Sunday, September 3, 2023

గ్రూప్ లోని అందరూ తప్పక చదవాల్సిన మెసేజ్ ఇది..

 🍃🪷 గ్రూప్ లోని అందరూ తప్పక చదవాల్సిన మెసేజ్ ఇది..

ఒక ఊర్లో పదో తరగతి మిత్రులు, ఓ 80 మంది కలిసి చదువుకున్నారు. కొందరు పై చదువులకని, కొందరు బతుకు బాటను వెతుక్కుంటూ బయటి దేశానికి వలసకనీ , కొందరు ఊళ్ళోనే తోచిన పని చేసుకుంటూ ,  కొందరు పక్కనున్న పట్టణంలో చిన్నదో, పెద్దదో వ్యాపారం చేసుకుంటూ గడపసాగారు..గడప దాటారు.  ఓ పది సంవత్సరాలు గడిచిపోయాయి..

ఇంతలో 'WHAT's App" లేదా మరో   యాప్ వచ్చింది. ఒక మిత్రుడు అందరం రోజూ పలకరించుకుందాం, సాధకా బాధకాలు చెబుకుందాం అనే ఉద్దేశ్యంతో.. ఓ గ్రూపు Creat చేసాడు. కొద్దిరోజుల్లోనే... 80 మందిలో.. 60 మంది నెంబర్ లు దొరకబట్టి... గ్రూపులో add చేశారు..
చిన్ననాటి మిత్రులే గాని, ఇప్పుడే కొత్తగా పరిచయం అయిన వ్యక్తుల వలె.. ఎంతో ఉత్సాహంతో పలుకరించుకునే వాళ్ళు. ఎవరెవరు.. ఏమేం పనులు చేస్తున్నారో.... ఎక్కడెక్కడ ఉన్నారో.. పెళ్లి.. పిల్లల విషయం... ఒకటేమిటి... సర్వం సంభాషించుకునే వాళ్ళు..
మళ్ళీ పాత రోజులు గురుతు చేసుకుంటూ... మంచి మంచి సూక్తులు.. శాత్రాలు, పంచులు, జోకులు వేసుకుంటూ ఎంతో సంబర పడిపోయేవారు. అందరూ అడ్మిన్ లే !

ఇలా ఎంతో జోష్ గా గ్రూప్ నడుస్తుంది. ఒక రోజు open చేయక పోతే.. వందల సంఖ్యలో Unread మెసేజ్ లు ఉండేవి.  గ్రూపు పుణ్యానా... ఒకనాడు అందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం (Get Together/ Reunion) కూడా ఏర్పాటు చేసుకున్నారు..రోజులు గడవసాగాయి. 

ఒకనాడు, గ్రూపులో ఓ మిత్రుడు... "Good Morning" మెస్సేజ్ పెట్టాడు.
ఇంకో మిత్రుడు కలుగజేసుకొని "ఎందుకురా ఈ పనికి రాని మెస్సేజ్? ఏదైనా పనికి వచ్చే మెసేజ్ పెట్టండి. Good Morning , Good Night లతో ఒరిగేది ఏం లేదు" అని అన్నాడు..
ఇక అయోమయంలో, ఏమెసేజ్ పెట్టాలో తెలియక... ఆ Good Morng చెప్పిన మిత్రుడు... మళ్ళీ ఏనాడూ మెస్సేజ్ చేయలేదు..

ఒకనాడు... ఆ ఊళ్ళో జరిగిన ఓ దొంగతనం గురించి... తీవ్రంగా చర్చ నడుస్తున్న సమయంలో... ఒక మిత్రుడు... తాను చూసే సినిమా టాకీస్ తో పాటు, పోస్టర్ తో దిగిన ఫోటో ఒకటి , ఈ గ్రూపులో షేర్ చేసాడు..

"అరేయ్.. మేము ఇంత తీవ్రంగా చర్చ నడిపిస్తే... మధ్యలో నీ సోది ఏంది రా?? ఏదైనా పనికి వచ్చే పోస్ట్ పెట్టు" అని అనగానే....
ఏ పోస్ట్ , ఎప్పుడు పెట్టాలో అర్థం కాకపోవడంతో..మరొక్కమారు అతను... గ్రూపులో ఏ పోస్ట్ పెట్టలేదు.
'ఒకతనను..మంచి మసాలా వేసి వండిన.... 'సాంబారు' తో పోస్ట్ చేసాడు.
'ఎప్పుడూ.. తిండి విషయలేనా?? ఏదైనా పనికి వచ్చే పోస్ట్ చేయమన్నారు' ఇంకొకరు..

ఆ సాంబార్ పోస్ట్ వ్యక్తి వెంటనే గ్రూపు నుండి Left అయ్యాడు..
ఓసారి దేశ, రాష్ట్ర రాజకీయాలు మీద వాదోపవాదాలు నడుస్తున్నాయి.
"మా పార్టీ ఇది చేసింది, అది చేసింది"  అని తీవ్రంగా వాదించుకుంటున్నారు. 
ఎదురుగా ఉంటే.. కొట్టుకునే వాళ్లే!!
ఇంతలో మధ్యలో.. ఒక మిత్రుడు...  ఓ "అమ్మాయి ఫోటోలో.. 'ఫోన్ నెంబర్ కావాలా??" అని రాసి ఉన్న ఫొటో పెట్టాడు..

ఆ ఇద్దరు "రాజకీయ మేధావులకు".. ఎక్కడో కాలింది.  ఇద్దరు కలిసి.. ఈ మిత్రున్ని తిట్టారు. ఏదైనా.. పనికి వచ్చే..  పోస్ట్ పెట్టమన్నారు.
అంతే.. మరోమారు.. ఈ మిత్రుడు ఏ పోస్ట్ పెట్టలేదు..

ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. అవి చెబితే... ఇది కూడా పనికి రాని పోస్ట్ అవుద్దని చెప్పడం లేదు. మిత్రులు మన్నించాలి...🙏
ఇలా... ఏ పోస్ట్ పనికి వచ్చేదో..  ఈ గ్రూపులో ..  దెంతో లాభసాటిగా ఉంటుందో అర్థం కాక..  ఒక్కొక్కరు... పోస్టులు చేయడం మానేశారు.
చివరికి... గ్రూపులో ఓ నిశ్శబ్బ వాతావరణం నెలకొంది..

ఒకప్పుడు ఫోన్ లో TOP లో కనబడిన గ్రూపు కాస్త.. ఎక్కడో అడుగుకి పడిపోయింది. Search లో వెతికితే గాని దొరకడం లేదు..
అప్పుడప్పుడు..ఊళ్ళో ఒకరినొకరు.. ఎదురెదురుగా కనబడినా... మారు మాట్లాడుకునే వాళ్ళుకాదు..

అందుకే..మిత్రుల మధ్యన అడ్డుగోడలు ఏం పెట్టుకోకండి..
బడి గోడ మీద కూర్చున్నప్పుడు... ఏం మాట్లాడుకుంటాం??
కాలేజి కాంటీన్ లో, టీ తాగుతూ..  ఏం డిస్కషన్ చేస్తాం??
వాడకట్టు మిత్రులు , ఊరి మిత్రులు ఓ బస్టాండ్ దగ్గరి చెట్టు కింద కూర్చొని ఏం మాట్లాడుకుంటాం??
వీటిలో.. ఏ ఒక్క ముచ్చటకు హద్దు ఉండదు..!
ఓ హాద్డే ఉంటే.. ఆ ముచ్చట ఎంతో సేపు.. ఎంతోకాలం నడవదు..

మనం ఏదైనా... జాబ్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొంటున్నమా?? 
ఏదైనా ఓ సంఘటన మీద డిస్కస్ చేయడానికి?? లేదు కదా..

మిత్రుల మధ్యన.... ఎప్పుడూ.. పనికి వచ్చే ముచ్చటనే ఉండక్కర్లేదు. Good Morning, Good Night ల వల్ల... ఆ మిత్రుడు మనతో కలిసి ఉన్నాడని , ఆనందంగా ఉన్నాడని అనుకోండి. 
ఏ పోస్ట్.. ఎప్పుడైనా.. ఏ సమయంలోనైనా పంపనివ్వండి. ఎందుకంటే.. అతని.. ప్రతి  విషయాన్ని.. మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాడు..

తుమ్మినా.. దగ్గినా కూడా మెసేజ్ లు పెట్టే వాళ్ళను చూసి తిట్టకండి. ఎందుకంటే.. ఎందుకంటే.. ప్రతి క్షణాన్ని, మీతో కలిసి ఓ మధుర స్మృతిగా మలుచుకుందాం అని అనుకుంటున్నారు..

చివరగా ఓ సందేశం...
మిత్రుల మధ్యన ఎప్పుడైతే... హద్దుల అడ్డుగోడలు ఏర్పడతాయో...మెల్లమెల్లగా.. 
ఆ స్నేహబంధం బీటలువారి బద్దలైపోతుంది..
ఈ మెసేజ్ అయిన మొత్తం చదివారా లేదా నిజంగా..

స్నేహితులు ఒక గొప్ప తరగని ఆస్తి..
అంతే..."దానికి విలువ లేదు" అంటే వెలకట్టలేము ఆని..విలువే లేనిది అని కాదు..

🍃🪷సే:వల్లూరి సూర్యప్రకాష్ కరీంనగర్

No comments:

Post a Comment