Saturday, October 26, 2024

 *_ఈ సమాజంలో నటిస్తూ... నమ్మించే వాళ్ళు కొందరు..._*

*_నమ్మి మోసపోయే వాళ్ళు కొందరు. ఎన్ని నిజాలు చెప్పినా నమ్మని వాళ్ళు ఇంకొందరు..._*

*_అబద్ధాలే నిజమని నమ్మేవాళ్ళు కొందరు. చెప్పుడు మాటలు విని మనల్ని దూరం పెట్టేవాళ్ళు కొందరు..._*

*_మనం ఏమిటో తెలియకపోయినా అక్కున చేర్చుకునే వాళ్ళు కొందరు."ఇదే నేటిసమాజం" తీరు..._*

*_"స్వచ్ఛమైన మనస్సు" ఉన్నవాళ్ళు అన్ని విషయాలను బయటకు చెప్పేస్తారు. మనస్సులో ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్పా... నటించడం రాదు.! వాళ్ళ "కోపం" క్షణకాలం.! వాళ్ళ "ప్రేమ" జీవితకాలం.!!_*

*_విమర్శ... ఎవరో విమర్శించారని భయపడి, బాధపడి... తలపెట్టిన మంచి పనిని మానేయవద్దు.!_*

*_విమర్శ ఎప్పటి కప్పుడు వెన్నుతట్టి ప్రోత్సాహించే ప్రశంస అనుకోవాలి.! అప్పుడే మనలో మరింత పట్టుదల పెరుగుతుంది.!_*

*_కత్తిరించడం చేత పూలమొక్క వివిధ అకృతుల్లో శోభాయమానంగా కనిపించడం చూస్తుంటాం కదా!_*

*_అలాగే ఓ సద్విమర్శ  సన్మార్గంలో నడిపించి... సంకల్పాన్ని సాధించే వాహికగా భావించాలి.!_*

*_కువిమర్శ గాలికి కొట్టుకు పోయే పనికిరాని తాలు, పొట్టు లాంటిది. దాని గురించి దిగులు ఎందుకు.?_*

*_నిశ్వార్ధముగా చేసే కార్యములో దైవం యొక్క తోడు ఉంటుంది... నమ్మకంగా ముందడుగు వెయ్... అంతా ఆ దైవమే చూసుకుంటుంది. తొందరెందుకు.?☝️_*

      *_-సదా మీ శ్రేయోభిలాషి... 👏_*
🌸🌸🌸 🌹🙇‍♂️🌹 🌸🌸🌸

No comments:

Post a Comment