Sunday, September 3, 2023

" Parenting tips" ( పేరెంటింగ్ టిప్స్)

 🔥🔥🔥🔥🔥
" Parenting tips"
( పేరెంటింగ్ టిప్స్) 
      ' మీరు సామాజిక మాధ్యమాల్లో ఎవరినైనా స్నేహితులుగా చేసుకోవాలనే అప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.   చెపుతాను ఓపికతో, మీ విలువైన, అమూల్యమైన సమయానికి వెచ్చించి వింటారా? 
     🙏🙏🙏
"Mazumdar Bangalore" 87925-86125.
       🔥🔥🔥

🦚 1)" అపరిచితులను మారు పేర్లు, ఫోటోలతో ఖాతాలను ఏర్పరచుకునే వారిని, కచ్చితంగా మీరు తిరస్కరించండి.  అపరిచితులు ఎవరైనా పదే పదే మీకు రిక్వెస్ట్ పంపిస్తూ ఇబ్బంది పెడుతుంటే ఫేస్బుక్ ఇచ్చిన ఆప్షన్  "బ్లాక్" లేదా రిపోర్ట్ ని ఉపయోగించండి. 

💐2)" మీరు మీ వ్యక్తిగత వివరాలు ఫోటోలు పోస్టులు వంటివి అతిగా పెట్టకపోవడమే మంచిది.   మీ ఖాతాలో ఉన్న స్నేహితులు చూసే విధంగా వాటిని పోస్ట్ చేసుకుంటే మేలు.   అది లేదంటే ఏ గ్రూపు వారు వాటిని చూడాలనుకుంటున్నారో ఆ మేరకే పరిమితం చేసినా మంచిదే.   అప్పుడే దుర్వినియోగం కాకుండా ఉంటాయి మీరు పెట్టిన పోస్టులకు మీ స్నేహితుల జాబితా లోని వారు స్పందించే తీరును గమనించుకోవాలి శృతిమించకుండా చూసుకోవటం ఉత్తమం.  శృతి మించి రాగాన పడకుండా ముందు జాగ్రత్త కొరకు మీకు చెప్పటం అయినది. పెద్దలు చెప్పిన మాటను  శ్రద్ధగా వినుట చేయాలి,  నిర్ణయం మీది, జీవితం మీది, బాధపడేది కూడా మీరే!  విజ్ఞులు వివేకవంతులు, ఎదుటి వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తాము నడుచుకుంటారు.
       🙏           
" Parenting Tips "-2
( "పేరెంటింగ్ టిప్స్")
    " మీ చిన్నారుల నిద్ర చక్కగా పోవుట లేదా?"
"Mazumdar, Bangalore" 87925-86125.
      🔥🔥🔥
      " మీ చిన్నారి పిల్లల "జీవనశైలిలో" మార్పులు నిద్రవేళ  లో అనూహ్య  మార్పులకు కారణం  అవుతున్నారు మీరే!  ఈ పరిస్థితి కొన్నాళ్ళకు నిద్రలేమి సమస్యకు దారి తీయవచ్చు.   ఈ దుష్ట    ప్ర భావము పెద్దల కంటే ఎదిగే పిల్లల పైనే అధికమని  అధ్యయనాలు. కొన్ని చెబుతున్నాయి.   ఈ పరిస్థితిని ముందు జాగ్రత్తగా గమనించుకుని చురుగ్గా స్పందించి చిన్నారులు కమ్మగా నిద్రపోయేలా చూడాలి.   ఇందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

💚 మీ పని వేళలకు రాత్రి, పగలు తేడా లేక పోవచ్చు.                       ఆ ప్రభావము చిన్నారులపై పడనీయకండి.   ఇల్లంతా వెలిగే లైట్లు, వెలుతురు ,కంప్యూటర్, స్మార్ట్ఫోన్ (smartphone) తెరల కాంతి, చిన్నారుల కంటి మీద కునుకు రాకుండా అడ్డుపడుతుంది, అని గుర్తుంచుకోండి?     మీ పిల్లలు ఆ పరికరాలకు దూరంగా ఉండేలా చూసుకోండి.    పరిస్థితిని మీరు మార్చకుంటే మాత్రం ముందు పిల్లలకు కళ్ళు పొడిబారటం వంటి సమస్య ఎదురవుతుంది.   నిద్రలేమి వల్ల ఊబకాయం, అలసట, కుంగుబాటు, వంటివి పిల్లలను వేధించ వచ్చు.

