*🏵️వామ్మో HM🏵️*
*🙆♂️ మనిషా ? యంత్రమా* ?
*✅బడి పని, మళ్ళ తన పాఠాలు తాను చెప్పుకోవడం.*
*🙆♂️ఇంటికి పోయినా బడి పనే*
*హెడ్మాస్టర్లా ? యంత్రాలా?*
*పని భారం తో* *అలసిపోతున్న ప్రధానోపాధ్యాయులు.*
👉 పాఠశాలకు వచ్చిన ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని భారంతో అలసిపోతున్న హెడ్మాస్టర్లు.
👉 అందరికంటే ముందుగా పాఠశాలకు వచ్చి, రాగానే పాఠశాల పరిసరాలను గమనించాలి.శుభ్రంగా ఉన్నాయా ? లేవా ? లేనట్లయితే శుభ్రం చేయించాలి.
👉 తర్వాత బయోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించాలి. అందరూ ఉపాధ్యాయులు బయోమెట్రిక్ వేసినారా ? లేదా ? ఆరోజు లీవ్ లో ఉన్న ఉపాధ్యాయులు ఎంతమంది ?
వారికి లీవ్ అప్లై చేయడం ? వారి పీరియడ్ నిర్వహణ ? తమ తరగతి నిర్వహణతో పాటు సెలవులో ఉన్న ఉపాధ్యాయిని తరగతి నిర్వహణ అదనపు భారం ?
👉 ప్రార్థన పూర్తి కాగానే ఉపాధ్యాయులతో చిన్నపాటి సమీక్ష ? FLN మూల్యాంకన విషయాలను పరిశీలించడం. విద్యార్థుల సామర్థ్యాల గురించి శోధించడం.
👉 తరువాత విద్యార్థుల ఉపస్థితిని పరిశీలించాలి. ఆరోజు పాఠశాల హాజరైన విద్యార్థులు ఎందరు ? ఉపస్థితి కాని విద్యార్థులు ఎవరు ? కారణాలేమిటి ? తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడడం లేదా ప్రత్యక్షంగా ఇంటికి వెళ్లి పరిశీలించడం ?
👉 మరుగుదొడ్ల పరిశీలన. మరుగుదొడ్లలో నీటి సౌకర్యాలను పరిశీలించడం.
👉 తదుపరి మధ్యాహ్న భోజనం నిర్వహణ. ఉపస్థితికి తగిన విధంగా బియ్యం అందించడం. ఆ రోజు మెనూ పరిశీలించడం.
👉 ఇవన్నీ చేస్తూనే తమ తరగతి పాఠ్యాంశానికి తగిన విధంగా పీరియడ్ ప్లాన్ తయారు చేసుకోవడం.పాఠ్యాంశాన్ని బోధించడం. ఇతర ఉపాధ్యాయుల పీరియడ్ ప్లాన్స్, లెసన్ ప్లాన్స్, ఇయర్ ప్లాన్స్, సమీక్షించడం.
👉 తమ FLN రిపోర్టర్ తో పాటు ఇతర ఉపాధ్యాయుల రిపోర్టులు సమీక్ష చేసుకోవడం మండల విద్యావనంల కేంద్రానికి అందించడం.
👉 ఆరోజు మోస్ట్ అర్జెంట్ రిపోర్టులను అప్పటికప్పుడు తయారు చేయడం. MRC కి అందించడం.
👉 ఉచిత దుస్తులు మరియు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం. ఇది అందించిన రోజు రాని విద్యార్థులకు వారు వచ్చి అడిగినప్పుడు ప్రత్యేకంగా అందించడం.
👉 సరిగా పని చేయని app లో సైతం మధ్యాహ్న భోజనం రిపోర్టును సమయానికి పంపించడం.
👉 ఎప్పటికప్పుడు మధ్యాహ్నం రికార్డులను అప్డేట్ చేస్తూ, స్టాక్ రిజిస్టర్, టేస్ట్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం.
👉 సమయానికి పరీక్ష పేపర్లను ఉపాధ్యాయులకు అందిస్తూ, పరీక్షలు నిర్వహించడం. వాటిని మూల్యాంకనం చేయించడం. రిపోర్టులు సిద్దం చేయించడం .
👉 అసెస్మెంట్ పూర్తికాగానే యాప్ లో మరియు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో విద్యార్థుల మార్కులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం.
👉 వీటన్నిటితో పాటు నూతన అడ్మిషన్ల నమోదు చేయడం, ప్రతిరోజు పాఠశాలకు స్టడీ సర్టిఫికెట్ల కోసం వచ్చే విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించడం.
👉 SMC అకౌంట్ నిర్వహణ కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం.
👉 మన ఊరు మనబడి నివేదికలు అందించడం. పనులను పరిశీలించడం.
👉 హెడ్మాస్టర్ సమావేశాలకు, FLN సమావేశాలకు హాజరు కావడం నివేదికలు అందించడం.
👉 మధ్యాహ్న భోజనం బిల్లులు, నెలవారి పాఠశాల నివేదికలు, FA, SA, FLN నివేదికలు తయారు చేసి మండల వనరుల కేంద్రంలో అందించడం.
👉 పాఠశాలలో అటెండర్ లేనట్లయితే అటెండర్ డ్యూటీలు కూడా నిర్వహించడం.
👉 ఇంటి దగ్గర సైతం పాఠశాల పనులతో సతమతమవడం.
*🔷వర్థెల్లి మల్లయ్య🔷*
No comments:
Post a Comment