Sunday, October 27, 2024

ఏది శాశ్వతం...దేహమా, జీవుడా, దేవుడా, ప్రకృతా లేక ఆత్మా?*

 *ఏది శాశ్వతం...దేహమా, జీవుడా, దేవుడా, ప్రకృతా లేక ఆత్మా?*


*మన దేహం శాశ్వతంకాదని తెలుస్తూనే ఉంది.  జీవుడు నిత్యుడు. జీవుడన్నా, జీవాత్మ అన్న ఒక్కటే. జీవుడు అనాది.*

*దేవుడు ఆత్మను సృజించడం లేదు. ప్రకృతి కూడా అనాదే.  నిత్యమే. జీవుడు అణువైతే దేవుడు విభువు. అతడే మనకు 
ఈ శరీరాలను కల్పిస్తున్నాడు.*

*మనం పూర్వజన్మలో సంపాదించుకున్న పాపరాశిని లేక పుణ్యలేశాన్ని భరించలేకుండా ఉన్న దశలో జీవునికి కర్మానుభవం సంప్రాప్తం అయ్యేందుకు తగిన దేహం ఇస్తాడు.*

*పెరిగే దాన్ని దేహం అంటాం. తరిగిపోయే దాన్ని శరీరం అంటాం.*

*ఏ జన్మలో అయితే, జీవుడి కర్మరాశి అంటే పాపం, పుణ్యం పూర్తిగా తొలిగిపోతాయో, అప్పుడు ఆ జీవుడు పరమపదం లేదా కైవల్యాన్ని చేరుకుంటాడు.*

*మన చేతుల్లోనే, మన చేతల్లోనే అన్నీ ఉన్నాయని మనం తెలుసుకోవడమే సుఖానికి, మోక్షానికి ప్రథమ సోపానం. అన్నింటికీ భగవదనుగ్రహమే కీలకం.*
అలాగే,
```
*ఈ శరీరం మనకే చెందినది అని మన ఇష్టం వచ్చినట్లు వినియోగపడాలని ఎలా వినియోగ పరుచుకొను చున్నామో.. 
ఈ జీవుడు కూడా పరమాత్మకు శరీరం లాంటి వాడు కనుక ఈ శరీరం వలే జీవుడు కూడా పరమాత్మకు``` *‘సర్వాత్మ నా స్వార్ధే నియన్తుమ్ ధారయితుంచా శక్యం’*``` అని పరమాత్మచే ధరింపబడే వాడుగా ఉండాలి!

దాసుడు అయింతర్వాత చెయవలసిందేమిటీ  కైకార్యసేవ అవతల వానికి ఆనందం కలుగుటకు ఏ కొంచం అయినను సేవ చేయటం``` *’నాకించిత్ కుర్వత శేషత్వం’*```  ఏ కొంచం అయిన సేవ చేయక ఉన్నట్లయితే శేషత్వం వున్నా లేనట్లే!

పరమాత్మకు చెందినవారు అనుకుంటే సరి కాదు మనకు అత్యంత ప్రీతి ఒకరి ఎడల వున్నట్లు అయితే కొంచమైనను సేవ చెయ్యాలనిపిస్తుంది  పరమాత్మ ఎడల ప్రీతి విశేషం ఉన్నట్లు అయితే ఆయనకు సేవ చేయకుండా వుండలేము ఇది జీవుని స్వరూపం.```

 *’బందే మోక్షేత  దైవచ్చనాణ్యదా లక్షణం తేషామ్’*``` వైకుంఠంలో ఉన్నవాళ్లు అయినా ఈ లోకంలో ఉన్నవాళ్లు అయినా ఈ ఆత్మలకు ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే...``` *’ఆత్మదాస్యం హారేహే స్వామ్యం స్వభావంచ సదాస్మర’*``` ఆత్మకు ఉండవలసిన లక్షణం దాస్యం!
పరమాత్మకు వుండే ధర్మము స్వామిత్వం! అంటే సొత్తును కలిగి వుండటం!

ఈ లక్షణం మనకు లక్ష్మణ స్వామిలో కనపడుతుంది.  

No comments:

Post a Comment