❤️ " మీ చిన్నారులు నిద్రపోయిన కచ్చితమైన వేళలు ఏర్పరచండి.   కొన్ని రోజుల పాటు దాన్ని అలవాటు గా మార్చాలి.   దానికి "21 రోజులు సూత్రము" గుర్తుంచుకోండి.   ఎవరైనా ఇరవైఒక్క రోజులు, ప్రతిరోజు ఒక పని తప్పనిసరిగా చేసినారా?  మరిచిపోరు ఇరవై రెండో రోజు కూడా ఆ అలవాటు     మానుకో రు.   పిల్లలు నిద్రించేటప్పుడు వెలుతురు, శబ్దాలు ఘాటయిన వాసన, వంటివి చేరకుండా చూడండి.   అలాకాకుండా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే నిద్రలేప వలసి వస్తే వారు చదువుపై దృష్టి పెట్టలేరు.

🇧🇴 నేడు తల్లిదండ్రులే సరే అయిన మార్గమున నడవరు, పిల్లల కొరకై తల్లిదండ్రులు కూడా రాత్రి 9 గంటలకు పడుకొని, ఉదయము సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాలకు (48) ముందుగా నిద్ర లేచిన, వారికి ఆ రోజు చాలా సమయము పొదుపు అగును.  ఎక్కువ కష్ట పడిన వారు అలసట చెందరు, వారే నేడు "భారతదేశ ఉత్తమ విజేతలు". అగును.

❤️ "గురుకులాలలో ను, సంగీత విద్య నేర్చుకునే వారు,  యోగాభ్యాసము చేయువారు, ఐ. ఐ. టీ రామయ్య గారు కూడా ఈ పద్ధతినే అనుసరిస్తూ, తెల్లవారుజామున, వారు వచ్చిన వాహనాలను 12 కిలోమీటర్ల దూరంలో ఉంచి, వారి ప్రాంగణం  నకు నడుచుకుని వెళ్ళవలెను, అనే పద్ధతి పెట్టినారు.  ఎలాంటి 'రికమండేషన్స్," ఒప్పుకోరు.  అంతటి క్రమశిక్షణా, చర్యలతో తమ శిక్షణ నేటికీ కొనసాగించుట, మనందరికీ  తెలిసిన విషయమే!

🇧🇴" నేటి పిల్లలు ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటలకు, నిద్ర లేచుట, "కరోన"  వల్ల  ఉదయము స్కూల్స్ లేనందున, వట్టి సోమరిపోతులై, నేటి పిల్లల కు  పొట్టలు, కళ్లజోడు లు వచ్చుట, నేడు మనము చూస్తున్నాము.   దానికి కారణము "తల్లితండ్రులు" అని గుర్తించండి .  సరిగా మేల్కొనండి, భారతదేశ భవిష్యత్తు ముందు తరాల వారిదే అని గుర్తించండి.

💐" తల్లిదండ్రులు నేడు పోటీ ప్రపంచం నందు పిల్లలకు అధిక ఒత్తిడి కలగజేసి' విదేశీ విద్యలు కోసం  Abroad  లో తమ పిల్లలను, చదివించాలని
వారికి అన్ని సబ్జెక్టులలో 60% నుండి 80% మార్కులు వచ్చిన, విదేశాలకు పంపవచ్చునని, అక్కడ కొన్ని యూనివర్సిటీలలో
 "Scholarships" వచ్చునని, మరికొన్ని దేశాలలో ఉచిత వైద్య,
కూడా ఉండవచ్చునని, ఆదేశాలలో చదువుకుంటూ, ఉద్యోగం కూడా చేయవచ్చునని, అంటున్నారు.
తమ పిల్లలపై, వారి తీవ్రమైన కోరికను. బలవంతంగా రుద్దుచున్నారు.  " మన భారత దేశంలో విద్యను
చదువును బట్టి అర్హత కాకుండా, కుల ప్రాతి ప్రతీకగా  మీద కోటాలు ఏర్పరచి, మరికొన్ని రాజకీయ నాయకులు,
మధ్యవర్తుల ద్వారా అమ్ముకుంటున్నారు. అని ఆవేదన కూడా ఒక కారణం కావచ్చు!
🙏🙏🙏🙏🙏


🙏" మానవ సంబంధాలన్నియు, నేడు ఆర్థిక సంబంధాలుగా ఉన్నవి.

No comments:

Post a Comment