Sunday, September 3, 2023

అంతా అయోమయం

 🌺 గుమస్తాలు మాయం, 
కూలీలు మాయం 
💝కోడళ్ళ పనితనం మాయం
🌸అత్తమామల మాటసాయం మాయం 
🌹అల్లుళ్ళ గౌరవ హోదా మాయం 
☀️పోస్టుమాన్ మాయం 
🌺ఆసాంతం వినే వైద్యుడు మాయం 
🤦చీర--రవిక మాయం 
🙁పుస్తక పఠనం మాయం 
🌸రేడియోకి శ్రోతలు మాయం 
🌸పెరడు బావి మాయం 
🌹సైకిలు మాయం 
🌺ఎండావకాయ మాయం 
🌹కుంపటిపై దిబ్బరొట్టి మాయం 
🌸మట్టి వాసన మాయం 
💐పిడతకింద పప్పు బండి మాయం 
🌹వందరోజులాడే సినిమాలు మాయం 
☺️అర్ధరాత్రయినా నిశ్శబ్దత లేని నిశిరాత్రులు మాయం 
🌸ఉపాధ్యాయుడు మాయం 
🌹కుంకుడుకాయ సీకాకాయ మాయం 
🌹వాకిట పూలమొక్కలు మాయం 
🌸పిచ్చుకలు, సీతాకోకచిలుకలు మాయం 
🌹సత్తుగిన్నె చారు మాయం 
💐స్కూల్లో మైదానం మాయం 
🌸సంఘంలో నిదానం మాయం
💐తరవాణి దబ్బాకు వాము పప్పునూనె మాయం 
☀️వానపాము మాయం 
🌹చెరువుల్లో ఆటలు మాయం 
💐కోతికొమ్మచ్చి కబడ్డీ మాయం 
😄అవ్వ.....!!  గోచీ కూడా మాయం 
🌹థూళి లేని గాలి మాయం 
🌸పాళీ ఉన్న పెన్ను మాయం
💐ఖాళీ ఉన్న స్నేహితుడు మాయం 
🌹నిలకడగా కురిసే వాన మాయం
🌺నిర్మానుష్యమైన ఏకాంతం మాయం 
💐కంటికి నిద్ర మాయం
💖వెన్నెల చూడాలనే కన్నులు మాయం
💐పట్టుమని పదినిమిషాల ఏకాగ్రత మాయం 
🌹హారన్ కూత లేని వీధి మాయం 
💐దోమలు లేని పార్కులు మాయం 
🌸తోటమాలి కొలువే మాయం 
🌹దాచుకుందామంటే వడ్డీరేటు మాయం 
🌸 *'ఒక అల్లం పెసరె'* అని కేక వేసే పాక హోటల్ మాయం
☀️సగం సగం పంచునే తేనీరు మాయం 
☺️నిఖార్సయిన చేగోడీ, వడియం, అప్పడం మాయం 
😄ప్రేమ ప్రకటించే పొందిక మారి ప్రేమ లేఖలు మాయం  
😪ఎవరి చరవాణి లోకి వాళ్ళు మాయం 
☹️అంతా సాంకేతిక *మయం*

*చివరకి నాణ్యమైన విబూది కూడా మాయం*

*అంతా అయోమయం*

No comments:

Post a Comment