Tuesday, September 17, 2024

🌹గుడ్ మార్నింగ్ 🌹జీవిస్తాం, అందరం అవసరాల కొరకు, కోరికలు తీర్చుకోటానికి నిరంతరం బయట చూస్తూ - బయటే సంపూర్ణ శ్రద్ధను, ధ్యాసను ఉంచి - మొత్తం బయటి నుండి పొందటానికి ప్రయత్నిస్తూ జీవిస్తాము. బయట దృష్టి అవసరమే. అన్నీ బయటి నుండి పొందాలన్నది నిజమే...
కాని ఎంత? ఎన్ని? ఎప్పటి వరకు?
ఈ ప్రశ్నలకు సమాధానం బయట ఉన్నంత వరకు దొరకక పోగా - ఇంకా ఏవో పొందలేక పోతున్నాను అన్న భావన పెరుగుతుంది - నా మొత్తం బాధలకు బయటి వారే కారణం అనిపిస్తుంది. ఇలా అన్నీ పెరుగుతూ అనేక చెడు లేక వ్యతిరేక భావాలు పెరుగుతూనే ఉంటాయి. స్వార్ధం పెరుగుతూ ఆగక సాగుతూనే ఉంటుంది......
ఒక్కసారి మనలోకి మనం వచ్చి - మనను మనం గమనించుకుంటే - లోపల కధ అంతా మనదే ఉంటుంది. మనము లోపలికి తీసుకున్నవే లోపల మనను కదపగలవు అన్న సత్యం లోపల గమనించుకుంటూ ఉంటే అర్ధమవుతుంది. అన్నిటికి నేనే పూర్తి కారణం అని తెలుస్తుంది. అలా లోపల చూసుకునే వారికి బయటి అన్ని విషయాలలో ఎక్కడ ఆగాలో, ఎలా ఆగాలో తెలుస్తుంది. ఎప్పుడైతే నేనే కర్త, కర్మ, క్రియ అని తెలుస్తుందో - బయటి నేరారోపణలు - చెడులు ఆగిపోతాయి.నేను నాకు పూర్తిగా అర్ధమవుతూ ఉండటం వలన మొత్తం బాధ్యత నాదే అని అర్దమవుతుంది. ప్రయత్నిస్తే సత్య జీవితం ----------- ప్రయత్నించలేకపోతె  - కనీసం కారణం నా భావనలే అని అయినా తెలుస్తుంది. బయటిదంతా లోపలిదానిపైనే ఆధారపడి ఉంది. కాసేపు లోపలకు కూడా వెళదాము. మన లోపలకు మనం వెళ్లి, మనతో మనం ఉండటమే ధ్యానము - తపస్సు - ఆధ్యాత్మికత - ఆత్మజ్ఞానము. చాలా తేలికైన విద్య లేక సాధన. కానీ బయటే ఉంటూ, దైవాన్ని, జ్ఞానాన్ని కూడా బయటే వెతుక్కుంటూ తిరుగుతున్న వారికి ఎప్పటికి అసలు ఆలోచనే పుట్టని అంతరంగ చదువు ఇది. ఏమి చేస్తాం....ఎవరి ఇష్టం వారిది. ఎవరి నడక వారిది. ఎవరి స్వేచ్ఛ వారిది. కాని సత్యము - గమ్యము మాత్రము ఒక్కటే. అది నువ్వే. నీ లోపల ఉన్న నువ్వే... 🌹god bless you 🌹

No comments:

Post a Comment