బ్రహ్మచర్యం తో వీర్యాన్ని నిలపక పొతే దేవతా ఉపాసన ఫలించదా ?
Author Name:Vastavam Channel
Youtube Channel Url:https://www.youtube.com/@vastavam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=U1pGGiNYdvM
Transcript:
(00:00) సంసారంలో ఉన్నవాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వీర్యాన్ని కాపాడుకోవడం సాధ్యమేనా అది అసలు అవసరమా? నమస్తే ప్రసాద్ గారు శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రేన మహాచాందిని మనం సాధన చేసినప్పుడు గానీ లేదా దీక్షపరమైన ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు గానీ మనకి గురువులు గాని దీక్షి ఇచ్చిన వాళ్ళు గాని ఒక్క విషయం చెప్తారు మీరు బ్రహ్మచర్యం కచ్చితంగా పాటించాలి లేదా మాంసాహారం తినకూడదు ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఇలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు.
(00:29) ఇలాంటివి చేయలేకపోతున్న పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా సంసారంలో ఉన్నవాళ్ళు సాధన చేయడానికి పనికిరారా. ఈ వాంఛలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వాళ్ళ సహచర్యులతో వాళ్ళు శారీరకంగా కలిసినప్పుడు ఈ సాధకులు వాళ్ళ ప్రాణశక్తిని ఎక్కువగా కోల్పోతూ ఉంటారు వాళ్ళ వీర్యాన్ని ఎక్కువగా కోల్పోతూ ఉంటారు. ఇలా జరిగినప్పుడు వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గటం అనేది కూడా ఉంటూ ఉంటుంది.
(00:54) ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న బ్రహ్మచర్యం అన్నారు ఇంకోటి కూడా అడిగారు ఇక్కడ రెండు టూ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇక్కడ బ్రహ్మచర్యం అంటే నిజానికి ఆ అర్థం వేరే బ్రాహ్మణ్ చర్య అనే రెండు పదాల కలయిక బ్రహ్మచర్యం బ్రాహ్మణ్ అంటే పరమ సత్యం లేదా పరమ బ్రహ్మం సర్వోన్నతమైనటువంటి ధర్మం పరమ వాస్తవం అని అర్థం చర్య అంటే ప్రవర్తన నడవడిక జీవన విధానం అంటే ఉత్తమమైన పరమాత్మ తత్వమైనటువంటి మార్గాన్ని ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ జీవించడం అనేది బ్రహ్మచర్యం అంతేగానీ అది
(01:42) స్త్రీ పురుషుల లైంగిక కలయక కలయక దూరంగా ఉండడం ఆ శారీరక వాంచలకు దూరంగా ఉండడం అది కాదు సో వివాహమై వివాహ ధర్మాన్ని పాటిస్తూ కూడా బ్రహ్మచారిగా ఉంటూ ఆ దైవనుగ్రహాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి బ్రహ్మచర్యం వేరు రెండోది మీరు అడిగింది ఏంటంటే వీర్యాన్ని కోల్పోతూ ఉండడం సాధకులకి సాధన చేసేవాళ్ళు జప సాధన చేసే వాళ్ళు కానీ లేదంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు దేవతా ఉపాసన చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఆ ప్రాణశక్తిని ఎక్కువగా గనక కోల్పోతే దాని వల్ల ఆ ఏమైనా నష్టం ఉంటుందా అది ఏ విధంగా వాళ్ళ సాధన మీద
(02:29) ప్రభావం చూపిస్తుంది అన్నది ఈ విషయం పైన ఆధునిక సైన్స్ ఆరోగ్య శాస్త్రం ఏం చెప్తుంది అలాగే మనం పురాతన శాస్త్రాలు యోగ తంత్ర ఏం చెప్తున్నాయో చూద్దాం. వైద్య పరిభాషలో వీర్యాన్ని లేదా ప్రాణశక్తిని కాపాడుకోవడాన్ని సీమన్ రిటెన్షన్ అంటారు అయితే వాళ్ళ పరిశోధనల ప్రకారం ఆధునిక వైద్య పరిశోధనల ప్రకారం ఆరోగ్యంగా ఉన్న పురుషుల్లో లైంగిక సంబంధం ద్వారా లేదా హస్త ప్రయోగం ద్వారా క్రమం తప్పకుండా వీరయ్యస్కలనం జరగడం వల్ల వీర్యం కోల్పోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు.
