Friday, October 28, 2022

సహజంగా…మనం పట్టించుకోవాల్సిన…సోషల్ రూల్స్!

 Xx.xi. 1-6.  281022-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సహజంగా…*
        *మనం పట్టించుకోవాల్సిన…*
                *సోషల్ రూల్స్!*
                 ➖➖➖✍️

 1. ఏవరికైన  రెండు సార్లకు మించి
     అదేపనిగా కాల్ చేయవద్దు. వారు
     సమాధానం ఇవ్వకపోతే, వారికి వేరే
     చాలా ముఖ్యమైన పని ఉందని
     అర్థం. (కొంతమంది ఫోను 
      ఎత్తేవరకూ మళ్ళీమళ్ళీ, మళ్ళీమళ్ళీ
       ఫోనులు చేస్తూనే ఉంటారు)*

 2. అవతలి వ్యక్తి అడగక ముందే మీరు
     అరువు తీసుకున్న డబ్బును వారికి
     తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న
     మొత్తమైనాసరే!      అది మీ
     వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది! 

 3. ఎవరైనా మీకోసం పార్టీ
     ఇస్తున్నప్పుడు మెనూ లో ఖరీదైన
     వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్
     చేయవద్దు.  వీలైతే మీ కోసం వారినే
     ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని
     అడగండి.

 4.  "మీకు ఇంకా వివాహం కాలేదా?
      మీకు పిల్లలు లేరా? 
      ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?"
      వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను
      ఎదుటివారిని అడగవద్దు. 
      అవి వారి సమస్యలు!
      మీవి కావు!!

 5. మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ
      మీరే  తలుపు తెరిచి లోపలికి
      ఆహ్వానించండి. 
      అమ్మాయి,అబ్బాయి, చిన్నా, పెద్దా  
      ఎవరైనా సరే. ఒకరిపట్ల మంచిగా
      ప్రవర్తించడం ద్వారా మీరు చిన్నగా
      మారరు.

 6. మీరు ఎవరితోనైనా వేళాకోళంగా 
      సరదాగా మాట్లాడుతున్నప్పుడు 
      దాన్ని వారు సరదాగా తీసుకోకపోతే     
      వెంటనే దాన్ని ఆపివేయండి! 
      మరలా చేయవద్దు.

 7. బహిరంగంగా ప్రశంసించండి,
      ప్రైవేటుగా విమర్శించండి.

 8. ఒకరి బరువు గురించి మీరు
     ఎప్పుడూ  వ్యాఖ్యానించవద్దు.
     "మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు"
      అని చెప్పండి.  అప్పుడు బరువు
      తగ్గడం గురించి మాట్లాడా
      లనుకుంటే, వారే మాట్లాడుతారు. 

 9. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటో
     చూపించినప్పుడు, అదొక్కటే
     చూడండి. ఎడమ లేదా కుడి వైపుకు
      స్వైప్ చేయవద్దు. తర్వాత
      ఏముంటాయో మీకు తెలియదు
      కదా!

 10. మీరు ఒక సీ.ఈ.ఓ. తో ఎట్లా
       వ్యవహరిస్తారో అదే గౌరవంతో
       క్లీనర్‌తో కూడా వ్యవహరించండి.
       మీ క్రింది వారిని గౌరవంగా చూస్తే
       ప్రజలు ఖచ్చితంగా దాన్ని
       గమనిస్తారు.

 11. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ
        సలహా ఇవ్వకండి.

 12.  సంబంధంలేని వారికి మీ 
        ప్రణాళికల గురించి చెప్పవద్దు. 

 13. ఒక స్నేహితుడు / సహోద్యోగి
       మీకు ఆహారాన్ని ఆఫర్
       చేసినప్పుడు మర్యాదగా 'నో'
       చెప్పండి. 
       కానీ, రుచి లేదా వాసన
       చూసిన తర్వాత 'నో' చెప్పవద్దు.
       అట్లా చేస్తే మీరు వారిని
       అవమానించినట్లే! 

 14. మరో ముఖ్య విషయం! ఇతరుల
        విషయంలో అనవసరంగా జోక్యం
        చేసుకోకుండా, మీ పనేదో మీరు
        చూసుకోండి!!

        చివరిది , అతి ముఖ్యమైనది:

15.  ఇలా ఎవరైనా సలహాలు ఇస్తుంటే , 
       వీడేంటి ఉచిత సలహాలు 
       ఇస్తున్నాడు వీడికి  పనిపాటా లేదా 
       అనుకోవడం కాకుండా, వారికి కాస్త 
       సమయం కేటాయించి వారు చెప్పేది 
       విని , నచ్చితే పాటించడం 
       నచ్చకపోతే వదిలెయ్యడం

       అంతేకానీ వారిని తక్కువగా 
       చూడకూడదు 
       వారు ఎవరైనా సరే పేద్దవారైన, 
       చిన్నవారైన....✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

స్త్రీ ఔన్నత్యం

iii. i.   2-6.  281022-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                   స్త్రీ  ఔన్నత్యం
                   ➖➖➖✍️

నేటి సమాజంలో కొందరు స్త్రీలు తాము కోరినవి భర్త తేలేని స్థితిలో ఉన్నప్పుడు, అందరి ముందూ తూలనాడుతూ, అవహేళన చేస్తూ, అవమానకరంగా ప్రవర్తిస్తుంటారు. భర్తపై హాస్య ధోరణిలో మాట్లాడుతూ అపహాస్యం చేస్తుంటారు. పెళ్ళైన స్త్రీమూర్తి భర్తతో ఎలా ప్రవర్తించాలో చాటి చెప్పే గొప్ప శ్లోకం రామాయణంలో ఉన్నది. పతివ్రతా ధర్మాన్ని ఆచరించి చూపిన మహా పతివ్రత సీతమ్మ తల్లి రావణునిచే అపహరింప బడి అశోకవనంలో ఉన్నప్పుడు రాక్షస స్త్రీలతో జరిగిన సంభాషణ, అత్యంత రమణీయం.

వాల్మీకి మహర్షి విరచిత రామాయణం లో ‘సుందర కాండము’ అత్యంత ప్రశస్తము.  అందులో ఈ శ్లోకం అత్యద్భుతంగా ఉంటుంది. ఆదికవి వాల్మీకి అని ఎందుకు అంటారో రామాయణం అంత అద్భుతంగా తాను తన దివ్య దృష్టితో కన్నదంతా పొల్లు పోకుండా విడమరచి వ్రాయడం సామాన్యులకు సాధ్యమేనా.

లంకా రాజ్యములో రావణుని అశోక వనములో శింశుపా వృక్షము కింద సీతకు కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు ఆమెను పలు పలు విధాలా దూషించారు. రావణుని వరించి సుఖించమని లేకున్న చంపి తినివేస్తామని బెదిరించారు. రావణుడు కూడా ఎన్నో ఆశలు చూపెట్టాడు. అయినా మహాపతివ్రత సీతా సాధ్వి కొంచెం కూడా చలించలేదు. ఆమె సుగుణాలు గన్న రాక్షస స్త్రీ గణం మారారు గానీ,  సీత ఆ లంకా సామ్రాజ్య వైభవం అంతా గడ్డిపోచతో సమానంగా భావించింది. సీత సుగుణాలకు ముచ్చట పడిన రాక్షస కాంతలు - రాజ్యము వైభవం ఏ మాత్రం లేని రామునే భర్తగా ఇప్పటికీ కోరుకుంటున్నావు. ఆయన్ని తిరిగి చేరినా నీకు కష్టాలు తప్ప మరేముంటుంది అని అడిగారు. 

దానికి సీతా మహా సాధ్వి ఇచ్చిన సమాధానం ఈ అద్భుత శ్లోకం…

దీనోవా రాజ్య హీనోవా యో మే భర్తా సమే గురుః
తం నిత్యా మనురక్తా స్మి యథా సూర్యం సువర్చలా
యథా శచీ మహా భాగా శక్రం సముపతిష్టతి
అరుంధతీ వశిష్టంచ రోహిణీ శశినం యథా
లోపాముద్ర యగస్త్యం సుకన్యా చ్యవనం యథా
సావిత్రీ సత్యవంతంచ కపిలం శ్రీమతీ యథా
సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా
నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రతా
తథాహు మిక్ష్వాకువరం రామం పతిమనువ్రతా

తన పతి అయిన రామునికి రాజ్యము లేకపోయినా అతను దీనస్థితిలో ఉన్నా… ఆయన యెడల నిత్యం అనురక్తితో సూర్య భగవానుని సువర్చలా దేవి, ఇంద్రుని మహాపతివ్రత శచీదేవి, క్షత్రియ వంశ గురువు వశిష్టులవారిని అరుంధతి, చంద్రుని వరించి ఆతన్నితోనే అనురక్తురాలైన రోహిణీ తార వలే, అగస్త్య మహామునిని సేవించిన లోపాముద్ర మాదిరి, చ్యవనుని సేవించిన సుకన్యవోలె, సత్యవంతుని బ్రతికించుకున్న సావిత్రి వలే, కపిలమహామునిని సేవించిన శ్రీమతి వలే, సౌదాసుని అనుసరించిన మదయంతి వోలె , సగర చక్రవర్తి ని అనుసరించిన కేశిని వలే, నలమహారాజుని వరించిన భీమ రాజ పుత్రి దమయంతీ దేవి వలే ఇక్ష్వాకు వంశ తిలకుడు తన పతి శ్రీరాముని అన్ని వేళలా అనుసరిస్తానని ఆమె చెప్పడముతో సీత శీల సౌభాగ్యానికి అమిత ముగ్ధులై ఆమె పాదాలను అప్రయత్నంగా తాకారట ఆ రాక్షస స్త్రీలు.

ఇదీ మన దేశ స్త్రీల ఔన్నత్యం.✍️

ఇదీ మన భారత దేశ సౌభాగ్యము.
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

శ్రేయో భూయాత్ సకల జనానాం

271022b2306. 281022-2.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀279.

శ్రేయో భూయాత్ సకల జనానాం
➖➖➖✍️

ఇది జగద్గురు శంకరాచార్య శ్రీచంద్రశేఖర సరస్వతి స్వామి వారు రాసిన ‘మైత్రీం భజత’ అనే పాట చివరి పాదం. దీని అర్థం ‘ప్రపంచంలోని ప్రతి ప్రాణి ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి’ అని కాంక్షించడం.

1996లో ఐక్యరాజ్య సమితి 50వ వార్షికోత్సవం సందర్భంగా కర్ణాటక సంగీత సమ్రాజ్ఞి, భారతరత్న శ్రీమతి యమ్.యస్. సుబ్బులక్ష్మి గారిని కచేరి ఇవ్వమని ఆహ్వానం పంపారు. ఆమె ఈ విషయం పరమాచార్య స్వామివారికి తెలిపి ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినప్పుడు స్వామి వారు సంస్కృతం లో ఈ పాటను రాసిచ్చారు. ప్రపంచ శాంతిని, మత సామరస్యాన్ని ప్రతిబింబించే ఈ పాటను అక్కడ పాడటం ప్రతి భారతీయుడికి గర్వకారాణం.

పరమాచార్య స్వామివారు ఇచ్చిన ఆ పాట, దాని భావం...

“మైత్రీం భజత, అఖిల హృత్ జైత్రీం | స్నేహము, వినయంతో ప్రవర్తించి అందరి హృదయాలను గెలువు.
ఆత్మవదేవ పరాన్నపి పశ్యత | అందరినీ నీలాగే(సమానంగా) చూడు.
యుద్ధం త్యజత, స్ఫర్ధాం త్యజత | యుద్ధాన్ని త్యజించు, అధికారం కోసం పోటీపడడం త్యజించు.
త్యజత పరేషు అక్రమఆక్రమణం || వేరేవారి ఆస్తులను ఆక్రమించాలనే దుర్భుద్ధి త్యజించు.

జననీ పృథివీ కామదుహాస్తే | కామధేనువు వంటి భూమాత నీ కోరికలన్నీ తీరుస్తుంది.
జనకో దేవః సకల దయాళుః | భగవంతుడు..మన తండ్రియై అందరిని కరుణిస్తాడు.
'దామ్యత, దత్త, దయధ్వం' జనతా | నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో; నీ ఆస్తి పదుగురికి పంచు;

వేరేవారిపట్ల దయతో ఉండు; ప్రపంచ జనులారా!
శ్రేయో భూయాత్ సకల జనానాం || ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి.
శ్రేయో భూయాత్ సకల జనానాం || ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి.
శ్రేయో భూయాత్ సకల జనానాం || ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి.

సర్వ మానవాళి సంక్షేమమే పరమాచార్య స్వామి వారి లక్ష్యం.

ఈ పాటను, ప్రతి పంక్తిని శ్రద్ధగా పరిశీలిస్తే మీకు బోధపడుతుంది... “దామ్యత”, “దత్త”, “దయధ్వం” లోని మూడు “ద”లను మనిషి ఎన్నటికి మరువరాదు.

ప్రపంచ దేశాల ప్రతినిధులందరికి దీన్ని అనువదించి ఇవ్వడం జరిగింది. యమ్.యస్. అమ్మ, ఐక్యరాజ్య సమితిలో ఈ పాట పాడగానే దాని భావానికి అందరి మనస్సులు కరిగిపోయాయి. వారి గాత్ర మాధుర్యానికి తన్మయత్వానికి లోనై, సారాన్ని అర్థం చేసుకున్న ఎంతోమంది ప్రతినిధులు కళ్ళనీళ్ళు కారుస్తూ ఉండిపోయారు.

అరోజు ఆవిడకి గొంతు బాగాలేక సరిగ్గా ఊపిరి కూడా తీయని పరిస్థితిలో ఉన్నారు. కచేరి ఎలా చేయడమా అని భయపడుతూ పరమాచార్య స్వామిని ప్రార్థించగా, పాడడం ప్రారంభించగానే గొంతు సరిఐపోయి అత్యంత మాధుర్యంగా కచేరి చేసారు. పరమాచార్య స్వామి వారిగురించి అమ్మ మాటల్లో, మరియు ఆ కచేరి ఈ క్రింది వీడియోలో...

https://www.youtube.com/watch?v=y7uijcWK1mQ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

జ్ఞాన వార్ధక్యం

 Xx6. Xi. 1-5. 271022-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                జ్ఞాన వార్ధక్యం
                 ➖➖➖✍️

వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవయసులోనే పరిపూర్ణజ్ఞానం గలవారిని జ్ఞానవృద్ధులంటారు. 

సాధారణంగా జీవితమంతా ఆర్జించిన అనుభవాలు వార్ధక్యజ్ఞానంగా పరిణతి చెందుతాయి.

