Tuesday, August 18, 2026

Kapala Moksham Part 14

Kapala Moksham Part 14

Author Name:Telugu Books

Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LYIPmIdK9e4



Transcript:
(00:00) కపాల మోక్షం మంత్రాలకి మహత్వ ఉన్నదా భోగ జీవితంలో ఎదురైన అమ్మాయిల ప్రేమ చేదు అనుభవాల కన్నా యోగ జీవితంలో ఎదురైన అమ్మాయిల మాయలు మిన్నాయని గ్రహించి తిరిగి యోగ జీవితంలోనికి అడుగుపెట్టాను. అప్పుడు అసలు నిజంగానే మంత్రాలకు మహత్తు ఉందా అనే ధర్మ సందేహం నాకు ఎప్పుడూ నన్ను వెంటాడేది. ఎందుకంటే ప్రతి నిత్యం ఈ మంత్రాలు చదవలేక ఒత్తులు సరిగ్గా పలకలేక ఇబ్బందులు పడేవాడిని పైగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మంత్ర విధి విధానాలు ఉంటాయి.
(00:38) శివయ్య బాలమ్మ గణపతి కుమారస్వామి వీరభద్ర హనుమాన్ సుబ్రహ్మణ్య నవగ్రహాలు ఇలా ప్రతి విగ్రహమూర్తికి మంత్రాలతో అభిషేకాలు మంత్రాలతో పూజలు చేసేసరికి నాకు నిజంగానే ఈ మంత్రాల మీద సందేహాలు వచ్చేవి. విసుగు చికాకు వచ్చి ఈ మంత్రాలు కనిపెట్టిన వారిని ఈ పూజా విధానాలను కనిపెట్టిన వారిని ఈ విగ్రహారాధన కనిపెట్టిన వారిని ప్రతిరోజు తిట్టుకుంటూ బాధపడుతూ చేసేవాడిని అప్పుడు నాకు తెలిసి తెలియని మనసు ఇన్ని విధాలుగా ఎన్నిసార్లు పూజలు చేస్తున్న విగ్రహాలు మాట్లాడకపోయేసరికి నాకు విసుగు చికాకు బాగా పెరుగుతూ వచ్చింది.
(01:16) మహా నైవేద్యము చెప్పి విగ్రహమూర్తికి అన్నం తినిపించాలని ఆయనే స్వయంగా వచ్చి అన్నం తింటాడు అని ఆలోచనల్లో ఉండేవాడిని కానీ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా పూజించిన ఏ విగ్రహమూర్తి నేను వచ్చి నేను పెట్టిన మహా నైవేద్యాలు ప్రసాదాలు తిన్నట్లుగా ఎక్కడా కనిపించలేదు అనిపించలేదు అనగా అనుభవం గాని అనుభూతి గాని కలగలేదు దాంతో రాను రాను నాకు విగ్రహం మీద భక్తి మీద మంత్రాల మీద వైరాగ్య భావాలు కలగడం మొదలయ్యాయి.
(01:43) పనికిరాటి వాటిని కనిపెట్టి సమయము డబ్బు దండగ చేస్తున్నారని ఆలోచనలు విపరీతంగా వచ్చేవి. మహాశివరాత్రి నాడు రుద్రనామంతో 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకము మూడు గంటల పాటు జరిగేది. ఇలా చెప్పిన మంత్రం 11 సార్లు చెప్పడం ఎందుకో అర్థమయ్యేది కాదు. పైగా ఈ మంత్రం ఉచ్చారణ జరుగుతున్నంతసేపు శివలింగమూర్తి మీద పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉండాలి.
(02:11) పైగా ఏమి తినకుండా ఉపవాస దీక్షతో శ్రద్ధగా ఓపికగా చేయాలి. నా సామిరంగా ఇక చూడండి ఒక పక్క ఆకలి మరొక పక్క పంచామృతాలతో అభిషేకం పని మరో పక్క మంత్ర ఉచ్చారణ కదలకుండా మెదలకుండా శివాభిషేకం చేయాలి. మంత్రమును మంత్రమునకు వెళ్ళాల్సి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇదే మలమునకు వెళ్ళాల్సి వస్తే ఏకంగా స్నానం చేసి మళ్ళీ రావాలి. దాంతో ఇవి వచ్చేటట్లు ఉన్నా కూడా ఈ పనులు చేసే ఓపిక లేక బలవంతంగా ఆపుకొని రుద్రాభిషేకం చేసేవాడిని దాంతో నాకు విసుగు వచ్చేది ఇది ఇలా ఉంటే దేవీ నవరాత్రులు చేసే దసరా పండుగ వచ్చేది ఇక చూడండి నా స్వామి రంగా అమ్మవారికి ప్రతి రోజు బంగారు అలంకారాలు
(02:56) [గురకలు] అలంకారాలు మార్చాలి సాయంత్రం లలితా సహస్రనామాలతో శ్రీ చక్రార్చన వచ్చిన వారందరికీ ప్రసాదాలు పంచేసరికి నా తలప్రాణం తోకకి వచ్చేది దీనమ్మ అసలు మంత్రాలలో మహత్తు ఉందా అనేది ఉందా ఇంతమంది ఇన్నిసార్లు లలితా సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు ఒక్కనాడు ఒక్కసారైనా పూజ చేయించుకున్న అమ్మవారు నాకే కాదు చేసిన వారికి ఎవరికైనా కనిపించకపోయేసరికి విసుగు చికాకు వచ్చేది.
(03:28) నా భక్తిలో లోపం ఉంటే మిగతా వారి అందరి భక్తుల భక్తిలో లోపాలు ఉంటాయా లేక అసలు మంత్రాల్లో లోపాలు ఉన్నాయా నాకైతే అర్థమయ్యేది కాదు అర్థమై అర్థం లేని అర్థం కాని మంత్రాలతో అర్థం అర్థం లేని పూజలతో కాలం గడుపుతున్నానని నాకు తీవ్రంగా అనిపించే సమయంలో ఒక మహత్తర సంఘటన జరిగింది. మా ఊర్లో ఒకాయనకి ఒకసారి పాము కరిచింది. పైగా అది విషసర్పం మా ఊరి వైద్యులు ఇతను బతకడం చాలా కష్టమని చేతులఎత్తేశారు.
(03:56) దాంతో వాళ్ళు గుడి దగ్గరకు వచ్చి ఉన్నాడో లేదో తెలియని శివలింగమూర్తి దగ్గరికి వచ్చి మా వాడిని ఎలాగైనా బతికించు స్వామి ఈ జాత్రలో వాడి పేరుతో ఒక ప్రభకట్టి ఊరేగింపు చేస్తాము మాకు వాడు ఒక్కడే కొడుకు రక్షించు దేవా రక్షించమని వేడుకున్నారు. నాకైతే అతను చనిపోవడం కాయమని అనిపించింది. ఇంతలో ఆ గుంపులో నుండి ఒక పెద్దాయన వెంటనే రేయ్ మనము పాము మంత్రం వేస్తే పాముల స్వామి దగ్గరికి తీసుకుని వెళ్లి మన వాడికి బతికిద్దాం.
(04:26) వాడు ఖచ్చితంగా బతుకుతాడు పదండి అనగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఇక్కడ ప్రతిరోజు క్రమం తప్పకుండా వేళ తప్పకుండా నిత్యము చేస్తున్న ఈ ఒక్క దేవుడు మహత్తు చూపలేదు అలాంటిది ఎవరో స్వామి పైగా ఆయన పాము మంత్రం వేస్తే పాము కాటుకు గురైన వ్యక్తి బతుకుతాడట పైగా వైద్యులు బతికించలేమని చెప్పి చేతులెత్తేస్తే పాము మాత్రం పాము మంత్రం వేసేవాడు ఎలా బతికిస్తాడు వీరి పిచ్చిగానే అనుకొని అసలు ఏం జరుగుతుందో ఒకసారి వీరి వెంట వెళితే ఎలా పోలా అనిపించడంతో ఈ గుంపు వెంట పాముల స్వామి దగ్గరికి వెళ్ళాను ఆయన చూస్తే 80 సంవత్సరాల వయసు ఉన్నవాడిలాగా ఉన్నాడు. బయటకి వచ్చి పాము కరిచిన వాడి
(05:06) దగ్గరికి వచ్చి పాము కాటు వేసిన చోట చూసి చిరునవ్వు నవ్వి కంగారుపడకండి తగ్గిపోతుందిలే ఎలా ఎక్కిందో అలా కిందికి దిగిపోతుందిలే తగ్గిపోతుందిలే అంటూ లోపలికి వెళ్లి ఏదో వేరు లాంటిది తెచ్చి ఈ పాముకాటు వేసిన చోట దీన్ని పెట్టి ఏదో మంత్రం చదువుతుండగానే స్పృహ కోల్పోయిన వాడు నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి నేను గతుక్కుమన్నాను వామ్మో ఇది విచిత్రంగా ఉందే ఎవరో చెప్పినట్లుగా నిద్రలో లేచినట్లుగా లేస్తున్నా డు ఆయన ఏదో మంత్రం చదువుతుంటే పాముకాటు వ్యక్తి శరీరం నీలం రంగు నుండి మామూలు స్థితికి రావడం చూసేసరికి నాకు నోట మాట రాలేదు.
(05:42) పాముకాటు వ్యక్తికి తిరిగి వచ్చి లేచి నిలబడి ఆయన నమస్కారం చేసి అందరితో మనిషిలాగా వెళుతున్న వాడి కేసి చూసి నమ్మాలా వద్దా అనే సందేహం కలిగింది. కళ్ళ ముందు జరిగిన ఈ యథార్థ సంఘటనకి నాకు బుర్ర తిరిగింది. ఇందులో ఏదో తెలియని రహస్యం ఉందని నాకు అనిపించింది. ఆ తాత దగ్గరికి వెళ్లి నిజంగానే మంత్రాలకు మహత్తులు ఉన్నాయా అని అడిగినప్పుడు ఆయన నాకేసి అదోలా చూసి ఎందుకు లేవు నాయనా ఉంటాయి ఈ విషయంలో మంత్రం తంత్రం యంత్రం అనేవి ఉన్నాయి.
(06:16) ప్రతి మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి వీటికి మన శరీరంలోని నాడి ఉత్తేజం కలిగించే శక్తిని కలిగి ఉంటాయి. వీటికి ఆ శక్తిని ఆయా మంత్ర దేవతలు ఇస్తారు. వీరికి మన విశ్వంలో ఉన్న దైవశక్తి తోడవుతుంది. ఈ దైవశక్తికి మనం నిత్యం చేసే హోమాలు, యజ్ఞాలు యాగాల వల్ల వాటితో చేసే ప్రతి పదార్థం వలన అనగా ఆవునెయ్యి, ఆవు పిడకలు, ఆవుపాలు, కొబ్బరికాయలు, నవధాన్యాలు, నవగ్రహ సమిధలు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఇలా వాడే ప్రతి పదార్థం వలన హోమదేవతలకు దైవశక్తి వస్తుంది.
(06:51) ఎలా అంటే ఈ ప్రపంచంలో ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ మనకి ఆక్సిజన్ ఇచ్చే మహత్తర శక్తి ఉన్న ఒక్క గోమాతకే ఉంది. అనగా ఆవు జాతికే ఎట్టి అవకాశం ఉన్నది. నువ్వు నిత్యం చేసే పంచామృతాలు అనగా ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార వాడుతున్నావు కదా, అంటే మన శరీరంలో మనకు తెలియకుండా ప్రాణశక్తి స్థాయిలు తగ్గినప్పుడు మనలో ఉన్న వివిధ రకాల చక్రాలు బలహీన పడతాయి.
(07:18) వాటి వలన వీటికి సంబంధించిన అంగాలు దెబ్బ తినడం మొదలై వ్యాధుల రూపంలో బయటికి వస్తాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మనం మనకి పునఃప్రాణ శక్తి ఇచ్చే పదార్థాలను వస్తువులను ఏర్పరచడం జరిగింది. ఇలాంటి శక్తిని ఇవ్వటంలో ఆవునెయ్యి ఆవుపాలు ఆవు పెరుగు ఆవు మూత్రం ఆవుపేడ ప్రథమ స్థానం ఉన్నదని మన పూర్వీకులు గ్రహించి వాటిని నిత్య పూజా విధానాల్లో ఉండేటట్లుగా ఏర్పాటు చేసినారు.
