Saturday, May 2, 2026

 *షోడశోపచార పూజ*
   షోడశ అనగా పదహారు, ఉపచారాలు అనగా సేవలు.

 *పూజా వస్తువులు - అవి వరుసగా...* 

 *1.ఆవాహనం* = మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించాలి. 

 *2.ఆసనం* = వచ్చిన వారిని కూర్చోబెట్టాలి.  

 *3పాద్యం* = పాద పూజ చేయాలి.  

 *4.ఆర్ఘ్యం* = చేతులు శుభ్రపరచాలి. 

 *5.ఆచమనీయం* = దాహమునకు మంచి నీళ్ళివ్వడము. 

 *6.స్నానం* = శుభ్రమైన నీటితో అభిషేకము చేయాలి. 

 *7.వస్త్రం* = పొడి బట్టలు కట్టాలి. 

 *8.యజ్ఞోపవీతం* = యజ్ఞోపవీతమును మార్చాలి. 

 *9..గంధం* = శ్రీ గంధము చెట్టు చెక్కను సానపై సాదగా వచ్చిన సుగంధమును అలంకరించాలి. 

 *10.పుష్పం* = పువ్వులతో అలంకరించాలి. 

 *11.ధూపం* = అగరు బత్తీలు వెలిగించి ఉంచాలి. 

 *12.దీపం* = ఆవు నెయ్యి లేదా మంచి నూనెతో దీపము వెలిగించాలి. 

 *13.నైవేద్యం* = మడితో వండిన ఆహారమును లేదా ఫలములు, బెల్లము, మొదలగునవి సమర్పించాలి. 

 *14.తాంబూలం* = తమలపాకులు వక్కలు తాంబూలముగా ఉంచాలి. 

 *15.నమస్కారం* = మనస్పూర్తిగా నమస్కరించాలి. 

 *16.ప్రదక్షిణం* = మన కుడి భుజము వైపున దేవుడు ఉండేలా చూచుకొని దేవుని చుట్టూ తిరగటము.

 *నైవేద్యం:---*

భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . 
తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి.



1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు, పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .

 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిoచరాదు . చల్లారాక పెట్టాలి.

 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.

 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.

 *ఫలాలు:--*  
వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు...

 *కొబ్బరి కాయ* ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి. 

 *అరటి పండు -* భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది.
అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. 
చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. 

 *చిన్న అరటిపళ్లు నైవేద్యం* గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. 

 *నేరెడు పండు.* - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు. 

 *ద్రాక్ష పండు.* - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు, రోగాలు నశిస్తాయి, కార్యజయం లభిస్తుంది. 

 *మామిడి పండు.* - మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది, నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు. 


 *అంజూర పండు.* - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అo జూరాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

 *సపోట పండు.* - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి. 

 *యాపిల్ పండు* - భగవంతుడికి యాపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. 
*కమలా పండు -* భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి. 

 *పనసపండు* - పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

No comments:

Post a Comment