Thursday, May 7, 2020

"మద్యం" పై వ్యసనమా/బానిసలా? - చిట్టికధ

"మద్యం" పై వ్యసనమా/బానిసలా?
చిట్టికధ -చదవాలి.మరి....
ఒక కుటుంబం చాల ముచ్చటపడి
ఒక చిన్న పిల్లి కూనను తెచ్చి పెట్టుకుని, ప్రతిరోజు దానికోసంగా అర్థలీటరు ఆవు పాలు పోసి పెంచుతున్నారు.
ఇలా మూడు నెలలుగా పిల్లికి పా లు తాపిచడంతో అది బాగా బలిష్టంగా తయారైంది.
రోజూ మాదిరిగా దాని పొద్దున్న రాత్రిపూట పాలు పడుతున్నారు. మరోరోజు పొద్దున్నే గిన్నెలో పాలు పోసి ఉంచారు ,అదేసమయంలో ఇంటి తూములోంచి ఒక ఎలుక బయటకు రావడం ,ఈ పెంపుడు పిల్లి గమనించింది.వెంటనే శబ్ధం చేయకుండా ఒక్కగంతులో ఆ ఎలుక ను నోట కరచుకుని ,ఇంటి గడప బయటకు పోయి ,అక్కడే ఉన్న చెట్టు కొమ్మనెక్కి,ఎలుక ను చంపి దానుండి వచ్చే వేడిరక్తాన్ని తాగింది. ఆతరువాత యధా తథంగా ఇంటిలోకి వచ్చి కూర్చొంది.కానీ రోజూ త్రాగు తున్న గిన్నెలో పాలను ముట్టలేదు
మరునాడు కూడ దాని యజమాని అలవాటు ప్రకారం గిన్నెలో ఆవుపాలును రోజూ పిల్లికోసం ఉంచుతునే ఉన్నారు.
పాలగిన్నె దగ్గరకు రాకుండా , క్రితం రోజు ఎలుక వచ్చిన తూము వద్దనే పిల్లికాపలా కాయడం మెదలు పెట్టింది. మధ్యాహ్నం రెండు గంటలైనా పాలు ముట్టలేదు.
ఎప్పడైతే ఎలుక రక్తం రుచి చూసిందో ఆపిల్లి ఆ ఎలుక రక్తాని అలవాటు పడి, చివరకు ఆర్తానికి బానిసగా మారింది.ఆవుపాలేకాదు రకరకాలుగా పాలతోచేసిన పాయసాన్ని సైతంముట్టలేదు.కేవలం ఎలుక రక్తం కోసం నిరీక్షణ చేయడం, ఇల్లు వదలి ,పెంచినవారిని కూడా మరచి,ఎలుకల వేటకు సంచారం ప్రారంభించింది.
ఇది ఎందుకు ప్రస్తావన చేసానంటే.
ఎలుక రక్తం రుచిమరిగిన పిల్లి మాదిరిగానే ,మానవుడు మత్తుకు అలవాటు పడితే ,నెలలుకాదు ,సంవత్సరాల సైతం అతని యావ ,ఝాస మత్తు మీదనే ఉంటుంది.
మద్యం కు అలవాటు పడిన మనిషి‌ ,ఎలుకరక్తాన్ని రుచిచూసిన పిల్లిని ఆ అలవాటు మాన్పించడం.పుట్టించిన ఆ బ్రహ్మతరంకాదు...ఇదివాస్తవం...నలభై రోజుల లాకడౌన్ తరువాత మద్యం ప్రియులు/బానిసలు , నడి ఎండను సైతం లక్ష్య పెట్టక ,
బ్రాందీ సీసాల కోసం పడుతున్న పాట్లు చూస్తే ,ఎలుక కోసం తూము వద్ద పిల్లి నిరీక్షణ చాల తక్కువగా చెప్ప వచ్చు.,,
శృంగారానికి బానిస అయినా వ్యక్తి కొంతయస్సు మీదపడతే ఆ వ్యసనాన్ని మరిచిపోతాడు.
మద్యపానం వ్యసనపరులకు.ఫుల్ స్టాప్ అనేది ప్రాణం అనంతవాయులలో కలసిన పుడే అనుకోవాలి, ఒక కవి రానసిన ఆత్మ గేయం లో ,""సురా పానప్రియుడు మరణింస్తే అతన్ని ఖననం చేసిన చోట మట్టీని తీసుకొని, ఆ మట్టితో మద్యం సేవించే పాత్రను తయారు చేసి ,ఆపాత్రలో మద్యం నింపి ముందుతరాల వారు అందులోని సురా పానం చేస్తేనే మరణించిన పానప్రియుని ఆత్మకు శాంతి చేకూరుతుందట.!
అదీ పాన ప్రియుల ...పిపాస.అంటారు.//
""ఎం.మారుతి ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్.'""

What is the moral of the above story? Is it:
“ however much you may try to feed unnatural food by enforcing lockdown for any number of weeks, wise people ultimately return to their natural food decided by God”?

No comments:

Post a Comment