28-10-2024-సోమవారము-శుభమస్తు...
🌹🌹🌹🌹 గుడ్ మార్నింగ్ 🌹🌹🌹🌹
మనిషికి కలిగే చాలా బాధలు వదలలేకపోవటం వలన. ఇవి వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, సంపదలు కావచ్చు, బంధాలు, బంధుత్వాలు కావచ్చు, అనుభవాలు, అనుభూతులు కావచ్చు......
సంపాదించేది ఖర్చుపెట్టుకోటానికి............
వస్తువులన్నీ వినియోగానికి...................
బంధాలు బ్రతకటానికి...........................
సంఘటనలు, సందర్భాలు కాలములో కదిలిపోతూ ఉంటాయి....................
అనుభవాలు, అనుభూతులు జీవించటములో ప్రతి సెకను అందుతూ, వచ్చి పోతూ మారిపోతూనే ఉంటాయి. అసలు మన శరీరమే పాతను వదిలేస్తూ కొత్తగా మార్పులు చెందుతూ నిరంతరం మారిపోతూనే వున్నది.....................
విశ్వములో అన్నీ - ప్రతి దాని కదలిక ఉన్న స్థితిని వదులుతూ, కొత్త మార్పులు పొందుతూ - మొత్తం విశ్వమే ఎప్పటికప్పుడు కదిలిపోతున్నది................ శక్తి లక్షణం చైతన్యం అంటే కదలిక అంటే వున్నది ఉన్నట్టుగా ఉండకుండా జరిగే మార్పు. మార్పే జీవత్వపు లక్షణము..........
స్థిరత్వము జడము.చైతన్యము కదలిక మార్పు. మార్పు అంటే వున్నది ఇంకోలా..... ఎప్పుడూ మరోలా.................................
అందుకే భవిష్యత్తు ఎవరికి తెలియదు. కారణం అనంత విశ్వ చైతన్యపు కదలికే మన భవిష్యత్తు. అది ఎలా కదలబోతున్నదో ఎవరికి తెలుసు.................................
వదలలేక పోవడం అంటే స్థిరత్వపు భావనతో - జడత్వాన్ని కోరుకుంటున్నాము.
సృష్టి తీరే మార్పు - అది శక్తి కనుక...........
మనకు నచ్చినా నచ్చకపోయినా - మనము లాభమనుకున్నా, నష్టమనుకున్నా - మనకు సంతోషమయినా, బాధ అయినా - మనము ఎంత ప్రయత్నించి ఆపాలనుకున్నా............
శక్తి కదలికను - అదే మార్పును ఆపటం కుదరదు. అది మొత్తముగా అనంత విశ్వములో జరుగుతూ - ఆ విశ్వములోనే ఉన్న మనతో కలిపి జరుగుతున్న ఏక ప్రక్రియ.ఈ ప్రక్రియను అర్ధం చేసుకోవటము, అంగీకరించటం తప్ప వేరే దారి లేదు...........
ఇది చైతన్యపు, కదలిక అనే సత్య లక్షణపు చర్యల యొక్క వ్యవస్థ.......................
వదలలేకపోవటం అంటే విశ్వ శక్తికి విరుద్ధముగా కోరుకోవటం లేక ప్రయత్నించటం. ఎలా???? అసంభవం......
ఇక్కడ వ్యవస్థ అంతా వచ్చింది పోవటం - పొందింది పోగొట్టుకోవటం...................
వచ్చిన, ఉన్న, మనమే కచ్చితముగా ఒక రోజు మనను - మనమే వదలి వెళ్లిపోక తప్పని సృష్టి విధానము............................
ఆశ్రద్దతో పారవేసుకోమని, పాడుచేసుకోమని కాదు........................
సంపూర్ణ శ్రద్దతో జరిగేదానిని అంగీకరించమని - మన పరిధిలో లేనిది, మన వల్ల కానిది, మనము ఆపలేనిది, జరుపలేనిది - జరిగినది,జరుగుతున్నది, జరగబోయేది అంగీకరించమని...............
అంగీకరించడం అంటే - నేను - సృష్టితో కలిసి సాగడం.................................
బలమైన ముద్రల, కోరికల, ఆశల, మనసు వదలలేక దుఃఖపడుతుంది.....................
ఎప్పుడు విడిగా, విభేదముగా, పరిమితముగా ఉండిపోతుంది..........
జ్ఞానము - అర్ధం చేసుకుంటూ, అంగీకరిస్తూ
సాగిపోతుంది - సృష్టిలో కలిసిపోతుంది.
ఇదే ఆధ్యాత్మిక చదువు.వదలగలగటం అనే సాధన - పరిమితిని వదిల్చి - అనంతములో లయింప చేస్తుంది.................................
ఇదంతా నువ్వు నీకే నేర్పుకొని - నిన్ను నీతో నువ్వే నడుపుకొని - నీలో నువ్వు - నీతో నువ్వు సాగవవలసిన అంతరంగ, ఆత్మజ్ఞాన, ఆధ్యాత్మిక స్వీయ సాధనా ప్రక్రియ.ఆధ్యాత్మిక చదువు...............
🌹🌹🌹🌹 god bless you 🌹🌹🌹🌹
No comments:
Post a Comment