🔱శుభోదయం🙏
సూర్యోదయ శ్లోకః
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం ।
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ॥
ఆత్మీయ బంధు మిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🤝 ప్రత్యక్ష నారాయణుడు అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
06-03-2022:-ఆదివారం
ఈ రోజు AVB మంచి మాట..లు
ఈ సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్నదంతా మన దృష్టి లొనే ఉంది,,
రాజ్యాలను జయించినవాడు ధీరుడు కాడు,
ఐశ్వర్యాల మధ్య తులతూగేవాడు ధనవంతుడు కాడు,
జీవితంలో ఎన్ని సమస్యలెదురైనా ధైర్యమును కోల్పోనివాడే ధీరుడు, చిరునవ్వును వీడనివాడే నిజమైన సంపన్నుడు,,
-పరిస్కారం అయ్యే సమస్యల కోసం ఆలోచించాల్సిన పనిలేదు.. పరిష్కారం కాని సమస్యల కోసం ఆలోచించిన ఉపయోగం లేదు.. ఆలోచించి బీపీ షుగరు తెచ్చుకొని ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప
తినటం కోసం బతకడం కాదు మనం చేయాల్సింది బతకటం కోసం తినాలి.. బతికి చనిపోతే నలుగురు మాత్రమే మోసుకొని వెళ్తారు.. జీవిస్తూ మరణిస్తే నాలుగు తరాలవారు మీ పేరును,మిమ్మల్ని గౌరవం తో కూడిన ప్రేమతో జీవింపచేస్తారు
సేకరణ ✒️AVB సుబ్బారావు 💐🤝👍
సేకరణ
No comments:
Post a Comment