Monday, September 4, 2023

మౌనం ...* *మహా భాగ్యం ...

 *మౌనం ...*
*మహా భాగ్యం ...*
రోజూ ఒక్క అరగంట
మౌనంగా ఉంటే చాలు, శారీరక, మానసిక ఆరోగ్యం, సొంతమవ్వటమే కాదు, ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు అన్ని నెరవేరుతాయి అని చెబితే నమ్మగలరా? నమ్మలేం కదూ? కాని ఇది నిజం, అదెలా సాధ్యం? ప్రయత్నిస్తే తెలుస్తుంది, ఎలా సాధ్యమో? 

*ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరుకు మనం  మాట్లాడుతూనే ఉంటాము, ఎప్పుడైనా లెక్కేశారా? పోనీ, ఎంత సేపు మౌనంగా ఉంటాం? ఒంటరిగా ఇంట్లో ఉంటే, మౌనంగా ఉంటాం కదా? అప్పుడు, ఎవరితో మాట్లాడతాం అంటారా?* 

దానికి నిపుణుల సమాధానం ఏంటో చూద్దాం, మౌనంగా ఉండటమంటే, ఇంట్లో పనులు చేస్తూ, లేదా ఏ టి.వి లోని కార్యక్రమాన్ని చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని, ఇంటర్నెట్  బ్రౌజ్ చేస్తూ, ఈ పనులు అన్నీ చేస్తున్నపుడు, మన నోరు మాట్లాడక పోయినా, అలోచనలు, మనస్సు పరుగులు పెడుతూనే ఉంటాయి, అవి మనల్ని, మన నుంచి వేరుగా ఉంచుతాయి 

*అదే కళ్ళు మూసుకుని మాటని, మనసుని మౌనంలోకి కలిపి శూన్యం స్థితిలో తీసుకునిరండి, ఓ పదినిమిషాలు చాలు, కళ్ళు తెరిచాకా చూస్తే హాయిగా ఉంటుంది*

మౌనం మనకి, మనల్ని దగ్గర చేస్తుంది, రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు, అరుపులు, వాతావరణ, ధ్వని కాలుష్యం ఇలాంటి పరిస్థితులు, పరిణామాలు, ఇవన్నీ మనసులో చేరి, ఆలోచనలుగా మారి, 
ఉక్కిరి, బిక్కిరి చేస్తాయి

*వదిలించుకోవటం ఎలా? సింపుల్, కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే, దాన్ని మీరు ధ్యానమనండి, మెడిటేషన్, ప్రాణామాయం, ఎదైనా కావచ్చు, ఏకాగ్రతగా శ్వాస పై ధ్యాస పెట్టగలిగితే చాలు, అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది*

మౌనం ఆత్మవిశ్వాసం పెంచుతుంది, మనల్ని అంతర్ముఖులను చేస్తుంది, తప్పులు చేసి ఉంటే, సరిచేయడానికి అవకాశాలు ఇస్తుంది, ఉదయం లేచిన దగ్గుర్నుంచి అన్ని రకాల అనుభూతులు, భావపరంపరాలు,
వాటి ప్రభావం మనస్సు పై పడుతుంది, ఫలితం ఒత్తిడి, చికాకు, ఆరోపణలు, కోపతాపాలు మొదలైన వాటిలో మధ్య ఇరుక్కుంటాము

*ఇలా చక్రం తిరిగినట్టు,* 
*ఒకదాని ప్రభావం వలన మరొకటి డిస్టబ్ అవుతుంది, ఈ చక్రాన్ని ఆపే అవకాశం, శక్తి మన చేతుల్లోనే వుంది, అదే "మౌనం",  మౌనంలో, ఏ అలోచనలు ఉండకూడదు, ప్రశాంతమైన మనసుతో మమేకమై, ఓ అరగంట / పది నిమిషాలు అయినా ఉండగలిగితే చాలు, ఫలితం ఏమిటన్నది చెప్పటం ఎందుకు, అనుభూతి పొందండి*🌹

No comments:

Post a Comment