Wednesday, October 9, 2024

****ఎవరి కొరకు ఎవరు సంపాదిస్తున్నారు ? ఎవరి కొరకు ఎవరు బ్రతుకుతున్నారు ? ఎవరి కొరకు ఎవరు చస్తున్నారు ?

 ఎవరి కొరకు ఎవరు సంపాదిస్తున్నారు ?
ఎవరి కొరకు ఎవరు బ్రతుకుతున్నారు ?
ఎవరి కొరకు ఎవరు చస్తున్నారు ?

NT రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు తర్వాత ఎవరికి దక్కింది ?

స్వాతంత్రం కొరకు ఎంతోమంది బలయ్యారు కానీ స్వాతంత్రం పేరు ఎవరికి దక్కింది

తెలంగాణను ఎంతో కష్టపడి ఎవరు సాధించారు 
అ పేరు ఎవరికి దక్కింది పేరు

ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదించి కూడబెట్టి సంతానం మగ పిల్లలు లేకపోవడంతో ఆడబిడ్డలు ఉంటే ఇల్లరికం తెచ్చుకుంటే ఆ ఆస్తి అంతా ఎవరు అనుభవిస్తారు ?

కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని బంగారం కొనుక్కొని బంగారం ఒంటినిండా పెట్టుకోని పెళ్లికి వెళ్లి వచ్చేటప్పుడు ఏ దొంగనో ఎత్తుకొని వెళ్తాడు

తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను పోగుచేస్తాయి అది ఎవరో దొంగిలిస్తారు

ఒక వ్యక్తి ఎంతో కష్టపడే జ్ఞానాన్ని సంపాదిస్తాడు 
అ జ్ఞానం తన సంతానానికి దక్కుతుందన్న గ్యారెంటీ లేదు దానికి ఎవరు అర్హులో వారే జ్ఞానాన్ని పొందుతారు

ఎవరు ఎలా సంపాదించిన ఎవరికి దక్కాలో అది వారికే దక్కుతుంది తాను అనుభవించొచ్చు అనుభవించకపోవచ్చు 

ఎవరికి ప్రాప్తం ఉందో వారే అనుభవిస్తారు.
.
ఒక బడా వ్యాపారవేత్త, 
ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఒక ఆమెను 

కొంతకాలం తర్వాత ముచ్చటపడి
తన భార్యకు 100 కోట్ల ఆస్తిని బదిలి చేసిన తర్వాత అంతలోనే అకస్మాత్తుగా చనిపోయాడు. 

తన భర్త కింద పనిచేస్తున్న యువకుడిని పెళ్లి చేసుకుంది. 
ఈమె ఎంతో ఇష్టపడి

అ యువకుడు ఇన్నాళ్లు నేను నా బాస్ కింద పని చేస్తున్నానని అనుకున్నాను, కానీ
నా బాసే నాకోసం పనిచేసి ఇంత సంపద కూడబెట్టాడు. అని అనుకున్నాడు. 

చూశారా 

ఈ చిన్న చిన్న విషయాలు ఎంతో నేర్పిస్తుంది 
అర్థం చేసుకుంటే

'ఎంత సంపాదించామన్న దానికన్నా ఎంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా, సంతృప్తిగా జీవించాం' అన్నది ముఖ్యం.

1. ఆరోగ్యమైన జీవితం కోసం శ్రమించండి.

2. ఎంత ఖరీదైన సెల్ ఫోన్ లోనైనా, 75% యాప్స్ వృధా.

3. ఖరీదైన కారులో కూడా, 75% వేగం ఉపయోగం లేనిది.

4. ఖరీదైన, విలాసవంతమైన భవనంలో కూడా 75% వృధాగా, ఖాళీగా ఉంటుంది.

5. ప్రతి వ్యక్తిలో 75% TALENT నిరుపయోగంగా ఉంటుంది. మిగిలిన 25% ప్రతిభను సమర్థవంతంగా వాడడం ముఖ్యం.

6. మీ బట్టల్లో 75% చాలా తక్కువగా ఉపయోగిస్తారు.

7. మన సంపాదనలో 75% తరవాతి తరాలకోసం వాడ్తాం. 

8. దాహం వేయక పోయినా, తరచూ మంచినీళ్ళు త్రాగండి.

9. అహం ప్రదర్శించ వలసి వచ్చినా, అదుపులో పెట్టుకోండి.

10. మీరే కరెక్ట్ అని తెలిసినా తగ్గి ఉండడంలో తప్పులేదు. 

11. మీరెంత శక్తివంతులైనా వినయంగా ఉంటే తప్పులేదు.

12. ఉన్న దాంతో తృప్తిగా ఉండడం నేర్చుకోండి.

అద్భుతమైన జీవితం అందుకోండి, అనుభవించండి.

మళ్లీ మానవ జన్మ వస్తుందన్న గ్యారెంటీ లేదు

వచ్చిన ఇంత ఆరోగ్యంగా 
అవయవాలతో ఇంత చురుగ్గా ఉంటారన్న గ్యారంటీ లేదు
.
అందుకే జన్మలో మీరు ఎవరో తెలుసుకోండి.

 *నీవు ఎవరో తెలుసుకో* 
 *ఎరుకతో ఉండి మసులుకో* 


Be Humble 
Be Polite.

No comments:

Post a Comment