Sunday, September 3, 2023

 💞మనం ఎదుటి వారికి ఏమి ఇస్తే 
అదే తిరిగి వస్తుంది అనే మాట చాలా సార్లు విని ఉన్నాము కదా. అది ఎలాగో తెలుసుకుందాం .

మనం చాలాసార్లు వింటుంటాం . ఎవరో ఎవరికో డబ్బు సాయం చేశారని పేదలను ఆదుకున్నారని భగవంతునికి బంగారు కిరీటం సమర్పించారని  లేదా ఇంకేదో అర్పించారని  . వినగానే మనకు ఉంటే ఇవ్వకపోదునా?...?
 నా దగ్గర ఏమి ఉంది ఇవ్వటానికి అను కుంటాము కదా.. 

ఇలాగే ఆలోచించిన 
ఒక పేదవ్యక్తి బుద్ధుని అడిగాడట.
 నేను పేదవాడిగా ఎందుకు ఉన్నాను అని
 అందుకు సమాధానంగా   బుద్ధభగవానుడు...
 నీ దగ్గర ఉదారత లేని  కారణంగా , నీ దగ్గర ఉన్నది ఇచ్చే గుణం లేకపోవడం వల్ల అన్నాడట. ....
అయ్యో... నేనే పేద వాడిని  నేను ఎవరికి ఏమి ఇవ్వగలను అన్నాడట ఆ పేదవాడు.
అప్పుడు బుద్ధుడు
నీ దగ్గర అయిదు {5}గొప్ప విషయాలు ఉన్నాయి కానీ నువ్వు అవి ఎవరికి పంచటం లేదు .... వాటిని పంచటం ద్వారా నీఉదారత్వం చూపించవచ్చు.
నా దగ్గర {5} విషయాలు ఉన్నాయా?
అదికూడా నాకు తెలియకుండానా అంటూ అంతులేని ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆ పేదవాడు.
*
అందుకు బుద్ధుడు*చెప్పాడు
మొదటిది నీ చిరునవ్వు.*
ఎదుటి వారిని చూడగానే  అందమైన చిరునవ్వుని చిందించవచ్చు. కానీ అది నీవు చేయవు.

అలాగే రెండవది,నీవు ఈ లోకాన్ని చూసే కనులతో దయ, ప్రేమ, శ్రద్ద ఎదుటి వారికి అందించవచ్చు.
*కానీ అది నీవు చేయవు.*

మూడవది నీవు తినటానికి, మాట్లాడటానికి మాత్రమే అనుకునే నోటి తో నాలుగు మృదువైన మంచి మాటలు చెప్పవచ్చు.
*కానీ నువ్వు అది చేయవు.*

నాలుగవది నీ హృదయ మందిరం నుంచి మనస్ఫూర్తిగా ఎదుటి వారిని అభినందించవచ్చు. *కానీ నువ్వు అది చేయవు.*

ఇంకా ముఖ్యంగా ఐదవది నీ శరీరంలోని అవయవాలు అన్ని చక్కగా ఉన్నాయి.
నీ కాళ్ళని చేతుల్ని 
ఉపయోగించి ఎంతయినా సేవ చెయ్య గలవు.
*కానీ నువ్వు అది చేయవు.*అన్నాడట

 మిత్రులారా .ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఎన్నో కలిగి ఉన్నాము...*
*దానం అంటే ఉదారత్వం*
 అంటే ఎదుటి వారికి
డబ్బు లేదా వస్తువులు ఇవ్వటం మాత్రమే కాదు మనకి ఉన్నంతలో చేతనయినంతలో ఇతరులకి ఇవ్వటమే.
అందుకే పత్రీజీ పదేపదే అంటూ ఉంటారు . పంచితే పెంచబడు తుందని. ధ్యానం చేస్తే ఆనందం ధ్యాన  ప్రచారం చేస్తే పరమానందం.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment