27-10-2024-ఆదివారము - శుభమస్తు...
🌹🌹🌹🌹 గుడ్ మార్నింగ్ 🌹🌹🌹🌹
మనసును నెమ్మదింప చేసుకోవటమే మన శాంతికి మార్గము. మంచిలో నైనా - చెడులోనైనా వేగవంతముగా సంచరించే మనసు - నిత్యము అనేక సందర్భములలో మనిషి చేసే పనులలో లేక ఆలోచనలలో వేగముగా పరుగులు తీసే మనసు శాంతిని ఇవ్వదు. చెడ్డ వారికి ఎలాగూ శాంతి ఉండదు - మంచి వారికి కూడా శాంతి ఉండకపోవటానికి కారణం ఈ వేగ మనసు.
మనసు వేగం ఊహించలేనిది. స్మరణ మాత్రమున ఎక్కడికైనా వెళ్ళిపోగలదు...
కాని మనసు కదలికలకు అనుగుణముగా కదలవలసినది శరీరము. శరీరమునకు అన్ని విధములుగా పరిమితి వున్నది..... శరీరము కొంత పరిమిత వేగముతోనే
ఏదైనా చేయగలదు.......................
మనసును శరీర వేగమునకు కలిపి నడుపుకునేలా మనో వేగాన్ని అదుపు చేసే ప్రక్రియే ఆధ్యాత్మికము. నా మనసు, నా శరీరము కలిసి ఒకే వేగములో, ఒక తీరుగా
నేనే నడుపుకుంటాను......................
అప్పుడు శరీర స్థితిగతులకు తగ్గట్టుగా మనసు ఉండటం చేత - ఆలోచనలు, పనులు అన్నీ సక్రమముగా ఉంటాయి...
ఈ సక్రమత లేని వారు తొందరపాటు మనుషులుగా మన చుట్టూ కనపడుతూనే వుంటారు. ఓర్పు అనేది ఈ మనసు అదుపు వలన వచ్చేదే.......................
చెడు మొత్తము ఈ మనో పరుగుల వల్లనే...
ఎక్కువగా ఆలోచించటం - అన్ని వ్యతిరేక ఆలోచనలు చేయటం - ప్రస్తుతానికన్నా భవిష్యత్తు ఊహలలో ఎక్కువ ప్రయాణించటం - ఇలాంటి ఎన్నో మనో వేగపు చర్యలే...........................
దీనికి సాధన మనను మనము గమనించుకోవటమే..........................
మనలోని అసమానతలను అర్ధం చేసుకొని - వాటిని సరి చేసుకునే సామర్ధ్యం మనకే వున్నది. ఇలా నిరంతరం మనను మనం అన్ని విధములుగా సరి అయిన విధానములో నడుపుకోవటమే ఆధ్యాత్మిక చదువుకు సంబంధించిన సాధన.............
నిరంతరం నీలో నువ్వు - నీతో నువ్వు - నిన్ను గమనించుకునే నువ్వు - నిన్ను సరి చేసుకునే నువ్వు..ఇదే ఆధ్యాత్మికము....
🌹🌹🌹🌹god bless you 🌹🌹🌹🌹
No comments:
Post a Comment