Saturday, May 2, 2026

 నిద్రపోవడం అంటే తాను  ఉండడం.

మేలుకోవడం అంటే తాను అనేకం అవడం.

వెరసి తానొక్కడే ఉండేది.

"ఒక్కడు"గా ఉండడం ఆనందం. నిద్రలో ఒక్కడుగా ఉన్నప్పుడు ఉన్న ఆనందాన్ని మెలకువలో వెతకడమే "జీవితం" అయ్యింది. మూడూ ఒకటైతే తప్ప సుఖం దొరకదు.
ఈ కొంతే నేను అని ఉన్నప్పుడు నీవు కలలో ఉన్నట్టు.
❤️💖❤️
అంతా నేనే అని ఉన్నప్పుడు నీవు మెలకువలో ఉన్నట్టు.
కల ఉంటే తాను - సర్వసాక్షి, కల లేకుంటే తాను - కేవలసాక్షి.
ఎక్కణ్ణుండి ఏకంగా ఉన్న తాను మూడుగా అయినాడో, మళ్ళీ ఆ కేంద్రానికి చేరుకుని "ఒకటి" అయితేగాని ఆ "హాయి" అనేది, సుఖం అనేది అనుభవానికి రాదు. గాఢనిద్రే ఆ కేంద్రం.

మెలకువ అనేది పరిధి.
నువ్వు దేనినైతే మనస్సు అంటున్నావో అది సాక్షాత్తు ఆత్మయే.

నువ్వు దేనినైతే ప్రపంచం అంటున్నావో అది సాక్షాత్తు బ్రహ్మమే.

నువ్వు మార్చవలసిందిగాని, రిపేర్ చేయవలసిందిగాని ఏమీలేదు.

నువ్వు పోగొట్టుకోవలసిందిగాని, పొందవలసిందిగాని ఏమీలేదు.

No comments:

Post a Comment