Tuesday, July 28, 2026

 🔱ఓం నమః శివాయ🔱:
*జీవుడు చైతన్యం , బుద్ధి, మనస్సు , ప్రాణం ద్వారా శరీరానికి అరిషడ్వార్గాలతో బంధించబడి ఉంటాడు . తిరిగి అదే క్రమంలో వాటిని విడదీసి జీవుడు తన స్వరూపాన్ని చేరుకోవాల్సి ఉంటుంది* . 


*అరిషడ్వార్గాలను క్రమబద్ధమైన , ధర్మబద్ధమైన జీవితంతోనూ, ప్రాణాన్ని ప్రాణాయామంతోను , బుద్ధిని  ధారణతోను , మనస్సును ధ్యానంతో , చైతన్యాన్ని సమాధితోను నిలువరించాలి.* 

*సంకల్పం జీవునితో మొదలై చైతన్యాన్ని ప్రేరేపించి  , భావంగ మారి , ప్రేరణగా మారి , ఆలోచనగా రూపుదిద్దుకుని, భాషగా , క్రియగ మారి మనకు కావలసిన మార్పుగా రూపాంతరం చెందుతుంది.*


తమ ఆసీత్ తమసా గూఢమాగ్రి ప్రకేతం సలిలమ్ సర్వమా ఇదంతుచ్యేనాభ్వాపిహితం యదాసీత్ తపసత్ తన్మహినాజాయతైకం – 3

3.అంతా అంధకారంతో ఆవృతమైన గాఢాంధకారం నెలకొని ఉంది. అవగాహనకి అందని ఆ బ్రహ్మం (బ్రహ్మ పదార్ధం) మన అవగాహనకి అందని విధంగా దాగి ఉంది. అది ఏమైతేనేమి, అది నామరూపాలు లేని శూన్యం (శూన్యం కూడ పూర్తిగా “శూన్యం” కాదని గుళిక శాస్త్రం చెబుతోంది కదా!). తీవ్రమైన తాపం (వేడి) వల్ల దానికి అస్తిత్వం సిద్ధించింది, ఉనికి ఏర్పడింది. (బిగ్ బ్యాంగ్ జరుగగా అధికమైన వేడి పుట్టిందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్తున్నది.)

ముందు యావత్తూ అంధకారంతో ఆవరించబడి గుర్తుపట్టలేని వెల్లువగా సమస్తాన్ని ఇముడ్చుకొని ఒక్కటే ఏదయితే ఉందొ అదే అభివ్యక్తమౌతున్నది.


అప్పుడు ఉన్నది స్త్రీ కాదు పురుషుడు కాదు . ఆ ఒక్కటీ అనిర్వచనీయమైనది . విశ్వం యొక్క ఈ స్థితి ఇప్పుడు చెప్పే బిగ్ బాంగ్ ను పోలి  ఉంది . అది చైతన్యాన్ని తనలో ఇముడ్చుకున్న స్థితి శక్తి . అందులోనుండి వెలువడిన చైతన్యం చరాచర పరాపర విశ్వంగా మారింది .


ప్రథమంగా ఉన్నది అంధకారమై  ఇప్పుడు కనపడే సమస్తాన్ని తనలో ఇముడ్చుకొని ఒక ఆవరణగా ఉంది . ఈ స్థితి ఏది అని కనుక్కోవడానికి శాస్త్రాలు ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి . అందుకే ఋగ్వేదం దాన్ని అనిర్వచనీయమైనదని అన్నది. 


కామస్తదగ్రే సమవర్ధతాది మనసో రేతః ప్రథమం యదాసీత్ సతో బంధుంసతి నిరవిందన్ హృది ప్రతీప్యా కవయో మనీషా – 4

4.దానికి కారణం కోరిక (ఇచ్ఛ). అదే ప్రధమ బీజం, పరబ్రహ్మం యొక్క మనసు నుంచి ఉద్భవించింది. అక్కడి నుంచే విశ్వావిర్భావం జరిగింది, విశ్వం వికసించింది. అది ఉనికికి, ఉనికి లేకపోవటానికి మధ్య ఉన్న తెరని ఛేదించింది. అనగా విశ్వం వేగంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఏ ఋషులైతే దాని కోసం తమ హృదయాలను శోధించారో, వారికి శక్తికి, పదార్ధానికి, సత్తుకు, అసత్తుకు కారణమైన చైతన్యాన్ని దర్శించగలిగారు. వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు.

మనస్సు ప్రథమ రేతస్సుతో మొదట హృదయంనుండి ఆకాంక్ష అంకురించబడినదని తెలుసుకున్న ఋషులు సత్యానికి అసత్యానికి ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు .

సత్యం అన్నది మూలం . అసత్యం అన్నది మూలం నుంచి వచ్చి తిరిగి అందులోనికి పోయేది అని అర్థం . సృష్టి పరంగానైనా శాస్త్ర పరంగానైనా ఈ నిజం ఒకటే . జగత్తులో ఒక్క మనిషి మాత్రం ఆ చైతన్యాన్ని గుర్తించి మూలంలోకూడా చైతన్యంగా వ్యవహరించగలుగుతాడు . ఆ చైతన్యం కలిగిన మనిషే దేవుడౌతాడు .

