Friday, October 25, 2024

ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరు!

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరు!*
             ➖➖➖✍️

*ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు...*

*అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు, బ్రహ్మానందం తనికెళ్ళ భరణి ఇద్దరినీ చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారిద్దరూ కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నమయ్యాడు.*

*పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీలేదు, వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది గానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు, ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకొని పూజారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమని అడిగారు.*

*”ఇప్పుడు సమయం అయిపోయింది రేపు ఉదయం ఏడు గంటలకు రండి” అని చెప్పి వెళ్ళిపోయాడు.*

*మర్నాడు ఉదయం ఏడు గంటలకల్లా గుడి దగ్గర నిలబడి ఉన్నారు, పూజారి రావడం, అభిషేకం చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అన్నీ అయిపోయాయి.*

*”స్వామీ దక్షిణ తీసుకోండి!” అని తలా వేయిరూపాయలు బయటకు తీశారు.* 

*ఆయన హుండీలో వేయమని సైగ చేశాడు.*

*యూనిట్ వాళ్లు టిఫిన్ తెచ్చి ఇచ్చారు ఇద్దరూ ఆ గుడి ఆవరణలోనే కూర్చుని తినడానికి వెళ్తూ పూజారిని ఆహ్వానించారు.* 

*”నేను తినేశాను మీరు తినండి.”అని సున్నితంగా తిరస్కరించాడు.*

*”కాఫీ అయినా తాగండి” అన్నారు.* 

*ఆ పూజారి “మంచినీళ్ళు కూడా తాగను” అనేశాడు.* 

*”మీరు మమ్మల్ని గుర్తించారా ?”అని అడిగారు భరణి గారు కాస్త అహంతో.*

*ఆ పూజారి పేర్లతో సహా చెప్పాడు.*

*బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఆశ్చర్యంతో… "స్వామీ దక్షిణ ఇస్తే తీసుకోలేదు హుండీలో వేయమన్నారు, టిఫిన్ ఇస్తే తీసుకోలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు, ఎందుకు, కారణం తెలుసుకోవచ్చా" అని అడిగారు.* 

*అప్పుడాయన "సార్ నాకొక ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి ఈ జీవితానికి" అని వెళ్ళిపోయాడు.* 

*ఆ సందర్భాన్ని అప్పుడే భరణి గారు "మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది" అని వర్ణించారు.*

*ఎవరి దగ్గరా ఏదీ ఆశించకపోతే జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది ఇద్దరికీ, ఆక్షణం… ‘ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరు!’ అన్నంత గొప్పగా కనిపించాడు ఆ పూజారి వాళ్ళిద్దరి కళ్ళకి, సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషీ మహారాజే గురూజీ.*

*ఆశించడం ఆపేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎవరి నుంచీ ఏదీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అప్పుడే లైఫ్ లో తృప్తి దొరుకుతుంది, ప్రశాంతత నీలో కొలువుంటుంది.*

*ఈ సంఘటనను వెంటనే భరణి గారు. ఓ పాటలా ఇలా రాశాడు...*

*"మాసెడ్డ మంచోడు దేవుడు*    *మాసెడ్డ మంచోడు దేవుడు                 నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు                            మాసెడ్డ మంచోడు దేవుడు... అస్సలడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు మాసెడ్డ మంచోడు దేవుడు..."*✍️

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment