Tuesday, October 15, 2024

*****సానుభూతి ఒక "అనుభూతి" !!

 *సానుభూతి ఒక "అనుభూతి" !!* (బండారు రాం ప్రసాద్ రావు)🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷గాయపడ్డ శునకాన్ని లేదా పక్షుల్ని, పావులరాలిని, జంతువులను దరిచేర్చుకొని నిమిరి కాస్తా మందు పెట్టీ ఉపశమనం కలిగిస్తే అవి ఎంతో కృతజ్ఞత భావంతో ఉంటాయి...అయితే భౌతిక స్పర్శ వల్ల జంతువులే అంత ఆరాధన భావంతో ఉంటే అస్వస్థత తో లేదా కాలో చెయ్యే విరిగి, అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఆత్మీయ మిత్రులను పలకరించి ఆయన చేరిన ఆసుపత్రి బెడ్ పక్కన కూర్చుని కాసేపు ఆయన చెయ్యి దగ్గరి కి తీసికొని ధైర్యం చెబితే ఆ వ్యక్తికి కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఆ చేతిని గుండెల మీద పెట్టుకుంటాడు...అలాగే ఎవరైనా మరణించిన మనిషి తాలూకూ బంధు వుల ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించి కాసేపు ఉపశమనం మాటలు నాలుగు చెబితే వారిలో ఎంతో ఆప్యాయత అనురాగం ఏర్పడుతుంది...ఖర్మ కాలి నేటి పలకరింపులు కూడా ఓటు బ్యాంక్  రాజకీయం కోసమో లేక ఏదో ప్రయోజనం కోసమో చేస్తున్నట్టు అనిపిస్తుంది...సానుభూతి అంటే అదొక భావోద్వేగ సన్నివేశంగా భావించాలి...కపట నాటకం కాకుండా ఉండాలి! ఇటీవల హఠాత్తుగా భార్య చనిపోయి భాధలో ఉన్న వ్యక్తి తన బాధను అంత దిగమింగుకుని  తనను పరామర్శించడానికి వచ్చిన వారిని పలకరిస్తుంటే...ఒక ఆవిడ "చిన్న వయసులో భార్య పోయింది...పిల్లలు చిన్నవాళ్ళు...మీకు ఆడదిక్కు" అవసరం అని వాళ్ళ బందువులు ఆమె అనడం విని అదే టైం లో వెళ్ళన నన్ను పలకరించి నట్టే పలకరించి, తన బెడ్ రూం లోకి వెళ్లి బోరున ఏడుస్తున్నాడు..."ఏమైంది బాబు అంటే "భార్య పోయి నేను దుఃఖం లో ఉంటే పది రోజులు కాక ముందే ఆడదిక్కు కావాలి అని అనడం ఇదీ సానుభూతా బాబాయ్" అని రోదించాడు! సమాజం ఎంత దిగజారింది అంటే ఒకడు ఎలా బ్రతకాలి అన్నది కూడా సమాజమే నిర్ణయిస్తుంది.. అలా ఉంటాయి లోకం మాటలు !! ఇటీవల ఒక వ్యక్తి చనిపోయి ఆ కుటుంబం దుఃఖంలో ఉంది...శవాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలో ఎక్కడ దహనం చేయాలో అనే మీమాంస ఆ కుటుంబంలో ఉంది అదే సమయంలో దగ్గరగా ఉన్న శ్మశాన వాటిక కు వెళ్లి అంత్యక్రియలకు అయ్యే ఏర్పాట్లు చేసి ఇంటి దగ్గర టెంట్ వేయించి ఒక పాతిక కుర్చీలు వేయించి, వచ్చే బంధువులకు తాగడానికి నీళ్ళు, ఇంటి ముందు శవ సంస్కారం చేసే ఏర్పాట్లు,  అనంతరం అంతిమ యాత్ర కు వాహనం సిద్ధం చేయడమే కాకుండా శవ  దహనం అయ్యాకా స్నానాలకు ఏర్పాట్లు, తరువాత ఇంటి కుటుంబ సభ్యులకు బంధువులకు ఇంత ఆన్న పానీయాలు ఇప్పించే వ్యక్తిని ఆ కుటుంబం జీవితాంతం మరవదు!! అది అసలైన ఆత్మీయ పరామర్శ!!🌷🌷🌷🌷🌷🌷🌷 మంచి 
 లేదా చెడు ఆయా  వ్యక్తులపై వారి శ్రేయస్సుపై దృష్టి సారించి వారినీ అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. భావోద్వేగ దుఃఖంలో ఉన్న వ్యక్తి కి ఉపశమనం కలిగించే విధంగా మాటలు ఉండాలి...పోయినోళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉన్నోళ్ళు వారి తీపి గుర్తులు అనే విధంగా బంధువులకు రీసీవ్ చేసుకుంటే కుటుంభానికి గౌరవ మర్యాదలు దక్కుతాయి....అందరూ సమాజంలో స్వార్థ పరులు ఉండరు...ఇంకా మంచి బ్రతికి ఉంది... ఎందుకంటే ప్రజలందరికీ భావోద్వేగాలపై సాధారణ అవగాహన ఉంటుంది. ఆ అవగాహన శ్రుతి మించకుండా ఉండాలి... 
అటువంటి ప్రవర్తన స్వీయ-సంతృప్తిని కలిగిస్తుంది. ఎందుకంటే మీతో కనెక్ట్ అయిన వ్యక్తికి ఏదో ఒక మార్గంలో (కుటుంబం, సామాజికం,  ఆర్థికంగా) సహాయం చేసిన వాళ్ళు పట్ల ఆ  కుటుంబం మీరు కనబడగానే బోరున విలపిస్తారు. నిస్వార్థత వ్యక్తులకు ఆ ఆప్యాయత లభిస్తుంది. సానుభూతి క్రియాత్మక సమాజాన్ని నిర్వహించడానికి అవసరమైన ఇవ్వడం మరియు తీసుకోవడం యొక్క చక్రాన్ని సులభతరం చేస్తుంది!! అదే అసలైన మానవత్వం! కేవలం ప్రయోజనం ఆశించి ఏ పని చేయకూడదు!!

No comments:

Post a Comment