ఏ మనిషి ఇతరులకంటే శక్తిమంతుడు అయి ఇతరులకు ఉపయోగపడే కార్యం  చేస్తాడో అతడే దైవంగా భావిస్తున్నారు . తన్ను తాను తెలుసుకున్నవాడు మూలం చేరి విముక్తడవుతాడు . ఇతరులకు ఉపయోగపడితే  దేవుడవుతాడు . 

తిరశ్చినో వితతో రశ్మిరేషామధ: స్విదాసీ దుపరి స్విదాసీత్ | 
రెతొధా అసన్ మహిమాన ఆసన్ త్స్వధా అవస్తాత్ ప్రయతి: పరస్తాత్ || -5

5.మరియు శూన్యానికి, దానిపైన, క్రింద ఏమున్నదో, దానికి ఆధారమైనదేదో తెలుసుకోగలిగారు. అభ్యుదమైన ఆ శక్తి సారవంతమైనశక్తులను తయారు చేసింది. అన్నిటికిపైన చైతన్యశక్తి యొక్క ఉద్దేశ్యం, ప్రేరణ ఉంది, అదే దీన్ని నడిపిస్తోంది, క్రింద క్రమశిక్షణతో కూడిన సృజనాత్మకత ఉంది. అది ప్రేరణకు తగ్గట్టుగా నడుస్తోంది.

అతనిలో ఒక కిరణం ఏటవాలుగా ఉంది. ఆవెలుగు కిరణం క్రిందికి పైకి వ్యాపిస్తున్నది.అక్కడ బీజం ఉంది. అతనియందు మహిమలు న్నాయి. అతనికి స్వతంత్రమైన పనులున్నాయి.అతని యందు చైతన్య స్పందన ఉన్నది. శ్రేష్ఠమైన ప్రగతి ఉంది.అతని యందు (ప్రకాశించే)శక్తి ఉన్నది
పనులు =సృష్టి స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాది పంచ కర్మలు శక్తి = చిచ్ఛక్తి .


కోఅద్ధా వేద క ఇహ ప్రవోచత్ కుత ఆజాతా కుత ఇయం విసృష్టి: | 
అర్వాగ్దేవా అస్య విసర్జనేనాథాకోవేద యత ఆ బభూవ || -6

6.కానీ ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుసు? దేవతలకు (పరబ్రహ్మం కాదు, పుణ్యఫలాల కారణంగా దేవతాజన్మను పొందిన వారు, ఇంద్రుడు, వరుణుడు, ఆదిత్యుడు, అగ్ని మొదలైనవారు) కూడా ఈ ప్రాదుర్భావం తరువాతే అస్తిత్వం సిద్ధించింది (వారు కూడా ఈ తర్వాత వచ్చినవారే).


సరీగ్గా ఎవరికి తెలుసు ? అతడిని గురించి ఎవరు చెప్పగలరు? ఈ సృష్టి ఎక్కడినుంచి వచ్చిందో ఎవరు చూసారు?

దేవతలంతా తరువాత జన్మించిన వారు. ఎక్కడినుంచి ఈసృష్టి ఎలా వచ్చిందో ఎవరూ చూడలేదు. ముందు గాఉన్నది అతడు మాత్రమే.

ఇక్కడ దేవతలు అంటే పంచ బ్రహ్మలు.(స బ్రహ్మ స శివ, స హరి స్సేంద్ర: సొ అక్షర: పరమ స్వరాట్) .


ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధేయ దివాన | 
యో అస్యాధ్యక్ష: పరమె వ్యొమన్ సొ అంగ వేద యది వా నవేద || -7

7.ఈ సృష్టిని చేసి, దాని పగ్గాలు పట్టి నడిపిస్తున్నవాడికి నిశ్చయంగా ఇది ఎలా ఏర్పడిందో, దీనికి కారణం ఎంటో తెలిసే ఉండాలి. బహుశ అతనికి కూడా తెలియదేమో! (ఎవరికి తెలుసు?)

ఈ సూక్తంలో చెప్పిన చాలా విషయాలను ఆధునిక భౌతికశాస్త్రం కూడా వర్ణించింది. విశ్వోద్భవశాస్త్రం మీద, భౌతిక శాస్త్రం మీద అవగాహన ఉన్నవారికి ఇది స్పష్టంగా తెలుస్తుంది.

ఈ సృష్టి ఎక్కడినుంచి వచ్చింది, పరమా కాశం లో దీనిని ఎవరు ఉంచారు ? ఇది పరమాకాశం లో ఉన్న, అన్నిటికి అధ్యక్షుడైన విశ్వకర్మ ఆ సృష్టికర్తకే తెలుసు....లేదా ఆయనకు తెలియదని మనం అనుకోవచ్చు.
అన్ని యెరిగిన వాడు, సర్వసాక్షి ఆ పరమాత్మ యొక్కడే.
*ఆధ్యాత్మిక కుటుంబం*                      

No comments:

Post a Comment