పెడితే వాళ్ల వైభోగాన్ని చూసి అసూయ
కలుగుతుంది. కానీ అవి వాళ్ల సొంతమేనా కాదా, ఒకవేళ
సొంతమే అయితే వాళ్లకు ఆ తాహతుందా, లేక ఆర్భాటాలకు
పోయి ఆనక అప్పులతో ఇబ్బందులు పడుతున్నారా...అవేవీ
మనకు తెలియదు. ఫొటోల కోసం ఎవరికో ఏదో సాయం
చేస్తున్నట్లు నటించేవారు పెరుగుతున్నారని వారి సోషల్
మీడియా పోస్టులే చెబుతుంటాయి ఇనిస్టా లోనో,
స్నాప్ చాట్ లోనో అందమైన అమ్మాయిల ఫొటోలు చూసి
ఆత్మన్యూనతకు లోనయ్యేవారూ, తామూ అలా కనపడాలని
రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నవారూ లేకపోలేదు.
ఫొటోలకు ఫిల్టర్లు ఉంటాయనీ ఎలాంటి వారైనా అందంగా
కనిపించవచ్చనీ ఆ క్షణం స్ఫురించదు.
తెరలమీద కనిపించేవన్నీ రకరకాల ఫిల్టర్లేసిన
'సోషల్ బతుకులు'
నిజజీవితాలు కాదు. నిజాయతీగా ఉన్నదున్నట్లు
చూపించుకునేవారూ ఉంటారు. కాకపోతే వారిది
ప్రదర్శనలా ఉండదు, ఎవరికీ ఇబ్బంది కలిగించదు. లేనిది
ఉన్నట్లూ ఉన్నది లేనట్లు చూపించుకోవడానికి సోషల్
మీడియాను మయసభలా వాడుకునేవారితోనే సమస్యంతా.
వాళ్లను చూస్తూ 'తోటి వాడు తొడ కోసుకున్నాడు... నేను
మెడ కోసుకుంటా' అంటే జీవితంలో మిగిలేది అసంతృప్తి
మాత్రమే! చిన్నప్పుడు మార్కుల విషయంలో అమ్మ
మనల్ని అన్నతోనో చెల్లితోనో పోలిస్తేనే కోపం వచ్చేసేది
కదా! మరిప్పుడు ముక్కూమొహం తెలియని వారితో
ఎందుకు పోల్చుకోవాలి? సామాజిక మాధ్యమాలను
చేతనైతే మన అవసరాలకు వాడుకోవాలి. లేకపోతే వాటికి
దూరంగా ఉండాలి. అంతేకానీ వాటికి మనం
వినియోగదారులుగా మారకూడదు.
[7/9, 17:11] null: *@ మనదాకా రావాలా..?@28
తేది:09/07/2025
""""""""""""""""""""""""""""""""""""""""""
రాఘవరావుకు ముగ్గురు పిల్లలు
వాళ్ల చిన్నతనంలోనే భార్య
కాలం చేస్తే, తల్లి సాయంతో ముగ్గురినీ పెంచి పెద్ద చేశాడు.
తండ్రి ఇచ్చిన చిన్న వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. పిల్లలందరికి
ఘనంగా పెళ్లిళ్లు చేశాడు. ఆ తరవాత ఆస్తులన్నిటినీ వాళ్లకే
పంచి ఇచ్చాడు. ఆస్తుల పంపకాల సమయంలో కొందరు
స్నేహితులు 'నువ్వు కొంత ఉంచుకోమని చెప్పినా.. 'నా
పిల్లలు బంగారాలు, వజ్రాలు...అంటూ వారి సలహాను కొట్టిపడేశాడు నాలుగేళ్ళ తిరిగేసరికి ఆపిల్లలకు తండ్రి భారమ
'య్యాడు. పెద్దలతో చెప్పించినా పిల్లలు వినకపోవడంతో..
'నా ఆస్తులు తిరిగి నాకు ఇప్పించండి' అంటూ ప్రభుత్వ కార్యాలయాలకు విజ్ఞాపన పత్రాలతో తిరుగుతున్నాడు రాఘవరావు,
ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రాఘవరావు ఒక్కడిదే కాదు.
దేశంలో వేలాది తల్లిదండ్రులది.
ఆస్తులన్నీ ముందుగానే పిల్లలకు రాసిచ్చి వారి ఆదరణకు నో
చుకోక చేతిలో చిల్లిగవ్వ లేక బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో భిక్షా
టనతో జీవిస్తున్నవారెందరో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో
కష్టమైనా సుఖమైనా అందరమూ కలిసే అనుభవిద్దాం అనే
భావన ఉండేది. కుటుంబాలతో పాటు ఇప్పుడు మనసులూ
చిన్నవైపోతున్నాయి. కన్నవారికి చోటివ్వలేనంత ఇరుకైపోతు
న్నాయి. నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని నిర్దయగా తీసుకెళ్లి
ఎక్కడో అపరిచిత ప్రదేశాల్లో
దించి వచ్చేస్తున్నారు
కొందరు.
బతికుండగానే
శ్మశానంలో వదిలి వస్తు
న్నారు మరికొందరు.
వేల ఏళ్ల క్రితం జపాన్ లో ఒక ఆచారం ఉండేదట. వృద్ధా
ప్యంతో నిస్సహాయ స్థితికి చేరిన తల్లిదండ్రులను తీసుకెళ్లి
కొండ ప్రాంతాల్లో వదిలేసేవారు. వారు ఆకలికి అలమటించి
శుష్కించి ప్రాణాలు విడిచేవారు. అలాంటి ఓ తల్లిని కొడుకు
భుజాలపై వేసుకుని కొండల్లో విడిచిపెట్టేందుకు బయలుదే
రాడు. భుజంమీద ఉన్న తల్లి దారిపొడవునా చెట్ల ఆకులను,
పూలను తెంచి కింద పడేస్తుంటే 'కదలకుండా ఉండలేదు' అని
మనసులోనే విసుక్కున్నాడు. గమ్యం చేరాక దించి వెళ్లిపో
తుంటే.. ఆమె 'నాయనా చాలా దూరం వచ్చావు. చీకటి పడు
తోంది... వెళ్లేటప్పుడు దారితప్పి ఇబ్బంది పడతావేమోనని
ఆకులూ పువ్వులూ తెంచి దారి పొడుగునా వేస్తూ వచ్చాను..
వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా ఇంటికెళ్లు' అంది. అమ్మ
ప్రేమ ఎంత ఉన్నతమో...తాను చేస్తున్న పని ఎంత హీనమై
నదో అర్ధం చేసుకున్న ఆ కొడుకు కన్నీళ్లతో తల్లిని గుండెలకు
హత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు ఆమె జీవించినంత కాలం
ప్రేమగా చూసుకున్నాడట. అతణ్ని చూసి ఇంకొందరు..
వారిని చూసి మరికొందరిలో మార్పు రావడంతో ఆ అనా
చారం క్రమంగా రూపుమాసిందట. జన్మనిచ్చి, జ్ఞానంతో పాటు
అనంతమైన ప్రేమను పంచిన తల్లిదండ్రుల పట్ల జీవితాంతం
కృతజ్ఞతాభావాన్ని నింపుకోవడమే వారికి కొంతైనా మనం
తీర్చుకోగల రుణం. లేకుంటే కాస్త ముందో వెనకో మనకూ
అలాంటి పరిస్థితి తప్పకపోవచ్చు.*
[7/11, 15:30] null: @ స్వేచ అంటే...@ 29
తేది :11/07/2025
""""""""""""""""""""""""""""""""""
బట్టలు బాగోలేవనీ మార్చుకోమనీ చెప్పిన తల్లిని 'ఇష్టమైన
'డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా నాకీ ఇంట్లో...
ప్రశ్నిస్తుందో టీనేజర్.
'హాస్టల్లో అసలు ఫ్రీడమ్ ఉండదు నాన్నా' తండ్రికి నచ్చజెబుతాడు కొడుకు.
'ఉద్యోగం చేస్తున్నా ఓ పదివేలు సొంతానికి వాడుకునే
స్వాతంత్య్రం లేదు' నిట్టూరుస్తుందో ఇల్లాలు.
'పేరుకే అధికారిని. రూల్స్ మా చేతులు కట్టేస్తాయి.
స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేం'' వాపోతాడు ఉద్యోగి.
అసలేంటీ స్వేచ్ఛ? ఎవరిస్తారు?
స్వేచ్ఛ అనగానే మనకి గుర్తొచ్చేది రెక్కలల్లార్చుకుంటూ
ఎగిరే పక్షే. మనకీ అలా రెక్కలుంటే ఎంత బాగుణ్ణు.
కావాల్సిన చోటికి రివ్వున ఎగిరిపోవచ్చు...ప్రతిమనిషి ఏదో
ఒక సమయంలో అనుకునే మాటే ఇది. కానీ పక్షులు నిజంగా
అంత స్వేచ్ఛగా ఉంటాయా? ఏ పక్కనుంచీ రాబందుల
రెక్కల చప్పుడు వినిపిస్తుందోనని ఒళ్లంతా చెవులు చేసుకుంటాయి ఏ మూల ఏ పాము పొంచివుందోనని ఎక్స్ రే కళ్లతో
స్కాన్ చేస్తుంటాయి. ఎటునుంచి వేటగాడి ఉండేలు దెబ్బ
దూసుకొస్తుందోనని అనుక్షణం అప్రమత్తంగా ఉంటాయి. పాట
కైనా ఆటకైనా అనువైన చోటునే వెతుక్కుంటాయి తప్ప
ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆడి, పాడవు.
ఎప్పుడేం చేయాలనుకుంటే అది చేయగలగడమే స్వేచ్ఛ
అని అందరూ అనుకుంటారు కానీ, అది నిజం కాదు.
నిజమైన స్వేచ్చకి పరిమితులుంటాయి. అవి లేని దాన్ని
విశృంఖలత్వం అంటారు.
స్వేచ్ఛ చాలా రకాలు. బ్రిటిష్ వాళ్లనుంచి మనం పొందింది
రాజకీయ స్వేచ్ఛ
ఆర్థిక స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ...
ఇలా
చాలా స్వేచ్ఛలే ఉన్నాయి. అవన్నీ మన సొంతమే, ఎవరో
ఇచ్చేవి కావు. అయితే ఏ స్వేచ్ఛ అయినా హద్దుల్లో ఉన్నంతవ
రకూ, మరొకరి స్వేచ్ఛకు భంగం కలిగించనంతవరకూ మాత్రమే
అది మన హక్కు. అందుకే 'చెయ్యి విసరడానికి నీకున్నస్వేచ్ఛ...
అవతలి వ్యక్తికి హాని చేయనంతవరకే అన్న ఆమెరికా సుప్రీంకోర్టు మాజీ జడ్జి
ఆలివర్ వెండెల్ హోమ్స్ జూనియర్ మాటని స్వేచ్ఛ పరిమితులు చెప్పడానికి వాడుతుంటారు...
కాకపోతే వీటన్నిటినీ మించింది- ఆలోచనల్లో స్వేచ్ఛ. 'నిజమైన స్వేచ్ఛ మన లోపలి నుంచి వస్తుంది. దాన్ని బయటినుంచి
ఎవరూ ఏమీ చేయలేరు' అంటారు
రవీంద్రనాథ్ టాగోర్
సంతోషంగా ఉండటానికి కావాల్సింది,మిగిలిన స్వేచ్ఛలన్నిటికీ
పునాది- ఆ స్వేచ్ఛే మరి...!
[7/13, 19:33] null: *@ రాదు..కాదు..లేదు..@30
తేది: 13/07/2025
""""""""""""""""""""""""""""""""""""
"రాదు.... కాదు... లేదు... అన్న మాటలు నా డిక్షనరీలో
లేవు తన కుడిచేతి వేళ్లను ఉత్తుత్తి తుపాకీలా మడిచి,
గిరగిరా తిప్పి, కణతకు ఆనించి, రజినీకాంత్ స్టయిల్లో గాల్లోకి
శాల్యూట్ కొడుతూ అంటున్నాడొక విద్యార్థి ఇది ఆబడిలో
పిల్లల సరదా ఆట...
టీచర్ పనిగట్టుకుని వాళ్లకది నేర్పించింది
ఎందుకంటే... అదొక ముఖ్యమైన పాఠం మరి
'నాకు రాదు. నాకు వీలు కాదు. నాకు టైం లేదు'...
ఎంత సునాయాసంగా అనేస్తుంటామో ఈ మాటల్ని. 'రాదన్న
పని రాజా పని' అని నానుడి. ఇక, అవునంటే కాదనడంలోని
మజానే వేరు. ఉందని ఊబిలో పడడం కన్నా, లేదని
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని మురిసిపోయే వాళ్ల
సంగతి సరేసరి. 'లేకపోతే, వచ్చని చెప్పి గంపెడు పనిని
నెత్తికెత్తుకుంటామా?' అని లౌక్యం ఒలకబోసే వారి గురించి
చెప్పేదేముంది? పని తప్పించుకోవడానికి చెప్పే సాకులది
ఒకరకం అయితే, 'నాకు ఎప్పటికీ రాదు. నావల్ల కాదు. నేను
చేయలేను' అనుకుంటూ మనల్ని మనం కన్విన్స్
చేసుకుంటామే, అదే అసలు ప్రమాదం... కుంగుబాటుకు,
నిరాశా నిస్పృహలకు మూలం. కొత్త విషయాలు
నేర్చుకోవాలన్నా, కొత్తపని చేపట్టాలన్నా 'నాకెందుకు రాదు?
నావల్ల ఎందుకు కాదు? నేనెందుకు చేయలేను? అని
ప్రశ్నించుకోవడం అత్యవసరం. సరిగ్గా అలాంటప్పుడే జూడీ
గార్లాండ్ పాట గుర్తొస్తుంది.
'ఎక్కడో ఇంద్రధనుసుకు ఆవలగా నీలిపిట్టలు
ఎగురుతున్నాయి. కువకువలాడే నీలిపిట్టలు ఇంద్రధనుసును
దాటి పైకెగిరిపోతున్నాయి. మరి, నేనెందుకని? ఓ!
నేనెందుకని ఎగరలేను?'
'వై కాంట్ ఐ?' అన్న చిన్నారి డొరోతీ ప్రశ్న అందించిన
స్ఫూర్తి, ఆ పాటని మిలీనియం గీతంగా మార్చింది. స్ఫూర్తి
ఎక్కడో కాదు, మన చుట్టూనే ఉంటుంది. మనం
గ్రహించాలంతే. అది ఎగిరే నీలిపిట్ట కావచ్చు, తాను నేసిన
పట్టుదారాలు మీదనే, పదే పదే జారిపడే సాలీడు కావచ్చు.
స్కాటిష్ యోధుడు కింగ్ బ్రూస్ గురించి విన్నారా? స్వేచ్ఛా
పోరాటంలో ఆరుసార్లు ప్రయత్నించి, ఓడిపోయి, నిరాశా
నిస్పృహలతో కుంగిపోయి, ఒక పాడుబడ్డ గుడిసెలో దాక్కుని
ఉంటాడు. అక్కడ ఒక సాలీడు పైకి ఎగబాకడానికి ఆరుసార్లు
ప్రయత్నించి, విఫలమై, మళ్లీ ఏడోసారి ప్రయత్నిస్తుంది.
గమ్యం చేరుకుంటుంది. 'సాలీడు పాటి పట్టుదల నాకు
లేదా?' అనుకున్న కింగ్ బ్రూస్ శక్తులన్నీ కూడగట్టుకుని
ప్రయత్నిస్తాడు విజయం సాధిస్తాడు...
'మొదటిసారి
గెలవలేకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించు' అన్న హితోక్తి
అప్పుడే పుట్టింది
'ట్రయల్ అండ్ ఎర్రర్' అన్నది మానవాళి
మనుగడకే మూలసూత్రం అదే లేకపోతే మానవ పురోగతి
సాధ్యమయ్యేదేనా?
అందుకే, ఒకసారి విఫలమైనా ప్రయత్నించండి. మళ్లీ
ప్రయత్నించండి. స్ఫూర్తి, ప్రేరణ మన చుట్టూ ఉన్నంతగా,
మనలోనూ ఉంటాయి. అందుకు అడ్డుపడే
'రాదు, కాదు,లేదు'
లాంటి మాటలను తీసి, చుట్టచుట్టి,
ఏబంగాళాఖాతం లోకో విసిరికొట్టండి...!*
[7/15, 16:36] null: @ కోపం వస్తుందా...@31
తేది:15/07/2025
""""""""""""""""""""""""""""""""""
"కోపం ఎందుకు రాదండీ..! మడిసన్నాక
కోపం వచ్చుద్ది"అంటుంది 'అత్తారింటికి దారేది' సినిమాలో ఓపాత్ర నిజమే కోపం
ఒక ఉద్వేగం మనలో చాలామందికి
పిలవకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది...
మనిషికి కోపంతో పని పడుతుందా...?
అంటే - పడుతుంది.
ధర్మానికి హాని జరిగినప్పుడు, కళ్లకు
ఎదురుగా అన్యాయం జరుగుతున్న
ప్పుడు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అలా
వచ్చే కోపాన్ని 'ధర్మాగ్రహం' అంటారు. పిలవని పేరంటంలా
వచ్చిపడే సందర్భాల్లో అయితే అది
శత్రు కూటమిలో ఒక
టైన కోపం అవుతుంది. మనలో చాలామందికి ఆరెండో
తరహా కోపంతోనే పరిచయం ఎక్కువ
తన కోపమే తన
శత్రువు అన్న మాట నిజమయ్యే సందర్భాలవే.
'కారణంలేకుండా ఎవరికీ కోపం రాదు.. అయితే
ఎప్పుడో గాని కోపానికి సరైన కారణం ఉండదు" అన్నారు
బెంజమిన్ ఫ్రాంక్లిన్. 'సరైన కారణం' అనేదే కీలకం.
కాబట్టి కోపం ముంచుకొచ్చినప్పుడల్లా ఒక్కక్షణం ఆగి మన
కోపానికి తగిన కారణం ఉందో లేదో చూసుకుంటే చాలు.
అది కేవలం ఉద్వేగానికి చెందిందో, ధర్మానికి చెందిందో
మనకే తెలిసిపోతుంది దాన్నిబట్టి ఆగ్రహించాలో -
నిగ్రహించాలో తేల్చుకోవచ్చు.
కోపం, దుఃఖం, భయం.. వంటి ఆరింటిని ప్రాథమిక
భావోద్వేగాలుగా చెబుతుంది మనస్తత్వ శాస్త్రం. వాటికి
తక్షణమే స్పందించేది మెదడులోని 'లింబిక్ లోబ్. అప్పుడు
'ఎడ్రినలిన్' అనే రసాయనం విడుదల అవుతుంది. అది
మనిషిని అసంకల్పిత చర్యలకు ప్రేరేపిస్తుంది.ఆమధ్య ఒక
బాలిక తన తల్లిపైకి దూసుకొచ్చిన ఆటోను అమాంతం
ఎత్తేసి అమ్మను రక్షించుకొన్న సంఘటనను సామాజిక
మాధ్యమాల్లో చూశాం. అంటే భయమనే భావోద్వేగాన్ని
అంతర్గత శక్తిగా ఆవిష్కరించిందామె. నేనెత్తగలనా అన్న
ఆలోచనే లేకుండా అంత బరువునూ ఎత్తిపడేసింది. అలా
మనిషిలో కోపాన్నీ ఆయుధంగా, శక్తిగా మార్చుకోవడం
సాధ్యమే- అంటారు మనస్తత్వ నిపుణులు.
అలా కోపాన్ని నిగ్రహించుకోవడంగాని, ఒక ఆయుధంగా
మార్చుకోవడం గాని ఎప్పుడు సాధ్యమవుతుందంటే- భావో
ద్వేగ సంయమనాన్ని (ఎమోషనల్ బ్యాలెన్సింగ్) సాధన చేసిన
ప్పుడు. దానికి మనిషిలోని వివేకం ఆధారం. నిగ్రహానికి
పునాది భావోద్వేగ వివేకం (ఎమోషనల్,ఇంటెలిజెన్స్).
కోపాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించడంకోసం పనిగట్టుకొని
దాన్ని పిలవడమే ఫ్రాంక్లిన్ చెప్పిన 'సరైన కారణం',
భయంలో, దుఃఖంలో, కోపంలో మునిగిపోయినప్పుడు మనిషి
దేహంలో వణుకు రావడానికి కారణమయ్యే ఎడ్రినలినే
ధర్మాగ్రహం విషయంలో శక్తిగా మారుతుందని అర్థం. కోపం
తనంతట తానే వచ్చినప్పుడు అదే మనిషిని శాసిస్తుంది ప్రతీకారానికి ప్రేరేపిస్తుంది. కానీ, కోపాన్ని మనం పిలిచినప్పుడు
అదే ఎడ్రినలిన్ మన చేతిలో ఆయుధం అవుతుంది.
కోపంరావడమా...
తెచ్చుకోవమా...
ఏదిమేలంటారు...?
[7/17, 16:56] null: @ గెలుపు పిలుపు...@32
తేది: 17/07/2025
"""""""""""""""""""""""""""""""""""""
'ఈసారి వార్షికోత్సవంలో గెస్టులను వేదిక మీదికి ఆహ్వానించే
బాధ్యత నీదే' అని ఆఫీసులో చెప్పారనుకోండి... నూటికి
తొంభై తొమ్మిది మంది నుంచి వెంటనే వచ్చే సమాధానం
'అమ్మో... నేనా...' అని. 'నా కాళ్లు వణుకుతాయి, అంతమం
దీని చూస్తే నాకసలు గొంతే పెగలదు...' అంటూ సమర్ధించు
కుంటారు. లోపల చేయాలనే ఉంటుంది. బాగా చేసి ప్రశంస
అందుకోవాలనీ ఉంటుంది. ఇదే కాదు, ఐఏఎస్సో ఐపీఎస్సో
సాధించాలనో, కంపెనీ పెట్టి వందలాది మందికి ఉపాధి
కల్పించాలనో, రాజకీయ నేతగా రాణించాలనో... చాలామంది
కోరుకుంటారు, కలలు కంటారు. కానీ తమ వల్ల కాదేమోనన్న
సంశయంతో, స్వీయ సామర్థ్యం మీద అపనమ్మకంతో ప్రయ
త్నమే చెయ్యరు. అనవసర భయాలను పక్కన పెట్టి, 'ప్రయ
త్నిస్తే పోయేదేమీ లేదు, గెలిస్తే విజయపతాకాన్ని ఎగరేయవచ్చు, ఓడితే అనుభవ పాఠాలు మిగులుతాయ'ని ముందడుగు
వేసేవారు కొందరే ఉంటారు. నిజానికి విజేతలకు కావాల్సింది
అలాంటి దూకుడు స్వభావమే. రిస్క్ తీసుకోనిదే ఏదీ
లభించదు. రోడ్డుమీదికి వెళ్తే ప్రమాదం జరుగుతుందేమోనని
భయపడి ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోం కదా..!
ముందుగా పిరికితనాన్ని వదిలి ధైర్యంగా ముందడుగేయాలి. ప్రతిభకి పదునుపెట్టి, కొత్త కోణంలో ఆలోచిస్తే
తప్పక విజయం సాధించవచ్చు. స్టార్ బక్స్ ఎంత పెద్ద
సంస్థ తెలిసిందే కదా. దానికి సీయీవో కాగలనని ఒక
ట్రక్కు డ్రైవరు కొడుకు కలనైనా ఊహించగలడా? స్టార్ బక్స్ కి
సుదీర్ఘకాలం పాటు సీయీవోగా సేవలందించిన హోవర్డ్ షుల్ట్ జ్ ట్రక్కు డ్రైవరు కొడుకు పేదల కోసం ప్రభుత్వం
కట్టించిన ఇంట్లో అతని బాల్యం గడిచింది కష్టపడి చదివి
సేల్స్ మన్ గా ఉద్యోగం ప్రారంభించారు 1982లో రీటైల్
ఆపరేషన్స్ అండ్ మార్కెటింగ్ విభాగానికి డైరెక్టరుగా స్టార్
బక్స్ లో అడుగుపెట్టిన హోవర్డ్, ఆ తరువాత సీయీవో
అయ్యి ఇంతింతై...అన్నట్లుగా కంపెనీని విస్తరించారు.
పదేళ్లలోనే ప్రపంచంలో అతిపెద్ద కాఫీ హౌస్ చైన్ గా తీర్చిదిద్దారు. రెండు దఫాలుగా పాతికేళ్లు కంపెనీకి సారథ్యం
వహించి బయటకు వచ్చినా మళ్లీ సంక్షోభం తలెత్తినప్పుడు
ఆయననే పిలిచి తాత్కాలిక సీయీవోగా బాధ్యతలు అప్పజెప్పారంటే- హోవర్డ్ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
'అందరూ చేసినట్లే చేయొద్దు, మూసలో ఇమడటానికి
ప్రయత్నించొద్దు. ఒకరు చెప్పింది మాత్రమే చేస్తే నీ సత్తా
ఏంటో ఎప్పటికీ తెలియదు. మిగతావాళ్లు అసాధ్యం అనుకు
న్నదాన్నే ప్రయత్నించాలి... అంటారాయన తన పుస్తకం
'పోర్ యువర్ హార్ట్ ఇంటూ ఇట్'
లో
రిస్క్ అంటే భయపడేవాళ్లు, అసలు ప్రయత్నమే చేయని
వాళ్లు దేన్నీ సాధించలేరు. రాత్రి పడుకుంటే తెల్లారి లేస్తా
రన్న గ్యారంటీ లేదు. అయినా నమ్మకంగా పడుకుంటారు.
రేపు ఏమవుతుందో తెలీదు. కానీ భవిష్యత్తు కోసం రకర
కాల పథకాల్లో డబ్బు మదుపుచేస్తారు అచ్చం అలాగే
గెలుపు మీద కూడా నమ్మకం పెంచుకోవాలి. కలలు కనాలి.
