కంపు చేస్తున్న ట్రంపు
'ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ' అని ఒక సినిమాలో నూతన్ ప్రసాద్ అంటుంటాడు. ఇప్పుడు నిజంగానే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అదీ అమెరికా ప్రెసిడెంటు ట్రంపు బాబాయి వల్ల. అతను రెండోసారి ప్రెసిడెంటు అయినప్పటినుండి తను ప్రశాంతంగా ఉండింది లేదు. ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచింది లేదు.
అసలు ట్రంపుకు ఏం కావాలి? ఏమీ అక్కరలేదు అంతా కంపు చేయడం తప్ప.
అతనికి ఎనభై ఏళ్ళు. పరలోకానికి పోయేందుకు సిధ్దంగా ఉన్న వయసు. చూడాల్సినవన్నీ చూశాడు. చేయాల్సినవన్నీ చేశాడు ఆ ఎప్‌స్టీన్ తో సహా. ఇక మూడోసారి ప్రెసిడెంటు అయ్యేందుకు ఎలాగూ ఛాన్సు ఎలాగూ లేదు. అసలు ఈ ముసలోడ్ని ఎన్నుకున్నందుకు అమెరికా ప్రజలు కూడా బాగానే అనుభవిస్తున్నారు.
ఒకసారి బాగా గమనించండి ప్రపంచంలో శాంతి లేకుండా చేస్తున్నది ఈ ముసలి ప్రెసిడెంట్లే. ఎందుకంటే ఎలాగూ తొందర్లో పోయేవాళ్ళమే.. తమతో పాటు ఈ ప్రపంచాన్ని కూడా తీసుకుపోదామని ఈ ముసలి ముండల ఆలోచనేమో..
ఎక్కడో యుధ్దం జరిగితే మనకేమిటి అనుకోవడానికి లేదు.. అందులోనూ అమెరికా చేసే ప్రతి యుద్దమూ నేరుగా మన వంటింట్లో ప్రభావం చూపిస్తుంది. అమెరికా పెద్ద ఊడల మర్రి లాంటిది. ప్రతి దేశంలోను ఒక ఊడను దింపి కెలుకుతూ ఉంటుంది.
ట్రంపు బాబాయి యుద్దాల్ని ఆపుతానని అధికారం లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆగిన యుద్దాల్ని కూడా ప్రారంభిస్తున్నాడు.
ఐడెంటిటీ క్రైసిస్, అహంకారం, అబద్దాలు, నీతిజాతి లేకపోవడం, ముసలివయసు, రోగాలు, అంతులేని అధికారం, డబ్బు మీద యావ .. ఇలాంటి ఎన్నో అవలక్షణాలు కలిస్తే ఒక ట్రంప్ బాబాయి.
అతనేదో అధికారం లోకి వస్తూనే ఆ శాంతి బహుమతి ఏదో అడిగాడు. అదేదో ఇచ్చేసున్నా ఆగి ఉండేవాడేమో.. ఇప్పుడు శాంతి బహుమతి నాకు ఇచ్చేదాకా మీకు శాంతి లేకుండా చేస్తానని కూచున్నాడు ..
'ది గ్రేట్ డిక్టేటర్ ' సినిమాలో చాప్లిన్ హిట్లర్ వేషంలో గ్లోబ్ తో ఆడుకుంటాడు. ఇలా ఆడుకుంటున్నాడు ట్రంపు. గ్లోబులో ఎవరైనా నా మాట వినాల్సిందే. లేకపోతే ఆంక్షలే అంటున్నాడు. వేరే దేశంలోకి వెళ్ళి ప్రెసిడెంటును ఎత్తుకొచ్చి జైలులో పెట్టేస్తున్నాడు. వాళ్ల ఆయిల్ ను సొంతం చేసుకున్నాడు. ఎక్కడ ఆయిల్ కనపడితే అక్కడ దిగి ఇది నాదే అంటున్నాడు. మెన్నటి రోజు అమెరికా మోస్ట్ పవర్‌ఫుల్ కంట్రీ. ఈరోజు మోస్ట్ హేటేడ్ కంట్రీ. ఇది ట్రంపు బాబాయి తనను గెలిపించినందుకు అమెరికా ప్రజలకు ఇచ్చిన గిఫ్టు.
- సాయికిరణ్ పామంజి,
No comments:
Post a Comment