(07:44) అందుకే ఆవు పేడ నుంచి విభూతిని తయారు చేస్తారు. ఆవునెయ్యిని నిత్య దీపారాధనలో వాడేటట్లు చేశారు. ఆవుపేడను గొబ్బెమ్మల రూపంలో పండగల సమయంలో వాడేటట్లు చేశారు ఎందుకంటే మనిషికి ప్రాణశక్తి కోసం ఒక పూజలో కాకపోయినా మరొక పూజలో అందుకునే ఉద్దేశంతో ఇన్ని రకాల విధానాలు ఏర్పరిచారు. పైగా ఇలా వచ్చిన ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న 72వేల నాడులకు వెళ్ళటానికి మంత్రాలను ఏర్పరిచినారు.
(08:11) ఉదాహరణకి శివ పంచాక్షరీ మంత్రం చదివితే ఆవుపాల అభిషేకం వలన మనకి జ్ఞానము ఏర్పడి వైరాగ్య భావాలు కలుగుతాయి. అనగా ఆజ్ఞ చక్రం శుద్ధి అవ్వటం మొదలవుతుంది అన్నమాట. అలాగే శివ పంచాయితన పూజ వలన మనలోని పంచ చక్రాల శుద్ధి వీటికి ఆయా పదార్థాల వలన అలాగే నివేదన వలన తిరిగి ప్రాణశక్తి కలుగుతుంది. ఏ చక్రానికి ఏ దేవత ఉండాలో దానికి సంబంధించిన నిత్య పూజా విధానాలు ఉండాలో దానికి తగినట్లుగా నాడులు ఎలా స్పందిస్తాయో గమనించి ఏ పదార్థాలు తింటే అది బలంగా ఉందో తెలుసుకొని విగ్రహ పూజా విధానాలు ఏర్పాటు చేశారు.
(08:49) ఇలాగే పాము మంత్రం తేలు మంత్రాలు కూడా వచ్చాయి. వీటికి వీటి విషానికి విరుడుగా సంజీవిని వేరు మొక్క అలాగే పాము కోరల్లో ఉండే నల్లరాళ్ళు అన్నమాట. వీటిని ఉపయోగించి ఎంతటి విషమునైనా హరించివేయవచ్చు. కాకపోతే వీటిని ఉపయోగించేటప్పుడు కాటు తిన్న వ్యక్తి నుండి వైద్యం చేసే వ్యక్తికి ఈ విషం వచ్చే అవకాశం ఉండటం వలన దీన్ని నిరోధించుటకు పాము అలాగే తేలు మంత్రాలను కనిపెట్టారు.
(09:14) వీటిని నిష్టతో 12 సంవత్సరాల పాటు ఈ మంత్రాలను ఆరాధన చేసిన వారికి ఈ మంత్ర సిద్ధి కలిగి ఎలాంటి విషం వీరిని ఏమీ చేయలేదు. పాములు లేదా తేలు కాటు వేస్తే అవి చనిపోతాయి కానీ ఈ మంత్ర సిద్ధి పొందిన వారికి ఏమీ కాదు అని చెప్పి లోపలికి వెళ్ళాడు నా కళ్ళు తెరిపించాడు. అంటే మనము నిత్యం చేసే పూజల్లో చదివే మంత్రాల్లో దైవిక పదార్థాల్లో ఈ మహత్వ ఉన్నదని గ్రహించి వాటిని ఒక వరుస క్రమంలో ఒక పూజా విధి విధానాలతో మనకు ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేసిన మన భారతీయ ఆగమ శాస్త్ర విధి విధానాలకు నమస్కారం చేశాను.
(09:50) ఈ పూజా విధానాల్లో ఆయుర్వేదం అల్లోపతి, హోమియోపతి, మూలికా వైద్యం, రేఖీ వైద్య విధానం మనకి అలాగే రాబోవు మానసిక, శారీరక మనోవ్యాధులు తొలగించారని అందుకే కాబోలు 24 బీజాక్షరాలను తీసుకొని 24 దేవతా శక్తులను అమర్చి వారికి 24 గురువులను అనుసంధానం చేసి, 24 చేతి ముద్రలను ఏర్పరిచి, దాన్ని గాయత్రీ మహామంత్రంగా రూపుదాల్చి, సర్వ దేవతలకే అనుసంధానం చేసి, త్రిలోకాల్లో అంటే మూడు కాలాల్లోనూ ఆరోగ్య ప్రదాత అయిన సూర్యదేవుని నిత్యారాధన చేసే గాయత్రీ మహామంత్రం యొక్క గొప్పతనం ఇప్పుడు తెలిసిందని అనుకుంటూ ఇకనుంచి ప్రతినిత్యం మనస్ఫూర్తిగా ఆర్తిగా సహనంతో భక్తి
(10:33) విశ్వాసాలతో శ్రద్ధగా మంత్రోచ్చారణ చేయాలని నిర్ణయించుకొని ఆనందంగా గుడికి బయలుదేరాను నిత్యగాయత్రి మంత్రోస్థానం వలన నా జీవితంలో జరిగిన మార్పులు ఏమిటో తెలుసుకోవాలని ఉందా అయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా గమనిక పాము మరియు తేలు మంత్రాలను అలాగే ఈ మంత్రవాదులను ప్రోత్సహించాలని నా ఉద్దేశ్యం కాదని గ్రహించండి.
(10:57) ఎందుకంటే ఇలా నిజమంత్రవాదులను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. భారతీయ మంత్రశాస్త్రం యొక్క గొప్పతనం నేను తెలుసుకున్న దాన్ని లోకానికి తెలియజేయడం చెప్పడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పాము మంత్రముడి ఆరాధ్యుడిగా పాముల నరసయ్య అనే సిద్ధ పురుషుడు ఉన్నారని చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకసారి కాశీ క్షేత్రంలో వీరిని కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర మహాస్వామి వారు చూసి ఇతని చేతిలో గరుడ రేఖ ఉందని చూసి ఇతని వలన లోకోద్ధరణ జరగాలని భావించి వీరికి పాము మంత్రోపదేశం చేసినారు.
(11:29) అలా పాముల నరసయ్య 12 సంవత్సరాల పాటు బ్రహ్మచర్య దీక్షతో అత్యంత కఠిన నియమాలను పాటించి ఆపై మంత్ర సిద్ధి పొందిన తర్వాత ఉచితంగా అందరికీ పాముపడి పాము పడిన వారిని లక్షలాది మందిని రక్షించారని అందుబాటులో లేని సమయంలో ఫోను ద్వారా ఈ మంత్రోచ్చారణ చేస్తూ ఎక్కడో దూరాన ఉన్న పాముకాటు వ్యక్తిని తిరిగి ఆరోగ్యవంతులని చేసేవారని వారి జీవిత మంత్ర చదివితే నాకు తెలిసింది.
(11:57) మంత్రమును మనసును పెట్టి చేస్తే ఆ మంత్ర సిద్ధి కలిగితే నిజంగానే మంత్రాలకు చింతకాయలు రాలతాయని చింతకాయలేం కర్మ చింతామణులే రాలతాయని నేను గ్రహించాను. అంతెందుకు ఆదిశంకరాచార్యులు ఒకసారి చేసిన కనకధారా స్తోత్రం వలన బంగారు ఉసిరికాయలు రాలినాయి కదా ఆలోచించండి కాకపోతే ఆయా మంత్రాలను ఆయా మంత్ర విధానాలను శ్రద్ధాశక్తులతో భక్తి విశ్వాసాలతో నియమనిష్టలతో చేస్తే ఆ మంత్ర దేవతలు వారికి ప్రత్యక్షమై వారికి కావలసినవి ఇచ్చి వెళ్తారని నా స్వానుభవంలో చాలాసార్లు రుజువైంది.
(12:34) నా మీద నమ్మకం లేదా అయితే మీకు నచ్చిన మంత్రమును ఎంచుకొని ఆరాధన చేయండి. విషయం మీకే తెలుస్తుంది లోపల లోపం మనలో ఉంటుంది కానీ మంత్రంలో ఉండదు అని మీరే గ్రహిస్తారు

No comments:

Post a Comment