Saturday, October 26, 2024

 దర్శనాలు ఆరు

'దర్శనం అనే పదానికి దృష్టి, చూడటం, చూపించడం (ప్రదర్శన) అనే అర్ధాలున్నాయి. ఇవి సాధారణ ఆర్ధాలు. ఒక పవిత్రవ్యక్తిని లేదా దేవతలను, విశేషవస్తువు లాంటి వాటిని స్పష్టంగా చూడటానికి ప్రయత్నించడం అని విశేషార్థం. సాధనతో కూడిన ప్రార్ధన, లేదా ధ్యానంతోనే ఇది సాధ్యమవుతుంది. జీవితం, ధర్మం, మోక్షం లాంటి తాత్విక విషయాల గురించి చాలా మందికి అనేక సందేహాలు కలుగుతుంటాయి. వాటన్నింటికీ తత్వవేత్తలు పలురకాలైన సమాధానాలు సులభమైన రీతిలో చెప్పారు.. వాటినే దర్శనాలు అంటారు.

దర్శనం అంటే మూలాల వైపు చూడటమనీ మరొక అర్థం ఉంది. మనసులో కలిగే అనేక వేదాంతపరమైన ప్రశ్నలకు సమూలమైన సమాధానాలు దర్శించగలం కాబట్టి దర్శనాలు అని పిలుస్తారు. వాటిలో ముఖ్యమైనవి ఆరు. వాటినే షడ్దర్శనాలు అంటారు. అవి- సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. వీటిలో మొదటిది సాంఖ్య దర్శనం. దీన్ని రచించిన వాడు కపిల మహర్షి. 'విశ్వ ఆవిర్భావానికి కారణ భూతమైంది. ప్రకృతి' అని సాంఖ్య సిద్ధాంతం చెబుతోంది. దీని కదనం ప్రకారం సత్వం(సాత్వికం), రజస్సు(రాజసం), తమస్సు (తామసం) అనే మూడు గుణాలతో ఏర్పడింది. ఈ ప్రకృతి. మానవుడు ఈ మూడింటి చేష్టలను గమనిస్తూ సంసారంలో బందీ కాకుండా జాగ్రత్త పడే
వివరాలను తెలుపుతుందిది.
పతంజలి మహర్షి యోగదర్శనాన్ని రచించాడు. ఇందులో నిగ్రహించుకోవడానికి మనసును ఉపాయాలు సూచించాడు. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, సమాధి అనే పది రకాలైన అభ్యాసాల đó మానవుడు ఆనందమయ జీవనాన్ని గడిపే మార్గాలను సూచిస్తుంది. యోగదర్శనం. మూడోదైన న్యాయ దర్శనాన్ని గౌతమ మహర్షి దర్శింపజేశారు. వైదిక ధర్మాన్ని అర్ధం చేసుకుని, అవి చేసే సూచనలను అనుసరిస్తూ క్రమబద్ధమైన తార్కిక ధార్మిక జీవనం గడపడానికి, న్యాయదర్శనం దోహదపడుతుంది. ప్రతి వనరునీ సరైన రీతిలో ఉపయోగించుకుని, జీవితాన్ని సుఖమయం చేసుకునే మార్గాలను
తెలుపుతుంది న్యాయ దర్శనం. వైశేషిక దర్శనాన్ని కణాద మహర్షి ప్రచారం చేశాడు. జీవించే విధానంలో విశేషాలను తెలుపుతుంది కాబట్టి దీనికి పేరు. యోగమార్గంలో భగవత్రీతి కోసం సత్కర్మలను చేసేవారికి భగవంతుడి అనుగ్రహం దక్కుతుంది. వారికే మోక్షం లబిస్తుంది. జీవులు సుఖదుఃఖాలు దేనివల్ల కలుగుతున్నాయో గ్రహించి తదనుగుణంగా దుఃఖమయ జీవనం వదిలి. సుఖమయ జీవనం గడిపే మార్గాలను సూచిస్తుంది.

వేదాల మొదటి భాగం ఆధారంగా ఏర్పడింది పూర్వ మీమాంసా దర్శనం. ఈ దర్శనకర్త జైమిని మహర్షి. ఇది వేదాల్లో చెప్పిన యజ్ఞయాగాది కర్మలకు ప్రాముఖ్యాన్నిస్తుంది. వేద నిషిద్ధాలైన కర్మలు చేసేవారు ఎలాంటి ఫలితాలు పొందుతారు... ఎవరి కర్మ ఫలాన్ని బట్టి అనుభవం వారికి ఎలా వస్తుంది... సుఖమయ జీవనం కోరుకునే వారు ఎలా మసలాలి? వీటి గురించి స్పష్టంగా చెబుతుంది పూర్వమీమాంస, వేదాల ఉత్తరభాగం ఆధారంగా ఏర్పడింది కాబట్టి ఉత్తరమీమాంస. వేదాల చివరి భాగమైన ఉపనిషత్తులనుంచి ఉద్భవించినవివి. జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధాన్ని తెలియపరుస్తాయి. వ్యాసమహర్షి రచించిన వీటిని బ్రహ్మసూత్రాలు అనీ వేదాంత దర్శనమనీ అంటారు.
ఈ దర్శనంలో అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం- అనే మూడు సిద్ధాంతాలు " ప్రసిద్ధాలు. సక్రమ జీవన విధానాన్ని గడిపి మోక్షాన్ని పొందే మార్గాలను తెలిపేవే దర్శనాలు.

- అయ్యగారి శ్రీనివాసరావు

No comments:

Post a Comment