[11/17, 03:41] +91 73963 92086: Shobha Rani:
Shobha Rani:
🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు..
🌹ఈ రోజు 39,వ దుర్వాస మహర్షి గురించి తెలుసుకుందాము..🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿మనకి దుర్వాసుడు అంటే కోపిష్ఠి అనే తెలుసు . కాని దుర్వాస మహర్షి చాలా గొప్పవాడు . అత్రి మహర్షి తపస్సుకి అనసూయ పాతివ్రత్యానికి త్రిమూర్తులు ఇచ్చిన వరప్రసాదం దుర్వాసుడు .
🌸దుర్వాసుడు పెరిగి ఉపనయనం అయిపోయాక బ్రహ్మచర్యం తీసుకుని గొప్ప తపస్సు చేశాడు . దేవతలు అతని తపస్సుకు మెచ్చుకుని మూడు లోకాల్లోనూ తిరగగల శక్తిని ఇచ్చారు .
🌿తపస్సు వల్ల వచ్చిన శక్తితో , తేజస్సుతో మూడు లోకాల్లోనూ తిరుగుతూ ఉండేవాడు దుర్వాసుడు .
🌸ఒకనాడు దుర్వాసుడు విష్ణుమూర్తిని దర్శించి ఆయన ఇచ్చిన పారిజాతపువ్వునీ , మధ్యలో వింధ్యాధర స్త్రీలిచ్చిన పూలదండల్ని పట్టుకొస్తుంటే
🌿ఇంద్రుడు ఎదురొచ్చాడు దుర్వాసుడు ఆ దండలు ఇంద్రుడికి వేస్తే అతడు తీసి తన ఏనుగుకి వేశాడు . ఏనుగు ఆ దండల్ని చించి పారేసింది . దుర్వాసుడికి కోపం వచ్చి ఇంద్రుడు ఐశ్వర్యాలన్ని గంగపాలైపోవాలనీ ఐరావతం తల తెగిపోవాలని శపించాడు .
🌸అందుకే అమృతం సముద్రంలోకి పోయింది . ఐరావతం తల వినాయకుడికి వెళ్ళింది . దుర్వాసుడు ధర్మదేవత నిజరూపాన్ని చూడాలని దత్తాత్రేయుడితో కలిసి ఆహారం తీసుకోకుండా నిప్పులలోనూ , నీళ్ళ మధ్య పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు .
🌿ధర్మదేవత కనిపించలేదు . దుర్వాసుడు కోపంతో ధర్మదేవతని శపిద్దామనుకుంటూ ఉండగా ధర్మదేవత బ్రాహ్మణరూపంలో సపరివారంగా వాళ్ళ ఎదురుగా వచ్చాడు .
🌸దుర్వాసుడు ఇంకా కోపంలోనే ఉండడం , చూసి మహాత్మా ! ఋషులకు కోపం ఉండకూడదు అన్నాడు . నాకోపం గురించి మాట్లాడుతున్నావు అసలు నువ్వెవరన్నాడు దుర్వాసుడు .
🌿నేను ధర్మదేవతని నీ కోపం తగ్గించడానికి వచ్చానన్నాడు . నువ్వు నాకు కన్పించడానికి పదివేల సంవత్సరాలు కావల్సివచ్చాయా ? ఇప్పుడు కూడా నువ్వు నా శాపానికి భయపడి వచ్చావు .
🌸నువ్వు సుఖం తెలియని రాజుగానూ , దాసీదాని కొడుకుగానూ , ఛండాలుడుగానూ పుట్టమని ధర్మదేవతని శపించాడు దుర్వాసుడు .
🌿అదే విధంగా ధర్మదేవత ధర్మరాజు , విదురుడు , వీరబాహుడు గాను పుట్టాడు . కర్మఫలం అనుభవించడం అంటే ఇదేనేమో ! కృతయుగంలో సుప్రతీకుడనే మహారాజుకి దుర్వాస మహర్షి వరం వల్ల భార్య విద్యుత్ర్పభకు దుర్జయుడనే కొడుకు పుట్టాడు .
