Tuesday, October 15, 2024

****మంచిని పెంచండి!

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


         *మంచిని పెంచండి!*
              ➖➖➖✍️

```
ఒక ఊర్లో ఒక రైతు 100 ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు. ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు, ఆ జిల్లా లోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ది. పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజులు ఆ చుట్టు పక్కల ఊళ్లలో ఉన్న చిన్న పిల్లలు అందరికీ పుచ్చకాయలు తినే పండగ చేసేవాడు.

దానికోసం తన దగ్గర ఉన్న అత్యంత మేలిమి రకం పుచ్చకాయలని ఎన్నుకునేవాడు. పిల్లలకి ఒక కండీషన్ పెట్టేవాడు, పుచ్చకాయ తినేటప్పుడు గింజలని కొరకకూడదు, వాటిని తీసి ఆ రైతుకి ఇవ్వాలి. ఎన్ని వాటర్ మెలన్స్ అయినా తినొచ్చు. చిన్న పిల్లలు కూడా ప్రతి సంవత్సరం పుచ్చకాయల పండగ కోసం ఎదురు చూసేవారు. నిజానికి ఇదొక స్ట్రాటజీ.

వారం రోజుల పుచ్చకాయల పండగ అయ్యాక ఆ గింజలని వచ్చే సంవత్సరం కోసం విత్తనాలుగా దాచేవాడు. ఆ తర్వాత సంవత్సరం మరింత మేలైన పుచ్చకాయలు కాసేవి. వాటిల్లో అత్యంత మేలిరకం వాటిని మళ్ళీ వారం రోజులు వాటర్ మెలన్ తినే ఫెస్టివల్ జరిపి మళ్ళీ మరుసటి సంవత్సరం కోసం దాచేవాడు.

దీనివల్ల ప్రతి ఏటా మేలిమిరకం విత్తనాలు, నాణ్యత కలిగిన కాయలను ఇచ్చే విత్తనాలను డెవలప్ చేసుకుంటూ పోయాడు తను… కాలక్రమంలో ఆ రైతు కాలం చేశాడు. ఆ రైతు కొడుకు పుచ్చకాయలని పండించేవాడు. అయితే మా ఫాదర్ వెర్రిబాగులోడు, మంచి పుచ్చకాయలని తినే ఫెస్టివల్ కోసం ఉంచటం ఏంటి , నాన్సెన్స్ అని మేలు రకం పుచ్చకాయలని ఎక్కువ రేటుకి అమ్మి చిన్న సైజు వాటిని, నాణ్యత లేని వాటిని పుచ్చకాయలు తినే పండగ కోసం ఉంచేవాడు.

దాంతో ఏం జరిగింది..? మేలిమిరకం విత్తనాలు ఎక్కడో పడిపోయేవి… పిల్లలు తిన్న నాసిరకం పుచ్చకాయల విత్తనాలే ఈ రైతుకు మిగిలేవి… తద్వారా ఏటేటా దిగుబడి తగ్గింది, రాబడి తగ్గింది. అన్నింటికీ మించి కాయల క్వాలిటీ తగ్గింది…

ఉన్న వాటిలో మేలురకం వాటిని ఎక్కువ ధరకి అమ్మి, నాణ్యత లేని తక్కువ రకం వాటిని పుచ్చకాయలు తినే ఫెస్టివల్ కి ఉంచటం వలన సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పుచ్చకాయల నాణ్యతతోపాటు సైజు కూడా తగ్గుతూ చివరికి అన్నీ నాణ్యత లేని పుచ్చకాయలే కాసేవి. దీంతో జనాలకి కూడా ఆ రైతు పండించే వాటి మీద ఆసక్తి తగ్గింది, చివరకి ఆ రైతు దగ్గర ఒక్క మంచి విత్తనం కూడా మిగలలేదు

జీవితం చిన్నదే కానీ దీర్ఘకాలిక ప్రణాళిక ఎందుకు ముఖ్యమో గోవా మాజీ ముఖ్యమంత్రి, మాజీ డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పర్రీకర్ గారు చెప్పిన వాటర్ మెలన్ స్టోరీ అటూఇటూగా తర్జుమా చేసి రాసిన పోస్ట్ ఇది.✍️```
      
         -సేకరణ.

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment