Monday, March 25, 2024

ఆత్మ అంటే వెలుతురా ? చీకటా?

 త్రిపురా రహస్యము - 27

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉

స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 


17. ఆత్మ అంటే వెలుతురా ? చీకటా? 

“గురువుగారూ !  హేమలేఖ సంసార బంధనాల గురించి తన నాధుడికి వివరించింది కదా! ఆ తరువాత ఏమైందో వివరించండి” అన్నాడు కృష్ణశర్మ. వివరించటం  ప్రారంభించాడు రత్నాకరుడు. 

హేమలేఖ మాటలు విన్న హేమచూడుడు చాలా ఆశ్చర్యపోయి గద్గద స్వరంతో “దేవీ నీవు చాలా నైపుణ్యము గలదానవు. నీ జ్ఞాన వైభవము అమోఘము. అద్వితీయము. నాకు అనేక విషయాలు తెలియచేశావు. నా వృత్తాంతము ఇది అని నాకు తెలియచెప్పావు. నీ తల్లియైన పరాచితి ఎవరు ? ఆమెకు ఎందుకని పుట్టుకలేదు? అసలు మనమెవరము. మన స్వరూపం ఏమిటి ?” అన్నాడు. దానికి హేమలేఖ “రాకుమారా ! ఇది చాలా రహస్యమైన విషయము. ఆతిశ్రద్ధగా విను. నిర్మలమైన మనస్సుతో ఆత్మతత్తాన్ని గురించి విచారించు. 

ఆత్మ అనేది కంటికి కనిపించేది కాదు. వాక్కుతో చెప్పబడేది కాదు. అందుచేత దాన్ని గురించి ఏ విధంగానూ చెప్పలేము. ముందుగా నీ ఆత్మ స్వరూపం గురించి నువ్వు తెలుసుకో. ఆ తరువాత నీ తల్లియైన త్రిపురాదేవి గురించి తెలుసుకుందువు గాని.  

ఆత్మస్వరూపాన్ని గురించి ఎక్కడా చెప్పబడలేదు. చెప్పేవారు కూడా లేరు. శుద్దబుద్ధి స్వరూపమైన నీ స్వరూపమే నీ అత్మ. శుద్ధబుద్ధి అంటే విషయభోగాలవైపు మొగ్గుచూపని బుద్ధి. ఆ బుద్ధికి కూడా ఆశ్రయమైనది ఆత్మ. కంటికి కనిపించేదంతా నిషేధిస్తే చివరకు మిగిలేదే ఆత్మ. ఆత్మ అనేది అన్ని జీవుల యందు పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి ఉన్నది. అంటే ఆత్మ అన్నింటినీ ప్రకాశింపచేస్తుంది. కాని అది దేనిచేత ప్రకాశింప చెయ్యబడదు. అది అన్నిచోట్లా ఉంటుంది. ఏ ప్రమాణాలకూ అందదు. దేనితోనూ నిరూపితం కాదు. ఎవరైనా “ఆత్మ స్వరూపాన్ని నాకు తెలియచెయ్యి' అని అడిగితే అతడు 'నా కళ్ళు నాకు చూపించు” అని అడిగినట్లే. గురువుకూడా నీకు ఆత్మ సాక్షాత్కారానికి మార్గాన్ని మాత్రమే చెప్పగలడు. అంతేకాని ఆత్మసాక్షాత్కారం చేయించలేడు. సాధకుడి మనసు బహిర్ముఖమైనప్పుడు, అంటే విషయవాంఛల మీద లగ్నమయినప్పుడు అతడు ఆత్మకు దూరమవుతాడు. అప్పుడు గురువు శిష్యుడి మనస్సు అంతర్ముఖం చేసి ఆత్మసాక్షాత్మారానికి మార్గం చూపిస్తాడు. ఆ మార్గాన్ని నేను ఇప్పుడు నీకు వివరిస్తాను.  శ్రద్ధగా వినవలసినది. 

నీకు 'నాది” అనిపించేదంతా నువ్వు కాదు. నీది అంతకన్నా కాదు. నాది అనే దానికన్న వేరైనది ఏదైతే ఉన్నదో అదే నీ నిజస్వరూపము. వెళ్ళి ఏకాంతంగా కూర్చుని, నీ వివేకాన్ని ఉపయోగించి పరిశీలించు. నాది అనిపించే వాటన్నింటినీ వదిలెయ్యి.  

చివరకు మిగిలేదేదో అదే నీ ఆత్మ. భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు ఏవీ నువ్వు కాదు. నీవి కావు. వీటన్నింటినీ వదిలెయ్యి. దేన్నయితే వదలటానికి సాధ్యం కాదో, అదే నీ ఆత్మ అని తెలుసుకుని శ్రేయస్సు పొందు.” అన్నది. 

ఆ మాటలు విన్న రాకుమారుడు గుర్రమెక్కి నగరందాటి, అవతలగా ఉన్న తన ఉద్యానవనం చేరాడు. అందులో స్పటిక నిర్మితమందిరం ఉన్నది. ఆ మందిరంలోకి ప్రవేశించాడు. సేవకులందరినీ వదిలేశాడు. “నేను ఏకాంతంగా ఉండటానికి వెడుతున్నాను. నా కోసం ఎవరు వచ్చినా, చివరకు రాజుగారైనా సరే లోపలకు రానీయవద్దు” అని చెప్పి మందిరాంతర్భాగాన తొమ్మిదవ అంతస్తుకు వెళ్ళి, అక్కడ సుఖంగా కూర్చుని మనసును ఏకాగ్రం చేసి హేమలేఖ చెప్పినట్లుగా ఆలోచించటం ప్రారంభించాడు.  

అ లోకంలోని జనం అంతా మోహంతో పడిపోయి ఉన్నారు. వీరెవరికీ తన ఆత్మగురించి తెలియదు. అందరూ తమ లాభం కోసం ఏదో ఒక పని చేస్తుంటారు. వేదశాస్తాలు చదివినా, వ్యవసాయం చేసిన, వ్యాపారం చేసినా అంతా తమ లాభం కోసమే. ఆత్మను గురించి తెలుసుకోకుండా ఏ పని చేసినా ఉపయోగం ఏమీ లేదు. ఈ రకంగా ఆలోచించి ముందుగా దేహాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. 

దేహం అంటే ఆత్మకాదు అని ఆలోచించటం ప్రారంభించాడు. రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ చర్మము, మలమూత్రాలు వీటితో కలిసినదే ఈ దేహము. ఇది ప్రతిదినము వృద్ది పొందుతూ ఉంటుంది. లేదా క్షీణిస్తూ ఉంటుంది. చివరకు నశిస్తుంది. అలాంటి కనిపించింది. అలాగే స్వప్రకాశము, చిదేక రసము, అయిన ఆత్మతత్త్వము పూర్వవాసనలచే కలిగిన మనోవికల్పముచే ఆవరించబడిన దానివలె ఉంటుంది. ఎప్పుడైతే మనసును  నిగ్రహించామో, అప్పుడు ఆ వికల్పాలు అన్నీ నశిస్తాయి. అప్పుడు ఆత్మస్వరూపము గోచరిస్తుంది. కుండను చీకటి ఆవరించి ఉన్నట్లే ఆత్మకన్న ఇతరములైన మానసిక భావాలు వేరుగా ఉంటాయి అనుకోవాలి....🙏

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

J N RAO 🙏🙏🙏

హృదయార్పణం....

 🔱 *ఓం నమశ్శివాయ*🔱

*"హృదయార్పణం"*

 చాలా చక్కటి వ్యాసం. అందరూ తప్పక చదవాలని నా ప్రార్ధన.

మనిషి తనకు మానవజన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు. 

పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో,
ఫలమో, జలమో సమర్పించుకుంటూ ఉంటాడు. 

ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా? 

ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు!
 
భగవంతుడిదే ఆ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే.
కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు.

పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు.
అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది.
పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు.

*పరమేశ్వరా !*🙏🙏🙏

*నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు. కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి?*🙏

*అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి?* 🙏

*నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు?*🙏

*పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా?*🙏

*నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి?*🙏

*ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి?* 🙏

*గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా?*  🙏

*ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి?* 🙏

*నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు?* 🙏

*మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా?*🙏

*నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా?* 🙏

*జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా?*🙏

*నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు?* 🙏

*విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తిపరచగలనా?*🙏

*అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి?*🙏

*అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి?*🙏

*వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి?'*🙏


ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు. 

భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే. 

వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు. 

అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది.

నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు.
వస్తువులు అంతకన్నా కావు. 
ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు. 
భక్తితో స్మరిస్తే చాలునంటాడు.

కానీ మనిషి మనసు చంచలం. 
చపలం. స్థిరంగా ఒకచోట ఉండదు. 
లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు. 

అందుకే శంకరభగవత్పాదులు

*ఓ పరమేశ్వరా!*🙏🙏🙏 

*నా మనసు ఒక కోతి వంటిది. 
అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది.

*భార్యాపుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. 

*క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది.

*అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను.*🙏🙏🙏 

*దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో అని ప్రార్థిస్తారు.*


సామాన్య భక్తులను తరింపజేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది.

*ఓ పరమేశ్వరా!*🙏🙏🙏

*బంగారుకొండ మేరుపర్వతమే 
నీ చేతిలో ఉంది.* 
*అపార ధనవంతుడైన కుబేరుడు* 
*నీ పాదదాసుడై ఉన్నాడు.* 
*కల్పవృక్షం,* 
*కామధేనువు,* 
*చింతామణి*
నీ ఇంటిలోనే ఉన్నాయి.
*షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు.*

*సమస్త మంగళాలనూ కలిగించే పార్వతీదేవి సర్వమంగళయై నీ పక్కనే ఉంది.* 

*కనుక నీకు నేనేమీ ఇవ్వలేను.* 
*నా దగ్గర ఉన్నది ఒక్క మనసే.* 
*అది నీకు సమర్పిస్తున్నాను!*🙏🙏🙏


అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు.

🕉️ *సర్వేజనా సుఖినోభవంతు* 🕉️

Saturday, March 23, 2024

భగవద్గీత చెప్పిన అభ్యుదయ సిద్ధాంతం.*

 *ఎవరిని వారే ఉద్ధరించుకోవాలీ.* 

*భగవద్గీత చెప్పిన అభ్యుదయ  సిద్ధాంతం.* 

ఆత్మోద్ధరణ చెందాలంటే సప్త సూత్రాల ఆలంబనగా సాధకులు ముందడుగు వేయాలి. 

ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. 

చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం.

ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు.

అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. జీవన పరివర్తనకు, ఏకత్వం నుంచి అనేకత్వానికి కొనసాగించే మధుర యాత్ర- ఆధ్యాత్మిక చింతన. 

సప్త సూత్రాల సమన్వితంగా ప్రతి వ్యక్తిలో ఆధ్యాత్మికత దీప్తిమంతమవుతుంది. 

నిశిత దృష్టి, నిజాయతీ, నిశ్శబ్దం, నిర్మోహం, నిర్భయం, నిరంతర చింతన, నిర్విచారం- అనే ఏడు అంశాల ప్రాతిపదికన ఆధ్యాత్మిక ప్రగతి ప్రణాళిక ఆవిష్కారమవుతుంది. 

ప్రతి వ్యక్తికీ సమున్నత ఉపకరణం బుద్ధి. కర్మల్ని అనుసరించి బుద్ధి ఆకృతి దాలుస్తుంది. అల్ప బుద్ధులతో అనల్పమైన విషయాల్ని సాధించడం అసాధ్యం. 

విశాల దృక్పథం, సద్బుద్ధి, సాత్విక దృక్కోణం వ్యక్తుల్ని ఆదర్శమూర్తులుగా ప్రకటిస్తాయి. వీటిని సాధించాలనే లోతైన దృష్టి అవసరం. 


నీతి నిజాయతీలనేవి బాహ్యంగానే కాదు. ఆంతరంగికంగా ఎవరికి వారు ప్రదర్శించినప్పుడే ఆధ్యాత్మికత స్వచ్ఛ స్ఫటికంగా ప్రకాశిస్తుంది.

సంకుచిత భావనలను విడనాడి, సంఘర్షణాత్మక వైఖరిని నిలువరించి స్పష్టతతో మసలుకోవాలి. 

‘నిశ్శబ్దం నిండిన హృదయం పరమాత్మకు నెలవు’ అన్నారు రామకృష్ణ పరమహంస.

మనసులో అలజడులనే సవ్వడులు లేకపోతే, ప్రతి మదీ మందిరమైమంగళదాయకమవుతుంది.



శాంతి నిండిన మనసు ఆహ్లాదభరితమై, ఆధ్యాత్మిక వనమై గుబాళిస్తుంది. రాగద్వేషాలకు అతీతంగా మసలుకోవడం ఆధ్యాత్మిక పయనంలో ముఖ్య సూత్రం.

ప్రతికూలతల్ని అధిగమించి, విపరీత శక్తుల్ని ఎదుర్కొని సమదర్శనంగా ప్రగతి బాటలో ప్రయాణం చేసినప్పుడు మనోహరమైన మజిలీలు మనల్ని పలకరిస్తాయి.

నిర్మోహంగా వ్యవహరించడం ద్వారా జీవన్ముక్తుడై సాధకుడు ఆధ్యాత్మిక జగత్తులో ప్రకాశిస్తాడని జగద్గురు ఆదిశంకరులు పేర్కొన్నారు.

స్వపరభేదాలు లేని సమ్యక్‌ దృష్టి, సమగ్రభావన వ్యక్తుల్ని విలక్షణంగా తీర్చిదిద్దుతాయి. 

‘అనవసర భయాలతో జీవితాన్ని కుంగదీసుకోవద్దు. జీవితం అనేది భయపడటానికి కాదు. 

జీవన మధురిమల్ని సదా ఆస్వాదించడానికి’- అంటారు శ్రీఅరవిందులు. 

ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరం ఆధ్యాత్మిక చింతనలో ఎల్లప్పుడూ అభిలషణీయం.

పిరికితనం అనేది మరణంతో సమానమని వివేకానందుడు చెప్పిన హితోక్తి.

జీవనయాత్రలో ఎదురయ్యే ప్రతి సంఘటననూ దైవం నిర్దేశించినదిగానే స్వీకరించాలి.

ధైర్యం,సాహసంఅనేవివ్యక్తులకు సహజ భూషణాలుగా అమరినప్పుడు వాళ్లు తేజోమూర్తులుగా ప్రకాశిస్తారు.

స్వేచ్ఛ

 .                  *స్వేచ్ఛ*
.                 ********

     వచ్చిన మన స్వేచ్ఛా స్వాతంత్ర్యం
       నచ్చిన మన ఇచ్ఛా గణతంత్రం
     నేర్పును సుఖముగ బ్రతికే తంత్రం !
     ఎందుకు మనలో ఏదొ కుతంత్రం ?!

      మన యీ పవిత్ర భరతావనిలో
      సత్కీర్తుల దీప్తుల మధువనిలో
       శ్రేయస్కర సంపాదన పనిలో
     అనుభవ సంభవ సరసామనిలో

     మనసు తరించగ ఇట కొనసాగగ
         ఒకరికొకర మాసరగా ఏగగ
      కలసి ఉంటెనే కలదు సుఖమ్మని
     అదే మనకు నిజమైన స్వేచ్ఛయని

     " కష్టేఫలే " అనె నానుడి తలనిడి
  అనుదినమటునిటు వడి వడి అడుగిడి
         ఆకలి కేకల నెఱుగని  పచ్చని
     పగ సెగలెఱుగని మనుగడె స్వేచ్ఛని

    అపుడే ఎపుడూ మన భవితవ్యము 
   చెలిమి కలిమితో ప్రియ సాంగత్యము
  కొనసాగును గద మన జన గుణములు
 చనువుల మనువుల శుభగృహ సీమలు.

   ఇదియే కద మన నిజమగు స్వేచ్ఛ.
   సమాజమున మన ఇంటా రచ్చా
    ‌సంకట రహితముగా నిశ్చింతగ
   నిరాటంకముగ బ్రతుకగ నెంచగ.

         ********************
రచన :---- రుద్ర మాణిక్యం.(✍️కవి రత్న)
   రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)

*************************************

శీర్షిక : *అచ్చుల గేయం ( *బాల *గేయం*)

 శీర్షిక  :  *అచ్చుల గేయం ( *బాల *గేయం*)
రచన: మిడిదొడ్డి చంద్రశేఖరరావు

*అఆ*  అ  అంటే  అమ్మ 
            అమ్మతోనే అన్ని
            అ  అంటే  అవని
            అవని లేకుంటే ఏమి లేదు
            ఆ  అంటే  ఆనందం
            ఆనందమే ఆరోగ్యం
            ఆ  అంటే  ఆకాశం
            ఆకాశం స్థాయికి ఎదగాలి 
            ఆ  ఆవేశం మాను 
*ఇఈ* ఇ  అంటే ఇష్టం
            ఇష్టపడి పని చేయ్
            నిన్ను  నీవే  ఇష్టపడు 
            ఈ  అంటే  ఈర్ష్య 
            ఈర్ష్యను  ఈడ్చి కొట్టు 
            ఈశ్వరుని  నువ్వు  పూజించు
            ఈత నేర్చుట మంచిది
*ఉఊ* ఉ అంటే  ఉన్నతం
          ఉన్నంతలోనె  నువ్వు  సర్దుకో 
          ఉబలాటాలు అధికం చేటు
          ఊ  అంటే  ఊహ
          ఊహలు  మంచిగ  ఊహించు
          ఊతం ఇచ్చిన వారిని మరవకు గౌరవించు
ఋ* ఋ  అంటే  ఋతువు 
         ఋతువులు  ఆరని  తెలుసుకో 
         ఋగ్వేదం  దేవ వేదం 
         ఋషులను  చూసి  నేర్చుకో 
         ఋణం ముప్పు తెలుసుకో
*ఎఏ* ఎ  అంటే  ఎదగడం
           నీకు  నీవే  నేర్చుకో 
           ఎంత ఎత్తుకు ఎదిగిన గతాన్ని మరవకు
         ఏ  అంటే  ఏకాగ్రత 
         ఎన్నడూ  నువ్  కోల్పోకు
         ఏ మార్పు మానుకో అది చేటు 
*ఐ*   ఐ  అంటే  ఐక్యం 
         ఐక్యంగా  నువ్  మెలుగు
         ఐక్యతే  మంచిగుణం 
         ఐకమత్యమే  మహాబలం
         ఐక్యత కోసం పోరాడు
*ఒఓ* ఒ  అంటే  ఒంటరి 
        ఒంటరితనం జయించు
        ఒడిదుడుకులు  సహజం 
        ఓ  అంటే  ఓటమి 
        ఓటమిలో  నువ్  కృంగకు
        ఓర్మితో మెలుగు
*ఔ* ఔ  అంటే  ఔనని 
        ఔననడం   మంచిదే 
        ఔనని  అనకు  అన్నిటికీ 
       కాదనడం  కూడా  నేర్చుకో
        ఔనత్యముతో మెలుగు
*అం* *అః* అం  అంటే  అందరం 
అందరు  బాగుండాలి 
అందరూ మంచిగా ఉండాలని 
కోరుకో
అందుకే మనమందరం 
అః అః అంటూ ముందుకు కదులుదాం 
అహర్నిశలూ   శ్రమించాలీ ఆనందంగా ఉండాలి

యం. చంద్రశేఖర్.

నిశ్శబ్దం!!!

 నిశ్శబ్దం!!!
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

అమ్మానాన్నలకు మధ్య
నిశ్శబ్దం!!
ఎంతో దగ్గరగా ఎంతో సౌకర్యంగా
ఉన్నట్లు ఉంటుంది.!!

అమ్మానాన్నలకు మనకు మధ్య
నిశ్శబ్దం!!
ఎంతో దగ్గరగా ఎంతో సౌకర్యంగా
ఉన్నట్లు ఉంటుంది.!!

ఇద్దరు స్నేహితుల మధ్య
ఇద్దరు ప్రేమికుల మధ్య
ఇద్దరు భార్యాభర్తల మధ్య
కూడా నిశ్శబ్దం!!
ఎంతో దగ్గరగా ఎంతో సౌకర్యంగా
ఉన్నట్లు ఉంటే!!

అంతకుమించిన బంధం-
అనుబంధం -సంబంధమే లేదు-
ఈ లోకంలో!!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా

కైతదార్లు

 *కైతదార్లు*

ఏశంమారి మోసంనేర్సి
బాస రుసి మార్న నాల్కె బొంకుడు నేర్సి
బదలు దెచ్చుకున నవ్వులు కుండపోతోలె కుర్సి
ఆపచ్చన పెర్గిన మతి
కుతిదీరక పొగడ్తల ఊదుపొగ శాల్వలకు మరిగి
కైత రాతలన్ని సట్టకాతైంది
కైకిలి కవనదార్లకు గిట్టుబాటైదిగాని
జాతి  గోస గాసాన్ని ఉద్దెరకే కుద్వబెడ్తన్లు

ముసల్తనాన్కి మీసాలకు రంగేసి
వయ్సిమీద బమను బైటవడకుండ
పెండ్లి సుాపులమురిపెం
అసలు బత్కు రాతలు పట్నం వల్సల పురిటినొప్పులు

చీకటి కాల్చె పొద్దుకొర్రయి పుట్టుకను తేలకుంటజేసి
పల్సబడ్డ పొత్తం సెత్రికింద సలికి వన్కుతుండ్రు

 సక్కదనపు కోడల్కు ఊరుకప తిరిగి పోవాలని నీతిజెప్పి
అత్త పట్నంతీర్న సింగారానికోయినట్టు
బుద్ధిగల్లెద్దు సేంన్లవడి కోతకచ్చి పంట కడ్పునిండమేసిందంట

పిర్రలొత్తకపోని మెత్తసీటుకింద ముండ్లుగుచ్చినని తంతె మీదున్నోని ఎతలే కత లని రాతరాస్తుండ్రు కైతదార్లు

దొరగడీలెక్కున్న అపార్ట్మెట్ల బవంతుల బజనెంతకాలం 
బజార్నపడ్తేంది బల్మీటికైనా పట్నం బాసింగంనిడ్సి
పల్లెబత్కుచరితరాయి
పుట్లకొద్ధి లైకులు పొతం పంటకో గిట్టుబాటు రాకున్న సాహిత్యసాగుదారివైతవు సాలు కైతదారి

డా.మహేందర్ కట్కుారి

కవిత్వం పై ప్రముఖుల వ్యాఖ్యలు....

 ఒక కవి గతం, వర్తమానం మరియు భవిష్యత్తును మిళితం చేసి ఎప్పటికీ నిలిచిపోయే కవిత్వాన్ని సృష్టిస్తాడు. హృదయానికి అర్థమయ్యే భాష కవిత్వం మాత్రమే. ఈ ప్రత్యేకమైన రోజున ఒక కవిత వ్రాయండి మరియు మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకొండీ. కవి మిత్రులకు ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు 2024!

     🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

• కవిత్వం పై ప్రముఖుల వ్యాఖ్యలు....

కవిత్వ మొక తీరని దాహం --శ్రీశ్రీ

ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే--శ్రీశ్రీ

వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం --గుర్రం జాషువా

అబద్ధాలాడడమంత సులభం అవదు సుమూ! కవిత అల్లడం---దాశరథి కృష్ణమాచార్య

ఒకరు రాయమంటే రాయునది కవిత్వం కాజాలదు ఆకలియే కవిత్వం, ఆలోచనయే కవిత్వం, కదిలించే ఘటనలు మరియు కవ్వించే ప్రతినలు కవితకు ప్రతిపాదికలు
.....
నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన. 
.....
ప్రపంచవ్యాప్తంగా కవిత్వాన్ని చదవడం, రాయడం మరియు బోధించడం ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
.....
భావాలను, ఆలోచనలను అద్వితీయంగా, అందంగా వ్యక్తీకరించే మార్గం కవిత్వం. ఇది చాలా కాలంగా ఉంది. తెలిసిన మొదటి పద్యం, "గిల్గమేష్ యొక్క ఇతిహాసం" సుమారు 4,000 సంవత్సరాల క్రితం బాబిలోన్‌లో కనిపించింది. సంవత్సరాలుగా, నిర్మాణాత్మక సొనెట్‌ల నుండి స్వేచ్ఛా-రూప వ్యక్తీకరణల వరకు వివిధ రకాల కవిత్వం అభివృద్ధి చెందింది.
......
కవులను స్మరించుకోవడానికి మరియు కవిత్వ పఠన అభ్యాసాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం మార్చి 21 న ప్రపంచ కవితా దినోత్సవం జరుపుకుంటారు. కవిత్వం అనేది రచయితలకు లోతైన అనుభూతిని, అనుభవాలను మరియు ఆశలను వ్యక్తీకరించే సామర్థ్యాన్ని అందించే సృజనాత్మక రూపం. దానిని సాధనంగా ఉపయోగించుకుని కవులు అణచివేతకు ప్రతిఘటనను అందించి సమాజానికి అద్దం పట్టవచ్చు. అందువలన, పదబంధానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది.
.....
యునెస్కో ప్రకారం, ఈ రోజు సాంస్కృతిక, భాషా వ్యక్తీకరణ మరియు గుర్తింపు కోసం మానవత్వం యొక్క అత్యంత విలువైన వ్యక్తీకరణలలో ఒకదానిని జ్ఞాపకం చేస్తుంది. కవిత్వం ద్వారా భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడం మరియు అంతరించిపోతున్న భాషల దృశ్యమానతను పెంచడం లక్ష్యం.
.....
ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ (UNESCO) 1999లో తన 30వ జనరల్ కాన్ఫరెన్స్‌లో మొదటిసారిగా ప్రపంచ కవితా దినోత్సవాన్ని ప్రకటించింది, ప్రజల మనస్సులలోని సృజనాత్మక స్ఫూర్తిని సంగ్రహించడంలో, సాంస్కృతిక వైవిధ్యాన్ని పెంపొందించడంలో కవిత్వం యొక్క ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించే ఉద్దేశ్యంతో, మరియు సంభాషణ మరియు శాంతిని ప్రోత్సహించండి.
ప్రాచీన కాలం నుండి, రవీంద్రనాథ్ ఠాగూర్, కబీర్, రాంధారీ సింగ్ దినకర్, కాళిదాసు, భారతిదాసన్, అలెగ్జాండర్ పుష్కిన్ మరియు TS ఎలియట్ వంటి కవులు పాఠకులను ఆకర్షించడానికి, కదిలించడానికి మరియు మార్చడానికి కూడా దోహదపడ్డారు. కవిత్వ సంరక్షణ వివిధ భాషలు మరియు నాగరికతల పరిరక్షణను ప్రోత్సహిస్తుంది, అలాగే ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించడం.

• ప్రాచీన తెలుగు కవులు-కవిత్వ తత్వము...

తెలుగు సాహిత్యానుశీలనకు విమర్శ సిద్ధాంతాలుగా ఇంతవరకు సంస్కృతాలంకారికుల సిద్ధాంతాలే ఆధారమయ్యాయి. కావ్యాన్ని, కవిత్వ తత్వాన్ని, కావ్య హేతువులను, కావ్య ప్రయోజనాలను సంస్కృతాలంకారికుల దృష్టితోనే పరిశిలించే దశ ఇప్పుడు కూడా ఉంది. దీనికి కారణం తెలుగులో సమగ్రమైన కావ్య తత్వ శాస్త్రాలు లేకపోవడమే. ప్రసిద్దులైన తెలుగు సాహిత్య విమర్శకులు సంస్కృత లక్షణ గ్రంథాలమీదే ఆధారపడి విమర్శ సిద్దాంతాలను వెలయించారు. దీనికి కారణం దాదాపుగా ఆధునిక యుగం వచ్చే వరకు తెలుగు సాహిత్యం సంస్కృత సాహిత్యం మీదనే ఆధారపడి ఉండడమే. ప్రతి కావ్యము మార్గ రీతిలో రచింపబడడమే. సంస్కృత భాషా సాహిత్యాలు తెలుగు భాషా సాహిత్యాలపైన గాఢమైన ప్రభావాన్ని చూపడమే.
.....
తెలుగు కవులు తమ కావ్య అవతారికలలో తమ కవిత్వాన్ని గురించి వివరించే దశలో కొన్ని సిద్ధాంతాలను  కూడా చేశారు.

మహమ్మద్ గౌస్

లోకం ! ఈ లోకంలో మనం !

 .    *లోకం ! ఈ లోకంలో మనం !*
.   ***************************

  అనంతమైనది ఈ సువిశాల ఆకాశం !
  ఐనా అందులో కొంతే మనకవకాశం !
  ఏమిటో ఏమో మన ఇప్పటి రోజులు !
  తీర్చుకొనుటకే  మన నాగరిక మోజులు !
    ఎవరి జీవితం ఎపుడెటులవునో !
     ఎవరికెవరు ఏమౌతు ఉందురో !
      ఎల్ల కాలముండనిది జీవితం !
     ఎపుడెవ్విటికో ఇది ప్రభావితం !

    మంచికొ చెడుకో తెలియదు కానీ
  బ్రతుకున ఎన్నో మార్పులు చేర్పులు !
    అందులొ కొన్నీ స్వయంకృతమైతే
    మన ప్రమేయమూ లేనివి ఎన్నో !

  ప్రపంచమున మన తీరు తెన్నులూ
 ఒకలా ఉండవు మనసులు మనువులు !
   ఇంతేగా మన గతులు సంగతులు !
మన మతుల స్మృతులు సంస్కృతులు !
సమ్మతులూ ! ఇంకెన్నో అసమ్మతులూ !
ఇష్టాలూ, ఆయిష్టాలూ ! మిత్ర శత్రుత్వాలూ !
కుటుంబాలు, బంధువులు, ఇతరులూ
చచ్చిన పిదప వీరందరు మాయం !

      కాలం ఎపుడూ అసలాగనిదీ !
       కలకాలం ఆగక కొనసాగేదీ !
   మన జీవన గమనం ఎపుడో ఆగేదీ !
 పుట్టితి మెపుడో ! బ్రతికేదిపుడూ చచ్చేదెపుడో !
ఒడుదొడుకుల ఈ జీవన పయనం  ఎన్నాళ్ళో !?
ఇంతకె మనలో స్వార్థం, తలబిరుసుతనం !
    పెడదారిన బడుతూ తిరిగెడి వైనం !
    చాలు చాలు ! మారుమ ఇకనైనా !

  మంచిని ఆశ్రయించి బ్రతికి తరించుమ !
        పదుగురితో నీ స్నేహశీలతే
     కృషి, పట్టుదల, సమాలోచనలే
  చక్కని సుగతీ, ప్రగతుల బాటగునులె !

             ఇది మనది విధి !
         సద్గతుల సారథ్యమిది !
         ఇదే సంతృప్తుల సన్నిధి !
        ఇదే స్వర్గ సోపాన వారధి !

        **********************
రచన:---రుద్ర మాణిక్యం.(✍️కవి రత్న)
   రిటైర్డ్ టీచర్.   జగిత్యాల (జిల్లా)

************************************

ఇది కవిత కాదు!!

 ఇది కవిత కాదు!!
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

అది మృగమే
కానీ ఖడ్గ మృగం కాదు!!

అది ఆసనమే
కానీ సింహాసనం కాదు!!

అది వరమే
కానీ స్వయంవరం కాదు!!

అది దానమే
కానీ నీ దానం కాదు!!!

అది మరణమే
కానీ ఆభరణము కాదు!!

అది ప్రేమే
కానీ పాము కాదు!!

అది పాపే
కానీ పాపం కాదు!!
వాళ్లు నాయకులే
కానీ వినాయకులు కాదు!!

అది స్వప్నమే
కానీ స్వప్న కాదు!!
అది నిప్పె
కానీ ఇది ఉప్పు కాదు!!

అది నిజమే
కానీ వజ్రం కాదు!!
అది మర్మమే
కానీ ధర్మం కాదు!!

అది అందమే
కానీ శ్రీ గంధం కాదు!! Hi

ఆమె స్త్రీ యే
కానీ శ్రీ కాదు!!
ఆమె కవితే
కానీ ఇది కవిత కాదు!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.

మన అసలైన జీవన వైఖరి

 .     *మన అసలైన జీవన వైఖరి*
.     **************************

    నీ వయసెంత ? నీ ఆస్తి ఎంత ?
                                అవసరం లేదు. 
నీవు సంపాదించుకున్న కీర్తి ఎంత 
                   ఎటువంటిది అనేదే అవసరం.

 నీ పుట్టుకతో మరణంతో అవసరం లేదు.
నీకున్న జ్ఞానం, విజ్ఞానం వాటి ఆచరణతో
                                                అవసరం.

   నీవు ఆడా ! మగా ! అవసరం లేదు.
నీ లోని మనసు, మమతలు అవసరం.

   నీవు ఎవరివో అవసరం లేదు.
ఇతరుల ఎడ నీ ప్రవర్తన అవసరం.

నీవు తింటున్నావో పంటున్నావో
                                అవసరం లేదు.
నీవు ఉండే తీరు తెన్నులు అవసరం.

నీవు చేస్తున్న పనితో అవసరం లేదు.
నీవు చేస్తున్న పనిలో నిపుణత
                       ఎంతుందో అవసరం.

నీ శరీర అందచందాల గురించి
                                అవసరం లేదు.
నీ ఆలోచనా వైఖరి ఎలాంటిదో అవసరం.

నీవు ఎలా జీవిస్తున్నావో అవసరం లేదు.
ఇతరులతో నీకు గల స్నేహం ఎలాంటిదో
                                          అవసరం.

నీ బంధువులు, మిత్రులు ఎవరో ఎందరో
                                  అవసరం లేదు.
వారు ఎలాంటి వారు అనేది అవసరం.

  నీవున్న చోటుతో అవసరం లేదు.
అక్కడ ఉన్న నాగరికత ఎలాంటిదో
                                        అవసరం.

నీవు నిరుపేదవో ధనవంతుడివో
                              అవసరం లేదు.
నీకున్న సంతోషం, సంతృప్తి ఎంత
                              అనేది అవసరం.

నీవు దేవునికి చేస్తున్న పూజ ఏమిటో
                                   అవసరం లేదు.
నీ సద్గుణం, సత్ప్రవర్తన, భక్తి ప్రపత్తులే
                                    అవసరం.

నీవు , నీ తల్లిదండ్రి ఎవరో అవసరం లేదు.
నీవెవరో ! నీ జన్మం ఏదో తెలిసి మసలుటే
                                         అవసరం.

మన సంతోష సంతృప్తికర జీవన విధానానికి
ఇవే మన జీవనంలో అవసరాలు.   
                                      అనుసరణీయాలు.

          ********************
  రచన :---- రుద్ర మాణిక్యం.(✍️కవి రత్న)
   రిటైర్డ్ టీచర్.      జగిత్యాల (జిల్లా)

*************************************

Saturday, March 16, 2024

ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది కాదు. ఏలా స్నేహం చేస్తున్నాం అనేది ముఖ్యం.

 ఓ పులి కుక్కతో సావాసం చేసింది. స్నేహంలో కుక్క పులిని ఏరా, ఆరేయ్ అని పిలుస్తుఉండేది. ఇది వింటున్న సమాజం పులిని చులకనగా చూడటం మొదలు పెట్టింది.
పులి తన గౌరవం కోసం కుక్కతో ఎందుకు సావాసం చేసానురా అని బాధపడుతూ కుక్కతో స్నేహం తగ్గించింది. తన మిత్రుడి బాధను కుక్క ఇది గ్రహించింది. పులితో కుక్క గౌరవంతో మాట్లాడటం ప్రారంభించింది. పులికి ఆశ్చర్యం కలిగింది. నేను నీతో ఏమి చెప్పలేదు అయినా నువ్వు నా సమస్య తెలుసుకుని దాన్ని నువ్వే పరిష్కారం చేసావ్. ఇది ఎలా సాధ్యం అని అడిగింది. అప్పుడు ఆ కుక్క పులితో ఇలా చెప్పింది.
"నువ్వు సమాజం కోసం బ్రతుకుతున్నావు. నేను స్నేహం కోసం బ్రతకుతున్నా."
ఇది విన్న పులికి నోట మాట రాలేదు. తన తప్పు తెలుసుకుని పులి చింతిస్తూ కుక్కని అక్కున చేర్చుకుంది.
ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది కాదు. ఏలా స్నేహం చేస్తున్నాం అనేది ముఖ్యం.
 *ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే కొండపైన కొలువున్న దైవ దర్శనం అయినట్లు, మనలో ఉన్న దైవ స్వరూపం సాక్షత్కరించాలి అంటే కూడా గర్వం, అహంకారం, అసూయ, కోపం, చిరాకు, వ్యక్తి దూషణ, ద్వేషపు భావజాలం లాంటి ఎన్నో బలహీనతలను దాటి సాటి మనిషిలో కూడా ధైవాన్ని చూడగలిగే ప్రేమ  స్వరూపుడివి నువ్వు కావాలి. నీ మనస్సు సాటి మనిషిని ప్రేమించలేక పోతే నీ దైవ దర్శనం ఎన్నటికీ పూర్తి కాదు! ✍️*

నిజమైన స్నేహితులు.*

 *మన కష్టాలను చూసి దూరంగా పోయేవాడు కాదు అసలైన మిత్రుడంటే, మన బాధలను చూసి, నేనున్నానంటూ దగ్గరికి వచ్చేవాడే నిజమైన మిత్రుడు. తాను కష్టాల సముద్రంలో మునుగుతున్నా తన వారిని తీరానికి చేర్చడానికి ప్రయత్నించే వాడే నిజమైన స్నేహితుడు. నవ్వు వెనుక బాధను మౌనం వెనుక మాటలను, కోపం వెనుక ప్రేమను అర్థం చేస్కొనే వాళ్ళే నిజమైన స్నేహితులు.*

మళ్ళీ ఆ రోజులు వచ్చేనా?

 *_మళ్ళీ ఆ రోజులు వచ్చేనా?_*
☹️☹️☹️☹️☹️☹️☹️☹️

*పరీక్షలయిపోయి వేసవి సెలవులు వస్తున్నాయంటే మహా సంబరం. దాదాపు నెలా పదిహేను రోజులు. ఎంత ఆనందం? ఇప్పటిలా దూర్దర్శన్ కార్యక్రమాలూ, స్మార్ట్ ఫోన్ లూ, డొరేమాన్ లూ ఏవీ ఉండేవి కావు.   ఎండలో బయటికి తిరగవద్దనీ అమ్మ ఆంక్ష. అయినా స్నేహితులందరం ఒక చోట చేరి చింతపిక్కలు, వామనగుంటలు, గవ్వలతో ఆటలు, ఇంకా వైకుంఠపాళి మొదలైన ఆటలతో సాయకాలమయుపోయేది. అమ్మ పెట్టిన ఏదో చిరుతిండి తిని కాసిని పాలు తాగి, ఆ వీధులోనే ఉన్న స్నేహితుల ఇళ్ళకు  పోయి ఉయ్యాలలూగడం, ఒప్పులకుప్పలు తిరగడం, తొక్కుడు బిళ్ళ ఆడుకోవడం ఓహ్. ఎంత సరదాగా ఉండేది. ఆటపాటలతో అలసి ఇంటికి వెళ్ళి కాసేపు ఏ చందమామో, బాలమిత్రో చదువుకుని అన్నం తిని పడుకునేవాళ్ళం. ఇప్పటి లా అర్ధరాత్రిదాకా మేలుకోవడం పొద్దెక్కినదాకా పడుకోవడం సెలవులయినా ఉండేది కాదు. ఆ రోజులు వేరు. ఒకోసారి సాయంకాలాలు పిల్లలందరం కలిసి పాటలు పాడుకోవడం, కథలు చెప్పుకోవడం, ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ గడిపే వాళ్ళం. ఒకోసారి మా నాన్నగారు బీచ్ కి తీసుకెళ్ళేవారు. అక్కడ కెరటాలతో ఆడుకోవడం, తరువాత ముంతకింద పప్పు తింటూ నాన్నగారు చెప్పే మంచి మంచి విషయాలు తెలుసుకుని ఆనందంగా ఇంటికి చేరేవాళ్ళం. అలసి పోయి కమ్మగా నిద్రపోయేవాళ్ళం. మరో ఆదివారం దగ్గరలో ఉన్న మామిడితోటకి తీసుకు వెళ్ళేవారు. ఇంటినుంచి ఒక చాకు, ఉప్పు కారం పొట్లాం కట్టి తీసుకుని వెళ్ళేవాళ్ళం. అక్కడ తోటమాలి నడిగి  నాన్నగారు మామిడికాయలు తెచ్చెవారు. అవి ముక్కలు చేసుకుని ఉప్పు కారం అద్దుకుని తింటుంటే ఎంత బాగుండేదో.. ఆ తోటలో కోతి కొమ్మచ్చి, దాగుడు మూతలు ఆటలు ఆడుకునే వాళ్ళం. అవన్నీ మథురస్మృతులుగా జ్ఞాపకాల పుటలలో కనిపిస్తూ ఉంటాయి.*

*ఇంక సెలవులు పూర్తి అయి పాఠశాలలు తెరుస్తారంటే అదో సరదా..పై తరగతికి వెళ్ళడం, కొత్త పంతులమ్మలు, కొత్త పుస్తకాలు, కొత్తగా ప్రవేసించిన విద్యార్ధుల పరిచయాలు మహదానందంగా ఉండేది. నాన్నగారు కొత్త తరగతి పుస్తకాలు కొని తెచ్చి వాటికి తీరువుగా అట్టలు వేసి, లేబిల్ అంటించి అందంగా నా పేరు, సబ్జెక్ట్ పేరు, తరగతి రాసి పెట్టేవారు. ఆయన అట్టలు వేస్తుంటే పక్కన కూచొని, కొత్త తరగతి, కొత్త స్నేహితుల గురించి ఎన్నో కబుర్లు చెప్తూ ఉండే దాన్ని. అన్నీ ఓపికగా, ఆసక్తిగా వినేవారు. ఇప్పటిలాగ పుస్తకాలూ, అట్టలూ అన్నీ పాఠశాల యాజమాన్యమే ఇవ్వడం, అమితంగా డబ్బు వసూలు చెయ్యడం ఉండేది కాదు. మా నాన్నగారు తెల్లకాయితాలు తెచ్చి అవి చక్కగా కుట్టి రూళ్ళకర్రతో రూళ్ళు గీసి రఫ్ పుస్తకాలకని ఇచ్చేవారు. కొత్తపుస్తకాల సువాసనని ఆస్వాదిస్తూ ఆ పుస్తాల మధ్య నెమలి కన్నులు దాచుకునేవాళ్ళం. వాటికి మేత కూడా పెట్టేవాళ్ళం. అదో పిచ్చి. అమ్మావాళ్ళు ఆవకాయలు పెట్టడం, అదో సందడి. నాన్నగారు కాయలు కోస్తే అమ్మ అన్నీ కలిపి ఆవకాయ పెట్టేది. పనంతా వాళ్ళు చేసుకుంటే మేము ఆ ముక్కలు పట్టుకుపోయి ఉప్పు కారం వేసుకుని తింటుండే వాళ్ళం.*

*ఒప్పులకుప్పలు తిరగడం, ఉయ్యాలలూగడం, తొక్కుడబిళ్ళ ఒంటికాలితో గెంతడం, స్తంభాలాట ఇవన్నీ ఎదిగే పిల్లలకి మంచి వ్యాయామం. అందుకే అప్పుడు స్థూలకాయాలు ఉండేవి కావేమో. ఏమైనా అప్పటి రోజులే వేరు, ఆ ఆనందాలే వేరు. మళ్ళీ ఆరోజులు వచ్చేనా అనిపిస్తుంది.*
=================
*_{ఇదిసేకరణే : --వెలిశెట్టి నారాయణరావు👍}_*

రూ.100 ఇస్తే ఏం చేస్తావు? ఆ స్టూడెంట్ ఆన్సర్ కి టీచర్ ఫిదా..! 20 ఏళ్ల తర్వాత ఏమైందంటే?

 *రూ.100 ఇస్తే ఏం చేస్తావు? ఆ స్టూడెంట్ ఆన్సర్ కి టీచర్ ఫిదా..! 20 ఏళ్ల తర్వాత ఏమైందంటే?*
 

బయట జోరుగా వర్షం పడుతుంది.తరగతి గదిలో టీచర్ పాఠం బోధిస్తున్నారు. పిల్లలు శ్రద్దగా వింటున్నారు. కానీ వాతావరణం డల్ గా ఉండడంతో ఆ ఎఫెక్ట్ పిల్లల ముఖాల్లో కూడా కనిపిస్తుంది.వాళ్ల మైండ్స్ ని జనరేట్ చేయాలనే ఉద్దేశంతో  జేబులో నుండి వందరూపాయలు తీసి ఇప్పుడు నేను ఈ వందరూపాయలు ఇస్తే మీరేం చేస్తారు అంటూ ప్రశ్నించారు టీచర్.

నేను బొమ్మకారు కొనుక్కుంటా అంటూ మెరిసే కళ్లతో సమాధానం చెప్పాడొక విద్యార్ధి నేను ఫ్రెండ్స్ తో కలిసి సమోసాలు కొనుక్కుని తింటాను అంటూ పెదవులు తడుపుకుంటూ చెప్పాడు మరో విద్యార్ధి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం సర్,నేను ఆ డబ్బులతో క్రికెట్ బ్యాట్ కొనుక్కుంటాను అన్నాడు మరొక విద్యార్ధి.

*నేను మా అమ్మకి కళ్లజోడు కొంటాను* సర్ అని”  చివరగా ఒక విద్యార్ధి  సమాధానం ఇచ్చాడు *ఆశగా వందరూపాయల వైపు చూస్తూ. వెంటనే టీచర్ ఆ విద్యార్ధి వైపు తిరిగి , మీ అమ్మకి నువ్వెందుకు కళ్లజోడు కొనడం? ఆ పని మీ నాన్న చేస్తాడు. కాబట్టి ఈ వందరూపాయలతో నీకోసం నువ్ ఏం కొనుక్కుంటావ్ అని రెట్టించి అడిగాడు*

*నాకు మా నాన్న లేడు సర్,చనిపోయాడు.మా అమ్మ టైలర్ పని చేసి నన్ను మా చెల్లిని చదివిస్తుంది . బట్టలు కుట్టేటప్పుడు మా అమ్మ కళ్లు కనపడక చాలా ఇబ్బంది పడుతుంది* 
తను సంపాదించినది మా చదువులకి , తిండికే సరిపోవట్లేదు . అందుకే కళ్లజోడు కొనుక్కోవట్లేదు. మీరు ఈ డబ్బులిస్తే మా అమ్మకి కళ్లజోడు కొంటాను అంటూ మళ్లీ అడిగాడు ఆశగా.

*కుర్రాడి చెప్పిందంతా విన్నాక టీచర్ కళ్లు చెమర్చాయి . కన్నీళ్లను తుడుచుకుంటూ సరే ఇస్తాను, కానీ ఒక షరతు అంటూ ఆగాడు. చెప్పండి సర్ మీరేం చెప్పినా చేస్తాను , మా అమ్మకి కళ్లజోడు కొనిపెట్టడం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటూ హుషారుగా అన్నాడు*

*వందరూపాయలు ఆ కుర్రాడి చేతిలో పెడుతూ రేపు నువ్ పెద్దయ్యాక పెద్ద ఆఫీసర్ అవుతావు కదా ,అప్పుడు నాకు ఈ వందరూపాయలు తిరిగి ఇచ్చేయాలి ఇదే ఆ షరతు అన్నాడు. అంతేకాదు నువ్ జీవితంలో చాలా గొప్పవాడివి కావాలి,అవుతావు అంటూ దీవించాడు*

*ఈ సంఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఆ  స్కూల్ ముందు ఒక కార్ వచ్చి ఆగింది. ఆ రోజు కూడా వర్షం కురుస్తుంది పదిహేనేళ్ల క్రితం జ్ణాపకాన్ని కళ్లముందు నిలబడానికా అన్నట్టుగా. తరగతి గదిలో టీచర్ పాఠం చెప్తున్నారు*

*ఎక్స్క్యూజ్ మి సర్ అంటూ వినపడిన ద్వారం వైపు ఎస్ అంటూ సమాధానం *ఇస్తూ టీచర్ తలతిప్పారు. తనతో పాటు స్టూడెంట్స్ కూడానూ. మీరిచ్చిన వందరూపాయలు సర్ అంటూ , ఆ రోజు తన తల్లి కళ్లజోడు కోసం ఇచ్చిన వందరూపాయల్ని తిరిగిస్తూ ,*పాదాభివందనం చేసిన ఆ విధ్యార్ధి ఇప్పుడు *ఒక జిల్లా కలెక్టర్*

*అవును ఒక మనిషి ఎప్పుడూ తన కోసం కాకుండా తన దేశం *కోసం,తన కుటుంబం కోసం ఆలోచిస్తూ, దయాగుణం మానవతా హృదయం కలిగి ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతారు*
*మనలోని ఉన్నతమైన లక్షణాలు మనల్ని గొప్పగా ఎదిగేలా*,
మనలోని అవలక్షణాలే మనల్ని జీవితంలో పైకి ఎదగకుండా వెనక్కి లాగుతుంటాయి  అనడానికి
 *ఈ స్టోరి ఒక చక్కటి ఉదాహరణ*

జీవితం యొక్క వాస్తవికత మరియు సత్యం చాలా అందంగా వ్రాయబడింది. 👌👍😃 .... *యువకులు మరియు వృద్ధులు

 *నేను కుర్రాడిగా ఉన్నప్పుడు,*
 *నేను మేల్కొలపడం కష్టంగా అనిపించింది.*
 *నేను వయసులో ఉన్నప్పుడు,*
 *నాకు నిద్రపోవడం కష్టంగా ఉంది.*.

 జీవితం యొక్క వాస్తవికత మరియు సత్యం చాలా అందంగా వ్రాయబడింది.  👌👍😃 ....
 *యువకులు మరియు వృద్ధులు*

 *నేను కుర్రాడిగా ఉన్నప్పుడు,*
 *నా మొటిమల గురించి నేను ఆందోళన చెందాను.*
 *నేను వయసులో ఉన్నప్పుడు,*
 *నా ముడతల గురించి నేను చింతిస్తున్నాను.*

 *నేను కుర్రాడిగా ఉన్నప్పుడు,*
 *నేను ఒకరి చేయి పట్టుకోవడానికి వేచి ఉన్నాను.*
 *నేను వయసులో ఉన్నప్పుడు,*
 *ఎవరైనా నా చేయి పట్టుకుంటారని నేను ఎదురు చూస్తున్నాను.*

 *నేను కుర్రాడిగా ఉన్నప్పుడు,*
 *నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా వదిలేయాలని కోరుకున్నాను*
 *నేను వయసులో ఉన్నప్పుడు*
 *ఒంటరిగా మిగిలిపోవాలని చింతిస్తున్నాను*

 *నేను కుర్రాడిగా ఉన్నప్పుడు,*
 *నేను సలహా ఇవ్వడాన్ని అసహ్యించుకున్నాను.*
 *నేను వయసులో ఉన్నప్పుడు,*
 *మాట్లాడడానికి లేదా సలహా ఇవ్వడానికి ఎవరూ లేరు.*

 *నేను కుర్రాడిగా ఉన్నప్పుడు,*
 *నేను అందమైన విషయాలను మెచ్చుకున్నాను.*
 *నేను వయసులో ఉన్నప్పుడు,*
 *నేను నా చుట్టూ ఉన్న వస్తువులలో అందాన్ని చూస్తున్నాను.*

 *నేను కుర్రాడిగా ఉన్నప్పుడు,*
 *నేను శాశ్వతుడిని అని భావించాను.*
 *నేను వయసులో ఉన్నప్పుడు,*
 *త్వరలో అది నా మలుపు అని నాకు తెలుసు.*

 *నేను కుర్రాడిగా ఉన్నప్పుడు,*
 *నేను క్షణాలను సెలబ్రేట్ చేసాను.*
 *నేను వయసులో ఉన్నప్పుడు,*
 *నేను నా జ్ఞాపకాలను ఆదరిస్తున్నాను.*

 *నేను కుర్రాడిగా ఉన్నప్పుడు,*
 *నేను హృదయం - థ్రోబ్‌గా ఉండాలని కోరుకున్నాను.*
 *నేను వయసులో ఉన్నప్పుడు,*
 *నా గుండె ఎప్పుడు ఆగిపోతుందోనని నేను ఆందోళన చెందుతున్నాను.*

 *మన జీవితంలోని విపరీతమైన దశలలో,*
 *మేము చింతిస్తున్నాము కానీ మేము గ్రహించలేము,*
 *జీవితంలో అనుభవం ఉండాలి.*

 * ఇది చిన్నవారైనా లేదా పెద్దవారైనా పట్టింపు లేదు.  జీవితాన్ని ప్రేమతో మరియు ప్రియమైనవారితో జీవించాలి.  మీరు ఖచ్చితంగా వీరిలో ఒకరు.*

 * అద్భుతమైన సందేశం*😄

దాతృత్వం...!!

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                *దాతృత్వం...!!*
                  ➖➖➖✍️

*దాత పిసినారి. చచ్చినా భూమిపై దేన్నీ వదిలిపెట్టడు. అంతా దానం చేసి వెళ్ళిపోతాడు.*

 *పిసినారి గొప్ప త్యాగి. చచ్చిన తరవాత అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. తనవెంట ఏదీ తీసికొని వెళ్ళడు.*

*దాతను, పిసినారిని గురించి పూర్వకవులు చేసిన చమత్కార వ్యాఖ్య ఇది!*

*దానం చేయకపోతే మరుసటి జన్మలో దరిద్రం వస్తుందని, దానాలు చేస్తే తరవాతి జన్మలో సంపదలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతాయి.*

*దాతృత్వం అనేది నిజంగా ఒక గొప్ప గుణం. లోకంలో ఉదార చరితులైన మహాత్ములు ప్రాణులందరినీ తమవారిగానే భావించి దానాలు చేస్తారని, సంకుచితమైన మనసు కలిగిన అల్పులు మాత్రం ప్రాణుల్లో స్వపర భేదాలను సృష్టించుకొంటూ భేదభావం ప్రదర్శిస్తారని ప్రాచీన నీతి చెబుతోంది.*

*దానం చేసేవాడి చేయి ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది. యాచించేవాడి చేయి ఎప్పుడూ కిందనే ఉంటుంది.*

*ఇదీ దాతకు, యాచకుడికి ఉన్న తేడా!సముద్రం భూమి అంతా విస్తరించి ఉంది. కానీ ఏం లాభం? ఏ ప్రాణికైనా దాహం వేస్తే గుక్కెడు మంచినీళ్లను కూడా ఇవ్వలేదు.*

*ఎక్కడో మూలలో ఉన్న చేదబావి చిన్నదే. కానీ దాహం వేస్తే అందరూ ఆ చిన్నబావినే ఆశ్రయిస్తారు. దాత కూడా చేదబావిలాంటివాడే.* *              పిసినారి సముద్రంతో సమానుడు!*

*దానం చేయాలనే ఆలోచన రాగానే వెంటనే దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.*

*ఒక చేయినుంచి మరొక చేతిలోనికి తీసుకొనేలోగా బుద్ధి మారిపోవచ్చు. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానం చేయమంటాయి ధర్మశాస్త్రాలు!*

*అమోఘ దానశీలంతో చరిత్రలో నిలిచిపోయిన బలి, శిబి, దధీచి, కర్ణుల వంటివారు చేసింది అదేనని గ్రంథాలు చెబుతున్నాయి.*

*సంపాదించిన ధనానికి మూడే మార్గాలుంటాయి...*

*వాటిలో మొదటిది, శ్రేష్ఠమైంది దానమని,*

*రెండోది మధ్య మార్గమైన భోగమని, ఈ రెండూ చేయకపోతే*

*మూడో మార్గం నశించిపోవడమేనని భర్తృహరి సుభాషిత త్రిశతిలో అంటాడు.*

*కనుక దానం చేసి శ్రేష్ఠులుగా నిలిచిపోవాలని సందేశం. పాలు ఇవ్వడం ద్వారా గోవులు, ఫలాలను ఇవ్వడం ద్వారా చెట్లు... ఎప్పుడూ పరోపకారమే చేస్తాయి.*

*అలా జీవించడం ప్రశంసార్హం. తేనెటీగలు ఎంతో శ్రమించి, పుప్పొడులను సేకరించి తేనెలను దాచుకుంటాయి.*

*కానీ, ఏం లాభం? ఎంతగా దాచినా, ఆ తేనెలను మనుషులు దోచుకుంటారు. అవసరానికి మించి ఎంతగా దాచినా, అది పరుల పాలవుతుంది.*

*మనిషి తనకు సంపదలు పుష్కలంగా ఉన్నప్పుడే దానధర్మాలు బాగా చేయాలి. సంపదలు ఎప్పుడు నశించిపోతాయో ఎవరికీ తెలియదు.*

*అవి వ్యర్థంగా నశించిపోయాక విచారించి లాభం లేదు. కనుక కలిగి ఉన్నప్పుడే దానం చేయాలి.*

*ఆర్తులకు దానం చేయడం ఉపయోగం. అందుకే పాత్రోచిత దానం ఫలాన్నిస్తుంది. ఆకలిగొన్నవాడికి ఆహారం పెట్టాలిగాని, అజీర్ణమైనవాడికి ఆహారం పెడితే ఏం ప్రయోజనం?*

*పరోపకారం కోసమే మేఘాలు వర్షిస్తాయి. పరోపకారం కోసమే చెట్లు ఫలాలనిస్తాయి. పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తాయి. మనిషికి భగవంతుడు ఇచ్చిన అమూల్య శరీరమూ పరోపకారానికే ఉపయోగపడాలి.*

*బలవర్ధకాలైన ఆహారాలతో శరీరాన్ని ఎంతగా పోషించినా, శారీరక శక్తిని పరోపకారం కోసం వినియోగించకపోతే, కొవ్వు పెరగడానికి తప్ప దేనికీ ఉపయోగపడదు.*

*దాతృత్వం ఒక వరం. అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే లభిస్తుంది. ప్రపంచంలోని చరాచరాలన్నీ అనాదిగా అందిస్తున్న సంపదలే నేడు మనిషికి సౌఖ్యజీవన సాధనాలైనాయి.*

*చేసిన దానం తరతరాలూ చెరిగిపోకుండా నిలుస్తుంది. చివరికి మిగిలేది అదే..!!*✍️
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Friday, March 15, 2024

మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనకి మూడు లాభాలు కలుగుతున్నాయి.

 మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనకి మూడు  లాభాలు కలుగుతున్నాయి.```
మొదటిది:-*`మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది.```
. రెండవది:-`వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి.```
మూడవది:-ఈ శక్తులు మన వర్తమానం లోనూ భవిష్యత్తులోను గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తాయి.

ఈ పనే పాండవులు చేశారు. మనం మాత్రం ఎందుకు చేయకూడదు.మహర్షులు, యోగులు కర్మలనుండి ఎలా తప్పించుకోవాలా? అని ఎప్పుడు ఆలోచించలేదు. కర్మ క్షాళనం కోసం తపించారు. వారు అనుసరించిన పద్ధతినే మనం కూడా అనుసరించ వచ్చును.

మనం గత జన్మల్లో చేసుకున్న పాప రాశి కొండంత ఉంటుంది. దీనిని చాలా నెమ్మదిగాను, వాటినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చే జన్మలకి వాయిదా పడి ఇంకా జన్మలు పెరిగి పోతాయి.

 విష్ణుమూర్తి ద్వారపాలకులు అయిన జయవిజయులని “మూడు జన్మల్లో  హరి వైరులుగా మారి,  శ్రీహరి తో చంపబడి  వైకుంఠం చేరతారా? లేదా ఏడు జన్మల్లో  హరిభక్తులు గా జన్మించి వైకుంఠం చేరతారా?” అని అడిగితే వారు “ఏడు జన్మల హరి విరహం భరించలేము. ఏడు జన్మల సుదీర్ఘ కాలం భరించలేము” అన్నారు. మరి మనం మాత్రం మన కర్మాభారాన్ని కొద్ది జన్మల్లోనే వదిలించుకోవద్దూ? దీనికి మనం ఏమి చేయాలి. 
దీనికి శ్రీకృష్ణుడు ఒక మహాద్భుత మార్గాన్ని సూచించాడు.-జ్ఞాన యోగం: 37 శ్లోకం లో 
అర్జునా! బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలని ఏ విధంగా బూడిద చేయగలుగుతుందో, మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మలని బూడిద చేయగలుగుతుంది.”```

 *ఈ ఉపదేశం లో పరమార్ధం ఏమిటి?* 
జ్ఞానం మనలో  అగ్నిలా జ్వలిస్తే…  మన కర్మలు మనలని బాధించలేవు. మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే, ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ మనకి ప్రసాదించడానికి వచ్చారు.
మనం ఈ కర్మ రహస్యాన్ని...  జ్ఞానాన్ని పొందితే మన పెదవులపైన చిరునవ్వే ఉంటుంది కదా! కర్మలు వస్తాయి, మనలని చుట్టుముడతాయి. అవి మనపైన ఏ ప్రభావం చూపవు. జ్ఞానం చేత ఆ కర్మలు దగ్ధమవుతాయి.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

జీవితంలో ఏది సాధించాలన్నా ధర్మ బద్ధంగా కష్టపడి ప్రయత్నించాలి

 జీవితంలో ఏది సాధించాలన్నా ధర్మ బద్ధంగా కష్టపడి ప్రయత్నించాలి – రామాయణ, భారత, భాగవత, భగవద్గీత తదితర పురాణేతిహాసాలన్నీ నిర్ద్వందంగా చెప్పే విషయం ఇది. రాముడంతటి వాడే కష్టపడి యుద్ధం చేసి రావణ సంహారం చేసాడు. కృష్ణుడు మహావీరుడైన అర్జునుడికి గీతాబోధ చేసి మరీ 18 రోజులు యుద్ధం చేయించాడు. 

కానీ ప్రస్తుత సమాజంలో అందరూ రాత్రికి రాత్రే వారి కోరికలన్నీ తీరిపోయి, సిరి సంపదలు వచ్చే దారుల కోసం వెతుకుతూ జీవితమంతా వృధా చేసుకొంటున్నారు. ఎవరైనా మంత్రాలు, యంత్రాలు, తాయెత్తులు ఇస్తామంటే అప్పు చేసి మరీ వేలకు వేలు సమర్పించుకొని కొత్త కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు. 

పురాణాలన్నీ కాలక్షేపానికి చదువుతారు. అర్ధం చేసుకొనే ప్రయత్నం శూన్యం, ఆచరణ ప్రశ్నే లేదు. మాకూ పురాణాలు తెలుసనే విజ్ఞాన ప్రదర్శనలో, అహంకారంతో అర్దం లేని వాదనలు చేయడంలో ముందుంటారు. రాముడికీ, కృష్ణుడికీ తెలియని కిటుకులు, రహస్యాలు, విజయానికి దగ్గరి దారులు మనకు తెలిసిపోతాయనుకోవడం అమాయకత్వమా, మూర్ఖత్వమా? లేక మంత్రాలు, యంత్రాలు అమ్ముకొనే వారంతా విశ్వామిత్రుడు, వశిష్ఠుల వంటి మహర్షుల కన్నా గొప్ప గురువులని నమ్మకమా?

రాముడు, కృష్ణుడు అంత కష్టపడినా, వారికి విజయం చేకూరింది వారు దైవస్వరూపులనే  కారణంతో కాదు. వారి యుద్ధం, వారి ప్రయత్నం ధర్మబద్ధమైనది కనుక విజయం వారిని వరించింది. వారి విజయం దైవికం ఐతే యుద్ధం అవసరమే ఉండదు కదా?! అప్పుడు రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఏవీ ఉండేవి కావు.

వేదాలు, పురాణేతిహాసాల వంటి అఖండ జ్ఞాన నిధిని మహర్షులు మానవాళికి అందించింది వాటి ద్వారా మానవుడు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో నేర్చుకోవాలని. కానీ ఈ విషయం గుర్తించలేని నేటి మానవుడు, అసలైన ఆధ్యాత్మిక బాటను వదిలి, అజ్ఞానాంధకారాలతో తప్పుల మీద తప్పులు చేస్తూ - ఈర్ష్యాసూయలనే ముళ్ళు, తుప్పలు, నిండిన స్వార్థపు దారిలో అగాధం వైపే అడుగులు వేస్తూ పతనం అంచుకు చేరుతున్నాడు.

పతనం చెందకుండా కాపాడుకోవాలంటే ఉన్న మహత్తర అవకాశం, తక్షణ కర్తవ్యం - ఆధ్యాత్మిక బాటను చేరుకోవడం, ధర్మాచరణ చేయడం. అధర్మమైన, స్వార్ధపు కోరికలతో - దేవుడికి వింత మొక్కుబడులు, ఆర్భాటపు కానుకలు సమర్పిస్తూ దేవుడిని అపవిత్రం చేసి మరింత పాపం మూటగట్టుకొని, వంశంలో తరువాతి తరాలకు తగిలే శాపాలకు బాధ్యులు కాకుండా - వంశాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం! 

సర్వేజనాః సుఖినోభవంతు🌺🙏🏻🌸

మిమ్మల్ని అమ్మేసారు !... చెక్ చేసుకోండి మీ పిల్లల్ని హైదరాబాద్ లో, పెద్ద స్కూల్ లో చదివిస్తున్నారా?

 💥💥💥💥💥💥మిమ్మల్ని అమ్మేసారు !...  
చెక్ చేసుకోండి 

మీ పిల్లల్ని హైదరాబాద్ లో,  పెద్ద స్కూల్ లో చదివిస్తున్నారా?

అయితే ఒక సారి చెక్ చేసుకోండి . 
మీకు తెలియకుండా...  మిమ్మల్ని అమ్మేసి ఉండే అవకాశం  ఎక్కువ .

అదేంటి ? 
మాకు తెలియకుండా మమ్మల్ని అమ్మేయడం ఏంటి? అనుకొంటున్నారా ?
  అవునండీ ..
 మీకు తెలియకుండా మీరు రాబొయ్యే కొనేళ్లల్లో..  మీ బిడ్డ కోసం కట్టబోయే ఫీజు ను , మీ బిడ్డ విద్యను అమ్మేసారు .... అదీ విదేశీ కంపెనీ లకు .

హైదరాబాద్ లో కరోనా కాలం తరువాత నడుస్తోన్న ట్రెండ్ ఇదే .

హైదరాబాద్...  ఇంటర్నేషనల్ స్కూల్స్ కు , పెద్ద స్కూల్స్ కు ఎప్పటినుంచో ప్రసిద్ధి .

గత మూడు నాలుగేళ్లుగా విదేశీ కంపెనీ లు రంగ ప్రవేశం చేసి పెద్ద పెద్ద స్కూల్స్ ను కొనేస్తున్నాయి .

కొండాపూర్ లో ముప్పై ఏళ్లుగా పని చేస్తూ పేరొందిన ఒక ప్రముఖ స్కూల్ ను బ్రిటన్ కు చెందిన ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసింది .

హైదరాబాద్ లోని మరో ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్ ను హొంగ్ కాంగ్ కు చెందిన ఒక బహుళ జాతి కంపెనీ 1600  కోట్లకు కొనింది .

మైనారిటీ వర్గానికి  చెందిన ఒక రాజకీయ నాయకుడి కుమార్తె రెండు దశాబ్దాల క్రితం బండ్లగూడ లో స్థాపించిన ఒక స్కూల్ ను సింగపూర్ కంపెనీ 400  కోట్ల కు కొనింది .

మాదాపూర్ లో ఇరవై ఏళ్ళ క్రితం ప్రారంభం అయ్యి మంచి పేరు సంపాదించిన ఒక స్కూల్ ను దాని స్థాపకుడు నిర్వహణ తలనొప్పులు భరించలేక ఒక విదేశీ కంపెనీ కు అమ్మేశాడు . 
ఇదే కంపెనీ మరి కొన్ని పాఠశాలల్ని కొను గోలు చేసింది . మరిన్ని పాఠశాలలను కొనుగోలుచేసే సన్నాహాలు జరుగుతున్నాయి .

బోయినపల్లి .. సుచిత్ర...  కీసర లాంటి చోట్ల ఉన్న తమ స్కూల్స్ ను  యాజమాన్యం ఒక విదేశీ కంపెనీ కి అమ్మేసింది . 

అలాగే జూనియర్ కళాశాలల టేక్ ఓవర్ కూడా పెద్దఎత్తున జరుగుతోంది .

ఇవన్నీ ఏదో సీక్రెట్ వార్తలు కాదు . 
పైన ఇచ్చిన హింట్స్  ఆధారంగా మీరు స్కూల్ పేరు టైపు చేసి సోల్డ్ టు ..  అని గూగుల్ లో కొడితే వార్తలు మీ ముందు ప్రత్యక్షం .
 ఇంకా వివరాలు కావాలంటే ఆయా విదేశీ కంపెనీ ల వెబ్సైట్ లో దొరుకుతాయి .

విదేశీ ఫండింగ్ కంపెనీ లకు లాభాలు కావాలి .
 బైజూస్ లాంటి కంపెనీ కరోనా కాలం లో కలల్ని అమ్మింది . కొన్ని వేల కోట్ల విదేశీ ఫండ్స్ బైజూస్ కు ప్రవహించింది .

ఆన్లైన్ విద్య కు ఇక అంతగా భవిషత్తు లేదని గ్రహించిన విదేశీ కంపెనీ లు .. రెగ్యులర్ స్కూల్స్ వైపు దృష్టి సారించాయి ." విద్య  లో పెట్టుబడి బంగారు బాతు" అని ఈ కంపెనీ లు నమ్ముతున్నాయి .

ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న...  హైదరాబాద్ లో ఏ ఇంటర్నేషనల్ / సిబిఎస్సీ స్కూల్ అమ్ముడు పోయింది? " అని కాదు . 
ఇంకా ఎన్ని మిగిలి వున్నాయి? " అని .
ఉప్పల్ కు దగ్గరలోని ఒక స్కూల్ బేరం కుదరక ఇంకా పాత  యాజమాన్యం చేతిలోనే వుంది .  బేరసారాలు  సాగుతున్నాయి . 

తోలి దశలో ఈ విదేశీ కంపెనీ లు . ఇంటర్నేషనల్ స్కూల్స్ / సిబిఎస్సీ స్కూల్స్ పైనే ద్రుష్టి సారించాయి .

మరి కొన్ని రోజుల్లో రెండో దశ మొదలు కానుంది . అప్పుడు మధ్య స్థాయి స్కూల్స్..  చిన్న స్కూల్స్ ను టేక్ ఓవర్ చేస్తాయి .

ఎందుకు అమ్మేస్తున్నారు ?

ముప్పై ఏళ్ళు వెనక్కు వెళుదాము. ప్రతి వీధిలో ఒక చిన్న దుకాణం ఉండేది . 
షాప్ యజమాని అంగట్లో కూర్చునేవాడు . 
వెళితే ... పేరు పెట్టి పలకరించేవాడు. 
డబ్బు లేదంటే అప్పు ఇచ్చేవాడు . 
మనిషి అందుబాటు లో ఉండేసరికి మనందరికీ లోకువ అయిపోయాడు .
 గీచి గీచి బేరం ఆడేవారం. నాణ్యత బాగాలేదు అనే  వారం. 

పాపం .. కాలగమనం లో దుకాణం నడిపే...  శెట్టి గారు / సేథ్ మాయం అయిపోయాడు . 

  అదే మనం ..
 ఇప్పుడు  హైపర్  మాల్స్ .. సెంట్రలైజడ్ ఏసీ. ఫ్యాషన్ దుస్టులు ధరించిన సేల్స్ బాయ్స్ గర్ల్స్ . హైటెక్కు సోకులు .. 

ఆ ఖర్చులు ఎవరి జేబు నుంచి ?
 కొనుగోలు దార్ల నుంచి కాక ఇంకెక్కడినుంచి వస్తాయి ? 

 అంటే రూపాయి సరుకు...  ఏసీ ఖర్చులు .. మాల్  అద్దె...  ఇలా అన్ని కలిపి తడిచి మోపెడయ్యింది .

 అయిదు వందలు ఒరిజినల్ ప్రైస్.. పది పైసలు తగ్గింపు అంటే అదే భాగ్యం అనుకొని మనం కిక్కురు మనకుండా కొనుగోలు చేసి బయటకు వస్తున్నాము . 
బేరాలు లేవు .. మాటలు లేవు .. మాట్లాడుకోవడాలు లేవు .

  చందా పేరుతొ నిన్నటి సేథ్ ను బెదిరించిన లోకల్ గ్యాంగ్ లు ఇప్పుడు మాల్స్ కు పోలేవు .    వెళ్లినా పైసా  రాలదు.

స్కూల్స్ ను  స్థాపించిన వారందరూ మహనీయులు.. ఎలాంటి దోపిడీ జరగలేదు అని కాదు .. కానీ నిన్న మొన్నటి దాక స్కూల్ స్థాపించి నడిపిన వారు ఒక తరం . స్కూల్ నడపాలని  పాషన్ వున్నవారు .

స్కూల్ నడపడం ఎన్నో చిక్కులతో కూడుకొన్న వ్యవహారం . అందులో స్కూల్ స్థాపకుడు అందుబాటులో ఉంటే నిన్నటి వీధి చివరి దుకాణం సేథ్ కు ఎదురయినట్టే ఎన్నో ప్రశ్నలు . ఏది ఏమైనా నడుపుతూ వచ్చారు .

 వీరిలో ఎక్కువ భాగం ఇప్పుడు ...  యాభై అరవై లో అడుగుపెట్టారు .

వారి రెండవ తరం ఈ జంజాటం తమకు ఎందుకు ? అని అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడింది .
" నిర్వహణ తలనొప్పులు ఎందుకు ? ఒక్క సరిగా ఇన్ని కోట్లు వచ్చేస్తోంది .. అమ్మేస్తే తలనొప్పి వదులుతుంది "అని మెజారిటీ భావిస్తున్నారు . 

విదేశీ కంపెనీ  లకు రూపాయి పెట్టి..  అయిదు రూపాయిలు లాగడం ..  చీజ్ తో పెట్టిన విద్య .

వెనుకటి తరం తల్లితండ్రుల సంగతి వేరు .
 నిన్నటి కార్పొరేట్ పాటశాలల్లో చదివిన వారే  నేటి తల్లితండ్రుల్లో అధిక శాతం

చదువంటే తెలియదు . ఇంగిత జ్ఞానం లేదు . సామజిక తేలితేటలు సున్నా .. 
  తమ పిల్లల స్కూల్ ను తమ స్టేటస్ సింబల్ గా భావించి బిల్డ్ అప్ లు ఇచ్చుకునే రకం నేడు కోకొల్లలు .

వీరికి  కావాల్సింది బ్రాండ్ . ఐబి కరికులం .. సీబీఎస్సీ .. పది ఎకరాల్లో స్కూల్ .. క్రికెట్ టెన్నిస్ ఫుట్ బాల్ గ్రౌండ్స్ .. 
ఇలా బ్రాండింగ్ ఉంటే చాలు .. కిట్టి   పార్టీ ల లో అమ్మలు ... మందు పార్టీ ల్లో అయ్యలు .. తమ పిల్లాడి బ్రాండెడ్ స్కూల్ ఇది అని గర్వంగా చెప్పొకొంటే .. మిగతా వారు ఈర్శగా చూస్తే .. హా .. ఆ కిక్కే .. వేరు ... 

బౌరంపేట్ ప్రాంతం లో ఒక పాత స్కూల్ సీబీఎస్సీ క్యాంపస్  ను ప్రారంభించింది . ఒకటో తరగతి ని రెండో తరగతి ని కలిపి కూర్చోపెడుతున్నారు . అలాగే ఆరో తరగతి  వరకు . తక్కువ మంది టీచర్ లైతే...  జీతం తక్కువ అని యాజమాన్యం భావిస్తోంది .

అనేక ఇంటర్నేషనల్ పాఠశాలల్లో ప్రతి పాఠానికి వీడియో ఆన్ చెయ్యాల్సిందే . దీని వల్ల టీచర్ కు పాఠం రాకున్నా ఫరవాలేదు అని యాజమాన్యం ఆలోచన . మన పిల్లలకు లేటెస్ట్ గాడ్జెట్స్ తో పాఠాలు చెబుతున్నారని పేరెంట్స్ హ్యాపీ .
" రోజులో అయిదు గంటలు వీడియోస్ .. ఆ దెబ్బకు మా కళ్ళు పోతున్నాయి . అవసరం అయినా చోట ఒకే. కానీ మంచి టీచర్లు లేకపోయినా పాఠం నడిపేలా చేసందుకు ఈ మోసం .. పిల్లల కంటి చూపు పోగొట్టిన పాపం మాకెందుకు?" అని కొంతమంది టీచర్స్ ఆ పాఠశాలను వదిలేసారు .

ఆక్టివిటీస్ ఆధారంగా పాఠాల్ని చెబితే పిల్లలకు పాఠాలు అర్థం అవుతాయి . పిల్లల కోసం యాక్టివిటీస్ . కేవలం  షో ఆఫ్  కోసం అయితే ? 

"తరగతి గదిలో అవసరం అయినవి కానివి తెచ్చి గోడలు నోటీసు బోర్డు లు గడ్డీగాదం తో నింపడం ..పేరెంట్స్ ను మోసం చెయ్యడం "  కేంబ్రిడ్ కర్రీకులం పాఠశాలను వదిలిపెట్టాలి అనుకొన్న ఒక టీచర్ ఈ రోజు చెప్పిన మాటలు .

సొమ్ము రాబట్టాలంటే సోకు చెయ్యాలి . పిల్లలకు మొబైల్ ఆధారంగా హోమ్ వర్క్ ఇవ్వడం .. ఇంటర్ నెట్ ఆధారంగా రీసెర్చ్ చెయ్యాలి అని చెప్పడం .

 పాఠశాలనుంచి ఇంటికి వచ్చిన మూడో క్లాస్ పిల్లాడు.. మమ్మీ స్కూల్  నుంచి నీ వాట్సాప్ కు హోమ్  వర్క్ వచ్చిందా?"  అంటాడు . మమ్మీ చూపుతుంది .

 అందులోని అంశాలను తన కొడుకు గూగుల్ చేస్తుంటే తల్లి ఆనందానికి అవధులు వుండవు ." మోడరన్ ఏజ్ .. మోడరన్  గాడ్జెట్స్ .. తన బాల్యం లో పదో తరగతి లో కూడా చదవని అంశాలు తన కొడుకు  ఐబి కరికలుం లో మూడో తరగతి లోనే చదివేస్తుంటే మురిసి పోయే ఆ  తల్లికి ... ఆ బిడ్డ మానసిక శారీరిక ఆరోగ్యం  ఎంత దారుణంగా దెబ్బతింటుందో  చెప్పేదెవరు ?  

  రెండు రూపాయిల బి సి డి విటమిన్ మాత్రలు వేసుకొంటే...  ఇంట్లో పల్స్ ఆక్సీ మీటర్ పెట్టుకొంటే పొయ్యేదానికి...  కరోనా పేరుతొ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి లక్ష ఖర్చు పెట్టి రెండిసివెర్ ఇంజెక్షన్లు  వేసుకొని...  అటు పై సిటి స్కాన్...  ఐసీయూ అని లక్షలు ఖర్చుపెట్టుకొని  అదో రకం  తుత్తిని అనుభవించి  .. అది చాలక  అటు పై వాక్ సీన్ వేసుకొని...  ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నవారు  నేటి సమాజం లో కోట్ల కొద్దీ ... 

.వీరు .. బి సి డి విటమిన్ మాత్రలు వైద్యాన్ని వెక్కిరించినట్లే .. ఎవరైనా స్కూల్  ఎలా ఉండాలో చెబితే .. "   మీది పనికి రాని స్కూల్ . కాలం చెల్లిన విధానం .. మాది గొప్ప  స్కూల్" అని టెక్కులు పోతారు . చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ ! 

అదిగదిగో .. అలాంటి టెక్కుల తల్లితండ్రులు లెక్కకు మిక్కుటంగా ఉన్నారు. వారిని బ్రాండ్స్ పేరుతొ .. హై టెక్కు హంగులతో బురిడీ కొట్టించవచ్చు .. కోట్లు గడించవచ్చు అనే  నమ్మకం తో విదేశీ కంపెనీ లు రంగప్రవేశం చేసాయి ..

అన్నట్టు తెలుగు వారి రెండు కార్పొరేట్ బ్రాండ్ లో ఒకటి ఇప్పుడు  బలహీన పడింది . తాము స్కూల్/కాలేజీ నడుపుతున్న బిల్డింగ్స్ గత నెల అద్దె ఇంకా చెల్లించలేని స్థితి లో ఒక సంస్థ .
 జనాలు సిబిఎస్సీ బ్రాండ్ అయితేనే పడుతారు అని అలాంటి స్కూల్స్ స్థాపనలో మరొకటి .

  జూనియర్  కాలేజీ రంగం లో ఉత్తర భారత విద్య సంస్థలు వచ్చాయి .    పాతుకొని పోతున్నాయి . 

మీ దగ్గర అయిదు వందల కోట్లు ఉన్నాయా ? అయితే  మంచి ఏరియా లో రెండు ఎకరాల్లో సిబిఎస్సీ పాటశాల ప్రారంభించండి . తలకిందులు పడి రెండు -  మూడేళ్లు నడిపి పేపర్ పై ఎలాగో ఒకలా లాభాలు చూపించండి .
 నాలుగో  ఏడాది రెండు వేల కోట్ల కు స్కూల్  ను అమ్మేసి అమెరికా కు వెళ్లి సెటిల్ అయిపోండి .

ఈ లోగా బైజూస్ బుడగ పగిలినట్టే ఈ విదేశీ  విద్యా  కంపెనీ ల బుడగ పగిలితే పొతే అంటారా ? 

ఆన్లైన్ బుడగ  త్వరగా పగిలింది . ఇవి రెగ్యులర్ స్కూల్స్ కదా . అంత ఫాస్ట్ గా పగలదు . కనీసం కొనేళ్లు పడుతుంది . 
నిజమే అట్టే టైం లేదు . త్వరగా స్టార్ట్ చేసి త్వరగా  బేరం  పెట్టేయండి . 

ఇక నేటి తరం బ్రాండ్ కాన్షియస్ తల్లితండ్రుల సంగతి అంటారా ? 
ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్..  క్రొకోడైల్ ఫెస్టివల్ . 
అప్పుడు తూరుపు తిరిగి దండం పెట్టడమే .🙏🌙

60 దాటిన అదృష్టవంతులు వీరే. జపనీస్ పుస్తకం ప్రకారం, జపాన్‌లో, డాక్టర్ వాడా 60 ఏళ్లు పైబడిన వారిని 'వృద్ధులు' అని కాకుండా 'అదృష్టవంతులు' అని పిలువడాన్ని సమర్థించారు.

 *60 దాటిన అదృష్టవంతులు వీరే. జపనీస్ పుస్తకం ప్రకారం, జపాన్‌లో, డాక్టర్ వాడా 60 ఏళ్లు పైబడిన వారిని 'వృద్ధులు' అని కాకుండా 'అదృష్టవంతులు' అని పిలువడాన్ని సమర్థించారు.*

*డాక్టర్ వాడా 60 ఏళ్ల వారికి సలహా ఇచ్చారు...*
*"అదృష్టవంతుడు" అవ్వడం యొక్క రహస్యం"34 వాక్యాలలో" ఇలా వివరించబడింది:*

*1. కదులుతూ ఉండండి.*
*2. మీరు చిరాకుగా అనిపించినప్పుడు, లోతైన శ్వాస తీసుకోండి.*
*3. వ్యాయామం చేయండి, తద్వారా శరీరం దృఢంగా అనిపించదు.*
*4. వేసవిలో, ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు, ఎక్కువ నీరు త్రాగాలి.*
*5. మీరు నమలడం వల్ల మీ శరీరం మరియు మెదడు మరింత శక్తివంతంగా ఉంటాయి.*
*6. జ్ఞాపకశక్తి తగ్గుతుంది వయసు వల్ల కాదు, ఎక్కువ కాలం మెదడును ఉపయోగించకపోవడం వల్ల.*
*7. ఎక్కువ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు.*
*8. ఉద్దేశపూర్వకంగా రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించాల్సిన అవసరం లేదు.* 
*9. మీరు ఇష్టపడేది మాత్రమే చేయండి.*
*10. ఏం జరిగినా ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు. ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు రావడమే కాకుండా నడవండి.*
*11. మీకు కావలసినది తినండి, కానీ నియంత్రణలో ఉంచండి.*
*12. ప్రతిదీ జాగ్రత్తగా చేయండి.*
*13. మీకు నచ్చని వ్యక్తులతో అదే విధంగా ప్రవర్తించవద్దు.* 
*14. మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి.* 
*15. వ్యాధితో చివరి వరకు పోరాడడం కంటే దానితో జీవించడం మంచిది.*
*16. కష్ట సమయాల్లో, ఇది ముందుకు సాగడానికి సహాయపడుతుంది.*
*17. ప్రతిసారీ, ఆహారం తిన్న తర్వాత, తప్పనిసరిగా కొన్ని గోరువెచ్చని నీరు త్రాగాలి.*
*18. మీరు నిద్రపోలేనప్పుడు, మిమ్మల్ని మీరు బలవంతం చేయకండి.*
*19. సంతోషకరమైన పనులు చేయడం అనేది మెదడును పెంచే ఉత్తమ చర్య.* 
*20. మీ సన్నిహితులతో మాట్లాడుతూ ఉండండి.*
*21. మీకు సమీపంలో ఉన్న "ఫ్యామిలీ డాక్టర్"ని త్వరగా కనుగొనండి.*
*22. ఓపికగా ఉండండి, కానీ అతిగా ఉండకండి, లేదా మిమ్మల్ని మీరు ఎల్లవేళలా చక్కగా ఉండేలా బలవంతం చేయండి.*
*23. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి, లేకపోతే మీరు పాత అంటారు.*
*24. అత్యాశతో ఉండకు, ఇప్పుడు నీ దగ్గర ఉన్నదంతా మంచిది మరియు సరిపోతుంది.* 
*25. మీరు మంచం మీద నుండి లేవవలసి వచ్చినప్పుడు, వెంటనే లేచి నిలబడకండి, 2-3 నిమిషాలు వేచి ఉండండి.*
*26. మరింత సమస్యాత్మకమైన విషయాలు, మరింత ఆసక్తికరంగా ఉంటాయి.* 
*27. స్నానం చేసిన తర్వాత, బట్టలు ధరించేటప్పుడు గోడ నుండి మద్దతు తీసుకోండి.*
*28. మీకు మరియు ఇతరులకు ప్రయోజనకరమైనది మాత్రమే చేయండి.*
*29. ఈరోజు ప్రశాంతంగా జీవించండి.*
*30. కోరికలే దీర్ఘాయువుకు మూలం!*
*31. ఆశావాదిగా జీవించండి.*
*32. సంతోషకరమైన వ్యక్తి ప్రజాదరణ పొందుతాడు.*
*33. జీవితం మరియు జీవిత నియమాలు మీ స్వంత చేతుల్లో ఉన్నాయి.*
*34. ఈ వయస్సులో ప్రతిదీ ప్రశాంతంగా అంగీకరించండి!*

*60 ఏళ్లు దాటిన మిత్రులందరికీ అంకితం...*

*_💐 నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి  🙂

ప్రశ్న: భగవాన్!దైవాన్ని చూసే మార్గం ఏమిటి?

 *🌺☘ *శ్రీ రమణుల బోధ:* 

 🌺☘* *ప్రశ్న: భగవాన్!దైవాన్ని చూసే మార్గం ఏమిటి?       మహర్షి: దైవాన్ని ఎక్కడ చూడాలి? దాని కన్నా ముందు, నిన్ను నువ్వు చూసుకోగలవా? నిన్ను నువ్వు చూసుకోగలిగితే దైవాన్ని కూడ చూడగలవు. మన కళ్లను మనం చూసుకోగలమా? అవి మనకు కనిపించవు కాబట్టి "నాకు కళ్ళు" లేవు అనగలమా?అలాగే ఎప్పుడూ చూస్తూనే ఉన్నా, దైవాన్ని చూడనట్లే ఉంటుంది. మనం భగవంతుడి కన్నా వేరేగా ఉన్నాము అనే ఆలోచన దైవాన్ని చూడటానికి ప్రతిబంధకం. ఇది నశించడమే దైవాన్ని దర్శించడం. నిజానికి "నేను" భగవంతుడి నుంచి వేరుగా ఉన్నాను అనే ఆలోచన అతి విచిత్రం! పెద్ద వింత!*

 *శ్రీ  రమణ మహర్షి*.🙏

జ్ఞానభేధాలు -మోక్షసాధనాలు - 3

 త్రిపురా రహస్యము - 63
================

స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 

 
జ్ఞానభేధాలు -మోక్షసాధనాలు - 3 

ఉత్తమ జ్ఞానులు తమకు సహజంగా లేకపోయినా, తాము కల్పించుకుని తెచ్చుకున్న భావాలతో లోకవ్యవహారం చేస్తారు. వీరి మనస్సు వికారం పొందదు. ఉత్తమ జ్ఞానికి తన విషయంలోగాని, ఇతరుల విషయంలోగాని కలిగే సుఖదుఃఖాలు కల్పితాలే. అవి వారి మనస్సునంటవు. 
 
మేధావులైన జ్ఞానులు తమ మనస్సులో ఉన్న పూర్వవాసనలను నాశనం చెయ్యటానికి ప్రయత్నించరు. అందువల్ల అవి వారిలో పని చేస్తాయి. ఆ కారణంగా వారు కోపిష్పులుగానో, కాముకులుగానో అవుతారు. ఆ కర్మవాసనలు వారికి ప్రతిబంధకాలు కావు. అందుచేతనే ఉత్తమజ్ఞానులలో రకరకాల ఆచారవ్యవహారాలు కనపడుతుంటాయి. 
 
సమనన్ములైన వారిని మందజ్ఞానులంటారు. వీరు అల్పజ్ఞానులు వీరికి కూడా సమాధిస్టితిలో ఆత్మతత్త్వం గోచరిస్తుంది. స్వరూపవిమర్శన లేనివారికి ఆత్మతత్త్వం 
గోచరించదు. 
 
హఠయోగికి వికల్పనిరోధంవల్ల కలిగే స్వరూపస్ఫూర్తియే సమాధి. హఠయోగులు రెందు రకాలు. 
 
1. పతంజలి చెప్పిన అవమ్టాంగయోగంలో సిద్ది పొందినవారు 
 
_ 2, ధౌతి, వస్తి మొదలైన షట్కర్మలు, ప్రాణాయామం బాగా చెసి, షట్బక్రఛేదనం చేసి సుషుమ్న ద్వారా కుండలిని సహస్రారం చేర్చేవారు. 
 
మొదటి పద్దతిలో ముందుగా ఆలోచనలు వదలివేస్తాడు. తరువాత ఆలోచనలను నిరోధిస్తాడు. తరువాత సంకల్పాన్నికూడా వదిలేస్తాడు. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఇక తానొక్కడే ఉంటాడు. రెండవ పద్ధతిలో ప్రాణాయామం చేస్తాడు. అది చాలా శ్రమతో కూడినది. కాని ప్రాణవాయువు సుషుమ్నలో ప్రవేశించిన తరువాత హాయిగా ఉంటుంది. 
 
ఈ రెండు పద్ధతులలోనూకూడా, సిద్ధి కలిగినప్పుడు, సుషుప్తిలో కలిగే సుఖం కలుగుతుంది. 
 
వ: హఠయోగికీ, జ్ఞానయోగికీ తేడా ఏమిటి ? 
 
ద: జ్ఞానయోగికి అజ్ఞానము యొక్క ఆవరణము, విక్షేపము అనే రెండు అంశాలూ తొలగిపోతాయి. ఆత్మతత్త్వం గోచరిన్తుంది. హఠయోగికి అజ్ఞానం పోదు. 
 
ప: హఠయోగికి వచ్చే సుషుప్తికీ, సమాధికీ తేడా ఏమిటి ? 
 
ద: సుషుప్తిలో మనస్సు తమోగుణరూపంగా పరిణమిస్తుంది. అది మూఢావస్ట, సమాధిస్థితిలో మనస్సు ్రకాళించినా, అజ్ఞానంతో అది మేఘాలు క్రమ్మిన సూర్యుడిలా ఉంటుంది. అదే జ్ఞానయోగికి నిర్మలాకాశంలోని సూర్యునిలా మనస్సు ప్రకాశిస్తుంది. అని దతాత్రేయుడు పరశురాముడికి జ్ఞానభేదాలు. మోక్షసాధనాల గురించి వివరించాడు అంటూ పంధొనిమిదో అధ్యాయాన్ని పూర్తిచేశాడు రత్నాకరుడు. 
 
🌴. విధ్యాగీత  - 1 🌴
 
గురువుగారూ ! జ్ఞానులలో ఉండే వివిధరకాలు, మోక్షసాధనాలు గురించి తెలుసుకున్న తరువాత పరశురాముడు ఇంకా ఏమడిగాడు ? అంటూ ప్రశ్నించాడు నారాయణభట్టు చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. 
 
దత్తాత్రేయుడు చెప్పిన విషయాలను పూర్తిగా విన్న పరశురాముడు “గురుదేవా జ్ఞానుల వ్యవహారాలు ఎ విధంగా ఉంటాయో వివరించండి” అన్నాడు. ఆ మాటలు విన్న దతాశ్రేయుడు చెప్పటం ప్రారంభించాడు.  
 
పూర్వకాలంలో ఒకసారి సత్యలోకంలో జ్ఞానయజ్ఞం జరిగింది. దానికి సనక సనందనాదులు, వసిష్టుడు, వామదేవుడు, పులస్త్యుడు, పులహుడు, చ్యవనుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, నారదుడు మొదలైన మహానుభావులంతా విచ్చేశారు. యజ్ఞం కేవలం ప్రవచనాలు, చర్యగా సాగింది. చివరలో అక్కడ చేరిన మహానుభావులంతా విధాతనడిగారు. “ప్రజాపతీ, ఇక్కడ చేరినవారందరూ జ్ఞానులే. అయినప్పటికీ, గతజన్మ కర్మవల్ల కొందరు సమాధిలో ఉంటున్నారు. కొందరు శాస్త్రాలు చర్చిస్తున్నారు. కొందరు భక్తులు, కొందరు కరిష్టులు అయినారు. వీరందరిలోకీ ఎవరు శ్రేష్టులు ఎవరికివారు తమ అభిప్రాయాలే మంచివి అనుకుంటున్నారు. కాబట్లి మాలో శ్రేష్పులెవరో నువ్వే తేల్చవలసినది” అన్నారు. 
 
ఆ మాటలు విన్న బ్రహ్మ తీవ్రంగా ఆలోచించాడు. వీళ్ళెవరికీ తమమీద నమ్మకం లేదు. కాబట్టి నేను చెప్పిన మాటలు మాత్రం నమ్ముతారనే నమ్మకమేముంది ? అనుకుని “మహర్షులారా ! ఈ విషయం చెప్పటం నాక్కూడా కష్టంగానే ఉన్నది. అందుకని మనమంతా ఈశ్వరుడి దగ్గరకు వెడదాం రండి” అన్నాడు. మహర్నులందరూ కలిసి కైలాసం చేరి విషయం శివుడికి వినిపించారు. ఆయనకు కూడా బ్రహ్మకు వచ్చిన అనుమానమే వచ్చింది. 

దాంతో శివుడు “మునీంద్రులారా ! ఈ విషయం నాక్కూడా పూర్తిగా తెలియటంలేదు. మనమంతా పరమేశ్వరిని స్తుతి చేద్దాం. ఆమే మీ ప్రశ్నకు సమాధానం చెబుతుంది.” అన్నాడు దాంతో బుషీశ్వరులంతా ఆ వరమేశ్వరిని పరిపరివిధాల స్తుతి చేశారు. 
  
కొంతసేపటికి ఆ పరమేశ్వరి వారి ఎదుట ప్రత్యక్షమై, ఏ కోరికలు లేని మీరు నన్నెందుకు పిలిచారు? మీకేం కావాలి ? అని అడిగింది. అలా ప్రత్యక్షమైన దేవిని పరిపరివిధాల స్తుతించినవారై చివరకు ఆమెతో “అమ్మా నీ రూపాలలో 
 
1. ఐది పరము? 
 
2, ఏది అపరము ? 
 
3. ఏది నీ ఐశ్వర్యరూపం ? 
 
4 న్‌ జ్ఞానరూపం ఎమిటి ? 
 
5. ఆజ్ఞానానికి ఫలమేమిటి ? 
 
6. జ్ఞానానికి ముఖ్యసాధనం ఏది ? 
 
7. ఎవడు సాధకుడు 7 
 
8. ఎవడు సిద్దుడు ? 
 
9. అన్నిటికన్న ఉత్తమమైన సిద్ది ఏది ? 
 
10. సిద్దులలో శ్రేష్టుడెవరు ?

జనన మరణ చ్రకంలో జీవితరహస్యం

 [3/14, 21:42] +91 73963 92086: జనన మరణ చ్రకంలో జీవితరహస్యం

నచికేతుడు

లోకంలో వివేచన, విచక్షణ కలగలసిన ప్రత్యేక ప్రాణి మనిషి. హృదయస్పందనలతో, మేధస్సు నిండిన మస్తిష్కంతో ప్రాణికోటిలో శ్రేష్ఠుడై వెలుగొందు తున్నాడు. 'శుభకరమైనదీ, సుఖకరమైనదీ' అనే రెండు మార్గాలు మానవుని సమీపిస్తాయి. బుద్ధిమంతుడు రెండింటినీ చక్కగా పరిశీలించి వివేచిస్తాడు. సుఖం కంటే శ్రేయస్సే మేలని ఎన్నుకొంటాడు. కానీ బుద్ధి హీనుడు లోభాసక్తితో సుఖాన్నే కోరుకుంటాడు. విజ్ఞతకు సంబంధించిన సున్నితమైన ఆలోచన మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది.


ఏది శాశ్వతం, ఏది క్షణికం అనే వివేచన, సర్వదా సుఖాలపట్ల విముఖత, మన: ఇంద్రియ నిగ్రహం, ఆనందోల్లాసాలే పరమావధి కాకపోవడం, సహనం, శాంతి, శ్రద్ధ ఆలంబనగా చేసుకోవడం, మోక్షమా ర్గానికి అన్వేషణ సాధ్యం అనుకుంటే పొరపాటు. మాలిన్యం నుండి మనసు ప్రక్షాళన మయితే సత్య గ్రహణం సంభవం అని నిరూపించిన నచికేతుని వృత్తాంతమే కఠోపనిషత్తు రూపంలో భాసిల్లుతుంది.


శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్తౌ సంపరీత్య వివినక్తిధీర:|
శ్రేయోహి ధీరోభి ప్రేయసోవృణీతే ప్రేయో మందో
యోగక్షేమాత్‌ వృణీతే||''

విశ్వజిత్‌ యాగం చేసిన వాజస్రవసుడనే ఋషి కుమారుడు నచికేతుడు. వాజస్రవసుడు తన సంపద నంతా దానం చేస్తున్నాడని తెలుసుకున్న నచికేతుడు శ్రద్ధతో తండ్రిని గమనించసాగాడు. శక్తినశించి కృంగికృశించిన ఆవులను దక్షిణలుగా దానం చేయడం వల్ల నా తండ్రికి దుర్గతి కలుగుతుందనీ వేదనతో తండ్రీ! నీ సంపదలో నేను భాగస్థుడినే కదా! మరి నన్నెవరికిస్తావు? అని ప్రశ్నించగా స్పందించని తండ్రిని మళ్లీ మళ్లీ అదే ప్రశ్నను అడుగుతాడు నచికేతుడు. వాజస్రవసుడు చిరాకులో నచికేతా! నిన్ను యమునికిస్తాను' అంటాడు.


కాలగతిలో ఎలాగూ నశించిపోయే క్షణికమైన జీవితం కోసం సత్యపాలన వదులుకోరాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మహాత్ములు సత్య నిష్ఠను కాపాడుకున్నారు. కనుక తండ్రీ నేను యమలోకానికి వెళ్లడానికి అనుమతినివ్వు' అని వేడుకుంటాడు నచికేతుడు. వాజస్రవసుని ఆశీస్సులతో యమపురికి చేరిన నచికేతునికి యమధర్మరాజు ఇంటలేడనే విషయం తెలిసి మూడు రోజులవరకూ నిరాహారుడై యమునికై వేచి ఉంటాడు.

నచికేతుడు యమపట్టణ ద్వారం దగ్గర మూడు రోజులుగా నిరాహారుడై ఉన్నాడన్న విషయం తెలుసుకున్న యముడు అతనికి మూడు వరాలను ప్రాయశ్చిత్తంగా అను గ్రహిస్తాడు. ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించి తగిన సత్కారం చేయాలి. అతిథిని నిర్లక్ష్యం చేసే గృహస్థుని ఆశలూ, ఆం క్షలూ, సత్ఫలి తాలూ, పుణ్య కర్మలూ అన్నీ నశిస్తాయి. అందుకే నచికేతుని సంతృప్తి పరచడానికి మూడు వరాలను అనుగ్రహిస్తాడు యముడు.


యమధర్మరాజును ధైర్యంగా నచికేతుడు అడిగిన మూడవ వరం కఠోపనిషత్తుకే తలమానికమై జీవితరహస్యాన్ని ఆవిష్క రిస్తుంది. 'మరణానంతరం ఆత్మ ఉంటుందా?' అని నచికేతుడు అడి గిన సందేహం సృష్టి అంతరార్థాన్ని సూచిస్తుంది. మృత్యుదేవతే యమ ధర్మ రాజు. మరణాంతర గతులను నిర్ణ యించే సమవర్తీ యముడే. కనుక మరణం తర్వాత మానవుని స్థితి గురించి చెప్పగలిగే శ్రేష్ఠులెవరు? యమధర్మరాజు తప్ప. సత్యమే అయినా అసా ధ్యమనిపించే నచి కేతుని కథా రూపం సంగతి కాసేపు పక్కన పెడితే...

 జీవిత రహస్యం మరణం

జీవితరహస్యం మరణం లోనే ఉంది. నిష్ఫాక్షికంగా విచారిస్తే ఆత్మచైతన్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ధాన్యం నాటువేయడం, కోతలో రాలిపోవడం తిరిగి అదే బీజంగా మారి మొలకెత్తడం ప్రకృతిలో సహజం. మనిషి కూడా జనన మరణ చక్రాన్ని అనుస రిస్తాడు. మనిషి జన్మ మృత్యువును సూచిస్తుంది. మృత్యువే మనిషి పునర్జన్మను సూచిస్తుంది. అందుకే అనవసరంగా శోకించే పనిలేదు. అలాగని మితిమీరిన ఆనందమే సుఖమని భావించ క్కర్లేదు.
జంతువుల కంటే మనిషి ఆయుష్షు ఎక్కువ కావచ్చు.

మనుషుల కంటే దేవతలు వందల సంవత్సరాలు అధి కంగా జీవించవచ్చు. కల్పాంతమైన బ్రహ్మదేవుని ఆయు: పరిమితి అందరికంటే దీర్ఘమై కొనసాగ వచ్చు. కానీ ఆది అంతం లేని కాలంలో బ్రహ్మ జీవితమైనా ఎంతటి వైభవంతో అలరారు తున్నా జీవితం క్షణికమే, అంటూ జీవిత రహస్యాన్ని విశ్లేషిస్తూ కఠోపనిషత్తు 'ఆత్మ' చైతన్యదిశగా అడుగులు వేయ మంటుంది. కుటిలచిత్తం లేని, జననాది వికారాలు లేని పరబ్రహ్మానికి తొమ్మిది ద్వారాలున్న ఈ దేహమే పట్టణం. హృదయ ధామంలో విరాజిల్లే పరమాత్మను రాగద్వేషాలు లేక తలచేవాడు జనన మరణరూప సంసార బంధం నుండి విముక్తి పొందుతాడు. పరమాత్మ నిత్యనిజరూపమే మానవునిలోని జీవాత్మ. హేతువాదానికి అందనిదీ, నిగూ ఢమైనదీ ఆత్మ.


ఏకరూపమైన అగ్ని ప్రపంచంలో ప్రవేశించి అది మండించే పదార్థాన్ని పోలిన రూపాన్నే ధరించినట్లు, అన్ని జీవులలోనూ ఉన్న ఒకే ఒక ఆత్మ తాను ప్రవేశించిన జీవుల రూపాలనే ధరించి కనబడుతుంది. వారిని మించి కూడా విశ్వవ్యాప్తమై అలలారుతుంది. జగన్నియామకుని సకల జీవుల అంతరాత్మగా, సకల ప్రాణుల జీవాత్మలే పరమాత్మగా అనుసంధానం చేయబడే రహస్య తత్త్వమే శాశ్వతం. వస్తు ప్రపంచం ఎప్పుడూ అనిత్యమే.


''ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు|
బుద్ధింతు సారధిం విద్ధి మన: ప్రగ్రహమేవచ||''
[3/14, 21:42] +91 73963 92086: శరీరమనే రథాన్ని నడిపే యజమాని ఆత్మ, బుద్ధే సారధి, మనస్సే కళ్లెం అని గ్రహించి జీవిస్తే ఇంద్రియాలనే గుర్రాలనూ, ఇంద్రియ విషయాలు అవి పరుగుతీసే మార్గాలనూ ఉంచుకొని నిజమైన జీవితానందాన్నీ, మోక్ష పదాన్నీ చేరుకోగలం. శరీరం, ఇంద్రియాలు, మనస్సులతో కూడిన ఆత్మయే చైతన్యం, శాశ్వతం అంటుంది కఠోపనిషత్తు. జనన మరణాలు లేక, మనుష్యాది రూపాలే శాశ్వతం కాక, జన్మ-వృద్ధి-పరిణతి-అపక్షయ-వ్యాధి-నాశాలనే వికారాలు
పొందక శాశ్వతమై విశ్వంలో అలరారే ఆత్మ అత్యున్నతమైంది. అపూర్వమైంది.


మనోనిగ్రహం లేని మనిషి ఆత్మతత్త్వం తెలుసుకోలేక సంసార బంధంలో పదే పదే చిక్కుకుంటున్నాడు. జ్ఞానంతో, మనోనిగ్రహంతో పరిశుద్ధుడైన మనిషి పుట్టుకను తిరిగి పొందక పరమపదాన్ని చేరుకోగలడు. ఇంద్రియాల కంటే శ్రేష్ఠమైనది మనస్సు. మనస్సుకంటే శ్రేష్ఠ తరం బుద్ధి. బుద్ధికంటే శ్రేష్ఠం ఆత్మ. మహత్తు కంటే అవ్యక్తం పరం. అవ్యక్తం కంటే మనిషి శ్రేష్ఠతరం. పురుషుని కంటే పరమాత్మ శ్రేష్ఠతరం, సర్వావ సానం. కనుక ఆత్మచైతన్యమే ఆలంబనగా జీవితాన్ని స్వీకరించి, అనుభవించి పరమ పదంలో లీనం చేయగల మార్గమే మానవ జీవిత పార మార్థిక నిధి తత్త్వం. రహస్యం

సేకరణ రాధ 🙏

మౌనమే జ్ఞానం

 మౌనమే జ్ఞానం

!  ఆధ్యాత్మిక  రంగంలో ఒక గురువు  ఉంటాడని,  లేక ఉండాలని ఆయన చుట్టూతా కొందరు  శిష్యలు గుమిగూడి ఉంటే ,  ఇక  ఆగువుగారు ఏదో ప్రభోదిస్తుంటాడన్నది-- మనకు సాధారణంగా  అగుపంచే దృశ్యం. శ్రీరామకృష్ణులూ, శ్రీరమణులు, శ్రీ సత్యసాయిబాబావారలూ ఇలా ప్రభోదించక పోలేదు. కానీ  ఇట్లా వాక్కుతో  చేసే ప్రబోధాలకన్నా మౌనంలో వీరు  చేసిన ప్రబోధమే ఎక్కువ. ముఖ్యంగా  భగవాన్ రమణులు  మౌన ప్రబోధాన్ని గురించే  ప్రబోధించారు.! 

! ఇట్లా మౌనాన్ని  ఒక  సాధనంగా  వారు  చెప్పవలసిన అవసరం ఏమి  కలిగినది?
  ఏమార్గాన్ని  అనుసరించినా అంతిమ  లక్ష్యం అయిన '  ఆత్మసిద్ధిని'  పొంటం ఖాయం. కానీ  ఆయామార్గాలు  బహు శ్రమను  కల్గిస్తాయి. ఒక్కొక్కప్పుడు  లక్ష్యంమీద అవిశ్వాసాన్ని కల్గించ వచ్చును. ఈ ప్రమాదం నుండి తప్పించడానికే  భగవాన్ రమణులు ఏమార్గాన్ని కాదనలేదు  -- కానీ  అత్యంత ఋజుమార్గంగా ( సూటి అయిన సరళమయిన  మార్గంగా) ఈ మౌనాన్ని  చూపారు.

శ్రీరమణులది  కోహం ( నేనెవ్వరు)  అన్న విచారణా మార్గం కదా ఈమౌనం అన్న పేరు
కొత్తగా ఎక్కడ నుంచి వచ్చింది? అని. అడగవచ్చు. కోహం- మౌనం రెండూ  ఒక్కటే . కోహం నాలికతోనో,  మనస్సుతోనో చేసే జపం కాదు., కాకూడదు. అందువల్ల  జప భ్రాంతిని పోగొట్టడం  కోసం  మౌనం అని అనాల్సి వస్తున్నది. ప్రబోధించటం అంటే  వేదికలెక్కి ఉపన్యాసాలివ్వటం కాదు.

అలాంటి ఉపన్యాసాలకు  ఒక, గంటో, గంటన్నరో విని, దులుపు కొని  వెళ్ళిపోతారు.
' ఉపన్యాసంవారిని ఏవిధంగానూ ప్రభావితం  చేయదు' ఇంకొకడు  ఒక ముక్త పురుషుని ముందు  జ్ఞాని ముందు కాసేపు కూర్చుంటారు. 
అంతే--  ఆమాత్రం తోనే  జ్ఞాని సన్నిధి అతని జీవిత దృక్పధాన్నే  మార్చేస్తుంది.

ఈ రెంటిలో ఏది ఉత్తమమైనదో చూడమంటారు  భగవాన్!!

"భగవంతుడు, చైతన్యం, మనసు, దేహం ఇవన్నీ క్రమ రూపాంతరాలేనా ?"

భగవంతుడు మనలో చైతన్యంగా, ఆ చైతన్యమే మనలో మనసుగా, ఆ మనసే ఈ దేహంగా రూపుదిద్దుకున్నాయి ! మనసుకి ఒకవైపు ఉన్న దైవం స్థిరాస్తి. అది యుగాలైనా మారదు ! బాహ్యమైన ఈ దేహం చరాస్తి ! జన్మజన్మకి మారిపోతూనే ఉంటుంది !! ఒక జన్మలోనే శిశువుగా ఉన్నప్పటి దేహం వృద్ధాప్యం వరకు ఉండదు. 
నిద్రలో లభించిన శాంతి ద్వారా శక్తిని పొందిన మనసు, మెలకువ రాగానే దైనందిక కార్యక్రమాల కోసం ఆ శక్తిని వినియోగించుకుంటుంది. కానీ ఈ విషయాన్ని గుర్తించే సున్నితత్వం దానికి లేకపోయింది. 
నీటితో స్నానంచేసి రాగానే తిరిగి మట్టిని గుమ్మరించుకునే గజస్నానం లాగానే, మనం రోజు నిద్రలో పొందిన శాంతిని మెలకువలో కోల్పోతున్నాం. 
శాంతిని శాశ్వతం చేసుకునేందుకు సాధన చెయ్యాలి. మనసుకు బాహ్యంలో ఉన్న ఈ దేహం ఎంత స్పష్టంగా తెలుస్తుందో, అంత స్పష్టంగా తనలోని దైవాన్ని తెలుసుకునే వరకు మనస్సుకు సాధన అవసరం !

'దైవానికి, దేహానికి మనసే వారధి !'

