🌺సుగుణశీలి🌺
🚩🚩
ఒకనాడు దేవేంద్రుడు భూలోకంలో ఉన్న రాజులలో
కృష్ణదేవుడనే రాజే
ఉన్నతమైన సంస్కారవంతుడని గొప్పగా కొనియాడాడు.
ఈవిధంగా దేవేంద్రుడు పొగడడం సభలోని
ఒక దేవ పురుషునికి నచ్చలేదు.
దేవేంద్రుడు ఒక మానవమాత్రుని
పొగడడమా ? ఆ కృష్ణదేవుని
గొప్పతనం పరీక్షించాలని ఆ దేవపురుషుడు భూలోకానికి వచ్చాడు. కృష్ణదేవుడు పయనిస్తున్న మార్గంలో ఆ దేవపురుషుడు ఒక చనిపోయిన శునక
రూపంలో పడివున్నాడు.
చచ్చిపడివున్న ఆ శునక శరీరం నుండి భరించలేని దుర్వాసన
వస్తూవుంది. ఆ
శునకము యొక్క నోరు తెరుచుకొని పరమ వికారంగా అందరూ అసహ్యించుకునేలా పడివున్నది.
కుళ్ళిన ఆ శునకాన్ని
కృష్ణ దేవుడు జాలిగా పరికించి చూచాడు " ఆహా.. యీ శునకము యొక్క
పళ్ళవరుస చాలా అందముగా,
ఎంతో తెల్లగా పరిశుభ్రంగా
ముత్యాలవలె ప్రకాశిస్తున్నాయి" అని
తన మనసులోని మాటను పక్కవారితో అన్నాడు. ఆ క్షణంలో కృష్ణ దేవుని దృష్టి
కుళ్ళిన ఆ శునకపు శరీరం మీదకుగాని, అక్కడి దుర్వాసన మీదకు గాని పోలేదు.
కాని శునకంలో చూసిన ఓ మంచి విషయం
మీదకే రాజు దృష్టి పడింది.
ఇదే కృష్ణ దేవుని యందు వున్న ఉన్నతమైన గుణం.
కృష్ణదేవుని ఔన్నత్యాన్ని స్వయంగా చూసిన
దేవపురుషుడు చచ్చిన ఆ శునకరూపము వదలి తన నిజ రూపంతో రాజుకి దర్శనమిచ్చాడు.
" మహారాజా .. సకలజీవులలో మంచిని మాత్రమే చూడగల గొప్ప సంస్కారం నీలో వున్నది.
ఈ లోకంలో నీవంటి వారు మాత్రమే
సుఖసంతోషాలతో ప్రశాంతంగా వుంటారు.
అని ప్రశంసించి ఆ దేవపురుషుడు దేవలోకానికి తిరిగి
వెళ్ళిపోయాడు.
No comments:
Post a Comment