Kapala Moksham Part 18
Author Name:Telugu Books
Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0ixgSLxir_4
Transcript:
(00:01) కర్ణ పిశాచి దర్శనం ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ జిజ్ఞాస గుడికి వచ్చి నన్ను కలుసుకున్నాడు. ఎంతవరకు మీ విధిరాత భవిష్యత్తు వచ్చింది అని అడిగాడు. దానికి అతడి జాతక చక్రం గీసి రాబోవు సంవత్సరాల్లో జరగబోయే విషయాలు చెప్పడం జరిగింది. అయినా అతను సంతృప్తి చెందలేదు. నాకు ఈరోజు ఈ క్షణంలో జరగబోయే విషయాలు కావాలని పట్టుబట్టి కూర్చున్నాడు.
(00:28) దాంతో అతనికి నెలలు ఆ తరువాత వారాలు ఆ తరువాత రోజుల్లో జరగబోయే భవిష్యత్తు విషయాలు చెప్పినను అతను సంతృప్తి చెందలేదు. దానితో నాకు తిక్కరేగి కొన్ని రోజుల తర్వాత కనబడు నీకు కావలసిన క్షణాల భవిష్యత్తు చెబుతాను అని అతనికి నమస్కారం చేశాను. దానికి అతను ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. నాలో నాకే తెలియని అసహనం మొదలయింది.
(00:53) వీడి చేత ఎలాగైనా నేను పెద్ద తోపుగాని గొప్ప జ్యోతిష్యవేత్త అనిపించుకోవాలనే తపనా తాపత్రయం నాలో నాకే తెలియని కనిపించాయి. ఏమి చేయాలో తెలియని పరిస్థితి అలా అని బయటకు వెళ్లి చెప్పుకోలేని మౌన స్థితి ఓటమి ఒప్పుకోవడం నాకు నచ్చని స్థితి ఇది ఇలా ఉండగా ఉన్నత చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళాల్సిన వచ్చిన గతి పండగలకి పబ్బాలకి మా ఊరు రావడం దేవాలయ అర్చన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగేది.
(01:26) నేను ఊరికి వచ్చిన రోజుల్లో జిజ్ఞాస కనబడేవాడు నాలో కసిని పెంచేవాడు తన మాటలతో నన్ను నాలో తెలియని కోణం వైపు నడిపించేవాడు. ఇవాడికి ఎలాగైనా క్షణాల భవిష్యత్తు చెప్పాలనే కసి అంతవరకు పెరుగుతూ ఉండేది తప్ప తగ్గేది కాదు ఒకరోజు నేను చదువుకునే ఊరిలో ఒక భిక్ష సాధువు ఒక హోటల్ ముందు కనిపించాడు. భిక్ష వేయమని చేయి చాచాడు. నేను డబ్బులు ఇవ్వలేదు దానితో వాడికి కోపం వచ్చి నాలుగు ఇడ్లీలు రెండు గారెలు ఒక కాఫీ తాగడానికి డబ్బులు ఉంటాయి కానీ నాకు ఇవ్వటానికి డబ్బులు లేవు ఇంట్లో ఉన్న 15 అరిసలు తినడానికి అవకాశం ఉంటుంది కానీ నీ జేబులో 120 రూపాయలు ఉంచుకొని నాకు డబ్బులు ఇవ్వవు
(02:07) కానీ భిక్షపతిని చూడాలనుకుంటావు నాలో భిక్షపతిని చూడలేని వాడివి నిజంగానే ఆ పై భిక్షపతిని వచ్చినా గుర్తించలేని మూర్ఖ పూజారి అనగానే నాకు నోట మాట రాలేదు అమ్మ నీ అమ్మ వీడుఏంటి జాతకాలు చెప్పేవాడికి జాతకం చెబుతున్నాడు నేను ఏం తిన్నానో నేను తింటున్నప్పుడు చూసి ఉండవచ్చు నా గదిలో ఎన్ని అరిసలు ఉన్నాయో నాకే గుర్తులేదు నేను లెక్క పెట్టలేదు కానీ నా జేబులో 120 రూపాయలు ఉన్నాయని నాకు మాత్రమే తెలుసు మరి వారికి ఎలా తెలిసింది నేను పూజారి అని నా వాలకం చూసిన వాడు ఎవడో కూడా గుర్తుపట్టలేరు.
(02:44) వీరికి ఎలా తెలిసింది వామ్మో వీడి దగ్గర ఏదో ఉంది అది ఏమిటో తెలుసుకోవాలని నాలో తపన మొదలై వాడితో స్వామి మీరు చెప్పినది అన్నీ కూడా అక్షర సత్యాలే నాకు కూడా ఏదో కొద్దిపాటి వాక్శుద్ధి అలాగే జ్యోతిష్య విజ్ఞానం ఉంది కానీ మీకున్న జ్ఞానం మాత్రం నాకు లేదు నా దగ్గర 120 రూపాయలు ఉన్నాయని అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పారు నాకు చెబితే ఆ డబ్బులు మీకు పూర్తిగా ఇస్తాను అనగానే దానికి వాడు ఇబ్బందిగా మొఖం పెట్టి పెటి మొహమాట పడుతూ ఒక కాగితం పెన్ను తీసుకుని ఏదో మంత్రం రాసి దాన్ని కర్ణ పిశాచి మంత్రం అంటారని అనుష్టానం విధానం విధి చెప్పి దాని మంత్ర సిద్ధి పొందితే
(03:26) అది చెవిలో అన్ని రకాల అన్ని కాలాల భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లుగా చెబుతుందని ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని మీలాంటి వారిని ఏరోజుక ఆరోజు బోల్తా కొట్టించి భుక్తి పొందుతున్నానని ఈ మంత్రం ఎవరికీ చెప్పొద్దని గుడిలో లో ఈ మంత్రం పని చేయదని చెప్పి నా దగ్గర 20 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు.
