Friday, October 25, 2024

 _*చతుర్విధ పురుషార్థాలు - శాస్త్రాలు*_

✳️ మనిషి జీవితంలో సాధించవలసిన ప్రయోజనాలను నాలుగు విధాలుగా విభజించింది భారతీయ సంస్కృతి♪.
1. _*ధర్మం*_
2. _*అర్థం*_
3. _*కామం*_
4. _*మోక్షం.*_

🪷 ఈ నాలుగూ విడివిడిగా సాధించవలసినవి కావు♪. పరస్పర సమన్వయంతో సాగాలి♪. _*ధర్మంతో.. అర్థకామాలను సంపాదిస్తూ మోక్షం కోసం సాధన చేయడమే సార్థకమైన జీవితం♪.*_

🪷 ఈ నాలుగు పురుషార్థాలకు శాస్త్రాలను ఏర్పరచారు♪. అంటే - వీటికి సంబంధించిన సమగ్ర విజ్ఞానం ఈ దేశంలో ఆవిష్కరించబడిందని అర్థం♪. ఎక్కడ ఒక విషయమై పరిశీలన, పరిశోధన జరిగి విజ్ఞానం వెలికివస్తుందో అక్కడ ఆ విషయం శాస్త్రం (Science) అవుతుంది♪. అలా నాలుగు పురుషార్థాలకు తగిన శాస్త్రాలను విస్తృతిగా ఏర్పాటుచేసినా, ప్రధానంగా నాలుగింటికీ సూత్రగంథాలున్నాయి. వీటికి మూలం వేదవిజ్ఞానం♪.

1. _*'ధర్మ'*_ సాధనకు ఆధారం స్మృతులు♪. వీటినే ధర్మశాస్త్రాలు అంటారు♪. మనుస్మృతి, పరాశరస్మృతి, గౌతమ ధర్మసూత్రాలు వంటి అనేక స్మృతులు మనకు ఉన్నాయి•. యుగాల క్రితమే మానవవ్యవస్థ, నాగరికత నిర్మాణంలో ఎంత బలమైన శాస్త్రీయ పునాదులు ఈ దేశంలో వేసి ఉన్నాయో ఈ గ్రంథాలను పరిశీలిస్తే అర్థమౌతుంది♪.

2. _*'అర్ధ'*_ విషయమై కూడా ఎన్నో గ్రంథాలున్నా కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రాచీనమూ, ప్రామాణికమూ♪. ప్రపంచ దేశాలకు ఇప్పటికీ ప్రయోజనకరమైన అంశాలున్న రాజకీయ, సామాజిక నిర్వహణ విధానాలు ఇందులో ఉన్నాయి♪. ఈ సూత్రాలను నేటికి అన్వయించి ఆచరిస్తే చక్కని ఫలితాలను పొందగలమనడంలో సందేహం లేదు♪.

3. _*'కామ'*_ విషయమై కూడా పశుప్రవృత్తి నుండి ఎదిగి, ధార్మిక సరళిలో ఉత్తమ కుటుంబ వ్యవస్థ నిర్మాణానికి సహకరించే విధంగా కామశాస్త్రాలు అభివృద్ధి చెందాయి. కొక్కోకుడు, వాత్స్యాయనుడు వంటి వారు ఈ శాస్త్రాలను ఏర్పరచారు♪. మహర్షి వాత్స్యాయనుడు రచించిన కామసూత్రాలను సమగ్రంగా, సవ్యంగా పరిశీలిస్తే ఉత్తమధార్మిక విధానంలోని మూడవ పురుషార్థ విధానం గోచరిస్తుంది♪. _*'ధర్మావిరుద్ధోభూతేషు కామోస్మి భరతర్షభ - ధర్మ విరుద్ధంకాని కామం భగవత్స్వరూపము అన్న గీతాచార్యుని బోధకు ఈ శాస్త్రం చక్కని ఆవిష్కరణ♪. 

4. _*'మోక్ష'*_ ప్రయోజనం కోసం జ్ఞాన, భక్తి, యోగాది మార్గాలు ఉన్నాయి♪. వాటన్నిటికీ కూడా శాస్త్రాలు ఏర్పడ్డాయి♪.

👉 జ్ఞానమార్గానికి బాదరాయణుని (వ్యాసుని) బ్రహ్మసూత్రాలు, భక్తి మార్గానికి నారదాదుల భక్తిసూత్రాలు, యోగ విధానానికి పతంజలి యోగ సూత్రాలు ప్రసిద్ధాలు.

✅ వీటన్నిటి సమన్వయాలు మన ఇతర కావ్యాదుల్లో కనిపిస్తాయి♪. ఇలా మన సనాతన సంస్కృతిని పరిశీలిస్తే మానవ జీవితాన్ని ఏదో ఒక కోణంలో కాక, అన్ని కోణాలలోనూ అవగాహన చేసుకొని అర్థవంతంగా జీవించేందుకు అనువైన మార్గాలను ఏర్పరచిన మహోజ్జ్వల నాగరికత మనది అని అర్ధమౌతుంది♪.

🪷 ఈ శాస్త్రాలతోపాటు సంగీతం, నాట్యం, శబ్దశాస్త్రం (వ్యాకరణం), అలంకారశాస్త్రం, వైద్యం, శిల్పం, జలవిద్య, యుద్ధవిద్య ఇలా అసంఖ్యాక విషయాలపై అపారమైన శాస్త్రాలను ఏర్పరచారు♪. సంస్కృతాన్ని అధ్యయనం చేసి, ఈ శాస్త్రాలను పరిశీలిస్తే ఒక అద్భుత నాగరికతను మళ్లీ సాధించగలం♪.

No comments:

Post a Comment