అనుభవజ్ఞానం అన్నింటికన్నా గొప్పదంటారు. కొందరికి పుట్టుకతో లభించే జ్ఞానం కూడా తక్కువేమీ కాదు. 

అష్టావక్రుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడే, తండ్రి శిష్యులు ఉచ్చారణ దోషాలను ఎత్తిచూపి శాపగ్రస్తుడయ్యాడని కథ. 

జ్ఞానం దైవప్రసాదం. వేదవ్యాసుడు సద్యోగర్భజనితుడు (ఆ క్షణంలోనే జన్మించినవాడు). ఆయనకు కృష్ణద్వైపాయనుడనే పేరు కూడా ఉంది. పద్దెనిమిది పురాణాలు, మహాభారతం, భాగవతం వంటి దివ్యరచనలు చేసిన వ్యాసుడు ప్రాతఃస్మరణీయుడు. ఆయన విష్ణురూపుడు. మరణం లేని కాలాతీతుడు. త్రికాలవేది. జగద్గురువుల్లో ప్రసిద్ధుడు. ఆయన ఎవరి దగ్గరా శిష్యరికం చెయ్యని జన్మజ్ఞాని. 

దత్తాత్రేయ అవతారాలన్నీ ఇలాంటివే. కొందరు ఏకసంథాగ్రాహులుగా ఉంటారు. వారు అల్పకాలంలోనే అనల్పజ్ఞానం ఆర్జిస్తారు. గురువులను మించిపోతారు. 

గురు నానక్‌ దేవ్‌ అలాంటి అసమాన జ్ఞాని. సిక్కులు ఆయనను గురుపరమాత్మగా ఆరాధిస్తారు.

మనలో కొందరు బాలమేధావు లుంటారు. సంగీతం, నృత్యం వంటి కళారంగాల్లో వారు ప్రసిద్ధులు. కానీ, వారి ప్రావీణ్యం ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. ఎవరి జ్ఞానం వృద్ధుల చేత గుర్తింపు పొంది, గౌరవానికి నోచుకుంటుందో, వారు వయసులో చిన్నవారైనా జ్ఞాన వృద్ధులుగా పేరొందుతారు. 

ప్రపంచ సంపదలకు హెచ్చుతగ్గు లుంటాయి. జ్ఞాన సంపద పంచిన కొద్దీ పెరుగుతుంది. 

విదురుడు కారణజన్ముడు. జ్ఞాన వృద్ధుడిగా చెప్పదగిన వాడు. ధృతరాష్ట్రుడు వంటివారికి నీతి బోధ చేసినవాడు. ‘మహాత్మా’ అనిపించుకున్న యోగ్యుడు. అనేక ధర్మ సందేహాలను తీర్చిన ప్రాజ్ఞుడు. ఆయన బోధలు విదురనీతి పేరుతో లోక ప్రసిద్ధం. 

జ్ఞానం ఆనందకారకం. హయగ్రీవస్వామిని, దక్షిణామూర్తిని జ్ఞానానంద స్వరూపులుగా చెబుతారు. దక్షిణామూర్తిని దీక్షగా చూస్తే చాలు... జ్ఞానప్రసారం జరుగుతుందన్న కథ ఉంది.

ఏది అజ్ఞానమో తెలిపేది జ్ఞానం. అలౌకికమైన జ్ఞానమే ఆధ్యాత్మిక జీవితానికి ఆలంబనం. వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే వివేకం. క్షణభంగురమైన జీవితాన్ని శాశ్వతమని భ్రమించక, సద్వినియోగం చేసుకోవడమే మనిషి కర్తవ్యం.

ఆదిశంకరులు ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నప్పుడు ఒక చోట వృద్ధుడు వ్యాకరణం వల్లె వేస్తుంటాడు. ఆ క్షణంలోనే ఆయన భజగోవింద శ్లోకాలు ఆశువుగా చెప్పినట్లు కథ ప్రచారంలో ఉంది. ఆ వృద్ధవిద్యార్థితో ఆదిశంకరులు- ‘ఓ మూఢుడా! మృత్యుముఖంలో ఉన్నప్పుడు ఈ వ్యాకరణసూత్రాలు నీకు అక్కరకు రావు. గోవిందుణ్ని భజించు. నీకు మోక్షం లభిస్తుంది’ అంటారు.

ఈ సలహా అందరికీ వర్తిస్తుంది. భగవంతుడి సన్నిధికి చేర్చేది భక్తి మార్గమే... శాస్త్ర జ్ఞానం కాదు. జ్ఞాన వృద్ధులు బాల్యం నుంచే భక్తిమార్గంలో స్థిరచిత్తులై ఉంటారు.

భగవంతుడి గురించి సుబోధకం చేసేదే జ్ఞానం. అలాంటి జ్ఞాని ప్రపంచ మాయలో చిక్కుకోడు!✍️
             - కాటూరు రవీంద్ర త్రివిక్రమ.
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కుశల కర్మలు

 ii.x2.   1-4.   271022-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               కుశల కర్మలు
                ➖➖➖✍️

’కుశల కర్మలు’ అంటే మంచి పనులు. ‘అకుశల కర్మలు’ అంటే చెడ్డ పనులు. ప్రతి మనిషి మనస్సులో, ఆలోచనల్లో ఈ రెండూ ఉంటాయి. పుట్టుకతోనే ‘వీరు మంచివారు’ ‘వీరు చెడ్డవారు’ అని విభాగించుకుని పుట్టరు. వ్యక్తిగా, సామాజికంగా పెరిగిన కొద్దీ మనలో ఈ భావాలు పెరుగుతాయి. 

’కుశల ధర్మాలు’ మనకి శాంతిని ఇస్తాయి. ‘అకుశలాలు’ చివరికి దుఃఖాన్నే తెచ్చిపెడతాయి.

అయితే మనిషి దుఃఖంలేని కుశల మార్గంలోనే నడవడం ఏదోఒక క్షణంలోనో, రోజులోనో జరిగే పని కాదు.

ఎంత సాధన చేసి మంచిగుణాలు అలవర్చుకున్నా ఏదో క్షణంలో బుద్ధుడు చెప్పినట్లు చిటికె వేసినంత కాలంలో– అకుశలం వచ్చి ఆవహించేస్తుంది.

కాబట్టి మనిషి కుశల చిత్తంతో మెలగాలంటే నిరంతరం అదే ధ్యాసలో ఉండాలి, నడవాలి.

ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఎందరో భిక్షువులు ఎంతెంతో సాధన చేసినవారు కూడా ఆ చిటికెల కాలంలోనే దారి తప్పేవారు. 

ఈ విషయంలో ఎందరో బుద్ధుని దగ్గరకు వచ్చి...
‘భగవాన్‌! మా చిత్తాన్ని నిలుపుకోలేకపోతున్నాం. ఏదో క్షణంలో చెడ్డ భావాలు వచ్చి పడుతున్నాయి. వానినుండి ఎలా బైటపడగలం’ అని అడిగేవారు. 

అప్పుడు బుద్ధుడు... ‘మీరు అందుకోసం నిరంతరం పది సాధనా మార్గాల్లో ఉండాలి’ అంటూ వాటి గురించి చెప్పాడు. 

అప్రమత్తంగా ఉండటం, సోమరితనంతో గడపడం, అతిగా కోరుకోవడం, ఎంత లభించినా ఇంకా, ఇంకా కావాలి అనే అసంతృప్తి, నిరంతరం నిర్లక్ష్యంగా ఉంచే అజాగ్రత్త, ఏ విషయాన్నైనా లోతుగా గ్రహించకపోవడం వల్ల కూడా అవగాహనాలేమి, చెడ్డవారి స్నేహం, వీటితోపాటుగా జాగరూకతను నిరంతరం పెంచుకోకపోవడం చెడ్డవారిని అనుసరిస్తూ, అకుశల కర్మలే శిక్షపొందుతూ ఉంటే.. ఈ పది కార్యాల వల్ల మనిషితో అకుశల ఆలోచనలు పెరుగుతాయి. అకుశల ఆచరణలు జరుగుతాయి.

అలాంటి వానికి సంపద నష్టం,                        కీర్తి నష్టం, ప్రజ్ఞ నష్టం, సకలం నష్టం. దీనివల్ల దుఃఖం. 

అలాగే కుశల ధర్మాలు పెరగాలంటే ప్రమత్తతను వీడి అప్రమత్తతతో సోమరితనాన్ని వదిలి ఉండాలి. పట్టువదలని సాధనలో ఉండాలి. అధిక కోర్కెల్ని వదిలి, బతకడానికి సరిపడు మితమైన కోర్కెలు (అల్పేచ్ఛ) కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి, జాగరూకతతో మెలగాలి. ప్రతి విషయం పైనా మంచి అవగాహన పెంపొందించుకోవాలి. మంచిని చేకూర్చే మంచి మిత్రులతోనే స్నేహం చేయాలి. మంచివారిని అనుసరించాలి. మంచి కర్మల శిక్షణ పొందాలి. ఈ పది కార్యాల వల్ల మనిషిలో కుశల ఆలోచనలు పెరుగుతాయి. కుశల ధర్మాలు ఉద్భవిస్తాయి. కుశలాచరణ కలుగుతుంది.

అలాంటి వారికి సంపద నష్టం కాదు. కీర్తికి నష్టం రాదు. ప్రజ్ఞ దిగజారిపోదు. దుఃఖం దరికే రాదు. అని చెప్పాడు బుద్ధుడు. 

ఇలా ప్రతి వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకుంటే, అది వ్యక్తికి, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి మేలు అని బోధించిన తధాగత బుద్ధునికి జేజేలు!✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

ఆంజనేయస్వామికి.. మర్కటరూపం ఎందుకు?

251022f1958.     271022-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


ఆంజనేయస్వామికి.. 
      మర్కటరూపం ఎందుకు?
                   ➖➖➖✍️

హనుమంతుడి అమ్మమ్మ అహల్య...
ఆమె శాపంతో హనుమంతుడికి వానర రూపం.           



గౌతమ మహర్షి, అహల్య దంపతులకు
కలిగిన పుత్రులు వాలి ,  సుగ్రీవులు
మర్కట రూపులుగా ఎందుకు ఉన్నారు? 

వీరి పుత్రిక అంజనా దేవి కుమారుడు_
ఆంజనేయ స్వామి మర్కట రూపుడు
అవడానికి కారణమేమిటి? తెలుసుకుందాం…

గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చి_
శివుడు సాక్షాత్కరించిన తరువాత తను_     బ్రహ్మచర్యము వీడి తను ఇచ్చటనే ఉండి ఇంకనూ  సంతానం పొందగోరి సంసార జీవితం గడిపారు.

అహల్య గౌతమ మహర్షి దంపతులకు_
ఒక కుమార్తె ఇద్దరు కుమారులు కలిగారు.
వీరి కుమారులే వాలీ, సుగ్రీవులు.
వీరి కుమార్తెయే..ఆంజనేయస్వామి వారి కన్నతల్లి అంజనాదేవి.

ఇంద్రుడు అహల్యను చూసిన తరువాత
ఆమె అందచందాలకు ఆమెపై మోజుపడతాడు.

 అహల్య, ఇంద్రునికి దక్కకపోవడం చేత
ఒకనాడు మహర్షి లేని సమయాన గౌతమ మహర్షి రూపములో వచ్చి అహల్యతో సంభోగించి ఇంద్రుడు తన కోరికను తీర్చుకున్నాడు.

ఈ విషయము అంజనాదేవి కనిపెట్టినా మౌనముగా ఉండిపోయింది.

ఒకనాడు గౌతమ మహర్షి..
తన ఇరువురు కుమారులను రెండు భుజములపై ఎక్కించుకుని కుమార్తెను చేత పట్టుకుని సరస్సు  గట్టుపై నడుస్తున్న సమయాన చిరంజీవి అంజనా తన తండ్రి తనకు పుట్టిన నన్ను నడిపిస్తూ, పరులకు పుట్టిన వారిని భుజములపై మోయుచున్నాడని బాధపడుతుంది.

ఇది మనోనేత్రమున గమనించిన మహర్షి
అంజనా దేవి ద్వారా అసలు విషయం తెలుసుకుని  తన కూతురు చెప్పిన విషయంలో నిజమెంతో పరీక్షించదలచి ఈ సరస్సులోని నీటిలో వీరిద్దరిని  పడవేస్తాను, పరులకు పుట్టినవారైతే మర్కట రూపులుగా, తనకు పుట్టినవారైతే తమ స్వరూపులుగా ఈ నీటి నుండి తిరిగి వస్తారని చెప్పి పిల్లలిద్దరిని నీటిలో పడవేస్తాడు.

పిల్లలిద్దరూ మర్కట రూపులై తిరిగి రావడం చూసి గౌతమ మహర్షి మిక్కిలి కోపిస్టులవుతారు.

ఈ విషయం తెలిసిన అహల్య అచ్చటకు వచ్చినది.

కోపిష్టుడైన మహర్షి “పరపురుషుని స్పర్శ           తెలియనంతగా బండరాతివై ఉన్నావా?
నీవు రాతి బండవు కమ్మ”ని అహల్యను శపించి పిల్లలను వదిలేసి మహర్షి కోపముతో అక్కడ నుండి వెళ్లిపోయాడు.

అప్పుడు అహల్యాదేవి తన కుమార్తె 
అంజనాతో “పరపురుషులు తన తండ్రి రూపముతో  వచ్చినారని తెలిసి కూడా తనతో ఇంతకాలం చెప్పక  తను శాపగ్రస్తురాలగుటకు, తన కుమారులు
మర్కట రూపులు అగుటకు కారణమైతివి. కాబట్టి నీవు అంధురాలివికమ్ము. నీకు పుట్టబోయే కుమారుడు కూడా మర్కట రూపుడై పుట్టుగాక!” అని తన కుమార్తె అంజనాదేవిని శపించినది. 

తల్లి శాపముతో అంధురాలిగా మారిన అంజనాదేవి ఆ ప్రాంతం వదిలి కిష్కింద చేరి అచ్చట కేసరి అనునతడిని వివాహమాడినది.

వారికి కలిగిన సంతానమే ఆంజనేయస్వామి.

ఆనాడు అహల్య పెట్టిన శాపం వల్ల అంజనాదేవి కుమారుడైన  ఆంజనేయస్వామికి మర్కట రూపం వచ్చింది. ✍️              
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

Thursday, October 27, 2022

THVAMEVAAHAM త్వమేవాహమ్‌

THVAMEVAAHAM త్వమేవాహమ్‌

కన్నతల్లి కడుపులోంచి బయటపడి......తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......పుడమితల్లి కడుపులోకిచేరుకునేందుకు......
ఆఖరిసారి ఊపిరిని విడిచి పెట్టడం దాకా సాగే ప్రస్థానం.......పేరే......

నేను =I

ఈ "నేను" ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!

ఊపిరి ఉన్నంతదాకా "నేను" అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....

జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ...ఈ
"నేను" ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...

ఈ "నేను" లోంచే
నాది అనే భావన పుడుతుంది!

ఈ నాది లోంచే....

1.నా వాళ్ళు,
2.నా భార్య,
3.నా పిల్లలు,
4.నా కుటుంబం,
5.నా ఆస్తి,
6.నా ప్రతిభ,
7.నా ప్రజ్ఞ,
8.నా గొప్ప...

అనేవి పుట్టుకొచ్చి....

చివరికి ఈ "నేను" అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,
ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహం గా ప్రజ్వరిల్లుతుంది.

EGO అహం

అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ ”నేను", ”నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది.

నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.

1. పంతాలతో
2. పట్టింపులతో,
3. పగలతో,
4. ప్రతీకారాలతో......

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.

1 .బాల్య,
2.కౌమార,
3.యౌవన,
4.వార్ధక్య,

దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ
నేను అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.

సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.

సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.

మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.

మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.

1.నేనే శాసన కర్తను,

2.నేనే ఈ సమస్త భూమండలానికి అధిపతిని,

3.నేనే జగజ్జేతను...

అని మహోన్నతంగా భావించిన ఈ నేను
లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా
రోజు మారుతుంది.

ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’ కథ అలా సమాప్తమవుతుంది.

అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”
గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”
“SRIMADBHAGAVATH GEETHA”....

చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది శ్మశానవైరాగ్యం మాత్రమే!

అది శాశ్వతం కానే కాదు

ఈ నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన
”వైరాగ్యస్థితి” అభిలాషికి సాధ్యమవుతుంది.

వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు.
దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం.

స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.

మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం

అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.

ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం.

1. నిజాయితీగా,
2. నిస్వార్థంగా,
3.సద్ప్రవర్తనతో,
4. సచ్ఛీలతతో,
5.భగవత్‌ ధ్యానం

తో జీవించమనేదే
వేదాంతసారం.

అహం బ్రహ్మాస్మి అంటే
అన్నీ నేనే అనే స్థితి నుంచి
త్వమేవాహమ్‌ అంటే నువ్వేనేను అని
భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే
*మానవ జన్మకు సార్థకత

సేకరణ

యోగి - భోగి - రోగి

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

             *యోగి - భోగి - రోగి*
                 
*హిమాలయ యోగులలో కొందరు నిత్యమౌన వ్రతం ఉంటారు. వారిదగ్గరకు ఎవరు వచ్చినా కన్నెత్తి అయినా చూడరు. అలాంటివారిలో హరి ఓం యోగి ఒకరు.

*ఒకసారి స్వామిరామా గురువు బెంగాలీ బాబా బద్రికి దగ్గరున్న శ్రీనగర్ వద్ద గుహలో హరి ఓం యోగి దగ్గరచెప్పింది నే ర్చుకోమని పంపాడు.

*సరే నని వెళ్లి రెండేళ్లు ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. ఒకసారి తనగురువుకు ఈ విషయం తెలియజేశాడు.

*‘ఆయన నిన్ను గమనించలేదనుకోకు నీ వివరాలన్నీ ఆయనకు తెలుసు”అని చెబితే ”

*“అదెలా సాధ్యం? ఆయనెప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు. ఆయన ఒక జీవం లేని కర్రముక్కో రాయిలాగానో ఉంటాడు చలనం లేదు!” అని ఫిర్యాదు చేశాడు.

*“కాదులే అక్కడే ఉండు” అని భరోసా ఇచ్చాడు గురువు.

*ఒక రోజు హరి ఓం స్వామి కళ్ళు తెరిచి నవ్వుతూ ”నేను కర్రముక్కనా రాయినా ?” అన్నాడు.

*కంగుతిన్నాడు స్వామిరామా.    తను గురువుతో చెప్పిన సంగతి ఈయన కెట్లా తెలిసిందని బోల్డు ఆశ్చర్యపడ్డాడు. మళ్ళీ హరి ఓం స్వామి ”కళ్ళు మూసుకొని నేను మీరు కళ్ళు తెరిచి చూసినదానికంటే అద్భుతానందాన్ని చూస్తున్నాను ఆ ఆనందంలో మునిగిపోయే వాడికి ఈ భౌతిక లోకం ఏమానందం కలిగిస్తుంది? ఆ విశ్వ చైతన్యంలో నేను విహరిస్తూ బ్రహ్మానందం అనుభవిస్తాను. అందుకే నిరంతరం కళ్ళు మూసుకొని ఉంటాను.” అన్నాడు.

*ఈ మాటలు రామా మీద గొప్ప ప్రభావం కలిగించాయి. హరి ఓం కనులు అరమోడ్పుగా చూస్తే చాలు అందులోనుంచి అమృతం పొంగి పొరలుతున్నట్లు ఉందని రామా భావించి అనుభవించాడు.

*ఓం హరి స్వామి ఒక సారి కళ్ళు తెరిచినప్పుడు కొన్ని మంత్రాలు చదివి అర్ధం చెప్పాడు… దానిభావం, లోకం అంతా రాత్రి వేళ నిద్ర పోతుంటే యోగులు, ఆత్మజ్ఞాన సంపన్నులు మేలుకొని ఉంటారు. ఇది ఉపనిషత్ వాక్యం ..!  తర్వాత దానిపై వివరణ ఇస్తూ ”రోజు మొత్తం మీద మంచి కాలం నిశ్శబ్ద రాత్రి వేళ మాత్రమే. అయితే దాని లోని అందాన్ని ఆ నిశ్శబ్ద భావాన్ని కొద్ది మంది మాత్రమే అనుభవించగలరు.

*రాత్రి వేళలలో ముగ్గురు మాత్రమే మెలకువ గా ఉంటారు.                                        వారే… ‘యోగి   భోగి    రోగి!’

*యోగి నిశీధి లో సమాదిగతుడై పరమానందాన్ని పొందుతాడు.

*భోగి ప్రాపంచిక సుఖాలలో రాత్రిళ్ళు నిద్రపోకుండా ఆనందం అనుభవిస్తాడు.

*రోగి జబ్బుతో ముక్కుతూ మూలుగుతూ నిద్ర లేకుండా గడుపుతాడు.

*యోగిది శాశ్వతానందం!
*భోగిది క్షణికానందం!! 
*రోగి ది బాధానందం!!!

*”మరి యోగికి నిద్ర క్కరలేదా?” అని అడిగాడు రామా.

*దానికి ”మనసులో ఏమీ లేకుండా కళ్ళు మూసుకొంటే అది నిద్ర. కావాలని కళ్ళు మూసుకొని దేనిపైన నైనా దృష్టి పెడితే అది ధ్యానం!

*యోగి కళ్ళుమూసుకొని ఇంద్రియ భావాలను దూరం చేసుకొంటాడు. అప్పుడు ద్వంద్వాలకు అతీతమైన స్థితి కలుగుతుంది. కళ్ళు మూసుకోవటం అంటే యోగికి అంతరేంద్రియమైన కన్ను ను తెరవటమే. అందరూ రెండుకళ్ళతో ప్రపంచ వస్తువులు చూస్తే యోగి సర్వ దేహమూ కన్నుగా మారుతుంది, సర్వ ప్రపంచం దర్శనీయమౌతుంది!” అని స్వామిరామా సందేహ నివృత్తి చేశాడు.

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానం ధ్యానంగా మారితే మోక్షం

 జ్ఞానం ధ్యానంగా మారితే మోక్షం

🔹🔸🔹🔸🔹🔸🔹


యతః ప్రవృత్తిర్భూతానాం యేవ సర్వమిదం తతమ్‌
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః


సమస్తమైన సృష్టి ఎవని నుండి జరిగిందో, ఈ చరాచర ప్రపంచంలో ఎవరు వ్యాపించి ఉన్నారో, ఆ పరమాత్మను సాధకుడు స్వకీయ కర్మచే ఆరాధించి, మోక్ష యోగ్యతాభరితమైన జ్ఞాన సిద్ధిని పొందాలంటుంది భగవద్గీత. 

అంటే మన స్వభావానికి (ఏ ప్రలోభాలకు, ఆకర్షణలకు లోనుగాకుండా) లేదా ప్రవృత్తికి తగిన కర్మలను ఆచరిస్తూ, భక్తి భావనతో భగవంతుడిని స్మరిస్తూ, ఆరాధిస్తే, అర్చిస్తే మోక్ష సిద్ధి కలుగుతుందని భావం.

 అర్చించడం అంటే అనుసరించడం లేదా అనుకరించడం. అయితే కర్మలు బంధన కారణాలు. కాబట్టి కర్మాచరణ మోక్షానికి ఎలా మార్గం చూపుతుందనేది అనుమానం. చేయవలసిన కర్మలను చేయవలసిన పద్ధతిలో ఈశ్వరార్పణగా, ఫలితం కోరకుండా, చేసినప్పుడు ముక్తి లభిస్తుందనేది ఆ అనుమానానికి జవాబు. ఫలితంపై ఆశ లేకుండా భగవదర్పితంగా కర్మలను ఆచరించడం వల్ల కర్మాచరణలోని దోషాలు తొలగిపోయి చిత్తశుద్ధి కలుగుతుందనేది కృష్ణపరమాత్మ ఉపదేశం.

సాధకునికి సాధనలో జాత్యంతర వికాసం కలగాలంటే.. సాధకుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి. కర్మఫలితాన్ని ఈశ్వరార్పితం చేయకుంటే ఆ ఫలితం తన మనసుపై ముద్రగా ఏర్పడి మన ప్రయాణంలో భారంగా మారుతుంది. ఆ ఫలితాన్ని అనుభవించేందుకు మరొక జన్మ అవసరమవుతుంది. ఆ జన్మలో చేసే కర్మల వల్ల ఇంకొక జన్మ.. ఇలా నిరంతరంగా జననమరణ చక్రబంధనంలో ఇరుక్కుపోతాం. 

అయితే కర్మ చేయకుండా మనిషి మనగలడా అంటే లేదనే చెప్పాలి. ఊపిరి తీసుకోవడమూ కర్మయే కాబట్టి ఏ కర్మా చేయకుండా క్షణం కూడా గడవదు. కర్మ ఇలా బంధనాలను ఏర్పరిస్తే.. ఆ బంధనాల నుండి ఎలా బయటపడడం? అంటే.. కర్మ ఫలితాన్ని తనదిగా స్వీకరిస్తే పడే ముద్రలవల్ల మనస్సు మలినమై పరమాత్మను స్ఫష్టంగా చూడలేం, ఆరాధించలేం. ఫలితాన్ని పరమాత్మకే త్యాగం చేయడంవల్ల స్వచ్ఛతను సాధించి ఆ భగవంతునిలో ఐక్యం కాగలుగుతాం.

కర్మ ఫలితాన్ని అనుభవించేందుకు మనకు స్వతంత్రం లేదు కదా మరి కర్మలను ఎంచుకునేందుకు స్వేచ్ఛ ఉన్నదా? .

అంటే ఉన్నదనేదే జవాబు.

 ఎంచుకోవడం రెండు విధాలు. ఇష్టమైన దానిని ఎంచుకోవడం లేదా బుద్ధితో విచారించి, వివేచనతో, విజ్ఞతతో సుగతి ప్రదాయినిని ఎన్నుకోవడం.

 వివేచనతో ఎంచుకొని చేసే కర్మ తపస్సుగా మారి మనసు ప్రకాశవంతమవుతుంది.

 అలాంటి మనసును సహస్రారం వరకూ చేర్చడం పరమాత్మలో లయం కావడంగా చెప్పబడుతుంది. దీనికి జ్ఞానం అవసరమవుతుంది. 

జ్ఞానం అంటే సంపూర్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడం. జ్ఞానం ధ్యానంగా మారితే ప్రయాణం సమగ్రమవుతుంది, సంపూర్ణం, సఫలం అవుతుంది. ఆ దిశలో మనందరి ప్రయాణం సఫలం కావాలి.

జై శ్రీమన్నారాయణ🙏🏻

🔹🔸🔹🔸🔹🔹K

🎻🌹🙏 ఏకాగ్రత ....!!

 🎻🌹🙏  ఏకాగ్రత ....!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸ఆత్మశుద్ధి లేని ఆచారం, భాండశుద్ధి లేని పాకం, చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థమంటాడు వేమన...!!

🌿ఏకాగ్రత లేని ఏ పనులు సైతం వ్యర్థమైనవే. 

🌸కార్యం- అది లౌకికమైనా, ఆధ్యాత్మికమైనా ఏకాగ్రత కొరవడితే చెడిపోతుంది.

🌿‘ధ్యానం’ అనే మాట తరచుగా వింటుంటాం. ధ్యానం, ఏకాగ్రత- రెండూ సహ భావనలే! ఆ రెండింటికీ సన్నిహిత సామ్యం ఉంది.

🌸ధ్యానం అనే మాటను పారమార్థిక దృష్టితో వాడతాం. సర్వసాధారణంగా ‘పరధ్యానం’ అనే మాటనూ ఉపయోగిస్తుంటాం. 

🌿ఎవరికైనా ధ్యానం అలవడాలంటే, ఏకాగ్రత కుదరాలి. అది సాధించాలంటే, ధ్యానం సాగించాలి.

🌸ప్రహ్లాదుడిది అనితరసాధ్యమైన విష్ణుభక్తి. తండ్రి ఎన్ని హింసలకు గురిచేసినా, అతడి మార్గానికి అవరోధం కలగలేదు. నమ్మిన దైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దానికి కారణం.

🌿అలాగే, తండ్రి ప్రేమ పొందాలని ధ్రువుడు చెక్కుచెదరని దీక్షతో తపస్సు చేశాడు. ఆ ధ్యానానికి మూలం ఏకాగ్రత.

🌸వశిష్ఠుణ్ని మించిన బ్రహ్మర్షి కావాలన్నదే రాజర్షి విశ్వామిత్రుడి ప్రగాఢ కోరిక. దాన్ని ఆయన ఏకాగ్ర చిత్తం, పట్టుదలతో తపస్సు చేసి సాధించాడు. 

🌿‘భగీరథ ప్రయత్నం’ అనే మాట వింటుంటాం. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింపజేయాలన్న తపన ఆయనది. అదే దీక్షతో, దివి నుంచి భువికి గంగ దిగివచ్చేలా తపస్సు ఆచరించాడు.

🌸ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయడం ఏకాగ్రత. దాన్ని ‘లక్ష్యం’ అనీ పిలుస్తుంటాం.

🌿ద్రోణుడు చెట్టును చూపించిన తక్షణం, దాని కొమ్మమీద గల పక్షి కన్ను అర్జునుడి లక్ష్యమైంది. అందుకే మేటి విలుకాడయ్యాడు. అంటే- లక్ష్యం, ఏకాగ్రత ఒక్కటే.

🌸మనిషి మనసు నిండా ఆలోచనల పరంపరలుంటాయి. అతడి స్వేచ్ఛకు, బంధానికి మనసే కారణమని విజ్ఞులు చెబుతారు. పరమ చంచలమైనది మనసు. దానికి స్థిరత్వం లేదు. ఆ స్థిరత్వాన్ని ఎలాగైనా సాధించడమే ఏకాగ్రత. 

🌿అభ్యాసం కూసువిద్య అంటారు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అనీ చెబుతారు. అభ్యాసం, సాధన వల్ల ఏకాగ్రత సాధించవచ్చు. 

🌸ఒకే లక్ష్యంపై మనసును కేంద్రీకరించవచ్చు. నిరంతర అభ్యాసం వల్ల మనసును ఎలా నిరోధించవచ్చో భగవద్గీత, పతంజలి యోగసూత్రాలు తెలియజేస్తాయి..

🌿ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలంటే, ముందుగా దానిమీద ఇష్టం ఉండాలి. 

🌸అది లేకుండా ఏ పని చేసినా, ఏ కోశానా ఏకాగ్రత కుదరదు. వ్యక్తి ఎప్పుడైతే సర్వశక్తుల్నీ 

🌿ఒక అంశంపైనే కేంద్రీకరిస్తాడో, అప్పుడే అతడి లక్ష్యసాధన మార్గంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 

🌸అందుకు వివేకానంద వంటివారి జీవితాలే ఉదాహరణలు.

🌿అవధానాలు చేసే పండితులు ఏకాగ్రతకే అధిక ప్రాధాన్యమిస్తారు. వారి దృష్టి ఎప్పుడూ సంబంధిత అంశం మీదే ఉంటుంది. దానికి సంబంధించిన ఆలోచనలు తప్ప, వేరేవీ వారి మనసులోకి ప్రవేశించవు.

🌸‘శబ్దం’ అనేది మనసును ఒక విషయంపై కేంద్రీకృతం చేయడానికి తోడ్పడుతుంది.

🌿పిల్లలు బిగ్గరగా చదువుతారు. అలా చదవడం వల్ల, వారి స్వరం సృష్టిస్తున్న శబ్దాలు చెవుల ద్వారా మనసులోకి చేరతాయి. ఆ మనసు వారు వల్లె వేస్తున్న విషయాలపైనే నిలిచి ఉంటుంది.. 

🌸బయటకు చదవడం వల్ల, వారి ఏకాగ్రత స్థిరపడుతుంది. వేదమంత్రాల్ని గట్టిగా చదవడం, వల్లె వేయడం వెనక అంతరార్థం అదే! ఏకాగ్రత సాధించేందుకు అదే మొదటి మెట్టు..

🌿అందరిలోనూ ఏకాగ్రత స్థాయి ఒకేలా ఉండదు. అందరికీ అన్ని విషయాలపైనా ధ్యాస నిలవదు. చేసే పని మీద ఇష్టం పెంచుకుంటే, మనసులో దృఢమైన సంకల్పం ఉంటే, ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయవచ్చు..

🌸ఇష్టం, సంకల్పం- ఈ రెండే ఏకాగ్రతకు సోపానాలు. వ్యాకులత, ఆరాటం, చంచలత్వం ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. మనిషి ముందుగా వాటిని జయించాలి..స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

ఇతరుల పట్ల మన వైఖరి సర్వ సామాన్యంగా ఇలా వుంటుంది

 *ఇతరుల పట్ల మన వైఖరి సర్వ సామాన్యంగా ఇలా వుంటుంది*.
1) ఇతరుల తప్పులు వెతకడానికి సర్వదా కాచుకొని వుంటాము.
 2)మన  కన్నా వాళ్ళు ఎక్కువగా గొప్పగా కనపడితే అంగీకరించక అసూయ పుడుతూ ఏమిటంట నీ గొప్ప అని ఎదో సాకు తో వారిని కించ పరుస్తాము. 
3)వారు కొంచెం మనం కన్నా తక్కువ వారైతే మీద ఎక్కి స్వారీ చేస్తాము.
4)మన బాధ్యతలు కూడా ఎదుటివారి మీద నెట్టివేస్తాం.
 5) మనకు నచ్చే విధంగా వారు వుండాలి అంటాము .
వుండక పోతే చెడ్డ వారిగా ప్రచారం చేస్తాము.
 6)మనలను ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుని అసూయ లేదా ద్వేషం, ఏర్పరచు కుంటాము 
7)ఇతరులు నుండి ఎప్పుడూ ప్రేమని  గౌరవాన్ని, పొగడ్తలని , అంగీకారాన్ని  కోరతాము 
8) మన పట్ల ఇతరులు సకారాత్మక (positive) భావోద్వేగాలే  కాని నకారాత్మక భావోద్వేగాలు(కోపం, ద్వేషం) ప్రదర్శించ కూడదు అంటాం 

సార్ధకత

 🟣 సార్ధకత 🟣 

ఒక పక్షి ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక మర్రి పండు కనిపించింది. మర్రిపండుని నోట కరుచుకుని ఎగురుతుండగా అది పక్షి నోటి నుండి జారి పడింది. మర్రి పండు పడిన ప్రదేశం ఒక గ్రామం ప్రక్కన ఉన్న మైదానం. మర్రిపండు మైదానంలో పడిన రోజునే బలమైన గాలులతో వర్షం కురిసింది. గాలులకు మట్టి రేగి మర్రిపండును కప్పేసింది. రెండు రోజుల తరువాత మర్రి పండు విచ్చుకుని అందులో ఉన్న గింజలు బయట పడ్డాయి. మర్రి గింజలు వాటిలో అవిమాట్లాడుకున్నాయి. ఒక గింజ సంతోషంగా “మన పక్షాన అదృష్టం ఉండ బట్టే మనమింకా బ్రతికి ఉన్నాము. లేదంటే పక్షి కడుపులో పడి జీర్ణం అయ్యేవారము అంది. మరో గింజ “నిజమే. పక్షి కడుపులోకి వెళ్ళి చనిపోయే వాళ్ళం. ఇలా మాట్లాడే అవకాశమే ఉండేది కాదు అని చెప్పింది. మిగతా గింజలు కూడా అవునవును అని సంబరపడ్డాయి.
 
మరో రెండు రోజులు గడిచేసరికి ఒక గింజ నుండి మొలక వచ్చింది. ఆ మొలకను చూసిన గింజ సంతోషంతో గెంతులు వేసి మీరంతా చూడండి. నాకు మొలక  వచ్చింది అని చూపించింది. మొలకను చూసిన మిగతా గింజలు ఆ మొలకను లాగి పడెయ్యి. మొలకెత్తావంటే నీ రూపం మారిపోతుంది. భూమి మీద కొత్త రూపంతో పెరుగుతావు. ఎదిగే క్రమంలో  ఎన్నో కష్టాలు పడాలి. కొన్నిసార్లు మనుషులు మొక్కల్ని పీకి పడేస్తారు. మరికొన్ని సార్లు పశువులు తొక్కి చంపుతాయి. లేదా నమిలి మింగుతాయి. ఇవన్నీ దాటుకుని మొక్కగా పెరిగాలి. ఒకవేళ ఎదిగావనుకో, కావలసినంత నీరు అందాలి. అలా నీరు దొరకకపోయినా ఎండిపోయి చస్తావు. అన్ని కష్టాలు పడలేవు కానీ మాలాగా గింజ రూపంలోనే ఉండిపో. మనమంతా  హాయిగా కలసి గడుపుదాం అన్నాయి. మిగతా గింజల  మాటలు ఆలకించింది కానీ  మొలక వచ్చిన గింజ జవాబు చెప్పలేదు. తన మొలకను వేరు చేయలేదు. కొన్ని రోజులకు మర్రి మొక్క భూమి మీదకు వచ్చి ఎదగడం ప్రారంభించింది. దాని కాండం నిటారుగా ఎదిగింది. కొమ్మలు  ప్రక్కలకు పెరిగాయి. ఎన్నో  ఆకులు మొలిచాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి పెద్ద వృక్షంగా ఎదిగింది.
 
ఎండ వేడి నుండి రక్షణ కోసం రైతులు, బాటసారులు మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవారు. పశువులు, జంతువులు రాత్రి వేళల్లో, వర్షం కురిసినప్పుడు చెట్టు క్రింద తల దాచుకునేవి. పక్షులు చెట్టు మీద గూళ్ళు కట్టుకున్నాయి. మర్రి చెట్టు నిత్యం ఎందరికో ఆశ్రయం ఇస్తుండడం వలన అక్కడ సందడిగా ఉండేది. అప్పుడప్పుడు వైద్యులు మర్రి చెట్టు దగ్గరకు వచ్చి మర్రి బెరడు, పాలు , ఆకులు, మొగ్గలు కోసుకుపోయే వారు. వాటిని వైద్యం కోసం ఉపయోగించేవారు. మైదానానికి ఆడుకోవడానికి  వచ్చే పిల్లల్లో కొందరు మర్రి ఊడలతో ఊయల ఊగి ఆనందించేవారు. అవన్నీ చూసి మర్రిచెట్టు సంతోషించేది. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజు భయంకరమైన తుపాను వచ్చింది. చాలా బలమైన గాలులు వీచాయి. ఏకధాటిగా వానలు కురిసాయి. తుపాను ధాటికి ఎన్నో వృక్షాలు నేలకొరిగాయి. అప్పుడే మర్రి వృక్షం కూడా నేలకు ఒరిగింది. మర్రి వృక్షం అలా ఒరిగిపోయినందుకు ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. మర్రిచెట్టు కొమ్మల మీద నివసించే పక్షులు , జంతువులు మూగగా రోదించాయి. మరికొన్ని రోజులకు మర్రి చెట్టు పచ్చదనం తగ్గిపోగానే గ్రామస్తులు గొడ్డళ్లతో నరికి చెట్టు కొమ్మలను, కాండాన్ని వంట చెరుకుగా, గ్రుహోపకరణాలుగా వాడుకున్నారు. కలప మోసుకు వెళుతున్నవారు బ్రతికినప్పుడే కాకుండా చనిపోయాక కూడా ఉపయోగపడిందని చెప్పుకున్నారు. 

స్వార్ధంతో గింజలుగా భూమిలోనే ఉండి పోయిన మిగతా గింజలు తమ సోదరుడికి లభిస్తున్న ప్రశంసలు విని సంతోషించాయి. మరో వైపు సిగ్గుపడ్డాయి. వాటిలో ఒక గింజ మనమంతా దిద్దుకోలేని పొరపాటు చేసాము. ఎలా పుట్టామో అలాగే మిగిలిపోయాము. ఎవరికీ "ఉపకారం" చేయలేకపోయాము. మనల్ని గుర్తుపెట్టుకునే మంచి పని ఒక్కటి కూడా చేయలేకపోయాము. పుట్టిన  ప్రతి జన్మకూ సార్ధకత ఉండాలి. మన జన్మ మాత్రం  వృధా అయింది. పక్షి నోటి నుండి జారిపడి నందుకు మనం గొప్ప "అవకాశం" పొందినప్పటికీ   వృధా చేసుకున్నాము. మన సోదరుడు మాత్రం మంచి పని చేసాడు. మరణించి కూడా జనం గుండెల్లో, వారి ఇళ్లల్లో నివాసం ఏర్పరుచుకున్నాడు. జీవితమంటే మన సోదరుడిదే అంది. అది విన్న మరొక మర్రి గింజ కొందరు పిరికితనంతో బ్రతుకుతారు. ఇప్పుడు మనం చేసిన తప్పే చేస్తుంటారు. ఇతరులకు మేలు చేసే జీవితం వలన తృప్తి కలుగుతుందని తెలుసుకోలేక జీవితాన్ని  వృధా చేసుకుంటారు. ప్రక్కవారికి చేసే సేవల వలన చిరస్థాయిగా పేరు నిలుస్తుందని తెలుసుకుని ఒకరికొకరు సాయపడుతూ బ్రతికితే ఎంతో బాగుంటుంది” అంది. జరిగిపోయిన దాన్ని వెనక్కు తీసుకురాలేము కాబట్టి ఇతరులకు  సహాయపడినప్పుడే ఈ జన్మకు సార్థకత...🟣

🌳సమస్త లోకా సుఖినోభవంతు🌳
 🪷🪷🙏❤‍🔥 🌳 ❤‍🔥🙏🪷🪷

నేటి ఆణిముత్యాలు .

 నేటి ఆణిముత్యాలు .

పనికిమాలిన వాళ్ళు మాట్లాడే ప్రతిమాటకు బాధపడకూడదని,
నీ మనసుకు నువ్వు చెప్పుకుంటే చాలు...

కష్టాల్లో తోడు ఉండే వారికంటే,
అవసరానికి వాడుకునే వారే ఎక్కువ ఈ రోజుల్లో..అందుకే అన్ని తెలిసి మనం మోసపోతున్నాం..

ఏదీ శాశ్వతంకాదు ప్రపంచంలో...?
అన్నీ స్వల్పకాలిక బంధాలే!మనమంతా కూడా..కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే.!

ఎప్పుడు ఎవరికి ఎలా రాసిపెట్టుందో...?ఎవ్వరు చెప్పరు, చెప్పలేరు!
జీవితంలో ఎన్నో మామూలు సన్నివేశాలుంటాయి,
వాటిలో సరదాలుంటాయి..!
ఆలోచిస్తే, అర్ధం చేసుకోగలిగితే...
వాటి వెనుక కానరాని సత్యాలు ఉంటాయి..!

వాచ్ మనదైన మాత్రాన, కాలం మనకు అనుకూలంగా ఉంటుంది అనుకోవద్దు..
మన మనోధైర్యమే మన బలం..
మనం సృష్టించుకున్న భయమే మనకు శత్రువు...

ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా,
విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

Wednesday, October 26, 2022

"ఆణిముత్యాలు". (Golden Words)

 "ఆణిముత్యాలు".   (Golden Words)  
         🔥🔥🔥
🚩" సమర్పణ: Mazumdar
 Bangalore.
87925-86125.
            🇮🇳🇮🇳🇮🇳              
 1) "complaints" వద్దు  "   ,"compliments"   మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు.

        2)"కృషితో పాటు పట్టుదల ఉండాలి".

      3) సముద్ర ప్రవాహం వంటి  మీ కోపాన్ని తగ్గించుకోండి.

     4) "సత్పురుషుల  ధర్మం "అతి సూక్ష్మంగా" ఉంటుంది. 

  5)"మంచం" నిన్ను చీదరించుకో కుండా లేవండి.".

 6)"మీరు అనుకున్న గమ్యాన్ని చేరటానికి" సక్సెస్" అంటారు.

     7)"నీవు "ఆటోగ్రాఫ్" ఇచ్చే వాడివి అయితే  నీవు జీవితంలో "సక్సెస్" అయినట్లే,"

. 8)"రేపు నీవు ఎలా ఉండాలో ఈ రోజు రాశి పెట్టుకో!".

 9) "ఎప్పుడు మీరు చేసే పని  "ఇష్టపడి"  చేయాలి, "కష్టము"  అని నమ్మి చేయ  కూడదు.

  10)"నీ సమయాన్ని నీవు ఉపయోగించుకోకపోతే , "లక్ష్యం" గల వాడికి మీ సమయాన్ని ఉపయోగించుకుంటారు

. 11) "లక్ష్యం "ఉన్నవాడు "లీడర్ " అవుతాడు. లేకపోతే నీవు "లక్ష్యం" ఉన్నవాడికి  పనిచేసే "లేబర్" గానే  నీవు ఉండిపోతావు.

  12)"నీ కంటూ లక్ష్యం ఉంటే, నీ లక్ష్యం కోసం పని చేస్తావు.    నీకు నీవు ఉపయోగ పడతావు, లేకుంటే   నిన్ను వేరే వారు ఉపయోగించుకుంటారు.

13)"మీ మస్తకము లోని విషయాలు ఇతరులతో పంచుకోండి".

    14)"నీవు ఈ భూమి మీదకు వచ్చినది "ఇచ్చి పోవడానికి," పదిమంది గుండెల్లో ఉండాలి నీవు,

 15)"నీవు పంచుకుంటావా! నీవు "తుంచు" ఉంటావా? పెంచు కుంటావా? ఇది నీ వ్యక్తిత్వము, నీ "ఆలోచన సరళి " మీదే ఆధారపడి ఉంటుంది. ". 

   16)"Wife" లేకపోతే    " Life" లేదు. (నీ వద్ద టన్నుల కొద్దీ "ప్రేమ" ఉంది కానీ ఏమి ప్రయోజనం?)


    17)"మీరు గొడవలు పెంచకండి, "అగ్రిమెంట్" ఎవరి కి చేయకండి".

      18)"ఎడిషన్" అన్నాడు,"బల్బు" ఎలా చేయకూడదో నాకు మాత్రమే తెలుసు.
 19)"రామోజీరావు" :-నేను పట్టేది ముట్టుకునే ది బంగారం. 

  20)" టాటా":-"నేను ఏమనుకుంటానో, అనే "అదే జరుగుతుంది" అని.
      ఇవి మీకు నచ్చిన, మరికొన్ని తర్వాత చెప్పుకుందాం!
    సదా మీ సేవలో,
"మజుందార్ బెంగళూరు"
💐💐💐💐💐💐


  "  "సేకరణ & సమర్పణ:"Mazumdar, Bangalore"

మంచి మాట.. లు(26-10-2022)

బుధవారం --: 26-10-2022 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
మీరు ఒకరి గురించి మంచిగా చెప్పకపోయినా పర్లేదు కానీ చెడుగా మాత్రం చెప్పొద్దు, పని పాటలలేక ఏమి తోచక ఎవరో ఒకరి సంతోషం ఆనందం కొసం చేప్పే మాటలు ఇంకోకరి జీవితం నాశనం కావటానికి కారణం అవుతుంది
ఒకసారి మీరే ఆలోచించండి .

నీలో ఉన్న చికాకులన్నీ ఎగిరిపోవడానికి నీ చిన్న చిరునవ్వు చాలు , నీ కన్నీళ్ళు ఆగిపోవటానికి చల్లని చూపుచాలు , నీ గుండె మంట చల్లార్చటానికి మాట్లాడే తీయని మాట చాలు , మనం ఉన్నామని భరోసా ఇవ్వడానికి మంచి స్నేహం చాలు, మంచి స్నేహితుడు ఉంటే ఆత్మీయ బంధం ఉన్నట్లే .

జీవితం నీది, స్వప్నం నీది,గమ్యం నీది, కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్నీ నీవే , కింద పడితే లేవాల్సింది నువ్వే , బాధను దిగమింగుకోవాల్సింది నువ్వే , నీకేమైన గాయాం అవుతే ఆ గాయాన్ని భరించాల్సింది నువ్వే , దైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే, ఇతరులు కేవలం చోద్యం చూస్తారు,వీలైతే ఎగతాళీ చేస్తారు నీవు ఎవర్నీ పట్టించుకోవద్దు సాగిపో దైర్యంగా మొరిగే కుక్కలని పట్టించుకోకుండా.అప్పుడు .విజయం నీ ఇంటి కాపలాదారు గా మారుతుంది


సేకరణ ✒️మీ ...AVB సుబ్బారావు 🚩🕉️

ఓ ఉత్తమ ప్రజ్ఞాశాలి,!

 ఓ ఉత్తమ ప్రజ్ఞాశాలి,! 

ఊహాతీతము, అద్వితీయము అగు మాయకు సాధ్యము కానిది ఏమి కలదు? 

పిండము - దేహము - మొదలుకొని బ్రహ్మాండము వరకు గల విశ్వము యొక్క సృష్టిని గురించి చెప్పెదను; వినుము.

చిదాకాశరూపమగు జీవాత్మ యందు ఆలోచనల రూపంలో ఉన్న ఇదంవృత్తి యను విక్షేపశక్తి కోట్ల కొలది వాసనలను కల్పించును. 

వాసనల చేత కలతపడిన జీవుడు చిదాకాశ రూపమగు తన ఆత్మను శరీరము మొదలగు అనేక రూపములు గలదానిగా దర్శించును. 

చేతులు కాళ్లు మొదలగు అవయవములు గల ఈ శరీరము నాది, నేను ఈ తండ్రికి కొడుకును, నాకు ఇన్ని ఏండ్లున్నవి అని జీవుడు భావించును; 
మరియు వీరు నాకు ఇంపైన బంధువులు, ఇది నా అందమైన ఇల్లు. ఆమె ఈమెయే. అతడు ఇతడే. నేను, నీవు, ఇది, అది మంచి - చెడులు సుఖ- దుఃఖములు, బంధ-మోక్షములు, 
జాతివర్ణ - ఆశ్రమాదులు, దేవతలు - పశుపక్షాదులు, నరులు మొదలగువారు, మంచివారు, చెడ్డవారు, మధ్యములు, భోక్త, భోగము, భోగ్యవస్తు సముదాయము, లోకములు, కోట్లకొలది బ్రహ్మాండములు - ఇట్టి అసత్య భావనలు జీవుని ఆత్మయందు భాసించును.

మనశ్చలనము చేత కలిగిన వాసనలు నానా రూపములలో ఉండును; 

సహజముగా నిర్వికారుడగు జీవుడు నిద్రించి భ్రాంతి వలన వాసనలకు వశుడయి లోకములను (జాగ్రదావస్థలో) చూచు విధముగా అనేక విధములగు దేహములను చూచును.

ఓం తత్ సత్

కర్మలు

 *🍁కర్మలు🍁*

✍️ మురళీ మోహన్ 
🍁 అనగనగా ఒక రాజు ఉండేవాడు .ఆ రాజు ఒకసారి తన రాజ ప్రసాదం లో తన ముగ్గురు మంత్రులను రమ్మని ఆదేశించాడు .వాళ్ళు వచ్చిన తరువాత వారికి మూడు సంచులు ఇచ్చి తోటలోకి వెళ్లి మంచి పళ్ళు కోసుకొని సంచులు నింపుకొని తొందరగా రావాలని ఆదేశించాడు.మంత్రులు వెంటనే తోటలోకి వెళ్లి కోయడం మొదలు పెట్టారు.

1)మొదటి మంత్రి:కష్టమైనా పర్వాలేదు అనుకోని రాజు కోసం మంచి మంచి పళ్ళు ,రాజుకు ఇష్టమైన పళ్ళు కోసి సంచి నింపాడు.

2)రెండో మంత్రి : ఆ రాజు ఇవన్ని పరీక్షా పెట్టి చూస్తాడ ఏదో ఒకటి అనుకోని కొన్నిమంచి పళ్ళు,కొన్ని పండనివి మరికొన్ని పనికిరానివి అన్ని కలిపి తొందరగా సంచి నింపుతాడు.

3)మూడో మంత్రి: రాజు ఎన్ని పళ్ళు తెచ్చారు ,ఎలా ఉన్నాయి అని చూస్తాడ ? ఆయనకి నిండిన సంచులను చూస్తాడు అంతే అని అనుకోని సంచి లోపల గడ్డి వేసి సంచి నింపాడు.మిగతా వారి కంటే తొందరగా ఇతని పని అయిపొయింది.

రెండో రోజు ఆ రాజు ముగ్గురి మంత్రులను పిలిచి ఆ సంచుల్లో ఏముందో కూడా తెలుసుకోకుండా వారిని 3 మాసాలు ఆ సంచులతో సహా ఖైదు చెయ్యవలసిందిగా సైనికులకు ఉత్తర్వులు ఇచ్చాడు.
ఆ కారాగారం లో మూడు మాసాల వరకు వారికి తినడానికి ఏంలేదు వారు తెచ్చుకున్న సంచులలో పళ్ళు తప్ప .మొదటి మంత్రి మాత్రం తను తెచ్చుకున్న మంచి పళ్ళు తినుకుంటూ మూడు నెలలు గడిచిపోయాయి . ఇక రెండో మంత్రి తను తెచ్చుకున్న కొన్ని మంచి పళ్ళు తిని ఆ తరువాత పనికిరాని పళ్ళు తినడం వల్ల అతని ఆరోగ్యం దెబ్బతింది.మూడో మంత్రి తను తెచ్చుకున్న గడ్డి వల్ల తనకి ఎం ఆహారం దొరకక కొన్ని రోజుల్లోనే చనిపోయాడు.

😱   ఒకసారి మనం అందరం ఆలోచికుందాం మనం ఏం కర్మలు చేస్తున్నామని.ఎందుకంటే మన కర్మనుసారమే మనకు ప్రతిఫలము లభిస్తుంది.ఆ భగవంతుడు సర్వంతర్యామీ అన్ని చూస్తుంటాడు.మన సత్కర్మలకు ,మన దుష్కర్మలకు మనమే బాధ్యులం. 🍁

అనుభవమే జ్ఞానం (book author రామిరెడ్డి మానస సరోవరం) audio from youtube

 నమస్తే .నా పేరు రామిరెడ్డి మానస సరోవరం .నేను రాసిన అనుభవమే జ్ఞానం బుక్ గ్రంథాలయం పేరిట PMC ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది. ఆ బుక్ మొత్తం వినాలనుకుంటే ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి వినవచ్చు.మొత్తం ఎపిసోడ్స్ ఇందులో ఉన్నాయి.

 https://youtube.com/playlist?list=PLbNU53JJdvs1xPhY-57Y406CPPdb8hFLy

ఆందోళన

 ::::::::::::*ఆందోళన* :::::::::::
      మనం ఎక్కువగా క్రింద చెప్పిన కారణాల వల్ల ఆందోళన చెందుతాం.
*1)*  భవిష్యత్తు లో కీడు నష్టం కష్టం కలగ వచ్చు అని ఊహిస్తూ, ఊహా నిజం అను కుంటాము
*2)*  మనలను మనం తక్కువ అంచనా వేసి రాబోయే కష్టం భరించ లేము అనుకుంటాం.
*3)*  రాబోయే రోజులన్నీ గడ్డు రోజులు అనుకుంటాం.
*4)*   వ్యతిరేక పరిస్థితులను భూతద్దంలో చూస్తాం.
*5)*  పర్యవసానాలను సరిగ్గా అంచనా వేయం,మంచిని చిన్నగా చూసి చెడును పెద్దగా చూస్తాం.
*6)*  సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకోము.
*7)*  ఎప్పటి కప్పడు రిలాక్స్ అవ్వకుండా టెన్షన్ తోనే జీవిస్తూ ఉంటాము.
     మీరు ఆందోళన నుంచి బయటకు రావాలంటే, అవగాహనను కలుపుకునే ధ్యానం చేయండి.
      
        ఇట్లు
  అభ్యాసి  లేని  అభ్యాసం

మనిషికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు అన్న ఆ మహానుభావుడి మాటను నిరంతరం గుర్తెరిగి మన లక్ష్యాన్ని సాధించుకుందాం

 ఈరోజు మన జీవిత సత్యాన్ని తెలుసుకుందాం

         జీవితం సముద్రం ఒడ్డూన మెరిసే నీటి బుడగ లాంటిది.  నీటి బుడగ దూరం నుండి చూసినప్పుడు చాలా అందంగా కనబడుతుంది. తెల్లవారు జామున వచ్చే లేత సూర్య కిరణాలు దానిపై పడినప్పుడు ఏడు రంగుల ఇంధ్రధనస్సు ఏర్పడుతుంది ఆ ఇంధ్రధనస్సు యెక్క రంగులతో మెరిసిపోతుంది. ఇదంతా దూరం నుండి చూసినప్పుడు, కాని దగ్గరకు వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు అది పగిలిపోయి మాయమైపోతుంది. జీవితం కూడా అంతే నీటి బుడగ లాంటిది. దూరం నుండి చూసినప్పుడు చాలా అందంగా కనబడుతుంది. కాని జీవితం లోతుల్లోకి వెళ్లి చూస్తే మనిషి ఇంత ఆశలతో కోరికలతో తలమునకలై జీవిస్తుంటే మరణం అనేది వచ్చి అన్నిటిని కూల్చేసి జీవితం  అశాశ్వతమైనది నీటి బుడగలాంటిది అనే సత్యం ప్రకటిస్తుంది. దీనినే మృగమరీచిక అంటారు. దూరం నుండి అందంగా ఉండేవన్ని దగ్గరకు వచ్చాక సత్యం ప్రకటిటమయ్యాక అందంగా ఉండవు. అదంతా మన భ్రమ.

 అందుకే మనిషి జీవితం బురదలో కమలంలా ఉండాలి. దేన్ని ఆశించకుండా, అతిగా వెళ్లకుండా సమంగా ఉండాలి. ఏలాగైతే పువ్వులో మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద పువ్వుకు ఎలాంటి హాని చేయకుండా తీయదనాన్ని ఎలా రుచి చూస్తుందో  అలాగే మనిషి ఈ ప్రపంచం యొక్క ఆకర్షణల్లొ , బంధాల్లో చిక్కుకోకుండా స్థితప్రజ్ఞాతతో జీవించాలి. అలా కాకుండా కొన్ని తుమ్మెదలు పూలల్లో మకరందాన్ని ఆస్వాదిస్తూ తమని తాము మర్చిపోయి ఆ పువ్వు ముడుచుకున్నప్పుడు ఆ రెక్కల మధ్యల్లో పడి చచ్చిపోతాయి. చాలా మంది మనుషుల జీవితాలు కూడా అలాగే ఆకర్షణల్లో చిక్కుకొని మరణిస్తారు. జీవితమంటే తామరాకు మీద నీటి బిందువులా నిర్లిప్తంగా ఉండాలి. జ్ఞానోదయం పొందడానికి అదే తొలి అడుగు అవుతుంది.     

అలాగే మనలో ఉన్న శక్తిని గుర్తించలేక అంతా బయటే వెతుకుతున్నాం . ఆ ఊరు వీధిలో ఒక కరెంట్ స్థంభానికున్న దీపం వెలుగులో ఒక అవ్వ దేనికోసమో వెదుకుతూంది. వీధిలో అటూ ఇటూ వచ్చి వెళ్ళేవారు, "అవ్వా ! దేని కోసం వెదుకుతున్నావు ?" అని అడిగారు.
"వజ్రపు ఉంగరం పోగొట్టుకున్నాను, నాయనా ! దాన్ని వెదుకుతున్నా," అంది అవ్వ.
అది విని,అవ్వకు సహాయంగా, ఆ ఉంగరం కోసం అందరూ వెదుకుతూన్నారు. ఉంగరం ఎంతకూ దొరకలేదు. గంటలు గడిచిపోయాయి.
వారిలో ఒకరు,"అవ్వా ! ఉంగరాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావు ?" అని అడిగారు. 

🔺 " నా పూరి గుడిసెలో పోగొట్టుకున్నాను,నాయనా !"అంది అవ్వ. 
"నువ్వో పిచ్చి అవ్వ ! పూరి గుడిసెలో పోగొట్టుకుని ఇక్కడ ఎందుకు వెదుకుతున్నావు ?" అన్నారందరూ.

🔺 అవ్వ బిగ్గరగా నవ్వి,ఓరి "వెర్రి వెంగళప్పలారా ! మీరు జీవిత కాలమంతా చేస్తున్నది అదే కదా ! మీలోనే సర్వ శక్తిసామర్థ్యాలను కలిగివుండి కూడ మీ సమస్యల పరిష్కారాల కోసం, లక్ష్యాల సాధన కోసం బాహ్య ప్రపంచంలో వెదుకుతున్నారు" అన్నది. నిజానికి మనం చేస్తున్నది ఇదే. పితామహ పత్రీజీ చెప్పినట్లు సర్వ శక్తులు మనలోనే ఉన్నాయి. మనిషికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు అన్న ఆ మహానుభావుడి మాటను నిరంతరం గుర్తెరిగి మన లక్ష్యాన్ని సాధించుకుందాం మిత్రులారా! 

సేకరణ .మీరామిరెడ్డి మానస సరోవరం👏

అతడొక బీదవాడు. బీదరికం నుంచి విముక్తి పొందాలన్నది అతడి తీవ్రమైన కోరిక. ఏం చేశాడో చూద్దాం.

 అతడొక బీదవాడు. బీదరికం నుంచి విముక్తి పొందాలన్నది అతడి తీవ్రమైన కోరిక. ఏం చేశాడో చూద్దాం. 

ఒక భూతాన్ని వశపరచుకొంటే దాని ద్వారా కోరినదంతా తెచ్చుకోవచ్చుననుకొన్నాడు. సమీపంలోని అడవిలో ఆ వశీకరణ మంత్రాన్ని అనుగ్రహించే మహాత్ముడున్నాడని తెలుసుకొని వెళ్లి, అతడి కాళ్లమీద పడ్డాడు. భూతాన్ని వశం చేసుకునే మంత్రాన్ని ఉపదేశించమని బతిమాలాడు. మహాత్ముడు ఆలోచించి 'నీకెందుకయ్యా భూతం? దానితో వ్యవహారం చాలా కష్టం. నీవిప్పుడు సుఖంగా ఉన్నావు. పేదరికంలో మనశ్శాంతి ఉంటుంది. సంపద పెరిగితే తాపత్రయాలు పుట్టుకొస్తాయి. నీవు కష్టాలపాలవుతావు. నెమ్మదిగా ఇంటికెళ్లు' అన్నాడు.
బీదవాడు వినలేదు. అతడి దైన్యాన్ని గమనించి మహాత్ముడు 'నేను చెప్పిన మంత్రాన్ని ప్రతిదినం ఉదయం జపించు. భూతం నీ వశమవుతుంది. నీవు చెప్పిన పనులన్నీ చేస్తుంది. కానీ జాగ్రత్త... భూతం చాలా భయంకరమైనది. దానికి సదా పని కల్పిస్తుండాలి. తగినంత పని కల్పించకపోతే అది నీ ప్రాణాలు తీస్తుంది' అన్నాడు. బీదవాడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
'స్వామీ, తమ సూచన మేరకు కావలసినంత పని కల్పిస్తాను' అంటూ కొన్ని రోజులు శ్రద్ధగా మంత్రాన్ని జపించాడు. వారం రోజుల తరవాత పెద్ద భూతం ప్రత్యక్షమైంది.
'ఇదో వచ్చాను. నీ మంత్రంతో నన్ను వశపరచుకొన్నావు. ఇకమీద, నాకు ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించి తీరాలి. పని చెప్పకపోయావో నిన్ను చంపేస్తాను' అన్నది.
'అయితే నాకో రాజ భవనం కట్టించు' అన్నాడు. తన మనసులో భూతానికి పెద్దపనే కల్పించాననుకొన్నాడా బీదవాడు. రాజభవనం నిర్మించడానికి చాలాకాలం పడుతుందిలే అనుకొన్నాడు. చూస్తుండగానే రాజభవనం, ఉద్యానవనం అన్నీ తయారయ్యాయి. 'మరేం చేయాలో చెప్పు' అన్నది భూతం.
'సమీపంలోని అడవిని కూల్చి ఒక మహా నగరాన్ని నిర్మించు' అన్నాడు బీదవాడికేమీ తోచక. నగర నిర్మాణం కొన్నేళ్లు పడుతుందనుకొన్నాడు. భూతం కొన్ని నిమిషాల్లోనే అద్భుతమైన నగరాన్ని సృష్టించింది.
బీదవాడు వణికిపోయాడు. మరేం పని చెప్పాలో పాలు పోలేదు. దిక్కుతోచక నేరుగా మహాత్ముడి వద్దకు వెళ్లాడు. 'స్వామీ, నన్ను కాపాడండి' అంటూ ఏడ్వసాగాడు. 'ఎంత కష్టమైన పని చెప్పినా క్షణాల్లో పూర్తిచేస్తుంది. పని చెప్పమంటుంది. నేను ఏమీ చెప్పలేకున్నాను. స్వామీ నన్ను కాపాడండి' అని పాదాలపై పడ్డాడు. ఆయన- 'అయితే, ఆ కుక్కను పట్టుకో. దాన్ని తీసుకెళ్లి దాని తోకను నిటారుగా ఉంచమని చెప్పు' అన్నాడు మహాత్ముడు.
బీదవాడు ధైర్యంగా ఆ కుక్కను పట్టుకెళ్లి భూతం చేతికిచ్చాడు. 'వెంటనే ఈ కుక్క తోకను నిటారుగా చెయ్యి' అన్నాడు. భూతం 'ఇదేం పెద్దపని!' అంటూ కుక్క తోకను తన రెండు చేతులతో నిలబెట్టి చేతులు తీయగానే వంకర! భూతం ఎన్నిసార్లు యత్నించినా ఏం లాభం, మళ్ళీ వంకరే! వారం రోజులు చేసినా సాధ్యం కాలేదు. బీదవాడి దగ్గరకు వెళ్లి, 'ఈ కుక్క తోకను నిటారుగా పెట్టించే పని మాన్పించు, నేను నిర్మించిన వాటినన్నింటినీ నీకే అప్పగిస్తాను. నిన్ను చంపనని ప్రమాణం చేస్తాను' అన్నదా భూతం.
బీదవాడు సమ్మతించాడు. బతికాను అంటూ భూతం కాళ్లకు బుద్ధి చెప్పింది. బీదవాడు మహాత్ముడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తన రాజమందిరం చేరాడు.
ఈ కథను స్వామి వివేకానందులు తమ కర్మయోగంలో చెప్పారు. ఈ ప్రపంచాన్ని దిద్దడానికి మనం యత్నించరాదు. మనకొక ప్రయోజనం ఉంది. ముందు మనసును స్థిరంగా ఉంచుకోవాలి. దాని వంకర పోతుంది. స్థిరమైన మనసుతో మంచి పనులు చేపట్టాలి. అప్పుడే మనసుకు శాంతి లభిస్తుంది. లోకం సుఖంగా ఉండగలదు. 'మనసు మర్మమెరిగినవాడె ఘనుడు' అన్నారు త్యాగరాజస్వామి.

సేకరణ .మీ రామిరెడ్డి మానస సరోవరం👏

Tuesday, October 25, 2022

దుఃఖం /కోపం ↔️ వద్దు

 *దుఃఖం /కోపం ↔️ వద్దు*
 1)మనందరం ఎ రూపంలో అయినా దుఃఖం వద్దు అనుకుంటాం. అలాగే 
   చిన్న పాటి కష్టం కాని నష్టం కాని ఇబ్బంది కాని వద్దు అనుకుంటాం.అందు వల్ల దుఃఖం +వద్దు  అనేవి మనస్సు లో జత కట్టింది. 
     2)చాలా విషయాలు వద్దు అంటాం . వద్దు అనుకున్న వన్నీ దుఃఖం కలిగించేవి కాక పోవచ్చు. కోపాన్ని కలిగించక పోవచ్చు 
     కాని వద్దు మరియు దుఃఖం/కోపం జత కలవడం వల్ల మనం సిద్దాంతపరంగా, ఆదర్శంగా, వద్దు అనుకున్నవన్నీ దుఃఖం లేదా కోపం తెచ్చి పెడుతున్నాయి.
    అందుకే మనకు మాట్లాడితే ఏడుపు, ఇష్టం లేనిది, గిట్టనిది అంటే ఏడుపు, ఈ రకంగా, దుఃఖం,లేదా  కోపం సరైన కారణం లేనిదైనది.
   ఓర్పు, సహనం,అంగీకారం,
రాజి పడటం, రిలాక్స్ అవడం తగ్గి పోతుంది.
  ఇట్లు 
దుఃఖితుడు లేని దుఃఖం.

అహం బ్రహ్మాస్మి: నేనే బ్రహ్మను..........!!

 అహం బ్రహ్మాస్మి: నేనే బ్రహ్మను..........!!
**

'అహం బ్రహ్మ అస్మి' అంటే నేను 'బ్రహ్మ' అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే 'బ్రహ్మ' ఉన్నాడనే భావన రావాలి. నేనే బ్రహ్మను, నేను ఏం చేసిన అది బ్రహ్మాజ్ఞ అంటే కుదరదు!

మనం చేసేది మనసా, వాచా, కర్మణా అంతరాత్మ చెప్పిందే అయితే నిశ్చయంగా మనం 'బ్రహ్మమే"! దీని ప్రకారం బ్రహ్మ ఎవరో కాదు, నేనే అని ఈ ఉపనిషత్తు వాక్యం చెబుతుంద. ఇక మరో మహావాక్యం తత్వమసి. తత్వం అంటే నువ్వు, నువ్వు కూడా బ్రహ్మవే అని దీని అర్థం.

సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చిన వాక్యం ఇది. మరో మహత్తర వాక్యం 'అయమాత్మా బ్రహ్మ'. అంటే ఈ ఆత్మే బ్రహ్మ అని అర్థం.

అధర్వణవేదంలోని ముండకోపనిషత్తు నుంచి ఈ వాక్యం వచ్చింది. ఈ మహత్తర వాక్యాల సారాన్నంతా మళ్లీ ఒకే వాక్యంలో చేర్చి చెప్పటం జరిగింది. అదే 'సర్వం ఖల్విదం బ్రహ్మ'. అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప మరేమీ కాదు!ఈ వాక్యాల సారం అర్థమయితే చాలు, భగవంతుడు మరెక్కడో లేడు-మన అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ ఉన్నాడనే భావన వస్తుంది.

మన అంతరంగంలో అన్వేషిస్తే దీనికి సరైన సమాధానం లభిస్తుంది. బయట వెతికితే ఏమీ లభించదు .శంకరులు "అహం బ్రహ్మస్మి" అన్నారు. వెంటనే శిష్యులు కూడా "అహం బ్రహ్మస్మి" అన్నారు. మరి కొందరు అహంకారులు "అహం పరబ్రహ్మస్మి" అన్నారు.

ఇంకా కొందరు అహంకారులు "అహం పరాత్పర బ్రహ్మస్మి" అన్నారు. అనగా శంకరులు నేను బ్రహ్మము అనగా కొందరు శిష్యులు నేను బ్రహ్మమునే అనియు, మరి కొందరు శిష్యులు నేను బ్రహ్మము కన్న అధికమైన పరబ్రహ్మము అనియు, నేను పర బ్రహ్మము కన్న ఇంకా అధికమగు పరాత్పర బ్రహ్మమనియు అన్నారు. బ్రహ్మమగు శంకరులు చెప్పిన విషయాన్నిఎవరూ గ్రహించలేక పోయారు! ఈ తత్వసారాన్ని తెలుసుకోవాలంటే అహంకారాన్ని పూర్తిగా వదలివేయాలి! చాలా మంది అహంకారం, గర్వం ఒకటే అని అనుకుంటారు . గర్వం వేరు, అహంకారం వేరు. 'అహం' అన్నది 'నేను' అనే వ్యక్తిత్వ భావన ఎక్కువైతే వచ్చేది.

'నేను' కు మూలంలోకి వెళ్ళితే తప్ప 'అహం' అసలు స్వభావం తెలియదు.

' అహం బ్రహ్మస్మి ' అన్నారు పెద్దలు.' అహం ' అంటే 'ఆత్మ' అని వారి భావన. నిర్గుణబ్రహ్మస్థితి కలిగి 'సోహం' మంత్రమును శ్వాస, నిశ్వాసాల ద్వారా నిరంతరము జపించేవారికి ఆత్మతత్త్వము తెలుస్తుందని కొందరి అభిప్రాయం. 'సోహం' అనగా 'అదే నేను' అని అర్థం. 'అహం బ్రహ్మస్మి' అనే మహావాక్యానికి ఇది మంత్రరూపం. ఇది ప్రతివ్యక్తిలోను వారికి తెలియకుండా ఉఛ్వాసలో 'సో' అని, నిశ్వాసలో 'హం' అని నిత్య సాధన జరుగుతుంటుంది. దీన్నే'అజపాగాయత్రి' అని అంటారు.

పూర్వం కణాదుడనే తత్వవేత్త ఉండేవాడు. అతను ప్రతి పదార్థం అణువులతో నిర్మితమై ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు అణువులు విడిపోవడం వల్లే పదార్థం ముక్కలవుతుందని భౌతిక నిజాన్ని ఊహించాడు కానీ అతను కూడా భౌతికతకి వ్యతిరేకమైన ఆత్మని నమ్మాడు. ప్రతి పదార్థంలో ఆత్మ ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు

ఆత్మ కూడా ముక్కలవుతుందని నమ్మాడు. గ్రీక్ తత్వవేత్త ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మాడు.

పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు. "తానూ, దైవమూ ఒక్కటేనని, అలాంటి ప్రజ్ఞ కలిగినప్పుడు ఆ మనిషి దివ్యాత్మని అనుభవిస్తాడనే " ఆత్మ జ్ఞానాన్ని మహనీయులు కొందరు చెప్పారు..

ప్రతి మనిషిలోను భగవంతుడు కొలువై ఉంటాడు. అందుకే అన్నారు "అహం బ్రహ్మస్మి" అని !కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సాధన చేసి అంధకారాన్ని పారద్రోలాలి! శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు. ఆత్మ నాశనం కానిదని, శస్త్రం ఏదీ ఛేదించలేనిదని , అగ్ని దహించలేనిదని, నీరు తడపలేనిదని, వాయువు ఆర్పలేనిదని అని వివరించాడు.

అహం అనే మాటని "నేను" గా అనువదిస్తే వచ్చే అర్ధం నేను బ్రహ్మని (ఇక్కడ బ్రహ్మ అనే మాట త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు, పరమ చైతన్యం) అని అర్ధం! కాబట్టి ప్రతి ప్రాణి ఆ చైతన్యమే! దేవుడు మనలోనే ఉన్నాడు, మనం దేవుడిలో ఉన్నాం. ఆ దివ్య చైతన్యంలో మనం కూడా భాగం అవ్వటం గురించి సాధన చేయాలి.

ఆత్మ ఒక్కటే. అది పరిమితమైతే అహంకరణం, పరిమితం కానప్పుడు అది అనంతము, సత్యమూనూ అని శ్రీ రమణులు చెప్పారు. ''నేనెవ్వరు?'' అన్న విచారణా మార్గం సాధకులకు తెలియాలి. శివుడికి లింగభేదం లేదు. తనలో అటువంటి భేదాన్ని సృష్టించబోయిన మన్మధుడిని దహించాడు. కాముడిని జయించాడు. శివుడు అవసరమైతే విషం పుచ్చుకుంటాడు. సన్యాసిగా మన్మధుడిని కాల్చినవాడే, పార్వతిని వివాహమాడి

సంసారి అయ్యాడు.

మన్మధుడిని మళ్ళీ బ్రతికించాడు. ఈ భిన్న తత్వాల ఏకత్వమే అర్థనారీశ్వర తత్వం. శివుడు తన దేహాన్ని (ప్రకృతిని) ఆలిగా చేసుకున్నాడు. శివపార్వతుల (దేహత్మల) కలయికే మానవుడు. అంతా నేనే అయినపుడు, ఇతరులను హింసించడమంటే, నన్ను నేను హింసించుకోవడమే అవుతుంది!

ఆధ్యాత్మిక ఆదర్శం

 *ఆధ్యాత్మిక ఆదర్శం*
✳️🌈💫🌈💫❇️✅✳️💫🌈💫🌈✳️

❇️ ప్రతి మనిషికీ ఒక జీవిత ఆదర్శం ఉండి తీరాలి. ఆదర్శం అంటే జీవితాన్ని ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దుకునే ఆలోచన, ఆచరణ. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుకుంటే, సునాయాసంగా అభివృద్ధి సోపానాలు అధిరోహించవచ్చు.

✳️ తల్లిదండ్రుల పోరు పడలేక చదవాల్సివస్తోంది అనుకుంటూ మొక్కుబడిగా చదివితే,  ముక్కున పట్టిన విద్య తుమ్మగానే జారిపోతుంది.

✳️ విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం చదివే చదువు కాదు. అక్షరంలోనే అనంతజ్ఞానం, అద్భుతశక్తి దాగి ఉన్నాయి. అక్షర తపస్సు చేసినప్పుడే శక్తి లభించి, జ్ఞానఫలాలు దక్కుతాయి. 

❇️ మహామంత్రాలన్నీ బీజాక్షర సంపుటాలే. తెలుగులో ఉండేవి యాభైఆరు అక్షరాలే. కానీ, అవి వివిధ మేళవింపుల్లో కథలు, కావ్యాలు, గీతాలు, సంగీతాలుగా మారిపోతాయి.

✳️ ఆ విధంగా వాటిని రూపకల్పన చేయగల నైపుణ్యం కోసమే అక్షరాన్ని ఆత్మగా చేసుకుని అధ్యయనం చెయ్యాలి.

✳️ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతిరూపమే 'ఓంకారము' అని వేదాలు చెబుతున్నాయి. ఇటీవల సూర్య దేవుడి నుంచి వెలువడే ధ్వనితరంగాలు ‘ఓం’ కార శబ్దంగా పరిశోధనలు వెల్లడించాయి. 

✳️ మనిషి అజ్ఞానం ఎలా ఉంటుందంటే - తనకు తెలిసిందే జ్ఞానం, తెలియనివన్నీ శూన్యం అనుకుంటాడు. మన నేత్రాలు చూడలేనివి ఎన్నో ఉన్నాయి. మన మేధకు అందనివీ మరెన్నో ఉన్నాయి. ఆ విషయం మనకు అర్థం కానంతవరకూ మనమే ఘనులమనే భ్రమలో బతుకుతుంటాం.

✳️ చక్రవర్తి తనను తాను  భగవంతుడితో సమం అనుకుంటాడు. మేధావి తానే మహాజ్ఞాని అనుకుంటాడు. మహాధనికుడు తానే అపర కుబేరుడిని అనుకుంటాడు. సౌందర్యవతి తానే అప్సరసను అనుకుంటుంది. ఇలా ఎవరికి వారు తామే అధికులమని విర్రవీగుతుంటారు.

✳️ వారి అహంకారాన్ని కాలం అనాయాసంగా తుడిచిపెట్టేస్తుంది. వారి పరిమితులు ఆయువు తీరేవరకేనని తేటతెల్లం చేస్తుంది.

✳️ దైవం ఉన్నాడా లేడా, స్వర్గ నరకాలు నిజమా అబద్ధమా, పాపపుణ్యాలను నమ్మాలా వద్దా... ఇలాంటి తర్కవితర్కాల మధ్య జీవితం చివరి మజిలీకి చేరువైపోతుంది. అప్పుడు నోరు తెరుచుకుని కొండచిలువలా మనకోసం ఎదురు చూస్తున్న మృత్యువుకు ఆహారం కాక తప్పదు.

✳️ ప్రాపంచిక ఆదర్శాలన్నీ ధనకనకవస్తువాహనాల ఆర్జన, హోదా, అధికారం, సుఖసౌఖ్యాలకు సంబంధించినవే. 

✅ ఇందుకు పూర్తి భిన్నమైనది *ఆధ్యాత్మిక ఆదర్శం.* దీంట్లో పెట్టుబడి స్వల్పం. ఫలితం అనంతం.

✅ శ్రద్ధ, భక్తి- వీటితో పోల్చదగిన ఆధ్యాత్మిక ఆదర్శం మరొకటి లేదు. విశ్వాసం ఈ రెండింటికీ ఇరుసు. భక్తుడు-భగవంతుడు మధ్య అవిశ్వాసం, అతి బద్ధకం, అత్యాశల వంటి అడ్డుగోడలుంటాయి. వీటిని నిర్మలభక్తితో అధిగమించాలి.

✅ మనం నిజాయతీగా ప్రయత్నిస్తే, ఆప్యాయంగా ఆయన చేతులు చాచి మనల్ని తనవైపు లాక్కుంటాడు. మన ఆలోచనకు శబ్దం ఉండదు. కానీ, అది అంతర్యామికి ఆ క్షణంలోనే అర్థమైపోతుంది. మన ఆచరణకు సాక్షులు ఉండకపోవచ్చు. కానీ, ఆయన అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఈ ఎరుక మనకు ఉండి తీరాలి.

✅ అది లేనంత వరకు మనకు అంతర్యామి అర్థం కాడు. ఎంత ప్రయత్నించినా అగుపించడు.

🙏 *ఆధ్యాత్మిక ఆదర్శం అంటే - భక్తి నటించకపోవడం, భగవంతుడికి పరీక్షలు పెట్టకపోవడం, మన సర్వశక్తులు ఏకీకృతం చేసి అంతర్యామిని అర్చించడమే!*
✳️🌈💫🌈💫✳️✅❇️💫🌈💫🌈✳️

ప్రదోష సమయం

 ప్రదోష సమయం

‘ప్రదోష’ అనే పదానికి అర్ధం అధిక దోషం కల సమయం. కానీ నిజానికి ఇది చాలా శుభకరమైన సమయం. ఇంత శుభప్రదమైన కాలాన్ని శబ్దార్ధం ప్రకారం వ్యతిరేకమైన భావాన్ని స్ఫురింపజేసే ‘ప్రదోష’ అనే పదంతో వర్ణించటం వింతగా కనిపిస్తుంది. శబ్దార్ధం ప్రకారం కలియుగ అనే పదానికి పాపంతో నిండిన యుగం అని అర్ధం. కానీ ఈ యుగంలో తప్ప మరియే యితర యుగాల్లోనూ అధిక మోతాదులో పుణ్యం సముపార్జించటానికి అవకాశం లేదు. ప్రదోష కాలంలో ప్రజలు సమావేశమై పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే అ సమయం వారికి శుభప్రదమౌతుంది. అలాగాక వారు ఇతర కార్యక్రమాల్లో ఆ సమయాన్ని గడిపితే దోషాల్ని లేక అనర్ధాల్ని ఇస్తుంది. ప్రదోష సమయంలో చేసిన పాపాల ఫలితాలు మామూలు వేళల్లో చేసిన పాపాల ఫలితాలకంటే నూరు రెట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ కాలంలో ఒనరించిన పుణ్యాల ఫలితాలు కూడా ఇంచుమించు అదే నిష్పత్తిలో ఉంటాయి.

నిజాన్ని గ్రహిస్తే ప్రదోష కాలం చాలా పవిత్రమైనది. శుభప్రదమైనది కూడా. ఈ సమయంలో కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తుంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ సమావేశమవుతారు. కనుక ఈ సమయంలో ఇతర దేవతలా సాన్నిధ్యం కొరకు ఆయా దేవుళ్ళ ఆలయాలకు పోనక్కరలేదు. ఆ కాలంలో అందరు దేవతలు శివుని దగ్గరే ప్రత్యక్షమౌతారు. కాన ఆకాలంలో శివుని ఆరాధిస్తే మనకు శివుని ఆశీస్సులతోబాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ప్రదోషకాలం యొక్క విశేష లక్షణమిదే.

ఈ సమయంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా మనకు దర్శనమిచ్చుట ద్వారా ఒకే శరీరంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తాడు. ఆయన ఎడమవైపు పార్వతి రెండవ పార్శ్వమున శివుడు ఉంటారు. ఈ సమయంలో మనంఅర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే మనకు రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కోర్కెలను నియంత్రించగల్గటం ఒకటి. కాలాన్ని అనగా మరణాన్ని జయించగల్గటం రెండవది. శివునకు కాల సంహారమూర్తియని, కామ సంహారమూర్తియని పేర్లున్నవి. శివునకు చాలా ఇతర నామాలున్నాయి. కంచిలో ఒక మామిడి వృక్షం క్రింద ఉంటాడు గనుక అక్కడ ఆయన్ని ఏకామ్రేశ్వరుడ౦టారు. మద్రాసులోని మైలాపూరులో ఆయన్ని కపాలేశ్వరుడని పిలుస్తారు. అక్కడ ఉన్న ఈశ్వరుడు చేతిలో కపాలాన్ని ధరించి ఉంటాడు. మన్మథుణ్ణి సంహరించాడు. గనుక ఆయనకు కామ సంహారమూర్తి అని పేరు కూడా ఉంది.

ప్రదోషకాలంలో ఉపామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకు గుర్తు చేస్తుంది ఈ క్రింది శ్లోకం.

“శ్లో!! సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే
భాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్
వామాంచి మాత్ర కలితే జనని త్వదీయే
కావా ప్రసక్తిరిహ కాలజయే పురారే!!

అర్థనారీశ్వర రూపంలో మూడవ నేత్రం మీ దంపతులకిరువురకు చెందినదే. కానీ కామ సంహార మూర్తి లేక కామారి అనే బిరుదు శివునకు మాత్రమె చెందుతుంది. నీకాఖ్యాతిని, గౌరవాన్ని తీసుకునే అవకాశం ఈయబడలేదు. మీరిరువురకు ఉమ్మడియైన ఒక వస్తువువల్ల ఒక కార్యం సాధించబడితే, దానివల్ల లబ్ధమయ్యే కీర్తి గాని, పేరు గాని యిరువురికి చెందవలయుగదా, కానీ యిక్కడ పరమేశ్వరునకు మాత్రమె ఈయబడినది. అది అలా ఉండగా, కాలసంహారమూర్తి యనే పేరుకూడా ఆయనకే దక్కాలా? కాలుణ్ణి అనగా యముణ్ణి తన వామపాదంతో తంతాడు. వామపాదం నీకు సంబంధించినది. అయినా ఈ కీర్తి కూడా నీకు దక్కకుండా ఆయనకే సంక్రమిస్తుంటే, ఓ పార్వతీ ఎలా మిన్నకున్నావు?”

