Tuesday, September 5, 2023

సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺 🌹 *Chapter -- 3:--- జీవితమే ఓ దైవం

 *Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 3:--- జీవితమే ఓ దైవం* 🌹
🌷 *Part -- 1* 🌷

🌳 ఎముకలూ, రక్త మాంసాలతో నిర్మింపబడి ఉన్న ఈ శరీరంలో ఏ మాత్రమూ సంబంధం లేనట్లు ఎవడో దీనిలో దాగి ఉన్నాడు - ఏదో దీనిలో దాగి ఉంది ! శల్య రక్త మాంసాలతో దేంతోనూ ఇది కలవదు ! మృత్యువు దరిదాపులకు కూడా రాలేని ఇతడు లేక ఇది చిరంజీవి ! దీనికి జనన మరణాలు లేవు ! ఇతడు అజుడు - అమరుడు ! దీనికి ఆది అంతమూ రెండూ  లేవు. ఏ స్వరూపమూ లేకుండా మన అందరిలోనూ ఇది దాగి ఉంది. ఇతడు దాగి ఉన్నాడు. మీ చిమ్మ చీకటి ఆజ్ఞానంలో ఈ ప్రజ్వలిస్తున్న ఆరిపోని జ్యోతి కోసం వెతకండి !

🍀 కానీ ఈ అఖండ జ్యోతిని  మృత్యువు అనే పోగ దాచేస్తూ ఉండడం వల్ల ఆ దివ్య జ్యోతి దర్శనం మనకు కలగడం లేదు. పొగకు తట్టుకోలేక మనం వెనక్కు తిరిగి వస్తున్నాం. కొందరు ధైర్యవంతులు కొంత శోధించినా ఆ శోధన మృత్యువు అనే పొగ మధ్యలోనే సాగుతూ ఉండడం వల్ల జ్యోతి దగ్గరి వరకూ వెళ్ళలేకపోతున్నారు.

🌼 పొగకు అతీతంగా ఆమం ఉన్న జ్యోతి వరకూ, మన దేహంలోనే ఉన్న ఆత్మ వరకూ యాత్ర కొనసాగించడం ఎలా? జగదాత్మను అందుకోగలగడం ఎలా? ప్రకృతితో కప్పబడి ఉన్న దాన్ని, ప్రకృతిలోనే దాగి ఉన్న దాన్ని తెలుసుకోవడం ఎలా? 

🍁 సత్యం కోసం సౌందర్యం కోసం శోధించే ప్రయత్నం చెయ్యడం ఎందుకు? అని అడగడం ప్రస్తుతం పరిపాటి అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకనాడు జీవితం అంతమయ్యే రోజు వచ్చేస్తుందనీ, ఆరోజు జీవితంలోని సత్యాన్నుంచి పారిపోవడం ఎవరికీ సాధ్యం అయ్యే పని కాదని నేను ఇప్పుడే చెబుతున్నాను. మనం ఇళ్ళు మారవచ్చు, మన శరీరాలు మారవచ్చు. కానీ మన ఉనికి మాత్రం ఎప్పటికీ ఉండి తీరుతుంది ! అదే ఆత్మ ! *"అక్షరం"* అది - అంటే ఎప్పటికీ నశించి పోనిది. దాన్నుండి తప్పించుకుని పోవడం మాత్రం కుదిరేపని కాదు ! 

🌸 జీవితమే ఓ దైవం. అంతే తప్ప మరో దేవుడు లేడని, ఉండే అవకాశం కూడా లేదనీ నేనంటాను. అలాగే జీవితాన్ని ప్రేమించగలగడమే ఓ సాధన అనీ, దైవత్వాన్ని ప్రాప్తింపజేసే మార్గం అదేనని కూడా నేను అంటాను. జీవితంలో ఉంటూ అత్మ సిద్ధిని పొందడమే నిజమయిన మతమని నేను అంటాను. *"జీవితంలోని సత్యాన్ని గ్రహించగలగడం"* అన్న మంగళకరమైన మొదటి మెట్టే చివరికి మనలకు బంధం నుంచి విముక్తిని కలిగిస్తుంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 3:--- జీవితమే ఓ దైవం* 🌹
🌷 *Part -- 2* 🌷

🌿 జీవించే కళను నేర్పించేదే మతం అని నేను అంటాను. సృష్టిలో దాగి ఉన్న నిగూఢ సత్యాలను పెకలించి ప్రకటించగల సాధనమే మతం. జీవితాన్నంచి పారిపోవడం కాదు, ధైర్యంతో జీవించడాన్ని కొనసాగించే పద్ధతిని నేర్పేదే మతం. విరక్తితో తృటించడం కాదు జీవితాన్ని అనురక్తి తో స్వీకరించడమే మతం అంటే. జీవితాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడమే మతం.

🌸 ప్రముఖ మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన *'కూయీ'* సామాన్య మానవుని మనస్సు ప్రతి క్రియా సిద్ధాంత0కు లోబడే ప్రవర్తిస్తుందనే విషయాన్ని గురించి లా ఆఫ్ రివర్స్ - ఎఫెక్ట్ అనబడే ఈ సిద్ధాంతం ప్రకారం మనం దేన్నించి తప్పించుకుందామని ప్రయత్నిస్తామో దాన్నే సూటిగా వెళ్ళి గుద్దుకుంటాం - ఎందుకంటే మనం భయపడుతున్న వస్తువు మీదే మనస్సు సంపూర్ణంగా లగ్నమై పోతుండడం వల్ల !

🏵️ కామంతో సంబంధం లేకుండా సమాధి స్థితిని పొందే జ్ఞానం మీకు లభిస్తే తప్ప మీరు కామం నుండి విముక్తిని పొందలేరు. 

🍁 మానవుడి మనస్సు ఈ కామగంగలో మునిగి ఉన్నంత వరకూ అతడు మళ్ళీ మళ్ళీ లేచి కూలిపోతూ ఉండడం తప్పదు. 

🌿 వక్రీభవించిన ఆలోచనలేవీ లేకుండా నా మాటలను ధ్యాస పెట్టి విన్న వాళ్ళందరూ కామం నుండి తప్పిక విముక్తులవుతారు. 

🌼 కామం మనల్ని ఎప్పుడూ ఊరిస్తునే ఉంటుంది . దాన్ని గురించిన మన కల్పనలన్నీ ఆ కామాన్ని ఆచరించి మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంటాయి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🏵️ *సంభోగం నుండి సమాధి వైపు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు" కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

No comments:

Post a Comment