Saturday, May 2, 2026

 *ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు  మరియు వైశాఖ పౌర్ణమి శుభోదయ శుభాకాంక్షలు 💐*
లక్ష్మి సరస్వతి దుర్ఘ గాయత్రి అమ్మవార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
 *ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాభినందనలు తెలియచేస్తూ.. 💐💐🥭🥭🌹🌹*



         చంద్రుడిలో ఉండే చిన్న *మచ్చ* చూడకుండా చుట్టూ ఉన్నా అనంతమైన *స్వచ్ఛమైన* తెల్లదనం చుడండి.. మీ *మనస్సు* ఆలోచన బాగుంటుంది.

         జీవితంలో *పైకి* వచ్చేటప్పుడు *వెనుక* ఉన్న వారితో  *మంచిగా* మెలగండి.. *రేపు* మనకి ఏదైనా *కష్టం* వచ్చినప్పుడు.. వారు మన వెనక *తోడు* నిలుస్తారు

       ఎదుటివారిలో *లోపాలు* మాత్రమే చూస్తూ ఉంటే.. *బంధాలు* ఎప్పటికీ బలపడవు.. మన *మనసు* ను *విశాలంగా* చేసుకునే కొద్దీ వారి లోని *లోపాలు* చిన్నవిగా కనిపిస్తాయి  

     జీవితం నడి *సముద్రంలో* ప్రయాణం వంటిది..ఆ ప్రయాణాన్ని *పిరికివాడు* ప్రమాదంగా.. *ధైర్యావంతుడు* సహసంగా..*తెలివైనవాడు* విహార యాత్ర గా చూస్తాడు..

            *అహంకారం* ఎందుకు మిత్రమా..పై  *చర్మం* దుస్తులు తొలిగిపోతే అందరి లోపల దాగుండే శరీర నిర్మాణం ఒకటే.. పైకి మాత్రమే *రంగు* అందం. శరీరం రంగులు కాదు.. *మనసు* రంగు చూడటం *అలవాటు* చేసుకో మిత్రమా.

       మనిషి చేతికోచ్చిన *ధనాన్ని* చూసి సంతోషం మురిపంగా గా లెక్కిస్తాడు.. తన ఆస్తి ఎంత పెరిగింది అని..
కాని పైన ఉన్నా *భగవంతుడు* నవ్వుతు *చూస్తుంటాడు*.. నా దేగ్గెరకి *రావటానికి* నీ జీవితంలో ఎంత *కాలం* తగ్గిందో అని..
     
        భయపడితే *కుక్క* కూడా బెదిరిస్తుంది ఎదురు తిరిగితే *దుర్మార్గుడు* కూడా పారిపోతాడు.

     నీవు *నిజాయితీగా* ఉంటే నీతో చాలా మంది *మిత్రులు* ఉండకపోవచ్చు *కానీ !* కచ్చితంగా *సరైనా వ్యక్తులే* నీకు మిత్రులుగా *మిగులుతారు* .

       *మనసు* శరీరం *ఉల్లాసంగా* లేవని *డాక్టర్* దగ్గరికి వెళ్తే *నాడి* పట్టుకుని చూసి *నవ్వుతూ* ఆయన చెప్పిన సలహా ఏంటో *తెలుసా ?* . వెళ్తు వెళ్తు నీ పాత *మిత్రులందరినీ* ఒకచోట చేర్చి వారితో గడపడానికి *సమయాన్ని* కేటాయించుకో నీ *బాధలన్నింటికి* అదే మందు .

       జీవితంలో *ఓడిపోవడం* *మోసపోవడం చెడిపోవడం పడిపోవడం* అంటూ ఏం ఉండవు, కేవలం *నేర్చుకోవడం* మాత్రమే ఉంటుంది . కొందరు *ఒడిపోయి* ఎలా *గెలవాలో* నేర్చుకుంటారు , ఇంకొందరు *మోసపోయి* ఎలా *జాగ్రత్తగా* ఉండాలో నేర్చుకుంటారు . మరికొందరు *చెడిపోయి* ఎలా బాగుపడలో అని *నేర్చుకుంటారు* .ఇంకా మరి కొందరు  *పడిపోయి* ఎలా నిలబడాలో *నేర్చుకుంటారు* జీవితం అనేది *ఒక పాఠశాల* ఇక్కడ *నేర్చుకోవడం* మాత్రమే ఉంటుంది .మరి మీరు ఏమి నేర్చుకుంటున్నారు..?
  🕉️🙏🕉️

No comments:

Post a Comment