Wednesday, October 9, 2024

 🪷🙏🏻🪷🙏🏻🪷

🙏🏻 *రమణోదయం* 🙏🏻

*సద్వస్తువు "నేను" అనే అహంకారానికి మూలమని (ఉత్పత్తి స్థానమని) అతి సూక్ష్మబుద్ధికి తెలుస్తుంది. స్థూల నామరూపాలను తెలుసుకొంటున్న లావైన రోకలి వంటి మందబుద్ధి కలవారికి ఆత్మని తెలుసుకొనడం అసాధ్యం.*

వివరణ : *"స్థూలమైన గడ్డపారతో సన్నని పట్టు వస్త్రాన్ని కుట్టలేము; గాలిచే అతి చంచలమైన దీపంతో అతి సూక్ష్మమైన వస్తువుల లక్షణాలను నిర్ణయించలేము; రజస్తమోగుణ వశమైన మనస్సుతో వస్తువు యొక్క అనుభవం సాధ్యం కాదు..." అని శ్రీ రమణ మహర్షుల గ్రంథం విచార సంగ్రహం లోని 8వ అధ్యాయంలో ఉపదేశించిన విషయాన్ని ఇక్కడ గ్రహించాలి.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.446)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
                 
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment