Wednesday, August 19, 2026

Modern Panchatantram-1: ఆఫీస్ పాలిటిక్స్ & మన చుట్టూ నక్కలు | Pamidikalva Madhusudan

Modern Panchatantram-1: ఆఫీస్ పాలిటిక్స్ & మన చుట్టూ నక్కలు | Pamidikalva Madhusudan

Author Name:Dhatri TV

Youtube Channel Url:https://www.youtube.com/@dhatritvtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zBph6_3oNrw



Transcript:
(00:00) బిబిజి వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబలిగా ఎదుగుతున్న బేవల్లి హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. [సంగీతం] [సంగీతం] సమాజం మారింది. టెక్నాలజీ మారింది. వేషభాషలు కూడా మారాయి. కానీ మానవ స్వభావం మనస్తత్వం ఆఫీస్ పాలిటిక్స్ అసూయలు కుట్రలు మాత్రం వేల ఏళ్లుుగా అలాగే ఉన్నాయి.
(00:38) మనుషుల నమ్మకాన్ని దెబ్బతీసి మిత్రుల మధ్య చిచ్చుపెట్టే ప్రక్రియనే పంచతంత్రంలో మిత్రభేదం అన్నారు. ధాత్రి టీవీ అందిస్తున్న ఈ మోడరన్ పంచతంత్రం మొదటి ఎపిసోడ్ లో మూడు అంశాలు ఉన్నాయి. మొదటి భాగంలో విష్ణు శర్మ పంచతంత్ర గ్రంథాన్ని ఎలా సృష్టించాడో రాజనీతిని కథల రూపంలో నేర్పడం వెనుక ఉన్న తర్కాన్ని చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా వందల భాషల్లోకి అనువాదమైన ఈ మహా గ్రంథం కేవలం పిల్లల కథల పుస్తకం కాదు అది నేటి యుగానికి పర్ఫెక్ట్ లీడర్షిప్ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ గైడ్ మనకు వచ్చే సమాచారాన్ని అంటే డేటాను ఎలా ఆడిట్ చేయాలి
(01:24) ఫాక్ట్ చెక్ ఎలా చేయాలి అన్న ప్రాథమిక సూత్రాన్ని తెలుసుకుంటాం. రెండో భాగంలో సింహమైన పింగళకుడు ఎద్దైన సంజీవకుడి కథ ద్వారా బిజినెస్ పార్ట్నర్షిప్ల రహస్యం అర్థమవుతుంది. విజన్ రిస్క్ తీసుకునే ధైర్యం ఉన్న సఈఓ సింహం ఆపరేషన్స్ క్రమశిక్షణ స్థిరత్వం తెచ్చే సీఓ ఎద్దు కలిస్తేనే విజయవంతమైన కంపెనీలు లేదా ఆర్గనైజేషన్లు తయారవుతాయి.
(01:54) ఒకే రకమైన ఆలోచనలు ఉన్నవారి కంటే విరుద్ధమైన నైపుణ్యాలు ఉండి పరస్పర గౌరవం కలిగిన వ్యక్తుల బంధమే అత్యంత బలమైనది. మూడో భాగంలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. సింహం ఎద్దుల బలమైన స్నేహాన్ని చూసి ఊర్వలేని దమనకుడనే మిడిల్ లెవెల్ నక్క రంగంలోకి దిగుతుంది. సొంతంగా పని చేసే సామర్థ్యం లేక కేవలం బాస్ దగ్గర భజన చేస్తూ ఇద్దరి మధ్య అబద్ధాలు చెప్తూ ఇన్ఫర్మేషన్ గ్యాప్ క్రియేట్ చేసే కార్పొరేట్ నక్కలను ఎలా గుర్తుపట్టాలో తెలుసుకుంటాం.
(02:30) ఈ మూడు భాగాలు కలిపి చెప్పే ఒకే ఒక్క సత్యం ఏమిటంటే శక్తివంతమైన పార్ట్నర్షిప్లను బిల్డ్ చేయడం ఎంత ముఖ్యమో ఆ పార్ట్నర్షిప్ల మధ్య విషం చిమ్మే నక్కల్ లాంటి వ్యక్తులను గుర్తించి దూరం పెట్టడం కూడా అంతే ముఖ్యం. పదండి ఆనాటి పంచతంత్రం పాత్రలను ఇప్పుడు మన మధ్య వెతుక్కుందాం. అసలు విషయంలోకి వెళ్ళే ముందు ధాత్రి టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Facebookఇస్గ ఎక్స్ లో ధాత్రిని ఫాలో అవ్వండి మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి.
(03:11) [సంగీతం] మీ ఆఫీస్ లో లేదా మీ టీంలో ఎవరైనా కావాలని సగం నిజాలు సగం అబద్ధాలు చెప్తూ పాలిటిక్స్ చేస్తున్నారా మీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నట్టుండి మీకు ఎందుకు దూరమయ్యాడో అర్థం కావట్లేదా ఏళ్ల తరబడి సాగిన బిజినెస్ పార్ట్నర్షిప్లు ఉన్న పళళంగా ఎందుకు కూలిపోతున్నాయి. 2000 ఏళ్ల క్రితం అడవిలో జంతువుల మధ్య జరిగిన కథలు నేడు మన కార్పొరేట్ ఆఫీసుల్లో స్టార్టప్ుల్లో పొలిటికల్ సర్కిల్స్ లో చివరికి సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా సరిగ్గా అలాగే జరుగుతున్నాయి.
(03:44) అవును టెక్నాలజీ మారింది ఆఫీస్ వాతావరణం మారింది కానీ మనుషుల ప్రవర్తన కుట్రలు ఈర్షలు వ్యూహాలు మాత్రం అస్సలు మారలేదు. మనుషుల మనస్తత్వాలను రాజనీతిని వివరించే మహా గ్రంథం పంచతంత్రం దీని మూలకర్త విష్ణు శర్మ కథ ప్రకారం మహిళారోప్యం అనే రాజ్యాన్నిలే అమరశక్తి మహారాజుకు ముగ్గురు కొడుకులు వాళ్ళు చదువు మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టని అజ్ఞానులు రాజనీతి నేర్పడానికి ఎందరో పండితులు ప్రయత్నించి ఓడిపోతారు.
(04:19) అప్పుడు 80 ఏళ్ల వయోవృద్ధుడైన విష్ణు శర్మ రంగంలోకి దిగుతాడు. ఆయన పొడి పొడి సూత్రాలు క్లిష్టమైన వ్యాకరణాలు చెప్పలేదు. కేవలం జంతువుల పాత్రలతో అద్భుతమైన కథలు చెప్పడం ప్రారంభించాడు. కేవలం ఆరు నెలల్లో ఆ రాజు కొడుకులను అత్యంత సమర్థులైన వ్యూహకర్తలుగా పాలకులుగా తీర్చిదిద్దాడు. అలా పుట్టుకొచ్చిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకమే ఈ పంచతంత్రం.
(04:49) పంచతంత్రం కేవలం పిల్లల కథల పుస్తకం కాదు అది భారతీయ జీవిత విధానాన్ని సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలను తీర్చిదిద్దిన ఒక మహా నీతిశాస్త్రం ప్రపంచంలోనే అత్యధిక భాషల్లోకి అనువాదమైన భారతీయ సాహిత్యం పంచతంత్రం సంస్కృతంలో పుట్టిన ఈ గ్రంథం తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ బెంగాళీ మరాఠి గుజరాతి ఒరిస్సా అస్సామీ పంజాబీ కాశ్మీరి ఇలా ప్రతి భారతీయ భాష లోకి అనువాదం అయింది.
(05:22) సాధారణ శకం 570లోనే పహ్లావి అంటే పాత పర్షియన్ భాషలోకి ఆ తర్వాత అరబిక్ గ్రీక్ లాటిన్ ఇంగ్లీషులతో పాటు ప్రపంచవ్యాప్తంగా 50 కి పైగా భాషల్లో 200 రకాల వెర్షన్లుగా విస్తరించింది. ఈ డిజిటల్ యుగంలో పంచతంత్ర పుస్తకం మనకెందుకు అవసరం ఒకటి ఇన్ఫర్మేషన్ ఆడిటింగ్ మన దగ్గరికి వచ్చే ప్రతి వార్త లేదా సమాచారం నిజమేనా దాన్ని ఎవరు ఏ ఉద్దేశంతో మనకు చెప్తున్నారు అన్న ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాచీన కాలంలోనే విష్ణు శర్మ నేర్పాడు.
(05:59) రెండోది టాక్సిక్ మనుషులను గుర్తించడం మన పక్కనే ఉంటూ ముఖంపై నవ్వుతూనే గోతులు తవ్వే వ్యక్తులను సులువుగా పసిగట్టొచ్చు. మూడోది లీడర్షిప్ నెగోషియేషన్ ఒక ప్రాజెక్ట్ ను ఎలా డీల్ చేయాలి సంక్షోభంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈ కథలు నేర్పుతాయి. సిరీస్ మొదటి భాగమైన మిత్రభేదం ప్రాధాన్యం ఇక్కడే ఉంది. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య థర్డ్ పార్టీ వచ్చి చిచ్చు పెట్టడం ఎలా జరుగుతుందో విష్ణు శర్మ ఎప్పుడో చెప్పాడు.
(06:28) మన చుట్టూ ఉన్న కన్నింగ్ వ్యక్తులను ఎలా గుర్తుపట్టాలి మన దగ్గరికి వచ్చే ఇన్ఫర్మేషన్ను ఎలా ఆడిట్ చేయాలి ఒక మూడో వ్యక్తి ఇద్దరి మధ్య నమ్మకాన్ని దెబ్బతీయకుండా ఎలా కాపాడుకోవాలి ఈ ప్రశ్నలన్నిటికీ ప్రాక్టికల్ లైఫ్ స్టైల్ సమాధానమే ఈ మొదటి సీజన్ ఈ సిరీస్ లో మనం సంస్కృత శ్లోకాలను బట్టి పట్టబోవడం లేదు. ప్రాచీన నీతి సూత్రాలను ఆధునిక వర్కింగ్ కల్చర్ కు అప్లై చేస్తూ కథలను విశ్లేషించుకోబోతున్నాం.
(06:56) సింహం లాంటి లీడర్ ఎద్దు లాంటి నిజాయితీ గల ఉద్యోగి నక్కలాంటి కన్నింగ్ నెగోషియేటర్ మీ ఆఫీస్ లో మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎక్కడున్నారో ఇప్పుడు మీరు చాలా సులువుగా గుర్తుపట్టొచ్చు సిద్ధంగా ఉన్నారా మనుషులను స్పష్టంగా చదవడం నేర్చుకుందాం నమ్మకాన్ని కాపాడుకుందాం. [సంగీతం] మీ డ్రీమ్ బిజినెస్ పార్ట్నర్ ఎలా ఉండాలి సరిగ్గా మీలాగే ఆలోచించే వ్యక్తిగా ఉండాలా లేక మీకు లేని నైపుణ్యాలు ఉన్న వ్యక్తిగా ఉండాలా వ్యాపార ప్రపంచంలో ఒక పెద్ద అపోహ ఉంది.
(07:35) ఒకే రకమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు కలిస్తే వ్యాపారం వేగంగా పరిగెడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. గొప్ప బిజినెస్ సామ్రాజ్యాలు ఒకే రకం ఆలోచనలు ఉన్న ఇద్దరు వ్యక్తులతో తయారయ్యేవి కావు పరస్పర విరుద్ధమైన నైపుణ్యాలు విభిన్నమైన బలాలు ఉన్న వ్యక్తులు ఒకటైతేనే అక్కడ ఒక బలమైన వ్యవస్థ తయారవుతుంది. 2000 సంవత్సరాల క్రితం పంచతంత్రంలో విష్ణు శర్మ చెప్పిన అత్యంత అద్భుతమైన భాగస్వామ్య కథే పింగళకుడు అనే సింహం సంజీవకుడు అనే ఎద్దు కథ.
(08:12) పింగళకుడు అడవికి రాజు ఆధిపత్యం శారీరక బలం రిస్క్ తీసుకునే ధైర్యం అతడి నైపుణ్యాలు సంజీవకుడు ఒక వ్యాపారి సమూహం నుండి తప్పిపోయిన ఎద్దు కష్టం చేయడం స్థిరత్వం ఓర్పు శాంతి అతడి లక్షణాలు ఒకరోజు అడవిలో సంజీవకుడి గంభీరమైన రంకె విన్న పింగళకుడు ఆ శబ్దానికి భయపడ్డాడు. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని వెళ్లి చూస్తే అక్కడ ఉన్నది కేవలం ఒక సాధు జంతువైన ఎద్దు సింహం క్రూర మృగం ఎద్దు కేవలం గడ్డి తినే శాఖహారి వీరిద్దరి స్వభావాలు వేరు ఆహారపుట అలవాట్లు వేరు జీవనశైలి పూర్తిగా వేరు కానీ వాళ్ళు ఒకరి శక్తులను మరొకరు గౌరవించుకున్నారు తమలోని వైవిధ్యాలను అంగీకరిస్తూ స్నేహబంధాన్ని
(08:54) ఏర్పరచుకున్నారు. అలా ఆ అడవిలోనే అత్యంత బలమైన ఆదర్శవంతమైన జోడీగా మారారు. ఈ కథ నేటి కార్పొరేట్ అండ్ స్టార్టప్ ప్రపంచానికి ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ ప్రపంచంలో విజయవంతమైన ఏ పెద్ద కంపెనీని చూసినా ఈ సింహం ఎద్దు కాంబినేషన్ కనిపిస్తుంది. పింగళకుడు ఒక విజనరీ సఈఓ లేదా సేల్స్ హెడ్ లాంటివాడు రిస్క్ తీసుకుంటాడు.
(09:21) మార్కెట్లో వేగంగా అడుగులు వేస్తాడు బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేస్తాడు. సంజీవకుడు సిఓ లేదా సిటీఓ లాంటివాడు ఆపరేషన్స్ చూసుకుంటాడు ఫైనాన్స్ మేనేజ్ చేస్తాడు సిస్టంలో స్థిరత్వాన్ని తీసుకొస్తాడు. గొప్ప భాగస్వామ్యాల సూత్రం ఏంటంటే మీలాంటి ఆలోచనలే ఉన్న వ్యక్తినే పార్ట్నర్ గా ఎంచుకుంటే మీతో పాటు మీ బలహీనతలు కూడా రెట్టింపు అవుతాయి. కానీ మీ వ్యతిరేక శక్తులు ఉన్న వ్యక్తితో చేతులు కలిపితే మీ ఆర్గనైజేషన్ పూర్తి స్థాయిలో బలపడుతుంది.
(09:53) విజన్ ఉన్న సింహానికి ఎగ్జిక్యూషన్ కెపాసిటీ ఉన్న ఎద్దు తోడైతే ఆ కంపెనీని ఎవ్వరూ ఆపలేరు. ఒకరి శక్తి మరొకరి బలహీనతను భర్తీ చేసినప్పుడే అది విజయవంతమైన పార్ట్నర్షిప్ అవుతుంది. సింహం అడవికి రక్షణ ఇచ్చింది ఎద్దు దానికి వివేకాన్ని క్రమశిక్షణను నేర్పింది. పింగళక సంజీవకుల మైత్రి అడవిలోని మిగతా జంతువులకు అసూయ తెప్పించింది. ముఖ్యంగా ఈ గొప్ప భాగస్వామ్యాన్ని చూసి ఓర్వలేని మూడో కన్ను ఒకటి ఉంది.
(10:24) అవే నక్కలైన దమనక సంజీవకులు పరస్పరం ఎంతో నమ్మకంతో ఉన్న ఈ ఇద్దరి మధ్య ఆ నక్కలు ఎలాంటి కుట్ర పన్నాయి ఆ నమ్మకాన్ని ఎలా దెబ్బ తీశయి ఈలోపు ఒక్కసారి ఆలోచించండి మీ బిజినెస్ లో లేదా మీ ఆఫీస్ టీం లో మీ సింహం ఎవరో మీ ఎద్దు ఎవరో చూసుకోండి. ఇక్కడ ఎద్దు అని అంటే నెగిటివ్ గా తీసుకోవాల్సిన పని లేదు పరమ పాజిటివ్ [సంగీతం] మీ ఆఫీస్ లో లేదా వర్క్ స్పేస్ లో ఎవరైనా పని తక్కువ చేస్తూ మేనేజ్మెంట్ దగ్గర బిస్కెట్లు వేస్తూ ఎప్పుడూ కాకా పడుతున్నారా? పై అధికారుల దగ్గర లేనిపోని కబుర్లు చెప్తూ నిజాయితీగా పని చేసే మిగతా ఉద్యోగుల మధ్య గొడవలు పెట్టే వ్యక్తులు మీ
(11:07) కంటపడ్డారా? విష్ణు శర్మ పంచతంత్రంలో రాసిన కరాటక దమనకులు అనే రెండు నక్కల పాత్రలు నేటి కార్పొరేట్ ప్రపంచంలో మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఉండే ఐస్క్రీమ్ బాబులకు భజనపరులకు పర్ఫెక్ట్ ఉదాహరణ కథలోకి వెళితే పింగళకుడు అనే సింహానికి సంజీవకుడు అనే ఎద్దుకు మధ్య అమితమైన స్నేహం కుదిరింది. ఆ నమ్మకం ఎంత పెరిగిపోయిందంటే రాజుగా ఉన్న సింహం వేటాడడం కూడా మానేసి రోజంతా ఎద్దుతోనే కాలక్షేపం చేస్తోంది.
(11:42) ఇది చూసి ఆస్థానంలో పనిచేసే కరటక దమనక అనే రెండు నక్కలకు కడుపు మండిపోయింది. ఈ రెండింటిలో కరటకుడు కొంచెం ప్రాక్టికల్ మనకెందుకు అనవసరమైన విషయాలు మనకు రావాల్సిన తిండి వస్తోంది కదా ఊరుకో అని దమనకుడికి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ దమనకుడు మాత్రం తీవ్రమైన అసూయతో దురాశతో స్వార్థంతో రగిలిపోతూ ఉంటాడు. దమనకుడి ప్లాన్ ఏంటంటే నేను ఎలాగైనా రాజుస్థానాన్ని శాసించాలి రాజు నా మాట మాత్రమే వినాలి కానీ ఇప్పుడు ఈ నిజాయితీ గల ఎద్దవచ్చి రాజును ప్రభావితం చేస్తుంది.
(12:16) ఈ ఇద్దరి మధ్య ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసి గొడవ పెడితేనే నా ఆటలు సాగుతాయి. అప్పుడే నా ప్రాధాన్యం పెరుగుతుంది అని కుట్రకు తెరతీస్తాడు. నేటి కార్పొరేట్ అండ్ పొలిటికల్ ప్రపంచంలో దమనకుడి లాంటి మిడ్ లెవెల్ సైకోలను మనం చాలా సులభంగా పసిగట్టొచ్చు. వీళ్ళ వద్ద కొన్ని స్పష్టమైన లక్షణాలు ఉంటాయి. మొదటిది ఇన్ఫర్మేషన్ గ్యాప్ క్రియేట్ చేయడం టాప్ లీడర్షిప్ కు గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీస్ కు మధ్య సమాచారం సరిగ్గా చేరకుండా వీళ్ళు మధ్యలో ఫిల్టర్లు పెడతారు.
(12:49) సఈఓ దగ్గరికి వెళ్లి సార్ టీం సరిగ్గా పని చేయడం లేదు నేనే దగ్గరుండి చేయిస్తున్నాను అని చెప్తారు. గ్రౌండ్ టీం దగ్గరికి వచ్చి బాస్ మీ మీద చాలా సీరియస్ గా ఉన్నాడు నేనే మిమ్మల్ని కాపాడుతున్నాను అని రంగులు మారుస్తూ చెప్తుంటారు. రెండోది కాన్ఫిడెన్స్ దెబ్బ తీయడం వీళ్ళు స్వయంగా ఏ ప్రాజెక్టు సాధించలేరు కానీ వేరే వాళ్ళ మధ్య అనుమానాలు రేకెత్తించడంలో మాత్రం దిట్టలు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లేదా బిజినెస్ పార్ట్నర్ల మధ్య అతడు నీ గురించి ఆరోజు మీటింగ్లో ఇలా అన్నాడు అలా అన్నాడు తెలుసా అని సగం నిజాలు సగం అబద్ధాలు కలిపి మైండ్ విషపూరితం చేస్తారు. విజనరీగా ఉన్న
(13:27) ఏ లీడర్ అయినా బిజినెస్ ఓనర్ అయినా ఈ దమనకుల వలలో పడితే ఆర్గనైజేషన్ సర్వనాశనం అయపోతుంది. సింహం లాంటి లీడర్ సంజీవకుడి లాంటి నమ్మకమైన నిజాయితీ గల ఉద్యోగిని దూరం చేసుకొని ఈ నక్కల భజన మాటలు వినడం మొదలు పెట్టినప్పుడే కంపెనీ పతనం ప్రారంభంవుతుంది. మీ చుట్టూ ఉన్న దమనకులను గుర్తించడానికి ఒకే ఒక్క సూత్రం వాళ్ళు ప్రచారం చేసే పుకార్లను వాళ్ళు తెచ్చే డేటాను ఎప్పటికప్పుడు ఫాక్ట్ చెక్ చేసుకోండి స్వార్థంతో చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకండి.
(14:06) మరి పింగళక సంజీవకుల మధ్య దమనకుడు ఆ విషబీజాన్ని ఎలా నాటాడు ఆ మిత్రభేదం ఎలా జరిగింది రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం మీ ఆఫీస్ లో మీ ప్రాజెక్టులో ఇలాంటి కరటక దమనకులు ఎవరైనా ఉన్నారా ఆలోచించుకోండి.

No comments:

Post a Comment