*"త్రికరణశుధ్ధి లోపం కూడా ఒక పాపమే!!..."*
ఒకానొక సమయంలో ఆది శంకరుడు దిగ్విజయ యాత్ర సలిపి, పుణ్య క్షేత్ర మైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు.
అక్కడ కాశీ విశ్వనాథుని ప్రార్ధించాడు.
ఏమని? - " ఈశ్వరా, నాపాపములను పరిహారం కావించుకునే నిమిత్తమై, నేను ఇక్కడకు వచ్చాను. " అన్నాడు. "
ఆదిశంకరులు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులుకదా! ఏమి పాపం చేశాడు? ఈయన
ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని సార్థకం చేసుకున్నారు కదా! ఈయన పాపం చేయటమేమిటని? " శిష్యులు అనుకున్నారు.
"నేను మూడు పాపములు చేశాను.!శంకరా ,అవి పరిహారము గావించుకొనుటకు వచ్చాను. " అన్నాడు.
*మొదటి పాపము-*
భగవంతుడు మనస్సు కు వాక్కుకు అతీతమైన వాడని తెలుసుకుని, ఆచరణలో పెట్టలేక పోయాను... నిన్ను వర్ణింప డానికి ప్రయత్నిస్తున్నాను.
తలచి నది, చెప్పి నది వేరు వేరు గా ఉండటం చేత అది పాపమే, ...! అన్నాడు.
*మరి రెండవ పాపం -*
" ఈశా వాస్య మిదం సర్వం, " వాసుదేవ స్సర్వమిదం" అని చెబుతున్నాను, విశ్వసించాను, కానీ, నిన్ను దర్శించడానికి కాశీ వచ్చాను.
నేను చెప్పే దొకటి, తలచేదొకటి, చేసేది వేరొకటి, ఇది కూడా పాపమే కదా".... !
*ఇంక మూడవ పాపమే మిటి?*
" నీయందు, నాయందు ఉన్నది ఒకే ఆత్మ.
ఏకాత్మ సర్వభూతాంతరాత్మ ". దీనిపై నాకు విశ్వాస ముంది.
నీవు, నేను ఒకటే అని విశ్వసించి ఉపన్యాసాలు చేశాను.
కానీ నిన్ను భిన్నంగా చూస్తున్నాను, ఇది మూడవ పాపం.
ఈ మూడు పాపాలను పరిహారం చేసి నాకు అద్వైత త త్వాన్ని ప్రసాదించు, అని కోరాడు.
చూశారా...! పాపమంటే కేవలం పరులను నిందించడం, పరులను దూషించడం, మాత్రమే కాదు.
తలచి నది ఒక్కటి, చెప్పడం మరొకటి, చేయడం వేరొకటి -- ఇదే పాపము.
మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేదీ, అధో స్థాయికి నెట్టునదీ కూడా మనస్సే. కనుక మనస్సు ను స్వాధీనము చేసుకోవాలి.
_Be a master mind_
*_☀️శుభమస్తు☀️_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏సేకరణ భక్తీడిభేట్ BD బూరుగు దశరదకుమార్
No comments:
Post a Comment