[12/31/2022, 05:26] +91 73963 92086: *శ్రీరమణ మహర్షి తేదీ ప్రకారం గా రమణ మహర్షి జయంతి నిన్నటి రోజున, తిథి ప్రకారం ఈరోజున*
రమణ మహర్షి
(డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.
16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు. బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు.
రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు.
వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.
ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవాడు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గములని కూడా బోధించేవాడు.
శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి గాంచిన ఈయనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రము) ' నాడు జన్మించాడు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అళగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు (నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వాడు.
పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవాడు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవాడు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపించేవాడు కాదు. తిరుచ్చుళిలో సరైన విద్యాసౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చిన్నాన్న వద్దకు (సుబ్బాయ్యర్) వెళ్ళాడు. రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా ఆయనకు తెలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వల్ల సుబ్బయ్యర్ గారు నాగస్వామి (రమణ గారి అన్నయ్య), రమణ లను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశాడు.
స్వీయ-శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవారు.
రమణ మహర్షిని గూర్చిన ఒక వ్యాసం వ్రాసాన్ని ప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత సోమర్ సెట్ మామ్ రాసాడు.
*30 డిసెంబరు 1879 లో జన్మించిన భగవాన్ రమణమహర్షి.* 20 వ శతాబ్దపు మహర్షి
అని అనేకులచే కీర్తించబడిన భగవాన్ రమణులు సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అవతారం అని అనేక మంది ఉపాసకులు అనుభవాల ద్వారా చెప్పారు. ఆత్మసాక్షాత్కారానికి విచారమార్గాన్ని చూపిన గురువులు రమణులు.
భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తనజీవితం ద్వారా మనకు చూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. మౌనంలో విశ్రమించు, మనస్సు మూలాల్ని అన్వేషించు, ‘నేను’అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. అదే మౌన తపస్సు అంటారు మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని చేసే మౌన సాధన వల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుంది అని ఉపదేశించేవారు అరుణాచల రమణులు.
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో 1879 డిసెంబర్ 30న వెంకటరామన్‌గా జన్మించిన రమణ మహర్షికి పదహారు సంవత్సరాలున్నప్పుడు అంతు తెలియని జబ్బు చేసింది. మరణం అంచుల దాకా వెళ్లి, భగవత్కృపతో బతికి బయటపడ్డారు. ఆ సమయంలో తన మనసులో కలిగిన ప్రేరణతో ఇల్లు వదిలి ఎన్నో దివ్యస్థలాలకు నెలవైన అరుణాచల పర్వతాన్ని చేరారు. అక్కడి కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ, మౌనస్వామిగా పేరు పొందారు. విరూపాక్ష గుహలో ధ్యాన మగ్నుడై ఉన్న ఈ బాలయోగిని కావ్యకంఠ గణపతి ముని సందర్శించుకుని, తనను చిరకాలంగా పట్టి పీడిస్తున్న ఎన్నో సందేహాలను తీర్చుకుని, ఆయనకు రమణ మహర్షిగా నామకరణం చేశారు. అప్పటినుంచి దేహాన్ని చాలించే వరకు రమణ మహర్షి ఆ ప్రదేశాన్ని వీడి ఎక్కడకూ వెళ్లలేదు.
అరుణాచలంలో అడుగిడినప్పటినుంచి చాలాకాలం వరకు మౌనంలోనే ఉన్నారు మహర్షి. భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలు రాసి చూపుతూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత జిజ్ఞాసువులైన భక్తులపట్ల ఆదరంతో పెదవి విప్పి పరిమితంగా మాట్లాడేవారు. అవి
[12/31/2022, 05:27] +91 73963 92086: భక్తుల సందేహాలను తీర్చేవి, వారి బాధలను రూపుమాపేవి. అలా మౌనోపదేశం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు భగవాన్ రమణులు.
రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సమకాలీన భారతీయులకు తెలియజేసినవారిలో ముఖ్యులు కావ్యకంఠ గణపతి ముని కాగా పాశ్చాత్యులకు పరిచయం చేసిన వారిలో ప్రధానమైనవాడు పాల్ బ్రింటన్. రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్, అనంతర కాలంలో ఆయనకు శిష్యుడై, అమూల్యమైన తన పుస్తకాల ద్వారా భగవాన్ జ్ఞానసంపదను ప్రపంచానికి చేరువ చేశారు.అద్వైత వేదాంతమే తన తత్వంగా నిరూపించుకున్న రమణ మహర్షి జంతువులు, పక్షులు, సమస్త జీవులలోనూ ఈశ్వరుణ్ణి సందర్శించారు. ఆయనే అనేక మంది భక్తులకు ఆరాధ్యదైవంగా దర్శనమిచ్చారు. ఆయన అలా అగుపించింది కేవలం హిందూమతంలోని వారికే కాదు, బౌద్ధులకు బుద్ధ భగవానుడిగా, క్రైస్తవులకు జీసస్‌గా, ముస్లిములకు మహమ్మద్ ప్రవక్తగా కూడా దర్శనమిచ్చినట్లు అనేకమంది చెప్పుకున్నారు. తన ఆశ్రమంలో యథేచ్ఛగా సంచరించే అనేకమైన ఆవులను, కోతులను, లేళ్లను, శునకాలను కూడా ఆయన అది, ఇది అనేవారు కాదు. అతడు, ఆమె అనే సంబోధించేవారు. పక్షపాతం చూపడాన్ని, ఆహార పదార్థాలను వృథా చేయడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణించేవారు.
‘‘గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది’’ అని చెప్పిన రమణులు అరుణాచలంలో అడుగిడినప్పటినుండి సిద్ధిని పొందేవరకు మౌనం అనే విలువైన సాధన ద్వారానే అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదను మనకందించారు.1950, ఏప్రిల్ 14న తనువు చాలించేవరకు ఆయన కొన్ని వేల మందికి తన ఉపదేశాల ద్వారా ఉపశమనం కలిగించారు. కొన్ని వందలమందిపై చెరగని ముద్ర వేశారు. కొన్ని తరాల వారిపై బలంగా ప్రభావం చూపారు. ఇప్పటికీ కూడా అనేకులు రమణ మహర్షి నిజంగా భగవానులే అని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ వమ్ము చేయలేదు, చేయరు కూడా! ఎందుకంటే వారి నమ్మకమే ఎంతో రమణీయమైనది మరి!
రమణ వాణి
మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటిబిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం అవివేకం. మానవత్వాన్ని వదులుకోకుండా కడదాకా కొనసాగించడం వివేకవంతుని లక్షణం. భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతదూరంలో ఉంటాడు. సావధానంగా వినటం, సంయమనంతో సమాధానమివ్వటం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం, ప్రశాంతంగా జీవించటం అందరికీ అవసరం. నీ సహజస్థితి ఆనందమే. దానిని కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. అయితే అది బయట ఎక్కడో ఉందనుకోవడమే తప్పు. అది నీలోనే ఉంది. అది గ్రహించడమే జ్ఞానవంతుల లక్షణం. భగంతుని అనుగ్రహం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. దానిని పొందడానికి అవసరమైనవే ప్రయత్నం, సాధన. మన జీవితంలో అనివార్యమైన, నిశ్చయమైన ఏకైక ఘటన మృత్యువు. దానిని గుర్తించి, చనిపోయేవరకు సకల జీవుల పట్ల సంయమనంతో, విచక్షణతో మెలగడం అందరికీ అత్యవసరం. జీవితంలో వ్యతిరేక పరిస్థితులు ఎవరికైనా తప్పవు. అయితే అన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతాయని తెలుసుకుని, భారాన్ని ఆయన మీద వేసి, వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేక మేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి, వాటి మీది నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు. సజ్జనులతో సహవాసం జన్మజన్మల వాసనలను రూపుమాపడంలో తోడ్పడుతుంది. మనం నమ్మిన వారిని భౌతికంగా మాత్రమే కాదు, వారిని స్మరించడం, ధ్యానించడం, వారితో మానసికంగా అనుబంధం పెట్టుకోవడం ద్వారా కూడా వారి సాయం లభిస్తుంది. నీ విశ్వాసమే నీ ఆయుధం.
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు..
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
ప్రతిరోజూ ఉదయం 5 గం.లకు క్రమంతప్పకుండా భగవాన్ కూర్చునే హాలు తెరచేవారు, భక్తుల దర్శనార్ధం. స్వామి సమక్షమే ఈశ్వరసందర్శనం లాగా, స్వామి ప్రమేయం లేకుండానే, భక్తులు సాష్టాంగ నమస్కారాలు చెయ్యడము ఉపనిషద్ పారాయణం, ధ్యానం చెయ్యడం జరిగిపోతూ ఉండేవి. ఆశ్రమ నియమాల ప్రకారం స్త్రీలు రాత్రులందు ఆశ్రమంలో వుండకూడదు కావున, బయటనుండి స్త్రీలు ఆ సమయానికి ఆశ్రమానికి వచ్చేవారు.
ఆరున్నరగంటలకు స్వామి స్నానంముగించి ఫలహారం సేవించి కొండమీదకు వెళ్ళేవారు. మిగిలినవారు తమ దైనందిన పనులు చూసుకునేవారు. అంటే, తోట నుండి పూలు తెచ్చి పూలు కట్టడం, వంటకు కావలసిన సంభారాలు వూరిలోనికి వెళ్లి తేవడం, వంటపని, పశువులను శ్రద్ధగా చూసుకునే పని యిలాంటివి. మరి కొందరు ఆశ్రమకార్యాలయంలో పఠనాలయమ్ నిర్వహణా కార్యక్రమం లో వుండేవారు.
వేదపాఠశాల నిర్వహించేవారు మాతృభూతెశ్వరునికి, దేవి యోగంబకు, స్కందునికి, వినాయకునికి, శ్రీచక్రమునకు, ఆగమవిధి ప్రకారము పూజలు చేశేవారు. పర్వదినాలలో విశేషపూజలు చేసేవారు.
ఎనిమిది గంటలకు స్వామి మరల హాలులో సోఫాలో కూర్చునేవారు. ఎక్కువగా మౌనంగా ధ్యానముద్రలో వుండేవారు. ఆసమయంలో భక్తులు తాము వ్రాసిన స్తోత్రాలు, పాటల
[12/31/2022, 05:28] +91 73963 92086: ు పాడేవారు. కొందరు తమ వాదనా పటిమ స్వామి ముందు ప్రదర్శించాలని ఉవ్విళ్ళూరేవారు. వారికికూడా మౌనమే స్వామి సమాధానం. ప్రశ్నలు అర్ధవంతమై, అవతల వ్యక్తి జిజ్ఞాసతో కూడినది అయితే సమాధానం ఇచ్చేవారు. చాలా మంది మటుకు స్వామివదనం చూస్తూ ఆత్మవిచారము, ధ్యానము సులభంగా అభ్యాసము చేశేవారు.
ఆవిధంగా కొద్దిసేపు గడిచిన తరువాత, 9 గం. లకు దేశవిదేశాల నుండి వచ్చిన లేఖలకు గణపతిముని వ్రాసిన జవాబులు చూసి, అవసరము అనుకున్న చోట్ల సరిచేసేవారు. తిరిగి భక్తులతో గోష్టి . పదకొండున్నర గంటలకు మధ్యాహ్న భోజనము. ఆపై రెండుగంటలవరకు స్వామి వార్తాపత్రికల చదవడమో, విశ్రమించడం చేశేవారు.
సుమారు రెండున్నర గంటలకు భక్తులందరకూ తేనీరు. మళ్ళీ హాలులో స్వామి కొలువుతీరి సాయంత్రం వరకు దేశవిదేశీ భక్తులతో సత్సంగం. కొందరు సందేహనివృత్తి చేసుకునేవారు.
కొందరు స్వామి తేజోవంతమైన కన్నులవైపేచూస్తూ, ఆత్మానందాన్ని అనుభవిస్తుండేవారు. సాయంకాలం 4.30 గం. లకు స్వామి కొండపైకి వెళ్ళేవారు. తిరిగిరాగానే, 5.30 నుండి ధ్యానసమయం. ఈ సమయంలో స్వామి వసారాలో కూర్చుని దర్శనమిచ్చేవారు. చుట్టుపక్కల అనూహ్యమైన ప్రశాంతత. వేదవిద్యార్ధుల నమక చమక పారాయణ, శ్రీ సూక్త పురుషసూక్తాలతో పరిసరాలు మారుమ్రోగిపోయేవి.
ఆతరువాత కొద్దిసేపు ఉపదేశసారము, వివిధ పుస్తక పారాయణము. ఆ సమయానికి మాతృభూతేశ్వర పూజ జరిగేది. ఆ తరువాత స్త్రీలు భోజనం చేసి నిద్రించడానికి వూరిలోనికి వెళ్ళేవారు.
స్వామి రాత్రి 7.30 ని. లకు లఘుభోజనము. ఎనిమిదిన్నరవరకు శిష్యుల ఘోష్టి. అనంతరం శిష్యులు నమస్కరించి శలవు తీసుకునేవారు.
ఆహా! యెంత నియమనిష్ఠలతో కూడిన దినచర్య. ఇట్టి దినచర్యలో స్వామితో పాలుపంచుకున్న ఆనాటి భక్తులు యెంతధన్యులో కదా! వారికి జీవన్ముక్తి కలిగింది అనుకోవడంలో అణుమాత్రం సందేహంలేదు. ఈ నాటికీ రమణాశ్రమంలో చరమాంకజీవితం గడుపుతున్న వారి జీవితాలు యెంత ప్రశాంతతను సంతరించుకున్నవో కదా!
రమణ = క్రీడించువాడు, రూప సంపదచేత సంతోషింప జేయువాడు; రమాయణీయుడు,సుందరుడు,మనోహరుడు, మనోజ్ఞుడు (ప్రియుడు,భర్త):;యోగులు రమించెడి నిత్యానంద స్వరూపమగు పరబ్రహ్మ,ఇచ్చాను సారము రామనీయమైన మూర్తిని వహించునట్టివాడు.
సర్వజీవుల హృదయములో ఎరుకగా క్రీడించెడివాడు.
భగవాన్ శ్రీ రమణమహర్షి చిన్ననాటి పేరు వెంకట్రామాన్.
బ్రాహ్మణ స్వామిగా విరూపక్ష గుహలోనున్న సమయంలో కావ్య కంఠ గణపతిముని వారికి ఈ పేరు ప్రసిద్ధ మొనర్చారు. జగద్విఖ్యాతిగాంచిన పేరు ఇదే.
భగవాన్ ఆత్మయొక్క శుద్ధచిత్ స్వరూపంలో క్రీడించారు.
రమణీయమే వారి బోధ. రమాణీయము అంటే ఆనంద సౌందర్యముల అనుభూతి. ఈ అనుభూతి చెడులో లేదు.
మంచిలో లేదు,అసత్యంలో లేదు,సత్యంలో ఉంది; ద్వేషంలో లేదు, ప్రేమలో లేదు ; సంఘర్షణలో లేదు, శాంతిలో ఉంది.
అంతస్సు బహిస్సును అనుగమిస్తుంది,అధోగమిస్తుంది. కనుక అంతర్ముఖత్వం వ్యక్తిత్వానికి పూర్ణత్వం ఇస్తుంది.
కేవలం ధ్యాన సమాధి నిమగ్నతలోనే కాక ,ప్రాపంచిక కర్యకలపాలలో కూడా ఆనంద రసామృతాన్ని ఆస్వాదింపజేస్తుంది.
శ్రీ రమణ మహర్షి రచించిన అక్షర మణమాల అర్థ విశేషాలలోని కొన్ని....
87. మౌనియై రాయిగా నలరకయున్నచో
మౌనమిది యగునొ అరుణాచలా !
భావం
అరుణాచలా ! కటికరాయి వలె ఉన్న మౌన స్థితి నిజమైన మౌనము
కాదు.అది ఆదర్శ నీయము కాదు.
విశేషాలు
మనసునిజముగానే మౌనమవటానికి హృదయమనే పద్మం
పూర్తిగా వికసింప వలసిన అవసరము ఉన్నదని రమణులు ఈ
చరణంలో ప్రబోధిస్తున్నారు. మనస్సుని మౌనముగా చేయటమే
అసలైన మౌనం. అనగా అహంకారం నశించి. కోరికల ఆలోచనలు
లేని మౌనమని తాత్పర్యం.
ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళదలిస్తే శ్రీ భగవానులవద్దకు వచ్చి
"వెళ్ళవచ్చునా" అని అనుమతి తీసుకునే వారు. " నేను మద్రాసు
వెళుచున్నాను లేక ఇంకెక్కడికో ప్రయాణం చేయవచ్చునా"? అని
అడుగగా భగవానులు ఒక్కొక్కసారి " సరే" అని మరికొన్ని
సందర్భాలలో మౌనంగా ఉండిపోయేవారు. భగవాన్
అంగీకరించారని ఎంతో సంతోషంగా భక్తులు
ప్రయాణమయ్యెడివారు. ఎవరైనా నిజంగా ఆయన అనుమతి
తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయనవద్దకేగి ఏమైనా అడిగితే రమణులు
తమ అంగీకారాన్ని మౌనంగా ప్రకటించేవారు.
మౌనం ఆధ్యాత్మిక సాధనకు మార్గం అయితే.. జపాలు, తపాలు,
కీర్తనల మాటేమిటి? ఇవన్నీ దైవంపై మనసు కేంద్రీకృతం
చేయడానికి ఉద్దేశించినవే! అయితే దైవత్వాన్ని మనస్ఫూర్తిగా
అనుభవించడానికి మౌనం కన్నా మహత్తరమైన సాధన లేదని
చెబుతుంది రమణుల జీవితం. జపం చేస్తున్నామనుకోండి.
పెదవులు మంత్రాన్ని పలుకుతుంటాయి. చేతిలో జపమాల
తిరుగుతుంటుంది. మనసు జప సంఖ్యపైకి మళ్లుతుంది. చివరగా..
సంకల్పం పక్కదారి పడుతుంది. సాధన సమర్థవంతంగా
సాగాలంటే జపం ఆగిపోవాలి. జపమాల తిప్పడం మరచిపోవాలి.
మనసులో మౌనం ఆవహించాలి. అప్పుడు ధ్యానం ఉన్నతస్థితికి
చేరుకుంటుంది.
సేకరణ.
No comments:
Post a Comment