🌸అతణ్ణి వెంటనే పదహారేళ్ళ వాడుగా చేసి , ఇంకొక భార్యకి సుద్యుమ్నుడనే కొడుకు కలిగేలా వరమిచ్చాడు దుర్వాసుడు .
🌿దుర్వాస మహర్షి గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండగా బలిచక్రవర్తి కొడుకు సాహసికుడు , తిలోత్తమ కలిసి మహర్షి ఉన్నాడని కూడా మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే ఇద్దర్నీ రాక్షసులుగా భూమిమీద పుట్టమని శపించాడు దుర్వాసుడు .
🌸శ్రీకృష్ణుడి చేతిలో మరణించిన గార్ధభాసురుడు , బాణుడి ఇంట్లో పుట్టిన ఉష వీళ్ళిద్దరే దుర్వాసుడి శాపం వల్ల పుట్టినవాళ్ళు . ఇంద్రుడు అప్సరసల పాటలు వింటూ ఉండగా నారదుడు అక్కడికి వచ్చాడు .
🌿ఇంద్రుడు ఇక్కడున్న అప్సరసల్లో ఎవరు గొప్ప అని నారదుణ్ణి అడిగాడు . దుర్వాసుడి దృష్టి ఎవరైతే మరల్చగలరో వాళ్ళు గొప్పన్నాడు నారదుడు .
🌸అందరూ మావల్ల కాదన్నారు కానీ , వపు అనే అప్సరస నేను దుర్వాసుణ్ణి తీసుకువస్తానని చెప్పి మహర్షి తపస్సు చేసుకుంటున్న చోట ఆడడం , పాడడం మొదలుపెట్టింది .
🌿దుర్వాసుడు వపుని చూసి పక్షివై పుట్టమని శపించాడు . ఆమె క్షమించమని అడగ్గానే శాపమోక్షమిచ్చాడు .
🌸దుర్వాసుడు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని ఔర్వ మహర్షి కుమార్తె ' కందళి'ని చేసుకోవాలనుకున్నాడు . ఔర్వ మహర్షి ఆమె కోపిష్ఠిదని క్షమించమన్నాడు .
🌿కోపిష్ఠి అయినా పర్వాలేదని కందళిని పెళ్ళి చేసుకున్నాడు దుర్వాసుడు . ఎంతచెప్పినా కందళిని తన గుణాన్ని మార్చుకోలేదు . విసిగిపోయిన దుర్వాసుడు ఒకసారి కోపంగా చూశాడు .
🌸అంతే కందళిని భస్మమైపోయింది
ఔర్వ మహర్షి తన కుమార్తెను చూద్దామని వచ్చి ఆమె భస్మమయిపోయిందని తెలిసి దుర్వాసుణ్ణి అంబరీషుడి వల్ల ఘోరమై అవమానం పొందుతావని శపించాడు .
🌿దుర్వాసుడు తిరుగుతూ తిరుగుతూ అంబరీషుడి దగ్గర ఆతిథ్యం అడిగాడు . అంబరీషుడు సరేనన్నాడు . దుర్వాసుడు శిష్య సమేతంగా స్నానానికి వెళ్ళి ఎంతకీ రాకపోతే ద్వాదశి వ్రతనిష్ఠలో వున్న అంబరీషుడు బ్రాహ్మణుల అనుమతితో కొంచెం నీరు త్రాగాడు .
🌸దుర్వాసుడు తిరిగి వచ్చాక తాను రాకుండా నీళ్ళు తాగినందుకు అంబరీషుణ్ణి శిక్షించాలని తన తలనుండి ఒక వెంట్రుక తీసి మంత్రించి పంపాడు .
🌿ఈలోగా అంబరీషుణ్ణి కాపాడ్డానికి విష్ణుమూర్తి చక్రం అడ్డం వేశాడు . దుర్వాసుడు చక్రానికి భయపడి ఈశ్వరుణ్ణి శరణువేడాడు .
🌸శివుడు తనవల్ల కాదన్నాడు . దుర్వాసుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే అంబరీషుణ్ణి వేడుకోమన్నాడు . అంబరీషుణ్ణి వేడుకోగానే ఆ చక్రం మాయమయింది .
🌿ఇదంతా ఔర్వ మహర్షి శాపమేనని అర్ధం చేసుకున్నాడు దుర్వాసుడు .
శబరితాపసుడు తపస్సు చేసుకుంటుంటే దుర్వాసుడు అక్కడికి వెళ్ళాడు .
[11/17, 03:42] +91 73963 92086: 🌸శబరుడు దుర్వాసుణ్ణి మెప్పించి ఆతిథ్యమిచ్చి ఆయనవల్ల గొప్ప పుణ్యాన్నిచ్చే వ్రతాలెన్నో తెలుసుకుని సత్యతప్తుడనే పేరుతో తరించాడు .
🌿 ముద్గల మహర్షిని పరీక్షించాలని దుర్వాసుడు అతనికి అతిథిగా వెళ్ళాడు . ముద్గలుడు తను ఉపవాసముండి దుర్వాసుడికి భోజనం పెట్టేవాడు .
🌸అలా ఎన్నిసార్లు వచ్చినా ముద్గలుడు విసుక్కోకుండా తనకి లేకపోయినా దుర్వాసుడికి పెట్టి పంపిస్తుంటే దుర్వాస మహర్షి అతడికి శరీరంతో స్వర్గానికి వెళ్ళే వరం ఇచ్చాడు .
🌿 దుర్వాస మహర్షి ఒకసారి కుంతి భోజుడింటికి వెళ్ళాడు . అతనికి సపర్యలు చేయడానికి కుంతిభోజుడు తన కుమార్తె కుంతిని అప్పగించాడు .
🌸కుంతి చేసిన సేవలకి మెచ్చుకుని దుర్వాసుడు కుంతిని వరం కోరుకోమన్నాడు .
🌿ఏ దేవుడ్ని ఉపాసిస్తే ఆ దేవుడు వల్ల కొడుకు పుట్టేలా మంత్రం చెప్పమని అడిగింది కుంతి . కుంతి కోరినట్లుగా మంత్రం ఉపదేశించాడు దుర్వాసుడు .
🌸ఒకనాడు పదహారువేలమంది గోపికలు , ఎనిమిది మంది భార్యలతో వున్న శ్రీకృష్ణుణ్ణి చూడాలనిపించి ద్వారకకి వెళ్ళాడు దుర్వాసుడు .
🌿శ్రీకృష్ణుడు ఉగ్రసేనమహారాజు , దేవకీవసుదేవులతో ఎదురెళ్ళి భక్తిగా తీసుకొచ్చి యోగమాయని సపర్యలకి పెట్టాడు .
🌸కొంతకాలం తర్వాత శివుని అంశ వల్ల పుట్టిన యోగమాయని దుర్వాసుడికిచ్చి పెళ్ళి చేశాడు శ్రీకృష్ణుడు .
🌿దుర్వాసుడు రాత్రివేళ శ్రీకృష్ణుడు అష్టమహిషులదగ్గర , పదహారువేలమంది గోపికల దగ్గర ఒకేసారి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయి శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశాడు .
🌸అందర్నీ వదిలేసి శివపార్వతులున్న కైలాసానికి వెళ్ళి శివుడి కాళ్ళమీద పడి ఇంక భూలోకం అంటే విసుగు పుట్టింది , ఇక్కడే ఉండిపోతానన్నాడు దుర్వాసుడు .
🌿నా అంశంతో పుట్టిన యోగమాయ నీ భార్య , అదీ గాక విష్ణుమూర్తె శ్రీకృష్ణుడు . వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడ ఉండకూడదని చెప్పి పంపించేసింది పార్వతీదేవి .
🌸భూభారాన్ని తగ్గించాలని శ్రీకృష్ణుడు ఆలోచించి దుర్వాసుణ్ణి తల్చుకోగానే విషయం తెలిసిన మహర్షి ద్వారకకి వచ్చాడు .
🌿 అక్కడ యాదవులు సాంబుడనే వాడికి ఆడవేషం వేసి ఈమెకి కొడుకెప్పుడు పుడతాడని మహర్షిని వేళాకోళం చేశారు .
🌸దుర్వాస మహర్షి మూర్ఖ్యులారా ! ఈమెకి ముసలం పుట్టి యాదవకులం నాశనం చేస్తుందని శపించి , శ్రీకృష్ణుడి కోరిక తీరిందని వెళ్ళిపోయాడు .
🌿దుర్యోధనుడు పాండవుల్ని అవమానించాలని దుర్వాసుణ్ణి శిష్యసమేతంగా ద్వైతవనంలో వున్న పాండవుల దగ్గరికి వెళ్ళమన్నాడు .
🌸దుర్వాసుడు సరేనని వెళ్ళగానే ధర్మరాజు ఎదురెళ్ళి దుర్వాసుణ్ణి పూజచేశాడు . దుర్వాసుడు స్నానం చేసి శిష్యులతో కలిసి భోజనానికి వస్తానని చెప్పాడు .
🌿వీళ్ళందరికి భోజనం ఎలా పెట్టాలా అని భయపడ్డాడు దర్మరాజు . ద్రౌపది తల్చుకోగానే శ్రీకృష్ణుడు వచ్చి వండుకునే గిన్నె తెమ్మని దాంట్లో ఒక మెతుకు తిని పాండవులకి భయం లేదని చెప్పాడు .
🌸శ్రీకృష్ణుడి ప్రభావం వల్ల దుర్వాసుడికి శిష్యులకి ఆకలి దాహం లేకుండా పోయింది . దుర్వాసుడు యోగదృష్టితో దుర్యోధనుడి కుళ్ళు బుద్ధి తెలుసుకున్నాడు .
🌿శ్రీరాముడు యముడితో రహస్యంగా మాట్లాడుతూ ఎవర్నీ లోపలకి రానివ్వద్దని లక్ష్మణుణ్ణి గుమ్మం దగ్గర కాపలా పెట్టాడు .
🌸కాని అదే సమయంలో దుర్వాసుడు నన్ను లోపలికి పంపకపోతే శపిస్తానన్నాడు .
🌿లక్ష్మణుడు భయపడి అన్నకి ఈ విషయం చెప్పడానికి లోపలికి వెళ్ళాడు . రాముడు తను చెప్పింది వినలేదు కాబట్టి లక్షణుణ్ణి నగరాన్ని వదిలేసి వెళ్ళిపొమ్మన్నాడు రాముడు .
🌸ఈ విధంగా లక్ష్మణుడు తన అవతారం చాలించడానికి దుర్వాసుడు కారకుడయ్యాడు .
🌿పరమేశ్వరుడి అంశలో పుట్టిన దుర్వాసుడు ఎంతో మందిని శిష్యుల్ని చేసుకుని అటు దేవతలకి ఋషులకి , ఇటు మనుషులకి కూడా గొప్ప ఉపకారం చేశాడు .
🌸శివుడి మీద పవిత్రమైన రుద్రకవచాన్ని చెప్పాడు . దుర్వాస మహర్షి . శ్రీరామావతారంలో సాయపడ్డాడు
శ్రీ కృష్ణావతారంలోనూ సాయపడ్డాడు . ఎంత గొప్పవాడో దుర్వాస మహర్షి !!
🌿ఇదండీ దుర్వాస మహర్షి గురించి తెలుసుకున్న విషయాలు రేపు మరో మహర్షి చరిత్ర తెలుసుకుందాము స్వస్తి..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment