Tuesday, October 29, 2024

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

   *తల్లితండ్రులు- పిల్లల బాధ్యత*
               ➖➖➖✍️


*తల్లి తండ్రులకు  కంటనీరు పెట్టించిన వారు ఎంత దురదృష్టవంతులో ఆనంద భాష్పాలు తెప్పించిన వారు అంతటి అదృష్టవంతులు.*

*వాళ్ళు ఉన్నంత కాలము మనము ఉంటాము. మనం ఉన్నతం కాలము వాళ్ళు ఉండరు.*

*బిడ్డలు శక్తి సామర్ధ్యాలు పొందే కాలంలో   తల్లి తండ్రులకు శక్తి సామర్ధ్యాలు తగ్గిపోతాయి.*

*బిడ్డలకు ఉన్నతమైన భవితపై ఆశలు చిగురించే సమయంలో తమ భవితపై అంతులేని అనిశ్చితికి లోనయ్యే సమయం వారిది.*

*బిడ్డలకు కొత్త కొత్త ప్రపంచాలు ఏర్పడే కాలంలో  బిడ్డలే తమ ప్రపంచంగా మారే కాలం తల్లి తండ్రులది.*

*రేపటి అంతులేని ఆశ బిడ్డలది. రేపటిపై అర్ధంకాని అయోమయం తల్లి తండ్రులది.*

*తమ జీవితాలని పెట్టు బడిగా పెట్టి పిల్లల భవితను తీర్చి దిద్దిన తల్లితండ్రులకు కొంత ప్రేమ మరికొంత ఆసరా ఇంకొంత ధైర్యం కలిగించవలసినది ఆ బిడ్డలే!*

*తమకంటూ ఏమి మిగుల్చుకోని తల్లి తండ్రుల త్యాగాలను గుర్తించకున్నా బాధ పడని తల్లితండ్రులు ఏవోవో కోరికలతో అత్యాశలతో స్థాయికి మించి పిల్లల కోరికలతో నిష్టురంగా మాట్లాడితే కలిగే బాధ వర్ణనాతీతము.*

*జీవితాన్నిచ్చిన తల్లితండ్రులకు రెండు పూటలా తిండితో పాటు రెండు మాటలు ప్రేమతో మాట్లాడితే ఎంత ఆనందిస్తారో ..!*

*ఏ తల్లి తండ్రులు బిడ్డలకు భారంగా మారాలని కోరుకోరు. తమ పనులు తాము చేసుకుంటూ దాటిపోవాలనే ఆశిస్తారు. అలా జరగనప్పుడు వారి ఆఖరి ప్రయాణానికి అంతులేని ప్రేమను పంచి ఆనందంగా ముగించటం బిడ్డల బాధ్యత.*

*ఆ దేవుడు కూడా మెచ్చుకొనేది అటువంటి జీవులనే.   తల్లి తండ్రులను గౌరవించని వాడు ఎన్ని పూజలు చేసినను ఆ దేవదేవుడు స్వీకరించడు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment