Siddhashram Secrets Revealed: A Yogi's Real Experience in Shambhala | సిద్ధాశ్రమం రహస్యాలు #facts
Author Name:NVVidyalayam
Youtube Channel Url:https://www.youtube.com/@NVVidyalayam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=KrAk1wJq7Ns
Transcript:
(00:06) జీవితం యొక్క పూర్ణత్వము [సంగీతం] జీవితంలోని ఆనందము మరియు జీవితం యొక్క సౌందర్యము వీటన్నింటిని ఒకే చోట అనుభవించగలిగే మహాద్భుతమైన దివ్యభూమి సిద్ధాశ్రమం [సంగీతం] ప్రతి సన్యాసి ఋషి సాధకుడు కూడా ఈ ఆధ్యాత్మిక పుణ్యస్థలాన్ని చేరుకోవాలని కలలు కంటారు. గొప్ప [సంగీతం] గొప్ప సాధువులు సన్యాసులు మరియు యోగులు కూడా సిద్ధాశ్రమంలోకి అడుగుపెట్టే అర్హత కోసం ఎదురుచూస్తుంటారు.
(00:35) [సంగీతం] సిద్ధాశ్రమంలోకి ప్రవేశం పొందడానికి ఎంతటి కఠినమైన పరీక్షలనైనా ఎదుర్కోవడానికి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సంవత్సరాల [సంగీతం] తరబడి సాధనల్లో నిమగ్నమై ఉంటారు. ఈ వీడియోలో సిద్ధాశ్రమంలోకి ప్రవేశం పొందాలనే ఆశయంతో ఉన్న సాధకుడు మొదటిసారి సిద్ధాశ్రమం ఎలా వెళ్ళాడు అక్కడ ఆ సాధకుడి అనుభూతులు ఏమిటి అనే విషయాలు తెలుసుకుంటారు.
(01:03) ఈ వీడియోలోని అనుభవాలన్నీ కూడా ఆ సాధకుని మాటల్లోనే చెప్పడం జరిగింది. సాధకుడి పేరును గోప్యంగా ఉంచడం జరిగింది. [సంగీతం] [సంగీతం] [సంగీతం] నా ఎనిమిదేళ్ల సాధనాత్మక జీవితంలో అతి పవిత్రమైన [సంగీతం] సిద్ధాశ్రమము అనే పదము నా మనసు పొరల్లో నిరంతరము తిరుగుతూనే ఉంది. అమృతతుల్యమైన ఈ దివ్యధామమును నా కళ్ళతో చూడాలనుకునే వాడిని మరియు [సంగీతం]
(01:50) పూజ్య గురుదేవులు శ్రీ నిఖిలేశ్వరానంద గారి శిష్యత్వం తీసుకున్న వెంటనే గురువుగారికి నా సంకల్పం గురించి తెలియజేశాను. [సంగీతం] ఆ క్షణాన గురుదేవులు ఆశీర్వాదం అయితే ఇచ్చి ఇంకా ఈ విషయం గురించి తెలియజేస్తూ ఈ విషయమై నీవు [సంగీతం] అత్యంత గొప్ప సాధనాత్మక స్థాయిని సాధించడం అనివార్యం. నువ్వు స్వయంగా పూర్తిగా ఈ సాధనలో నిమగ్నం అవ్వాల్సి ఉంటుంది అన్నాడు.
(02:19) ఆ తర్వాత ఐదేళ్ల వరకు గురుదేవులు ఈ సిద్ధాశ్రమం గురించి నాతో ఏ విషయము చర్చించలేదు. [సంగీతం] ఎప్పుడైనా మాటల మధ్యలో ఈ విషయం వచ్చినా ఇంకా దీనికి సమయం రాలేదు అని దాటవేసేవారు. ఇక నేను కూడా మౌనం వహిస్తూ [సంగీతం] నా శాయశక్తుల సాధనలో నిమగ్నమైపోయాను. కొద్ది రోజుల వ్యవధిలోనే గురుదేవులు తామ ఇచ్చిన మాటకు ఎంత కఠినంగా కట్టుబడి ఉంటారో నాకు అర్థమయింది.
(02:47) శిష్యునిలోని శిధిలత్వాన్ని బద్ధకాన్ని గురుదేవులు అస్సలు సహించరు. [సంగీతం] నిరంతరం శిష్యుల్ని సాధనల్లో నిమగ్నమయ్యేలా చేసి వారిని ఉన్నత స్థాయికి చేరుకునేలా తీర్చిదిద్దడమే గురువుగారి ధ్యేయం. గురువుగారి సాన్నిధ్యంలో ఉండే మొట్టమొదటిగా దివ్య తేజస మంత్ర సాధన ద్వారా నా ఆంతరిక జీవనాన్ని పవిత్రంగా [సంగీతం] మార్చుకొని తర్వాత కుండలిని జాగరణను అభ్యాసం చేసి శచక్ర భేదనంలో విజయం సాధించాను.
(03:19) కొంత సమయం తర్వాత [సంగీతం] నేను సహస్రారంలో ప్రాణవాయువును స్థాపించి సమాధి స్థితిలోకి వెళ్ళడం మొదలు పెట్టాను. [సంగీతం] ఆ తర్వాత నేను మహావిద్య సాధనలు చేయడానికి నిశ్చయించుకున్నాను. మొదట్లో కొన్నిసార్లు సిద్ధిని పొందలేక ఇబ్బంది పడినా గాని చివరకు [సంగీతం] నా సాధన సఫలీకృతమైంది. ఆ తర్వాత పూజ్య గురుదేవులు నాకు బ్రాహ్మి అభిషేకం చేశారు.
(03:45) ఆ తర్వాత నా జీవితంలో నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ సువర్ణ గడియ వచ్చేసింది. గురుదేవులు నన్ను తన వెంట సశరీరంతో సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళడానికి అనుమతిని [సంగీతం] ప్రసాదించారు. గురుదేవులు రహస్యమైన చిరునవ్వు నవ్వుతూ పదా మౌంట్ అబు వెళ్ళడానికి తయారవ్వు అన్నాడు. మరుసటి రోజే నేను గురుదేవులు [సంగీతం] మరియు కొంతమంది శిష్యులతో పాటు మౌంట్ అబు చేరుకున్నాము.
(04:13) చాలా మందిరాల్లో దర్శనం చేయించిన తర్వాత గురుదేవులు నన్ను [సంగీతం] గురుశిఖరము అనే పేరుగల పర్వతము వెనక్కి తీసుకెళ్ళారు. [సంగీతం] అక్కడ ఒక రాతిశిల ఉంది. ఆ రాతిశిల మిగతా రాతిశిలల్లా కాకుండా భిన్నంగా ఉంది. ఆ రాతిశిలలో దివ్యత్వము జీవత్వము ఉట్టిపడుతున్నాయి. [సంగీతం] ప్రత్యేకంగా ఉన్న ఆ విశాలమైన రాతిశలపై గురుదేవులు తమతో పాటు నన్ను కూడా కూర్చోబెట్టారు.
(04:40) నన్ను కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు. నేను కళ్ళు మూసుకోగానే ఆ రాతిశిల ముందుకు ప్రయాణిస్తున్నట్లుగా అనిపించింది. గాలిలో ఎగురుతున్నట్లుగా అనిపించింది. [సంగీతం] ఐదు నిమిషాల తర్వాత ఎప్పుడైతే గురుదేవులు కళ్ళు తెరవమనగానే కళ్ళు తెరిచి చూడగానే నా ఆశ్చర్యానికి అవధులు లేనట్లయింది. ఆ ప్రదేశము [సంగీతం] పూర్తిగా భిన్నంగా ఉంది. నా కళ్ళ ముందు మంచుతో కప్పబడి ఉన్న ఒక పర్వత శృంఖల దాని మధ్యలో ఒక విశాలమైన ద్వారము ఉంది.
(05:13) ఎదురుగానే ఒక వటవృక్షము ఉంది. దానికి ఎడంవైపు సురమ్యమైన సరోవరం ఉంది. గురుదేవులు ఆ సరోవరంలో దిగారు నేను కూడా గురుదేవులను అనుసరించాను. మెల్లమెల్లగా నీ ఇల్లు ఛాతి దాకా చేరుకున్నాయి. అయినా గాని [సంగీతం] గురుదేవులు ముందుకు వెళ్తూనే ఉన్నారు. చాలా ముందుకు చేరుకున్న తర్వాత మేము [సంగీతం] పూర్తిగా నీటిలోకి వెళ్ళిపోయాము.
(05:39) అయినా గాని శ్వాస మాత్రం మామూలుగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పుడు ఒక ప్రకాశవంతమైన గుహ కనిపించసాగింది. గురుదేవులు ఆ గుహ దగ్గరకు చేరుకోగానే ఆ గుహ ద్వారం స్వతహగానే తెరుచుకుంది. ద్వారంలోకి ప్రవేశించిన వెంటనే నా శరీరంలో అంతచేతన మరియు ప్రాణశక్తి ప్రవహించసాగాయి. [సంగీతం] నేను ఆశ్చర్యంలోనే ఉన్నాను. అంతటి మంచు ప్రాంతంలో గడ్డిపరక కూడా మొలకెత్తడానికి అవకాశం లేని ఆ ప్రాంతంలో మేము ప్రవేశించిన ఆ ద్వారం మధ్యలో ప్రకృతి యొక్క సామ్రాజ్యమే ఉంది.
(06:17) [సంగీతం] పచ్చపచ్చని సరికొత్త వృక్షాలు వేల రకాల పుష్పాలతో ఉన్న ఆ భూఖండం ఇంద్రుని నందనవనాన్ని తలపిస్తున్నది. [సంగీతం] ఆ పుష్పాల యొక్క మధుర గంధంతో మనసు మరియు ప్రాణంఅంతా కూడా సువాసన భరితమయింది. ఇప్పుడు మేము ఆశ్రమం యొక్క ముఖ్య భాగంలోకి ప్రవేశించాము. [సంగీతం] అక్కడ మృగచర్మాన్ని ధరించి ఉన్న చాలామంది యోగులు తిరుగుతున్నారు. గౌరవ వర్ణంతో బలిష్టంగా ఆర్యుల్లాగా ఒడ్డు పొడవు బాగా ఉన్న శరీరంతో ముఖంలో తపస్శక్తితో నిండిన వెలుగుతో మరియు భుజాలపై ఊగుతున్న జటలతో చాలా దివ్యంగా ఉన్నారు.
(06:56) వారంతా కూడా వెళ్తూ వెళ్తూనే గురుదేవులు ఎదురుపడగానే వారి కమండలాన్ని పక్కన ఉంచి సాష్టాంగ దండవత ప్రణామాలు చేస్తూ వెళ్తున్నారు. మనోహరి పర్ణ కుటీరం మధ్య ఉండా వెళ్తూ మేము [సంగీతం] సిద్ధయోగ సరస్సు వరకు చేరుకున్నాము. పారదర్శకమైన నీలం రంగు నీటి అలలపై కొంతమంది సాధకులు స్ఫటిక నౌకల్లో విహరిస్తూ ఆహ్లాదంగా ఉన్నారు. ఇంకొంతమంది స్త్రీ సాధికలు ఆ [సంగీతం] స్వచ్ఛమైన నిర్మలమైన జలంలో స్నానం చేస్తూ ఒకరిపై మరొకరు నీటిని చిలకరించుకుంటున్నారు.
(07:30) అదే సరస్సులో కొంతమంది యోగులు సంధ్యావందనం చేస్తున్నారు. ఆ వాతావరణం అంతా ఉత్సాహం, ఉల్లాసం ఆనందంతో నిండిపోయి ఉంది. [సంగీతం] గురుదేవుల ఆజ్ఞతో నేను ఆ సరస్సులో దిగి స్నానం చేశాను. [సంగీతం] ఆ సరస్సులో స్నానం చేసి బయటకు రాగానే మనసంతా ఉత్సాహం ఉల్లాసంతో నిండిపోయింది. [సంగీతం] నా శరీరమంతా చాలా అందంగా ఆకర్షణీయంగా తేజస్వితంగా మారిపోయింది.
(07:56) నా [సంగీతం] అసలు వయస్సు కంటే చాలా తక్కువ వయస్సుతో యువకునిలా స్వయంగా నాకే అనిపించసాగింది. ఆ సరస్సు యొక్క ఎడం వైపు పక్కనే [సంగీతం] ఒక ఉద్యానవనం ఉంది. ఆవనంలో శ్యామవర్ణంలో ఉన్న జింకలు నిశ్చింతగా [సంగీతం] నిర్భయంగా తిరుగుతూ ఉన్నాయి. ఆకర్షణీయమైన అందమైన స్త్రీ సాధికలు ఆహ్లాదకరంగా కూర్చుని ముచ్చట్లాడుతున్నారు. ఇంకొందరు ఆ జంతువులను నిమురుతూ ఉన్నారు.
(08:24) ఒక ప్రదేశంలో అత్యంత భవ్యమైన స్పటిక శిలల పైన చాలా మంది మునులు ఋషులు ధ్యానస్తులై ఉన్నారు. వారంతా కూడా ముఖ మండలంలోనూ శరీరమంతా కూడా దివ్యమైన తేజస్సుతో నిండి చూడగానే నమస్కరించాలన్న భావన కలుగుతున్నది. ఆ ఉద్యానవనం చివర్లో చాలా దట్టమైన చాలా నీడనిస్తున్న [సంగీతం] ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం యొక్క ఆకులు తామ్రవర్ణంలో వెలుగును ప్రసరిస్తూ ఉన్నాయి.
(08:55) వృక్షమంతా కూడా గులాబీ లాంటి పుష్పాలతో నిండి ఉంది. గురుదేవులు అక్కడ నిలబడి ఇదే మూలకల్ప వృక్షము [సంగీతం] ఇక్కడ నిలబడి ఏ వస్తువు కావాలని కోరినా ఆ వస్తువుని ప్రకృతే స్వతహాగానే తక్షణమే ఆ కోరికను తీరుస్తుంది. కొద్ది క్షణాలు ఆ కల్ప వృక్షం కింద నేను ధ్యానస్తుడినై కూర్చున్నాను. [సంగీతం] మనసులో శ్రీకృష్ణ భగవానుని దర్శించాలని కోరుకున్నాను. వెంటనే [సంగీతం] ఒక దివ్యమైన తేజస్సుతో నిండిన కాంతిపుంజం నా ముందు ప్రత్యక్షమైంది.
(09:28) మరుక్షణమే ఆ కాంతిపుంజము శ్రీకృష్ణ భగవానుని మన్మోహన రూపంగా దర్శనం ఇచ్చింది. పీతాంబరమును ధరించి [సంగీతం] మెడలో వైజయంతి మాల తలపై నెమలిపించంతో చేతిలో వేనువు పెదవలపై హృదయపూర్వకమైన చిరునవ్వుతో ఉన్నాడు. [సంగీతం] నా రోమ రోమాలన్నీ పులకించిపోయాయి. నా ఆరాధ్య దైవమైన ప్రభువు యొక్క దివ్య స్వరూపాన్ని దర్శించి నేను ధన్యున్ని అయ్యాను.
(09:58) అప్పుడే గురుదేవులు ఇకప అని సంకేతం ఇచ్చారు. [సంగీతం] ముందువైపు కొద్దిపాటి ధ్వనులు వినిపిస్తున్నాయి. చూస్తే దేవాంగనలు మరియు అప్సరసల సమూహము రెండు వైపులా నిలబడి గురుదేవుల దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని దాటుకుంటూ గురుదేవులు ముందుకు [సంగీతం] కదిలారు. ముందువైపు ఏదో ఋషుల సభ జరుగుతూ ఉంది. [సంగీతం] అక్కడ కూర్చున్న ఋషులు మునులు, యోగులు, సన్యాసులు అందరూ దేవదూతల్లా అనిపిస్తున్నారు.
(10:27) వారి పుష్టిగా ఉన్న శరీరాల చుట్టూ ఒక దివ్యమైన తేజస్సు కనిపిస్తూ ఉంది. అటువంటి తేజస్సు భూ ప్రపంచంలో సాధ్యం కాదు. గురుదేవులు అక్కడికు చేరగానే వారి శరీరాలన్నీ పులకించిపోయి వారంతా అత్యంత వినమ్రత భావంతో గురుదేవులను అక్కడ కొన్ని క్షణాలు గడపాల్సిందిగా ప్రార్థించారు. అక్కడే ఇప్పుడు అద్వితీయమైన సుందరి అప్సర ఊర్వశి మంగళ వాయిద్యాలతో కూడిన సిద్ధ నృత్యాన్ని ప్రారంభించింది.
(11:00) ఆ నృత్యంతో ఆ నలువైపుల ఒక ఆహ్లాదభరిత వాతావరణం నెలకొంది. ఆ నృత్యము సమాప్తమైన వెంటనే వారి అభ్యర్థన మేరకు గురుదేవులు అందరిని ఆశీర్వదిస్తూ లేచి నిలబడ్డారు. అక్కడి నుండి ముందుకు వెళ్ళడానికి అందరికీ అనుమతి లేదు అయినా [సంగీతం] గాని నేను గురుదేవుల వెంట ఉండడం వల్ల అక్కడ నన్ను ఎవరూ ఆపలేదు. కొద్ది దూరం వెళ్ళగానే ఒక పర్ణ కుటీరము కనిపించింది.
(11:29) ఆ కుటీరం నలువైపుల దివ్యమైన వెలుగు ఉంది. గురుదేవులతో పాటు నేను లోపలికి ప్రవేశించాను. ప్రవేశించిన వెంటనే ఎదురుగానే ఎవరి దర్శనం కోసమైతే దేవగణాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తారో ఆ దివ్యాత్మ అక్కడ ఉన్నాడు. చూస్తుంటే దివ్యమైన మహాతేజస్సే సశరీరంగా అవతరించినట్లుగా ఉంది. వారే సమస్త గురువులకే గురువైన దాదా గురు స్వామి [సంగీతం] సచ్చిదానంద మహారాజు గారు గురుదేవులు ప్రణామం చేసిన వెంటనే యోగిరాజుల వారు గురుదేవులను ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు.
(12:10) వారి పరిచయం జ్ఞప్తికి రాగానే వారి శ్రీ చరణాలపై తలను వాల్చి వెక్కి [సంగీతం] వెక్కి ఏడవసాగాను. తక్షణమే నా ఆత్మే నా ప్రాణమే ఎదురుగా కూర్చుని ఉంది అని అనిపించింది. భావాతీతమైన స్థితిలో అశ్రు నయనాలతో కూడిన కంఠధ్వనితో నా యొక్క అశృధారలతో వారి పాదాల్ని ప్రక్షాలన చేస్తూ ఉండిపోయాను. [సంగీతం] సగం తెరిచి ఉన్న కళ్ళతో నేను వారి అత్యంత సుఖమైన దివ్యమైన స్పర్శను అనుభూతి చెందుతూ ఉండిపోయాను.
(12:44) ఆ విధంగా ఎంత సమయం గడిచిపోయిందో కూడా నాకు తెలియదు. అకస్మాత్తుగా గురుదేవుల చెయ్యి నా వీపుపై తగిలింది. [సంగీతం] కళ్ళు తెరిచి చైతన్యమై స్పృహలోకి రాగానే అక్కడ ఎటువంటి గుహా లేదు. ఇంకా దాదా గురుదేవులు కూడా లేరు. [సంగీతం] నేను మరలా అదే వటవృక్షం కింద రాతిశలపై కూర్చుని ఉన్నాను. ఆ తర్వాత గురుదేవులు నన్ను కళ్ళు మూసుకోమని చెప్పి వాయుమార్గంలో మరలా మౌంట్ అబు ప్రాంతానికి తీసుకొని వచ్చాడు.
(13:17) వాస్తవంగానే నేను ధన్యుని ఎందుకంటే పూజ్య గురుదేవులు నాపై కృపతో నన్ను శిష్యునిగా అంగీకరించి సిద్ధాశ్రమం వరకు వెళ్ళగలిగే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించినందుకు నా శరీరంలోని రోమ రోమాలు కూడా వారికి రుణపడి ఉంటాయి.
No comments:
Post a Comment