(03:51) చేతిలో ఉన్న మంత్ర కాగితమును చూసి అర్థం కాని మంత్రమును చదువుకొని నా గది వైపు అడుగులు వేయటం జరిగింది. ఒకవేళ వాడు చెప్పినట్లుగా చేస్తే మంత్ర సిద్ధి పొందితే ఈ లోకంలో ప్రేతాత్మలు ఉన్నాయని తెలుస్తుంది కదా పోతే 20 రూపాయలు పోతాయి కదా ఇంటికి దూరంగా ఒక ఆరు నెలల పాటు దీక్షగా ఏ గుడికి వెళ్ళకుండా నేనేమో మరో బిచ్చగాడిగా మారి సాధన చేశాను.
(04:15) ఒకరోజు అర్ధరాత్రి పూట నా గదిలో ఏదో తెలియని తెల్లని శరీరం ఉన్న ఒక స్త్రీమూర్తి కనిపించసాగింది. చూడటానికి ఒక తెల్లని నీడలాగా కనిపించసాగింది. నన్ను ఆరాధన చేశవు కదరా నాకు కావలసిన విధంగా నన్ను సంతృప్తి పరిచినావు కదరా నీ భక్తికి సంతోషించి నేనే వచ్చాను నేనే ఆ కర్ణ పిశాచిని అనగానే నేను గతుక్కుమన్నాను. నాకు పారిపోవడానికి కూడా అవకాశం లేదు.
(04:40) గదిలో పైగా నేను ఒక్కడినే ఒంటరిగా ఉంటున్నాను. ఏం చేయాలో తెలియని భయంకర అనుభవ స్థితి మంత్ర సిద్ధి పొందినందుకు ఆనంద పడాలో కర్ణ పిశాచి కనబడినందుకు భయపడాలో అర్థం కానీ అయోమయ స్థితిలో ఉండగానే ఓయ్ నువ్వు తలుచుకోగానే నీ కుడి చెవిలో ఏం కావాలో అన్ని రకాల వివరాలు చెబుతాను సందేహించకు నాకు కావలసిన ఆహార పదార్థాలను నివేదన చేస్తే నేను నీ వెంటే ఉంటాను నా వలన నీకు ఎలాంటి ప్రాణహాని ఉండదు అనటం అంతర్దానం అయింది.
(05:13) దానితో దయ్యాల ఉనికి ఉండదని మంత్రాలకు చింతకాయలు రాలతాయని కాకపోతే మంత్రసిద్ధి పొందిన సిద్ధులు ఇచ్చే మంత్రాలకే మంత్రసిద్ధి కలుగుతుందని తెలుసుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా మా ఊరికి వెళ్ళడం జరిగింది. నేను వచ్చిన విషయం తెలుసుకున్న జిజ్ఞాసి నా దగ్గరకు వచ్చాడు కానీ అతనికి నేను కర్ణ పిశాచి మంత్ర సిద్ధి పొందినట్లు చెప్పలేదు.
(05:36) పైగా వాడు అడిగిన క్షణాల భవిష్యత్తును నా మంత్ర సిద్ధి వలన కర్ణ పిశాచి నాకు చెవిలో చెప్పిన విషయాలన్నీ చెప్పడం కళ్ళ ముందు జరగబోయే క్షణాల భవిష్యత్తు జరుగుతూ ఉండేసరికి గతుక్కుమని నాకు నమస్కారం చేశాడు. నాలో వాడిని ఓడించానన్న ఆనందం వాడికి నాలో ఏదో తెలియని మంత్ర సిద్ధి ఉందన్నది తెలుసుకున్నాడు. దాంతో నాలో ఏదో తెలియని అమితానందం కలిగింది.
(05:59) వాడు అక్కడి నుండి వెళ్ళిపోవడంతో నేను విజయ గర్వంతో ఇంటికి వెళ్ళిపోయాను నేను చదువులో వెనకపడటంతో నా తల్లిదండ్రులు నా వెంటపడట్టంతో విసుగు చెంది మహా సత్యాలు చూపించే విద్యలు ఇన్ని ఉండగా పనికిరాని ఇంగ్లీష్ విద్యలు వెంట ఎందుకు పడుతున్నారు అని తిట్టుకుంటూ నేను చదివే ఊరు వెళ్ళడానికి బస్సు వైపు అడుగులు వేయడం జరిగింది.
(06:20) ఎక్కడో రేడియో నుండి చదువు లేనివాడు వాడు దేనికి కొరగాడని అంటూ పాట లీలగా వినపడడంతో దీనమ్మ ఇప్పుడే ఈ పాట రావాలనుకుంటూ బస్సు ఎక్కాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా ఇంకా ఆలస్యం ఎందుకు శుభంభుయాత్ గమనిక ఇలాంటి తాంత్రిక మంత్రారాధన వలన మన సాధనా స్థాయి మహోన్నత మనిషి స్థాయి నుండి అధమ భూత స్థాయికి చేరుకుంటుందని కొన్ని నెలల తర్వాత తెలుసుకున్నాను దానితో ఇలాంటి మాంత్రిక మంత్ర సాధనలకి స్వస్తి పలకడం జరిగింది.
No comments:
Post a Comment