(03:10) అయితే వేదాలు ఉపనిషత్తులు వీటి సారాంశం ఏంటంటే ముఖ్యంగా యోగశాస్త్రంలో ఈ ప్రాణశక్తికి ఏదైతే ఆ వీర్యం అనుకుంటున్నామో పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఆ ప్రాణశక్తిని అధికంగా కోల్పోతే వాళ్ళు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని త్వరగా త్వరగా సాధించలేరు. ఉపనిషత్తులు మాత్రం వీర్యం అనేది ఎంతో విలువైనదిగా చెబుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వృధా చేయకూడదు అని చాలా స్పష్టంగా చెప్తాయి ఉపనిషత్తులు.
(03:43) ఆయుర్వేద గ్రంథాలు ఏం చెప్తాయంటే ఈ ప్రాణశక్తిని వీర్యాన్ని అధికంగా కోల్పోతే అలసట, బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, జీవశక్తి, ఓజస్ అని కూడా అంటారు. ఉత్సాహం తగ్గిపోవడం, ఏకాగ్రత తగ్గిపోవడం ఇన్ని కూడా సంభవిస్తాయని. కొన్ని తాంత్రిక పద్ధతులు ఏం చెప్తాయంటే వీర్యాన్ని సంరక్షించండి. లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకోవాలి.
(04:10) దానివల్ల త్వరగా కుండలిని శక్తిని సాధించగలుగుతాము. అయితే స్వామి వివేకానంద గాని స్వామి శివానంద అలాగే రామకృష్ణ పరమహంస ఇలాంటి యోగులు సిద్ధయోగులు చెప్పింది మాత్రం ఏంటంటే ఈ ప్రాణశక్తిని ఆ సెక్షువల్ ఎనర్జీని కాపాడుకొని మన స్పిరిచువల్ సాధనలో ఆధ్యాత్మిక సాధనలో ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు చాలా శీఘ్రంగా చాలా త్వరగా కలుగుతాయని ఇది సత్యం ఇది మనకు డాక్టర్లు చెప్పిందే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో మాత్రం ఒక స్పిరిచువల్ జర్నీ చేసినప్పుడు ఏదైనా సాధించాలని ఒక దేవతా ఉపాసన లేదంటే ఆ జపం ధ్యానం ఏదైనా సరే ఇలాంటి మార్గంలో చేసేవాళ్ళకి మాత్రం ఆ
(04:55) ప్రాణశక్తిని వృధా పోనీయకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు సంసారం ఇప్పుడు చాందిని మీరు అడిగిన ప్రశ్నకి మరి సంసారంలో ఉంటారు [నవ్వు] మరి సంసారంలో ఉంటూ కూడా సాధన చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఈ ఈ బ్రహ్మచర్యాన్ని లేదంటే ఈ ప్రాణశక్తిని కాపాడుకోవడం సాధ్యమేనా అని తప్పకుండా సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తూ కూడా ప్రాణశక్తిని కాపాడుకోవడానికి యోగశాస్త్రంలో చాలా విధానాలు చాలా పద్ధతులు ఉన్నాయి.
(05:26) అలాంటి పద్ధతులు అవలంబిస్తూ సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తూ చేసేదాన్ని కూడా బ్రహ్మచర్యం అంటాం. గత వీడియోలో కూడా మనం చెప్పాం కామవాంచలు ఉండేవాళ్ళు కామకూరిలు విపరీతంగా ఉండేవాళ్ళు కూడా సాధనని ప్రారంభించవచ్చు ఎలాంటి సందేహం లేకుండా ఎందుకని కాలక్రమైన ఆ సాధనలో వాళ్ళు ఆ కోరికలను జయించి ఇంద్రియ నిగ్రహాన్ని పొంది క్రమంగా క్రమంగా ఈ బ్రహ్మచర్యం వైపు అడుగులు వేస్తారు.
(05:55) సాధన చేయాలి అని ఒక ఆలోచన రావడమే ఆ దేవత మనకు ఒక మెసేజ్ పంపడం ఆ దేవత చూపు మన మీద పడినప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సో తప్పకుండా ఆ దేవత చూపు మన మీద పడింది మనకు ఆ పట్టుదల ఉంది ఆ సంకల్పం ఉంది కాబట్టి ఎన్ని బలహీనతలు ఉన్నా అవన్నీ కూడా సాధనలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జయించుకుంటూ పోతాం అని మనం చెప్పాం ఓం శ్రీ మాతిం నమః ఆ
No comments:
Post a Comment