*****ఇదే మన జన్మరాహిత్యం

 *ఇదే మన జన్మరాహిత్యం*

1  నీ మనస్సుకు సన్మానాలు కావాలి.

2  నీ మనస్సుకు భోగ విలాసాలు కావాలి అప్పు చేసిన సరే.

3  నీ మనస్సుకు ఎవరో నీ దేహాన్ని గుర్తించడం కావాలి..

4  నీ  మనస్సు ఎవరైనా పొగుడితే ఆనందిస్తుంది.

5  నీ మనస్సు కోరిక తీరగానే మొఖం చాటేచేస్తుంది
మళ్లీ అటు  చూడనన్నా చూడది.

6  .నీ మనస్సు నిరంతరం క్రొత్త దాన్ని కోరుకుంటుంది.

7  జైల్లో ఉన్నవారంతా మనసు చెప్పినట్లు చేసినవారే.

8  హాస్పిటల్లో ఉన్నవారంతా మనస్సు ఏది తినమంటే అది తిన్నావారే.  ఏది తాగమంటే  తాగినవారే.

9  మీరు మనస్సు చెప్పినట్లు చేస్తున్నారా.  లేక మీరు చెప్పినట్లు మనస్సు చేస్తుందా.

10  మీరు మనస్సును గెలిస్తే ఋషులవుతారు
ఒకవేళ మనసే మిమ్మల్ని గెలిస్తే మీరు ఏమౌతారో.

11  నీ మనసే బంధానికి మోక్షానికి కారణం.

12  జీవుడు అన్ని ఉంటే సుఖంగా  
ఉంటాను అంటాడు.

13  ఆత్మ అన్ని విడిచి పెడితే సుఖంగా ఉంటాను అంటుంది.

14  మనసు ఏది పట్టుకున్న బంధమే. మనసు అన్ని విడిచిపెట్టడం మోక్షం.

15  నీ జీవితమంతా అయితే ఇంకొకరిలా ఉండడం లేకుంటే ఇంకొకరికి నచ్చే విధంగా ఉండడం.
నీవు నీలాగా మాత్రం ఉండవు.

16  నీ మనసు ఎప్పుడు నిన్ను ఖాళీగా ఉండనివ్వదు ఎప్పుడు ఏదో ఒకటి చేయమని ప్రోత్సహిస్తుంది.

17  మీరు మీ సమస్యలు ఇతరులకు చెప్పాలని చూడకండి ఎందుకంటే వారికే  అనేక సమస్యలు ఉన్నాయి.

18  ఏదైనా తగిలించుకునే వాడు జీవుడు. అన్నిటినీ వదిలించే వాడు ఈశ్వరుడు.

19  మీరు నిరంతరం మనస్సును గెలిపించేందుకు  మీరు ఓడిపోతున్నారు.

20  మీ మనస్సు ఏది కోరితే అది క్షణాల్లో తెచ్చి పెడుతున్నారు ఒక సర్వర్ లాగా.

21  మీ మనస్సు ముందు పోయి మిమ్మల్ని వెనకాల రమ్మంటుంది ఎక్కడికైనా సరే మీరు ఏ మాత్రం ఆలోచించకుండా మనసు చెప్పినట్టు చేస్తున్నారు.

22  నీ మనస్సు నీతోని దొంగతనం చేపిస్తుంది వ్యభిచారం చేపిస్తుంది అబద్ధం అడిపిస్తుంది చేయకూడని పనులు చేయిస్తోంది చివరికి జైల్లో పెట్టిస్తుంది.

23  నీ మనస్సు నీతోని  అన్ని చేయిస్తుంది ఆది చేపించిన పనులన్నీ రివర్స్ అయినప్పుడు నిన్ను ఆత్మహత్యచేసుకొమ్మటుంది  దానికి కూడా మీరు వెనకడరు.

24  మీ జీవితాలన్నీ మనసుకు వదిలేశారు ఇక అది చేయించిందే  ఆట పాట కష్టం సుఖం నష్టం దుఃఖం చావు.

25  చంచలమైన మనస్సుకే జ్ఞాన బోధ అవసరముంటుంది.

26  మనస్సు స్థిరం ఐతే మీరు ధ్యానానికి రెడీ అయినట్లే.

27  మీకు ఇతరుల  నుండి పనులు జరగాలంటే ఎదుటివారి మనసులో ఏముందో కనిపెట్టండి  మనిషితో  పని లేదు మనస్సుతోనే పని.

28  మీరు ఎదుటివారి మనసును వశం చేసుకుంటే మనిషితో
పని లేదు.

20  ముందు మనస్సు విరక్తి చెంది చనిపోతేనే  మనిషి ఆత్మహత్య చేసుకుంటున్నారు.

30  మనిషి మాట్లాడేది నిజం కాదు ఆ మనిషి మనస్సులో ఏముందో  అదే నిజం.

31  మనిషి ని నమ్మకండి వారి మనస్సునే నమ్మండి.

32  పిచ్చి వారు మనస్సు చెప్పినట్లే తు.చ తప్పకుండా చేస్తూ ఉంటారు.

33  పోయిన జన్మలోని విపరీతమైన ఒక కోరిక ఉంటే ఆ కోరిక ఈ జన్మలోతీరగానే మరణిస్తున్నారు
ధనం కావచ్చు. పదవి కావచ్చు. గృహము కావచ్చు.ఇంకా ఏదైనా కావచ్చు.

34  మళ్లీ జన్మించడానికి ఈ జన్మలో ఒక కోరికతో చనిపోయి ఆ కోరిక తీర్చుకోవడానికి మళ్లీ జన్మ తీసుకుంటున్నారు.

35  అహంకారిని ఎవరు ఏమి అనే అవసరం లేదు ఎందుకంటే వారి ఆకారమే వారిని నాశనం చేస్తుంది.

36  మూర్ఖుడిని ఎవరు ఏమి చేసే అవసరం లేదు ఎందుకంటే వాడి మూర్ఖత్వమే వారిని నాశనం చేస్తుంది కనుక.

37  శారీరక సుఖాలు అనుభవించే వారిని చూసి మీరు బాధపడకండి వారి సుఖాలు వారి రోగాలుగా మరి హింసిస్తున్న ప్పుడు మాకు సుఖాలు లేనిదే నయం అనిపించే టైం వస్తుంది.

*25 సంవత్సరముల వరకు  గురుకుల వాసము.  25 నుండి 50 సంవత్సరముల వరకు గృహస్తు సంసార  జీవనం గడపాలి.*

*50 నుండి 75 సంవత్సరముల వరకు వానప్రస్త జీవనం గడపాలి.  75 సంవత్సరాల నుండి సన్యాసం తీసుకుని జీవనం గడపాలి.*

 కానీ మనిషి పుట్టినప్పటినుండి చనిపోయే వరకు సంసార జీవనం గడుపుతున్నారు.

   
 *చదివి వదలవద్దండి*                             జ్ఞానాన్ని పంచండి..!!
               
*ఆహా! కనుగొన్నాను...*

అక్కడ-ఇక్కడ లేని ప్రదేశం నేను.

అప్పుడు-ఇప్పుడు లేని కాలం నేను.

పైన-క్రింద లేని అవకాశం నేను.

లోపల-బయట లేని బట్టబయలు నేను.

అది-ఇది లేని ఉనికి నేను.

ప్రశ్న-సమాధానం లేని మౌనం నేను.

చలం-నిశ్చలం లేని అచలం నేను.

సత్యం-అసత్యం లేని సద్వస్తువు నేను.

పాపం-పుణ్యం లేని పరిశుద్ధుణ్ణి నేను.

బంధం-మోక్షం లేని అనంతం నేను.

*నేను-నాది లేని నేను నేను.*

🪻🪻🪻 *ఆభరణంలో* *ఉన్న బంగారాన్ని కనుగొనడానికి* --

*ఆభరణాన్ని చెరపి బంగారాన్ని చూడాలని ప్రయత్నించేవాడు - సాధకుడు*

*ఆభరణంగా కనిపిస్తున్నప్పటికీ నీవు చూస్తున్నది బంగారాన్నే అని స్థిమితంగా ఉండేవాడు - సిద్ధ పురుషుడు.*  
                                                               🪷⚛️✡️🕉️🪷

పూర్వజన్మ పాపం అంటూ ఏదైనా ఉంటుందా? మంచివాళ్లకి చెడు ఎందుకు జరుగుతుంది?

 *దైవ సృష్టి*

పూర్వజన్మ పాపం అంటూ ఏదైనా ఉంటుందా? మంచివాళ్లకి చెడు ఎందుకు జరుగుతుంది?

చెడంటూ ఎవరికీ జరగదు. ఎన్నో జరుగుతుంటాయి. నచ్చని వాటిని మీరు చెడు అనుకుంటారు. చూడండి...ఈ రోజు పెళ్లనుకుందాం. మీరు వీధిలో ఊరేగింపుగా వెళదామనుకున్నారు. కానీ ఈ రోజు పెద్ద వాన పడింది. అంతా తడిసి ముద్దయ్యారు. అది మీకు చెడు. కానీ ఇంకొకరు ఈ వర్షం కోసం ప్రార్ధిస్తున్నారు. అతనికి వర్షం పడుతోందని చాలా ఆనందం. కాబట్టి ఏది మంచి, ఏది చెడు అన్నది కేవలం మీ ఇష్టాయిష్టాల మీదే ఆధారపడుతుంది, అవునా? కాబట్టి మనం జీవితాన్ని మంచీ చెడులని వేర్వేరుగా చూడొద్దు.

ఎందుకంటే మీరంతా దేవుణ్ణి నమ్ముతున్నారు, అవునా? మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆయనే అన్నీ సృష్టించాడని నమ్ముతున్నప్పుడు ఇక మంచీ చెడూ ఎక్కడ? ఇదంతా మీకు అవసరమేనేమో? అందుకే ఆయన ఇలా చేస్తున్నాడేమో అనుకోవాలి. కాదంటే మీ దేవునిపై మీ నమ్మకం అసలైనది కాదని అర్థం. అవునా? మీరు దేవుణ్ణి నమ్మితే, అతను చేసేవన్నీ సరైనవై ఉండాలి. అవునా? లేదంటే అసలు దేవుణ్ణి తొలగించాలి! తాను చేసేది అతనికే తెలియకుంటే, అతనిని ఆ ఉద్యోగం నుంచి తప్పించాలి. అతను అంతా తెలిసే చేస్తుంటే మనం ఇక ఫిర్యాదు చేయకూడదు.

సుఖదుఃఖాలు...... ఉత్థానపతనాలు సహజo

 *🌴సుఖదుఃఖాలు...... ఉత్థానపతనాలు సహజo:🌴*

*దుర్దశలలో ధైర్యంగా ఉండటమే కర్తవ్యమని, ధైర్యం వల్లే సర్వం సానుకూలం అవుతుందనీ, సుఖమైనా దుఃఖమైనా అనుభవించడం కంటే గతిలేదనీ భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు.*

*మహాసంపదతో వెలుగుతూండే బలి చక్రవర్తి విధివశంవల్ల ఒకసారి గాడిద అయ్యాడు. ఆ సంగతి బ్రహ్మవల్ల తెలుసుకున్నాడు ఇంద్రుడు. ఖర రూపంలో ఉన్న బలిని చంపనని బ్రహ్మకు మాట ఇచ్చి, ఆ గార్దభం ఆచూకీ తెలుసుకుని వెళ్ళాడు. 'అయ్యో పాపం! ఎన్నో ఏనుగులు చుట్టిరాగా భద్రగజం మీద ఊరేగేవాడివి. అప్పుడు మమ్మల్ని కాసుకుకూడా లక్ష్య పెట్టేవాడవు కావు. ఇప్పుడిలా గాడిదవయ్యావా? బంగారు యూపస్తంభం నాటించి యజ్ఞం చేసేవాడివి. ఇప్పుడీ ఖర్మ పట్టిందా? నిన్ను చూస్తుంటే బాధగా ఉంది నాకు' అన్నాడు.*

*అందుకు బలి నవ్వుతూ 'నువ్విప్పుడు అధికుడవు. అల్పుల దగ్గర బీరాలు పలకడం తగదు. ప్రాణులన్నీ కాలాన్ననుసరించి సుఖదుఃఖాలు పొందుతూంటాయి. ఆ సంగతి తెలుసుకో గర్వపడకు' అని ఇంద్రుడితో అన్నాడు బలి చక్రవర్తి.*

*~ఇంతలో బలి శరీరం నుండి ఒక అందమైన స్త్రీ బయటకు వచ్చింది. ఇంద్రుడు ఆశ్చర్యపోతూ, 'ఎవరీమె?!!' అని అడిగాడు. 'ఆమెనే అడుగు' అన్నాడు బలి. ఇంద్రుడు అడిగాడు.*

 *’శ్రీ,, భూతి, లక్ష్మి అని మూడు పేర్లు నాకు. నువ్వే కాదు, ఏ యుగాల్లోనూ ఎవరూ నన్ను ఎరుగరు' అందామె. 'ఇప్పుడు ఇతగాణ్ణి ఎందుకు విడిచిపెట్టేస్తున్నావ్?'*

*’సత్యం, ధర్మం, దానం, దమం, పరాక్రమం, వచన మాధుర్యం ఉన్నచోటే ఉంటాను నేను. ఇన్నాళ్ళూ సచ్చరితంగానే ఉన్నాడు. ఈమధ్యనే ఈర్ష్యాద్వేషాలు, అసూయ పొడసూపాయి ఇతనిలో  అందుకని ఇతన్ని విడిచిపెడుతున్నాను నేను' అంది. అది విని బలి ఏం దిగులు చెందలేదు. అంతా విధివిధానం అనుకుని శాంతిపొందాడు.*

*నిజమే! కాలంవల్లే జనులకు కర్మ పరిపాకం కలుగుతోంది. లేకపోతే ఒకరికి ఒక సమయంలో హీనస్థితి కలుగుతూంటే మరొకరికి అదే విక్రమకాలం ఎలా అవుతోంది? అంతా కాలమహిమ. చెడుకాలం దాపురించేసరికి చేయ కూడని పనులు చేయవలసినవిగా కనిపిస్తాయి. బుద్ధి వక్రమార్గాన పడుతుంది. పక్కవాడి సొమ్ము పరమాన్నంలా, పరదార పంచదారలా అనిపిస్తుంది.*

*~లేకపోతే శుక్రాచార్యుడి నీతిశాస్త్రాన్ని ఔపోసన పట్టిన రావణబ్రహ్మ సీతను అపహరించుకు పోవడమేమిటి? నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయడమేమిటి? అందుకు దుర్యోధనుడు, కర్ణుడూ మొదలైన వాళ్ళంతా పగలబడి నవ్వడమేమిటి? వచ్చినవాళ్ళకు అన్నీ విపరీత బుద్ధులు పుడతాయి.*

*అన్ని పరిస్థితుల్లోను ధైర్యంగా ఉండాలంటూ భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు :~*

*పుత్ర దారైః సుభైశ్చైవ విముక్తస్య ధనేన ।*
*మగ్నస్య వ్యసనే కృచ్ఛే ధృతిః శ్రేయస్కరీ నృప ||*

*~’కట్టుకున్న భార్య, కన్నబిడ్డలూ దూరమైనా, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, కష్టాలన్నీ ఒకేసారి కూడబలుక్కుని దండెత్తివచ్చినా, ధైర్యం విడువకుండా ఉంటే శ్రేయస్సు దానంతటదే కలుగుతుంది'.*

*ఇంతకూ భీష్మపితామహుడు చెప్పిందేమిటంటే..’ఎంతటివారు అయినా కాలానికీ, ఏటికీ ఎదురీదలేరు. కాలమే అన్నిటికీ కారణం. కాలం కారణంగానే మనుష్యులు నిన్న ఉన్నట్లు ఈరోజు లేరు. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు. కాలమే ఎవర్ని ఏ దశకు తీసుకువెళ్ళినా, ఎవర్ని ఏ స్థితికి చేర్చినా! కాలగమనంలో సుఖదుఃఖాలు, ఉత్థానపతనాలు సహజమని తెలుసుకొని ధైర్యంగా ఉండగలిగేవాడు శాంతివంతుడై జీవిస్తాడు.*

  -శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

                                                    
 🪷⚛️✡️🕉️🪷