*ఎదురీత*
****
రాజ్యలక్ష్మికి భర్త పోయిన తరువాత అతని ఆఫీస్ లో హెల్పర్ ఉద్యోగం ఇచ్చారు...అది స్టేటు గవర్నమెంట్ ఆఫీస్...
రాజ్యలక్ష్మి భర్త డ్రైవర్ గా పనిచేసే వాడు. అతను ఆఫీస్ డ్యూటీలో ఉండగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు...
వెనుక కూర్చున్న సీనియర్ మానేజర్ ఎలాగో బతికి బయట పడ్డాడు..
ఎంతో షాక్ కి గురి అయినా...
మనసులో బాధ ఉన్నా, ఏదో ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా పిల్లలను పెంచుకోవచ్చు, సంసారాన్ని ఈదొచ్చు.. అన్న భరోసా కలిగింది...
తను పనిచేసే సెక్షన్ లో పదిమంది ఉంటారు...
వాళ్ళకి ఒక ఆఫీసర్...
ఒక పెద్దాయన యాదగిరి అని, ఇంకో హెల్పర్ ఉన్నాడు అక్కడే....అతను ఆ సంవత్సరంలోనే రిటైర్ అవుతున్నాడు...
అందుకని ఈమెని అక్కడ వేశారు...
ఆమె పని అడిగిన ఫైల్స్ ఇవ్వడం, అవసరమైన పేపర్ల జిరాక్స్ కాపీలు మెషీన్ లో తీసి ఇవ్వడం, యాదగిరి తెచ్చిన టీ ని కప్పుల్లో పోసి, అందరికీ ఇవ్వడం...
రాజ్యలక్ష్మికి నిండా ముప్పై ఏళ్ళు కూడా లేవు...
ఏమీ అలంకారాలు లేకపోయినా వయసు తెచ్చిన అందంతో, సహజంగా అందంగా ఉండేది..
కానీ ఆమె చేరిన వారానికే ఆ ఆఫీసర్ వక్రబుద్ధి అర్ధమయ్యింది...
ఏదో పని వంకతో పిలవడం...
టీ ఇస్తే కప్ తీసుకుంటూ చెయ్యి తాకడం...తాకి అసలు తెలియనట్టు ఉండటం..
ఇలాంటివి అసలు బయటికి ఎలా చెప్పుకోవాలో అర్ధం కాలేదు లక్ష్మికి...
ఆమెనుండి ఎటువంటి వ్యతిరేకతా లేకపోయేసరికి, అతను మరింత వేధించడం మొదలు పెట్టాడు...
ఫైల్ కోసం స్టోర్ రూమ్ కి వెళ్తే, అతనూ ఏదో పని ఉన్నట్టు రావడం...నువ్వు ఈ చీరలో బావున్నావు అనడం...ఏవో వెకిలి మాటలు మాట్లాడటం...
రాజ్యలక్ష్మికి ఈ ఉద్యోగం తను చేయగలదా అనిపించేది...దుఃఖం వచ్చేది...
ఎదిరించే ధైర్యం ఉండేది కాదు.
ఉద్యోగం చేయకపోతే, తన పరిస్థితి ఏంటని, చాలా వేదనగా ఉండేది...
ఇలా ఎదురీదడం తనవలన అవుతుందా, అనిపించేది...
ఇంట్లో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు... వాళ్ళకి చెప్పుకుని, వాళ్ళని క్షోభ పెట�
No comments:
Post a Comment