Monday, August 25, 2025

 @ 'రిఫ్రెష్' అవుతున్నారా..?@49
           తేది 25/08/2025
""""""""""""""""""""""""""""""""""""""""""""

బయటికెళ్లి రాగానే మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని
'ఫ్రెష్ ' అయితే హాయిగా ఉంటుంది ఏడాదికోసారి ఎక్కడి
కైనా వెళ్లొస్తే రిలాక్స్ అయినట్లుంటుంది కంప్యూటర్ మీద
పనిచేసేటప్పుడు తరచూ 'రిఫ్రెష్' బటన్ నొక్కడమూ మనకి
అలవాటే మరి ఇదే పని కెరీర్లోనూ, జీవితంలోనూ
చేస్తున్నారా? లేదూ, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుంన్నారా..?
అయితే మీరీ పుస్తకం చదవాలి
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను పెనవేస్తూ రాసిన పుస్తకం 'హిట్ రిఫ్రెష్' టెక్నాలజీ
ప్రియులనే కాదు, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది అందరికీ
ఉపయోగపడుతుంది సత్య చదువులో టాపర్
కాదు ఐఐటీలో సీటురాలేదు మామూలు కాలేజీలో ఇంజినీరింగ్ చదివారు ఫ్రెండ్ అప్లై చేస్తున్నాడని ఫారిన్ యూనివర్సిటీలో ఎంస్ కి అప్లైచేశారు కానీ అసలు తనకా ఆలోచనే లేదు ఎంఎస్
చేశాక సన్ మైక్రోసిస్టమ్స్ ఉద్యోగం వచ్చింది కొన్నాళ్లకు ఇన్వెస్ట్మెంట్
బ్యాంకింగ్ వైపు వెళదాం అనీ ఎంబీయేలో చేరారు ఇంతలో
మైక్రోసాఫ్ట్ అవకాశం వచ్చింది అక్కడ పనిచేస్తూనే
పట్టుదలగా ఎంబీయే పూర్తిచేశారు మైక్రోసాఫ్ట్ లో వరసగా
చేపట్టిన ప్రాజెక్టులు విజయం సాధించడంతో సంస్థలో విలువైన ఉద్యోగిగా పేరొచ్చింది ఇరవయ్యేళ్లపాటు వివిధ
హోదాల్లో పనిచేసి సీఈఓ అయ్యారు అప్పటికి సంస్థ అంతర్గతంగానూ వ్యాపారపరంగానూ పలు సమస్యలను ఎదుర్కొంటోంది వాటిని ఆయన ఎలా పరిష్కరించారు
యావ'రేజ్' విద్యార్థి ఉద్యోగంలో నాయకత్వ స్థాయికి ఎదగడం
వెనక ఎలాంటి క్రమశిక్షణ ఉంది, కార్పొరేట్ ప్రపంచంలోనే
పెద్ద కల్చరల్ షిఫ్ట్ ని తేగలిగిన గొప్ప సీఈఓగా రాణించడం
వెనక ఎటువంటి వ్యక్తిత్వం ఉంది, దాన్ని తీర్చిదిద్దిన అనుభవాలేంటి...
ఈప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతుందీ
పుస్తకం కెరీర్ లోనూ జీవితంలోనూ 'రిఫ్రెష్' అన్న పదానికి
ఉన్న ప్రాధాన్యమేంటో వివరిస్తుంది
తొలి సంతానమైన జైన్ సెరెబ్రల్ పాల్సీతో పుడితే 'నాకే
ఎందుకిలా జరిగింది' అని బాధపడేవారట సత్య అలాకాదు,
మనకి బాబుపట్ల ఎంపతీ ఉండాలి తల్లిదండ్రులుగా ఏంచేసి
తనని బాగా చూసుకోగలమో ఆలోచించాలి అని చెప్పిందట
భార్య ఎంపతీ...
ఈ మాట గతంలోనూ విన్నారాయన
ఇంటర్వ్యూలో ఆఖరి ప్రశ్నగా 'నడిరోడ్డు మీద ఒక చిన్నారి
ఒంటరిగా ఏడుస్తూ కనిపిస్తే ఏంచేస్తావు' అడిగాడు మేనేజరు
'పోలీసులకు ఫోన్ చేస్తా' చెప్పారు సత్య మేనేజర్ భుజం
తట్టి 'ముందు ఎంపతీ చూపాలి
ఆ చిన్నారిని అక్కున చేర్చుకుని భద్రతనివ్వాలి' అని చెప్పారట ఇప్పుడు భార్య కూడా ఆమాటే అంది అంటే ఏ విషయాన్నయినా
ఆ స్థానంలో మనం ఉండి ఆలోచించాలి... అనుకున్న సత్య దృక్పథమే మారిపోయింది వ్యక్తిగానూ ఉద్యోగిగానూ సహానుభూతి అవసరాన్ని
పలుచోట్ల గుర్తు చేస్తారాయన యాజమాన్యానికి సిబ్బంది
పట్ల, సిబ్బందికి వినియోగదారుల పట్ల ఎంపతీ ఉండాలి,
అప్పుడే సరైన ఉత్పత్తులు వస్తాయి, ఉత్పాదకతా పెరుగుతుంది...
ఇలాంటి ఎన్నో అంశాలను సత్య నాదెళ్ల ప్రస్తావిస్తారు తన జీవితం, నాయకత్వం, భవిష్యత్ సాంకేతికత...
ఈ మూడు అంశాలను ఈ పుస్తకంలో విపులంగా చర్చిస్తారు...

No comments:

Post a Comment