ఈ చమత్కార రచన ద్వారా పార్వతీ పరమేశ్వరుల మధ్య స్పర్థ సృష్టించటం కవియొక్క ఉద్దేశ్యం కాదు. ఆవిధంగా భక్తుల దృష్టిని అర్థనారీశ్వరుని వైపు త్రిప్పి ప్రదోష కాలంలో ఆ రూపాన్ని నిత్యం క్రమంగా వారిచే ధ్యానింప చేయటమే కవి స౦కల్పం. భగవంతుని ఈరూపంలో స్మరించిన ప్రతివాడూ కోరికలను జయించి పూర్వం కంటే సుఖతరమైన జీవితాన్ని గడపగల్గుతాడు.

ఉదయం వేళలో మనం శ్రీహరి శ్రీహరి అంటూ విష్ణువునే స్మరించాలి. మన పోషకత్వాన్ని నిర్వహించేది విష్ణువు గనుక ఉదయం లేవగానే ఆయన్ని స్మరిస్తే మన నిత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. సూర్యాస్తమయ సమయంలో శివుని స్మరించాలి. అలాచేస్తే మన నిత్యజీవితంలో సమతుల్యత లభిస్తుంది. హర శబ్దానికి హరించువాడని అర్ధం ఆయన్ని సాయం సమయాల్లో ధ్యానిస్తే మన పాపాల్ని అన్నింటినీ హరింపచేస్తాడు. “ప్రదోషే హరిం న పశ్యాత్ నృసింహం రాఘవం వినా” విష్ణువు నృసింహావతారం ఎత్తింది సాయం సంధ్యా సమయంలోనే గనుక నృసి౦హునకు మినహాయింపు ఈయబడింది. ఇక రాముని విషయానికొస్తే ‘రమయతీతి రామః” -ప్రజలను రంజింప చేసే వాడు కనుక రాముని ఎల్లవేళలా స్మరించవలసిందే.

పక్షానికి ఒకసారి సంభవించే మహాప్రదోష కాలంలో శివదర్శనం, శివనామ జపంమనకు అమిత ప్రయోజనకరం. సాయంసంధ్యసమయంలో ఉన్న త్రయోదశి తిధినాటి ప్రదోష కాలమే మహాప్రదోషమవుతుంది. ఆనాడు ఉదయం ద్వాదశి తిధి ఉన్నా ఇబ్బంది లేదు. కనుక ప్రదోషకాలం అన్ని విధాలా శుభప్రదమైంది, పవిత్రమైనది అని ఎంచి అర్ధనారీశ్వరుని ధ్యానించి మనం తరించాలి.

నీకు ఏ క్షణంలో అయినా "ఎరుక" కలిగితే, అదే కడసారి జన్మ.

 🕉 శ్రీ గురుభ్యోన్నమః 🕉

            తల్లిలేని  ఉడుత  పిల్లలు  గూటిలోనే  ఉంటే  సుఖమని  తెలియక,  గూటిలో  నిలువలేక  బయటికి  వెళ్ళడానికి  ప్రయత్నించి   బాధలు  పడినట్లే,  మనస్సు  ఉన్నచోటనే  (హృదయంలో )  ఉంటే  సమస్య  లేదు.  అది  బయటకు  వెళ్ళడానికి ప్రయత్నించినపుడల్లా  దానిని  తీసి,  గూటిలో  పడెయ్యాలి.       
                                                
            నేను - నాది  అనేది  ప్రకృతి  విషయం.  మమకారం  బంధించినట్టు  జీవుణ్ణి  మరేదీ  బంధించదు. 

            మనం  ఈ  నేను  అనే  దానిని  పోగొట్టుకోవడానికి  ప్రయత్నిస్తాము.  కాని  భగవంతుడు  దానిని  వదలకుండా  నొక్కి  పెట్టి  ఉంచుతాడు.

            కారణం,  ఆ   "నేను"   అనే  తలంపు  ద్వారా  ఇంకా  ఖర్మానుభవం  పొందవలసి  ఉంది  కాబట్టి,  దానిని  అలా  తొక్కిపెట్టి  ఉంచి  జీవుణ్ణి  జీళ్ళపాకంలా  సాగదీస్తాడు.

            అప్పుడు  కానీ   "పూర్ణ  ఎరుక"   సాధ్యం  కాదు.

             నీకు  ఏ  క్షణంలో  అయినా   "ఎరుక"   కలిగితే,  అదే  కడసారి  జన్మ.  
            అప్పుడు  ఆ  ఎరుక  ఎలా  ఉంటుంది  అంటే,  ఒక  చెయ్యి  రెండవ  చెయ్యిని  పట్టుకుంటే  స్పర్శ  ఎలా  తెలుస్తుందో  అంత  స్పష్టంగా  ఆ  వస్తువు  తాలూకు  వైభవం  నీకు  తెలుస్తుంది.  అది  నీవే  అన్న  సంగతి  కూడా  నీకు  తెలుస్తుంది.       
                       🌷🙏🌷

ప్రశ్న: మనస్సును నియంత్రించడానికి, ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది, అజప [చెప్పని] మంత్రం లేదా ఓంకారం యొక్క జపాన్ని చేయడం [`ఓం' శబ్దం]?

 *🕉️నమో భగవతే శ్రీ రమణాయ🙏🙏*
💥 *భగవాన్ శ్రీరమణ మహర్షి* చెప్పారు:
"ప్రశ్న: మనస్సును నియంత్రించడానికి, ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది, అజప [చెప్పని] మంత్రం లేదా ఓంకారం యొక్క జపాన్ని చేయడం [`ఓం' శబ్దం]?

రమణ మహర్షి: చెప్పని మరియు అసంకల్పిత జపం [అజప] గురించి మీ ఆలోచన ఏమిటి? 
`సోహం, సోహం’ [`నేనే అతనే, నేనే’] అనే నోటితో పదే పదే చెబితే అది అజపా అవుతుందా? 
అజప అంటే నోటితో ఉచ్ఛరించకుండా అసంకల్పితంగా సాగిపోయే జపాన్ని తెలుసుకోవడం. 
అసలు ఈ అర్థం తెలియక జనాలు అంటే నోటితో 'సోహం, సోహం' అనే పదాలను వందల వేల సార్లు పునరావృతం చేయడం, వాటిని వేళ్లపై లేదా పూసల తీగపై లెక్కించడం అని అనుకుంటారు.
జపాన్ని ప్రారంభించే ముందు శ్వాస నియంత్రణ సూచించబడుతుంది. 
అంటే, మొదట ప్రాణాయామం చేయండి [శ్వాసను నియంత్రించడం] ఆపై మంత్రాన్ని పునరావృతం చేయడం ప్రారంభించండి. 
ప్రాణాయామం అంటే ముందుగా నోరు మూయడం, కాదా? 
శ్వాసను ఆపడం ద్వారా, శరీరంలోని పంచభూతాలను బంధించి, నియంత్రించినట్లయితే, మిగిలేది నిజమైన నేనే. 
ఆ నేనే ఎప్పుడూ 'అహం, అహం' [`నేను, నేను'] అని పునరావృతం చేస్తూ ఉంటుంది. 
అది అజపా.
ఇది తెలిసి, నోటితో పదేపదే చెప్పేది అజపా ఎలా అవుతుంది? 
నిజమైన స్వీయ దృష్టి ఇది ప్రతి
అసంకల్పితంగా మరియు అంతులేని ప్రవాహంలో, నిరంతరంగా క్రిందికి ప్రవహించే నూనె వంటి జపాన్ని స్వయంగా చేసే నిజమైన ఆత్మ యొక్క దర్శనం అజప, గాయత్రి మరియు ప్రతిదీ. 
జపం చేసేది ఎవరో తెలిస్తే జపం అంటే ఏమిటో తెలుస్తుంది. 
మీరు జపం చేస్తున్నది ఎవరో శోధించి కనుగొనడానికి ప్రయత్నిస్తే, ఆ జపమే నేనే అవుతుంది."
🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏

ఎందుకు ఆయనను(భగవంతుణ్ణి) పదేపదే అడగడం! గట్టిగా నమ్ముకో! అన్నీ నీ దగ్గరికే పంపిస్తాడు!.

 *🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*

*_🌴 భక్తి అంటే భగవంతునికి లొంగి ఉండడం, నమ్మి ఉండడం. తమ అవసరాలు కోసం భగవంతుణ్ణి ప్రార్ధించడం అసలు భక్తి కానే కాదు. ఉదయం లేచినది మొదలు తిరిగి పరుండినంత వరకూ ఒకటేమిటి ఎన్నెన్నో ఏవేవో కోరికలు అడుగుతూ ఉంటాం. కానీ వాటి అర్హత కోసం మాత్రం సాధన చేయం! ఆయనను మనస్ఫూర్తిగా విశ్వసిస్తే తప్ప నాకు అది కావాలి, ఇది కావాలి అని అడగడానికి మనకి ఎలాంటి హక్కు లేదు! అసలు అప్పుడు కూడా అడగవలసిన పని లేదు! ఎక్కడో  కొండలలోని రాతి బండలోపల ఉన్న కప్పకు ఏదో రీతిన ఆదుకుంటున్న వాడు, నిత్యమూ ఆయననే నమ్ముకుని ఉన్న నిన్ను ఆదుకోడా! ఎందుకు ఆయనను పదేపదే అడగడం! గట్టిగా నమ్ముకో! అన్నీ నీ దగ్గరికే పంపిస్తాడు!.🌴_*

అసలైన ఆభరణం

 అసలైన ఆభరణం 
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

💫 ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో  ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నాలుకను అదుపు చేసుకోగల  విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి.

💫 నోటిని అదుపులో  పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే  ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది.

💫 చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.

💫 మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే. ‘వాగ్భూషణమొక్కటే  మనిషికి సుభూషణం’ అన్నాడు భర్తృహరి. 

💫 సంభాషణం -  మిత భాషణం, హిత భాషణం, స్మిత  భాషణం, ప్రియ భాషణం, పూర్వ భాషణం, సత్య భాషణం అయినప్పుడు - అంతకన్నా భూషణం  మరొకటి లేదు.

💫 ‘మితంగా,  హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ.

💫 ఎప్పుడూ  నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది.  

✅ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి.

💫 ఎదుటి వారిని  ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం.

💫 రాముడు స్మిత పూర్వ భాషి - మాట కన్నా  ముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది.

💫 సత్యమే సర్వోన్నతమైంది కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా, నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా మాట్లాడాలి.

💫 ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన  తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.  

💫 ‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’ అన్నారు స్వామి వివేకానంద.

💫 ఎవరైతే తమ  మాటలవల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు.

💫 ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ  ఎక్కువ.

💫 ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు  మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. 

💫 మాటలే మంత్రాలు,  చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కనుక  సున్నితంగా వాడాలి, ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.

💫 మాట్లాడటం అందరూ  చేస్తారు. అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత  ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి.

💫 మాటే  సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. 
మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్నీ తయారు చేస్తుంది. 

💫 నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు  ధన్యుడు. అలాంటివారికి శత్రువులే ఉండరు. 

💫 మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని  నయం చేయనూగలవు. సరైన మాటతీరు - చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా  మార్చగలదు.

💫 మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే  పాయసంలో జీడిపప్పులా మరింత మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది. సంభాషణ సరస  చతురత కలిగి ఉండాలి. తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.

💫 ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో  నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, సుందరకాండకు నాయకుడైన  సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి.

💫 మనిషికి భావ వ్యక్తీకరణ  గొప్ప ఆస్తి. ఏం చెప్పారనేదానిక న్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావప్రసరణ  మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. 

💫 భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత  మహత్తరంగా ఉంటుంది!


సేకరణ: 
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫

భగవంతుడు ఎవరికి దాసుడు? ఎవరిని ఇష్టపడాలి??? భగవంతునితో ముందు - ఎలాంటి భావంతో ఉండాలి???

 శ్రీ గురుదేవాయ  నమః                 భగవంతుడు ఎవరికి దాసుడు? ఎవరిని ఇష్టపడాలి???
భగవంతునితో ముందు - ఎలాంటి భావంతో ఉండాలి???

ఒకసారి శ్రీ రమణుల ముందు ఒక పెద్దమనిషి నిందగా భగవాన్ తో ఇలా సంభోధించారు ...

"భగవాన్ ! మీరు పశుపక్షుల మీద, పిల్లుల మీద, దిక్కుమాలిన దరిద్రుల మీద ఎంతో ఆదరణ చూపిస్తారు... 
కావాలని వాళ్ళని పలకరిస్తారు, లాలిస్తారు ,చేతుల మీద వారికి తినిపిస్తారు, మేము మీ చూపు కోసం, మాట కోసం, మీ చేతి నుండి ప్రసాదం కోసం ఎంత తపించిపోతున్నా, ప్రాధేయపడినా, ప్రార్ధించినా మా వంక  చూడరు... ఇది మీకు న్యాయమేనా? మీ సమత్వానికి భంగం కాదా? " అని నిష్టూరంగా మాట్లాడాడు...

భగవాన్ పెదవులపై చిరునవ్వు  తొణికిసలాడింది, కొద్దిసేపు మౌనం వహించారు...
తర్వాత మృదువుగా "అదా ! మీ సందేహం? ఆ పశువులు, పక్షులు, పిల్లులు, అత్యంత సహజంగా నా దగ్గరకు వస్తారు... ఏ కాంక్షలు, కోరికలు వారికి ఉండవు...
అందువల్ల నేను వారిని అత్యంత సహజంగా ప్రేమిస్తాను...
అట్లా సహజంగా ప్రవర్తించడం నాకు ఇష్టం.ఇంకా పెద్దలు ఎన్నో కోరికలతో, కౌపీనాలతో ఇక్కడ నుండి ఏదో పట్టుకుపోవాలి అనే  కాంక్షతో వస్తారు. 
దాని కోసం కావాలని భక్తిని తెచ్చి పెట్టుకుంటారు. ఇవన్నీ వేషాలు, మాత్రమే. ఇవి భగవంతుణ్ణి ఏమార్చలేవు"అని  అన్నారు...
నా అంతటి భక్తుడు లేడు అని, పెద్ద దండో , పూలో , ఫలాలో బుట్టలనిండా తెస్తారు. ఇవి అవసరమా!!! , నిర్మలమైన భక్తి ఒక్కటి చాలదా!!!...
నీ గూర్చి తెలిసిన భగవంతునికి, నీ మనసులో ఏమి ఉన్నదో తెలియదా?,ఇలా నటన భక్తికి భగవంతుడు ఎలా దాసుడు అవుతాడు? భక్తుడు ఎప్పుడూ నిర్మలమైన మనసుతో ఉండాలి...
ఇప్పుడు చెప్పు భగవంతుడు ఎవరికి దాసుడు, ఎవరిని ఇష్టపడాలి???