🙏 The Dharma Truth Nobody Talks About 🤔 | ⚡ Offering vs Charity ⚖️ | @kctalkstelugu
Author Name:KC Talks Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@kctalkstelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gDtgEtLZQ3c
Transcript:
(00:05) ఓం కృష్ణం వందే జగద్గురుం ఓం నమో భగవతే వాసుదేవాయ నా పేరు దోమకొండ శ్రీకాంత్ గుప్త అండి నేను రెగ్యులర్ గా కేసీ టాక్స్ ఫాలో అవుతుంటాను. మహాభారతం ఎపిసోడ్స్ మొత్తం విన్నాను. సో ఇప్పుడు రామాయణం కూడా ఫాలో అవుతున్నాను. నాకు ఒక మూడు క్వశ్చన్స్ ఉన్నాయి వాటి ఆన్సర్ తెలుసుకుందామని నేను కృష్ణ చైతన్య గారి దగ్గరికి వచ్చాను కేసి టాక్స్ కి సో వారిని అడిగి ఈరోజు నా డౌట్స్ క్లియర్ చేసుకుంటాను.
(00:31) హరే కృష్ణ కేసి గారు హరే కృష్ణ కేసీ గారు నేను వన్ ఇయర్ నుంచి మీ కేసిీ టాక్స్ ఫాలో అవుతున్నాను. సో మహాభారతం మొత్తం ఎపిసోడ్లు విన్నాను. ప్రశ్నావళి కూడా మొత్తం చూస్తున్నాను ఇప్పుడు. రామాయణం కూడా ఆల్మోస్ట్ నేను అన్ని ఎపిసోడ్లు ఫాలో అవుతున్నాను. నాకు మహాభారతంలో ఒక చిన్న సందేహం ఉంది నా మొదటి ప్రశ్న మహాభారతంలో పాపాల గురించి పుణ్యాల గురించి కర్మల గురించి చెప్పారు.
(00:55) కానీ దానం గురించి ఏం చెప్పారు అనేది నేను మీ దగ్గర తెలుసుకుందాం అని వచ్చాను. సో దానం గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా ఎప్పుడు కూడా కర్ణుడు గురించే మాట్లాడుతున్నారు అందరూ దానకర్ణుడు దానకర్ణుడు సో మనం కూడా ఎవరికైనా క్యాజువల్ గా చెప్పాల అంటే దానకర్ణుడు రావాడు దానం బాగా చేస్తాడు ఎవడైనా దానం చేయంగాని మనం అలా అంటాం మనము. సో కర్ణుడే దానం చేశడా మిగతా ఎవరు దానం చేయలేరా అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరా సో కర్ణుడు అనేవాడు ఒక అసురుడు అని మనం అంటాము.
(01:20) సో అసురుడిని మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము దానం విషయంలో సో దానం చేసిన వాళ్ళలో గొప్పవాళ్ళు ఎవరు లేరా తర్వాత బలి చక్రవర్తిని కూడా మనము దానం చేశాడు అని అంటారు. సో బలి చక్రుని పోని ఎందుకు గుర్తు చేసుకోం మనం కర్ణుడిని ఒక్కడిని ఎందుకు గుర్తు చేసుకుంటాము ప్రీణయామో వాసుదేవం శ్రీకాంత్ గారు మీరు అడిగిన మొదటి ప్రశ్న అసలు దానము యొక్క ప్రాముఖ్యత ఏమిటి వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాన ఇది కదా మీరు తెలుసుకోవాలని అనుకుంటుంది ప్లస్ మీకు దానం అని వినగానే మీకు గుర్తొచ్చేది కర్ణుడు దానికి దానవీర సూరకర్ణ అనే ఒక టైటిల్ తో వచ్చిన ఒక సినిమా దానికి మేబి దానికి ఒక ప్రైమరీ
(01:58) సోర్స్ అయి ఉండొచ్చు అందుకనే దానం అనగానే కర్ణుడు గుర్తొస్తాడు ప్లస్ అది మనం లౌకికంగా మనం వాడుతూ వాడుతూ వాడుతూ ఆ సినిమా ఇన్ఫ్లయెన్స్ జనాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది అందులో తెలుగు వాళ్ళ మీద మరీ ఎక్కువగా ఉంటుంది సినిమా ఇన్ఫ్లయెన్స్ సో దానివల్ల దానం అనగానే కర్ణుడు గుర్తుకు వస్తాడు. అసలు ఫస్ట్ దానం వల్ల వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి మహాభారతం దానం గురించి ఏం చెప్తుంది? దానం అనేది ఏంటి అంటే ఒక మనిషి తను చేసిన కర్మని ప్యూరిఫై చేసుకోవడం కోసం చేసే ఒక ప్రక్రియ దానం ఏంటంటే నేను గతంలో చెప్పాను మీకు ఇది కర్మభూమి భూమి కింద లోకాలు ఉన్నాయి భూమి పైలోకాలు
(02:41) ఉన్నాయి ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ అవ్వాలి ఒక మనిషి అనుకుంటే కచ్చితంగా భూమి మీదకు వచ్చి సత్కర్మ గాని దుష్కర్మ గాని అకర్మ గాని చేస్తేనే అతను పైనోకి కిందో ఎక్కడికో వెళ్ళగలడు భూమికి ఇంకొక పేరే కర్మభూమి సో ఇదొక ట్రాన్సిట్ పాయింట్ లాంటిది సో పూర్వం మీరు అర్థం చేసుకోవడానికి ఇండియా నుంచి డైరెక్ట్ గా అమెరికాకి ఫ్లైట్స్ ఉండేవి కావు.
(03:06) సో దుబాయ్ మిడిల్ ఈస్ట్రన్ కంట్రీస్ అనేది ఒక పెద్ద స్టాప్ సో ఇవాల్టికి చాలామందికి ఏంటంటే ఆ కాలిఫోర్నియా న్యూయార్క్ వదిలేసి అమెరికాలో ఇంకేదనా ఒక ప్లేసెస్ కి మీరు వెళ్ళాలి బాస్టన్ అట్లాంట ఇట్లాంటి వాటికి ఇంకా లోపల ఉన్న ఎన్నో ప్లేసెస్ కి వెళ్ళాలి అంటే దుబాయ్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఒక స్టాప్ లాంటివి అవి అంటే ఇక్కడి నుంచి మిడిల్ ఈస్టన్ కంట్రీస్ కి వెళ్లి అది కూడా ఏంటంటే ఒక దోహా ఆ లేదా ఒక దుబాయ్ ఇట్లాంటి వాటికి వెళ్లి అక్కడి నుంచి వేరే చోట్లకు వెళ్ళాలి సో సో ఇది ఉపమానంగా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ఒకవేళ మనం భయంకరమైన పాపాలు చేసి కింద లోకాల్లో ఉన్నాం అతల వితల సుతల
(03:42) తలాతల పాతాళ నరక లోకాలలో బ్రతికాం. అక్కడ తెలుసుకున్నాం అయ్యో మనం తప్పులు చేశం దాన్ని బట్టి మనం కింద లోకాలకి వెళ్ళాం ఇక ముందు ముందు ఈ తప్పులు చేయకూడదు అనే ఒక కాన్షియస్నెస్ వచ్చింది మనకి ప్రజ్ఞ వికసించింది భగవంతుడు మనకి మళ్ళీ ఒక మనిషి శరీరంతో భూమిమీద జన్మించేటట్టు చేస్తాడు. ఈ భూమిమీద మనిషి జన్మించగానే స్వార్థం నేను నా అని కర్మ బంధనంలో ఇరుక్కోకుండా వాడు జన్మరాహిత్యం పొందే సాధన చేస్తే డైరెక్ట్ గా మోక్షం వాడికి వస్తుంది.
(04:19) లేదా విపరీతమైన సెల్ఫ్లెస్ గా ఆ పుణ్యాలు చేస్తే అంటే పుణ్యాలు అంటే ఏమిటండి అంటే అతను ఏ స్వార్థము ఎటువంటి స్వలాభము ఆశించకుండా చేసే ప్రతి పని పుణ్యమే కానీ పుణ్యం కూడా కేవలం వైదిక ధర్మంలో చెప్పబడ్డది చేస్తేనే పుణ్యం మీ మనసుకు ఏది పడితే అది తలిస్తే అది పుణ్యం కాదు ఇతి శాస్త్రం ప్రమాణంతే కార్యా కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహర్సి అని భగవద్గీత 15వ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని అంటే శాస్త్రంలో ఏది చేయమని ఉందో అది మాత్రమే చేస్తే అది ఒక మంచి కర్మ అవుతుంది
(05:05) తప్ప నీకు నచ్చింది చేస్తే అది ఒక పుణ్య కర్మ కింద కౌంట్ చేయబడదు సో ఒక ఎవరో ఒక పేదవాడు వచ్చాడు వాడికి మీరు ఒక దానం చేశారు ఆ దానం డబ్బుతో ఆ పేదవాడు ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీలోనో ఉపయోగపడ్డాడు అనుకుందాం లేదా చాలామందికి దుఃఖం కలిగించే ఒక పనే చేశాడని అనుకుందాం లేదా ఇంకేదో ఆ దానం వల్ల ఒక సృష్టి వినాశనం జరిగిందని అనుకుందాం కచ్చితంగా అది మీ ఖాతాలోకి వస్తుంది కదా మీరంటూ ఆ డబ్బు ఇవ్వటం వల్లే కదా ఇంత పెద్ద ఇదేదనా జరిగింది అలాగా మనం ఏంటంటే శాస్త్ర విహీన కర్మలు చేయకుండా శాస్త్రంలో చెప్పిన ప్రిస్క్రైబ్డ్ కర్మలను మాత్రమేనిస్ నిస్వార్థంగా
(05:48) స్వలాభము లేకుండా చేస్తే ఖచ్చితంగా మీరు పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు అలా పుణ్యం చాలా ఎక్కువైనప్పుడు అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ తరగనంత బ్యాంకు బ్యాలెన్స్ మీకు అయినప్పుడు అప్పుడు మిమ్మల్ని స్వర్గలోకానికి ప్రమోట్ చేస్తారు ఆ స్వర్గలోకానికి వెళ్లి స్వర్గలోకంలో మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత పుణ్యం ఉందో అన్ని సంవత్సరములు అక్కడ భోగం చేసి మళ్ళీ ఈ భోగం వల్ల ఏమీ రాదు అంటే ఇక్కడ ఈ శరీరం ఏమిటి అంటే ఇది బాగా క్షీణించే శరీరం అంటే దీనికి మళ్ళీ ఒక ఉపమానం చెప్తాను మీకు సో వయసులో ఉన్నప్పుడు ఏది కావాలంటే అది తిని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు వయసు
(06:27) పైబడే కొద్దీ మీరు ఏది పడితే అది చేయలేరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేరు ఎలాంటి పదార్థాన్ని పడితే అలాంటి పదార్థాన్ని తినలేరు ఎందుకంటే మనకు ఉండేది మాంసపు శరీరం శరీరం అంటే ఏమిటి క్షీర్యతీది శరీరం ప్రతీక్షణం అది క్షీణిస్తూ క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి మానవ శరీరంతో భోగం చేయలేం ఇవాళ ఏదో మిడిమిడి భోగాలు చేసుకుంటూ మనమందరం మురిసిపోతాం అమ్మో డబ్బులు ఉంటే మనం ఎంతైనా సుఖపడవచ్చు అని ఎంత సుఖపడతాడు ఎవడైనా బాగా డబ్బు ఉన్నవాడు ఎంత సుఖపడతాడు ఏసీ లో పడుకుంటాడు నిద్రను కొనుక్కోగలడా ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లి అన్ని పాంచభాక్ష పర్వణాలు కనబడతాయి కానీ
(07:06) వాడికి షుగరు వాడికి బీపి వాడికి గట్టి ఇష్యూస్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటే వాడు అవన్నీ తినగలడా ఇక స్త్రీ వ్యామోహం ఉన్నవాడు ఆ సుఖం అనేది ఒక క్షణికం అది డబ్బు ఉన్నవాడికి కావచ్చు డబ్బు లేని వాడికి కావచ్చు మరి ఏమిటి ఇక్కడ భోగం అసలు ఆ మాటికి వస్తే ఈ మనిషి శరీరంలో భోగం చేయటం కుదరదు అనేది ప్రతి ముని ప్రతి ఋషి ప్రతి తపస్వి ప్రతి రాజు యొక్క హృదయం ఇక్కడ వచ్చిన పెద్ద పెద్ద ఋషులు పెద్ద పెద్ద మహాపురుషులు చెప్పింది ఏంటంటే మనిషి శరీరంతో భోగం అనేది కుదరదు ఆ భోగం చేయాలి అంటే నిస్వార్ధమైన వైదిక కర్మ మలను చేయి దాని వల్ల పుణ్యం మూటకట్టుకుంటావు ఆ
(07:47) పుణ్యం అనేది నీకు ఎక్కువైన తర్వాత ఇక్కడ దేహ త్యాగం చేస్తే నిన్ను స్వర్గలోకానికి తీసుకు వెళ్తారు అప్పుడు ఈ పంచభూతాకృతమైన శరీరం ఉండదు అక్కడ ఒక రకమైన శరీరం ఉంటుంది ఆ శరీరం ఎలా ఉంటుందంట నిత్యం ఎప్పుడు 30 ఏళ్ల లోపల శరీరమే అది అప్పుఎప్పుడు వృద్ధాప్యంలోకి వెళ్ళదుఅది ఒక మనిషి 30 ఏళ్లకు మించి మూడు పదులకు మించి ఆయన యొక్క శరీరం ఆయుర్దాయం పెరగదు ఎప్పుడు కూడా 30 ఏళ్ల శరీరంతోనే ఉంటూ ఆ శరీరం ఎప్పటికీ క్షీణించదు ఇక్కడ భోజనం అనేది ఒకటి ఉంది అనుకుందాం మీకు బాగా ఆకలయింది మీ నాలికి రుచికరమయ్యే భోజనం పెట్టాను.
(08:25) మీ కడుపు నిండిదా దాని తర్వాత ఆ మీకు బాగా ఇష్టమైన పదార్థాన్ని నేను ఏమంటానఅంటే ఇంకొంచెం తినండి అంటాను అప్పుడు మీరు ఏమంటారు లేదు సరిపోయింది అంటాను ఎగటు పుట్టేస్తుంది మీకు అంటే ఏదైతే మీరు చాలా ఇష్టపడి తిన్నారో కడుపు నిండిన తర్వాత అది చేదుగా వగరుగా ఎగటుగా ఉంటుంది అవునా అవును ఆ స్వర్గలోకంలో అలా ఉండదు మీరు ఎంత కావాలంటే అంత ఆ ఆనందాన్ని ఇంకా 10 15 20 రెట్లు ఎక్కువ అనుభవించగలరు అంటే భోజనం అనే ఒక దాంట్లో లో నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాను అది అన్నిటిలోనూ ఆపాదించుకోవచ్చు మీరు బయట నుంచి ఎండలో చెమటతో వచ్చారు ఏసీలో పెట్టగానే మీకు హాయిగా ఉంటుంది దానికి కొన్ని వందల రెట్లు
(09:05) ఆనందం స్వర్గంలో కలుగుతుంది అందుకనే భోగం ఎప్పుడైతే మనిషి చేస్తాడో వాడి పుణ్య క్షీణమై వాడు మళ్ళీ భూమి మీదకే పుడతాడు సో కింద ఉన్నవాడు కింద లోకాలలో పాపాలు చేసినవాడైనా భూమి మీదకే రావాలి పై లోకాలలో పుణ్యం చేసి వాడు పుణ్యం తరిగిన తర్వాత అయినా భూమి మీదకే రావాలి మళ్ళీ ఇక్కడి నుంచే పాపమో పుణ్యమో మూటకట్టుకోవాలి లేదా మోక్షం పొందాలన్నా ఇక్కడి నుంచే పొందాలి ఇది ఒక ప్రత్యేకమైన పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మరి పైలోకాల వాళ్ళందరూ భూమి మీద పుట్టే ఇక్కడి నుంచి మోక్షం పొందుతారా అంటే వాళ్ళు తారతమ్యాన్ని బట్టి ఇప్పుడు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు లాంటి వాళ్ళు
(09:45) బ్రహ్మ బ్రహస్పతులు లాంటి వాళ్ళు వాళ్ళు భూలోకంలో పుట్టారు ఎందుకంటే వాళ్ళు నిత్యం భోగంలో మునిగి ఉండరు. వాళ్ళు ఖచ్చితంగా జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళు ఆ లోకాలలో కూడా యోగం చేసి వాళ్ళు అక్కడి నుంచి పైలోకాలకి వెళ్ళిపోతారు బుహర్లోకం, స్వర్గలోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, సత్యలోకం పైన ఈ బ్రహ్మాండం పైన ఉండే ఆ వరజా నదిని క్రాస్ చేస్తే వైకుంఠం, అనంత వైకుంఠ లోకాలు అక్కడికి వెళతారు.
(10:13) సారూప్యంగా భగవంతుని ప్రార్థిస్తే వైకుంఠానికి వెళ్తారు. నిరాకారంగా ఉండే భగవంతుని ప్రార్థిస్తే వాళ్ళు బ్రహ్మజ్యోతిలో విలీనం అవుతారు దాన్నే కైవల్య మోక్షం అంటారు శంకర సంప్రదాయం వాళ్ళు వైష్ణవులందరూ అనేది ఏంటంటే మాకు భగవంతుని సారూప్యంగా సేవ చేసుకోవడం ఇష్టం కాబట్టి మేము బ్రహ్మజ్యోతిలో విలీనమై మా యొక్క అస్తిత్వాన్ని కోల్పోము మేము అనంత వైకుంఠాలకు వెళ్లి మాకు నచ్చిన రాముణని మాకు నచ్చిన నరసింహ స్వామిని మాకు నచ్చిన హయగ్రీవుడ్ని మాకు నచ్చిన కృష్ణుడిని అక్కడ సేవ చేసుకుంటూ సేవానందం పొందుతాం నిత్య ఆనంద స్థితి ఎందుకంటే అక్కడికి
(10:52) వెళితే వచ్చేది సచ్చిదానంద శరీరం స్వర్గలోకంలో వచ్చేది భోగ శరీరం భూలోకంలో వచ్చేది దుఃఖ శరీరం కింద లోకాల్లో కేవలం దుఃఖం మాత్రమే వాళ్లకు సుఖానుభూతే ఉండదు ఇక అతల వితల సుతల తల తల పాతాళ లోకంలో కిందకు వెళ్లే కొద్దీ సుఖం యొక్క అనుభూతి తగ్గుతుంది దుఃఖం యొక్క అనుభూతి పెరుగుతుంది ఎందుకంటే వాడు పాపం చేసాడు కాబట్టి వాడికి దుఃఖంతో వాడిని సంస్కరించాలి ఇది ఎలాంటిది అంటే జైల్ లాంటిది ఒకడు లుటీ కునికోరు ఏం చేస్తాం వాడిని తీసుకెళ్లి యావజీవ కారాగార శిక్ష వేసి 14 సంవత్సరాలు రాళ్ళు అవి కొట్టించి వాడి చేత భోజనం అది వండించి 14 సంవత్సరాలు
(11:29) వాడికి కఠిన శిక్ష ఇచ్చి మళ్ళీ బయటికవచ్చి ఇంకొకడిని లూటీ కూనీ చేయకుండా ఉండేటట్టుగా సంస్కరించే ప్లేస్ ఇవాళ మోడరన్ కారాగృహం జైల్ అలాంటిదే కింద లోకాలన్నీ జైల్తో సమానం పైల లోకాలన్నీ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్తో సమానం ఇది ఉపమానం మాత్రమేనండి మీరు అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను ఇక మధ్యలోకం మాత్రం కర్మభూమి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పావు నాయన ఉపోద్గాతం అంటే ఇక్కడ దానం అనేదానికి ప్రత్యేకత ఏమిటి అంటే అన్నిటిలోకి దానం గొప్ప అంటాం.
(12:02) దానం అనేది ప్రతి మనిషి చేయాలి అంటాం. ఉత్తరం నుంచి దక్షిణ వరకు ప్రతివాళ్ళు కార్తీక మాసం అని దామోదర మాసం అని అధిక మాసం అని చెప్పి వచ్చినప్పుడల్లా ఏదో ఒక దానం చేస్తుంటారు ఏమిటి ఈ దానానికి ఉన్న ప్రత్యేకత అంటే ఒక గ్రహస్థాశ్రమంలో ఉన్నవాడు దానం ఎందుకు చేయాలి ఎందుకంటే నిత్యం మనం బ్రతుకుతున్న బ్రతుకు ప్రతీక్షణ నా నేను అనే ఒక బ్రతుకు బ్రతుకుతాం ఒక సోమవారం పొద్దున ఎనిమిది గంటలకు మీరు హైదరాబాద్ రోడ్ల మీదకు రండి ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది.
(12:31) పొద్దున్నే పలహారం తిని టిఫిన్ తిని రోడ్ల మీదకి ఎక్కుతారు మనుషులందరూ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎందుకంటే ఇవాళ లింగభేదాలు లేవు కదా ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారు. సో ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా సంపాదన ఆటో ఎక్కగానే మీటర్ స్టార్ట్ అయినట్టు మన జీవితాల్లో సోమవారం పొద్దున 9 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం ఆరుఏడు గంటల వరకు కార్పొరేట్ ఉద్యోగులకు ఇక ఉద్యోగస్తులక అయితే శనివారం ఆదివారం కూడా మీటర్ ఆన్ లోనే ఉంటది.
(12:59) ప్రతి గంట ముందుకు వెళ్తున్న కొద్ది ఏదో ఒకటి చేసి సంపాదన సంపాదించాలి ఇది మెయిన్ ఉద్దేశం ఏమిటి సంపాదన దానికోసమేగా ఒక జీవి పరిగెడుతుంది. ఎవడి కోసం ఆ సంపాదన నా వాళ్ళు సో పాశ్చాత్య దేశాల్లో ఈ స్వార్థం మరీ ఎక్కువ ఎందుకంటే కుటుంబ వ్యవస్థ లేదు కదా వాడు తండ్రిని చూసుకోక్కర్ల. తల్లిని చూసుకోక్కర్లా. భార్యని చాలామంది పెళ్లిళ్లే చాలా లేటుగా చేసుకుంటారు ఒక పెళ్లి రెండు పెళ్లి మూడు పెళ్లి దాని తర్వాత పిల్లలు అక్కడ అసల ఆ ధర్మము ఆ గృహస్థాశ్రమ ధర్మమే లేదు అక్కడ అందుకనే మీరు వెస్టర్న్ కంట్రీస్ లో ఎప్పుడైనా పని చేస్తే అసల నాకు ఆ అమెరికా గాని యూరప్ లో గాని నేను చూచిన జీవితం
(13:39) కంటే స్వార్ధపూరితమైన జీవితం ఇంకొకటి ఉండదు ఎందుకంటే ఒక వ్యక్తి 10 మంది కోసం సంపాదించడం లేదా ఐదుగురు కోసం సంపాదించడం ముగ్గురు కోసం సంపాదించడం ఇద్దరి కోసం సంపాదించడం కూడా మనకు కరెక్ట్ గా కనపడదు ఎక్కడో ఒక కుటుంబాల్లో ఇద్దరి కోసం సంపాదిస్తాడు ఒక తెల్లవాడు ఒక ఏ ఉద్యోగము చేయని ఒక ఆడమనిషిని పెళ్లి చేసుకొని దానికి తిండి పెట్టడమే అదో పెద్ద దానంగా ఫీల్ అయ్యే ప్రపంచాలు అవన్నీ అందుకనే అవన్నీ కూడా భోగ భూములు పరమ స్వార్ధపూరితమైన మనుషులు బ్రతికే స్వార్ధభూములు భారతదేశంలో ఖచ్చితంగా ఒక వ్యక్తి వాడి కోసమే సంపాదించడు ఇంకా దౌర్భాగ్యపు
(14:17) పరిస్థితి 2026 నాటికి కూడా రాలా మరి జెన్జీల్ వచ్చిన తర్వాత అలాంటి ఏదన్నా ఒక రోజు వస్తుందేమో నాకు తెలియదు. ఇవాల్టికి ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఒక బిజినెస్ మన్ ఎవరికోసం అండి సంపాదిస్తున్నారు అంటే మీకోసం ప్లస్ మీ భార్య కోసం ప్లస్ మీ పిల్లల కోసం ప్లస్ వృద్ధులైన మీ తల్లిదండ్రుల కోసం ప్లస్ ఇంకెవరన్నా మీ తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమన్నా బాలేకపోతే వాళ్ళకు కూడా వ్యాపారం ద్వారా నా దగ్గర పని చేసే వాళ్ళ కోసం కూడా ఆ సో వ్యాపారం ద్వారా మీ దగ్గర పని చేసే వాళ్ళకని మీరు అంటున్నారు అది వెస్టర్న్ కంట్రీస్ లో అది కూడా ఉంది కదా సో పని
(14:47) చేసే వాళ్ళని వదిలేద్దాం కుటుంబ వ్యవస్థ గురించే మాట్లాడుకుందాం అయితే మీరు ప్లస్ నలుగురు ఐదుగురు మీ మీద నాలుగు జీవ ఆధారపడి ఉన్నాయా ఆరు మంది ఉన్నారు సో గుండెల మీద చెయ్యి వేసుకొని ఎన్ఆర్ఐలని అడగండి పాశ్చాత్య దేశాల్లో ఏ తెల్లవాడు ఎవరి కోసం సంపాదిస్తున్నాడో చూసుకోమనండి మాక్సిమం ఒకడి కోసమో మహా అయితే ఎక్కడో 100 కుటుంబాల్లో ఇద్దరి కోసమో సంపాదిస్తాడు.
(15:10) ఇది ఆర్యభూమి ఇది సనాతన భూమి ఇక్కడ ఏంటంటే నేను నా నా సంపాదన నా సుఖం నా తిండి నా సౌఖ్యం నా భోగం అనే ఆలోచిస్తూ ఉంటే రోజులు గడిచే కొద్దీ మీలో స్వార్థం పెరుగుతుందే తప్ప మీలో ఏ వైరాగ్యము రాదు అందుకనే ఇదంతా దానానికి లింక్ అయింది అందుకే చెప్తున్నా ఈ భూమిలో ఒక మనిషి సంపాదన అనేది తనకోసం ప్లస్ తన మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని కట్టుకొని వచ్చిన భార్య కోసం మీరు సంపాదించడం పెద్ద గొప్ప ఏముంది ఎందుకంటే మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు మీ 40 50 వచ్చేసరికి వదిలేసి వెళ్ళిపోతారు.
(15:54) మీరు కన్న పిల్లలు ఓ 20 25 వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎత్తుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. మిమ్మల్నే నమ్ముకొని వచ్చింది కదా ఒక పిచ్చిది పాపం ఏ ఇంట్లోనో పుట్టి మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చి మీ వంశాన్ని మీ ఇంటి పేరుని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చింది కదా మరి ఆమెని చూసుకోవడం మీ ధర్మం కదా బాధ్యత ధర్మం కదా అందుకు భార్య గురించి మరి తద్వారా ఇద్దరు పిల్లల్ని కంది కదా మరి వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలి కదా వాళ్ళని దేశం మీదకి అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేసే సంస్కృతి కాదు కదా మనది కాబట్టి గృహస్థ జీవనం సనాతన ధర్మంలో భారతదేశంలో లో పుట్టినవాడు తనకోసం కాకుండా తన వాళ్ళ కోసం
(16:30) బ్రతకటంలోనే ఒక ధర్మం ఉంది అంటే ఇక్కడ జీవన విధానంలోనే ఒక ధర్మం అనే ఒక ఒక సాఫ్ట్వేర్ విమర్శబడి ఉంది. కానీ అది దానం కాదు నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య నీ ద్వారా పుట్టిన నీ ఇద్దరు పిల్లల కోసం చేయటం నీ ధర్మం అది దానం కాదు అది సో ఒక సామెత ఉంది ఎవరో చెప్తారు కట్టుకున్న భార్యకి తిండి పెట్టి అదే దానంలా ఫీల్ అయ్యేవాడండి వాడు అంటారు అంటే ఎంత ఎంత స్వార్ధపరుడో వాడు అని అర్థం ఆ మాట అంటే మరి వారానికి ఐదారు రోజులు నాలుగు వారాలు ప్రతి రోజు మీ ప్రతి రోజు నా వాళ్లు అనే బ్రతుకుతూ ఉంటే మరి స్వార్థం పెరగదు నీకు అంటే ఎప్పుడు జిమ్ కి వెళ్ళావు ప్రతిరోజు ఎక్సర్సైజ్
(17:14) అది చేస్తే పైలవానిలాగా బాడీ పెరుగుతుదిగా అంతే కదా సో సిగరెట్ కి అలవాటు పడితే ఏమవుతది సిగరెట్ వదలడం కష్టం అవుతది కదా రోజు రాత్రి వెళ్లి పేకాటాడితే ఏమవుతది జూదం అలవాటు అవుతది కదా మందుకు అలవాటు అయితే ఏమవుతది మందు లేకుండా నువ్వు బ్రతకలేని రోజు వస్తది కదా ఇక భార్యని కాకుండా పరస్త్రీని కామదృష్టితో చూడటం ఒక్కసారి మొదలు పెడితే దానికి ఎండే ఉండదు ఒకసారి సారి వైరస్ లాగా ఇవి సోకితే వ్యసనాలు అవి వదలవు మనల్ని వదులుచుకోవడానికి చాలా కష్టపడాలి అందుకనే ఇలాంటి వ్యసనాల నుంచి దూరంగా ఉంటాం.
(17:46) అందుకనే కదా బాటిల్ మీద కూడా రాసి ఉంటది కదా లిక్కర్ రూయిన్స్ యువర్ ఫ్యామిలీ అని ఈ పాయింట్ మీరు అందరూ గుర్తుంచుకోండి నేను నా వాళ్ళ కోసం బ్రతకటం గాని మనకి అలవాటఅయితే అది ఒక వ్యసనం లాగా మనల్ని వెంటాడి దానికి మా గురువుగారు ఒక మాట అనేవాళ్ళు నాకు బాగా నచ్చిన మాట ధృతరాష్ట్ర సిండ్రోమ్ అని ఒక వ్యాధి వస్తుంది మనకి ధృతరాష్ట్రుడికి ఉన్నది ఈ వ్యాధి ఏంటంటే నేను నా వాళ్ళ అంతే నా తమ్ముడు కొడుకులు ఎలా పోయినా పర్వాలేదు దాన్ని దృత అంతరాష్ట్ర సిండ్రోమ్ అంటాం అదిఒక వ్యాధి అలాగ మనలో కూడా మన కొడుకు పట్ల విపరీతమైన వ్యామహం మన కూతురు పట్ల
(18:24) విపరీతమైన వ్యామం అంటే ఇంకా ఎవడు పిల్లల్ని కనలేదు ఇక నాకు పుట్టిన వాళ్లే పిల్లలని ఇక నా నా కుటుంబం నా ఇల్లు నా పిల్లలు దీనిలో పడిపోయి ఒక మనిషి ఆ చాప నీళ్ళల్లోనుంచి తీస్తే ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుమెట్టులాడతాడు కాబట్టి సనాతన ధర్మం ఏం చెప్పిందంటే అన్నిటిలో లోకి దానం అనేది ఒక మనిషిని అంతర్గతంగా బహిర్గతంగా శుద్ధి చేస్తుంది అని చెప్పింది.
(18:54) ఏమిటండీ శుద్ధి ఎలాంటి శుద్ధి ఎలాంటి దీని వల్ల ప్యూరిఫికేషన్ జరుగుద్ది పొద్దున్నే లెగిసి వేడినీళ్లు తాగమంటారు. పొద్దున్నే లెగిసి హర్బల్ కషాయాలు తాగమంటారు. దాని వల్ల ఏమవుతది అంటే డటాక్స్ అవుతది అని చెప్తారు. బాడీ డీటాక్స్ మరి కర్మ అనేది మనం దేనితో చేస్తాం కర్మేంద్రియములు ఇంద్రియములతోనేగా కర్మ చేసేది జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములకు జ్ఞానేంద్రియములు తోడైతేనే కర్మ అనేది జరుగుతుంది అంటే ఫస్ట్ బిజినెస్ చేయాలని ఆలోచన మైండ్ లో వస్తది దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీ చేతులు మీ కాళ్ళు అన్ని పనిచేస్తాయి కదా ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి కదా కాబట్టి
(19:31) పుణ్యకర్మ చేస్తే అది కూడా శరీరంలో భాగం అవుతుంది. దుష్కర్మ చేస్తే అది పాపం కింద మారి మీ రక్తము మీ మాంసము మీ మేడ్జా ఇట్లాంటి ధాతువులను పట్టుకొని ఉంటుంది అందుకనే గంగా స్నానం చేస్తే మనం చేసిన పాపము శరీరాన్ని వదిలి ఎంతసేపు గంగలో ఉంటామో అంతసేపు పక్కన ఉన్న చెట్టు మీద ఉండి మళ్ళీ బయటికి రాగానే మన శరీరంలోకి వస్తుందంట అందుకనే గంగా స్నానం అనేది అంత పవిత్రం ఈ భూమిమీద గంగా స్నానానికి మించినది ఏదీ లేదు ఎంతో కొంత పాపం జరుగుతుంది తప్ప ఉన్న పాపం అంతా ఏమి జరగదు అక్కడ ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది తీర్థ స్నానాలు చేయటం పుణ్యనదుల్లో మునగటం
(20:12) లాంటివి చేస్తే పాపం తగ్గుతుంది అన్న ఒక భ్రమ దాని వల్ల ఎంతో కొంత పాపమే తగ్గుతుంది తప్ప మనసు సంస్కరించుకోలేనంతవరకు ఏ పాపము తగ్గదు తపము వల్ల పాపం తగ్గుతుంది. ఏ ఇంద్రియములతో అయితే నువ్వు భోగం చేశావో ఏ ఇంద్రియములతో అయితే నువ్వు పాపం చేశావో ఆ ఇంద్రియములను తృప్తి పెట్టకుండా ఆ ఇంద్రియములను పనిష్ చేస్తే ఆ ఇంద్రియములకు దుఃఖాన్ని కలిగించి తపస్సు చేస్తే చేసిన పాపం తరుగుతుంది.
(20:46) ఇది చాలా పెద్ద పాయింట్ సనాతన ధర్మంలో ఇది చాలా మూలం ఎందుకంటే కంటితో చూసి పాపం చేస్తాం ఒక స్త్రీని గాని మనకు కాని సొమ్ముని గాని దేని మీదనా ఆశ కలగాలంటే కళ్ళు ఆ కళ్ళతో చూసిన దాన్ని చేత్తో ఇంప్లిమెంట్ చేస్తాం అంతే కదా దానితో వచ్చే సుఖాన్ని చర్మంతో అనుభవిస్తాం అందుకనే తపస్సు అనేది ప్రతి వ్యక్తి సనాతన ధర్మంలో చేసేవాడు ప్లస్ కర్మ అనేది ఇది ఈ సనాతన ధర్మంలో ఇంకొక పాయింట్ ఏంటంటే కర్మానుబంధిని మనుష్యలోకే అనేది ఒక సన్యాసి దగ్గర నుంచి చెట్టు కింద చుట్ట తాగేవాడి వరకు ప్రతివాడికి క్లారిటీ ఉంది.
(21:25) అందుకనే గుండెల మీద చేసుకొని చెప్పరా నువ్వు పాపం చేయలేదు అని అడుగుతారు. సూర్యుడు సాక్షిగా చెప్పరా నువ్వు చేయలేదు అని అడుగుతారు అది ఈ నేల మీద బ్రిటిష్ వాడు రానంతవరకు మనలో ఆ ప్రజ్ఞ ఉంది. సో ఇప్పుడు దానం మనం వారానికి ఐదు రోజుల నుంచి ఆరు రోజులు పరిగెత్తాం నా నా పిల్లలు నా భార్య గురించి మనం కష్టపడ్డాం. తద్వారా మనం ధనం సంపాదించాం.
(21:49) మరి అది నీ పిల్లలకి నీ వాళ్ళ కోసం ఖర్చు పెడితే నీ కర్మలో ఒక భాగం కూడా భార్య తీసుకోదు అదే వాల్మీకి అని అడిగారు. మరి నేను తీసుకొచ్చి మిమ్మల్ని రెక్క కష్టం చేసి పోషిస్తున్నాను కదా నా పాపంలో మీరు ఏమన్నా భాగం తీసుకుంటారా? అని వాల్మీకి అడిగితే ఏమని చెప్పింది భార్య ఒక్కనాటికి తీసుకోని చెప్పింది. పిల్లల్ని వాళ్ళు ఎందుకు తీసుకుంటారు పాపం? నీ ధర్మం నువ్వు ధర్మంగా బ్రతికి తీసుకొచ్చి మమ్మల్ని పోషించడం నీ ధర్మం కాబట్టి ఈ స్వార్థం నేను నా అనేది మనల్ని అంటకుండా వచ్చిన ధనంలోంచి కొంత ధనాన్ని నిస్వార్థంగా ఎవరికైనా అవసరంలో ఉన్న వాళ్ళకు దానం చేయటం
(22:27) వల్ల ఫస్ట్ ఎడిక్షన్ అనేది తగ్గిపోతుంది మన నేను నా అనే ఒక భావన నాకు తగ్గిపోతుంది. ఎందుకంటే నువ్వు చేసిన కర్మలో ఒక వంతుని నువ్వు పరులకు దానం చేస్తున్నావ్ వాళ్ళకి నీకు ఏ సంబంధం లేదు నీకు దేహ సంబంధం లేదు నీకు రక్త సంబంధం లేదు పాపం వాడు కష్టంలో ఉన్నాడు ఆ కష్టాన్ని చూచి వాడు కష్టం దూరమయ్యేటట్టుగా నీ కర్మలోని ఒక భాగాన్ని నువ్వు వాడికి ఇస్తున్నావు అంటే నీ కర్మని పంచుతున్నావు అందుకనే పూర్వం సన్యాసులు ఎవరి చేతితో పడితే వాళ్ళ చేతితో దానాలు తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళు పుణ్యాత్ములు అయితేనే వాళ్ళ చేతో దానాలు తీసుకునేవాళ్ళు
(23:05) ఎందుకంటే దానం ఇచ్చినవాడు వాడు కర్మను ఇచ్చేస్తాడు తీసుకున్నవాడు ఆ కర్మను భరించాలి. అందుకనే సనాతన ధర్మంలో ఇదంతా చాలా లాజికల్ అన్నమాట. సో దానం ఎందుకు ఇవ్వాలి ఒక మనిషి అంటే వాడు చేసిన కర్మని వాడు తగ్గించుకోవడం కోసం ప్లస్ స్వార్థం అనేది నా కోసమే బ్రతుకుతుంటే 24 గంటలు 24 గంటలు ఆ సిగరెట్లు 24 గంటలు ఆ మద్యం 24 గంటలు ఆ మాంసం ఏది తినాలి పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి డిసైడ్ చేస్తాడంట తిండిపోతూ బ్రేక్ఫాస్ట్ కి ఏం తినాలి లంచ్లో ఏం తినాలి సాయంత్రం స్నాక్స్ ఏం తినాలి తర్వాత డిన్నర్ ఏం తినాలి ఇదే ఒక ఆలోచన అయితే తిండి కూడా ఒక వ్యసనమే
(23:42) అవసరానికి తినాలి తప్ప నిన్నటించే ప్లాన్ వేస్తూ ఉంటాడు రేపుఏం దినాలు అదిఒక వ్యసనం ఎవరు మాట్లాడుకోరు దాని గురించి సో ఇలా మనం వ్యసనపరులాగా తయారయి మనలో నా నేను అనే స్వార్థం పెరుగుతుంది కాబట్టి దానం చేయటం వల్ల మన స్వార్థం తగ్గుతుంది దానం చేయటం వల్ల మన కర్మ ఒకళ్ళకు వెళుతుంది ఆ దానం అనేది ఎవరికి చేయాలి అవసరంలో ఉన్నవాడికి పాత్రత చూసి ఎవడికి పడితే వాడికి దానం చేయద్దు వాడికి పాత్రత ఉందా లేదా అర్హత ఉందా లేదా లేదా చూసి వాడికి దానం చేయటం వల్ల మీ కర్మలో ఒక భాగం వాడికి వెళుతుంది మీలో స్వార్థం తగ్గుతుంది.
(24:20) దీనివల్ల మీకు ప్యూరిఫికేషన్ జరుగుతుంది. లో అయితే భీష్ముడు చాలా పెద్ద ఉపోద్గాతం చెప్తాడు ఎవరికి దానం చేయాలి ఎంత దానం చేయాలి ఎలా దానం చేయాలి ఎవరెవరికి దానాలు ఇస్తూనే ఉండాలి ఒక రాజు ఒక రాష్ట్రం ఒక దేశం సుభిక్షగా ఉండటం కోసం అని చెప్పి ఒక ఉపోద్గాతమే ఇస్తాడు ఆయన ఇక విధురుడు అయితే విదురు నీతిలో దానం గురించి మాట్లాడతాడు యక్ష ప్రశ్నల్లో దానం గురించి వస్తుంది మహాభారతం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్ని చోట్ల కూడా దానం అనేదాన్ని చాలా ఎలాబరేట్ గా చెప్పారు సో దానం ఎందుకు ఇంపార్టెంట్ో మీకు ఇప్పుడు అర్థమైందా మీరు కన్విన్స్ అయ్యారా ఈ దానం అనేది ఒక గంగా
(24:57) స్నానంతో సమానం అనేది మీకు అర్థమయిందా అర్థమైంది మళ్ళీ ప్రేక్షకులారా పాత్రత అపాత్రత దానం ఎన్నడూ చేయవద్దు. ఇప్పుడు దానంలో అంటే కేసీ గారు పుణ్యం వస్తది అని అంటారు కదా దానం చేస్తేనే సో ధనం లాంటిది సహాయం చేస్తేనే మనకు పుణ్యం వచ్చుద్దా లేకంటే మాట సహాయం అంటారు కొందరు దానాల్లో చాలా దానాలు ఉన్నాయి అది ధనం మాత్రమే కాదండి ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో మనీ ఇస్ ద మీడియం ఇప్పుడు ధనం అనేది అన్నిటికీ మూలం అయింది కాబట్టి వైద్యానికి ధనమే కావాలి అవును విద్యకు ధనమే కావాలి జీవితానికి ధనమే కావాలి ఏదన్నా ధాన్యం కొనుక్కోవాలన్నా ధనమే కావాలి కాబట్టి బట్టి ధనం దగ్గరికి
(25:35) వచ్చింది కానీ పూర్వం దానం అనేది ధన రూపంలో కాదు వస్తు వాహన ద్రవ్యము భవతి భిక్షాందేహి అని బయటికి వచ్చేవాళ్ళు పూర్వం మీరు అసలు మీరందరూ అర్థం చేసుకోవాలి మన సనాతన ధర్మంలో నా చిన్నప్పుడు కూడా చూశనండి నేను ప్రతిరోజు ఇంట్లో ఒక మూడు నాలుగు పిడికెళ్ల బియ్యాన్ని గాని పప్పుని గాని పక్కన పెట్టి అప్పుడు వంట వండుకునేవాళ్ళు అవును ఎవరనా ఇంటి ముందుకు వస్తాడేమో భవతి భిక్షాందేహి అని వాడికి దానం ఇవ్వాలి అని మా ఇంట్లో మా నాన్నమ్మ చేసేది ఇది చేసేది కదా ఎందుకు చేసేది ఎందుకంటే ఎప్పుడు మనకోసమే బ్రతుకుతూ ఉంటే స్వార్థం ఒక వ్యసనం లాగా మనల్ని అంటుకోదు పూర్వం
(26:12) వాళ్ళ జీవన విధానంలోనే ఒక సాత్వికత ఉంది ఒక ప్యూరిఫికేటరీ ప్రాసెస్ ఉంది ఇవాళ స్వార్థం పెట్టరిగిపోయిందండి సమాజంలో వాళ్ళకి అర్థం కావట్లే ఇది వాళ్ళనే ముంచేస్తుంది ధృతరాష్ట్రుడు ఎలా అయితే అన్ని కోల్పోయి 100 మంది కొడుకుల్ని ఒంటరిగా ఉండిపోయాడో అలా పీడిస్తుంది ఈ సమాజం ఇవాళ ఉన్నదంతా ధృతరాష్ట్ర సిండ్రోమ్ ఎందుకంటే సమాజంలో లో నువ్వు పోయిన తర్వాత నీ అంతేష్టి జరిపి 13 రోజుల తర్వాత నీ పెద్ద కర్మ చేసిన తర్వాత ఏ అమావాస్యకి నీకు తర్పణం పెట్టనివాడు ఒక్కనాటికి గయకెళ్లి నీకు పిండం పెట్టనివాడు ఒక్కనాటికి నీ పేరు మీద అన్న సంతర్పణ చేయనివాడు అసల నువ్వు బ్రతికుండగానే
(26:52) నిన్ను చూసుకుంటాడో లేదో తెలియని ఒక అయోగ్యుడైన కొడుకు వాడి కొడుకు బ్రతకడానికి కూడా ప్రజలు సొమ్ము మూట కట్టి వాళ్ళ ఆస్తులని పెంచుకుంటున్నారు ఇంత విశేషంగా ఆస్తుల్ని మూటకొట్టుకోవడం అనేది గడిచిన 20 30 సంవత్సరాలుగా చూస్తున్నాం కానీ అంతకుముందు ఎవరు ఇలా బ్రతకలేదు. ఎందుకంటే తల్లిదండ్రుల పాపం పిల్లలకు వస్తుంది అనేది ఖచ్చితంగా ఈ సనాతన ధర్మం నేలలో మనిషి నమ్మాడు అందుకనే నేను నా కొడుక్కి ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా వాడికి విశేషమైన పుణ్యం ఇవ్వాలని అనుకొని పుణ్యకర్మలను మాత్రమే చేసేవాళ్ళండి పూర్వం మీరు ఇప్పుడు చెప్పినట్టు తల్లిదండ్రుల
(27:30) పాపం పిల్లలకు వస్తుంది అని అంటారు కదా మా అమ్మ నాకు వారంలో ఒకసారి నా మాట చెప్తుంది తల్లిదండ్రుల పాపం పిల్లల తగులుద్ది పిల్లల తగులుద్ది అని అంటే ఏదైనా మంచి చేసినా చెడు చేసినా మేము ఏదైనా అగ్రెసివ్ గా మాట్లాడినా ఏదనా అన్నా గాన మా మదర్ మాకు ఎప్పుడో ఆ మాట చెప్తూ ఉంటుంది ఒక నెలలో ఒకసారి అన్నారు టూ టైమ్స్ అనా చెప్తూ ఉంటుంది.
(27:47) అందుకనే తల్లిదండ్రులు పిల్లలక ఇవ్వాల్సింది పుణ్యము జ్ఞానము మంచి సంస్కారము తప్ప కోట్ల ఆస్తి కాదు ఎందుకంటే నువ్వు ఇచ్చిన కోట్ల ఆస్తి వాడు ఎలాగో దుర్వినియోగ పరుస్తాడు తేనె తీగలు కూడా తేనె పెడతాయి. దారిన పోయిన బాటసారి దాన్ని కాల్చుకొని వాటిని తీసుకెళ్ళిపోతాడు. అలాగే ఎన్నో శతకాలు ఉన్నాయి తెలుగులో సుమతి శతకాలు భర్తుహరి శతకాలు ఇలాంటి చాలా శతకాల్లో దీని గురించి మాట్లాడారు.
(28:13) కానీ భారతదేశంలో ఒక భోజనం వండిన తర్వాత కూడా ఎవరికైనా భోజనం పెట్టి మనం తినాలి. సో దానం మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఏదో క్రైస్తవుల్లాగా దశమ భాగాలు అడగట్లేదు ఇక్కడ ఎవరు కూడా సో అక్కడ డబ్బు అడుగుతున్నారు ఇక్కడ నేను అనేది ఏంటంటే విద్యాదానం నీకే స్కూల్ ఉంటే 10 మందికి విద్య ఫ్రీగా ఇస్తే అదే నీవంతు దానం లేదా నీకే ఒక ప్రొవిజనల్ షాప్ ఉంటే అవసరం ఉన్న వాళ్ళకి ద్రవ్యదానం ఒక ఉప్పు పప్పు చింతపండు నూనె ఇలాంటివి ఇస్తే దానం ఏదైనా ఒక దానం అండి అది నీకు రక్త సంబంధం లేనివాడు వాడు అవసరంలో ఉన్నవాడు యోగ ోగ్యత కలిగిన వాడికి నిస్వార్థంగా అంటే ఎటువంటి
(28:52) ఆశించకుండా అంటే పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి పెద్ద పెద్ద పోస్టర్లు వేసి గుళ్ళకు ఫ్యాన్లు దానం ఇచ్చి శ్రీ శ్రీ శ్రీ రామిశెట్టి గారి జ్ఞాపకార్థం అని చెప్పి రాసుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో భారతదేశం పడిపోయింది. ఇలాంటిది రాజులు కూడా మీరు ఎప్పుడైనా వెళ్ళండి పెద్ద పెద్ద గుళ్ళు కట్టించి ఏ రాజు కూడా శిలాశాసనం మీద తన పేరు రాసుకోడు.
(29:18) ఎందుకంటే దానం అనేది ఎడం చేతితో చేసింది కుడి చేతికి కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకూడదు దానం అనేది ఒక ప్యూరిఫికేటరీ యాక్టివిటీ అది ఒక గంగా స్నానంతో సమానం అనేది భీష్ముడు శాంతి పర్వంలో ఆ ధర్మరాజుకి చెప్తున్నాడు దానం గురించి ఇప్పుడు గొప్ప గొప్ప దానవంతులు ఎవరు కర్ణుడు అందరికంటే గొప్ప దానవంతుడా అని మీరు అడిగిన క్వశ్చన్ అండి నేను వేరే వాళ్ళు ప్రవచనకారుల్లో YouTube లో నేను చూసిన వాళ్ళు గొప్ప గొప్పవాళ్ళు చెప్పిన దగ్గర కూడా వాళ్ళు కూడా కర్ణుడు ఎలాంటి దానం చేయలేడని చెప్పారు కానీ పబ్లిక్ లో ఎందుకు అవేర్నెస్ వస్తలేదు పబ్లిక్ పబ్లిక్ శాస్త్రాలు ఏంటంటే నాకు తెలిసినంత
(29:51) వరకు ప్రవచనకారులు గడిచిన 20 30 సంవత్సరాలు లేదా 10 20 సంవత్సరాల్లో ఎక్కువయి అవేర్నెస్ చెప్పారు కానీ ఒక డార్క్ ఏజ్ నడిచింది నా తండ్రి గారి ఏజ్ మా తాతగారి తర్వాత మా జనరేషన్ మధ్యలో బేబీ బూమర్స్ అంటే ఈ ఇండస్ట్రియలైజేషన్ కొత్తగా కార్లు కొత్తగా ఏసీలు కొత్తగా ఫ్యాన్లు కొత్తగా టెలిఫోన్లు వచ్చిన ఆ 70స్ 80స్ జనరేషన్ లో ఒక డార్క్ ఏజ్ నడిచింది ఎందుకంటే మనది అనుకునేద దేని మీద మనకు ఒక మమకారం లేకుండా చేసిన ఒక శకం నడిచింది అలాంటప్పుడు ఎవరికీ కూడా ప్రాపర్ గా రామాయణ మహాభారతాలు తెలియకపోవడం వల్ల సినిమా వాళ్ళు తీసిన రామాయణ మహాభారతాలే
(30:28) నిజం అనుకొని అలా నమ్మి వాళ్ళు అలా అనుకుంటున్నారు ఇవాళ నేను మీకు చెప్తాను అసలు శాస్త్రాల్లో ఎవరు అందరికంటే గొప్ప దానవంతులు అని ప్రధమ కక్షలో తీసుకొని ఉత్తమ దానం ఎవరు చేశారు ఇప్పటివరకు భూమి మీద అంటే ఉత్తమోత్తమ దానాల్లో ఇద్దరినీ పెడతది శాస్త్రం ఎవరంటే ఒకటి దీచిముని రెండు శిబి చక్రవర్తి శివిచక్రవర్తి దీచి ఎవరంటే ఇంద్రుడు వృత్రాసురుడిని చంపాలి ఇదొక పెద్ద కథ వృత్తరాసుర ఉపాఖ్యానం నేను మళ్ళీ చెప్తాను అతన్ని చంపాలి వృత్రరాసురుడు ఒక అసురుడే కానీ అతను గొప్ప విష్ణు భక్తుడు కూడా అతన్ని చంపాలి విష్ణుమూర్తి అతన్ని చంపాలంటే చంపలేక విపరీతమైన
(31:09) దుఃఖం పొందుతూ విపరీతమైన క్లేషం పొందుతూ అసలు నేను ఇతన్ని చంపలేను అనే ఒక స్టేజ్ వచ్చేస్తే అతను వెళ్లి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడంటే ఒక ఋషి ఉన్నాడు కింద నిస్వార్ధమైన వ్యక్తి కేవలం బ్రహ్మజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు వజ్రాసనంలో కూర్చొని పండుముసలి వాడైన కుండలిని శక్తి జాగృతం చేసి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఎప్పుడు కూడా ఆ ఎనర్జీని పైన ఉధ్వరేకంగా తీసుకొని వెళ్లి ఆయన విపరీతమైన తపస్సు చేయటం వల్ల ఆయన వెనుముక ఒక వజ్రం లాగా మారిపోయింది.
(31:45) అందుకనే చెప్పాను నేను వెనుముక నిటారుగా ఉన్న జీవి కేవలం మనిషి మాత్రమే వాడు మాత్రమే తపోసాధన మోక్ష సాధన చేయగలడని అలాంటి దీచి ముని దగ్గరికి వెళ్ళు వెళ్లి నేను ఇంద్రుని నాకు నీ వెనుముక కావాలి దేనికంటే వృత్రాసుడు స్వర్గం మీద పడి ప్రళయ తాండవం చేస్తున్నాడు వాడిని సంహరించాలంటే నీ యొక్క వెనుముక కావాలి అంటే అసల దీచి ఒక్క క్షణమా ఆలోచించకుండా తన స్వార్థ ప్రయోజనం ఏమిటి కూడా చూడకుండా వచ్చినవాడు ఇంద్రుడు ఇంద్రుడు ఉంటే భూమండలంలో ధర్మం నిలబడుతుంది ఇంద్రుడు నిజంగా స్వర్గలోకవాసులు అందరూ సరిగ్గా ఉంటేనే సమయానికి వర్షాలు వస్తాయి అంకురార్పణ
(32:29) జరుగుద్ది మనకు తిండి దొరుకుద్ది వాయువు ఉంటాడు అందరూ బాగుంటారు అని చెప్పి లోకా సమస్తం సుఖినో భవంతు అన్నట్లుగా ఆయన తన శరీరాన్ని వదిలేసి ఒక్కసారిగా ఇలా పడిపోయాడు పడిపోతే ఇంద్రుడు ఆ శరీరాన్ని చీల్చి లోపల నుంచి వెన్నుముకను తీసుకుంటుంటే ఇంద్రుడి కంట వెంట నీరు వచ్చింది ఎందుకంటే ఎంత నిస్వార్థమైన మనిషిరా నాయన శరీరాన్ని వదిలేసాడు ఏ శరీరంతో అయితే ఆయన ఇంత తపోసాధన చేశాడో ఆ శరీరాన్ని లోక కళ్యాణార్థమై వదిలేస్తే ఆ వెనుముకను తీసుకొని వెళ్లి వృత్రాసురుడిని సంహరించాడు అంటే వాళ్ళ శరీరాన్ని కూడా లెక్క చేయని మనిషిగా ప్రథమ కక్షలో దీచి
(33:09) వస్తాడు ఈ దీచి యొక్క కథ భాగవతంలో వస్తుంది రకరకాల పురాణాల్లో వస్తుంది రెండవది శిబి చక్రవర్తి అంటే ఈయన చంద్రవంశంలో ఆ యయాతి సంతతిగా యయాతి యొక్క లీనియేజ్ లో వచ్చినవాడు వాళ్ళ యొక్క వంశవృక్షంలో వచ్చినవాడు షిబి యావత్ భూమండలాన్ని ఏలుతున్నప్పుడు అగ్ని ఇంద్రుడు కలిచి షిబి చక్రవర్తి ఎంత గొప్ప ధార్మికుడో తెలుసుకుందాం అనే ఒక దీనితో అగ్నిదేవుడు ఒక చిన్న పావురం లాగా ఇంద్రుడు ఒక పెద్ద డేగ లాగా మారిపోయి వెంబడిస్తూ వెంబడిస్తే వచ్చి శిబి చక్రవర్తి యొక్క ఒళలో వాలిన ఆ పావురం శిబి చక్రవర్తిని స్వామి నేను నీకు శరణాగతి పొంది రక్ష రక్ష చక్రవర్తి అని నిన్ను
(33:52) నేను దేహి అని ప్రార్థిస్తున్నాను నన్ను రక్షించగలవా అంటే ఒకసారి మాట ఇచ్చాడు నేను నిన్ను రక్షిస్తాను అని మరి రక్షిస్తానని మాట ఇచ్చిన తర్వాత డేగ వచ్చింది డేగ లేదా ఈగి వచ్చి ఏమంది జీవో జీవస్య జీవనం నువ్వు పొద్దున అన్నం తిన్నావా శిభి చక్రవర్తి అంది తిన్నాను స్వామి అని మరి రాత్రి తింటావు కదా అని తింటాను కదా స్వామి మరి నేనేం తినాలి నాయనా ఈ జీవే నాకు ఆహారం మరి దానికేమో నువ్వు మాట ఇచ్చావు నువ్వేమో దాన్ని వదలను అంటున్నావ్ నాకు ఇది కాక ఇంకా ఏ పిచుక ఏ ఆహారము దొరకని పరిస్థితి అది నిజమే ఆరోజు ఇంద్రుడు కలిపించాడు అక్కడ ఎటువంటి పక్షులు లేవు డేగ ఇక
(34:31) నీరసించిపోతుంది ఇక దానికి భోజనం లేదని తన కత్తి తీసి తన కుడి తొడలో ఉన్న మాంసాన్ని కోసి ఆ మాంసాన్ని ఇచ్చాడు డేగకి ఏమైనా స్వార్థం ఉందా శిబి చక్రవర్తి అందుకనే దానవీర సూర శిబి చక్రవర్తి అని సినిమా తీయాలి దీనికి ఎందుకంటే వీళ్ళందరికీ ఏ స్వార్థం లేదు కేవలం జీవో జీవస్య జీవనం ఆ డేగ బ్రతకాలి నేను మాట ఇచ్చాను తెలిసి తెలియక ఈ పావురానికి అని చెప్పి ఆ తొడభాగాన్ని కోసి దానికి ఇచ్చేస్తే తొడభాగం ఎందుకు కోసాడు అంటే మరి కంఠం కోస్తే మనిషి చచ్చిపోడు కాళ్ళ చేతిలోకి కోస్తే అంగవికలాంగుడు కాడు తొడభాగంలో ఉన్న మాంసం కోసిన అతను నిలబడగలనని అనుకున్నాడు అక్కడే
(35:12) అన్నిటికంటే ఎక్కువ పట్టున్న కండ దొరుకుతుంది దానికి కూడా అని దాని గురించి ఆలోచించి ఇచ్చేసాడు ఆయన ఇది ఉత్తమ దాన గుణాలలో వచ్చే ఇద్దరు ప్రప్రదములు ఎవరు అంటే వాళ్ళ శరీరాలను లెక్క చేయకుండా వాళ్ళు వాళ్ళని వాళ్లే త్యాగంగా ఇచ్చేసిన వాళ్ళు ఈ శిబి చక్రవర్తి ఈ తదీచి తదీచి ఇప్పుడు మధ్యమ కక్షలో కొందరు వస్తారు ఈ మధ్యమ కక్షలో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే హరిశ్చంద్రుడు ఎప్పుడన్నా విన్నారా మీరు హరిశ్చంద్రుడు కథ హరిశ్చంద్రుడిది విన్నాను సత్యం గురించి హరిశ్చంద్రుడు అంటారు కదా దానం గురించి విన్నాను అసలు హరిశ్చంద్రుడు చేసినన్ని దానాలు ఎవరు
(35:48) చేయకపోగా విశ్వామిత్రుడికి యావద్రాజ్యాన్నే దానంగా ఇచ్చేసాడు ఇప్పుడు హరిశ్చంద్రోపాఖ్యానం చెప్పుకుంటున్నప్పుడు అదొక పెద్ద కథ రాముడి యొక్క ఈ సూర్యవంశంలో వచ్చినవాడు హరిశ్చంద్రుడు ఆ ఇశ్వాక కుకుల తిలకాలలో ప్రప్రథముడు హరిశ్చంద్రుడు అంటే భగీరథుడు తర్వాతే బట్ ఆయన కూడా మహా సత్యనిష్ట గరిష్ఠుడు దానాల్లో అన్నిటికంటే గొప్పవాడు ఎందుకంటే తన ముందుకు వచ్చి రాజదండనాన్ని చేతిలో పట్టుకొని చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చున్న హరిశ్చంద్రుడు ముందుకు ఎవరు వచ్చి దేహి అన్నా వాళ్ళకు ఆ దానం ఇచ్చేసేవాడు.
(36:22) ఆయన యొక్క దానము ఆయన యొక్క సత్యము చూసి అసల ఈయన ఎక్కడి వరకు ఈ దానాన్ని ఈ సత్యాన్ని నిలబెట్టుకుంటాడని ఇంద్రుడు పరీక్షించడంలో విశ్వామిత్రుడు వచ్చి అదొక పెద్ద కథ అతను అడగానే రాజ్యాన్ని ఇచ్చేసాడు కఠిన దరిద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఈ దానాన్ని సత్యాన్ని ఎప్పుడు వదలలేదు కాబట్టి ఆయనకున్న సర్వస్వం దానం చేసేసిన వ్యక్తి సో అతను హరిశ్చంద్రుడు ఈ హరిశ్చంద్రుడు లాంటి వాడే ప్రహ్లాదుడు కూడా ప్రహ్లాదుడు అయితే ఇంకా పరాకాష్ట ఏమిటంటే నరసింహ స్వామి వచ్చి తన తండ్రిని చంపేసిన తర్వాత ఆయన పుట్టిందే ఒక అసుర కులంలో అసురుల మధ్యలో పుట్టాడు అసలు ప్రహ్లాదుడు ఎవరు
(37:05) హిరణ్య కశుపుడు కొడుకు ఆయన ఒక అసురుడే అవును సో అలాంటి ఒక అసురుడు ఏమన్నాడంటే ఇంతమంది స్వామి వాళ్ళకు తెలియక బుద్ధిమాంద్యంతో నిన్ను శత్రువుల్లాగా భావించి చేయరాని పాపా చేసి వాళ్ళందరూ కూడా నరక లోకాలకి వెళ్ళిపోతారు స్వామి నేను నన్ను అనుగ్రహించమని అడిగితే మీరు ఒక కోరిక కోరుకోమన్నారు స్వామి దానికి నాకు ఏమనిపిస్తుందిఅంటే ఈ పాపాత్ముల పాపం అంతా నా ఖాతాలో వేసేయండి వీళ్ళందరి తరపున నిన్ను కోట్ల జన్మలు నరకంలోకి వెళ్లి అనుభవిస్తాను కాబట్టి నాకు వీళ్ళ యొక్క బాధ వీళ్ళు చేసిన పాపము చూస్తే నాకు వాళ్ళ మీద విపరీతమైన జాలి కలుగుతుంది అని ఇలాంటి
(37:47) ఒక ప్రార్థన ప్రహ్లాదుడుత తప్ప ఎవరు చేయలేరు అంటే తన తండ్రి సంహరింపబడ్డాడు అన్న సంగతి చూచి అప్పుడు శ్రీమన్నారాయణుడైన లక్ష్మీ నరసింహ మూర్తికి ప్రహ్లాదుడు ప్రార్థన ఏమిటంటే ఈ అసురులు చేసిన పాపములన్నీ నా యొక్క ఖాతాలో వేయవలసినది అని ప్రార్థించుకున్నాడు ఆయన సో ఇది అద్భుతంగా వస్తుంది ఈ ఖండం భాగవతంలో అలాంటిది ప్రహ్లాదుడు తన జీవితంలో విశేషమైన దానాలు చేశాడు ఆ విశేషమైన దానాలు చేశాడు కాబట్టే ప్రహ్లాదుడు యొక్క మనవడుగా వచ్చినవాడు ఆయన యొక్క సంతతిలో వచ్చినవాడే బలి చక్రవర్తి మనవడు ఆ ముని మనవడు అంటే ఆయన యొక్క పరంపరలో వచ్చాడు అన్నమాట ఇక మధ్యమ కక్షలో
(38:29) దానధర్మాల గురించి లెక్క వేస్తే మన హరిశ్చంద్రుడు ప్రహ్లాదుడు ఇత్యాది వాళ్ళు వస్తారు ఇక కింద థర్డ్ సెక్షన్ లో ఉత్తమ మధ్యమ ప్లస్ కింద థర్డ్ స్టేజ్ లో ఉన్న దానధర్మాల్లో వచ్చే వాళ్ళు ఎవరంటే నెంబర్ వన్ బలి చక్రవర్తి అంటే బలి చక్రవర్తి తను యుద్ధం చేసి ఇంద్రుడి దగ్గర సమస్తాన్ని లాగేసాడు. [నవ్వు] అంటే ఆయనఏమి దుర్యోధనుడు పేకాటట్లో లాగేసినట్టు ఏమి లాగేయలే తన కండ కష్టంతో తన రెక్క కష్టంతో గురువు యొక్క అనుగ్రహంతో గురు బలం కోల్పోయిన ఇంద్రుడు మీదకు దండయాత్రకు వెళ్లి స్వర్గ లోకాన్ని అంటే సమస్త ఈ చతుర్దశ భువ మండలాలని అంటే భూమి
(39:11) భూ పైన లోకాలని భూ కింద లోకాలని మొత్తానికి అధిపతి అయ కూర్చున్నాడు ఆయన అలాంటిది శ్రీమన్నారాయణుడే ఒక చిన్న బాలుడుగా ఆయన ముందుకు వచ్చి నిలబడి నాకు దానం కావాలని అడిగినప్పుడు శుక్రాచార్యుడే వచ్చినవాడు సాక్షాత్తు నారాయణుడే అతనికి దానం ఇవ్వద్దని చెప్పి ఆ కమండలం లోపలికి వెళ్లి ఒక తుమ్మెదలాగా మారితే అక్కడ ఆ నీళ్ళు తర్పణంగా రాకపోతే ఆ చిన్న బాలుడైన వామనుడు ఒక చిన్న తీగతో పుల్లతో లోపలికి కమండలాన్ని గుచ్చటం వల్ల శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది అందులోనుంచి నీళ్ళ వచ్చి తర్పణం వదిలిన తర్వాత ఏ రాజ్యాన్నైతే ఇంద్రుడి దగ్గర లాగేసాడో మళ్ళీ ఆ
(39:52) రాజ్యాలన్నిటిని కూడా అతను శ్రీమన్నారాయణుడు దానంగా తీసుకొని దానిని ఇంద్రుడికి ఇచ్చాడు అసల తలుచుకుంటే బలి ఎటువంటి దానం ఇవ్వకుండా కూడా ఉండొచ్చు తనది కాని దాన్ని తన దానం ఇవ్వడంలో గొప్ప ఏమిటండి అందుకే మీరు అధమ దానం అన్నారా ఇది అంటే అతను రెక్క కష్టం చేసి సంపాదించిన దానమే కదా గెలిచింది కదా గెలిచింది అతనేమి తేరగా పేగాలో లాక్కున్నది కాదు పాచికల్లో లాక్కున్నది అంతకంటే కాదు రెక్క కష్టం చేసి యుద్ధం చేసి గెలిచినది అలాంటిది మొత్తం దానం ఇచ్చేశడు కాబట్టి అతనికి సుతల లోకానికి ఆయన్ని అధిపతి చేసి శ్రీమన్నారాయణుడు అతన్ని అక్కడ అధిపతిగా ఉంచాడు అందుకనే
(40:30) ప్రతి ఓనంకి కూడా ఆయన మళ్ళీ భూమండలం మీదకి వచ్చి ఒకప్పుడు ఈ భూమిని ఏలిన మనుషులందరితో కూడా ముచ్చటించి వాళ్ళ యోగక్షేమములు చూచుకునేటట్టుగా అనుగ్రహించాడు వామనమూర్తి అందుకనే విస్సు అని ఆ మలయాళి న్యూ ఇయర్ అప్పుడు ప్లస్ ఈ ఓనం అప్పుడు ఏమిటంటే ఈ వామనుడికి బలిచక్ర వర్తికి చేసే పండగ ఓనం సో వాళ్ళందరూ కూడా బలి ఇంటికి వస్తాడని ఓనం సద్య వాళ్ళు ఒక పెద్ద అరిటాకు మీద రకరకాల వంటకాలన్నీ చేసి బలికి వామన మూర్తికి నివేదించి వామన మూర్తికి నివేదించిన దాన్ని బలికి నివేదించి దాన్ని వాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తారు.
(41:07) సో బలి చక్రవర్తి అది కాకుండా ఇంకొక విశేషమైన మనిషి ఎవరంటే రంతి దేవుడు అని భాగవతం చెప్తుంది. ఎవరంటే ఆయన ఒక పెద్ద గొప్ప రాజు ఆయనకి కనీసం ఒక 15 20 రోజుల పాటు విపరీతమైన క్షయం వచ్చి తినటానికి భోజనం లేకపోతే చివరాకరిగా ఆ 15వ రోజు ఆయన చేతికి ఇంత అన్నము అతను శరీరాన్ని నిలుపుకోవడానికి ఇంతవస్తే అదే సమయంలో ఒక సాధు వచ్చి భవతి భిక్షాందేహి నేను ఇది లేకపోతే చనిపోతాను అంటే ఆయనకి 15 రోజులో 20 రోజులో ఆ సంఖ్య భాగవతం చెప్తుంది దాని తర్వాత చేతికి కి వచ్చిన ఆ పిటికెడి అన్నాన్ని ఆయనకి దానం ఇచ్చేస్తే దాని తర్వాత ఇంకొకడు వచ్చి ఆ కమండలంలో కొన్ని నీళ్లు ఉంటే నాకు నీళ్లు కావాలి
(41:52) స్వామి నా నోరెండిపోతుంది నేను చచ్చిపోతాను అంటే ఆ నీళ్లు కూడా దానం ఇచ్చేస్తాడు ఆయన అంటే తనకి అవసరం ఉన్న అవతల వ్యక్తి వచ్చి దేహి అని ప్రార్థన చేసి భిక్షాందేహి అని అర్జిస్తే ఉన్నదాన్ని కూడా ఇచ్చేస్తాడు అది అధమ కక్షలో ఉన్న దానమూర్తులు వీళ్ళు వీళ్ళల్లో ఎక్కడ ఎక్కడా కూడా కర్ణుడు ప్రస్తావన రాలేదు ఆ మాటికి వస్తే కర్ణుడు కంటే విశేషమైన దానమూర్తి భీష్ముడు కర్ణుడు కంటే విశేషమైన దానమూర్తి పాండురాజు వీళ్ళు ఇన్నిన్ని దానాలు చేశరట్టుగా చెప్తుంది మనకి మహాభారతం కర్ణుడు కంటే విశేషమైన దాన సంపన్నుడు ధర్మరాజు ఎంత దానం చేయాలో అంత దానం చేశాడు అశ్వమేద యాగంలో రాజసూయ యాగాలు
(42:37) జరుగుతున్నప్పుడు విశేషమైన దానాలు చేశరండి వీళ్ళు అన్ఫార్చునేట్లీ ఏంటంటే అంటే సినిమా వాళ్ళకు నచ్చింది కాబట్టి ఒక క్యారెక్టర్ ని విక్టిమైజ్ చేసి తల్లి వదిలేసిందని పనికిమాలిన కథలు చెప్పి మనల్ని నమ్మించి ఇక దానవీర సూరకర్ణ కక్షలోకి కర్ణుడిని వేశారు కర్ణుడు అనేవాడు చేసిన దానం తన యావత్ జీవితంలో ఏమీ లేదు ఇది కేవలం షాట్లల్లో రీళ్ళల్లోయూబ్ లో చూసుకోవడానికి పనికొస్తుంది ఆఖరికి కవచ కుండలాలు ఆయన దానం చేసింది కూడా ఒకటి ఆశించి తప్ప ఆయన ఆ శక్తి అనే ఒక ఆయు ఆయుధాన్ని ఆశించి దాని వల్ల అర్జునుని సంవరించొచ్చుఅనే ఒక స్వార్థం తప్ప కర్ణుడు
(43:16) చేసిన విశేషమైన దానాలు ఏది కాదు ప్లస్ ఇంకొకటి మీరందరూ అర్థం చేసుకోవాలి ఈ రంతి దేవుడి యొక్క కథ ఆయనకు అవసరం ఉన్నదాన్ని ఇచ్చేసాడు కదా దానం అనేది ఎప్పుడైనా మీకు అవసరం లేనిది ఇస్తే అది దానం కాదు మీకు అవసరం ఉన్నదాన్ని ఇస్తేనే దానం అందుకనే మనం చాలా తప్పు చేస్తాం మనం వాడేసిన చెప్పులు వాడేసిన బట్టలు మనం తినేసిన న తర్వాత మిగిలిన అన్నం అయ్యయ్యో ఇది చాలా అన్యాయం చాలా అమానుష్యం అది చాలా తప్పు అవైదీకం అది పూర్వం మీకు చెప్పాను కదా నేను తినకముందు తీసి పక్కన పెట్టి దానం ఇవ్వాలే తప్ప తిన్న తర్వాత మిగిలిపోయిన దానిని కేవలం పశువుకి మాత్రమే ఇవ్వాలి
(44:00) నార్త్ ఇండియాలో ఒక సామెత ఉంది పైలే రోటి గాయకి ఆఖరి రోటి కుత్తేకి అని మీరు తిని వదిలేసిన దానిని మాత్రం దయచేసి దానంలాగా భావించి మన ఇళ్లల్లో పని చేస్తున్న వాళ్ళకు మీరు ఇచ్చినట్లయితే చాలా పాపం తీసుకోవాల్సి వస్తుంది మీకు మీ ఎంగిలి ఒకళ్ళకు దానం ఇవ్వని ఇవ్వకూడదండి మీకు నిజంగా ప్రేమ కారిపోతుంటే ఇంట్లో పని చేసే వాళ్ళకి కూడా మీరు ముందే అన్నం తీసి మీరు తినక ముందు తీసి పక్కన పెట్టింది మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే మనం వాళ్ళలో భగవత్తత్వాన్ని చూసి ఇవ్వాలి ఆ మాటికి వస్తే చివరాకరిగా మీకు చెప్తున్నాను పరోపకారార్థమిదం శరీరం మనిషి శరీర శరీరము యొక్క ప్రయోజనం
(44:41) ఏమిటి అంటే పరులకు ఉపకారం చేయటమే మనిషి శరీరము యొక్క ప్రయోజనం అనేది ఇది ఉపనిషత్ సూత్రం ఎందుకు ఎందుకండీ పరోపకార విధం శరీరం అంటే మనం బ్రతకాలంటే మన నాలిక నుంచి మన మలద్వారం వరకు ఒక ట్రిలియన్ బ్యాక్టీరియాలన్నీ సూక్ష్మ జీవులన్నీ ఒకటయి మన గట్ హెల్త్ అని ఒకటి ఉంటుంది అందులో మైక్రోబ్స్ ఉంటాయి ఆ గట్ హెల్త్ లో ఉండి మన పచన శక్తికి మనకు హెల్ప్ చేస్తాయి.
(45:14) ఇవాళ ఆ బాక్టీరియా తక్కువైపోతే మనకు గ్యాస్ మనకు పైన బర్పింగు, అసిడిటీ లాంటి సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మీ యొక్క ఆలోచనా విధానం బాగోక గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు ఎప్పుడు స్వార్థం నేను నా కుళ్ళు కల్మషం కచ్చా లాంటి మనసులో పెట్టుకొని దీనివల్ల మీ కడుపులో ఉన్న సూక్ష్మ జీవులన్నీ చనిపోవడం వల్ల ఈ గట్ బాక్టీరియా చనిపోవడం వల్ల మీకు ఆరోగ్యం దెబ్బతింటుంది.
(45:37) అంటే ఒక ట్రిలియన్ బ్యాక్టీరియాలు ఒకటై మన పచన శక్తికి ఉపయోగపడితే తిన్న అన్నం జీర్ణించుకునే ఒక దౌర్భాగ్యపు డిపెండెంట్ బ్రతుకులు మనవి అలాంటిది మనం తినే తిండి వల్ల అవి సమృద్ధి చెందుతాయి అవి బాగుంటే మనం సమృద్ధిగా ఉంటాం. దాన్ని సింబయాటిక్ రిలేషన్షిప్ అంటారు. అంటే మన శరీరం నిలబడాలంటే మన లోపల ఉన్న సూక్ష్మజీవులు బ్రతకాలి.
(46:06) ఈ ఒక్క ఆధారంగా మనకి ఉపనిషత్ సూత్రం ఏం చెప్తుందంటే పరోపకారార్థం ఇదం శరీరం పరులకు ఉపకారం చేయటానికే మనిషి యొక్క శరీరం అలా ఒక మనిషి బ్రతికితే వాడు ధర్మమునందు పూనిక ఉన్నవాడై ధర్మ జాగృతి కలిగి వాడిలో సత్వ జాగృతి కలిగి వాడి వల్ల ఎటువంటి తప్పు జరగకుండా భగవంతుడే కాపాడతాడు. అంటే ఇప్పుడు మనకి మీరు భారతంలో ధర్మరాజు అండ్ మనకి భీష్ముడు వాళ్ళందరూ దానం చేసిన దాని గురించి చెప్పారు కదా [గురకలు] సత్య హరిశ్చంద్రుడు కూడా అంటే వీళ్ళద్దరినీ ఎప్పుడు సత్యానికి ధర్మానికి అక్కడ మన మైండ్లో కూర్చోబెట్టేసి దానం అనేసరికి అంటే కర్ణుడి దగ్గర తీసుకొచ్చారు మనల్ని అంటే ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది
(46:49) కేవలం ప్రాంతీయంగా ఒక రాష్ట్రమో రెండు రాష్ట్రాల వాళ్ళ నమ్మితే సరిపోదండి ఇది సో యావత్ భారతదేశంలో మీరందరూ అర్థం చేసుకోవాల్సింది కర్ణుడిని కేవలం సినిమా వాళ్ళు సీరియల్ వాళ్ళు హీరోయిన్ చేశారు అది కూడా సనాతన ధర్మం మీద జరిగిన ఒక పెద్ద కుట్ర సో మన మన పురాణాల మీద మన కృష్ణుడు మీద మన ధర్మరాజు మీద మనకే ఒక రకంగా చికాకు ఒక రకంగా నమ్మకం కోల్పోవాలి అంటే వీళ్ళని హీరోని చేయాలి.
(47:17) ఇది కమ్యూనిస్ట్ వాదులు దాని తర్వాత దీని వెనకాల చాలా పెద్ద కుట్రే ఉంది ఈ సినిమాల ద్వారా మనకు మన శాస్త్రం మీద మన ధర్మం మీద మనకే నమ్మకం కలగని ఒక స్థితికి మనల్ని తోసేసి అప్పుడు మన శాస్త్రం మీద మనకు నమ్మకం పోయింది అనుకోండి అప్పుడు మనకు తల్లి మీద నమ్మకం పోద్ది. ఇప్పుడు ఎవరైనా ఒక కుటుంబ వ్యవస్థని విరగగొట్టాలంటే వాళ్ళకు వాళ్ళ యొక్క తల్లి మీద తండ్రి మీద అపనమ్మకాన్ని క్రియేట్ చేయాలి ఇది అదే జరుగుతుంది ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కమ్యూనిస్టు వామ పక్షాలు ఈ దేశానికి చేసిన మంచి ఏమీ లేకపోగా వాళ్ళు చేసిన అతి దౌర్భాగ్యపు పని ఏంటంటే నాస్తికత్వాన్ని
(47:58) ప్రమోట్ చేసి సెక్యులరిజం సెక్యులరిజము నాస్తికత్వం అనే రెండిటిని కూడా తీసుకొని వచ్చి రాంగ్ రాంగ్ ఉదాహరణలతో మన శాస్త్రాల మీద మన ధర్మాల మీదే మనకు నమ్మకం లేకుండా చేస్తే అప్పుడు వాళ్ళ మనుగడ ముందుకు వెళుతుంది. ఇప్పుడు దానం గురించి మళ్ళీ మీరు ఇంకోటి చెప్పారు కదా మనము తినకముందు తీసి పెట్టాలి. అదొకటి సో దానం ఎంతవరకు ఇప్పుడు కొంతమంది మన ఉదాహరణలు చెప్తారు.
(48:24) అడ్డగోలగా దానాలు చేసేసాడు అందుక రోడ్డు మీదకి వచ్చాడు. ఇలా ఒకటి అంటారు. రెండోది మీరు తినగాక ముందే మనం పెట్టాలని అన్నారు కదా గురువుగారు. సపోజ్ నేను ఒక పార్సెల్ తెచ్చుకుంటాను. ఆ నేను తింటాను అనుకుంటాను పార్సెల్ నుంచి ప్లేట్లో వేసుకుంటాను దాన్ని అక్కడ పక్కన పెట్టేస్తాను. అది ఎంగిల్ అవ్వదు కదా దాన్ని ఇవ్వచ్చా మీకు సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తానండి మీ దానంలో ధర్మం ఉండాలి.
(48:45) విచ్చలవిడిగా దానాలు చేశాడు వాడు రోడ్డున పడ్డాడు కాబట్టి దానాలు మంచివి కాదనే ఒక ప్రయత్నం కూడా ఒక హేతువాదుల లక్షణమే ఇది. ఎందుకంటే వాడు అయోగ్యులకు దానం చేస్తే కచ్చితంగా వాడు రోడ్డుపాలు అవుతాడు. ధర్మో రక్షతి రక్షతః మీ దానంలో ధర్మం ఉంటే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నేను కొన్ని నెలలకు ముందు ఒక ఎపిసోడ్ లో ఒక రీల్ చూసాను అన్నమాట ప్రముఖ ప్రవచకడే తను చాలా మంచి ఫేమస్ తను చెప్పానంగా విన్నాను అన్నమాట ఏమన్నాడంటే నీకు ఉంచుకొని దానం చేయు అంతేగాని గొప్పలకు పోయి మొత్తం దానం చేసేస్తే అలాగే జరుగుద్ది అన్నట్టు అనేసాడు అందుకని మీరు మళ్ళీ క్వశ్చన్ అడిగాను
(49:23) నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ప్రాక్టికల్ గా మీకు భగవత్ ప్రేరణ కలిగి మీరు దానం చేయాలి దానికి దానం చేయాలంటే ఫస్ట్ మీ జీవితంలో లో సత్వ జాగృతి కలగాలి. అందుకనే లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలా బ్రతికి రజోగుణంలో ఉండి మనం పేరు కోసం ప్రఖ్యాతి కోసం నలుగురిలో చూపించుకోవడం కోసం దానాలు చేయకూడదు.
(49:51) మీరు ఫస్ట్ మీ జీవన శైలిని ఆలోచన విధానాన్ని మార్చుకొని మీరు పొద్దున్నే లేచి సూర్యుడికి అర్గ్యం ఇచ్చి సంధ్యావందనాది క్రియలు చేసి భగవత్ నివేదనగా మీరు బ్రతికి దానం కూడా కృష్ణార్పణమస్తు అనే ఒక భావనతో చేయాలి కాబట్టి మీ దానంలో ధర్మం ఉంటే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అది మీరు అందరూ గమనించాలి అందుకనే మన జీవితంలో మనకు జ్ఞానం ఉంటే అప్పుడు మన అవతల వ్యక్తి ఆ పాత్రత ఉన్నవాడా పాత్రత లేనివాడా అనే వ్యత్యాసం తెలుస్తుంది చూడండి సనాతన ధర్మం ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎమోషనల్ ఫూల్ అవ్వమని చెప్పదు లాజికల్ గా ఉండాలి అంటే ఫస్ట్ మీకంటూ ఒక బలం ఉండాలి ఆ బలం ఏమిటి
(50:33) అంటే మీరు ఒక ఆస్తికులయి ఒక గురువుని ఒక దేవుని నమ్మి ఒక సాధన చేస్తుంటే మీకు అవన్నీ అర్థంవుతాయి అందుకనే మనిషి జీవితంలో ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంది పశువుకి ఉండదు కాబట్టి మనుషులందరూ సత్వగుణంలో ఉంటే వాళ్ళకే ప్రేరణ కలుగుద్ది వీడికి ఇవ్వచ్చునా వీడికి ఇవ్వకూడదా అని సో మీరు ఇచ్చిన మీరు చెప్పినట్లుగా ఉన్నవన్నీ దానం చేసి రోడ్డున పడేవాడు కచ్చితంగా వాడు రజోగుణం వాడే అయి ఉంటాడు దానివల్ల భగవంతుడు వాడికి ఏం నేర్పుతున్నాడో వాడు అర్థం చేసుకోవాలి కానీ అవసరానికి ఎవరైనా వచ్చినప్పుడు నిస్వార్ధ భావనగా దానం చేస్తే దానం మిమ్మల్ని నిలబెడుతుందే తప్ప
(51:11) మిమ్మల్ని ఎప్పుడు ఎప్పుడు కూడా నాశనం చేయదు ఎందుకంటే మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి ధర్మో రక్షతి రక్షతః ఆ ధర్మాన్ని మీరు రక్షించినట్లయితే కచ్చితంగా అది మిమ్మల్ని రక్షిస్తుందండి. ప్లస్ ఈ భోజనం గురించి చెప్పారు నేను మళ్ళీ చెప్తున్నానండి నా ఐదువేళ్ళ నోట్లోకి వెళ్ళటానికే మనం బ్రతుకుతున్నామని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం ఇవాళ రోజున నిజంగా 5000 నోట్లో వెళ్ళటానికి మనం బ్రతకట్లా తిండి కోసం బ్రతకట్లా జానుడు పొట్ట కోసం అని ఇవన్నీ మెలోడ్రమాటిక్ డైలాగులు మనం ఎన్నో అవసరం లేని వాటి కోసం బ్రతుకుతున్నాం పేరు ప్రఖ్యాత నలుగురిలో గొప్పగా ఉండటం
(51:46) చూపించుకోవటం అన్ని లగ్జరీస్ కోసం మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం అందుకనే చెప్పాను భోజనం అన్నదానం అనేది అన్నిటికంటే గొప్పండి అందుకనే ఒక ఇంటి గ్రహిణి మీరు అడిగిన ప్రశ్నకు చెప్తున్నాను ఒక ఇంటి గ్రహిణి పతివ్రత శిరోమణి అత్తగారికి మామగారికి భర్తకి పిల్లలకి భోజనం పెట్టిన తర్వాత చివరాఖరికి తినేది ఇది మన జీవితంలో మనం తల్లి వరకు కూడా మనం చూసాం ఆఖరికి ఆవిడ దగ్గరికి వచ్చేసరికి కొన్ని ఉండవు అపడాలు ఉండవు వడియాలు ఉండవు పచ్చడి ఉండదు కొన్ని కొన్ని సార్లు మంచిగా ఏదైనా రుచికరంగా వచ్చింది ఉండదు ఏ బాధ పడదు ఉన్నది వేసుకొని తింటుంది ఆవిడకి దొరికిన పుణ్యం ఎవరికీ
(52:22) దొరకదు. మా అమ్మని చూస్తాను అట్లా నేను ఆ సో అలాంటిది మన జనరేషన్ లో మన అమ్మల వరకు చూసాం అది క్యారీ ఫార్వర్డ్ కావాలి ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా తినేవాళ్ళు అంటే వండిన పుణ్యంప మంది కడుపు నిండి అన్నదాత సుఖీభవన్ దీవిస్తే వచ్చే పుణ్యం ఎక్కడికి పోదండి అందుకనే ఆడవాళ్ళంతా విశేషంగా అధార్మికులు ఉండరు మగవాళ్ళు ఉంటారు విశేషంగా అధార్మికులు గాని ఆ జనరేషన్ వరకు ఆడవాళ్ళంతా చాలా వరకు సత్వగుణికులు చాలా మంచివాళ్లే ఉంటారు 99% ఇప్పుడు ఈ కార్పొరేట్ కల్చర్ అది వచ్చిన తర్వాత కొంచెం రివర్స్ కండిషన్స్ చూస్తున్నాం కానీ ఎప్పటికైనా దానం అనేది
(52:57) నిస్వార్థంగా చేస్తే దాని ఫలము మీకు డటాక్సిఫికేషన్ అని చెప్పేసాను కదా ఇక మీ కర్మలకు ఒక డీటాక్సిఫికేషన్ మీ శరీరానికి మీ మనసుకు కూడా ఒక డీటాక్సిఫికేషన్ అది ప్లస్ ఈ మాట అందరూ గుర్తుంచుకోండి పరోపకారార్థమిం శరీరం ఇది మనిషి యొక్క జీవితానికి మనిషి యొక్క మనుగడకి పనికొచ్చే ఒకే ఒక సూత్రం మనిషి శరీరం పరులకు ఉపకారం చేయటానికి మాత్రమే డిజైన్ చేయబడి ఉంది.
(53:23) ఫెరారిలంబorగిని రేసింగ్ కార్స్ రేసుల కోసమే డిజైన్ చేసినట్లుగా మనిషి శరీరం అనేది పరులకు ఉపకారం చేయడానికే నీ వల్ల అయింది నీకు ధనంతో కాకపోయినా పర్వాలేదు నువ్వు టీచర్వ అయితే 10 మందికి ఫ్రీగా చెప్పటం మంచి సలహా మంచి మాట అవి కూడా దానాల కిందికి వస్తాయి మంచి మాట మంచి సలహా ఎవడన్నా చేస్తాడు కానీ నిలబడటం వాళ్ళ కోసం అది పెద్ద దానం నీ సమయాన్ని వీక్షించడం ఏదో పనికిమాలిన సలహా ఇచ్చేసి పెద్ద దానం చేసామని మనం ఫీల్ కాకూడదు ఉపయోగపడే సలహా దానికి నిలబడటం వ్యాపారం పెడుతు అతనికి ఉపయోగపడే సలహా అని వ్యాపారంలో కూడా చాలా లోతుగా పరీక్షించాలి
(53:57) అది ఎలాంటి వ్యాపారం దాని వల్ల పర్యావరణానికి ఎలాంటి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది శాస్త్రం అనేది మనం లోతుగా వెళితే సత్వగుణి గుడికి అది ఈజీగా అర్థంఅవుతుంది. రజోగుణుడికి లోపలికి వెళ్లే కొద్ది చాలా చిక్కుముళ్ళ వస్తాయి వాడికి అందుకనే నేను చెప్పాను మన ప్రవర్తనలో ఫస్ట్ చేంజ్ రావాలి మనలో సత్వ జాగృతి కలగాలి మనం తినే భోజనం దగ్గర నుంచి ఆలోచించే ఆలోచన వరకు మనలో సాత్వికత రావాలంటే భగవత్ నామాన్ని మనం పట్టుకోవాలి.
(54:26) ఒక దినచర్య అనేది ఒకటి ఉండాలి పూర్వ సూర్యోదయం ముందే లెగటం సూర్యుడికి అర్గ్యం ఇవ్వటం అక్కడితో స్టార్ట్ అవుతుంది ఈ గ్రాటిట్యూడ్ ఆయన వల్ల మన జీవితాలు నడుస్తున్నాయి ఆయనక ఒక అర్గ్యం ఇచ్చి స్టార్ట్ చేస్తాం మనం ప్రత్యక్ష దైవం ఆయన ఆయనే సాక్షీభూతం మనం చేసిన కర్మకి సో అందుకనే మనిషి జీవితంలో పుట్టిన వాళ్ళందరూ కూడా నిస్వార్థ దానాలు చేసి వాళ్ళ కర్మలను వాళ్ళు డటాక్సిఫై చేసుకొని వాళ్ళ శరీరాలని కూడా వాళ్ళు డటాక్సిఫై చేసుకోవడం అన్కండిషనల్ దానం మళ్ళీ కండిషన్స్ నాట్ అప్లైడ్ నా రెండో ప్రశ్న కేసీ గారు సనాతన ధర్మముల గురించి దశావతారం గురించి దశావతారంలో
(55:01) బుద్ధావతారం గురించి కూడా చెప్తున్నారు కదా సో బుద్ధుడు అనేవాడు విష్ణుమూర్తి అంశలో పుట్టినవాడైనా ఇప్పుడు కలియుగంలో దశావతారం వచ్చేసిందా మరి సో మీ దృష్టిలో బుద్ధుడు దశావతారంలో ఒక భాగమేనా అనే కదా మీ ప్రశ్న చాలామంది ప్రవచనకారుల దగ్గర నుంచి కూడా విన్నాను అన్ని అవతారాల గురించి చెప్తున్నారు బుద్ధవతారం గురించి కూడా చెప్తున్నారు సో బుద్ధవతారం గురించి చెప్తుంటే ఒక రిలీజన్ వాళ్లే దాన్ని ఎందుకు పాటిస్తున్నారు మనం మనము జస్ట్ గోడల పెయింటింగ్ల దగ్గరను అక్కడ ఎందుకు ఆగిపోయాం మనం హిందువులం ఇది ఒక సూక్ష్మమైన క్వశ్చన్ దీనికి నాకు తెలిసిన ఆన్సర్ నేను చెప్తాను సో మరి
(55:34) ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అనేది మనం పక్కన పెడదాం ఎందుకంటే ఇది నేను ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ ని నాకు నచ్చింది చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పాను ఇది చాలా డీప్ క్వశ్చన్ చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇది ఉన్న ఫాక్ట్స్ చెప్తాను మీకు అసలు ఏమిటి అనేది ఇప్పుడు భాగవతం ఆధారంగా తీసుకుంటే బుద్ధుడు ఖచ్చితంగా తొమ్మిదవ అవతారంగా భాగవత పురాణం చెప్తుంది.
(55:59) ఎనిమిదవ అవతారం ఏమిటి అంటే బలరాముడు అని చెప్తుంది భాగవతం ఇది భాగవత హృదయం సో మనం ఫస్ట్ నుంచి లెక్కేద్దాం మస్్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ బౌద్ధ కల్కి అసలు కృష్ణుడు లేడు ఇందులో ఎందుకంటే భాగవతం ప్రకారం కృష్ణుడు అనే వాడు ఒక అవతారం కాదు కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతంలో మొదటి అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది సో కృష్ణుడే అన్నిటికంటే మూల పురుషుడు అనేది భాగవత హృదయం అందుకులే కృష్ణుడిని చేర్చలేదు భాగవతం అట్లాంటప్పుడు మళ్ళీ బలరాముడు అన్నారు కదా
(56:45) బలరాముని అతని దీనివల్ల మనకు లోక కళ్యాణం ఏం జరిగింది మరి ఆ రైట్ మంచి ప్రశ్న సో ఇప్పుడు నేను ఫస్ట్ బుద్ధుడు గురించి చెప్తాను బలరాముడు గురించి ఒక సపరేట్ పాడ్కాస్ట్ చేద్దాం ఉన్నది మనం మీరు అడిగినది బుద్ధుడు దశావతారంలో భాగమేనా సనాతన ధర్మం వాళ్ళకి బుద్ధుడు ఆరాధ్యనీయుడేనా ఇది అడ్రెస్ చదవం ఇదే పెద్ద ప్రశ్న ఇప్పుడు భాగవతం పక్కన పెట్టి విష్ణు పురాణం విష్ణుమూర్తి గురించి చెప్పేది ఏం చెప్తుందండి విష్ణు పురాణం అంటే విష్ణు పురాణంలో కూడా ఒక రకంగా బుద్ధుడు ఉన్నట్టుగా కొన్ని వర్షన్స్ లో లేదా బుద్ధుడు ప్లేస్ లో కృష్ణుడు పెట్టారు ఇంకొన్ని వర్షన్స్ లో
(57:21) సో [గురకలు] ఏమిటంటే మస్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ లేదా బుద్ధ ప్లస్ కల్కి పెట్టారు. ఇక మీతా మీతా పురాణాలు మస్య కూర్మ వామన ఇట్లాంటి పురాణాలలో రకరకాల పురాణాలలో రకరకాల వర్షన్స్ ఉన్నాయి. అసల బుద్ధుడు అనేవాడు సనాతన ధర్మానికి చెందినవాడా అసలు బుద్ధుడు అవతారం ఒకటి ఉందా అంటే మరి ఒకటి రెండు పురాణాల ఆధారంగా బుద్ధుడు అనేవాడు ఖచ్చితంగా తొమ్మిదవ అవతారమే.
(57:56) ఎందుకంటే కృష్ణుడిది ఒక స్పెషల్ యూనిక్ క్వాలిటీ ఏంటంటే మన ఒక యుగం సత్యయుగం త్రైతా యుగం ద్వాపర యుగం కలియుగం ఈ నాలుగు యుగాలు ఒకటయితే ఒక మహాయుగం ఈ మహాయుగాలు 71 అయితే ఒక మనువంతరం అలాంటిది 14 మన్వంతరాలు అయితే ఒక కల్పం ఇప్పుడు మనం ఉన్నది ఏడవ మనవంతరం అందులో మనం ఉన్నది శ్వేతవరాహ కల్పం ఇలా ఈ కాంప్లెక్స్ ఈక్వేషన్ లో అసలు కృష్ణావతారం అనేది ఈ 71 మహాయుగాలలో కేవలం 28వ మహాయుగంలో మాత్రమే కృష్ణావతారం వస్తుంది.
(58:39) అంటే స్వయం కృష్ణుడు సంపూర్ణావతారంగా వస్తాడు విష్ణుమూర్తి లాగా మరి మిగితా దాంట్లో 27 లో ఏమిటండి 26 లో ఏమిటండీ 25 లో ఏమిటండి అంటే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడుగా వస్తాడు అంటే కృష్ణ తత్వం అనేది ఒక యూనిక్ తత్వంగా కొన్ని కొన్ని పురాణ ఆధారాలుగా భాగవతంలో ఉన్న కృష్ణస్తు భగవాన్ స్వయం అనే ఒక దాన్ని పట్టుకొని కొన్ని కొన్ని సంప్రదాయాల వాళ్ళు ఇప్పుడు 28వ అవతారంలో వచ్చిన శ్రీకృష్ణుడు సాక్షాత్తు ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారంగా వచ్చిన శ్రీకృష్ణుడు కాదు స్వయంగా ఉన్న ఆ పరవాసుదేవుడు ఆ పరంధాముడు సంపూర్ణవతారంగా వచ్చే భగవంతుడు అని చెప్తున్నారు అది ఒక పాయింట్
(59:26) ఇప్పుడు రెండవ పాయింట్ ఏంటంటే బుద్ధుడు కలియుగంలో ఆరంభంలో వస్తాడా భాగవతం మరి ఖచ్చితంగా కలియుగ ఆరంభంలో లో వైదీకమైన ధర్మాన్ని అడ్డుపెట్టుకొని పేట్రేగిపోతున్న బ్రాహ్మణులు విపరీతమైన జంతుబలులు అవి ఇచ్చి సమాజంలో ఒక వర్గం అంతా కూడా దేవుని అడ్డం పెట్టుకొని ప్రజలను బ్రహ్మించి దేవుని అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేస్తూ ఎటువంటి సంస్కారము లేని సంస్కార విహీనులై భూత దయ లేకుండా జంతు బలులు ఇస్తూ ఆ జంతు మాంసాన్ని తిని విపరీతంగా పేట్రేగిపోతున్న సమాజంలో కలియుగ ఆరంభ దశలో బౌద్ధావతారం అనే
(1:00:15) ఒక అవతారంలో శ్రీమన్నారాయణుడు వచ్చి ఇట్లాగ వైదిక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని పేట్రేగిపోతున్న ఈ బ్రాహ్మణ శికామణులుగా ఉన్న అసురోత్తములను భ్రమింపచేసి వాళ్ళ యందు నాస్తికత్వాన్ని ప్రచారం చేసి వేదాన్ని తిరస్కరించేటట్టుగా వాళ్ళల్లో లో ఒకడై వాళ్ళని భ్రమింపజేసి ఒక మోహిని అవతారంలో ఎలా అయితే అసురలను మోహన్లోకి నెట్టేసి వాళ్ళని మోసం చేసి దేవతలకు ఆ అమృతాన్ని ఇచ్చాడో అలాగా అయోగ్యులందరిని ఒక వేపుకు తీసుకెళ్ళిపోయి వాళ్ళకు వేదాలను తిరస్కరించండి ఉపనిషత్తులు తిరస్కరించండి స్వ అనుభవమే అన్నిటికంటే పెద్ద ప్రమాణం అని చెప్పి
(1:01:02) నాస్తికత్వాన్ని ప్రచారం రం చేసే ఒక మోహ రూప అవతారమే ఈ బుద్ధావతారంగా మనకు భాగవతము ఇత్యాది పురాణాలు చెప్తున్నాయి. మరి నాస్తికత్వం అంటే ఏ దేవుని కూడా పూజించద్దు కదా ఏ దేవుని పూజించరు వాళ్ళు సో ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇంకా సూక్ష్మం ఉంది మీరు ఇక్కడ ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకున్నారు అలాంటి ఒక అవతారం ఉందనేది భాగవతం చెప్తుంది మరి ఇప్పుడు కలియుగంలో వచ్చిన సిద్ధార్థ గౌతముడు ఈ బుద్ధుడు ఒకటేనా ఇది మీకు రావాల్సిన డౌట్ సో ఇప్పుడు కలియుగంలో ఉన్న సిద్ధార్థ గౌతముడు బుద్ధుడుగా ఆయన ఎదిగాడు సో అలాంటి సిద్ధార్థ గౌతముడు బుద్ధుడు ఏది ఇది విష్ణుమూర్తి అవతారంగా తొమ్మిదవ
(1:01:45) అవతారంగా వచ్చే బుద్ధుడు ఒకటేనా ఈ పురాణ వాగ్మయంలో వచ్చే బుద్ధుడు మోహం క్రియేట్ చేసే బుద్ధుడు ఒకటేనా అంటే దానికి నేను కొందరు పండితుల్ని చాలా సూక్ష్మంగా రీసెర్చ్ చేసి చెప్పమంటే వాళ్ళు నాకు చెప్పింది ఏమిటంటే బుద్ధావతారం ఎప్పుడు రావాలి శాస్త్రం ప్రకారం కలియుగం స్టార్టింగ్ లో బుద్ధావతారం రావాలి. మరి ప్రస్తుతం ఉన్న బుద్ధావతారం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది అంటే 550 నుంచి 450 బిసి వచ్చింది.
(1:02:17) అంటే జీసస్ క్రైస్ట్ వచ్చి 2026 సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు దానికి ముందు 500 సంవత్సరాల ముందు బుద్ధుడు అంటే సిద్ధార్థ గౌతముడు ఇక్కడ ఉన్నట్లుగా మనకు శిలా శాసనాలు చరిత్ర చెప్తున్నాయి. అవును కానీ భాగవతానుసారం కలియుగ ప్రథమ స్థితిలో రావాలి అని చెప్పాడు ఆయన అంటే కలియుగం మొదలయింది జీసస్ క్రైస్ట్ కి ఇంకొక 3000 సంవత్సరాల ముందు మొదలైంది.
(1:02:41) అంటే కలియుగం ఇవాల్టికి వచ్చి 500 సంవత్సరాలు అయింది ఇవాల్టికి మరి ఆల్మోస్ట్ కలియుగం స్టార్ట్ అయిన 200 సంవత్సరాలకు వచ్చాడు కాబట్టి ఈ గౌతమ బుద్ధుడు ఆ గౌతమ బుద్ధుడు ఒకటి కాకపోవచ్చు ఇది వాళ్ళు అన్న ఒక ఉదాహరణ రెండవ ఉదాహరణ ఏంటంటే మన పురాణ వాగ్మయంలో గౌతమ బుద్ధుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాలి ప్లస్ గౌతమ బుద్ధుడు అంజని అనే ఒక స్త్రీమూర్తికి పుట్టాలి ఎక్కడ పుట్టాలి అంటే ఆయన కికాత అని ఒక ప్లేస్ దాన్నే ఇప్పుడు మోడరన్ బీహార్ లో సౌత్ బీహార్ లో ఉన్న గయగా మనం పోలుస్తాం సో ఆయన ఎక్కడ పుట్టాలి ఆయన బ్రాహ్మణ పరివారంలో పుట్టాలి నెంబర్ టూ ఆయన కిత అనే
(1:03:29) ప్రదేశంలో పుట్టాలి మూడు ఆయన అంజనీ అనే ఒక తల్లికి పుట్టాలి ఈ మూడు ఒక ఉదాహరణలు మన శాస్త్రం ద్వారా మనం కొన్ని కొన్ని తెలుసుకోవచ్చు ఎందుకంటే అంత క్లియర్ గా ఇస్తుంది. సో ఆయన సౌత్ బీహార్ లో ఉన్న గయలో పుట్టాలి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాలి ఆయన తల్లి పేరు అంజని అవ్వాలి. కానీ ఇక్కడ పుట్టిన ఈ సిద్ధార్థ గౌతముడు క్షత్రియ కుటుంబంలో పుట్టాడు.
(1:03:54) సో తల్లి పేరు మాయ. తండ్రి పేరు యుదోధన. వీళ్ళిద్దరూ కూడా సాక్య అనే ఇప్పుడు చోళ పాండ్య లాగా అప్పుడు ఏలుతున్న సాక్య అనే ఒక డైనాస్టీలో పుట్టారు ఆ రాజులు వీళ్ళంతా సో క్షత్రియ పిల్లవాడు సిద్ధార్థుడు అదే కాకుండా ఆయన పుట్టిన ప్రదేశం లుంబిని అది ఇవాళ సౌత్ నేపాల్ లో ఉంది. అదే ఇక్కడ లుంబిని పార్క్ అభివ రాస్తారు అది గౌతమ బుద్ధుడు పుట్టిన ప్లేస్ పేరు లుంబిని అవును మరి మనకు వైదిక పురాణ ప్రమాణం ఏమిటంటే ఆయన కికాతలో పుట్టాలి.
(1:04:29) సో దానిని వాళ్ళు జోడించి ఏమంటారంటే ఈ ఇవేవి మ్యాచ్ అవ్వట్లేదు. ఈ సిద్ధార్థ గౌతముడి యొక్క జననానికి ఇవేమి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే బీహార్ నేపాల్ బార్డర్ ఒకటే అంటారు కదా బీహార్ నేపాల్ బార్డర్ ఒకటే అందుకే మరి అందుకే సో వాళ్ళు అంటున్నది ఏంటంటే ఆయన పుట్టవలసినది క్షత్రియ కుటుంబంలో కాదు బ్రాహ్మణ కుటుంబంలో ఆ ప్లేస్ పేరు కిత అవ్వాలి ంబిని కాదు ప్లస్ ఆయన ఇక్కడ సిద్ధార్థ గౌతముడు ఏంటంటే ఒక క్షత్రియ కుటుంబంలో సాక్య అనే ఒక డైనాస్టీలో పుట్టాడు ఆయన సో ఇవి మ్యాచ్ అవ్వలా ఇది నేను 100% కరెక్ట్ అని చెప్పట్లా రీసెర్చ్ స్కాలర్స్ చెప్తున్నది నేను మీకు చెప్తున్నా
(1:05:00) ఓకే ఇది రెండవ పాయింట్ సో టైం మ్యాచ్ అవ్వట్లేదు పుట్టిన కుటుంబాలు మ్యాచ్ అవ్వట్లేదు ఇక మూడవది ఏంటంటే బుద్ధుడు అంటే అవతారాల్లో తొమ్మిదవ అవతారంగా వర్ణించే విష్ణుమూర్తి వచ్చిన ఆ బుద్ధుడు యొక్క అవతార ప్రయోజనం ఏమిటంటే జంతు బలులను ఆపాలి అహింస పరమోధర్మ అనే ఒక సూత్రాన్ని ఆయన ఒక రకంగా నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తాడు ఈ అసురులులా బ్రతుకుతున్న శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ఆత్మవంచన చేసుకుంటున్న అన్ని వర్ణాల వాళ్ళు బ్రాహ్మణ వైశత క్షత్రియ శూద్రుల అందరినీ కూడా ఆయన మోహించి ఒక సపరేట్ కమ్యూనిటీని ఆయన క్రియేట్ చేస్తాడు అని చెప్తుంది. మరి
(1:05:43) గౌతమ బుద్ధుడు కేవలం ఆయన ఇచ్చిన తత్వాన్ని చూస్తే అహింసా పరమో ధర్మః అనేది ఎంతవరకు ఉందనేది మనకు స్పష్టంగా ఇవాళ ప్రాక్టికల్ బౌద్ధంలో లేదు ఎందుకంటే మీరు టిబెట్ వెళ్ళినా ఏ బుద్ధిస్ట్ కంట్రీస్ వెళ్ళినా ఒక్క తైవాన్ వదిలేసి 99% బౌద్ధిస్టులు అందరూ కూడా ఆ నాన్ వెజిటేరియన్స్ నేను బెంగళూరు దగ్గర వెళ్ళాను పెద్ద బుద్ధుడిది టెంపుల్ ఉంది కుశాల్ నగర మైసూరు నుంచి కూర్కి వెళ్ళ మధ్యలో వస్తుంది సో అక్కడ బుద్ధిస్టులు అహింస ప్లస్ మీరు అన్నట్టు జంతు బలి కోరుకున్నా ఉన్నప్పుడు వాళ్లే తింటున్నారు అక్కడ ఆ ఇది చాలా దౌర్భాగ్యం మరి సో బుద్ధుడు
(1:06:21) నిజంగా అహింసా పరమో ధర్మ అనే సిద్ధార్థ గౌతముడు చెప్పాడా అంటే నాకు తెలియదు ఎందుకంటే నేను బౌద్ధ ధర్మానికి చెందిన వాడిని కాదు కానీ నేను చూసిన బౌద్ధ భిక్షువులు ఎవరూ కూడా మాంసాహారం తినకుండా అయితే లేరు కేవలం తైవాన్ లో కొన్ని కొన్ని ప్లేసెస్ లో బుద్ధిస్ట్ రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ మాత్రమే ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది సో అది చాలామంది అనుభవాల్లో ఉంది.
(1:06:45) సో నేనైతే ఏ ఫామ్ ఆఫ్ బుద్ధిజం లో కూడా మాంసాన్ని త్యజించే బుద్ధిజం ని నేను చూడలే కాబట్టి ఇవన్నీ ఆధారంగా తీసుకుంటే అక్కడ బుద్ధుడు మనం అనుకుంటున్న శ్రీమన్నారాయణుడే బుద్ధుడుగా వచ్చినవాడు ఈ జంతు బలులను అన్ని ఆపి ఈ వేదాన్ని అడ్డం పెట్టుకొని ఆత్మవంచన చేసుకొని సొసైటీ మీద ఆధిపత్యం కొనసాగిస్తున్న వాళ్ళని భ్రమింప చేసేలాగా ఉండటానికి ఆయన వచ్చాడు మరి ఈ గౌతమ బుద్ధుడు ఆయనకి ఉన్న ఏదో ఒక ఆ సూత్రాలని బౌద్ధాన్ని అంతా వర్ణించడానికి వాళ్ళు ధమ్మ అంటారు మనం ధర్మ అంటాం వాళ్ళు ధమ్మ అంటారు ఆ ధమ్మసుత సూత్రాలను వర్ణించడానికి ఆయన వచ్చాడు కాబట్టి కొందరు
(1:07:28) హిందూ కొందరు సనాతన పండితుల యొక్క విశ్వాసం ఏమిటంటే ఈ గౌతమ బుద్ధుడు ఆ గౌతమ బుద్ధుడు ఒకటి కాకపోవచ్చు మళ్ళీ ఇది ఖచ్చితంగా ఒకటి కాదా అంటే చెప్పలేం మరి కాలగర్భంలో ఒకటే అని ఎందుకు నమ్మారు అంటే మీరు అన్నట్లు ఈ ప్లేసులు ఒకటి ఒక దగ్గరే ఉండటం ఆ లుంబిని బీహారు ఒక దగ్గర ఉండటం ప్లస్ ఆ బౌద్ధ వృక్షం ప్లస్ ఇద్దరు పేర్లు ఒకటే అవ్వటం అసలు బుద్ధ అంటే ఏమిటంటే జ్ఞానమును తెలిసినవాడు లేదా జ్ఞాన పరిపక్వత లోకి వెళ్ళినవాడు అని అర్థం ఎన్లైటెంట్ సోల్ అండి బుద్ధ అంటే ఏంటంటే బ్రహ్మజ్ఞానమును తెలిసిన వాడిని బుద్ధ అంటారు సంస్కృతంలో అది ఒక బిరుదు మాత్రమే
(1:08:08) అదొక మనిషి కాదు ఈవెన్ వాళ్ళకి కూడా బుద్ధులకు కూడా అది ఒక బిరుదే మరి ఇప్పుడు ఆ బుద్ధ బుద్ధుడిది జన్మ జరిగిందా లేదా ఈ బుద్ధుడు జన్మ జరిగిందా ఒక బుద్ధుడు జన్మ అయితే జరిగింది ఆ బుద్ధుడు ఎవరనేది నాకు తెలియదు. సో ఒకటి ఈ బుద్ధుడే అని మనం అనుకుంటే ఒకవేళ ఆ బుద్ధుడు ఈ బుద్ధుడు ఇద్దరు ఒకటేనండి ఈ రీసెర్చ్ స్కాలర్స్ ఓవర్ అనాలసిస్ చేసి సమయాన్ని బట్టి దీన్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళు కాదంటున్నారు అని మీరు అనొచ్చు కానీ వైదిక శాస్త్రం ఈ వేదం అనేది మనకు ప్రమాణం పురాణం అనేది మనకు ప్రమాణం కాబట్టి మోహిని అవతారంలో అసురులుగా ఉన్న వాళ్ళల్లో ఎలా అయితే
(1:08:47) మోహాన్ని క్రియేట్ చేసి వాళ్ళని మోసం చేశాడో శ్రీ మహావిష్ణువు అలాగనే ఇక్కడ ఉన్న వేదాన్ని అడ్డం పెట్టుకొని ఆత్మవంచన చేస్తూ అందరినీ కూడా కంట్రోల్ చేసి ఎటువంటి దయా దాక్షణయాలు లేకుండా భూతదయ లేకుండా భూతములను అంటే సమస్త జంతువులను బలిస్తూ ఉంటుంటారు కదా వాళ్ళని నిగ్రహించడానికి మాత్రమే నారాయణుడుగౌ గౌతమ బుద్ధుడుగా వస్తాడు.
(1:09:15) సరేనండి ఈ కాంప్లెక్స్ అంతా మనకఎందుకు ఆ బుద్ధుడు ఈ బుద్ధుడు ఒకటే అని మనం అనుకుందాంఅండి అని మీరు అన్నారు అనుకోండి. ఇక్కడ మీకు అన్నిటికంటే ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే సనాతన ధర్మమునకు వేదము ప్రమాణం శ్రీమన్నారాయణుడే వచ్చి వేదమును తిరస్కరించేటట్టు ప్రవర్తించి కొందరిని ఆ మోహన్లోకి నెట్టేసి అసురులాగా బ్రతుకుతున్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వేదాన్ని అడ్డం పెట్టుకొని లోకాన్ని మోసం చేస్తూ ఆత్మవంచన చేస్తూ అసల జాలి దయ లేకుండా జంతు బలులు చేస్తూ తింటున్న వాళ్ళని ఆయన ఆయన మోసం చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయనను మనం ప్రత్యేకించి పూజించం
(1:09:56) ఎందుకంటే మీరు మోహిని అవతారాన్ని పూజిస్తారా ఇక్కడ ఆయన లేదు సో ఇది కూడా అంతే వైదిక ప్రమాణం ఉండాలి ఆ వేదముని ఆయన యక్సెప్ట్ చేస్తే అంటే ఇక్కడ మళ్ళీ మీకు ఒకటి చెప్తున్నానండి ఇది కాంట్రవర్సీ అవ్వచ్చు శ్రీమన్నారాయణుడే వచ్చి వేదాన్ని తిరస్కరిస్తే మనం నారాయణుని తిరస్కరిస్తాం మీరు ఇది అర్థం చేసుకోవాలి నా మాటల వల్ల ఎవరికన్నా దుఃఖం కలిగితే నన్ను క్షమించండి మీరు అంతా బట్టి నిజం ఏమిటంటే మీరు అడిగారు సనాతన ధర్మానికి బుద్ధుడికి ఏమిటి సంబంధం అని సనాతన ధర్మానికి మూలం వేదం అలాంటి వేదాన్ని తిరస్కరించినది ఏది కూడా మనం దానిని ధర చేరనీయం అవతార ప్రయోజనం ఒకటి
(1:10:35) ఎందుకంటే వేదాన్ని అడ్డం పెట్టుకొని మనుషుల్ని మోసం చేస్తున్నారు కాబట్టి అలాంటి అసురులందరినీ ఏరి ఒక పక్కన కక్షకు పెట్టి వాళ్లకు తెలిసిందే పరమార్థం వాళ్లకు తెలిసిందే ప్రపంచం అదే నిజమైన మోక్షం అని బ్రమపడే వాళ్ళని మనం ఏం చేయగలం వాళ్ళతో వాళ్ళ పాత్రత అంతే వాళ్ళు మోసగింపబడాలి అని అనుకుంటున్నారు వాళ్ళని భగవంతుడే వచ్చి మోసం చేశాడు.
(1:10:59) ఇప్పుడు జంతుబలి అన్నారు కదా మీరు జంతుబలి అనే దాంట్లో ఇప్పటికి మనము గ్రామ దేవతల్లో ఉన్న వాళ్ళకి జంతుబలి కూడా మనం ఇస్తుంటాము. సో మరి ఆ అవతారం వచ్చినప్పుడు ఇది ఆపడానికి వచ్చిండు అని అనుకున్నప్పుడు క్షత్రియులకు శూద్రులకు చెప్పాలి కదా బ్రాహ్మణుకి కాదు కదా చెప్పేది. మీ దృష్టిలో ఏంటంటే బ్రాహ్మణుడు మాత్రమే శాఖహారి వైశ్యుడు శాఖహారి మిగితా వాళ్ళు ఎవరూ కూడా మాంసాలు తినరు కదా మరి బుద్ధుడు ఎవరినండి మోహన్లోకి నట్టడానికి ఎవరిని మోసం చేయడానికి వచ్చాడు అంటే తమరు ఆంధ్ర వాళ్ళా తెలంగాణ వాళ్ళా నేను తెలంగాణ మీరు తెలంగాణ సో మీరు ఈ రాష్ట్రం నుంచి కొంచెం పైకి
(1:11:37) వెళితే ఈస్టర్న్ సైడ్ కి వెళితే వామాచారం వాళ్ళు ఎంతో మంది ఉంటారు అవును వామాచారం ఇప్పుడు కొత్తగా వింటున్న చూస్తున్నాను నేను కాదు వామాచారం అనేది పూర్వం నుంచే ఉంది ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో వామాచారం గురించి ఇక్కడ బాగా తెలుస్తుంది వామాచారం పూజలు లాంటివి చేపించి మందు మాంసాలు పెట్టి అలా చే అవన్నీ చేస్తున్నారు కదా అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఇప్పుడు తెలంగాణలో కొత్తగా వింటున్నాం మనం ఇదంతా ఏంటంటే ఈస్ట్ ఇండియా నుంచి వస్తది.
(1:12:03) సో వెస్ట్ బెంగాల్ లో మొదలవుతది ఈ దారుణం అంతా ఈ వామాచార సంప్రదాయంలో కొన్ని కొన్ని వేదాలలో ఉన్న వాటిని దేనిని వాడతారో నాకు తెలియదు నేను అందులో ప్రావీణ్యంగా నేను దాంట్లో ఏమి రీసెర్చ్ చేయలేదు కదా వామాచారంలో బట్ ఆల్కహాల్ మద్యం దాని తర్వాత మాంసాన్ని కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టించే వాళ్ళు ఎవరు బ్రాహ్మలు కదా అక్కడ ఉన్న వాళ్ళు తింటారు కొందరు అయితే చేపల్ని కూడా తింటారు కదా జల పుష్పాలని వెస్ట్ బెంగాల్ లో అట సో మరి నేను చూస్తున్న ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లోనే కొందరు అక్కడ ఇలాంటివన్నీ చేస్తున్నారు కాళీ ఉపాసకులు కావచ్చు వామాచార ఉపాసకులు మాంసాహారాన్ని భగవద్
(1:12:42) నివేదన చేస్తున్నారు కదా మరి సో దక్షిణాదిలో మన యొక్క అదృష్టం ఏమిటంటే శంకరాచార్య రామానుజాచార్య మధ్వాచార్య లాంటి ఆచార్యత్రయాలు వీళ్ళ ముగ్గురిని ఆచార్యత్రయం అంటారు ఈ ముగ్గురు ఆచార్యులు వచ్చి ఇక్కడ వేదములో ఉన్న వాటిని అన్నిటిని కూడా అర్థం చేసుకొని వేదాంత సూత్రాన్ని ఇచ్చి ఇక్కడ ఫస్ట్ బ్రాహ్మణులను వాళ్ళు సంరక్షించి వాళ్ళని సంస్కరించి తద్వారా ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళందరినీ స్వీకరించి అందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళు ఒక సాధనకు ఒక విధి విధానం ఇచ్చారు.
(1:13:18) ఉత్తర భారతంలో ఆ ఈస్ట్ ఇండియాలో అస్సాము వెస్ట్ బెంగాల్ బీహారు ఇత్యాది ప్రాంతాల్లో అంతగా లేదేమో అక్కడ గొప్ప గొప్ప ఆచార్యులు ఎవరూ రాలేదు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లోనే వామాచారం ఇంతుంటే ఇవాల్టి నుంచి ఒక 34వేల సంవత్సరాల కిందట నరబలులు జరిగాయి అని చెప్పి నాకు కొందరు చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు మాత్రమే ఏం తెలుసు బట్ కనీసం ఏమిటంటే మనం తెలంగాణలో కేవలం గ్రామ దేవతలకు మాత్రమే జంతు బలులు చూస్తాం అది కూడా గవర్నమెంట్ ఇప్పుడు నిషేధించింది కానీ అటువైపు విపరీతంగా ఉంది అదెందుకండీ మీరు నేపాల్లో గాదీమయ్య అని ఒక ప్లేస్ ఉంది.
(1:13:55) అక్కడ 2015 కు ముందు 5 లక్షల గేదెలను బఫెలోస్ ని నరికేవాళ్ళు. నేను ఒకసారి ఆ పాత వీడియో చూశాను నేను చిన్న చిన్న దూడల నుంచి పెద్ద పెద్ద గేదెల వరకు వాటిని ఒకే ఒక వేడితో దాని తల ముండం వేరు కావాలి అది చూడటానికి చాలా జుగుప్సగా ఉంటుంది. సో అలాగా ఈ గాదీమై అనే ఒక ప్రదేశంలో 5 లక్షల గేదెలను 5 లక్షలు అంటే చూడండి ఎంత పెద్ద దాని తర్వాత ఆ హ్యూమన్ యాక్టివిస్ట్లు అవి వాళ్ళు వీళ్ళు కలిసి పెద్ద ధర్ణాలు ప్రొటెస్ట్లు అన్నీ చేస్తే నేపాల్ సుప్రీం కోర్టు ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది ఇది చాలా అనాగరికంగా ఉంది దీన్ని మీరు ఆపాలి అని సో ఇవ్వాల్టికి అక్కడ గాదీమై అనే ఒక
(1:14:36) అమ్మవారికి 10వేలకు కూడా తగ్గకుండా ఇస్తున్నారు ఇవాల్టికి అంటే సుప్రీం కోర్టు నేపాల్లో గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ కి సో ఇదంతా ఇక్కడ ఆ సౌత్ నేపాల్ లో ఉంది ఆ బీహార్ నుంచి దగ్గరలోనే ఉంది ఇది. సో ఆ ప్రదేశంలో ఈ స్కేల్లో జంతుబలులు ఇవ్వాల్టికి జరుగుతుంటే మరి 5000 సంవత్సరాల కిందట అది ఎలా జరిగేదో మరి గౌతమ బుద్ధుడు వచ్చి దీనిని ఆపి మంచి పనే చేశాడని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అంటే అప్పుడు నేపాల్ ఇవన్నీ కూడా మన భరతఖండం లోపే వచ్చింది భరతఖండంలో భాగాలే కదా అవన్నీ సో కాబట్టి అలాంటిది ఇంత భయంకరంగా వామాచారాన్ని మరి ఎందుకు వాడుతున్నారో ఎలా
(1:15:10) వాడుతున్నారో అది దక్షిణాదికి ఎలా పాకిందో ఇదేమి నాకు తెలియదు తాంత్రికులు ఉన్నారు పూర్వం నుంచి కూడా మన దక్షిణాదిలో లో తక్కువ కానీ కేరళలో విశేషమైన తాంత్రికులు ఉన్నారు అథర్వవేద తాంత్రికులు దాని తర్వాత ఇంకా ఉజ్జైని దగ్గర కొందరు తాంత్రికులని చూశాను నేను తర్వాత కాశీ ప్రయాగరాజు దగ్గర కొందరు తాంత్రికులని చూశాను వాళ్ళది ఒక రకమైన సంప్రదాయం అది సామాజిక జీవనానికి పనికొచ్చే సంప్రదాయం అని నేను భావించట్లేదు సామాజిక జీవనంలో సాత్విక దైవీ వర్ణాశ్రమం అనేది ఉండాలి అందుకనే మనం ఒక ఆచార్యుని పట్టుకోవాలి అది శంకరాచార్యుడు గాని రామానుజాచార్యుడు గాని
(1:15:46) మధ్వాచార్యుడు గాని వల్లభాచార్యుడు గాని నింబార్కాచార్యుడు గాని కృష్ణ చైతన్య మహాప్రభువు అని వెస్ట్ బెంగాల్లో వచ్చారు ఆయన ఆయన ఈ తాంత్రికులతో చాలా యుద్ధం చేశారు ఆయన ఆయనది వైష్ణవ సంప్రదాయం గౌడీయ వైష్ణవం అంటారు ఆయన జగన్నాథపురిలో చాలా సంవత్సరాలు ఉన్నాడు ఆయన బెంగాల్లో పుట్టాడు ఆయన ఆయన వచ్చినప్పుడు కూడా చాలా తాంత్రిక శక్తులు చాలా వామాచారం ఉండేది ఆ వెస్ట్ బెంగాల్లో వాళ్ళందరికీ కూడా భాగవతమే ప్రమాణంగా భాగవత వర్ణాశ్రమ ధర్మాన్ని ఆయన స్థాపించే ప్రయత్నం ఆయన చేశాడు కాబట్టి అలాంటిది గౌతమ బుద్ధుడు ఆ కాలంలో వచ్చి ఈ జంతు బలులను ఆపి వేదముని
(1:16:21) వాడుకొని ఆత్మవంచన చేసుకొని నలుగురిని మోసం చేద్దాం అనుకునే అసురులందరినీ కూడా పక్కకు తీసుకువెళ్లి వాళ్ళకి ఒక హెడ్ గా ఉండి వాళ్ళని భ్రమపడేలాగా చేసి వాళ్ళకు కొన్ని సాధనలు ఇచ్చి వాళ్ళని వదిలేశాడు ఇవాల్టికి అది కొనసాగుతుంది అందుకనే మీరు ఎప్పుడన్నా చూడండి బౌద్ధ దేశాలన్నీ కూడా బాగా మెటీరియలిస్టిక్ గా ఉంటాయి విపరీతమైన డెవలప్మెంట్ విపరీతమైన హార్డ్ వర్క్ వాళ్ళు ఇదే పని రాక్షసుల్లాగా బ్రతుకుతుంటారు వాళ్ళు మీరు ఆ జపాన్ గాని ఈ చైనా గాని చైనా అయితే అది హేతువాద దేశం బట్ అందులోనూ ఎంతో కొంత బౌద్ధాన్ని నమ్మేవాళ్ళు ఉంటారు జపాన్ బౌద్ధ దేశమే
(1:16:56) దాని తర్వాత మీరు చూసే అన్ని కంట్రీస్ కూడా బౌద్ధం కంట్రీస్ ఇవన్నీ కూడా బర్మా దగ్గర నుంచి కొరియా దగ్గర నుంచి సౌత్ కొరియా దగ్గర నుంచి తైవాన్ దగ్గర నుంచి మీరు చూసే సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం కూడా బౌద్ధంతో నిండిపోయి ఉంది. సో శంకరాచార్యుడు మాత్రం వచ్చిన తర్వాత బౌద్ధాన్ని అన్ని రకాలుగా ఖండించి దాన్ని పాషండ మతాలలో ఒకటిగా చేసి ఎందుకంటే వేదాన్ని తిరస్కరించింది స్వ అనుభవాన్ని మాత్రమే నమ్మింది కాబట్టి ఆ బౌద్ధాన్ని కంప్లీట్ గా ఖండించి బౌద్ధం మన దేశాన్ని మొత్తం తన గుప్పెట్లోకి తీసుకుందండి ఇవాళ నుంచి 2000 సంవత్సరాల నాటికి శంకరాచార్యుడు కాళ్ళడిలో పుట్టి 36
(1:17:30) సంవత్సరాలు ఆయన బ్రతికితేనే బౌద్ధాన్ని ఈ దేశం నుంచి తరిమేసాడు ఆయన ఆయన గాని ఎందుకంటే ఆ జన్మాంతరం ప్రతి సనాతన ధర్మం అని చెప్పుకునేవాడు శంకరాచార్యుడికి ఎందుకు రుణపడి ఉండాలంటే అసల వైదీక ధర్మం గాని వేదము కానీ ఈ భరత ఖండాన్ని విడిచిపెట్టేసిన కాలం అది అంటే ఏదో మారుమూలని కుగ్రామాలలో వైదీక ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు కానీ రాజుల నుంచి మహారాజుల నుంచి చక్రవర్తుల వరకు ఇన్ఫ్లయెన్స్ చేసి ఆ అశోకుడు బౌద్ధాన్ని తీసుకున్న తర్వాత ఆ మౌర్య సామ్రాజ్యం కింద భాగాల్లోకి విస్తరించి అఖండ భారతంలో బౌద్ధం పెట్ట రేగిపోతున్న కాలం అది ఆ కాలంలో వచ్చాడు శంకరాచార్యులు ఆయన మొత్తం
(1:18:12) పాషండ మతాన్ని ఒక్క బౌద్ధాన్ని కాదు ఆయన జైనులని బౌద్ధులని ఇంకా 72 74 అవైదిక మతాలు అన్నిటిని కూడా ఆయన ఇక్కడి నుంచి తరిమేసాడుఅని చెప్తారు మరి ఆ 72 74 అవైదిక మతాలు ఏంటో మనకు తెలియదు అది శంకరమటాల వాళ్లే చెప్పాలి. సో అందుకు మనం ఆచంద్ర తారార్కం శంకరాచార్యుడికి రుణపడి ఉండాలి ఒక వైష్ణవుడైనా రుణపడి ఉండాలి ఒక స్మార్తుడైనా శంకరాచార్యులకి రుణపడి ఉండాలి.
(1:18:39) సో గౌతమ బుద్ధుడు చేసే పని ఏమిటంటే ఇలాగ వేదాన్ని వాడి జనాలను మోసం చేసి వాళ్ళ ఆత్మవంచన చేసుకుంటూ పశుబలులు ఇచ్చే వాళ్ళని డెల్యూడ్ చేయడానికి వాళ్ళని మోసం చేయడానికి అంటే ఇది ఒక మోహిని అవతారంతో మీరు పోల్చుకోవచ్చు. ఇక కొందరు విపరీతంగా ఈ హిందూ రీసెర్చ్ స్కాలర్స్ బౌద్ధుడు దీనికి వచ్చాడు కానీ ఇప్పుడున్న బౌద్ధుడు ఆ బౌద్ధుడు కాదు అతను వేరేవాడు అని చెప్తున్నారు.
(1:19:03) సో అందుకనే నేను మీకు ఉన్న ఎక్స్ప్లనేషన్ మొత్తం ఇచ్చాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు డౌట్స్ లేదు కొంచెం తీరింది ఇప్పుడు మళ్ళీ బౌద్ధం అనేది ఒక ఫ్యాషన్ అండి ఎందుకంటే మీరందరూ అర్థం చేసుకోవాలి మెటీరియలిజం అనేది పెరిగినప్పుడు రెండు సిద్ధాంతాలు బయటిక వస్తాయి ఒకటి చార్వాక సిద్ధాంతం భగవంతుడు లేడు అనే నాస్తిక సిద్ధాంతం ఇవాళ కొత్తగా కమ్యూనిస్టు వాళ్ళు వచ్చి కొత్తగా నేర్పింది ఏం లేదు ఎప్పుడో రామాయణం జరుగుతున్నప్పుడు నేను అయోధ్య కాండంలో కూడా ఒకటి చెప్పాను జాబాలి రామచంద్రమూర్తికి ఒక నాస్తిక సిద్ధాంతం చెప్పాడు నువ్వు చూసావా నాయనా పిండాలు పెడితే నీ
(1:19:37) తండ్రి వచ్చి తిన్నాడా నువ్వు ఇచ్చిన నీళ్ళు నీ తండ్రి తాగాడా అని కోపపడ్డాడు రాముడు అని చెప్పాను కదా సో ఈ ప్రపంచం మీరందరూ అర్థం చేసుకోవాల్సింది యుద్ధాలు రెండు మతాల మధ్యన జరగవు రెండు మనుషుల మధ్యన జరగవు రెండు విచారణల మధ్య జరుగుతాయి రెండు ఆలోచన విధానాల మధ్యన జరుగుతాయి రెండు సిద్ధాంతాల మధ్యన జరుగుతాయి దిస్ వరల్డ్ ఇస్ ఏ ప్లేస్ ఆఫ్ కాన్స్టంట్ ఫైట్ బిట్వీన్ టూ ఐడియాలజీస్ అండ్ ఫిలాసఫీస్ నాట్ బిట్వీన్ టు హ్యూమన్ బీయింగ్స్ సో ఈ సిద్ధాంతాల మీద ఈ ఆలోచన విధానాల మీద యుద్ధాలు చేసుకుంటారు తప్ప ఆ నిజమైన సాధకుడు ఎవడు కూడా వాడు యుద్ధం చేసే అంత
(1:20:17) టైం లేదు వాడి జీవితంలో ఎందుకంటే కాలం ముందుకు గడిచే కొద్ది కలియుగంలో ఆయువు తగ్గిపోతుంది. కాబట్టి నిజంగా ఆ రామకృష్ణుల చరణారవిందాలు పట్టుకొని వ్యాస వాల్మీకులను రెండు హృదయాలుగా చేసుకొని మీరు ఆ మంత్ర సాధన గురుముఖంగా మంత్రాన్ని తీసుకొని సాధన చేయండి జీవితం కచ్చితంగా ఉద్ధరింపబడుతుంది. కేసీ గారు ఇప్పుడు నా మూడో ప్రశ్న సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం గురించి ఎందుకంటే హిందువుల గురించి మన హిందుత్వం గురించి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను.
(1:20:49) సో మన హిందువులు ఎందుకు అంత వీక్ గా ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి గాని అట్లా ఈ కలియుగంలో మరి స్పెషల్ గా వేరే వేరే రిలిజన్స్ వాళ్ళ ధర్మాలని చాలా స్ట్రాంగ్ గా పాటిస్తారు పొద్దున్న లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా దాని గురించి ఫైట్ చేస్తారు చాలా గొప్పగా మాట్లాడతారు మన హిందువులు ఎందుకు మన ధర్మం గురించి ఇంత లైట్ తీసుకుంటాము సో మన దేవతలు ఎక్కువైపోయారనా లేకపోతే మనకు కష్టాలు ఎక్కువైనాయి అని చెప్పేసి కొంచెం డిప్రెషన్ తోని మనం పట్టించుకోమా సో ఇలాంటివి జరగడం వల్ల మన సనాతన ధర్మంలో ఇన్ని చీలికలు వచ్చాయా ఎందుకు వచ్చాయి అనే
(1:21:22) దాని గురించి నాకు కొంచెం అది కావాలి. సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు ఎందుకు మహమ్మదీయుల్లాగా క్రైస్తవుల్లాగా అన్య మతాల వాళ్ళలాగా అంత స్ట్రాంగ్ గా లేరు అనేది మీ ప్రశ్న అవును ఇది అంత ఈజీ కాదు ఇది నేను ఒక ఐదు నిమిషాలు 10 15 నిమిషాల్లో చెప్పలేను ఇది మొత్తం ఒక పాడ్కాస్ట్ చేయాలి మనం సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు సనాతన ధర్మీయులం అని చెప్పుకుంటున్న వాళ్ళు ఆచార వ్యవహారాల్లో ఎందుకు వీక్ గా ఉన్నారు ఐకమత్యంలో ఎందుకు వీక్ గా ఉన్నారు దీనికి నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా రవి అస్తమించని బ్రిటిష్ రాజ్యం అనేది విన్నారా మీరు అవును విన్నాను ఎప్పుడు అదే చెప్తుంటారు
(1:21:59) సన్ నెవర్ సెట్స్ ఆన్ ద బ్రిటిష్ ల్యాండ్ అవును బ్రిటిష్ ఎంపైర్ అవును భూమండలాన్ని అన్ని వేపుల నుంచి దోచేసుకున్నారు ఈ బ్రిటిష్ వాళ్ళు ఇది ఎందుకు వచ్చింది రవి అస్తమించని బ్రిటిష్ రాజ్యం అనే ఒకటి ఎందుకు వచ్చింది సన్ ఎవర్ సెట్స్ అనేది ఆఫ్రికాలో వాళ్లే ఇండియాలో వాళ్లే ఆస్ట్రేలియాలో వాళ్లే న్యూజిలాండ్ కూడా వాళ్లే ఉన్నట్టున్నారు అమెరికా వాళ్లే ఉన్నారు సౌత్ అమెరికా గా వాళ్ళే ఉన్నారు.
(1:22:27) సో ఎక్కడ సూర్యాస్తమం అయితే మళ్ళీ ఇంకొక బ్రిటిష్ పరిపాలిక ప్రాంతంలో ఇంకో సూర్యోదయం జరుగుద్ది. మళ్ళీ ఎక్కడ సూర్యోదయం జరిగితే ఇంకొక చోట సూర్యాస్తమయం జరుగుద్ది. సో సూర్యుడు మొత్తం బ్రిటిష్ ఎంపైర్ లో ఎప్పుడు కూడా అస్తమించడు ప్రతి చోట సూర్యుడు ఉంటాడు అనేది వాళ్ళు పెట్టుకున్నారు కదా ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమిటి? [నవ్వు] కేవలం ఒక 75 80 సంవత్సరాల కిందట ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమిటి చాలా వీక్ అయిపోలా బ్రిటిష్ వాళ్ళు వీక్ అయిపోయారు అన్ని రకాలుగా నష్టపోలా బ్రిటిష్ వాళ్ళు నష్టపోయారు అవునా ఇదే మనఇద్దరం ఒక 80 సంవత్సరాల కిందట మాట్లాడుకుంటే ఒకరోజు
(1:23:09) బ్రిటిష్ కాకుండా అమెరికా భూమండలాన్ని మొత్తం శాసిస్తుంది అని మీరు అనుకున్నారా? అనుకోలేదు. అనుకోలేదుగా మనఇద్దరం కాలంలో వెనక్కి వెళ్దాం ఒక 75 సంవత్సరాల వెనక్కి వెళ్లి మనం మాట్లాడుకున్నట్లయితే మన కలలో అయినా బ్రిటిష్ వాడిని తలదన్నే ఇంకొకడు వస్తాడు అని మనం అనుకోలేంు కదా అనుకోలేదు ఇంకొక 30 సంవత్సరాల తర్వాత ఎవరు ఆధిపత్యం కొనసాగిస్తారో ఎవరికీ తెలియదు కదా ఈ రష్యానో రావచ్చు చైనాను రావచ్చు లేకపోతే బ్రెజిల్లో రావచ్చు లేకపోతే ఇవన్నీ ఒకటయ్యి బ్రిక్స్ అనే ఒక దేశం కింద ఫామ్ అయ్యి మనమే రూలే చేయొచ్చు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి
(1:23:48) మీరు అడిగిన ప్రశ్నలో ఏంటంటే సనాతన ధర్మం ఎందుకు వీక్ అయింది అంటే ఈ కాలగర్భంలో ఈ కాల చక్రంలో పైకి కిందకి మారుతా ఉంటాయి పొజిషన్స్ ఒకప్పుడు బ్రిటిష్ వాడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు ఇవాళ బ్రిటిష్ వాడు చాలా అదో స్థితికి వెళ్ళిపోయాడు. అసలు ఒక భారతీయుడు బ్రిటిష్ ని పరిపాలిస్తాడని మీరు కలలోనా ఊవించారా [నవ్వు] అప్పుడు కూడా వాళ్ళు రావడం కారణం కూడా మన వాళ్లే వీక్ గా ఉండడం వల్లనే కదా వాళ్ళు కూడా వచ్చింది.
(1:24:19) సో అసలు ఇదంతా నేను ఇప్పుడు చెప్పాలంటే ఇదఒక చిన్న పాడ్కాస్ట్ సరిపోదు కాబట్టి సనాతన ధర్మం వీక్ అయిందా సనాతన ధర్మీయులు అని చెప్పుకునే వాళ్ళు వీక్ అయ్యారా అని మీరు అడిగిన ప్రశ్నకి నేను ఒక ఎలాబరేట్ ఒక పాడ్కాస్ట్ చేస్తా సో సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు కాలం ఒకలా ఉండదు. కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటున్న ధర్మం కిందకు వెళ్ళింది అని మనం అనుకుంటాం.
(1:24:44) కొన్ని కొన్నిసార్లు అది సూర్యుడు లాగా ప్రకాశిస్తూ ఉంటుంది అది జస్ట్ కాలం ఇదంతా ఒక కాల నిర్ణయం ఇది సో కొన్ని కొన్నిసార్లు మనమే పైన ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనం కిందకు వెళ్ళినట్టు కనబడతాం సో నేను ఏంటంటే సనాతన ధర్మం కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే సనాతన ధర్మం ఇప్పుడు మళ్ళీ లేచింది అవును మీలాంటి వాళ్ళ వల్లనే లేచింది లేదు లేదు లేదు నాలాంటి వాళ్ళ వల్ల అస్సలు కాదు అది నేను కచ్చితంగా దీని క్రెడిట్ ఏంటంటే మోదీ గారు 2014 లో ప్రధాని అయిన తర్వాత నుంచి నుంచి నేను చూస్తుంది ఏంటంటే ఆయన నిజంగా 2014 లో ప్రధాని అయితే సనాతన ధర్మం మళ్ళీ రివైవ్ అవుతుదని నేను కలలో
(1:25:19) కూడా ఊయించలేదు. అంటే ఏదో కాంగ్రెస్ పరిపాలిస్తుంది దాని తర్వాత జనాలకు ఆ స్కాములు గేములు చూసి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది కదా భారతదేశాన్ని ఇంకేదన్నా ప్రత్యామనాయ ప్రభుత్వం రావాలని బిజేపీకి ఓటు వేశారు మోదీ గారు అయ్యారని అనుకున్నాను తప్ప ఐదు సంవత్సరాలు మోదీ పాలన తర్వాతనే సనాతన ధర్మానికి రెక్కలు వచ్చాయి అసలు అలా అవుతదని నేను ఊహించలేదు మీరు ఊహించారా ఎప్పుడైనా లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఓపెన్ గా ఏం చెప్పుకోలేదు కదా ఆయన గుళ్ళు గోపురాలకు వెళ్ళాడు యోగా అది చేస్తాడు ఆయన ఒక సనాతన ధర్మీయుడు ప్రాక్టీసింగ్ సనాతన ధర్మీయుడు
(1:25:54) ఆయన అంటే ఆచరిస్తూ ఆయన గురువుల దగ్గర మంత్రాలు అవి తీసుకున్నాడు జపతపాలు అవి చేస్తాడట సో ఇక్కడ ఇది పాలిటిక్స్ గురించి నేను మాట్లాడట్లే పాలిటిక్స్ కి నాకు సంబంధం లేదు నేను కేవలం చెప్తుంది ఏంటంటే మళ్ళీ అది సనాతన ధర్మం అనేది మళ్ళీ ఒక రిసర్జెన్స్ మళ్ళీ దానికి గాలి తన వైపుకు వీస్తున్నట్టుగా మనకు కనబడుతుంది మన ధర్మంలో లేనిది వాళ్ళ ధర్మంలో ఏముంది ఎందుకు మనం అటువైపు చూస్తున్నాం అటువైపు మనం ఏం చూడట్లేదే ఎందుకు ఇప్పుడు ఇప్పుడు దర్గాలకు వెళ్తున్నారు ప్లస్ క్రిస్టియన్స్ అన్న దానికి చర్చిలకు వెళ్తారు సెక్యులరిజం ముసుకులో ఉండేసి మనం ఏమేమో చేస్తున్నాము
(1:26:26) చాలా రోజులు ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి అవన్నీ మైనారిటీ రిలీజియన్స్ అంటే ఇవాల్టికి వాళ్ళ సంఖ్య తక్కువ అనే చెప్పుకోవాలి కదా సో మనకేమి ఈ ఇస్లామో ఫోబియా క్రిస్టియన్ ఫోబియా ఉండాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళు ఏమిటి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు ఇప్పుడు పాలు మన ఇంటికి వస్తే పాలను మరిగించి మనం దాన్ని దగ్గ దగ్గరికి తీసుకురావాలి అంటే కాన్సంట్రేటెడ్ గా అలాగా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి సనాతన ధర్మము యొక్క వైశిష్టత ప్రాముఖ్యత అన్ని రకాలుగా లోతుగా వాళ్ళకు రామాయణ మహాభారత భాగవతాలన్నీ చెప్పి వాళ్ళకు గురుముఖంగా ఒక మంత్రాన్ని ఇచ్చి
(1:27:06) వాళ్ళు అనుష్టిస్తే వాళ్ళు అసలు మన ధర్మాన్ని వదిలేసి ఎందుకు వెళ్తారు అది ఎక్కడ లోపం జరుగుతుంది అందుకే అదే అంటే ఇప్పుడు మళ్ళీ కాలం కలిసి వచ్చింది కాబట్టి మళ్ళీ జనాలు అర్థం చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు మీ వయసు ఎంత 43 మీకు 22వ ఏట మీకు మహాభారతం అర్థమయిందా లేదు లేదు అసలు మహాభారతంలో మీకు ఏమన్నా తెలుసా ఎక్కువ తెలీదు రామాయణంలో ఏదో పై పైన రాముడు సీత వనవాసానికి వెళ్ళారు రావణుడు వచ్చాడు తీసుకెళ్ళాడు రాముడు చంపి సీతను తెచ్చుకున్నాడు ఇంతేగా తెలుసు ఈ ఎపిసోడ్ లో చూసిన తర్వాత తెలిసింది నాకు నా ఎపిసోడ్ లో కాదండి చాలా చోట్ల మీరు ఒకటి అర్థం చేసుకోవాలి తెలుగు తమిళం కన్నడ
(1:27:40) మరాఠి అని భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ సనాతన ధర్మం గురించి చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు గడిచిన 10 15 సంవత్సరాల్లో అందులోనూ మీరు చూస్తే కన్వర్షన్ రేట్ ఏమి ఉత్తర భారతంలో లేదే మనకంటే ఎక్కువ పేదరికం ఉత్తర భారతంలో ఉందా అవుంది ఆ యూపీ ఆ బీహారు ఆ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ జార్ఖండ్ ఇట్లాంటి చోట్లు ఉన్నాయి కదా ఇక్కడక్కడ తక్కువ ఉంది కానీ కన్వర్షన్ రేట్ అక్కడ ఏం లేదే ఇక్కడ ఎక్కువ ఉంది సో దక్షిణ ఎందుకంటే మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది దీనికి అందుకే చెప్పాను ఇది మీరు నన్ను క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేలా చేస్తున్నారు ఇదఒక పెద్ద
(1:28:13) పాడ్కాస్ట్ ఇది ఇది మనం డీటెయిల్డ్ గా మాట్లాడదాం కానీ మీరందరూ భయపడొద్దు ఏంటంటే సనాతన ధర్మం వీక్ గా ఉంది సనాతన ధర్మం ఎక్కడికో వెళ్ళిపోతుందని ఏమ అనద్దు నాకు అర్థమైనంతవరకు ఒక మంచి కాలం వచ్చింది. దానికి మోదీ గారు ఒక కారణమో కారణం కాదో కూడా నేను చెప్పదలుచుకోలేదు కానీ బట్ డెఫినెట్లీ ఒక ఆయన పరిపాలించిన తర్వాతనే ఈ సనాతన ధర్మానికి రెక్కలు వచ్చాయి.
(1:28:40) మనలో కొంచెం ఐకమత్యత అనేది వచ్చింది. సో ప్లస్ అసల ఐకమత్యం కంటే కూడా అసలు నేను పుట్టిన ధర్మం లోపల మూలాలు ఏమిటి నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి ఇది కర్మభూమి కర్మ సిద్ధాంతం అనేది కేవలం సనాతన ధర్మం మాత్రమే చెప్పగలదు. ఒక వ్యక్తి ఎందుకు కఠిన దరిద్రంలో పుట్టాడు ఒక వ్యక్తి ఎందుకు అంబానీ కుటుంబంలో పుట్టాడు అనేది వేరే మతాలు దాంట్లో ఆన్సర్ కాదు కదా దాంట్లో వేలు కూడా పెట్టలేవు వాళ్ళకు ఒకటే జన్మ ఒకటే మరణం మనకు జన్మ జన్మలు ఉంటాయి జన్మల తర్వాత జన్మలు జన్మల తర్వాత జన్మలు కర్మ కొద్ది జన్మలు ఉంటాయి కర్మనుబంధిని మనుష్యలోకే సో మన మూలాలు మనం అర్థం
(1:29:24) చేసుకొని జనాలలోకి తీసుకువెళ్తే అసలు మనకి ఆ బాధ భయం రెండు అక్కర్లేదు ఇవాళ ఈ కన్వర్ట్ అవుతున్న వాళ్ళు కూడా పాపం వాళ్ళకు తెలియక వాళ్ళు ఎమోషనల్ గా వాళ్ళకి ఎక్కడ ఆన్సర్లు దొరక్క ఎవరో ఒక పాస్టర్ ఎవరో వేరేవాళ్ళు వచ్చి వాళ్ళని ఏదో నమ్ముకోమంటే వాళ్ళకున్న కష్టాలు పోతాయేమో అని చెప్పి ఆ మతంలోకి వెళ్లి అక్కడ మళ్ళీ వాళ్ళు పాట్లు వాళ్ళు పడి దశమ భాగాలు ఇచ్చి వాళ్ళ చేత మోసగింపబడి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను సో దీని గురించి మనం ఇబ్బంది ఏమి పడక్కర్లేదండి ఎందుకంటే సనాతన ధర్మంలో ఒక మనిషి మనిషికి మానసిక పరిపక్వత అనేది చాలా
(1:30:00) అవసరం నా రిక్వెస్ట్ ఏంటంటే ముందు సనాతన ధర్మంలో పుట్టిన ప్రతివాడు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఆస్తులు ఇస్తున్నారా ఆస్తుల కంటే ముఖ్యం ఏమిటంటే వాళ్ళక ఒక ఐడెంటిటీని ఇవ్వండి మనం పుట్టిన ఈ భారత ఖండం మనం పుట్టిన ఈ భారతదేశం అసలు ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ ఖండానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి ఇక్కడ ఒక కర్మభూమి అంటున్నాం ఈ కర్మ అంటే ఏమిటి అసలు మోక్షం అంటే ఏమిటి రామాయణం అంటే ఏమిటి మహాభారతం అంటే ఏమిటి భాగవతం అంటే ఏమిటో మనది మనం తెలుసుకోగలిగితే నేను ఒకటి మనం ఒక చిన్న గీతని చిన్నదిగా చూపించాలి అంటే ఆ గీతని
(1:30:38) తుడపక్కర్లేదు పక్కన ఒక పెద్ద గీతని వేస్తే ఇది చిన్నగా కనబడుతుంది. మనది ఆల్రెడీ పెద్ద గీతే మన దగ్గర దొరకని ఆన్సర్ లేదు సో అష్టాదశ పురాణాలు నాలుగు వేదాలు 108 ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంత అక్కర్లేకపోయినా కేవలం రామాయణ మహాభారత భాగవత గ్రంథాలు భగవద్గీత మహాభారతంలో అంతర్భాగం సో ఇవి తెలుసుకోగలిగితే మన సనాతన ధర్మంలో ఉన్నవాడు వేరే మతాల వైపు చూడనే చూడడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ప్రచారం చేయం అదొకటి పెద్దది ఉంది మీరు అది గమనించాలి సనాతన ధర్మం ప్రచారాన్ని బిలీవ్ చేయదు కన్వర్షన్స్ అనేది సనాతన ధర్మంలో ఉండవు కన్విన్సింగ్ అనేదే ఉంటది కన్విక్షన్
(1:31:19) అనేదే ఉంటది సో వాడంతటి వాడి మనస్ఫూర్తిగా దీనికి రావాలే తప్ప మనం ఎవరిని వచ్చి ఒక రాముణని కృష్ణుడిని శివుడిని నమ్ముకోమని మనం చెప్పం కానీ అన్నిటికి ఆన్సర్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మంచి కాలం వచ్చింది ఈ కాలంలో మనం అందరం తెలుసుకొని సనాతన ధర్మం అంటే ఏమిటో ఒక పొలిటికల్ ఎజెండా కాదు ఈ సనాతన ధర్మం అనేది నాకు తెలిసినంత వరకు కు మోదీ గారిని ఏదో నేను కలిశాననో లేకపోతే మోదీ గారు అంటే నాకు ఇష్టమనో చాలామంది కామెంట్లలో పెట్టారు ఇష్టం అనేది కాదండి ప్రత్యామనాయం లేదు అని నేను అనుకుంటున్నాను అది నా యొక్క ఆలోచన ప్లస్ ఆయన వచ్చిన తర్వాతే సనాతన ధర్మము హిందూ
(1:31:57) అస్తిత్వము సనాతన ధర్మ అస్తిత్వం ప్రపంచ దేశాలలో 140 కోట్లలో మరి ఎంతమంది ఒక 80 కోట్ల మంది హిందువులు ఉన్నారో 90 కోట్ల మంది హిందువులు ఉన్నారు సో ఒక 100 కోట్ల మంది ఉన్నారుహింద హిందూ వాళ్ళు అధికంగా ఉన్న దేశం ఏదైనా ఉంటే అది ఇది ఒక్కటేనండి ప్లస్ ఇక్కడ ఎన్ని దేశాల మీద ఆక్రమణలు చేసి ఈ మొహమ్మదీయులు దేశాలను దేశాలను మార్చేశారు ఒక ఇండోనేషియాను మార్చారు ఇంకాలా ఎన్ని దేశాలను మార్చారు బ్రూనై దగ్గర నుంచి రీసెంట్లీ కొత్తగా ఉంది మలేషియా కూడా ఆ మలేషియా కూడా ఇస్లామిక్ కంట్రీ అయింది రీసెంట్లీ ఇచ్చారు అది కూడా ఆ మన దేశాన్ని మార్చగలిగారా 60700
(1:32:37) మొహమ్మదీయ పాలన 253 300 సంవత్సరాల బ్రిటిష్ పాలన గడిచిన 900 1000 సంవత్సరాలు మనం బానిసల్లాగా అన్య మతాల కింద బ్రతికిన దేశం కాబట్టి కొంచెం ఓపిక పట్టండి మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది 1000 సంవత్సరాలుగా గాయపడింది. ఒక బంగారు చిలక ఈ వరదండం ఈ వరదగండాన్ని దోచుకుంటానికి 1000 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ దాని యొక్క పునస్థాపన జరగాలి అది ఖచ్చితంగా జరుగుతుంది అనేది నా యొక్క ఆత్మవిశ్వాసం ఎందుకంటే దేశంలో గాని ప్రపంచంలో ఉన్న ఏ సమస్యకైనా ఆన్సర్ సనాతన ధర్మంలో దొరుకుతుంది మన అస్తిత్వం మళ్ళీ నిలబడుతుంది అందులోనూ మనకు ఒక వ్యక్తిత్వం
(1:33:21) వస్తుంది ఈ భారత ఖండంలో పుట్టిన వాడికి మళ్ళీ ఒక కొత్త వ్యక్తిత్వం వస్తుంది వాడికి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంది ఇవాళ బానిసల్లాగా బ్రతికాం కదండీ ఆ బానిస బ్రతుకుల నుంచి కొంచెం బయటికి రావటానికి రెండు మూడు తరాలు పడతాయి కానీ వస్తాం ఖచ్చితంగా సో ఎందుకంటే మన పూర్వీకులు 1000 సంవత్సరాల బానిసత్వాన్ని చూశారు ఈ దేశంలో కాబట్టి ఏమి పర్వాలేదు సనాతన ధర్మం ముందుకు వెళ్తుంది ఇంకా చాలా చాలామంది సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి నేను అందరూ ప్రేక్షకులకు మీకు కూడా చెప్పగలిగింది ఏంటంటే మహాభారత రామాయణ భాగవత భగవద్గీతలను పట్టుకోండి పరమాత్మ
(1:33:57) మిమ్మల్ని కచ్చితంగా కాపాడతాడు సనాతన ధర్మం అలా నిలబడుతుంది. సో సనాతన ధర్మం ఇస్ ఆల్ అబౌట్ క్వాలిటీ నాట్ క్వాంటిటీ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమః సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరిహి ఓం [సంగీతం]
No comments:
Post a Comment