Wednesday, June 24, 2026

ఇంద్రియ నిగ్రహం gurinchi manu dharma shastram

మనుస్మృతి మనుధర్మ శాస్త్రం 

'ఇలాంటి భోజనమే మనకెప్పుడూ లభించునుగాక" అని స్తోత్రము చేయాలి. అలా స్తుతించి చేసిన భోజనము శక్తినిస్తుంది. అలా స్తుతించకుండా భోంచేస్తే శక్తి నశిస్తుంది.

ఎంగిలి అన్నం ఎవ్వరికీ పెట్టకూడదు. మధ్యాహ్నం, రాత్రి తప్ప మధ్య మధ్య భోం చేయకూడదు. ఎంగిలి చేతితో అటు, ఇటు తిరగకూడదు. మితిమీరి భోజనము చేయకూడదు. మితిమీరి భోంచేయడం అనారోగ్యహేతువు. ఆయు స్సును నశింపజేస్తుంది. స్వర్గాది పుణ్యలోకాలకు, పుణ్యకార్యాలకు విరోధి. బ్రాహ్మ ణాదులు బ్రహ్మతీర్థంతో, దైవ తీర్థంతో ఆచమనం చేయాలి, పితృతీర్థంతో ఎప్పుడూ ఆచమనం చేయకూడదు.

బొటనవ్రేలి యొక్క మొదటిభాగాన బ్రాహ్మ తీర్థమున్నదనియు, చిటికిన వ్రేలి మొదటియందు కాయతీర్థమున్నదనియు, వ్రేళ్ళ కొనలయందు దైవతీర్థమున్న దనియు, తర్జన్యంగుష్ఠముల మధ్యమున పితృ తీర్థం వున్నదని చెబుతారు.

స్త్రీలకు వివాహమే ఉపనయన కర్మ, భర్తకు సేవలు చేయడమే గురుకుల వాసము, గృహకృత్య నిర్వహణమే అగ్నిహోత్రము.

గురువు శిష్యునికి ఉపనయనము గావించి మొదట శౌచమును, ఆచారాన్ని అగ్నిహోత్ర, సంధ్యోపాసనములను నేర్పాలి.

ప్రతి రోజూ వేదాధ్యయనం ప్రారంభించేముందు, ముగించేముందు గురువు పాదాలను చేర్చి పట్టుకోవాలి. అధ్యయనం చేసేటప్పుడు చేతులు కట్టుకోవాలి. అలా చేతులు చేర్చడాన్ని బ్రహ్మాంజలి అంటారు.

వేదాధ్యయనం ప్రారంభించేముందు ప్రతిసారీ ఓంకారము నుచ్చరించాలి.

అలా చేయకపోతే చదివింది క్రమంగా మర్చిపోతారు. వేదాధ్యయనం ముగించే ప్రతిసారి ఓం కారము ఉచ్చరించకపోతే చదివినది మనసులో నిలవదు.

బ్రాహ్మణుడు సంధ్యా సమయంలో, తక్కిన వేళల్లో రోజుకు వెయ్యిసార్లు గాయత్రిని జపిస్తే ఒక్క నెల రోజులలో పాము కుబుసం విడిచినట్లు సర్వపాపాల నుంచి విముక్తుడవుతాడు.

రోజూ గాయత్రి జపించని, హోమం చేయనివారు సజ్జనులలో నిందా పాత్రు లవుతారు.

ఓం అనే ఒక్క అక్షరమే బ్రహ్మము. ప్రాణాయామములే గొప్ప తపస్సు. గాయత్రిని మించిన మంత్రము లేదు. మౌనము కంటే సత్యము చెప్పుట మేలు.

చెవి, ముక్కు, నాలుక, కళ్ళు, చర్మము ఇవి అయిదు జ్ఞానేంద్రియాలు.
వాక్కు, కాళ్ళు, చేతులు, అపానము, ఉపస్థము ఇవి ఐదు కర్మేంద్రియాలు, మనసు పదకొండవ ఇంద్రియము. మనసు తన కార్యమునుబట్టి జ్ఞానేంద్రియంగాను, కర్మను బట్టి కర్మేంద్రియంగానూ అవుతుంది. మననును జయించిన వాడు జ్ఞాన, కర్మేంద్రియా లను రెంటినీ జయించినవాడు.

మనస్సు చెప్పినట్లు ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం పాటించాలి. ఇంద్రియలోలురు ఇహలోకమున కష్టమును, పరలోకమున పాపమును పొందుదురు. ఇంద్రియములను అదుపులో పెడితే మోక్షసిద్ధి కలుగు తుంది, కాబట్టి ఇంద్రియాలను జయించాలి.

ఇంద్రియ సుఖాలను అనుభవించడంలో ఎప్పటికీ తనివితీరదు. అగ్ని వ్యాపించి నట్టు, కోరికలు తీర్చుకునే కొద్దీ హెచ్చవుతుంటాయి. కోరికలను ఉపేక్షించడం, కోరికలను విడవడం ఉత్తమం. చెడుమనను గలవాడు వేదాలను ఆధ్యయనం చేసినా దానాలు చేసినా, యజ్ఞాలు చేసినా, తపస్సులు చేసినా ప్రయోజనంలేదు. ఏ మనిషి సుఖాలకు  సంతోషింపడో, కష్టాలకు దుఃఖపడడో అతడే జితేంద్రియుడు

ఇంద్రియాలన్నింటిలో ఏ ఒక్క ఇంద్రియలోలత్వం పున్నా, అతని జ్ఞానం కుండకున్న చిన్న రంధ్రం ద్వారా నీరంతా కారిపోయినట్లు నశిస్తుంది.

కాబట్టి ఇంద్రియాలను లోబరచుకొని, మనసును గట్టిపరచుకుని, ఉపాయంతో దేహాన్ని బాధ పెట్టక సకలార్థాలను సాధించాలి. అలా సాధించిన పిదప అతడు క్రమంగా ఆ దేహాన్ని వదలాలి.

ప్రతి రోజూ ఉదయాన సూర్యోదయమయ్యేవరకు గాయత్రీ మంత్రాన్ని నిలబడి జపించాలి. సాయంత్రం నక్షత్రాలు కనిపించేంతవరకు కూర్చుని గాయత్రిని జపించాలి. ఉదయం పూట గాయత్రిజపం చేసి రాత్రి చేసిన (పాపాలను పోగొట్టు కుని, సాయంత్రం గాయత్రి జపంచేసి) పగలు చేసిన పాపాలను పోగొట్టుకోవాలి.

ఎవరు ఉభయ సంధ్యలను ఉపాసింపరో అట్టి వారిని శూద్రుని బహిష్క రించినట్టు అన్ని బ్రాహ్మణ కర్మలనుంచి బహిష్కరించాలి.

గురుపుత్రుడు బంధువు, సేవ చేయువాడు, మరో విద్య నేర్పువాడు, పరి శుద్దుడు, చెప్పింది గ్రహించి గుర్తుంచుకునే సమర్థుడు, మేలు కోరేవాడు, వీళ్ళకు దక్షిణ తీసుకోకుండా చదువు చెప్పాలి.

తనను అడగకపోతే ఎవరికీ ఏమీ చెప్పకూడదు. భక్తి శ్రద్దలు లేకుండా అడిగిన వాడికి ఏమీ చెప్పమాడదు. బుద్ధిమంతుడయినవాడు తనకు అన్నీ తెలిసి వున్నా మూగవాడిలా మౌనంగా వుండాలి.


Content captured from  page: https://archive.org/details/20260623_20260623_1319/page/12/mode/1up page 12, page 13

మనుస్మృతి మనుధర్మ శాస్త్రం  Pdf download link archive.org book link

Maro మనుధర్మ శాస్త్రం pdf ebook with sloka and tatparyam lo archive.org book link


No comments:

Post a Comment