#శ్రీ మలయాళస్వామి తిరుపతిలో కొన్నాళ్ళ పాటు ధ్యానం చేయాలనుకున్నారు. కానీ ఆయన ఎక్కడ ధ్యానం చేయాలనుకున్నా అక్కడికి జనం వచ్చేవారు. ధ్యానానికి భంగం అయ్యేది. *
అక్కడికి దగ్గరలో ఒక నదీ పాయ ఉంది. మోకాలు నీటి లోతులో నడిచి వెళ్ళి అవతలి వైపు ఒక గుహ వెతుక్కుని తీవ్రసాధన చేయసాగారు. కాలం తెలిసేది కాదు. ఒక పూట భోజనం కోసం నది పాయ దాటి ఇవతలి వైపు ఉన్న తిరుపతి సత్రానికి వెళ్ళి భోజనం చేసేవారు. ధ్యానంలో కాలం తెలియకపోవడంతో వెళ్ళడానికి ఒక టైమంటూ ఉండేది కాదు. భోజనం వడ్డించేవారు వేళాపాళా లేకుండా వస్తున్నారని విసుక్కునేవారు.
శ్రీ మలయాళ స్వామి.. వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నది ఒడ్డున ఎవరైనా పిండప్రదానం పెడితే ఆ వరిపిండి ముద్దల్ని తిని కడుపు నింపుకునేవారు. అలా వారి ధ్యానసాధన తీవ్రమైంది. ఒకసారి ఆ నదికి వరద వచ్చింది. నదీపాయ మొత్తం నీటితో నిండిపోయి ఆ నీరు గుహ వరకు వచ్చేసింది. ఆయన బయటకు రావడానికి అవకాశం లేదు. ఆహారం లేదు. అలా నాలుగు రోజులు గడిచాయి. ఆయన ధ్యానంలోనే ఉండిపోయారు.
ఆ రోజు రాత్రి సత్రం యజమానికి ఒక కల వచ్చింది. ఆ కలలో శ్రీ వేంకటేశ్వరస్వామి కనిపించి ఫలానా చోట నా భక్తుడు చిక్కుకున్నాడు. వెంటనే ఆయనకు ఆహారం అందించు అని చెప్పారు. ఆ యజమాని మర్నాడు ఉదయాన్నే ఒక పడవలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఆహార సామాగ్రిని తీసుకుని స్వామి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి కొన్ని రోజులకు సరిపడా ఆహార పదార్థాలను అందించాడు. వరద తగ్గిన తర్వాత ప్రతిరోజూ మా సత్రానికి వచ్చి భోజనం చేయండి. మీరు ఏ సమయంలో వచ్చినా ఫర్వాలేదు. సాక్షాత్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి మీ బాగోగులు చూసుకోమన్నారు అని చెప్పి నమస్కరించి వెళ్ళిపోయాడు.
ఎవరైతే higher frequency తో ఉంటారో.. వారు చుట్టుప్రక్కల ఉన్న శక్తిక్షేత్రాలతో connect అవుతారు. మలయాళ స్వామి ధ్యానంలో ఉండగా.. ఆ శక్తి ప్రకంపనాలు శ్రీ వెంటేశ్వరస్వామిని తాకాయి. ఆయనే అన్నీ చూసుకున్నాడు. యోగులందరికీ (Higher frequency) ఇదే జరుగుతుంది. వారిని ఎప్పుడూ ఒక శక్తి వెన్నంటి కాపాడుతూ ఉంటుంది.. *
.
No comments:
Post a Comment