గెలుపునే శ్వాసించాలి. అప్పుడే గెలిచి తీరుతారు.
[7/19, 16:28] null: *@ ప్రవర్తనే..పరిచయపత్రం @33
తేది:19/07/2025
"""""""""""'''''''''''''''''""""""""""""""""""""""""""
వ్యవహార శైలిలోనే మన వ్యక్తిత్వం కనిపిస్తుంది
నడతే మన
నాగరికతకు అద్దం పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే
ప్రవర్తనే మన పరిచయ పత్రమవుతుంది. వస్త్రధారణ నుంచి
ఆహారపు అలవాట్ల వరకు, ఆతిథ్య సంస్కృతి నుంచి సభ్యత
వరకు, సంభాషణల సంస్కారాల నుంచి సభామర్యాదల
వరకు ప్రతిదీ మన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. చూడటానికి
చిన్న విషయాల్లాగే అనిపించినా, అలోచిస్తే మెరుగైన మానవ
సంబంధాలకు అవే ప్రధాన కారణమవుతాయని అర్థమవు
తుంది. మనం ఏవి ఇస్తే, అవే మనకు తిరిగి వస్తాయన్న
సూత్రం గౌరవ మర్యాదలకు కూడా వర్తిస్తుంది.
మనం రాళ్లు
విసిరి మనసై పూలవానలు కురవాలనుకుంటే ఎలా?
సభ్యతా సంస్కారాలను... చూసైనా నేర్చుకోవాలి, చెప్పి
నప్పుడైనా మార్చుకోవాలి. మనవల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది
కలగకుండా విజ్ఞతతో మెలిగేవారే వివేకవంతులు. సంఘజీవులమైన మనం సాటి మనిషికి అసౌకర్యం కలగకుండా
నడచుకోలేనప్పుడు మన చదువులకు, హోదాలకు విలువే
లేదు. మనిషి ఎక్కడో నిర్మానుష్య వనాల్లో ఒంటరిగా
కొండపైనో జీవిస్తున్నప్పుడు సభ్యత, సంస్కారం, మర్యాద,
మన్ననలతో పనిలేదు. కానీ ఆ కొండపై మరో వ్యక్తి
వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. సామరస్యంగా
మసలుకోకపోతే ఘర్షణ తలెత్తుతుంది.
ముంబయికి చెందిన రుక్సానా ఎయిసా అనే రచయిత్రి
వ్యక్తుల నడవడికకు సంబంధించి ఏకంగా ఓపుస్తకాన్నే
రాశారు. 'ది గోల్డెన్ కోడ్' పేరిట విడుదలైన ఈ పుస్తకం
బహుళ జనాదరణను పొందింది. రుక్సానా విమానయాన
రంగంలో ఉన్నతోద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తూ, వృత్తిరీత్యా
ఎన్నో దేశాల్లో పర్యటించారు. ఆ అనుభవంతో ఆమె సభ్యసమాజంలో మనుషుల మధ్య సామరస్య సంబంధాలకు ఎంత
ప్రాధాన్యముందో ప్రస్తావించారు. తాను పరిశీలించిన అంశాలకు
అక్షరరూపమిస్తూ రుక్సానా సామాజిక సంస్కారాల తాలూకు
విలువైన విషయాలను తన పుస్తకంలో క్రోడీకరించారు. వ్యక్తి
విజయం, సామాజిక విజయంపై ఆధారపడి ఉందని చెప్పకనే
చెప్పారు. అందుకే ఆ పుస్తకం శీర్షికకు
'మాస్టరింగ్ ది ఆర్ట్ఆఫ్ సోషల్ సక్సెస్'
అన్న ట్యాగ్ లైన్నీ జోడించారు.
సకల సాంకేతిక సౌలభ్యాల మధ్య... పరుగెత్తయినా పాలే
తాగాలనుకునే పాశ్చాత్య ప్రపంచంలో, పౌరులు పొరుగువారిపై
ఎంతో శ్రద్ధ చూపుతారట. ఎదుటి వారి స్వేచ్ఛకు ఏ మాత్రం
భంగం కలగకుండా, పక్కవారి మనసెరిగి మసలుకుంటారట.
తమ అవసరాలు తీరటం కన్నా తోటివారికి అసౌకర్యం కలగ
కుండా ఉండటమే ముఖ్యమని భావిస్తారట. ఎంత మంచి
సంస్కారం! ఇలాంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ రచయిత్రి
రుక్సానా భారతీయులం మనం ఇంకా ఆ విషయంలో వెనక
బడే ఉన్నామని అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మనం మారాల్సిన
అవసరాన్ని పరోక్షంగా ఎత్తిచూపిస్తారు...*
[7/20, 20:09] null: @ "స్వాట్ "మంత్ర...@ 34
తేది: 20/07/2025
"""""""""""""""""""""""""""""""'''''""""""
" నీలో ఈ లోపముందోయ్..."
పద్ధతి మార్చుకో' అన్నారనుకోండి ఎవరన్నా...
మనసు టక్కున చిన్నబుచ్చుకుని మొహం
కాలిపోయిన మతాబులా మాడిపోతుంది అలా చెప్పినవాళ్ళపై
కోపం తన్నుకొస్తుంది మూడ్ ఖరాబైపోయి ఇక ఆ రోజంతా
విచారం అలల మాదిరిగా ఎగసి పడుతూనే ఉంటుంది
లోలోన అలా చెప్పినవాళ్లు ముక్కుసూటి మనుషులైతే
ప్రాబ్లం మరీ ఎక్కువ ఎందుకంటే వారి మాటలు మెత్తగా
కాకుండా సుత్తితో కొట్టినట్టు సూటిగా ఉంటాయి కాబట్టి ఉన్న
లోపమే చెప్పినా అంగీకరించడానికి మనసు
ఓ పట్టాన ఒప్పదు చాలామందికి
నిజానికి ఎదుటి
వారు మన లోపాలను
గుర్తించి, మన బాగుకోరి చెబుతున్నారంటే
అదృష్టం అనుకోవాలి మన బలహీనత
లేంటో పసిగట్టడానికి
వారు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి
ఉంటారు దాన్ని మనకు చెప్పాలా, వద్దా అని నిర్ణయించుకోవడానికి తర్జనభర్జన పడి ఉంటారు చెప్పాలని నిర్ణయించుకున్న తరువాత ఎలా చెప్పాలా అని ఆలోచిస్తారు అంత
కష్టపడి మన బలహీనతల గురించి చెప్పినప్పుడు వారి
మీద కోప్పడటం అన్యాయం కాకపోతే మరేంటి..? అసలు
అలా చెప్పే సన్నిహితులు లేకపోవడంవల్లే చాలామందికి
తమ లోపాలేంటో తెలిసిరాక గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇష్టారాజ్యంగా జీవితాన్ని గడిపేస్తున్నారు
టీచర్లు, డాక్టర్లు,కోచ్ లు ఇలాంటి వారంతా మనల్ని బలహీనతల నుంచి
గట్టెక్కించేవారే కదా?
మరో విషయం ఏ మనిషి అయినా, సంస్థయినా అభివృద్ధి చెందడానికి మూలం లోపాలు, సమస్యలేనంటారు మేనేజ్ మెంట్ గురువులు వాటిని గుర్తించి, అధిగమించేవారికే వృద్ధీ
విజయం సిద్ధిస్తాయంటారు. అసలు లోపమేంటో తెలుసుకోవాడానికే ఇష్టపడకపోతే ఇక బాగుపడేదెప్పుడు..?
ఏ మంచి మార్పు
అయినాసరే లోపాల మీదా, అసౌకర్యాల మీదా పుట్టుకొస్తుందనేవారు ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆర్నాల్డ్ బెన్నెట్
చెప్పాలంటే మానవ వికాసయాత్ర అంతా ఇలా లోపాలను,
సమస్యలను అధిగమిస్తూ వెళ్తున్నదే
అమెరికాకు చెందిన ప్రఖ్యాత మేనేజ్ మెంట్ నిపుణుడు
ఆల్బర్ట్ హమ్ ఫ్రే 1960లో
'స్వాట్అనాలసిస్' అనే వ్యాపారాభివృద్ధి సూత్రాన్ని రూపొందించారు అది మొదలు
ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మేనేజ్ మెంట్ విద్యార్థులకు
పాఠమై కూర్చుందా సూత్రం
స్వాట్ (ఎస్ డబ్ల్యూఓటీ)
అంటే బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లు వీటిలో
బలహీనతలే మన చేతిలో ఉండేవి
అదుపులో ఉండని బాహ్య,ప్రపంచంలోని సవాళ్లను
ఎదుర్కోవడానికి, అవకాశాలను ఒడిసిపట్టడానికి చేయాల్సిందల్లా మనలోని లోపాలను అధిగమించి సామర్థ్యాలను
పెంచుకోవడమే ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా,పాలనకైనా
మరి దేనికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది...
సొమ్ములు
ఎన్ని ఉన్నా...
సోకులు ఎన్నిచేసినా...
లోపమేంటో తెలుసుకున్ననాడే జీవితం మేలిమి మలుపు,తిరుగుతుంది
లేదంటే, బతుకు పయనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే
అన్నట్లు ఉండిపోతుంది కాదంటారా...?
[7/24, 20:58] null: @ విలువ తగ్గదు..! @ 35
తేది : 24/07/2025
"""”"""""''''''""""""""""""""""""""""""""
'ఆనందానికి మార్గం లేదు ఆనందమే మార్గం'
అన్నాడు" బుద్ధుడు "
అందుకే జీవిస్తే సరిపోదు, దానికో లక్ష్యం
ఉండాలి ఆనందంగా జీవించడమే ఆ లక్ష్యం కావాలి
ఒక ప్రొఫెసర్ తరగతి గదిలో విద్యార్థులకు అయిదువందల రూపాయల నోటు చూపిస్తూ,
ఇది ఎవరికి కావాలి..?
అని అడిగారు అందరూ చేతులెత్తారు ఆ నోటును చేత్తో,
బాగా నలిపి మళ్లీ చూపిస్తూ ఇప్పుడు.?అన్నారు మళ్లీ
అందరూ చేతులెత్తారు ఎంత నలిగినా నోటు విలువ తగ్గలేదు జీవితమూ అంతే కిందా మీదా పడుతుంటాం
రకరకాల కారణాల వల్ల ఓడినా కిందపడినా
మనం మనమే
మన జీవితానికి విలువ తగ్గదు అందుకే మిమ్మల్ని మీరు
ప్రత్యేకమైనవారిగా గుర్తుంచుకోవాలి'
చెప్పారు ప్రొఫెసర్,
జీవితంపట్ల మెలకువతో ఉండాలి నిద్రమత్తుతో ఉండకూడదు మనల్ని ప్రేమించేవారు, మనం ప్రేమించేవారు
ఉన్నారు కాబట్టి జీవించాలనుకుంటాం
లక్ష్యం లేకుండా,
స్పష్టత లేకుండా జీవించడంలో అర్థం లేదు కావాలనుకున్నది ఏదో జరిగితే,
కోరుకున్నది అయితే అప్పుడు
సంతోషించవచ్చని ఎదురుచూస్తుంటారు కొందరు కష్టపడి
పనిచేయడం సబబేకాని కష్టం మాత్రమే జీవితం కాకూడదు.
సంపాదించడంలో మమతలు, అనుబంధాలు, అనురాగాలు
అడుగునపడి పోకూడదు ఇవన్నీ లేని సంపద అర్థరహితమే.
ఆనందం మన సహజలక్షణం కావాలి పనికి విలువనిస్తూనే
జీవితంలో నాణ్యతనూ పెంచుకోవాలి కోపం, విరోధం, అసంతృప్తి లాంటివి ఆనందాన్ని తుంచేస్తాయి మనకే అపకారం
చేస్తాయి ఆనందమనేది ఎవరో ఇచ్చేది కాదు, మన ఎంపికే
మీరు ఆనందంగా ఉండాలనుకుంటే దాన్ని పాడుచేయడం
ఎవరి తరమూ కాదు.!
ఇష్టమైన పనిచేయండి ఇతరులకు సాయం చేయండి
జీవితంలో లభించినవాటికి కృతజ్ఞతతో ఉండండి క్షమించడం,మరచిపోవడం...
అలవాటు చేసుకోండి ఓ సినీకవి అన్నట్లు
జనమందరిలో మనమెవరంటే తెలిసుండాలి
ఒక విలువుండాలి...
అందుకు మనదైన ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలి
పరీక్షలు, ప్రయాణం, ఉద్యోగం, ఆరోగ్యం...
రకరకాల
భయాలు మనకి కొందరైతే తమవే కాదు, తమ పక్క వాళ్ల
భయాలను కూడా తమ నెత్తిమీద వేసుకుని భారంగా జీవిస్తుంటారు
మరికొందరేమో ఎప్పుడో జరిగి పోయిన సంఘటనలను తలచుకుని
తలచుకుని కుమిలిపోతుంటారు భయం,వేదన
జీవితాల్ని దుర్భరం చేస్తాయి
కష్టాలు లేనిదెవరికి...?
నష్టాలు
రానిదెవరికి? వాటితో బాధపడటం కాదు,వాటినుంచి బయట
పడే మార్గం వెతుక్కోవడం వివేకవంతుల లక్షణం. మన
నియంత్రణలో లేని విషయాలను వదిలేయాలి. మనం చేయ
గలవాటిని చేసుకుపోవాలి
'నడిచేటప్పుడు నడవండి
తినేటప్పుడు తినండి' అనేది జెన్ సామెత
ఏ పని చేస్తుంటే ఆపనిలో నూటికి నూరుశాతం నిమగ్నమయ్యేవారికి అనవసరమైన
ఆలోచనలు రావు
ఆనందం వారిని వదిలిపోదు..!
[7/27, 20:40] null: *@ రోడ్డు మీద జ్ఞానోదయం @36
తేది: 27/07/2025
"""""""""""""""""""""""""""""""""""""""""""""
బడిలో బట్టీకొట్టిన పాఠాలకు,
కాలేజీలో కుస్తీపట్టిన చదువులకు,
వర్సిటీలో పల్లెవేసిన విషయాలకు
మించి
ఓ ట్రాఫిక్ జామ్ మనిషికి
గొప్ప లైఫ్ స్కిల్స్ నేర్పిస్తుంది
అంటే చాలామంది నమ్మరు నమ్మిందే
నిజంకాదని,నమ్మనిదానికీ నిజమయ్యే
అర్హత ఉందని చాలాసార్లు మన
శాస్త్రవేత్తలు నిరూపించారు కాబట్టి,
చెప్పాలనుకున్నది చెప్పేయడమే
తక్షణ కర్తవ్యం..!
ఒడుదొడుకుల జీవితం గజిబిజి రోడ్లకు ప్రతిబింబం అందులో
ఇంటికెప్పుడు చేరతామో తెలియని ప్రయాణం అంతులేని
జీవన గమనాన్ని స్పురింపజేస్తుంది ఆగలేని ఆరాటం,వెళ్లలేక
పోరాటం చిన్నచిన్న సందుల్లో సైతం ముందుకెళ్లిపోవాలనే
ద్విచక్ర వాహనదారుల ఉత్సాహం, దారిలేదని తెలిసీ దూరిపో
యేందుకు ప్రయత్నించే ఆటో అన్నల ప్రయత్నం... వెరసి,అవకాశాలు ఉన్నవి తీసుకోవడం కాదు,
కొత్తవి సృష్టించుకోవాలనే
పెద్దల మాటను కొంచెం గట్టిగానే పాటిస్తున్నట్లు అనిపిస్తుంది
ఉన్నత విద్యాసంస్థల్లో బోలెడంత ఖర్చుపెట్టి నేర్చుకునే
కమ్యూనికేషన్ స్కిల్స్ ను ట్రాఫిక్ లో చాలా సులభంగా ఆపోశన
పట్టేయొచ్చు ఎక్కడి నుంచో హఠాత్తుగా దూసుకొచ్చి, ప్రాణాలు
తీసేంత పనిచేసే మహానుభావులను...
కసితీరా తిట్టడానికి అతివేగంగా దూసుకొచ్చే బూతులను నోరు దాటకుండా ఆపగలిగితే
మీకున్నంత,సౌమ్యత ఇంకెవరికి ఉన్నట్టు? దారి కనపడనంతగా
వాహనాలున్నాయని తెలిసినా...
ఆగకుండా హారన్ వాయించే
వెనక బండి వారిని జాలిగా ఓ చూపు చూసి వదిలేస్తే అంత
కుమించిన స్థితప్రజ్ఞత ఎక్కడైనా ఉంటుందా..?
పదేపదే పలకరించే ఫోన్ కాల్స్,
ఎవరో రావాలి, ఏదోచేయాలి అని ఆశగా చూసే ఎదురుచూపుల మధ్య ఈసారి
ట్రాఫిక్ లో చుట్టూ ఒకసారి తలతిప్పి చూడండి
కార్ల అద్దాలు
తుడుస్తూ అటూ ఇటూ పరిగెత్తే చొక్కా చిరిగిన కుర్రాడు, కదల్లేని స్థితిలోనూ నెమ్మదిగా అడుగులేస్తూ పెన్నులు విక్రయించే
వృద్ధురాలు, ఆనందాన్ని పంచుతూ తన బతుకులో ఆసంతోషాన్ని ఎరుగని బుడగలు అమ్మే ఓ చిన్నారి...
ఎటువంటి పరిస్థితుల్లోనైనా జీవితానికి ఎదురీదాలనే ఓ గొప్ప
మేనేజ్మెంట్ పాఠాన్ని
చెప్పకనే చెబుతున్నట్టు తోస్తుంది..!*
[7/29, 17:34] null: *@ ఫైవ్ స్టార్ ఇచ్చారా..! @ 37
తేది: 29/7/2025
""""""""""""""""""""""""""""""""""""""""""
ఈరోజు కూర బాగుంది దోశ అదిరిపోయింది...
పచ్చడి వాసనకు నోరూరిపోతోంది పలావ్ స్పైసీగా భలే
కుదిరింది...
ఇలాంటి మాటలు మీ ఇంట్లో వినిపిస్తుంటాయా
వినిపిస్తుంటే సరే...
లేదంటే డైనింగ్ టేబుల్ శుభ్రం
చేస్తూనో, వంట గది గడప దగ్గరో ఓ మనిషి ఇలాంటి
చిన్న మాటల కోసం వెయిట్ చేస్తుంటారని గుర్తుపెట్టు
కోండి ప్రేమగా వండి పెట్టి, అంతే ప్రేమగా వడ్డించే
ఇల్లాలు మీ నుంచి కోరుకునేది ఇలాంటి మాటలనే నాకు
ఇలాంటివి అలవాటు లేవు అయినా ఇంట్లో కూడా
రోజూ ఇవన్నీ చెబుతూ కూర్చుంటామా అని అంటారేమో
ఈ మాట అనే ముందు ఓసారి
మీ ఫోన్ లో జోమాటో
స్విగ్గీ యాప్ లు ఓపెన్ చేసి మీరు గతంలో ఆర్డర్ పెట్టిన
ఫుడ్ ఐటెమ్ ను మెచ్చుకుంటూ ఆయా రెస్టారెంట్లకు
ఎలాంటి కామెంట్లు పెట్టారో చూడండి ఫుడ్ ఎలా
ఉంది రివ్యూ ఇవ్వొచ్చుగా అని నోటిఫికేషన్
వచ్చిందనో
ఫుడ్ తెచ్చిన అబ్బాయి అడిగాడనో ఫైవ్ స్టార్
రేటింగ్ ఇచ్చేస్తారే మరి ఇంటి వంటకు ఆ గౌరవం
ఇవ్వడానికి మాటలు రావేం..! బిడ్డ రోజంతా కష్టపడి
చదువుకుని వచ్చాడు మంచి టిఫిన్ ఏదైనా చేసి పెడదామనుకునే తల్లి, భర్త మధ్యాహ్నం ఎలా తిన్నారో ఏమో
రాత్రి పూట అయినా బాగా తినాలని తాపత్రయపడుతూ
అన్నీ వేడివేడిగా వడ్డించే భార్య,
అన్నకి రుచిగా వండి
పెట్టాలని ప్రయత్నించే చెల్లి,
తమ్ముడికి ప్రేమతో నచ్చింది
చేసి పెట్టే అక్క ఎవరైనా కానివ్వండి తమ కష్టానికి
ప్రతిగా కోరుకునేది ఆ చిన్న ప్రశంసే
ఈ రోజు వంట
బాగుందోయ్
ఫుడ్ సూపర్ అమ్మా అనే మాటలే
వారికి ఫైవ్ స్టార్ రేటింగ్ తో సమానం
ఆహారం బాగాలే
కపోతే ముఖం చిట్లించుకోవడం ఎంత బాగా వచ్చో...
బాగున్నప్పుడు బాగుందని చెప్పడమూ అంత
బాగారావాలి
"ఫుడ్ ఈజ్ లవ్" అన్నమాట వినలేదూ
ప్రేమగా ఎవరు వండిపెట్టినా నోరారా ప్రశంసించినప్పుడే
పెట్టినవారికి తిన్నవారికీ మధ్య బంధం బలవడుతుంది
మన తాతలు, నాన్నలు గతంలో చేసింది
మనకు
చేయమని చెబుతున్నది
ఇదే కదా..!
ఫుడ్ బాగాలేకపోయినా బాగుందని చెప్పాలా..?
అని
అనుకోవచ్చు అప్పుడు గుర్తు చేసుకోవాల్ళింది మీరు
రీసెంట్ గా వెళ్లిన రెస్టారెంట్ ని అంతగా బాగాలేని ఫుడ్ ని
కూడా 'అద్భుతం' అంటూ ఉదారంగా పదికి పది
మార్కులూ వేయలేదూ? అటువంటప్పుడు ఆమె కష్టాన్ని
ప్రేమనూ గుర్తించామని చెప్పేందుకు అయినా మన ఇంటి
స్టార్ కి మనం 5 స్టార్ రేటింగ్ ఇవ్వొద్దు
అది ఎలా...
మాటల్లోనా,చేతలతోనా...
ఎలా ఇస్తారన్నది మీ ఇష్టం....
ఫలితం బ్రహ్మాండంగా ఉంటుందని
వేరే చెప్పాలా...!*
[7/31, 16:17] null: *@ థింక్ బిగ్..! @ 38
తేది: 31/07/2025
"""""""""""""""""""""""""""""""
అదో సముద్రతీర గ్రామం ఉదయాన్నే పడవేసుకుని
వేట కెళ్లడం...
పట్టి తెచ్చిన చేపలను అమ్ముకోవడం
ఇదే
అక్కడి వారి దినచర్య...
ఆ గ్రామానికి చెందిన ముగ్గురు
యువకులు స్నేహితులు కలిసే వేటకెళ్లేవారు
ఒక రోజు
మొదటి యువకుడి వలలో పెద్ద మొత్తంలో చేపలు
పడ్డాయి వాటిని బయటికి తీస్తుండగా
బంగారం
రంగులో మెరిసిపోతున్న మూడు చిన్న చేప పిల్లలు కనిపించాయి వాటిని తన స్నేహితులకు చూపించాడు
ఎంతో ముద్దుగా ఉన్న ఆ చేప పిల్లలను తలా ఒకటి తీసుకుని పెంచుకోవాలనుకుని ఇళ్లకు తీసుకెళ్లారు మొదటి
యువకుడు తన బుల్లి చేప పిల్లను గ్లాసులో,
రెండోవాడు
ఒక గుండ్రని గాజు సీసాలో,
మూడోవాడు పెద్ద బిందెలో
వేసి పెంచడం మొదలెట్టారు
వాటికి రోజూ ఆహారం
తెచ్చి వేయడం,అవి తింటున్నాయా, పెరుగుతున్నాయా
అని గమనించడం...
ఇలా కొద్ది రోజులు గడిచిపోయాయి
ఓ రోజు ముగ్గురూ తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకొంటుండగా చేపల ప్రస్తావన వచ్చింది
గాజుసీసాలో
పెంచుతున్న యువకుడు తన చేప సీసాకు సరిపడా పెరిగిందన్నాడు
మరో పెద్ద పాత్రలోకి మార్చాలనుకుంటున్నట్లు
చెప్పాడు మూడోవాడు తన చేప కూడా బిందెకు సరిపడా
పెరిగిందనీ తీసి తొట్టెలో వేస్తే ఇంకా పెరిగేలా ఉంద
న్నాడు దీంతో మొదటి యువకుడు తన చేప పిల్ల గ్లాసు
లోనే చిన్నగా ఉందని నిట్టూర్చాడు చేప పిల్లలు తాము
ఉన్న పాత్ర పరిమాణానికి తగినట్లుగా మాత్రమే పెరుగుతు
న్నట్లు వాళ్ళు గమనించారు మనస్తత్వశాస్త్రంలో చెప్పే
'గోల్డ్ ఫిష్' కథ ఇది
దీన్నే 'ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ' అనీ
అంటారు చేపలు వాటిని ఉంచిన ట్యాంకును బట్టి పెరుగు
తాయి చిన్న ట్యాంకులోని చేప చిన్నగానే ఉండగా అదే
నదిలోని చేప పెద్దగా పెరగడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు దీన్ని ఉద్యోగులకు అన్వయించి చెబుతుంటారు
వ్యక్తిత్వ వికాస నిపుణులు నీటి తొట్టె చేప సైజును నియం
త్రించినట్లు పనిచేసే వాతావరణమూ ఎంచుకునే లక్ష్యం
ఉద్యోగి ఎదుగుదలని ప్రభావితం చేస్తాయంటారు
'లక్ష్యం చిన్నదైతే,విజయమూ చిన్నదే అదే లక్ష్యం పెద్దదైతే, సాధించే విజయమూ పెద్దగానే ఉంటుంది అనేదే ఈ
'గోల్డ్ ఫిష్' కథ అంతరార్థం వ్యక్తిగా, ఉద్యోగిగా ఎంత
ఎత్తుకు ఎదగాలి..?
ఏం సాధించాలి...?
భవిష్యత్తును ఎలా
తీర్చిదిద్దుకోవాలి...
అనే విషయాలను నిర్ణయించేది...
అతడి
ఆలోచనలే వాటికి పరిమితులు విధించుకోకూడదు ఎంత
విశాలంగా ఆలోచిస్తే అంత గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకో
వచ్చు వాటిని సాకారం చేసుకోవటానికి అంత కృషీ చేయవచ్చు
'అందుకే 'థింక్ బిగ్' అని పెద్దలు చెప్పేది..!*
[8/2, 16:15] null: *@ సృజనే నిచ్చెన @ 39
తేది:2/08/2025
""""""""""""""""""""""""""""""""""
అందరూ చూసేదాన్నే నువ్వూ చూస్తున్నా దాని గురించి
ఎవరూ ఊహించని విధంగా ఆలోచించడమే సృజనాత్మకత అంటారు విఖ్యాత శాస్త్రవేత్త
ఐన్ స్టీన్ అందుకే
అలాంటి సృజనాత్మక రచననో, పనినో,సినిమానో చూస్తే
'భలే ఉందే' అని అబ్బురపడతాం మనకీ ఆలోచన
రాలేదే అనీ అనుకుంటాం
ఈ సృజనని ప్రకటనల్లో చాలా ఎక్కువగా చూస్తాం
దశాబ్దాల కిందట
'ఓనర్స్ ప్రైడ్,నైబర్స్ ఎన్వీ' అని వచ్చిన
ఒనీడా టీవీ ప్రకటన ఎంతగానో ఆకట్టుకుంది
ఈ టీవీ
మీకు గర్వకారణమే కాదు పక్క వాళ్ళు అసూయచెందేలా
ఉంటుందన్న ఆ ప్రకటన సారం సగటు మనిషి ఇగోను
తృప్తిపరుస్తుంది ఈ మధ్య
వచ్చిన స్విగ్గీ ఇన్ మార్ట్
ప్రకటనలో ఓ యువతి
బ్రూమ్ (చీపురు) అని ఆర్డర్
పెట్టబోయి పొరపాటున
గ్రూమ్ (వరుడు) అని టైప్
చేస్తుంది వెంటనే డెలివరీ
బాయ్స్ ఓ మండపంలో
ఉన్న పెళ్లికుమారుణ్ని ఎత్తు
కొస్తారు ఇంతలో ఆమె
బ్రూమ్ అని ఆర్డర్ని సరిచేయడంతో
వెంటనే వరుణ్ని
దింపేసి, చీపురు పట్టుకెళ్లి ఇచ్చేస్తారు ఏ వస్తువు ఆర్డర్
చేసినా క్షణాల్లో తెచ్చిస్తామన్న సందేశాన్ని సృజనాత్మకంగా
చూపించిన ఆ ప్రకటన వినియోగదారులను ఆకర్షిస్తోంది
చేసే పని ఏదైనా భిన్నంగా ప్రయత్నించడమే సృజనాత్మకత
మూసలో పోసినట్లుగా పని చేసుకుంటూ పోతే ఏ
వృత్తిలోనూ ఎదుగూబొదుగూ ఉండదు
క్రియేటివిటీ అంటే
పరిశోధించడం, ప్రయోగించడం, రిస్కు తీసుకోవడం, అవసరమైతే తప్పులు చేయడం కూడా అన్నారు మేరీ లౌ కుక్.
కొత్తగా ఏం చేస్తే, ఎలా చేస్తే బాగుంటుందని శోధించడం,
దాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూడటం, అవసరమైతే ఈ
క్రమంలో తప్పులు చేయడం అంతిమంగా ఆప్రయత్నం
విజయవంతమైతే చాలు వృత్తి వ్యాపారాల్లో ఎదగడానికి
బోల్డన్ని అవకాశాలు.
2005లో బస్సు టికెట్లు దొరక్క పండగకు బెంగళూరు
నుంచి హైదరాబాద్ రాలేకయాడు ఫణీంద్ర సామా అనే
యువకుడు టికెట్లు దొరక్కపోవడం అనే సమస్యకు
పరిష్కారం కనిపెట్టాలని అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు
అప్పటి వరకు బుకింగ్ ఏజెంట్లు ఫోన్లపై నడిపించే
ఈ వ్యవహారానికి ఓ వెబ్ సైట్ పెట్టి,దాన్ని బస్సు ఆపరేటర్లకు, ప్రయాణికులకు మధ్య వారధిగా మలిచాడు అదే
దాదాపు ఏడువేల కోట్ల నెట్ వర్త్ కల రెడ్ బస్
టికెట్ దొరకలేదని అందరిలా
ఫణీంద్ర కూడా కాసేపు బాధపడి ఊరుకుంటే ఈరోజు రెడ్ బస్ అనేది ఉండేదా అసలు..!
మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలని ముత్యాలముగ్గు
సినిమాలో రావుగోపాలరావు చెప్పినట్లు
ఆ మాత్రం
సృజన, కొత్తదనం లేకపోతే మీ పని
మీకే కాదు మీకంపెనీకీ బోర్ కొట్టే ప్రమాదం ఉంది అందుకే కొత్తగా
ప్రయత్నించడం మానొద్దు సుమా..!*
[8/4, 22:07] null: *@ బందీలం కావద్దు..! @40
తేది: 04/08/2025
""""""""""""""""""""""""""""""""""""""
'మనసా తుళ్లిపడకే...అతిగా ఆశ పడకే'
అన్నారో సినిమా
కవి నిజంగానే మనిషి మనసుకు ఆశకన్నా అత్యాశ
ఎక్కువ క్షణం కుదురుగా ఉండదు రకరకాల ఆలోచనలు
చేస్తూ ఉంటుంది ఒక చిన్న సానుకూలాంశం కనపడగానే
ఊహల్లో మేడలు కట్టేస్తుంది పరిస్థితి కాస్త అటూ ఇటూ
అయిందంటే అమాంతం అధఃపాతాళంలోకి తొక్కేస్తుంది
మనసు కోతిలాంటిదని ఊరికే అనలేదు అది ఎప్పుడెలా
ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు ఎంతో కాలంగా
ఇష్టపడుతున్న మనిషికి ఎలాగైనా మనసులోని మాట
చెప్పేయాలని నిర్ణయించుకునేలా ప్రోత్సహిస్తుంది కాసేపు, తీరా
అక్కడికి వెళ్లేసరికి
'నీ వల్ల కాదులే'' అని వెనక్కి లాగేసేదీ
అదే నవ్విస్తుంది, కవ్విస్తుంది ఏడిపిస్తుంది ఎప్పుడూ ఏవిషయంలోనూ స్థిరంగా ఉండదు,మనల్ని ఉండనివ్వదు
మన భావోద్వేగాలన్నీ మనసు తాలూకు చేష్టలే మనుషులు
ఎప్పుడూ అయితే గతం గురించి, లేకపోతే భవిష్యత్తు గురించి
ఆలోచిస్తుంటారు వర్తమానం గురించి అసలు పట్టించుకోరు
అంటాడు డేల్ కార్నెగి నిజమేగా మరి...
ఈ కోర్సులో
చేరకుండా ఉండాల్సింది, కాస్త కష్టమైనా ఆ ఉద్యోగం కోసం
ప్రయత్నించి ఉండాల్సింది, ఫలానా సంబంధం
చేసుకోవాల్సింది...
చేతులు కాలాక ఇలా ఆలోచనల్లో ఆకులు
పట్టుకుంటూ ఉంటారు చాలామంది ఇక కలల రాణులూ
రాకుమారుల సంగతి చెప్పనే అక్కర్లేదు వీళ్లెప్పుడూ రేపటి
రోజున కట్టే కోటల గురించి మాటలు చెబుతారు తప్ప ఇవాళ
చేస్తున్న పనిలో మాత్రం మనసు పెట్టరు
సగటున రోజుకు ఏడు వేల నుంచి డెబ్భైవేల ఆలోచనలు
చేయగల సత్తా ఉందట మనిషి మనసుకు అందుకేనేమో
సృష్టిలో అన్నిటికన్నా వేగవంతమైంది మనసేనన్నారు
యక్షప్రశ్నల్లో జీవితం అన్నాక మంచీచెడూ,కష్టం సుఖం,
ఆనందం విచారం
అన్నీ ఉంటాయి... కాబట్టి వచ్చే
ఆ వేలాది ఆలోచనల్లో సానుకూలమైనవీ ఉంటాయి,
వ్యతిరేకమైనవి ఉంటాయి కూరగాయల్లో చచ్చుపుచ్చులన్నీ
ఏరి అవతలపడేసినట్లు పనికిరాని పిచ్చి ఆలోచనలను
అవతలికి తరిమేయాలి దేన్నయినా తట్టుకోవాల్సింది ఒకటే
మనసు దాన్ని చీటికీ మాటికీ చిన్నబుచ్చుకోనీయకుండా
దృఢంగా ఉండేలా మలచుకోవాల్సింది మనమే మనోనిబ్బరం
ఉన్నవాళ్ళు కొండలనైనా పిండి చేయగలరని గుర్తుంచుకోవాలి
ఓడిపోతే మరచిపోదు, గాయమైతే మాసిపోదు అని
పాడుకోడానికి బాగుంటుంది కానీ జాలిపడి దాన్ని అలాగే
ఉండనిస్తే జీవితాన్ని నరకప్రాయం చేసి వదిలిపెడుతుంది
అందుకని మనసు గతి ఇంతేననుకోకుండా దాన్ని మన
అదుపులో పెట్టే ప్రయత్నం బలంగా చేయాలి
చేస్తున్న
పనిలో లగ్నం చేయాలి నూటికి నూరుపాళ్లు మనసు పెట్టి
వర్తమానానికి న్యాయం చేయగలిగితే గతం మన జోలికి
రాదు, భవిష్యత్తు భయపెట్టదు కంటికి కనిపించని, చెవులకు
వినిపించని మనసు చేసే గందరగోళానికి మనం
బందీలం కాకూడదు...!*
[8/6, 23:15] null: *@ మెదడుకు పాలిష్..!@ 41
తేది:6/08/2025
"""""""""""""''"""""""""""""""""""""""""
అబ్బే గతేడాది పెద్దగా కలిసి రాలేదు
కొత్త సంవత్సర
మైనా కలిసొస్తుందేమో చూద్దాం
మన చుట్టూ ఉన్న చాలా
మంది నోట ఏటా వినిపించే మాట ఇది
ఆ తర్వాత అదే
పని.. అదే నిరాసక్తత...అంతా రొటీన్, మారేవి క్యాలెండర్
పేజీలు మాత్రమే అలా సంవత్సరాలకు సంవత్సరాలే
గడిచిపోతుంటాయి మరి మార్పెలా? అని ప్రశ్నించుకునే
వారికోసమే ఈ కథ,
ఆయనో బిజినెస్ మాగ్నెట్ ఒక విమానం దిగితే మరో
విమానం ఎక్కుతాడు ఒక సమావేశం తర్వాత మరో సమా
వేశం... బిజీ బిజీగా తిరుగుతుంటాడు
ఓ రోజు
సాయంత్రం ఇలాగే ఆఫీసు నుంచి బయలుదేరి వెళ్తుండగా
బూట్లు పాలిష్ చేసే వ్యక్తి దగ్గరకొచ్చాడు
'సార్... మీ
బూట్లు దుమ్ము కొట్టుకుపోయాయి పాలిష్ చెయ్యనా
అన్నాడు 'వద్దు నాకంత సమయం లేదు' అని ఆ వ్యాపార
వేత్త బదులిచ్చాడు ఆ పెద్ద భవనం దాటే లోపల పాలిష్
చేసేవాళ్ళు మరికొందరు తారసపడ్డారు అందరికీ అదే
సమాధానం చెప్పి చివరి బ్లాక్ దగ్గరికి వెళ్లేసరికి ఓ చెప్పుల
స్టాండ్ కనిపించింది అక్కడో వ్యక్తి '97, 98, 99... ' అంటూ
లెక్క పెడుతున్నాడు అతడు వ్యాపారవేత్తను చూడగానే ఇలా
అన్నాడు సార్... మీరు బిజీగా ఉన్నట్లున్నారు మీకు అడ్డు
పడుతున్నందుకు క్షమించండి ఈరోజు నా పుట్టినరోజు
ఇవాళ నా దగ్గరకు వచ్చే వందో వ్యక్తికి ఉచితంగా బూట్
పాలిష్ చెయ్యాలని అనుకున్నాను ఆ వ్యక్తి మీరే నా
మాట నిలబెట్టుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్' అన్నాడు
వ్యాపారి కాదనలేకపోయాడు ఆ వ్యక్తి బూట్లు శ్రద్ధగా
పాలిష్ చేశాడు ఎంతగా అంటే... అవి సరికొత్తగా కనిపించేంతగా పాలిష్ పూర్తికాగానే వెళ్లిపోబోతూ 'నువ్వు సాధార
ణంగా ఎంత తీసుకుంటావు..? అని అడిగాడు వ్యాపారవేత్త
'ఇరవై రూపాయలు' అన్నాడతడు వంద రూపాయల నోటు
అతడి చేతిలో పెట్టి, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోయాడు బిజినెస్ మ్యాన్, ఆయన కనుమరుగయ్యేదాకా చూసి
ఆ బూట్ పాలిష్ వ్యక్తి వందనోటు భద్రంగా జేబులో
దాచుకుని '97, 98, 99...' అని మళ్లీ అరవ సాగాడు
ఈ కథ..
"మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్క
నిమిషం చాలు"
అనే పుస్తకంలోనిది మనం ఏ పని చేస్తు
న్నామన్నది కాదు... దాన్నెంత సృజనాత్మకంగా చేస్తున్నామన్నదే ముఖ్యమని ఇది చెబుతోంది అందరికీ నచ్చిన పనో,
ఉద్యోగమో దొరక్కపోవచ్చు నైపుణ్యాలు తప్ప డిగ్రీ లేక
పోవచ్చు డిగ్రీ ఉంటే నైపుణ్యం లేకపోవచ్చు
అంతమాత్రాన నిరుత్సాహపడకూడదు చేతిలో ఉన్న విద్యకు తెలివి
తేటలు జోడించాలి స్మార్ట్ స్కిల్స్ సానపెట్టుకోవాలి
ప్రతికూలతలు ఎదురైతే సానుకూల వైఖరితో
మైండ్ ను
పాలిష్ చేసేయాలి అలా చేస్తేనే జీవితం నిత్యం
కొత్తగా మెరిసిపోతుంటుంది...*
[8/13, 21:42] null: *@ ఆ పని మీదే..!@ 42
తేది: 13/08/2025
""""""""""'"'''''""""""""""""""""""""""
మేడమ్...
మా పాప ఎంత చెప్పినా వినట్లేదు రాత్రి
పదిన్నర వరకూ టీవీ చూస్తూనే ఉంటోంది కొంచెం భయ
పెట్టండి అంటూ ఎల్ కేజీ చదువుతున్న చిన్నారిని స్కూల్లో
దింపడానికి వచ్చిన నాన్న టీచరుకు ఫిర్యాదు చేశాడు
మేడం...
మా అబ్బాయి హోంవర్క్ సరిగా చేయట్లేదు
ఎంతసేపూ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడటం మీదనే ధ్యాస
ఉంటోంది కొంచెం గట్టిగా చెప్పండి అవసరమైతే రెండు
తగిలించండి...
ఇది మూడో తరగతి చదువుతున్న హరి
మీద టీచరుకు వాళ్ల అమ్మ ఇచ్చిన ఫిర్యాదు
ఈ
ఫిర్యాదులు కల్పితాలు కావు ప్రతి బడిలో సర్వసాధారణంగా
వినిపించేవే అయితే ఏంటి? 'తమ పిల్లల బాగు కోసం
తల్లిదండ్రులు టీచర్లను అభ్యర్థిస్తున్నారు అందులో తప్పే
ముంది?' అనుకుంటే పొరపాటే
పిల్లల గురించి మనం చేసే ఆ ఫిర్యాదు ద్వారా... మన
వ్యక్తిత్వం, జీవనశైలి, పిల్లల ఎదుగుదల పట్ల మనం ఎంత
బాధ్యతతో లేదా బాధ్యతారాహిత్యంతో మెలగుతున్నాం...
ఇలా అనేక విషయాలు టీచర్లకు అర్థమవుతాయి ఉదాహరణకి
మా పాప అదేపనిగా టీవీ చూస్తోంది అని ఫిర్యాదు
చేసినప్పుడు దీనికి నేనేం చెయ్యగలను..? ఇంట్లో ఎనిమిదిన్నరకే
టీవీ కట్టేసి లైట్లు ఆర్పేసి అందరూ పడకగదిలోకి
చేరితే సరిపోతుంది కదా? ఇంతోటి దానికి నేను భయపెట్ట
డమేంటి..?అని టీచరు మనసులో అనుకుంటారు అలానే,
ఫోను చూస్తూ హోంవర్క్ మీద శ్రద్ధ పెట్టడం లేదు అని
చెప్పినప్పుడు, ఆ ఫోను పిల్లాడి చేతికిచ్చి అలవాటుచేసింది
మీరే కదా...? మీరు ఫోను అందుబాటులో ఉంచుతున్నప్పుడు
నేను మందలించినా ఏం ఉపయోగం..? అని టీచరు అను
కుంటారు అయితే, ఇవన్నీ వారు అమ్మానాన్నలకు చెప్పరు
వాళ్లు వెళ్లిపోయాక తోటి టీచర్లకు చెప్పుకొని నవ్వుకుంటారు
అమ్మానాన్నలను ఏమీ అనలేక ఇంట్లో పెద్దలు మారరు
కానీ, మనం భయపెట్టాలంట అంటూ విసుక్కుంటారు ఆ
చిరాకు వెంటనే ఆయా పిల్లల మీదికి మళ్లుతుంది తల్లి
దండ్రులకే వీళ్ల మీద శ్రద్ధలేనప్పుడు నేను మాత్రం వీళ్లకోసం
ఎందుకు తాపత్రయపడాలి అని ఆ పిల్లలను నిర్లక్ష్యం
చేస్తారు ఫలితంగా నష్టపోయేది పిల్లలే
పిల్లల పెంపకం అన్నది ఇద్దరి బాధ్యత ఒక చెయ్యి
అమ్మానాన్నా అయితే మరో చెయ్యి ఉపాధ్యాయులు రెండు
చేతులు కలిస్తేనే పిల్లలు రత్నాల్లో వెలుగుతారు ఇంటి
దగ్గర పిల్లల అలవాట్లను సరిచేసుకోవాల్సిన బాధ్యత అమ్మా
నాన్నలదే టీవీ చూస్తున్నారు ఫోన్లో ఆడుతున్నారు
అంటే... అవి లేకుండా సమయాన్ని ఎలా గడపాలో పిల్లలకి
మనం తెలియజేయట్లేదనే అర్థం మరేం చెయ్యాలి? పిల్ల
లతో కలిసి ఆటలు ఆడాలి, వాళ్లకి కథలు చదివి వినిపించాలి ఫోన్లు, టీవీల పాత్రని అమ్మానాన్నలు తమ ప్రేమతో
భర్తీ చెయ్యాలి అంతేకానీ,
ఆ బాధ్యతని కూడా టీచరు
చేతిలో పెడితే...
@అది గౌరవం అనిపించుకోదు@
[8/15, 15:54] null: *@ ప్రయత్నించండి..@43
తేది:15/08/2025
""""""""""""""""""""""""""""""""""""
పిల్లలకు నీతి కథలు చెప్పడం,వాటి ద్వారా వారికి జీవన
రీతిని బోధించడం మన నాగరికతలో భాగం
మొక్కై
వంగనిది మానై వంగునా అని సామెత అందుకే చిన్నప్పుడే
పిల్లలకు అవసరమైన జీవిత పాఠాలను కథల రూపంలో
చెబితే అవి వారి చిట్టి మనసుల్లో నాటుకుపోతాయి పెద్ద
య్యాక చక్కటి వ్యక్తిత్వంతో మంచి మనుషులుగా రాణిస్తారు
అంతేకాదు, కథలు వారి జ్ఞాపక శక్తికి, సృజన శక్తికి పదును
పెడతాయి ఆలోచన రేకెత్తిస్తాయి వారి పదసంపదను
పెంచి సంభాషణా చాతుర్యం అలవడేలా చేస్తాయి జీవన
నైపుణ్యాలను నేర్పుతాయి
కానీ పాఠ్యపుస్తకాలకు ఇచ్చిన ప్రాధాన్యం మనం కథల
పుస్తకాలకు ఇవ్వడం లేదు స్కూలు నుంచి విశ్వవిద్యాలయం
వరకూ అడుగడుగునా పిల్లల ప్రతిభకు పరీక్షలే కొలమానాలుగా
చలామణీ అవుతున్న రోజులివి పరీక్ష తప్పితేనే కాదు,
అనుకున్న దానికన్నా నాలుగు మార్కులు తక్కువొచ్చినా పిల్లలూ
తల్లిదండ్రులూ కూడా తలకిందులైపోతున్నారు అది సరైన
పద్ధతి కాదని అందరికీ తెలుసు అయినా ఆ పరిస్థితి ఎదురైన
ప్పుడు మాత్రం అన్నీ మరిచిపోతున్నారు అసలే పరీక్షల కాలం
ఫలితాల గురించి ఆలోచించకుండా ప్రయత్నలోపం లేకుండా
చదివి పరీక్ష రాయడమే మీ కర్తవ్యమని పిల్లలకు గుర్తు
చేయాల్సిన సమయం ఒకవేళ ఫలితం అనుకున్నట్లు రాకపోతే
మరోసారి ప్రయత్నించాలి ఆ స్ఫూర్తినిచ్చే ఒక చిన్న కథ...
అడవి పక్కన చెరువులో రెండు కప్పలు చాలా స్నేహంగా
ఉండేవి ఒకరోజు అవి ఊరు చూద్దామని బయల్దేరాయి కొంత
దూరం వెళ్లాక ఒక గుడిసె కన్పించింది లోపల ఏముందో
చూడాలని ఉత్సుకతతో అవి రెండూ కిటికీలోకి ఎక్కాయి
లోపలంతా చీకటిగా ఉండి ఏమీ కన్పించలేద...!దాంతో ఇంకాస్త
ముందుకు జరిగి చూడబోతూ దబ్బుమని ఒక కుండలో
పడ్డాయి ఆ కుండ నిండా మీగడ పెరుగు ఉంది నీళ్లలో
ఈదినట్టు ఈదలేకపోతున్నాయి అయినా కుండలో నుంచి
బయటపడాలని రెండూ ఎగురుతున్నాయి మొదటి కప్ప
కాసేపటికే నీరసించిపోయింది జీవితం మీద ఆశ వదులు
కుంది కాసేపటికే ప్రాణం వదిలింది కానీ రెండో కప్ప అలా
కాదు పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది ఒంట్లో శక్తి
ఉన్నంతసేపు ఎగురుతూనే ఉంది ఆ ఎగిరే క్రమంలో దాని
కాళ్లు తగిలీ తగిలీ పెరుగు చిలికినట్లయింది మెల్లగా చిక్కటి
పెరుగు కాస్తా మజ్జిగలా మారి కప్పకి ఈత తేలికైంది ఆ
పెరుగునుంచి తయారైన వెన్నంతా ముద్దలా పేరుకుని మజ్జిగ
మీద తేలుతోంది కప్ప ఆ వెన్నముద్ద పైకి ఎక్కి అక్కడి
నుంచి కిటికీలోకి ఒక్క గెంతు గెంతింది కిటీకీలోనుంచి
బయట పడి బతుకుజీవుడా అంటూ చెరువు దారి పట్టింది
మళ్లీ మళ్లీ ప్రయత్నించడమే వివేకవంతుల లక్షణం అలా
ప్రయత్నిస్తే ఎలాంటి పరిస్థితులనైనా మనకి అనువుగా మలచు కోవచ్చని చెప్పడానికి
@బాగుంది కదూ ఈ కథ@*
[8/17, 20:35] null: *@ ఓపిక ఉండాలి బాస్ @ 44
తేది:17/08/2025
"""""""""""""""""""""""""""""""""""""""""
మనకు తొందరగా పండ్లు కావాలని చెట్టు మునిగిపోయేలా
నీరుపోస్తే అది కాయలు కాయదు ఎదగాల్సినంత ఎదిగాక,
సీజన్ వచ్చినప్పుడే కాస్తుంది మనుషులైనా అంతే...
సమయం రావాలి వచ్చేవరకూ ఓపిగ్గా ఎదురు చూడాలి
అందుకు చక్కటి ఉదాహరణ...
టెంబా బవుమా
దక్షిణాఫ్రికాలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన బవుమా
తక్కువ ఎత్తువల్ల తరుచూ హేళనకు గురయ్యేవాడు
క్రికెట్ కి పనికిరాడనేవారు అవేమీ లెక్కచేయని బవుమా
జాతీయ జట్టులోకి చేరాలన్న సంకల్పంతో పట్టువదలని
విక్రమార్కుడిలా సాధన చేశాడు ఆడిన తొలి వన్డే మ్యాచ్
లోనే సెంచరీ సాధించాడు కొన్నాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ లో
దక్షిణాఫ్రికా జట్టుకు మూడు ఫార్మాట్లలో సారథిగా ఎంపిక
య్యాడు జాతీయ జట్టుకు కెప్టెన్ అయిన తొలి నల్లజాతి
క్రికెటర్ గా పేరొందాడు అయినప్పటికీ కోటాలో జట్టులోకి
వచ్చాడని, ఆటగాడిగా అర్హుడు కానివాణ్ని కెప్టెన్ గా ఎలా
కొనసాగిస్తారనే విమర్శలు వచ్చాయి అవేవీ లెక్క చేయకుండా
ఆటపైనే దృష్టి సారించాడు బవుమా ఫామ్ లోకి వచ్చి
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రాణించి జట్టును
గెలిపించాడు ఫైనల్లో అతడు జట్టును నడిపించిన తీరు
అద్భుతం రెండో ఇన్నింగ్స్ లో భారీ టార్గెట్ ముందున్నా,
తొడ కండరాలు పట్టేసినా నొప్పిని భరిస్తూ బ్యాటింగ్
చేశాడు తన నాయకత్వ పటిమతో బలమైన ఆస్ట్రేలియా
జట్టును నిలువరించి దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చాడు
27 ఏళ్ల తర్వాత స్వదేశానికి ఐసీసీ ట్రోఫీని అందించాడు
ఏడాది క్రితంవరకు బవుమాను ట్రోల్ చేసినవాళ్లు... ఇప్పుడు
ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇంతకన్నా ఏం కావాలి?
ఏ రంగంలోనైనా లక్ష్యసాధన అనుకున్నంత తేలిక కాదు
బాధలను భరించాలి, త్యాగాలు చేయాలి విమర్శలకు తలొగ్గ
కుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి
అన్నింటికీ మించి ఓపిక, సాధించగలమన్న నమ్మకం ఉండాలి
ఏదైనా అనుకుంటే అది వెంటనే జరగాలని ఆశపడతాం ఆ పని
జరగకపోతే ఇది నాకు చేతకాదేమో అని అంతలోనే నీరుగారి
పోతాం కొంతమంది అయితే అందుకు కారణాలను ఇతరులపై
నెట్టడమూ కద్దు ఇవేవీ సరికాదు
@విజయానికి ఎప్పుడూ షార్ట్ కట్స్ ఉండవు@
అన్నప్రాసన నాడే ఆవకాయ తినలేనట్లే పని
మొదలెట్టగానే ప్రథమ స్థానాన్ని అందుకోలేం క్రమం
తప్పకుండా సాధన చేయాలి సామర్థ్యాలను, నైపుణ్యాలను
పెంచుకోవాలి ఆ క్రమంలో ఎదురయ్యే కష్టాలను భరించాలి
అవాంతరాలను అధిగమించాలి అప్పుడే విజయం వెతుక్కుంటూ
వస్తుంది ఒక విజయం మరో విజయానికి పునాది వేసి కెరీర్ లో
ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది ఎంత ప్రయత్నించినా ఫలితం
దక్కట్లేదని వాపోతుంటారు కొందరు అలాంటివారు
ప్రయత్నంలో లోపం ఎక్కడుందో పరిశీలించుకోవాలి సరిదిద్దుకోవాలి
మనవల్ల కాదు, రాదు అనుకుంటే ఏదీ రాదు
ప్రయాణం కొనసాగించే వారే
@గమ్యాన్ని చేరుకోగలరు@*
[8/18, 20:55] null: *@ అనుక్షణ పోరాటం @45
తేది: 18/08/2025
"""""""""""""""""""""""""""""""""""""""
పోరాడి ఓడిపోతే పరాజయం పోరాడకుండానే ఓడిపోతే..?
పోరాటానికి పనికిరారని పక్కన పెడితే...
ప్రతిభ చూడకుండా
అర్హతను నిర్ణయిస్తే...
అది పరాభవం మొదటి దాంట్లో తన
శక్తిసామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం ఉంటుంది శక్తి
చాలనప్పుడు, ఎదుటివారి సామర్థ్యం అధికంగా ఉన్నప్పుడు
ఓటమి తప్పకపోవచ్చు దాన్ని మన మనసు కూడా అంగీకరి
స్తుంది ఎదుటి మనిషిని మెచ్చుకునేలా చేస్తుంది కానీ,
గెలుపు ఓటముల పోరాటం ఒక్క యుద్ధభూమిలోనే జరగదు
జీవితమే పెద్ద రణరంగం అనుక్షణం పోరాటం చేయాల్సిందే
పరాభవం పరీక్ష పెట్టకుండానే ఏకపక్షంగా ఫలితాన్ని నిర్ణ
యిస్తుంది శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం
ఇవ్వదు వివక్షకు గురిచేస్తుంది గెలవాలనే కోరిక గుండె
నిండా ఉన్నా, పోరాడే చేవ శరీరానికి ఉన్నా... నిరూపించు
కోలేని స్థితి ఇక్కడ ఆయుధాల కన్నా పదునైన మాటలు
ఉంటాయి మనసును ముక్కలు చేస్తాయి మనిషిని కోలుకో
లేకుండా బాధిస్తాయి
కర్ణుడికి రెండుసార్లు పరాభవం జరిగింది పరిస్థితుల
కారణంగా అధర్మమార్గంలోకి వెళ్లాడు ధర్మం చేతిలో ఓడి
పోయాడు కర్ణుడి పరాక్రమం తెలిసీ అర్ధరథుడిగా నిర్ణయి
స్తాడు భీష్ముడు ప్రయోజనాలు ఏవైనా ప్రతిభావంతులకు
పరాభవం తీరని వేదన కలిగిస్తుంది
సొంతవారి మాటలూ పరాభవానికి గురిచేస్తాయి పరీక్ష
తప్పిన పిల్లవాణ్ని అమ్మానాన్నలే తిడతారు కారణాలు
తెలుసుకునే ప్రయత్నం చేయరు ఇతరులతో పోల్చి అవమా
నిస్తారు ఆత్మన్యూనతకు గురిచేస్తారు ఈ న్యూనతాభావం
జీవితంలో అన్నింటా అవరోధంగా మారుతుంది
సందర్భం ఏదైనా పరాభవం జరిగినప్పుడు కుంగిపోకూ
డదు వివేకంతో ఆలోచించాలి పరిస్థితుల్ని విశ్లేషించుకోవాలి శక్తిసామర్థ్యాల్ని
పునః పరిశీలించుకోవాలి
సమయం చూసి తమను తాము నిరూపించుకోవాలి పరాభవానికి అదే సరైన సమాధానం అవుతుంది
ఒక్కోసారి పరాభవాలు మనం మరింత మెరుగుపడటానికి
ఉపకరిస్తాయి గెలీలియో ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త
సూర్యుడి చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని
ఆయన ప్రతిపాదిస్తే ఎవరూ నమ్మలేదు పైగా గేలిచేశారు
అయినా వెనకంజ వేయని గెలీలియో తన సిద్ధాంతాన్ని స్థిర
పరిచే మరిన్ని పరిశోధనలు చేసి ఖగోళ శాస్త్ర
పితామహుడిగా మన్ననలు పొందారు
పరాభవం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యకు కారణం
కారాదు ఎందుకంటే అది జీవితానికి ముగింపు కాదు,
జీవితంలో ఒక అనుభవం మాత్రమే లోపాలు దిద్దుకునే
అవకాశం
@సమర్థుడిగా గెలిచి నిలిచే ఛాన్స్..!@*
[8/20, 21:29] null: @కంటిరెప్పతో కథ చెప్పారు@46
తేది:20/08/2025
""''''''""""""""""""""""""""""""""""""""""""""""
మనిషి అనుకుంటే కానిదేముంది అంటారు కదా కానీ
అనుకున్నంత మాత్రాన అయిపోవు అన్నీ అందుకు ఎంతో
పట్టుదల, కృషి అవసరం, కార్యసాధనలో ఎదురయ్యే
సమస్యల్ని నేర్పుగా అధిగమిస్తూ దృఢసంకల్పంతో ముందు
కెళ్లిన వాళ్లే విజయం సాధిస్తారు కాలాతీత వ్యక్తులుగా
చరిత్రలో నిలుస్తారు అలాంటి ఓ విజేత కథ ఇది...
ఆయన పేరు జీన్ డామినిక్ బాబీ ఓ ప్రఖ్యాత ఫ్రెంచ్
మ్యాగజైన్ ఎడిటర్ భార్య, ఇద్దరు పిల్లలతో జీవితం
హాయిగా సాగిపోతోంది నలభై మూడేళ్ల బాబీ ఓ రోజు
కారులో కొడుకుని తీసుకుని బయటికి వెళ్తుండగా స్ట్రోక్
వచ్చింది ఇరవై రోజుల తరువాత స్పృహ వచ్చేసరికి ఆయన
ఆస్పత్రి మంచం మీద ఉన్నాడు పైనుంచి కిందివరకు
ఒంట్లో ఏ భాగమూ స్వాధీనంలో లేదు ఒకే ఒక్క ఎడమ
కన్ను మాత్రం తెరవడం మూయడం చేయగలుగుతున్నాడు
ఆయన పరిస్థితిని 'లాక్డ్ ఇన్ సిండ్రోమ్'గా పేర్కొన్నారు
వైద్యులు స్ట్రోక్ రావడానికి ముందే బాబీ ఒక పుస్తకం
రాయడానికి ప్రచురణకర్తలతో ఒప్పందం చేసుకున్నాడు
మెదడు బాగానే పనిచేస్తోంది కాబట్టి ఎలాగైనా ఆ పుస్తకం
రాయాలనుకున్నాడు బాబీ ఆ ఒక్క కంటిని మూయడం
తెరవడం ద్వారా ఆయన చెప్పదలచుకున్నది చెప్పేలా స్పీచ్
థెరపిస్ట్ సాయం చేసింది ఆ డిక్టేషన్ తీసుకుని రాయడానికి
ప్రచురణకర్తలు ఒక అసిస్టెంట్ని ఏర్పాటు చేశారు
"ఎ "నుంచి
"జడ్"వరకు ఒక్కో అక్షరాన్ని ఆమె పలుకుతుంటే అనుకున్న
అక్షరం రాగానే బాబీ కన్ను ఆర్పేవాడు అలా రోజూ మూడు
గంటల చొప్పున రెండు నెలల పాటు కష్టపడి రాసిన 137
పేజీల పుస్తకమే 'ద డైవింగ్ బెల్ అండ్ ద బటర్ ఫ్లై
ఆయనకి స్ట్రోక్ వచ్చిన తరువాత 14 నెలలకు పబ్లిష్
అయింది విపరీతంగా అమ్ముడైంది
అటువంటి పరిస్థితిలోనూ బాబీ చమత్కారంతో కూడిన
తన శైలిని మరవకపోగా తనమీద తనే జోకులు వేసుకునే
వాడు పిల్లల్ని దగ్గరకు తీసుకోలేని తన అశక్తత పట్ల
విచారం వ్యక్తంచేసేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ
'లాక్డ్ ఇన్ సిండ్రోమ్ ' ది తన మీద పైచేయి కాకూడదనుకున్న బాబీ
పుస్తకం రాయడమే కాదు, ఆ కొద్ది సమయంలోనే చాలా
పనులు చేశాడు తనలాంటి స్థితిలో ఉన్నవారి కోసం ఒక
అసోసియేషన్ పెట్టాడు ఒక టీవీ షోలో పాల్గొన్నాడు
మరో పుస్తకం రాయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు
దురదృష్టవశాత్తూ న్యూమోనియా రావడంతో పుస్తకం
విడుదలైన రెండురోజులకే చనిపోయాడు
మనలో చాలామందికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే
తపన ఉంటుంది తీవ్రంగా కృషి చేస్తారు కూడా ఏవైనా
సమస్యలు, ఆటంకాలు ఎదురైతే మాత్రం అధికశాతం నిరాశలో
కూరుకుపోతారు తమకు అదృష్టం లేదనుకుని అక్కడితో
ఆగిపోతారు సంకల్పబలం ఉంటే అదృష్టంతో పని ఉండదన
డానికి బాబీ జీవితం కన్నా
@గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది..?@*
[8/22, 22:23] null: *@తిరస్కరణా మంచిదే..!@47
తేది: 22/08/2025
""""""""""""""""""""""""""""""""""""""""""""
జాక్ మా పదిసార్లు హార్వర్డ్ కు దరఖాస్తు చేసుకున్నాడు
ఎంపిక కాలేదు ఉద్యోగ ప్రయత్నాల్లో ముప్పైసార్లు తిరస్కరణకు గురయ్యారు ఆఖరికి కేఎఫ్ సి లో కూడా ఆయనకు
ఉద్యోగం దొరకలేదు అలాంటి వ్యక్తి చైనాలో అత్యంత
ధనవంతుల్లో ఒకరెలా కాగలిగారు?
జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తిరస్కరణకు గురయ్యే ఉంటారు
'నో' అన్న మాట వినే
ఉంటారు అంతమాత్రాన అక్కడితో జీవితం ఆగిపోకూడదు
చరిత్రలో గొప్పవారైన చాలామంది ఎన్నో నిరాకరణలు, అవమానాలు ఎదుర్కొన్నవారే
జేకే రౌలింగ్ రాసిన హ్యారీపోటర్ నవలను12 పబ్లిషింగ్ కంపెనీలు తిరస్కరించాయి
అయినా నిరాశ పడకుండా పట్టుదలతో ముందుకు సాగారు
కాబట్టే ఇప్పుడా పుస్తకాలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ
అమ్ముడైన ఫిక్షన్ సిరీస్ గా పేరొందాయి
ఉద్యోగం, ప్రేమ, వ్యాపారం...
విషయం ఏదైనా సరే అవతలి వాళ్లు తిరస్కరించడానికి అనేక కారణాలు ఉంటాయి
తగిన అర్హత లేకపోవడం, నచ్చకపోవడం, కోపం ఏదైనా
కావచ్చు దాన్ని అంగీకరించాలి తప్పులు సరిదిద్దుకునే అవకాశంగా మార్చుకోవాలి సరైన దిశలో ఆలోచిస్తే తిరస్కరణ
కొత్త పాఠాలు నేర్పుతుంది కొన్ని సందర్భాల్లో తిరస్కరణా
మన మంచికే అనిపిస్తుంది అది మనల్ని మనం సానబెట్టు
కోవడానికి ఉపయోగపడుతుంది మన అసలు లక్ష్యాలను
నిరంతరం గుర్తుచేస్తుంది ఒక తలుపు మూసుకుపోతే మరో
తలుపు తెరవడానికి ప్రయత్నించేలా పురికొలుపుతుంది
సమాజంలో అనేక మార్పులు తీసుకువచ్చిన ఎందరో ప్రము
ఖులు తమ జీవితాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొ
న్నారు ప్రతిసారీ వాళ్లు అదే తొలి ప్రయత్నంగా సిన్సియర్ గా
చేస్తూ పోయారు కాబట్టే విజయం సాధించారు
యాపిల్ కంపెనీ స్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ ను కొన్ని
కారణాల వల్ల అదే సంస్థ తిరస్కరించింది అంతా ముగిసి
నట్లేనని అనుకోకుండా 'నెక్స్ట్' అనే కొత్త కంపెనీని స్థాపిం
చారు స్టీవ్ దాన్ని యాపిల్ సంస్థ కొనుగోలు చేయడంతో
ఆయన మళ్లీ సీఈవోగా వచ్చారు, యాపిల్ ని ప్రపంచంలోనే
అత్యుత్తమ బ్రాండ్ గా తీర్చిదిద్దారు
మైఖేల్ జోర్డాన్ ఎన్ బిఏలో చేరకముందు అనేక
సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొని తనను తాను తీర్చిదిద్దుకున్నారు హైస్కూల్లో చదువుతున్నప్పుడు తగినంత ఎత్తులేడని, అవసరమైన నైపుణ్యాలు లేవని బాస్కెట్ బాల్
జట్టు నుంచి అతణ్ని తొలగించారు అయితే ఈ అను
భవం మైఖేల్ ని మరింత కష్టపడి పని చేయడానికి ప్రేరేపించింది ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు...
అందరి
వెనకా ఒకటికి మించిన రిజెక్షన్ కథలు తప్పనిసరిగా
ఉంటాయి వాళ్లు దాన్ని సక్సెస్ గా ఎలా మలచుకున్నారో
తెలుసుకోవాలి తిరస్కారానికి కారణం ఏదైనా ఉండొచ్చు
భయపడకూడదు, వెనకడుగు వేయకూడదు దాన్ని ఒక
అవకాశంగా మార్చుకోవాలి ఎందుకంటే ప్రతి
@ 'నో'లోనూ ఒక 'ఓ' ఉంటుంది...
అంటే అవకాశం (ఆపర్చునిటీ)
ఎదగడానికి, మెరుగవడానికి, గెలవడానికి..!*@
[8/23, 22:53] null: @ నేర్పుతో గెలవాలి @ 48
తేది:23/08/2025
""""""""""""""""""""""""""""""""""""""""
'ఊరికే ఉంటే ఊరా పేరా,
కర్ర తేరా కలిబెట్టుతాను' అన్నాడట వెనకటికి ఎవరో నిజమే కదా ఏమీ చెయ్యకుండా ఉండే
వాళ్లకి ఏ సమస్యా ఉండదు ఏదైనా చేయాలనుకుంటేనే కదా
మంచో చెడో కష్టమో సుఖమో ఎదురయ్యేది
ఏ సమస్యలూ,
లేకుండా అంతా సాఫీగా సాగిపోతుంటే జీవితంలో
థ్రిల్ఏముంటుంది..?
అందుకే వచ్చే సమస్య పోయే సమస్య
అన్నట్లుగా ఉందనుకోండి, అనుభవంతో రాటుదేలుతాం
పెద్దలు చెప్పనే చెప్పారు కదా...
కాలు తడవకుండా ఏరుదాటలేం, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం అని...
అయినా కొందరు సమస్య అన్న మాట వింటేనే వణికిపో
తారు మనశ్శాంతిని కోల్పోతారు
తిండి తినరు,నిద్ర పోరు
ఇంటిని సైతం అశాంతిమయం చేసేస్తారు
ఇంకొందరుంటారు వాయిదా పద్ధతుంది దేనికైనా
అన్నట్లు సమస్యల్ని కూడా వాయిదా వేస్తూ కాలం గడిపేస్తుంటారు
మరికొందరిది కాలమే అన్నిటినీ పరిష్కరిస్తుంది అనే
సిద్ధాంతం అందుకని వీరసలు దాని గురించి ఆలోచించకుండా
తమ పని తాము చేసుకుపోతుంటారు వీళ్లందరితోనూ అంత
ఇబ్బంది లేదు కానీ ప్రతి సమస్యనీ ప్రపంచ యుద్ధం
స్థాయిలో సీరియస్ గా తీసుకునే వాళ్లుంటారే వారితోనే గొడవంతా...!
వీళ్లకు ప్రతి సమస్యా రెడీమేడ్ గా
పరిష్కారం కావాలి
లేకపోతే తీవ్ర ఒత్తిడికి లోనై ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు
లేదా ఎదుటివారి ప్రాణాలమీదికి తెస్తారు అలాంటి వాళ్లంతా
చేయాల్సింది సమస్య ఎదురైనప్పుడు ఆవేశపడకుండా కూల్ గా
ఆలోచించడం ఎందుకంటే ఒక ప్రఖ్యాత రచయిత అన్నట్లు
'ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది
పరిష్కారం లేని
సమస్య ఉంటే ఆ తప్పు సమస్యది కాదు,పరిష్కారం
కనుక్కోలేని ప్రయత్నానిది
ప్రతి తాళానికీ ఒక చెవి కూడా ఉంటుంది
కాకపోతే
అది దొరకడానికి మనకు కాస్త సమయం పడుతుండొచ్చు
అంతేకానీ చెవి లేకుండా మాత్రం తాళం ఉండదు అంటారు
మరో ఆంగ్ల రచయిత ఇక్కడ తాళమూ చెవీ అంటే
ఆయన ఉద్దేశం సమస్యా పరిష్కారమూ అని
'సమస్య'ను భూతద్దంలో చూస్తున్నంతసేపు అది మనల్ని
భయపెడుతూనే ఉంటుంది సవాలుగా తీసుకుని పరిష్కారం
మీద దృష్టి పెడితే ఎంతటి సమస్య అయినా దూదిపింజలా
తేలిపోతుంది మనిషికి కావాల్సిందల్లా
కాస్త ఓర్పు
మరింత
నేర్పు అసలు సమస్యకి భయపడకూడదు,
వాయిదా వేయకూడదు, దానికి దూరంగా పారిపోనూకూడదు ఆఫీసు సమస్య
అయితే సహోద్యోగులతో, ఇంటి సమస్య అయితే కుటుంబసభ్యులతో...
విడమరిచి చర్చించాలి తప్పనిసరిగా ఏదో ఒక
పరిష్కారమార్గం దొరుకుతుంది ఒకవేళ అప్పటికి దొరక్కపోయినా సమస్య భారం పదిమందీ పంచుకున్నట్లు అవుతుంది
ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు దానినుంచి బయటపడే
మార్గం స్ఫురించకపోదు అంతేకానీ
@ ఎక్కిళ్లు పెట్టి ఏడుస్తూ
కూర్చుంటే కష్టం పోదు కదా..!@
[8/25, 10:13] null: @ 'రిఫ్రెష్' అవుతున్నారా..?@49
తేది 25/08/2025
""""""""""""""""""""""""""""""""""""""""""""
బయటికెళ్లి రాగానే మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని
'ఫ్రెష్ ' అయితే హాయిగా ఉంటుంది ఏడాదికోసారి ఎక్కడి
కైనా వెళ్లొస్తే రిలాక్స్ అయినట్లుంటుంది కంప్యూటర్ మీద
పనిచేసేటప్పుడు తరచూ 'రిఫ్రెష్' బటన్ నొక్కడమూ మనకి
అలవాటే మరి ఇదే పని కెరీర్లోనూ, జీవితంలోనూ
చేస్తున్నారా? లేదూ, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుంన్నారా..?
అయితే మీరీ పుస్తకం చదవాలి
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను పెనవేస్తూ రాసిన పుస్తకం 'హిట్ రిఫ్రెష్' టెక్నాలజీ
ప్రియులనే కాదు, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది అందరికీ
ఉపయోగపడుతుంది సత్య చదువులో టాపర్
కాదు ఐఐటీలో సీటురాలేదు మామూలు కాలేజీలో ఇంజినీరింగ్ చదివారు ఫ్రెండ్ అప్లై చేస్తున్నాడని ఫారిన్ యూనివర్సిటీలో ఎంస్ కి అప్లైచేశారు కానీ అసలు తనకా ఆలోచనే లేదు ఎంఎస్
చేశాక సన్ మైక్రోసిస్టమ్స్ ఉద్యోగం వచ్చింది కొన్నాళ్లకు ఇన్వెస్ట్మెంట్
బ్యాంకింగ్ వైపు వెళదాం అనీ ఎంబీయేలో చేరారు ఇంతలో
మైక్రోసాఫ్ట్ అవకాశం వచ్చింది అక్కడ పనిచేస్తూనే
పట్టుదలగా ఎంబీయే పూర్తిచేశారు మైక్రోసాఫ్ట్ లో వరసగా
చేపట్టిన ప్రాజెక్టులు విజయం సాధించడంతో సంస్థలో విలువైన ఉద్యోగిగా పేరొచ్చింది ఇరవయ్యేళ్లపాటు వివిధ
హోదాల్లో పనిచేసి సీఈఓ అయ్యారు అప్పటికి సంస్థ అంతర్గతంగానూ వ్యాపారపరంగానూ పలు సమస్యలను ఎదుర్కొంటోంది వాటిని ఆయన ఎలా పరిష్కరించారు
యావ'రేజ్' విద్యార్థి ఉద్యోగంలో నాయకత్వ స్థాయికి ఎదగడం
వెనక ఎలాంటి క్రమశిక్షణ ఉంది, కార్పొరేట్ ప్రపంచంలోనే
పెద్ద కల్చరల్ షిఫ్ట్ ని తేగలిగిన గొప్ప సీఈఓగా రాణించడం
వెనక ఎటువంటి వ్యక్తిత్వం ఉంది, దాన్ని తీర్చిదిద్దిన అనుభవాలేంటి...
ఈప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతుందీ
పుస్తకం కెరీర్ లోనూ జీవితంలోనూ 'రిఫ్రెష్' అన్న పదానికి
ఉన్న ప్రాధాన్యమేంటో వివరిస్తుంది
తొలి సంతానమైన జైన్ సెరెబ్రల్ పాల్సీతో పుడితే 'నాకే
ఎందుకిలా జరిగింది' అని బాధపడేవారట సత్య అలాకాదు,
మనకి బాబుపట్ల ఎంపతీ ఉండాలి తల్లిదండ్రులుగా ఏంచేసి
తనని బాగా చూసుకోగలమో ఆలోచించాలి అని చెప్పిందట
భార్య ఎంపతీ...
ఈ మాట గతంలోనూ విన్నారాయన
ఇంటర్వ్యూలో ఆఖరి ప్రశ్నగా 'నడిరోడ్డు మీద ఒక చిన్నారి
ఒంటరిగా ఏడుస్తూ కనిపిస్తే ఏంచేస్తావు' అడిగాడు మేనేజరు
'పోలీసులకు ఫోన్ చేస్తా' చెప్పారు సత్య మేనేజర్ భుజం
తట్టి 'ముందు ఎంపతీ చూపాలి
ఆ చిన్నారిని అక్కున చేర్చుకుని భద్రతనివ్వాలి' అని చెప్పారట ఇప్పుడు భార్య కూడా ఆమాటే అంది అంటే ఏ విషయాన్నయినా
ఆ స్థానంలో మనం ఉండి ఆలోచించాలి... అనుకున్న సత్య దృక్పథమే మారిపోయింది వ్యక్తిగానూ ఉద్యోగిగానూ సహానుభూతి అవసరాన్ని
పలుచోట్ల గుర్తు చేస్తారాయన యాజమాన్యానికి సిబ్బంది
పట్ల, సిబ్బందికి వినియోగదారుల పట్ల ఎంపతీ ఉండాలి,
అప్పుడే సరైన ఉత్పత్తులు వస్తాయి, ఉత్పాదకతా పెరుగుతుంది...
ఇలాంటి ఎన్నో అంశాలను సత్య నాదెళ్ల ప్రస్తావిస్తారు తన జీవితం, నాయకత్వం, భవిష్యత్ సాంకేతికత...
ఈ మూడు అంశాలను ఈ పుస్తకంలో విపులంగా చర్చిస్తారు...
No comments:
Post a Comment