Friday, September 22, 2023

 *Class - 4 day*

*ముఖ్యంశాలు*
 
▪️ *అర్జున విషాద యోగము*
 మొదటి అధ్యాయం ఏ ఉద్దేశంతో చెప్పబడింది, ఆ ఉద్దేశం నిజానికి మొదటి శ్లోకం చివరి శ్లోకం ఈ రెండిటి మధ్యలోనే భగవద్గీత మొత్తం ఉంటుంది.

▪️మరి భగవద్గీతలో మొదటి శ్లోకం ఏంటంటే ధర్మ క్షేత్రే కురుక్షేత్రే... చివరి శ్లోకం యత్ర  యోగేశ్వరః ... ఈ రెండు శ్లోకాల మధ్యలోనే మనిషి యొక్క యావత్తు జీవితం ఉంది. మరి జీవితాన్ని మార్చుకోగలిగే అమృతతుల్యమైన రహస్యాలు ఉన్నాయి.

▪️ఈ మొదటి శ్లోకం
*ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |*
*మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||*
 ఈ శ్లోకానికంటే ముందుగా ఒక పదం ఉంటుంది భగవద్గీత ప్రారంభించబడినటువంటి పదం దృతరాష్ట్ర ఉవాచ. ఇక్కడ రెండు పేర్లు గుర్తు పెట్టుకోవాలి. దృతరాష్ట్ర, సంజయ. అతి పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత గ్రంథము మొట్టమొదట అర్జున విషాద యోగము అని విషాదము అనే నెగటివ్ వర్డ్ తో స్టార్ట్ అయింది. తరువాత మొట్టమొదటి పదమైన సరే ఒక పవిత్రమైనటువంటి పేరుతో లేదా ఒక మంత్రంతో స్టార్ట్ అవుతుందా అంటే అది కూడా దృతరాష్ట్ర ఉవాచా అంటూ మహాభారతంలోనే లోనే అత్యంత దారుణమైన, దౌర్భాగ్యమైనటువంటి ఒక నెగటివ్ క్యారెక్టర్ తో ప్రారంభమైంది. అంటే భగవద్గీత నెగిటివటితో మొదలై మనల్ని దివ్యత్వం వైపుకి తీసుకెళ్లాడానికి సూచిక.


▪️ మహాభారతంలో ఏ క్యారెక్టర్ గురించి తెలుసుకోకపోయిన నష్టం లేదు గాని, దృతరాష్ట్రుని గురుంచి మాత్రం చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయన జీవితంలో నుంచి మనకు అంతులేని లెస్సన్స్ ఉంటాయి.

▪️దృతరాష్ట్రునిలో ఉన్న బలహీనమైన గుణాలలో మమకారం ఒక్కటి.

▪️ఈ మమకారం అత్యధికంగా ఉందంటే ఎనలేని ముప్పును తెచ్చి పెడుతుంది. నా బిడ్డలు, నా భార్య, నా తమ్ముళ్లు, నా బంధువులు అని మమకారం చూపితే అత్యంత ప్రమాదం పొంచి ఉంటుంది.

▪️దృతారాష్ట్రుడు ఈ మమకారం తోనే తన కుమారుని పట్ల ఎనలేని మమకారంతో ముప్పును తెచ్చుకొని కురుక్షేత్ర యుద్దానికే దారి తీసి ఎంతో మంది వినాశనానికి కారకుడవుతాడు.

▪️మనం కూడా అనేక వస్తువులతో దారుణంగా తెలియకుండా ఒక బలమైన ఇనుప సంకెళ్లు లాంటి బంధాల్ని పెట్టుకున్నాం.
 ఇది మనల్ని సుఖంగా ఉండనివ్వదు. మనల్ని అభివృద్ధి చెందనివ్వదు. మనల్ని ధర్మం వైపు నడవనివ్వదు. మనల్ని బయట ఉన్నటువంటి భగవత్ సత్యం వైపుకి నడవనియదు.
ఎంత సేపు నా సుఖము, నా ఇల్లు, నా పిల్లలు, ఇది నాకే చెందాలి అన్నటువంటి స్వార్తాన్ని పెంచేస్తూ నిన్ను ఇంకా గోతిలోకే పుడ్చేస్తుందే తప్ప, మరి ధర్మాన్ని, జ్ఞానాన్ని తెలుసుకొని ఆ పరిదులను దాటి స్వేచ్ఛ పొంది ఒక పరామర్థిక జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నించవలసి ఉంటుంది.

▪️ఏది నాది కకాదు, ఎవరు నవాళ్లు కాదు కేవలం నా కర్మ ఫలాలు పంచుకోవడానికి భార్యలుగాను, నా పుత్రులుగాను నా దగ్గరికి వచ్చారు. ఈ జన్మకు మాత్రమే నాతో కర్మ ఫలాలు పంచుకోవడానికి మాత్రమే వచ్చారు. ఆ కర్మ బంధమ్ అయిపోగానే వారు మన దగ్గరి నుంచి వెళ్ళిపోతారు.
ఈ పరమ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్వేచ్ఛగానే ఉండాలి.

▪️నేను ఏది లేకపోయినా, ప్రపంచంలో ఎవరు లేకపోయినా, నాలో ఈశ్వరుడు ఉన్నాడు. నేను సదా సంతోషంగా, సంతృప్తి గా, మనశాంతగా ఉండగలను. ఈ స్థితిని సాధించడమే పరమార్థం.

No comments:

Post a Comment