🪔🪔 కొత్త వెలుగు🪔🪔
🌹వేసిన రోడ్డు మీద వెళ్ళిపోవడం సులువు. మనమే ఒక రోడ్డు వేసుకుని వెళ్ళడం కష్టం. అమ్మ చందమామను చూపించి బువ్వ తినిపిస్తుంది. జ్ఞాని దేవుణ్ని చూపిస్తాడు. చివరికి అతడే గురువుగా మిగిలిపోతాడు. మంచివాళ్లు, ఆదర్శవంతులు ఒక మార్గం చూపిస్తారు. ఆ దారిలో మనం వెళ్ళే జీవితం ఎక్కువ కష్టాలు లేకుండా సాగిపోతుంది.
🌹కాలం మనతోనే ప్రారంభం కాలేదు. మన ముందు ఎందరో ఉన్నారు. గొప్పగా బతికారు. ఎక్కడికక్కడ ఎలా అడ్డంకుల్ని అధిగమించి వెళ్ళాలో జీవించి చూపించారు. అందువల్ల- మనకు ఒక దారి ఉంది. ధైర్యం ఉంది. భయం లేదు. అలా ముందుకు వెళ్ళిపోదాం! అక్కడ మనకు ఎదురయ్యే ఆటంకాలను, అవరోధాలను పరిష్కరించి, రాబోయే తరాలకు మన మార్గాన్ని ఎలా సుగమం చేసుకున్నామో చూపిద్దాం.
🌹మార్గం పేరు, లక్ష్యం వేరు. సరైన మార్గం ఎన్నుకుంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలం. మనం ఎంతో అదృష్టవంతులం. మన ముందు తరాలవారు మనకు ఎన్నో ఉపాయాలు, పరిష్కారాలు, కిటుకులు అందించారు. భయపడకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చేయండి. మీకు మేమున్నాం- అని వాళ్ల అనుభవాల చరిత్ర భరోసా ఇస్తోంది. వారికి మనం ఎన్నో ధన్యవాదాలు చెప్పుకోవాలి. మనం | కూడా ఎంతో కొంత కృషిచేసి, మన పని మనం చేసుకుంటూ ఇతరులకు ఆదర్శప్రాయమై నాలుగు దారులు కూడలిలో దీపాలు వెలిగించాలి. ఆ వెలుగు భావితరాలకు కనిపించాలి. వాళ్లు మనకు అభినందనలు తెలపాలి.
🌹 ఇదే జీవితం! వెళ్ళేవారు. వెళ్తుంటారు. వచ్చేవాళ్లు వస్తుంటారు. ఎవరి అనుభవాలు వారివి. చివరికి అందరికీ కొన్ని అరుదైన అనుభవాలు శాశ్వతంగా మిగిలిపోతాయి. మరణించిన తరవాతా లోకంలో శాశ్వతంగా ఎలా ఉండిపోవాలో తెలియజేస్తోంది భగవద్గీత. ఎలా బతికితే శాశ్వత పరందామ పథం పొందగలమో కూడా వివరణ ఇస్తుంది. శ్రీకృష్ణుడు మనకు చేసిన | మహోపకారం- భగవద్గీత ద్వారా చూపిన జ్ఞాన మార్గం.
🌹మానవజాతి మొత్తం తరించిపోవడానికి ఆ దారి ఒక్కటి చాలు, కథలున్నాయి. గాథలున్నాయి. కావ్యాలున్నాయి. ప్రబంధాలున్నాయి. పురాణాలున్నాయి. శతకాలున్నాయి. నీతులున్నాయి. ధర్మాలున్నాయి. మనిషి ఎలా బతకాలో, ఇతరులను ఎలా బతికించాలో తెలిపే ధర్మసూక్ష్మాలున్నాయి. మహా గ్రంథాలు, మహానుభావులు అనుభవాలే మనకు దిక్సూచి. వారి కార్యాచరణే మనకు శిరోధార్యం. వారి నిబద్ధతే మనకు ప్రాణసమానం. వాళ్లే మన ఊపిరి. ఆ తాతముత్తాతలు ఆస్తులు ఇస్తారు.
🌹తల్లిదండ్రులు సంపాదించినవి ఇస్తారు. కాని, వెలకట్టలేనివి మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు. అవే మనకు విలువైన సంపద. తరగని ఆస్తి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాముడంటే తెలియని ఒక ప్రదేశంలో పుడితే, రామాయణం కూడా తెలియదు. దాని గొప్పదనం తెలియదు. మన ముందు నడిచిన మహానుభావుల అడుగుజాడల్లో నడవాలి. ధైర్యం విడిచిపెట్టకూడదు. వీరులు వాళ్లు. మన సుఖం కోసం వారెన్నో త్యాగాలు చేశారు. యుద్ధాలను ఆహ్వానించారు. విజయం సాధించారు. శాంతిని అందించారు.
🌹అదే దారిన పడుతూ లేస్తూ అయినా వెళదాం. వెయ్యిసార్లు కిందపడినా, మళ్ళీ లేచి నిలబడదాం. ఒక కొత్త వెలుగును లోకానికి చూపిద్దాం!వారసత్వాన్నే మన సంపదగా అందుకోవాలి.
సత్యం తెలియనప్పుడు వేరు,తెలుసుకున్నాక తెలుసుకున్న సరైన సాధన చేస్తే మాత్రమే ఆధ్యాత్మికతలో ఉన్నతంగా వెదుగుదల ఉంటుంది... కొన్నిసార్లు కొందరి అర్ఢం లేని అర్ఢం కాని ప్రసారాలు, ఉపన్యాసాలు, ప్రవచనాల మూలాన కొంత గందరగోళ పరిస్థితిని ఎదుర్కుంటారు....నమ్మకం, విశ్వాసం మరియు ధృడ సంకల్పం తో సరైన సాధన చేస్తే ఆన్ని ప్రశ్నలకు,అనుమానాలకు సరైన సమాధానాలు పొందడం జరుగుతుంది.
సేకరణ
పసుపుల పుల్లారావు, ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం
9849163616
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment