Friday, October 11, 2024

****ఇలాంటి సంఘటనలు రోజు వందలు మన దేశంలో జరుగుతున్నాయి

 మీ ఇంట్లో ఆడవారిని ప్రేమగా పలకరించటం , వారితో సంతోషంగా మెలగటం, వారి చిన్న చిన్న అవసరాలను తీర్చటం , వారితో సమయం తీసి ముచ్చటించటం , కలిసి భోజనం చేయటం, వారి నిర్ణయాలను గౌరవించటం మానారో, అంతే , ఇదే అలసుగా తీసుకుని కుట్ర పన్ని మీ ఇంట్లో ఆడవారి మీద వల వేయాలనుకున్న వారికి మీరు ఇంటి తాళాలు ఇచ్చినట్టే 

ఇలాంటి సంఘటనలు రోజు వందలు మన దేశంలో జరుగుతున్నాయి

అమ్మాయిలకు, ఆడవారికి ఏం కావాలో, వారిని బుట్టలో వేసుకోటానికి ఎలా మాట్లాడాలో, వ్యవహరించాలో వారికి తెలుసు, మీకు తెలీదు , అంతే

అయితే నేర్చుకోండి , లేకపోతే ఇలాంటి వ్యవహారాలకు కుటుంబమంతటిని బలి చేయండి

ఆడవారిని తప్పు పట్టే ముందు ఒకసారి ఆలోచించండి. భారతీయ స్త్రీలు పెళ్ళి తర్వాత తమ భర్తే సర్వస్వం అనుకుంటారు, పెళ్ళికి ముందు ఉన్న హుషారు పెళ్ళి అయ్యాక చాలా మంది మగవారికి ఉండదు, భార్యకి వివాహ బంధం , భర్త ముఖ్యం అవుతాయి కానీ భార్యా భర్తల బంధాన్ని పక్కన పెట్టి మిగతా అన్ని బంధాలు , వ్యవహారం మగవారికి ముఖ్యం, తన హక్కులు , అవసరాలను తీర్చకపోయినా , ఏదో ఒకరోజు మార్పుకోసం ఎదురు చూస్తూ ఉంటారు మహిళలు, 

అలాగే అమ్మాయిలు తమ కాబోయే భర్త తమని తన కళ్ళలో నింపుకుని చూడాలని, సమయం ఇవ్వాలని, తనకోసం సాహసాలు చేయాలని, ఎదురుచూడాలని, కనిపించకపోతే తల్లడిల్లాలని అనుకుంటారు, ఇవి ఏమీ చాలా మంది మన కుటుంబ అబ్బాయిల్లో లేని లక్షణాలు, అదే అలుసుగా ఇవన్నీ నేర్పి అబ్బాయిల్ని అమ్మాయిలను ట్రాప్ చేయటానికి వదులుతున్నారు. వాడికి ఇరవైనాలుగు గంటలు ఇదే పని , అదే ధ్యాస, వాడికి , వాడి కుటుంబానికి పోయేదేమీ లేదు, పైగా ఈ పని చేసినందుకు డబ్బులు ఇచ్చే సంస్థలు, వ్యవహారాలు, సిగ్గులేకుండా ప్రోత్సహించే కమ్యూనిటీ బలం

ఆలోచించండి , అర్థం చేసుకోండి, మన వ్యవహారంలో మార్పు చేసుకుందాం , లేకపోతే పతియే ప్రత్యక్ష దైవం అని పట్టించుకోని భర్త తో వేగలేక ఇలా బలి అవుతారు

***
5 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం టాక్సీ డ్రైవర్ , డాక్టర్ అయిన ఒక మహిళను ప్రేమ ప్రేమ అని , మీరు అందంగా ఉంటారు అని ప్రలోభ పెట్టి పెళ్ళి చేసుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబమైన వారి తల్లిదండ్రులు అమ్మాయి చేసిన తప్పుకు , అల్లారు ముద్దుగా పెంచి చదివించి ప్రయోజకురాలైన అమ్మాయి, గుట్కా తిని ఊమ్చే ముస్లిం అబ్బాయి ప్రేమ వలలో పడితే, వేదన తట్టుకోలేక ఆమెని తమన్ జీవితంలోంచి వెలివేసి అనారోగ్యం పాలు అయ్యారు . ఆమెకు 2 పిల్లలు పుట్టాక తెలిసింది వాడికి ముందే ఇద్దరు పెళ్ళాలు , ఐదుగురు పిల్లలు ఉన్నారని. ఆమె , ఆమెను కన్న తల్లిదండ్రులు, కన్న పిల్లలు, అంతా నాశనం. 

ఇలాగే ఒక డాక్టర్, డాక్టర్ అయిన తన భార్యకి సమయం ఇవ్వకపోతే, ఇంటి ముందు జూస్ అమ్మేవాడు ఆమెను రోజూ వస్తూ పోతూ ఉంటే పలకరిస్తూ బుట్టలో వేసుకుని, ప్రేమ నటించి, నమ్మించి, తీసుకువెళ్ళి , భర్తతో విడాకులు ఇప్పించి, భర్త ఆస్తి లాగేసుకుని, పెళ్ళి చేసుకుని, ఆమె , ఆమె భర్త ఆస్తి తీసుకుని పరారయ్యాడు. వాడికి మునుపే ఇద్దరు పెళ్ళాలు. 

మన కళ్ళముందే చూసిన ఈ సంఘటనలు, ఇంకా కొన్ని ఘోరాలు, వస్తున్న వార్తలు  నాలో ఈ ప్రమాదానికి కారణాలు, మూలాలు వెతకటం మొదలుపెట్టించాయి. అందులో నేను తెలుసుకున్న నిజాలు ఇవి. ఇక మీ ఇష్టం , ఖర్మ, అదే  I mean కర్మ

No comments:

Post a Comment